
ఈసీని డిమాండ్ చేసిన ఢిల్లీ మంత్రి అతిశి
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలపై బీజేపీ నేతలపైనా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మంత్రి అతిశి శనివారం ఎన్నికల కమిషన్(ఈసీ)ని డిమాండ్ చేశారు. బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని శనివారం ఆమె మీడియా సమావేశంలో ఆరోపించారు.
బీజేపీలో చేరడమో, ఈడీ అరెస్ట్‌ను ఎదుర్కోవడమో తేల్చుకోవాలంటూ ఆ పార్టీ నేత ఒకరు తనను బెదిరించారంటూ అతిశి చేసిన ఆరోపణలపై ఈసీ ఆమెకు శుక్రవారం నోటీసులిచి్చన విషయం తెలిసిందే. ‘మద్యం కుంభకోణంలో డబ్బు చేతులు మారిందనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకనప్పటికీ కేవలం అనుమానంతోనే ఆప్ నేతలు సంజయ్ సింగ్, మనీశ్ సిసోడియా, సీఎం కేజ్రీవాల్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో నిందితుడొకరు బీజేపీకి కోట్లాది రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందజేసినట్లు ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు’అని ఆమె ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment