పాఠశాలల్లో ప్రిన్సిపాళ్లు, టీచర్లను సస్పెండ్ చేసే, తొలగించే అధికారం తల్లిదండ్రులకు ఇవ్వాలని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోదియా అన్నారు. సోమవారం నాడు ఆయన ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విషయాలన్నీ తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్తో పాటు టీచర్లు కూడా సమయానికి రావట్లేదని, పిల్లలే ఒకరికొకరు పాఠాలు చెప్పుకోవడం, పరీక్షలు నిర్వహించుకోవడం లాంటివి చేస్తున్నారని ఆయన గమనించారు. పిల్లలు తనకు ఈ విషయాలన్నీ చెప్పారని, అసలు గత సోమవారం నుంచి టీచర్లు రాకపోయినా.. హాజరు పట్టీలో మాత్రం ఉదయం 9.30కి వచ్చినట్లు సంతకాలు పెడుతున్నారని ఆయన ఓ టీవీ చానల్తో మాట్లాడుతూ చెప్పారు.
పిల్లలు తినే మధ్యాహ్న భోజనం చూస్తే, అందులో పురుగులు ఉన్నాయని, అసలు ఏమాత్రం తినడానికి పనికిరాకుండా ఉందని సిసోదియా చెప్పారు. భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్ జేబులు నింపుకొంటున్నాడని, అందుకే ఈ కాంట్రాక్టర్ లైసెన్సు రద్దుచేసే అధికారం కూడా తల్లిదండ్రులకే ఇవ్వాలని ఆయన అన్నారు. తాను చూసిన పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లపై కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు.
టీచర్లను తీసేసే అధికారం తల్లిదండ్రులకుండాలి
Published Mon, Feb 3 2014 1:06 PM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
Advertisement
Advertisement