
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలపై కేసుల నమోదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ఢిల్లీలోని పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణంలో రూ.1300 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి అనుమతి లభించినట్లు సమాచారం.
ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పబ్లిక్ వర్క్స్ శాఖ 2400 తరగతి గదుల నిర్మాణంలో అవకతవకలు ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) 2020 ఫిబ్రవరి 17న తన నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలోనే 2022లో ఢిల్లీ ప్రభుత్వ విజిలెన్స్ డైరెక్టరేట్ ఈ కుంభకోణం ఆరోపణలపై దర్యాప్తునకు సిఫారసు చేస్తూ ప్రధాన కార్యదర్శికి నివేదికను సమర్పించింది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఉన్న వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment