approves
-
8వ వేతన సంఘం ఏర్పాటు
న్యూఢిల్లీ: దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు రంగం సిద్దమైంది. 8వ పే కమిషన్ ఏర్పాటుకు ప్రధాని మోదీ గురువారం ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తంచేశారు. గురువారం ప్రధాని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే వేతనసంఘాన్ని ఏ తేదీన ఏర్పాటుచేస్తారో ఆయన వెల్లడించలేదు. ఈసారి ఫిట్మెంట్ 2.57 రెట్లకు బదులు 2.86 రెట్లు ఉండొచ్చనే విశ్లేషణలు వెలువడ్డాయి. ఒకవేళ ఫిట్మెంట్ ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టే మూలవేతనం, దానికి హౌస్ రెంట్ అలవెన్సులు, ఇతరత్రాలు కలుపుకుని జీతభత్యాల్లో భారీ పెంపు ఉండొచ్చు. వేతన సంఘం ఏర్పాటయ్యాక అది చేసే సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలుచేస్తే కేంద్ర ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల జీతభత్యాలు పెరగనున్నాయి. ఏడో వేతన సంఘం కాలపరిమితి 2026 ఏడాదిలో ముగియనుంది. స్వాతంత్య్రం వచ్చిన 1947 ఏడాది నుంచి ఇప్పటిదాకా ఏడుసార్లు వేతనసంఘాన్ని ఏర్పాటుచేశారు. చివరిసారిగా 2016లో ఏడో వేతన సంఘం అమల్లోకి వచి్చంది. ‘‘ 7వ పే కమిషన్ వచ్చే ఏడాదితో ముగుస్తుంది. కొత్త కమిషన్ ఏర్పాటుకు ఏడాది కాలముంది. ఈలోపే పూర్తిస్థాయిలో సలహాలు, స్వీకరించడానికి సరిపడా సమయం ఉండటం కలిసొచ్చే అంశం’’ అని మంత్రి వైష్ణవ్ అన్నారు. జీత భత్యాలు, వేతనాలు, అలవెన్సులు, కరువు భత్యం, ఇతర లబ్ధి ప్రయోజనాలను నిర్ణయించడంలో పే కమిషన్‌దే కీలక పాత్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో పే కమిషన్ విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరుపుతుంది. తగు సూచనలు, సలహాలను స్వీకరిస్తుంది. ఏడో కమిషన్ ఏం చెప్పింది? ఏడో పే కమిషన్‌ను 2014లో ఏర్పాటుచేయగా అది 2016 జనవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వానికి తన సిఫార్సులను అందజేసింది. 7వ వేతన సంఘం గత వేతన విధానాల్లో సంస్కరణలు తెస్తూ జీతభత్యాల లెక్కింపులో సులభతర విధానాన్ని ప్రవేశపెట్టింది. నెలకు కనీస వేతనం రూ.18,000 ఉండాలని, గరిష్ట వేతనం రూ.2.5 లక్షలు ఉండాలని సిఫార్సు చేసింది. మూలవేతనంతో పోలిస్తే చేతికొచ్చే జీతం 2.57 రెట్లు ఎక్కువగా ఉండాలని సూచించింది. కనీస గ్రాట్యుటీ చెల్లింపు రూ.20 లక్షలు ఉండాలని సిఫార్సుచేసింది. అంతకుముందు 2006 ఏడాదిలో వచి్చన ఆరో పే కమిషన్ నెలకు కనీస వేతనం రూ.7,000, కార్యదర్శిస్థాయి ఉద్యోగికి గరిష్ట వేతనం రూ.80,000 చెల్లించవచ్చని సిఫార్సు చేసింది. 1.86 రెట్లు ఫిట్మెంట్ ఉండాలని, గ్రాట్యుటీ రూ.10 లక్షలు ఇవ్వాలని, సరిపడా హౌస్ రెంట్ అలవెన్సు ఇవ్వాలని సూచించింది. అరకోటి మంది ఉద్యోగులకు లబ్ధి జీతభత్యాలను పెంచుతూ ఎనిమిదో కమిషన్ ఇచ్చే సిఫార్సులతో దాదాపు అరకోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబి్ధపొందనున్నారు. ఒక్క ఢిల్లీలోనే 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా. వీరిలో రక్షణ శాఖతోపాటు ఢిల్లీ రాష్ట్రపరిధిలో పనిచేసే ఉద్యోగులూ ఉంటారు. అంటే ఫిబ్రవరి ఐదున జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై తాజా పే కమిషన్ ఏర్పాటు వార్త ప్రభావం చూపే అవకాశం ఉంది. ఢిల్లీ పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడతో మోదీ సర్కార్ పే కమిషన్ ఏర్పాటుపై హడావుడిగా నిర్ణయం తీసుకుందనే వార్తలొచ్చాయి. ఏడో పే కమిషన్ సిఫార్సులను అమలుచేయడం వల్ల ప్రభుత్వంపై 2016–17 ఆర్థికసంవత్సరంలో రూ.1 లక్ష కోట్ల వ్యయభారం పడింది. అయితే పెరిగిన వేతనాలను ఉద్యోగులు ఖర్చుచేయడంతో దేశంలో వినిమయం పెరిగి దేశారి్థకం బాగుపడుతుందనే వాదనలూ ఉన్నాయి. సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల జీతభత్యాల సవరణకు ప్రతి పదేళ్లకు పే కమిషన్ ఏర్పాటుచేయడం ఆనవాయితీగా వస్తోంది. చాలావరకు పే కమిషన్ సిఫార్సులను పరగణనలోకి తీసుకుని రాష్ట్రాలు సైతం తమ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై ఓ నిర్ణయానికొస్తాయి. ఇదీ చదవండి: కేంద్ర మంత్రికి మెటా క్షమాపణలు -
జమిలి ఎన్నికలపై కేంద్ర మరో ముందడుగు
-
అమరావతి రైల్వేలైన్‌కు కేంద్రం ఆమోదం
సాక్షి, ఢిల్లీ: అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కృష్ణానదిపై 3.2 కిమీ మేర రైల్వే వంతెన నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. రూ. 2,245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల మేర కొత్త రైల్వేలైన్ నిర్మాణం జరగనుంది. రాజధాని అమరావతికి హైదరాబాద్, చైన్నె, కోల్‌కోత్తాకు అనుసంధానిస్తూ కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేయనున్నారు.ఐదేళ్లలో రైల్వే లైన్ పూర్తిచేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో రెండు నూతన రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 6798 కోట్ల రూపాయలతో రైల్వే లైన్ల నిర్మాణం చేయనుంది. నర్కతీయ గంజ్-రాక్సౌల్-సీతా మరి-దర్భంగా-సీతా మరి-ముజఫర్‌పూర్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ చేపట్టనున్నారు.ఇదీ చదవండి: బాబుపై కేసుల సంగతి ఇక అంతేనా? -
ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.10,900 కోట్లు.. కేంద్రం ఆమోదం
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ‘ఫేమ్’ పథకం స్థానంలో రెండు సంవత్సరాలకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (పీఎం ఈ-డ్రైవ్) పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఏయే వాహనాలకు ఎంతెంత?పీఎం ఈ-డ్రైవ్ పథకం 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఈ-త్రీ వీలర్లు, 14,028 ఈ-బస్సులకు మద్దతు ఇస్తుంది. అలాగే 88,500 ఛార్జింగ్ సైట్లకు కూడా ఈ స్కీమ్ ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్కులు, ఇతర అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) వాడకాన్ని ప్రోత్సహించడానికి ఈ పథకం కింద రూ.3,679 కోట్ల విలువైన సబ్సిడీలు/డిమాండ్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది.ఇదీ చదవండి: న్యూ లాంచ్: ఎలక్ట్రిక్ యుటిలిటీ కారు ఎంజీ విండ్సర్14,028 ఈ-బస్సుల కొనుగోలు కోసం ప్రభుత్వ, ప్రజా రవాణా సంస్థలకు రూ.4,391 కోట్లు అందిస్తారు. రోగుల తరలింపు కోసం ఈ-అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త చొరవను తీసుకుంది. ఈ-అంబులెన్స్‌ల విస్తరణకు రూ.500 కోట్లు కేటాయించింది. అలాగే ఈ-ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.500 కోట్లు అందించనుంది. -
రిలయన్స్ బోనస్ ఆఫర్.. ప్రతి షేర్‌కు మరో షేర్ ఫ్రీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) బోర్డు 1:1 బోనస్ ఇష్యూని ఆమోదించింది. 2017 సెప్టెంబర్ తర్వాత కంపెనీ మొదటి బోనస్ ఆఫర్ ఇదే. దీని ద్వారా షేర్ హోల్డర్లు ప్రతి షేర్‌కు ఒక షేరును ఉచితంగా పొందుతారు.భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు తేదీకి సంబంధించిన వివరాలను తర్వాత తెలియజేయనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ అధీకృత వాటా మూలధనాన్ని రూ.15,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచే ప్రతిపాదనకు ఆర్ఐఎల్ బోర్డు ఆమోదం తెలిపింది.షేర్హోల్డర్లకు బోనస్ షేర్లను బహుమతిగా ఇవ్వడానికి కంపెనీ ప్రణాళికలను ప్రకటించడం ఇది ఐదవసారి. 1983, 1997, 2009, 2017లో ఇలాగే బోనస్ షేర్లను రిలయన్స్ అందించింది. -
మోదీ గుడ్ న్యూస్.. ఇకపై వారందరికి ఫుల్ పెన్షన్!
-
Visakhapatnam: 76 కిమీ.. రూ.14వేల కోట్లు..
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ మరింత అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో లైట్‌మెట్రోకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. 76 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయమవుతుందని తెలిపింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను అందించేందుకు కావల్సిన పూర్తి డాక్యుమెంట్లను సిద్ధంచేసే పనిలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. 76.90 కి.మీ. మేర ప్రాజెక్టు.. విశాఖ నగర ప్రజలకు భవిష్యత్తులో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు మెట్రోపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. నెలరోజుల క్రితం సీఎం జగన్ ఆధ్వర్యంలో లైట్‌మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 76.90 కిమీ మేర లైట్‌మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. హెవీ మెట్రోతో పోల్చిచూస్తే.. లైట్ మెట్రో ద్వారా నిర్మాణ వ్యయంలో 20 శాతం, వార్షిక నిర్వహణలో 15 శాతం భారం తగ్గనున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లైట్‌మెట్రో వైపే మొగ్గు చూపింది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఒక మెట్రో రైలు వెళ్తే ఎనిమిది బస్సులు వెళ్లినట్లు సమానం. ఒకసారి వెళ్లే మెట్రోలో 400 మంది ప్రయాణించగలరు. ప్రాజెక్టు గడువు ఎనిమిదేళ్లు.. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)–వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు జీఓలో స్పష్టంచేశారు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇక టెండర్లు దక్కించుకున్న సంస్థ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు దక్కించుకున్న మూడేళ్లకు తొలిమార్గంలో ప్రయాణికులకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని జీఓలో స్పష్టంచేశారు. 30 ఏళ్ల పాటు సదరు నిర్మాణ సంస్థకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ద్వారా నిర్వహించాల్సి ఉంటుందని, ఈ సమయంలో ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సదరు సంస్థ ఆర్జిస్తుందని డీపీఆర్‌లో తెలిపారు. 17న కేంద్రానికి డీపీఆర్ ఇక విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కేబినెట్ డీపీఆర్‌ను ఆమోదించినందున లైట్‌మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన జీఓ నెం.161ని ప్రభుత్వం విడుదల చేసింది. జీఓ, డీపీఆర్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పిస్తాం. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కాపీలు అందిస్తాం. వీలైనంత త్వరగా ప్రాజెక్టును ఆమోదింపజేసి టెండర్లకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. లైట్ మెట్రో ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఏపీలో కీలకంగా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలు కూడా కోర్ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. రాబోయే 35–40 ఏళ్లలో నగర ట్రాఫిక్ డిమాండ్‌కి అనుగుణంగా డీపీఆర్ సిద్ధంచేశాం. – యూజేఎం రావు, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ -
ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం -
వేతన జీవులకు గుడ్‌న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం
వేతన జీవులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. 2023 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.15 శాతంగా కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఈ మేరకు 8.15 శాతం వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లుగా ఈపీఎఫ్ఓ ఓ సర్క్యలర్ విడుదల చేసింది. ఈపీఎఫ్ పథకం- 1952లోని 60 (1) పేరా కింద ప్రతి సభ్యుని ఖాతాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ వడ్డీని జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదాన్ని తెలియజేసిందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ తెలియజేసినట్లు ఈపీఎఫ్ఓ సర్క్యులర్‌లో పేర్కొంది. దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో చందాదారుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేసిన పీఎఫ్ మొత్తానికి 8.15 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇంతకు ముందు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.10 శాతం చొప్పున వడ్డీని ఈపీఎఫ్ఓ జమ చేసింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 23 ఆర్థిక సంవత్సరానికికి గానూ 8.15 శాతం వడ్డీ రేటును గత మార్చి 28న సిఫార్సు చేసింది. ఈ సిఫార్సును అనుసరించి, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ఆమోదించి నోటిఫై చేయాలి. అప్పుడే సభ్యుల ఖాతాల్లో జమ అవుతుంది. సాధారణంగా, వడ్డీ రేటును ఆర్థిక శాఖ ద్వారా ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తెలియజేస్తుంది. 2023 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం చందాదారులు ఇప్పటి వరకు వేచి చూశారు. ఎంప్లాయీస్ ప్రావెడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది దేశంలోనే అతిపెద్ద రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్. ఇందులో 70.2 మిలియన్ల మంది ఉద్యోగులు, 0.75 మిలియన్ల కంపెనీలు సొమ్ము జమ చేస్తున్నారు. సబ్స్క్రైబర్ల పాస్‌బుక్‌ని పన్ను పరిధిలోకి వచ్చే, పన్నేతర విరాళాలుగా విభజించాల్సి రావడంతో తలెత్తిన సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ ఆలస్యమైంది. 2021-22లో రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్లపై వచ్చే పొదుపు ఆదాయంపై ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను దీనికి కారణం. -
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. బదిలీలకు సీఎం జగన్ ఆమోదం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బదిలీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారు. జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించారు. రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులు. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించారు. జిల్లాలో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించారు. అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ బదిలీలకు అవకాశం ఉంది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన సీఎంకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: సీఎం జగన్ ఏం సాధించారు?.. ఎల్లో బ్యాచ్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇదే.. -
గెయిల్ గూటికి జేబీఎఫ్ పెట్రోకెమికల్స్
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చర్యల్లో ఉన్న జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ కంపెనీని ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ కొనుగోలు చేయనుంది. రూ.2,079 కోట్లతో గెయిల్ వేసిన బిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం లభించింది. పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించాలన్న పట్టుదలతో గెయిల్ కొంతకాలంగా ఉంది. ఇప్పుడు జెబీఎఫ్ కొనుగోలుతో కంపెనీ తన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలు పడుతుంది. తాము ఇచ్చిన రుణాలను జేబీఎఫ్ చెల్లించక పోవడంతో రుణదాతలు ఎన్సీఎల్టీ అనుమతితో విక్రయానికి పెట్టారు. దీనికి గెయిల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ ఆమోదం తెలిపినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ కర్సార్షియంతో పోటీ పడి మరీ గెయిల్ జేబీఎఫ్ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. ఐడీబీఐ బ్యాంక్ రూ.5628 కోట్లను రాబట్టుకునేందుకు జేబీఎఫ్‌ను వేలం వేసింది. కొనుగోలు లావాదేవీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని గెయిల్ తెలిపింది. జేబీఎఫ్కు మంగళూరు సెజ్‌లో 1.25 మిలియన్ టన్నుల టెరెఫ్తాలిక్ యాసిడ్ తయారీ ప్లాంట్ ఉంది. గెయిల్‌కు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని పతా వద్ద పెట్రోకెమికల్ ప్లాంట్ ఉంది. ఇక్కడ 8,10,000 టన్నుల వార్షిక పాలీమర్స్ తయారు చేయగలదు. వచ్చే ఏడాదికి మహారాష్ట్రలోని ఉసార్‌లో ప్రొపేన్ డీహైడ్రోజెనేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది (ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) -
పేటీఎం భారీ బైబ్యాక్: ఒక్కో షేరు ధర ఎంతంటే!
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు రూ. 850 కోట్లవరకూ వెచ్చించనుంది. షేరుకి రూ. 810 ధర మించకుండా ఓపెన్ మార్కెట్ ద్వారా 10.5 మిలియన్ల సొంత ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్లు ‘పేటీఎమ్’ బ్రాండ్ కంపెనీ తాజాగా వెల్లడించింది. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఆరు నెలల్లోపు బైబ్యాక్‌ను పూర్తిచేయగలమని భావిస్తున్నట్లు తెలియజేసింది. ఇదీ చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! మంగళవారం(13న) సమావేశమైన బోర్డు బైబ్యాక్ ప్రతిపాదనను అనుమతించినట్లు పేర్కొంది. స్వతంత్ర డైరెక్టర్లతోపాటు బోర్డు మొత్తం ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేసినట్లు వెల్లడించింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం బలపడి రూ. 538 వద్ద ముగిసింది. -
భారత్‌కు కాట్సా నుంచి మినహాయింపు
వాషింగ్టన్: రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న భారత్‌పై ట్రంప్ హయాం నుంచి గుర్రుగా ఉన్న అమెరికా తాజాగా సానుకూల నిర్ణయం తీసుకుంది. కీలకమైన కౌంటరింగ్ అమెరికా అడ్వెర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్(కాట్సా) ఆంక్షల నుంచి మినహాయింపు నిచ్చింది. ఇందుకు ఉద్దేశించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్(ఎన్డీఏఏ)కు చేసిన సవరణకు అమెరికా ప్రతినిధుల సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. చైనా వంటి దురాక్రణదారులను నిలువరించేందుకు భారత్‌కు ‘ఎస్–400’ఎంతో అవసరమని పేర్కొంది. కాట్సా నుంచి మినహాయింపు కల్పిస్తూ భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు అధ్యక్షుడు బిడెన్ పరిపాలన తన అధికారాన్ని ఉపయోగించాలని కోరింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఇండో–అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రొ ఖన్నా సభలో ప్రవేశపెట్టారు. ఎంతో ప్రాముఖ్యమున్న ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించడం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ భారత ప్రభుత్వం 2018లో రష్యా నుంచి రూ.40 వేల కోట్ల విలువైన ఐదు ఎస్–400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో సప్లై చైన్ కంపెనీ డెల్హివరీ, నగదు లాజిస్టిక్స్ కంపెనీ రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ వెరండా లెర్నింగ్ సొల్యూషన్స్ చోటు చేసుకున్నాయి. డెల్హివరీ.. సప్లై చైన్ కంపెనీ డెల్హివరీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 7,460 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సెబీ అనుమతించింది. ఐపీవోలో భాగం గా కంపెనీ రూ. 5,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,460 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిని కార్లయిల్ గ్రూప్, సాఫ్ట్‌బ్యాంక్‌తోపాటు కంపెనీ సహవ్యవస్థాపకులు ఆఫర్ చేయనున్నారు. కంపెనీ 2021 నవంబర్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. ప్రధానంగా కార్లయిల్ గ్రూప్ రూ. 920 కోట్లు, సాఫ్ట్‌బ్యాంక్ రూ. 750 కోట్లు విలువైన షేర్లను విక్రయించనున్నాయి. రేడియంట్ క్యాష్ క్యాష్ లాజిస్టిక్స్ సంస్థ రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి సెబీ క్లియరెన్స్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా రూ. 60 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 3 కోట్ల షేర్లను ప్రమోటర్ డేవిడ్ దేవసహాయం, పీఈ సంస్థ ఎసెంట్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఆఫర్ చేయనున్నాయి. 2021 అక్టోబర్‌లో కంపెనీ సెబీకి దరఖాస్తు చేసింది. రేడియంట్‌లో ఎసెంట్ 37.2 శాతం వాటాను 2015లో కొనుగోలు చేసింది. వెరండా లెర్నింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ వెరండా లెర్నింగ్ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూకి సెబీ ఓకే చెప్పింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. నిధులను రుణ చెల్లింపులు, ఎడ్యురెకా కొనుగోలు అవసరాలు, వృద్ధి అవకాశాలకు వినియోగించనుంది. కంపెనీ 360 డిగ్రీ సమీకృత ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌గా సర్వీసులు సమకూర్చుతోంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ హైబ్రిడ్, ఆఫ్‌లైన్ బ్లెండెడ్ విధానాల్లో సేవలందిస్తోంది. -
కేంద్రం బూస్ట్: దుమ్మురేపిన వొడాఫోన్ ఐడియా
సాక్షి,ముంబై: అప్పుల సంక్షోభం, ఇతర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న టెలికాం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రభారీ ఊరట కల్పించిన నేపథ్యంలో గురువారం నాటి మార్కెట్లో టెలికాం షేర్లు భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో లాభాల పరంగా, వినియోగదారుల పరంగా బాగా వెనుకబడిన వొడాఫోన్ ఐడియా కు మళ్లీ జీవం వచ్చినట్టైంది. ఈ కంపెనీ షేర్లు 15 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ అయింది. అంతేకాదు గత 10 ట్రేడింగ్ రోజుల్లో స్టాక్ 72 శాతం పుంజుకోవడం విశేషం. టెలికాం రంగానికి సంబంధించి పలు నిర్మాణాత్మక సంస్కరణలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు బుధవారం టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించినసంగతి తెలిసిందే. ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం విధించింది. ఏజీఆర్‌కు సంబంధించి ప్రస్తుతమున్న నిర్వచనం ఈ రంగంపై భారానికి ప్రధాన కారణమని పేర్కొన్న ఆయన ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధీకరిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ రంగంలో నూరు శాతం ఎఫ్‌డీఐలు అనుమతించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందనీ, టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. చదవండి : టెలికాం రంగానికి కేంద్రం భారీ ఊరట కాగా ఎయిర్టెల్ జియో, వొడాఫోన్ ఐడియా మూడు ప్రైవేట్ రంగ సంస్థల ఉమ్మడి నికర రుణాలు రూ. 3.6 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఎడెల్వీస్ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, వోడాఫోన్ ఐడియా స్పెక్ట్రం , ఏజీఆర్ బకాయిల విలువ .1.6 లక్షల కోట్లు. అంటే సంస్థ మొత్తం బకాయిల్లో 84 శాతం. బ్యాంకింగ్ రంగంలో వొడాఫోన్ ఐడియాకు మొత్తం రూ . 29,000 కోట్ల రుణాలుండగా, దేశంలోని అతిపెద్ద బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా రూ .11,000 కోట్లు. దీంతోపాటు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ఇతర మధ్యతరహా బ్యాంకుల రుణాలున్నాయి. -
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి..!
-
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి
న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మన దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పూత్నిక్-వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో మరో వ్యాక్సిన్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించింది. టీకాను అత్యవసర వినియోగానికి వాడవచ్చునని కేంద్రం అనుమతి ఇచ్చింది. కరోనాబారి నుంచి రక్షించుకోవడానికి ప్రజలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ అండ్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు ఆగస్టు 5న దరఖాస్తు చేసింది. ఈ సంస్థ ‘జాన్సన్’ పేరుతో సింగిల్ డోసు వ్యాక్సిన్‌ను తయారు చేసింది. తమ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తోనే కరోనాను కట్టడి చేయవచ్చని కంపెనీ అధికారులు తెలిపారు. -
7లక్షలమంది భారతీయులు వెనక్కి!
-
భారతి ఎయిర్‌టెల్‌కు గ్రీన్ సిగ్నల్, భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌కు భారీ ఊరట లభించింది. భారతీ ఎయిర్‌టెల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచుకోవడానికి టెలికాం విభాగం (డాట్) ఆమోదం తెలిపింది. ఇంతకుముందు అనుమతించిన 49 శాతం నుంచి 100 శాతానికి పెంచుకునేందుకు అనుమతి లభించిందని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ సమాచారంలో కంపెనీ మంగళవారం తెలిపింది. జనవరి 23 తేదీలోపు రూ. 35,586 కోట్ల బకాయిలను చెల్లించడానికి ముందు ఈ ఆమోదం లభించడం గమనార్హం. ఇందులో రూ .21,682 కోట్లు లైసెన్స్ ఫీజు, మరో రూ.13,904 కోట్లు స్పెక్ట్రం బకాయిలు (టెలినార్, టాటా టెలిసర్వీస్ బకాయిలను మినహాయించి) ఉన్నాయి. నష్టాల ఊబిలో కూరుకుపోయిన భారతి టెలికాం సుమారు రూ 4,900 కోట్ల విదేశి పెట్టుబడుల కోసం ప్రభుత్వ అనుమతికోసం వేచి చూస్తోంది. నిధుల సమీకరణలో భాగంగా భారతి టెలికాం పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులను సమీకరిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్ కు చెందిన సింగ్ టెల్ అనే కంపెనీ సహా మరికొన్ని విదేశీ సంస్థల ద్వారా సుమారు రూ 4,900 కోట్ల పెట్టుబడిని సేకరించనుంది. కాగా ఎఫ్‌డీఐ దరఖాస్తును కేంద్ర టెలికాం శాఖ తిరస్కరించింది. ఈ క్రమంలో భారతీ ఎయిర్టెల్ తమ సంస్థలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ రెండోసారి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. -
58 పురాతన చట్టాల రద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో 58 పురాతన, వాడుకలోలేని చట్టాలను రద్దు చేసింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలోని రెండు (గత, ప్రస్తుత) ప్రభుత్వాలు కలిసి రద్దు చేసిన పురాతన చట్టాల సంఖ్య 1,824కు చేరింది. చట్టాల రద్దు, సవరణ బిల్లు–2019కు పార్లమెంటు ఆమోదం లభించడంతో త్వరలోనే మరో 137 పురాతన చట్టాలు రద్దు కానున్నాయి. మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులకు, ఈ పురాతన చట్టాలకు అసలు సంబంధమే లేదనీ, ఈ కాలానికి అవి పనికిరావని కేంద్రం చెబుతోంది. తాజాగా రద్దు అయిన 58 చట్టాలేవో ఇంకా తెలియరాలేదు. అయితే అవన్నీ ప్రధాన చట్టాలకు సవరణలు చేసేందుకు తీసుకొచ్చినవేనని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. వైద్య విద్యలో ‘నెక్ట్స్’కు ఆమోదం భారత వైద్య మండలి (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్థానంలో కొత్తగా జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ–నేషనల్ మెడికల్ కౌన్సిల్)ని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును కేంద్రం 2017 డిసెంబర్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ 16వ లోక్‌సభ గడువు ముగిసే నాటికి అది ఆమోదం పొందకపోవడం కారణంగా రద్దయింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షను అందరికీ ఉమ్మడిగా జాతీయ నిష్క్రమణ పరీక్ష (నెక్ట్స్–నేషనల్ ఎగ్జిట్ టెస్ట్) పేరిట నిర్వహించేలా బిల్లులో నిబంధనలున్నాయి. ఠి 15వ ఆర్థిక సంఘం తన నివేదికను సమర్పించేందుకు గడువును కేంద్రం మరో నెల రోజులు పొడిగించి నవంబర్ 30 వరకు సమయం ఇచ్చింది. ఠి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ డిజైన్ చట్టం–2014ను సవరించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లును కేబినెట్ ఆమోదించింది. మరో నాలుగు ఎన్ఐడీలను ఈ చట్టం పరిధిలోకి తెచ్చి, వాటిని జాతీయ ప్రాధాన్యం ఉన్న సంస్థలుగా ప్రకటించేందుకు ఈ సవరణను చేపడుతున్నారు. అమరావతి, భోపాల్, జొర్హాత్, కురుక్షేత్రల్లోని ఎన్ఐడీలను కొత్తగా ఈ చట్టం పరిధిలోకి తేనున్నారు. -
ఎట్టకేలకు సాక్షులకు రక్షణ
ఏ కేసులోనైనా సాక్షుల పాత్ర అత్యంత విలువైంది. న్యాయస్థానాల్లో కేసుల విచారణ సక్రమంగా సాగాలన్నా, అవి త్వరితగతిన పరిష్కారం కావాలన్నా సాక్షులే కీలకం. గత్యంతరం లేనప్పుడు మాత్రమే నేరం జరిగినప్పుడున్న పరిస్థితుల ఆధారంగా న్యాయస్థానాలు దోష నిర్ధారణ చేస్తాయి. చిత్రమేమంటే ఇంతటి ముఖ్య భూమిక పోషిస్తున్న సాక్షులకు మన దేశంలో కట్టుదిట్టమైన రక్షణ నిబంధనలు లేవు! ఈ స్థితి మారాలని, సాక్ష్యమిచ్చేవారి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని న్యాయ కోవిదులు చాన్నాళ్లనుంచి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సాక్షుల పరిరక్షణకు సంబంధించిన ముసాయిదా పథకాన్ని కేంద ప్రభుత్వం రూపొందించటం, దాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆమోదించటం హర్షించదగిన విషయం. పార్లమెంటు ఒక చట్టం చేసేవరకూ వేచి ఉండకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ ముసాయిదా పథకం అమలును ప్రారంభించాలని ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా జీవించే హక్కు పరిధిని విస్తరించింది. న్యాయస్థానాల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా సాక్ష్యమిచ్చే హక్కు కూడా ఈ పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. ఇకపై బెదిరిం పులు, ఒత్తిళ్ల కారణంగా ఎవరైనా సాక్ష్యం చెప్పలేని స్థితి ఏర్పడితే అది రాజ్యాంగంలోని 21వ అధిక రణను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో సాక్షుల రక్షణకు ప్రత్యేక చట్టాలున్నాయి. తమకుండే ప్రమా దాన్నిబట్టి విచారణ సమయంలో లేదా విచారణ పూర్తయిన కొన్నాళ్లవరకూ లేదా జీవితాంతం రక్షణ కల్పించాలని సాక్షులు కోరతారు. నేరాలకు పాల్పడేవారు తాము చేసే పనులకు సాక్ష్యా ల్లేకుండా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా సాక్ష్యం చెప్పడానికి ముందుకొస్తే తమకు శిక్ష పడే ప్రమాదం ఉంటుంది గనుక బెదిరింపులకు దిగుతారు. అవసరమైతే వారి ప్రాణాలు తీస్తారు. సాక్ష్యం చెప్పే వారు లేకపోవడం, వచ్చినా విచారణ దశలో వెనక్కు తగ్గడం లేదా బెదిరింపులకు భయపడి స్వరం మార్చడం వంటి కారణాల వల్ల మన న్యాయస్థానాల్లో కేసులు ఏళ్లతరబడి పెండింగ్ పడుతున్నాయి. ఆ తరహా కేసుల్లో నేరగాళ్లు శిక్ష పడకుండా తప్పించుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఆశారాం బాపుపై ఉన్న హత్యలు, అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో 10 మంది సాక్షులపై దాడులు జరిగాయి. ముగ్గురు సాక్షుల ప్రాణాలు తీశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఉనావ్‌లో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కులదీప్‌సింగ్ సెంగార్‌పై ఉన్న అత్యాచారం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, అందులో సాక్ష్యమిచ్చిన బాధితురాలి బంధువు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కేసు నుంచి తప్పించు కోవడానికే అతన్ని హతమార్చారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 1న మహా రాష్ట్రలోని భీమా–కొరెగావ్‌లో తలెత్తిన ఘర్షణలకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న 19 ఏళ్ల యువతి పూజా సాకేత్ మరో మూడునెలలకు బావిలో శవమై తేలింది. తమ కుటుంబానికి బెదిరింపులొస్తున్నా యని, కాపాడాలని అంతక్రితం ఆమె వినతిపత్రాలిచ్చినా ఫలితం లేకపోయింది. సినీ నటుడు సల్మా న్‌ఖాన్ తాగి కారు నడిపి ఒకరి ప్రాణం తీసిన కేసులో అతని అంగరక్షకుడు రవీంద్ర పాటిల్ సల్మా న్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత కాలంలో వచ్చిన బెదిరింపుల పర్యవసానంగా మాన సికంగా కుంగిపోయి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అటుపై ఆ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యాడు. మొన్న అక్టోబర్‌లో కేరళ బిషప్‌పై వచ్చిన అత్యాచారం ఆరోపణల్లో సాక్షిగా ఉన్న క్రైస్తవ గురువు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. మన దేశంలో 1872నాటి భారతీయ సాక్ష్యాధారాల చట్టం విచారణ ప్రక్రియలో సాక్షులకుండే రక్షణ గురించి మాట్లాడుతోంది. ఏదైనా కేసులో సాక్షిగా ఉండే వ్యక్తిని న్యాయస్థానంలో అనుచి తమైన లేదా ఆగ్రహం తెప్పించే ప్రశ్నలు వేయకూడదని అది నిర్దేశిస్తోంది. నిజానికి ఏ చట్టమూ సాక్షి పదానికి నిర్వచనం ఇవ్వడం లేదు. అందుకోసం మన న్యాయస్థానాలు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులపైనే ఆధారపడుతున్నాయి. 2006లో సాక్షుల రక్షణకు భారతీయ శిక్షాస్మృతిలో 195ఏ కింద కొత్త నిబంధన పొందుపరిచారు. ఈ సెక్షన్ కింద సాక్షుల్ని బెదిరించినా, వారి ఆస్తులు ధ్వంసం చేస్తామని హెచ్చరించినా ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. అలాగే తప్పుడు సాక్ష్యంతో అమాయకులను ఇరికించి వారికి శిక్ష పడటానికి కారకులైనవారికి అదే రకమైన శిక్ష వేసేందుకు ఈ సెక్షన్ వీలు కల్పిస్తోంది. కానీ ఇది సమగ్రంగా లేదు. కనుకనే సుప్రీంకోర్టు ఇప్పుడీ ముసాయిదాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ముసాయిదా సాక్షులను మూడు రకాలుగా విభజించింది. దర్యాప్తు విచారణ సమయంలో లేదా ఆ తర్వాత సైతం ప్రాణాలకు ముప్పు ఉన్న సాక్షులు, వారి కుటుంబసభ్యులు మొదటి కేటగిరీలోకి వస్తారు. దర్యాప్తు/విచారణ సమయంలో ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నవారు రెండో కేటగిరీలోకి వస్తారు. దర్యాప్తు సమయంలో సాధారణమైన బెదిరింపులు, వేధింపులు ఎదుర్కొంటున్నవారు మూడో కేటగిరీలోకి వస్తారు. సాక్షులు కోరితే వారి గుర్తింపు బయటపడకుండా న్యాయస్థానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, నిందితులూ, సాక్షులూ ఎదురుపడకుండా ఉండేవిధంగా చర్యలు తీసుకోవడం కూడా ముసాయిదాలో ఉన్నాయి. సాక్షు లను గుర్తుపట్టకుండా ఉండేందుకు వీలుగా ఛాయాచిత్రాల్లో వారి ముఖకవళికలు సవరించడం, ఆడియో ఫైల్స్‌ను వారి కంఠస్వరం పసిగట్టడానికి వీల్లేకుండా సాంకేతికంగా మార్చడం వంటివి కూడా ఇందులో చేర్చారు. ఇలాంటి రక్షణలు సహజంగానే సాక్షుల్లో ఉండే భయాన్ని పోగొడతాయి. కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడతాయి. ముసాయిదా సక్రమంగా అమలయ్యేలా చూసి, ఆచరణలో ఎదురవుతున్న సమస్యలేమిటో గుర్తిస్తే మున్ముందు సమగ్రమైన చట్టం రూపకల్పనకు వీలవుతుంది. ఈ ముసాయిదాతో పని ముగిసిందని భావించకుండా సాధ్యమైనంత త్వరలో చట్టాన్ని రూపొందించటం కేంద్రం బాధ్యత. -
ఎల్ఐసీ-ఐడీబీఐ డీల్‌కు ఐఆర్డీఐ గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: బిజినెస్వర్గాల్లో ఆసక్తిని రేపిన ఎల్ఐసీ- ఐబీడీఐ బ్యాంకు డీల్‌ను కీలకమైన ఆమోదం లభించింది. ఐడీబీఐ బ్యాంకులో వాటాల కొనుగోలుకు సంబంధించిన డీల్‌లో ఎల్ఐసీకి ఐడీబీఐ గ్రీన సిగ్నల్ ఇచ్చింది. డీల్‌లో భాగంగా బ్యాంక్‌లోకి ఎల్ఐసీ దాదాపు రూ. 13వేల కోట్లను పెట్టుబడులు పెట్టనుంది. బ్యాంకులో వాటాను 5-7 సంవత్సరాలలో 15 శాతానికి పరిమితం చేయనుంది. సెబీ నిబంధనల ప్రకారం వాల్యూయేషన్స్ నిర్ణయించబడతాయి. మరోవైపు ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటాను ఎల్ఐసీ కొనుగోలు వార్తలతో ఇవాల్టి బుల్ మార్కెట్లో ఐడీబీఐ షేర్ భారీగా లాభపడింది. ఇన్వెసర్ల కొనుగోళ్లతో 10శాతానికిపైగా ఎగిసింది. దీంతో బ్యాంకు మార్కెట్ వాల్యూ 7వేలకోట్ల రూపాయలు పుంజుకుని రూ. 23వేల కోట్లకు చేరింది. -
కేంద్ర ఉద్యోగులకు శుభవార్త
♦ 7వ వేతన సంఘం సిఫారసులకు కేబినెట్ ఆమోదం ♦ కనీస హెచ్ఆర్ఏ ఇవ్వాలని నిర్ణయం ♦ ఖజానాపై ఏడాదికి రూ. 30,748 కోట్ల భారం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగుల అలవెన్సులకు సంబంధించి ఏడవ వేతన సవరణ సంఘం సిఫారసులకు 34 మార్పులతో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులకు మేలు జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. కనీస హెచ్ఆర్ఏ విషయంపై కేబినెట్ పలు మార్పులు చేసిందన్నారు. జనాభా ప్రాతిపదికన మూడు వర్గాలుగా విభజించిన నగరాల్లో వరుసగా మూలవేతనంలో 30% (జనాభా 50లక్షలకు పైగా), 20% (5–50లక్షల జనాభా), 10% (5లక్షల కన్నా తక్కువ) ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) ప్రస్తుతం చెల్లిస్తున్నారు. అయితే, దీన్ని 24%, 16%, 8 శాతానికి తగ్గించాలని వేతన సవరణ సంఘం సూచించిందని జైట్లీ తెలిపారు. కేబినెట్ ఈ సవరణకు మార్పులు చేసి ఉద్యోగి నివసిస్తున్న నగరం ఆధారంగా రూ.5,400, 3,600, 1,800 కనీస హెచ్ఆర్ఏ అందేలా నిర్ణయం తీసుకుందన్నారు. రూ.18,000 కనీస వేతనం ఉన్న ఉద్యోగిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు సూచిం చామన్నారు. అయితే.. ఉద్యోగి డీఏ మూలవేతనంలో 25–50 శాతంలోపు ఉంటే హెచ్ఆర్ఏ 27 శాతంగా, 50 శాతానికన్నా ఎక్కువ ఉంటే 30 శాతంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ‘డీఏ (కరవు భత్యం) 50 నుంచి 100 శాతానికి పెరిగినపుడు హెచ్ఆర్ఏ కూడా పెరగాలని వేతన సవరణ సంఘం ప్రతిపాదించింది. అయితే కేంద్రం డీఏ 25 నుంచి 50 శాతానికి పెరిగినపుడే హెచ్ఆర్ఏను సవరించాలని నిర్ణయించింది’ అని జైట్లీ తెలిపారు. సియాచిన్, సీఆర్పీఎఫ్ బలగాలకు భారీ లాభం భద్రత బలగాలకు రేషన్ అలవెన్సు నేరుగా వారి ఖాతాల్లోకే చేరుతుందన్నారు. సియాచిన్ అలవెన్సు గురించి జైట్లీ వెల్లడిస్తూ.. ‘తొమ్మిదో లెవల్, అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవారికి రూ.31,500 ఇవ్వాలని వేతన సంఘం సూచించింది. అయితే దీన్ని మేం రూ.42,500కు పెంచాం. ఎనిమిదో లెవల్ అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు రూ.30వేలు (రూ.21వేలు చేయాలని సూచన)పొందుతారు’ అని చెప్పారు. నక్సల్స్ ప్రాంతాల్లోని సీఆర్పీఎఫ్ జవాన్లకు నెలకు ఇస్తున్న అలవెన్సులు రూ.8,400 నుంచి 16,800కు, రూ. 17,300 రూ. 25,000లకు పెరుగుతాయి. వీటి ద్వారా ఖజానాపై ఏడాదికి రూ.30,748.23 కోట్ల భారం పడనుంది. పింఛనుదారులకు బొనాంజా ఈ పెరిగిన అలవెన్సులు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వేతన సవరణ సంఘం సూచనలకు అదనంగా హెచ్ఆర్ఏను పెంచటం ద్వారా ప్రతిపాదనలకన్నా రూ.1,448 కోట్ల మేర అదనపు భారం పడనుంది. 53 రకాల అలవెన్సులను తొలగించాలని ఏడో వేతన సవరణ సంఘం సూచించగా.. వీటిలో 12 అలవెన్సులను కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా రైల్వేలు, పోస్టల్, రక్షణ, పరిశోధన విభాగాల్లో పనిచేసే లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు జరగనుంది. దీంతోపాటుగా పింఛనుదారులకు మెడికల్ అలవెన్సులను నెలకు రూ. 500నుంచి రూ.1,000కి పెంచుతున్నట్లు జైట్లీ ప్రకటించారు. వందశాతం అశక్తత (డిజేబుల్మెంట్) ఉన్న పింఛనుదారుల కాన్స్టంట్ అంటెండెన్స్ అలవెన్సును నెలకు రూ.4,500 నుంచి రూ.6,750కి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక అందించింది. ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అధికారులు చెప్పారు. ప్రభుత్వం సిబ్బంది, పెన్షనర్లకు చెల్లించే కరువు భత్యం పెంపుతో 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 58 లక్షల పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. ఇది జూలై 1, 2016 నుంచి అమల్లోకి అవకాశంఉంని సమాచారం. అయితే దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారో చూడాలి. -
కీలక అంశాలకు క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కొన్ని కీలక అంశాలకు బుధవారం ఆమోదం తెలిపింది. జీఎస్టీ అమలుకు ఉద్దేశించిన ఆర్థిక ప్లాన్, హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఫ్యాక్టరీ, రష్యా చమురు బావుల్లో వాటా కొనుగోలు, తదితర కీలక అంశాలకు సంబంధించి గ్రీన్ సిగ్న ల్ ఇచ్చింది. ప్రధానంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్టీ ప్రతిపాదించిన జీఎస్టీ అమలుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ)లోని ఐటీ ఇన్ఫ్రాక్చర్ మెరుగుదలకు సంబంధించిన అంశాన్ని ఆమోదించింది. దీనికోసం రాబోయే ఏడు సంవత్సరాల్లో 2వేల రెండు కోట్లను వెచ్చించనుంది. ఐవోసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)లు రష్యాలోని తాస్-యురై చమురు బావిలో 29.9 శాతం వాటా కొనుగోలు చేయడానికి 128 కోట్ల డాలర్ల ఒప్పందానికి క్యాబినెట్ ఓకే చేసింది. అలాగే హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఫ్యాక్టరీ మూసివేతకు అంగీకారం తెలిపింది. కాగా జీఎస్టీ అమలుకు సంబంధించి రోడ్ మ్యాప్ తయారు చేసింది సీబీఈసీ . ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్), కన్సార్టియానికి నాయకత్వం వహిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)..రష్యాలోని చమురు బావుల్లో వాటాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగంలోని టెలికాం శాఖకు కావలసిన కేబుల్స్ తయారీ సంస్థ హెచ్‌సీఎల్ నష్టాలనుఎదుర్కొంటోంది. వైర్లెస్ ఫోన్లు మార్కెట్లోకి రావడంతో ల్యాండ్ ఫోన్లు, వాటికి కేబుల్స్ అవసరం దారుణంగా పడిపోవడంతో హెచ్‌సీఎల్ మూసివేత స్థితికిచేరింది. 2015 ఫిబ్రవరిలో కంపెనీని మూసివేయడానికి కేంద్రం సిద్ధమైనా ఉద్యోగుల ఆందోళనలతో వెనక్కి తగ్గింది. అయితే అదే ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదు. -
92 ఏళ్ల సంప్రదాయానికి చరమగీతం
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లోనే కలిపే ప్రతిపాదనకు నరేంద్ర మోదీ సర్కార్ ఆమోద ముద్ర వేసింది. బుధవారం ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. ఫిబ్రవరి 1న ఒకే బడ్జెట్‌గా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు ప్రకటించాయి. దీంతో ప్రత్యేక రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టే సంస్కృతితోపాటు, 92ఏళ్ల నుంచి యూనియన్ బడ్జెట్‌కు ముందు రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆచారానికి ఎన్డీయే సర్కార్ తిలోదాకాలు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 25 , 2017నుంచి ప్రారంభించేందుకు యోచిస్తోందని తెలిపాయి. అయితే విలీనం తర్వాత రైల్వే శాఖ ఎప్పటిలాగానే స్వతంత్రంగా వ్యవహరించేలా ఫంక్షనల్ స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇకమీదట రైల్వే శాఖ కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో డివిడెండ్ చెల్లింపు, తదితర అంశాలను సమీక్షించే రైల్వే కన్వెన్షన్ కమిటీ రద్దవుతుంది. ఇతర విభాగాలకు మాదిరిగానే, మూలధన వ్యయం కోసం రైల్వేలకు బడ్జెట్ సహాయాన్ని అందిస్తుంది. వివిధ వర్గాలకు అందించే అన్ని వాస్తవ రైల్వే పాస్ లు ఆధార్ నంబరుకు అనుసంధానం చేయబడతాయి. ఏప్రిల్ నెలకల్లా ద్రవ్యబిల్లు, డిమాండ్లు-గ్రాంట్లపై పార్లమెంటులో చర్చలను పూర్తిచేయాలని, మే నెల నుంచే రాష్ర్టాలకు నిధులను విడుదల చేయాలని భావిస్తున్నది. ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీతో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చర్చించి ఆమోదం పొందినట్టు సమాచారం. -
జీఎస్టీ కౌన్సిల్‌కు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ఎన్డీఏ సర్కార్ ప్రతిష్టాత్మక బిల్లు జీఎస్టీటి అమలులో మరో కీలక అడుగుపడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి బిల్లును అమలు చేయాలన్న లక్ష్యంతో చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో భారత పన్ను విధానంలో కీలక సంస్కరణగా, సగానికన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించిన జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) బిల్లుకు సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ కౌన్సిల్ కు ఆమోదం తెలిపింది. గత వారంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేయడంతో, నేడు సమావేశమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ, జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 12 కింద కౌన్సిల్ ఏర్పాటు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ కౌన్సిల్ కు అధ్యక్షుడుగా ఉంటారు. ప్రధాన అటు ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం నేతృత్వంలోని ప్యానెల్ కొన్ని సూచనలు, సలహాలు అందించింది. ఈ కౌన్సిల్ కు ఆర్థిక మంత్రి చైర్మన్ గా వ్యవహరించనుండగా, రాష్ట్రాల ఆర్థికమంత్రులు సభ్యులుగా ఉంటారు. వస్తు సేవలపై పన్ను రేటు ఎంత ఉండాలి? మినహాయింపు ఉండే విభాగాలేంటి? పన్ను విధానం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోనుంది. ఈమేరకు సెప్టెంబర్ 22 , 23 తేదీల్లో ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ మొదటి సమావేశానికి నిర్ణయించింది. -
బ్యాంకుల విలీనానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) కీలక ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తన ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళ బ్యాంకును ఎస్ బీఐలో విలీనం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకులు ఫుల్ జోష్ లో నడిచాయి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్ లు 20శాతం లాభాలను నమోదుచేశాయి. కేంద్ర కేబినెట్ ఆమోదంతోనే ఈ ర్యాలీ కొనసాగినట్టు మీడియా రిపోర్టులు నివేదించాయి. ఈ ఆమోదంతో నాలుగు లిస్టెడ్ బ్యాంకులు, ఒక్క అన్ లిస్టెడ్ బ్యాంకుతో పాటు భారతీయ మహిళా బ్యాంకు ఆస్తులు, అప్పులను ఎస్ బీఐ తనలో విలీనం చేసుకోనుంది. మొండి బకాయిల సమస్యతో పోరాడటానికి, పబ్లిక్ రంగ బ్యాంకులను సుస్థిర దిశకు తీసుకురావడానికి ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ విలీనంతో ఎస్ బీఐ నెట్ వర్క్ లు 41శాతం పెరగనున్నాయి. 23 వేల ఎస్ బీఐ బ్రాంచ్ లు అందుబాటులో ఉండనున్నాయి. వర్క్ ఫోర్స్ కూడా 33శాతం పెరిగి 2,85,500 ఉద్యోగులకు చేరుకోనుంది. మార్కెట్లో షేర్ల జోరు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా 3.9 శాతం ఎగబాకి 215.65గా నమోదైంది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్ కోర్ 19.99 శాతం పెరిగి రూ. 478.90వద్ద ముగిసింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ 19.99 శాతం వృద్ధితో రూ.599.60కు చేరింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్ 20 శాతం పెరుగుదలతో రూ.547.90గా నమోదైంది. -
ఛనాఖా-కొరట కు ఓకే
- అటవీ, వన్యప్రాణి, మైనింగ్ ఎన్వోసీలు ఇచ్చిన మహారాష్ట్ర - మంత్రి హరీశ్‌రావు హర్షం.. 2018 జూలైకల్లా ప్రాజెక్టు పూర్తిచేస్తామని వెల్లడి - మేడిగడ్డ డిజైన్లపై నాసిక్‌లో కొనసాగుతున్న చర్చలు సాక్షి, హైదరాబాద్ గోదావరి ఉపనది అయిన పెన్‌గంగపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఛనాఖా-కొరట బ్యారేజీకి అవసరమైన కీలక అనుమతులను మహారాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇరు రాష్ట్రాల సమన్వయ కమిటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు అన్ని అంశాల పరిశీలన అనంతరం అటవీ, మైనింగ్, వన్యప్రాణి సంరక్షణలకు సంబంధించిన ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)లను జారీ చేసింది. ఈ పత్రాలను శనివారం రాష్ట్ర అధికారులకు పంపింది. పెన్‌గంగ నీటిని వినియోగంలోకి తెచ్చేందుకు ఛనాఖా-కొరట మధ్య 1.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. ఇది అంతర్రాష్ట్ర ప్రాజెక్టు కావడంతో మహారాష్ట్ర, తెలంగాణ మంత్రులు, అధికారుల స్థాయిలో పలు దఫాలు చర్చ లు జరిగాయి. బ్యారేజీ నిర్మాణానికయ్యే వ్యయంతోపాటు మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూముల పునరావాసం, భూసేకరణ వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరించాలని... తెలంగాణ, మహారాష్ట్ర 80:20 నిష్పత్తిలో నీటి వాటా తీసుకోవాలని సూత్రప్రాయంగా అవగాహనకు వచ్చాయి. అయితే బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలో సున్నపురాయి నిక్షేపాలున్న ప్రాంతం, తిప్పేశ్వరం వన్యప్రాణి కేంద్రానికి జరిగే నష్టంపై పరిశీలన చేసి ఎన్వోసీ జారీ చేస్తామని, ఆ తర్వాతే పనులు ప్రారంభించాలని మహారాష్ట్ర సూచించింది. ఈ మేరకు ఆ ప్రాంతాల్లో సర్వే చేసిన మహారాష్ట్ర అధికారులు సున్నపురాయి నిక్షేపాలకు, వన్యప్రాణి కేంద్రానికి నష్టమేమీ వాటిల్లే అవకాశం లేదని నిర్ధారించి... తాజాగా ఎన్వోసీలు జారీ చేశారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లపై మహారాష్ట్రలోని నాసిక్‌లో రాష్ట్ర అధికారులు మహారాష్ట్ర అధికారులతో చర్చలు జరుపుతున్నారు. బ్యారేజీని 101 మీటర్ల ఎత్తులోను, 102 మీటర్ల ఎత్తులోను నిర్మిస్తే... నీటి నిల్వ సామర్థ్యం, పంపుహౌజ్‌లు, మోటార్లు తదితర ఏర్పాట్లు ఎలా ఉంటాయనే దానిపై వివరణలు ఇచ్చారు. 2018 జూలైకల్లా పూర్తి.. ఛనాఖా-కొరట ప్రాజెక్టుకు మహారాష్ట్ర అనుమతులివ్వడంపై మంత్రి టి.హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వ న్యప్రాణి కేంద్రానికి సంబంధించిన అనుమతులు సంపాదించేందుకు ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారులు చేసిన కృషిని అభినందించారు. ఆదిలాబాద్‌లో సాగునీటి పారుదల రంగానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని... భూసేకరణ సహా వివిధ అంశాలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. ఛనాఖా-కొరట బ్యారేజీ పనుల నిమిత్తం 770 ఎకరాల భూమి అవసరం కాగా, ఇంకా 290 ఎకరాలు సేకరించాల్సి ఉందని... తహసీల్దార్లు భూసేకరణను వేగవంతం చేయాలని కోరారు. 2018 జూలై కల్లా బ్యారేజీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
దివాలా బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: దివాలా బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. లోక్‌సభలో ఈ బిల్లుకు మే 5నే ఆమోదముద్ర పడింది. రెండు సభలు ఆమోదం తెలపడంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. సుదీర్ఘకాలయాపన లేకుండా... కంపెనీలు, వ్యక్తులు అందరికీ ప్రయోజనం కలిగేలా నిర్థిష్ట కాల వ్యవధుల్లో దివాలా సమస్యల పరిష్కారం, తద్వారా రుణ సమస్యల నివారణ ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. దివాలాకు సంబంధించి 12 విభిన్న చట్టాల స్థానంలో తాజా బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. చర్చకు ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్‌సిన్హా సమాధానం ఇస్తూ... దీనిని చరిత్రాత్మక బిల్లుగా అభివర్ణించారు. దివాలా వ్యవహారాల ప్రక్రియ మొత్తం 180 రోజుల్లో పూర్తికావాలని బిల్లు నిర్దేశిస్తోంది. -
అభీష్ట రాజీనామా ఆమోదించిన చంద్రబాబు
-
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు
-
రుణం తీర్చుకుంటాం
బేషరతుగా రుణమాఫీ.. పరిమితులు లేకుండా అమలుకు కేబినెట్ నిర్ణయం 43 అంశాలపై చర్చ, పలు ఎన్నికల హామీలకు ఆమోదం లక్షలోపు రుణాల మాఫీతో సర్కారుపై రూ. 19 వేల కోట్ల భారం బంగారంపై రుణాలు, పాత బకాయిలకూ వర్తింపు 39 లక్షల మంది రైతులకు లబ్ధి, త్వరలో ఆర్థిక శాఖ మార్గదర్శకాలు అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. 40 వేల మందికి వరం విద్యార్థులకు ఆర్థిక సాయానికి 1956 ప్రామాణికత దళిత, గిరిజన వధువులకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 50 వేల సాయం అమర వీరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, ఇల్లు, భూమి, ఒకరికి ఉద్యోగం తెలంగాణ ఇంక్రిమెంట్‌కు ఓకే, కేంద్ర స్థాయిలో వేతనాలకు కమిటీ ఎస్టీలు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను రద్దు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు వారి పంట రుణాలను బేషరతుగా మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బంగారంపై తీసుకున్న రుణాలు, పాత బకాయిలతో పాటు ఎలాంటి పరిమితులు లేకుండా.. లక్ష వరకు పంట రుణాలను కచ్చితంగా మాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో బుధవారం జరిగిన రాష్ర్ట మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకు సందిగ్ధం నెలకొన్న పలు అంశాల విషయంలో ప్రభుత్వ వైఖరిపై కేబినెట్ ఈ సందర్భంగా స్పష్టత తీసుకొచ్చింది. దాదాపు ఐదున్నర గంటలపాటు జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో 43 అంశాలపై లోతైన చర్చ జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను కేసీఆర్ స్వయంగా మీడియాకు వెల్లడిస్తూ తెలంగాణపై వరాల జల్లు కురిపించారు. రుణాలపై స్పష్టత! లక్షలోపు రైతు రుణాల మాఫీని ఆమోదించడం వల్ల సుమారు 39,07,409 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు కేసీఆర్ తెలిపారు. బంగారం తాకట్టు రుణాలు, పాత బకాయిలతో పాటు ఎలాంటి పరిమితులు లేకుండా దీన్ని వర్తింపజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ర్ట ప్రభుత్వంపై 17 నుంచి 19 వేల కోట్ల రూపాయల మేరకు భారం పడే అవకాశముందని తెలిపారు. అయినా లెక్క చేయకుండా దీన్ని సత్వరం అమలు చేసేందుకు ఆర్థికశాఖను ఆదేశించినట్లు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని సీఎం వెల్లడించారు. దీనిపై ప్రధాన కార్యదర్శి అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 40 వేల వరకు ఉండవచ్చునని అంచనా వేసినట్లు తెలిపారు. అయితే దీనిపై తుది వివరాలు రావాల్సి ఉందన్నారు. చాలా కాలం నుంచి పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు అవసరమైతే వయోపరిమితికీ సడలింపు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. సుప్రీం ఆదేశాల మేరకు డిమోషన్ పొందే డీ ఎస్పీలను అదే హోదాలో కొనసాగించడానికి వీలుగా 134 సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించినట్లు చెప్పారు. ఉద్యోగులకు వరాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఖజానాపై రూ. 180 కోట్ల మేర భారం పడుతుందని అంచనా. అలాగే వారికి కేంద్ర ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇచ్చే అంశంపై అధ్యయనానికి రాష్ర్ట ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ దిశగాతక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాల్సిందిగా ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని మంత్రివర్గం తీర్మానించింది. సైబరాబాద్, హైదరాబాద్‌లో పోలీస్ శాఖ అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించేందుకు 3,883 వాహనాలను కొనుగోలు చేయనున్నారు. ఇందుకు రూ. 340 కోట్లు మంజూరు చేసేందుకు, 3,620 మంది కానిస్టేబుళ్లు-డ్రైవర్ల నియామకానికి కూడా కేబినెట్ ఆమోదం లభించింది. అమరుల కుటుంబాలకు అండ 1969 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నగదు సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అర్హులైన కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఆ కుటుంబసభ్యులకు ప్రభుత్వం తరఫున ఉచిత వైద్య సౌకర్యాలు, పిల్లలకు ఉచిత విద్య, రైతులైతే 3 ఎకరాల చొప్పున భూమి, పక్కా ఇల్లు సమకూర్చనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. 2001 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసుల ఎత్తివేతకు వెంటనే చర్యలు తీసుకోవాలని హోం శాఖను ఆదేశించినట్లు చెప్పారు. స్థానికత ఖరారు! విద్యార్థులకు ఆర్థిక సాయం కోసం ఉద్దేశించిన కొత్త పథకం ఫాస్ట్ (ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) అమలుకు స్థానికత, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. 1956కు ముందు తెలంగాణలో నివాసం కలిగి ఉన్న వారికే దీన్ని వర్తింపచేస్తామని, ఈ దిశగా ఆర్థిక, సాంఘిక సంక్షేమ, విద్యా శాఖలు మార్గదర్శకాలు రూపొందిస్తాయని ఆయన వెల్లడించారు. ఏ ఒక్క తెలంగాణ విద్యార్థికీ అన్యాయం జరగనివ్వమని పేర్కొన్నారు. దసరా నుంచి కొత్త పెన్షన్లు వృద్ధులు, వితంతువులకు 1000 రూపాయల చొప్పున.. వికలాంగులకు రూ. 1500 చొప్పున పెన్షన్లు చెల్లించాలని కేటినెట్ తీర్మానించింది. దీన్ని వచ్చే దసరా - దీపావళి నడుమ ఆరంభించనున్నట్లు సీఎం తెలిపారు. ఇందులోభాగంగా లబ్ధిదారులందరికీ ప్రత్యేకంగా కార్డులిచ్చి, బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. వీటిలోనే ప్రతినెలా ఠంచనుగా పింఛన్ జమయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే బీడీ కార్మికులకు నెలకు రూ. 1000 చొప్పున భృతి ఇవ్వనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. అర్హులైన వారి సంఖ్యను తేల్చే బాధ్యతను కార్మిక శాఖకు అప్పగించినట్లు చెప్పారు. దాదాపు 7 లక్షల మంది ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య కొంత తగ్గిందని భావిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల జాబితాను రూపొందించడానికి కొంత సమయం పడుతుందన్నారు. రిజర్వేషన్లకు గ్రీన్‌సిగ్నల్ ఎస్టీలు, మైనారిటీ వర్గాలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి వీలుగా సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తుల నేతత్వంలో రెండు వేర్వేరు కమిటీలు వేయాలని రాష్ర్ట మంత్రివర్గం నిర్ణయించింది. ఈ కమిటీల అధ్యయనం, సిఫార్సుల మేరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాతే అమలు దిశగా చర్యలుంటాయని కేసీఆర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మైనారిటీ సంక్షేమానికి బడ్జెట్లో రూ. 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 500 జనాభా దాటిన ఆదివాసీలు, గిరిజనుల తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. సత్వర చర్యల కోసం పంచాయత్‌రాజ్ శాఖ ద్వారా కలెక్టర్లకు ఆదేశాలు జారీకానున్నాయి. భూమిలేని దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూ పంపిణీకి కూడా ఆమోదం లభించింది. ఇక కొత్తగా కల్యాణలక్ష్మి పథకం చేపట్టనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. దీని కింద దళిత, గిరిజన అమ్మాయిల పెళ్లిళ్లకు ప్రభుత్వం తరఫున రూ. 50 వేలు చెల్లించనున్నారు. వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు సెషన్స్ జడ్జి హోదాలో కొత్తగా వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. భారీగా అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులు- భూములకు సంబంధించిన కేసుల సత్వర విచారణ, పరిష్కారాానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. గల్ఫ్‌లో ఉండే తెలంగాణవాసులకు కేరళ ప్రభుత్వ తరహాలో అండగా నిలవడానికి ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆటోవాలాకు అండ ఆటోరిక్షాలు, వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు రవాణాపన్నును రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో 5.17 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. తద్వారా సర్కారుపై రూ. 56 కోట్ల మేర భారం పడుతుంది. రూ. 76 కోట్ల పాత బకాయిలను కూడా రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. పవర్‌లూం కార్మికులు తీసుకున్న రూ. 6.50 కోట్ల రుణాలనూ రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానించింది. కొత్త యూనివర్సిటీలు - సంస్థలు వ్యవసాయ యూనివర్సిటీని వెంటనే విడదీసి.. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెడతామని కేసీఆర్ తెలిపారు. అలాగే తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. దీనికి మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు పేరు పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ చట్టాల ప్రకారం ఏర్పడి, తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న 89 సంస్థలకు వెంటనే తెలంగాణ పేరు పెట్టాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ను, ప్రత్యేకంగా రాష్ర్ట కాలుష్య నియంత్రణ మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని తీర్మానించింది. మరికొన్ని నిర్ణయాలు.. - దేవాలయ ట్రస్టీల నియామకాల విషయంలో ఆర్డినెన్స్. - ఇప్పటికే ఆమోదించిన తెలంగాణ రాజముద్రలో స్వల్ప మార్పులు. సత్యమేవజయతే అక్షరాలను దేవనాగరి లిపిలోకి మార్పు. సింహం గుర్తు, సత్యమేవ జయతే రెండు సమ్మిళితం చేయాలన్న కేంద్ర హోం శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం. - తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవికి కర్నె ప్రభాకర్ పేరు ఖరారు. - తెలంగాణ శాసనసభకు ఆంగ్లోఇండియన్ సభ్యుడిగా రాయిడిన్‌రోచ్ పేరు ఖరారు. - అడ్వొకేట్ జనరల్‌గా కె.రామకృష్ణారెడ్డి నియామకానికి ఆమోదం. - గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలందిస్తున్న ఆర్ఎంపీలు, పీఎంపీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేసేలా వైద్య శాఖకు ఆదేశాలు - జంటనగరాల్లో గతంలో రద్దు చేసిన కల్లుడిపోలు, సొసైటీలను పునరుద్ధరించాలని నిర్ణయం. వెంటనే అమలుకు ఎక్సైజ్ శాఖకు ఆదేశం. దసరాలోగా వాటిని తెరిపించే యత్నం. - బతుకమ్మ, బోనాలు పండుగలను రాష్ట్ర అధికారిక పండుగలుగా పరిగణిస్తూ నిర్ణయం. - పరిశ్రమల్లో పెట్టుబడుల కోసం దేశంలోకెల్లా అత్యుత్తమ పారిశ్రామిక విధానానికి రూపకల్పన. మార్గదర్శకాలు రూపొందించనున్న పరిశ్రమల శాఖ. - హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దటానికి కొత్తగా మాస్టర్‌ప్లాన్. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కన్సల్టెన్సీల సాయం తీసుకోవాలని నిర్ణయం. - అన్ని రంగాల్లోని నిష్ణాతులు, మేధావులు, అనుభవజ్ఞులు, జర్నలిస్టులతో కూడిన రాష్ర్ట సలహా మండలి ఏర్పాటుకు తీర్మానం. అన్ని అంశాల్లోనూ ఈ మండలి మార్గనిర్దేశనం మేరకు నడుచుకోవాలని నిర్ణయం. ఫలితాలను బట్టి తదుపరి దశలో జిల్లా స్థాయిలోనూ ఈ కమిటీల విస్తరణ. మైనారిటీ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రపునర్విభజన చట్టంలోని 101వ సెక్షన్ ప్రకారం ఏపీ మైనారిటీ కమిషన్ చట్టాన్ని సవరించి తెలంగాణ మైనారిటీ కమిషన్ చట్టాన్ని రూపొందించారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. వెయ్యి కోట్లతో మైనారిటీల అభివృద్ధికి వార్షిక ప్రణాళికను రూపొందించాలని కూడా ప్రభుత్వం మైనారిటీ సంక్షేమశాఖను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయనున్నారు. జిల్లాసెషన్స్, సివిల్ జడ్జి స్థాయి వ్యక్తి ట్రిబ్యునల్‌కు చైర్మన్‌గా, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ స్థాయిగల అధికారి సభ్యుడిగా ఉంటారు. ముస్లింలా, న్యాయ పరిజ్ఞానం ఉన్న మరోవ్యక్తి కూడా సభ్యుడిగా ఉంటారు. మీడియాకు లీకులొద్దు..! మంత్రివర్గ సమావేశంలో చర్చకు వస్తున్న అంశాలపై నిర్మొహమాటంగా అభిప్రాయాలను వెల్లడించాలని.. మీడియాతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలని మంత్రివర్గ సహచరులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. మీడియాకు లీకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘అంతర్గత సమావేశాల్లో ఎంతైనా ఓపెన్‌గా ఉండండి. కానీ మీడియాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వానికి సమస్యలు తేవొద్దు. మీరు కూడా సమస్యలు తెచ్చుకోవద్దు...’ అని అన్నట్లుగా సమాచారం. -
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ వరాల జల్లు
హైదరాబాద్: ఎన్నికల హామీలను నెరవేర్చేదిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో.. రైతుల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. బంగారంపై తీసుకున్న రుణాలు కూడా మాఫీ చేయడానికి కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల 39 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని కేసీఆర్ ప్రకటించారు. కేబినెట్లో తీసుకున్న ఇతర కీలక నిర్ణయాలు.. అమర వీరులకు కుటుంబాలకు 10 లక్షల రూపాయిల ఎక్స్‌గ్రేసియా అమర వీరుల పిల్లలకు ఉచిత విద్య, అర్హులైన వారికి ఉద్యోగం దళిత, గిరిజన అమ్మాయిల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకం, 50 వేల రూపాయిల సాయం నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ టీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ స్థాయి స్కేల్ ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌పై కమిటీలు టీ ఎన్ఆర్ఐలకు కేరళ తరహా సంక్షేమ బోర్డు వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయిల పింఛన్ 2011 నుంచి ఉద్యమ కారులపై ఉన్న కేసుల ఎత్తివేత 1956కు ముందు తెలంగాణలో స్థిరపడ్డ వారికే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపు వ్యవసాయ యూనివర్సీటీకి ప్రొ. జయశంకర్ పేరు అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ -
పోలవరం ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర