న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు రూ. 850 కోట్లవరకూ వెచ్చించనుంది. షేరుకి రూ. 810 ధర మించకుండా ఓపెన్ మార్కెట్ ద్వారా 10.5 మిలియన్ల సొంత ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్లు ‘పేటీఎమ్’ బ్రాండ్ కంపెనీ తాజాగా వెల్లడించింది. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఆరు నెలల్లోపు బైబ్యాక్‌ను పూర్తిచేయగలమని భావిస్తున్నట్లు తెలియజేసింది.
ఇదీ చదవండి: లేడీ బాస్ సర్‌ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!
మంగళవారం(13న) సమావేశమైన బోర్డు బైబ్యాక్ ప్రతిపాదనను అనుమతించినట్లు పేర్కొంది. స్వతంత్ర డైరెక్టర్లతోపాటు బోర్డు మొత్తం ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేసినట్లు వెల్లడించింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 2 శాతం బలపడి రూ. 538 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment