share buyback
-
ఐటీసీ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 5,054 కోట్లను అధిగమించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 4,965 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం ఎగసి రూ. 22,282 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 19,270 కోట్ల టర్నోవర్ సాధించింది. హోటళ్ల బిజినెస్ ఏకీకృతం ప్రస్తుతం హోటళ్ల బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రణాళికల్లో ఉన్న ఐటీసీ బోర్డు తాజాగా ప్రత్యర్థి సంస్థలలో గల వాటాలను ఏకీకృతం చేసే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. సొంత అనుబంధ సంస్థ రస్సెల్ క్రెడిట్(ఆర్సీఎల్) ద్వారా ఆతిథ్య రంగ దిగ్గజాలు ఒబెరాయ్, లీలా హోటళ్లలోగల వాటాలను కొనుగోలు చేయనుంది. ఈఐహెచ్(ఒబెరాయ్) లిమిటెడ్‌లో 1.52 కోట్ల ఈక్విటీ షేర్లను, హెచ్ఎల్వీ(లీలా)లో 34.6 లక్షల షేర్లను బుక్ విలువ ఆధారంగా కొనుగోలు చేయనుంది. దీంతో ఈఐహెచ్‌లో ఐటీసీకి 16.13 శాతం, హెచ్ఎల్వీలో 8.11 శాతం చొప్పున వాటా లభించనుంది. ప్రస్తుతం ఈఐహెచ్‌లో ఐటీసీకి 13.69 శాతం, ఆర్సీఎల్కు 2.44 శాతం చొప్పున వాటా ఉంది. ఇక హెచ్ఎల్వీలో ఐటీసీకి 7.58 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 472 వద్ద ముగిసింది. -
డివిడెండ్ పంపిణీ పన్ను కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: షేర్ల బైబ్యాక్‌కు సంబంధించి డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసిందిగా ఆదాయపన్ను శాఖ అపిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) తాజాగా ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియాకు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ కాగ్నిజెంట్ చేసిన అపీల్‌ను ఐటీఏటీ చెన్నై బెంచ్ కొట్టివేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు అనుమతిమేరకు చేపట్టిన రూ. 19,080 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ పథకంలో భాగంగా కాగ్నిజెంట్ డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉంటుంది. 2017–18 అసెస్మెంట్ ఏడాదిలో కంపెనీ యూఎస్, మారిషస్‌లోని తమ వాటాదారుల నుంచి 94,00,534 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 20,297 చొప్పున వీటిని సొంతం చేసుకుంది. కంపెనీ దాఖలు చేసిన రిటర్నులను పరిశీలించిన తదుపరి ఐటీ శాఖ రూ. 4,853 కోట్లకుపైగా డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉన్నట్లు డిమాండ్ చేసింది. ఆదాయపన్ను శాఖ నిబంధనల ప్రకారం మూలధన వినియోగం కారణంగా పన్ను చెల్లించవలసి ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ అంశంపై కాగ్నిజెంట్ అపీల్‌కు వెళ్లింది. -
పేటీఎం భారీ బైబ్యాక్: ఒక్కో షేరు ధర ఎంతంటే!
న్యూఢిల్లీ: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు రూ. 850 కోట్లవరకూ వెచ్చించనుంది. షేరుకి రూ. 810 ధర మించకుండా ఓపెన్ మార్కెట్ ద్వారా 10.5 మిలియన్ల సొంత ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్లు ‘పేటీఎమ్’ బ్రాండ్ కంపెనీ తాజాగా వెల్లడించింది. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఆరు నెలల్లోపు బైబ్యాక్‌ను పూర్తిచేయగలమని భావిస్తున్నట్లు తెలియజేసింది. ఇదీ చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! మంగళవారం(13న) సమావేశమైన బోర్డు బైబ్యాక్ ప్రతిపాదనను అనుమతించినట్లు పేర్కొంది. స్వతంత్ర డైరెక్టర్లతోపాటు బోర్డు మొత్తం ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటేసినట్లు వెల్లడించింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో పేటీఎమ్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం బలపడి రూ. 538 వద్ద ముగిసింది. -
టీసీఎస్ మరో బంపర్ బైబ్యాక్
ముంబై: దేశీ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీ స్థాయిలో షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. సుమారు రూ. 16,000 కోట్లతో 5.33 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనుంది. షేరు ఒక్కింటికి రూ. 3,000 వెచ్చించనుంది. బుధవారం బీఎస్ఈలో షేరు ముగింపు ధర రూ. 2,737తో పోలిస్తే ఇది 9% అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా టీసీఎస్ ఈ విషయం వెల్లడించింది. 2017, 2018లో కూడా టీసీఎస్ భారీ స్థాయిలో షేర్ల బైబ్యాక్ చేసింది. 2018లో దాదాపు రూ. 16,000 కోట్లతో షేరు ఒక్కింటికి రూ. 2,100 రేటు చొప్పున 7.61 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. కంపెనీ వద్ద ప్రస్తుతం రూ. 58,500 కోట్ల మేర నగదు నిల్వలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీ ఐటీ సంస్థ బైబ్యాక్ ప్రకటించడం ఇదే ప్రథమం. ఇక, మరో ఐటీ సంస్థ విప్రో కూడా అక్టోబర్ 13న షేర్ల బైబ్యాక్‌ను పరిశీలించనున్నట్లు పేర్కొంది. మరోవైపు, క్యూ2లో టీసీఎస్ నికర లాభం రూ. 7,475 కోట్లుగా (కన్సాలిడేటెడ్) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో రూ. 8,042 కోట్లతో పోలిస్తే సుమారు 7% క్షీణించింది. తాజా క్యూ2లో అమెరికన్ సంస్థ ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేషన్‌తో లీగల్ వివాదానికి సంబంధించి రూ. 1,218 కోట్లు కేటాయించాల్సి రావడంతో ఫలితాలపై ప్రభావం పడిందని టీసీఎస్ తెలిపింది. రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 38,977 కోట్ల నుంచి 3% వృద్ధితో రూ. 40,135 కోట్లకు చేరింది. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 4.7%, లాభం 6.7% పెరిగింది. షేరు ఒక్కింటికి రూ.12 చొప్పున టీసీఎస్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ అక్టోబర్ 15 కాగా నవంబర్ 3న చెల్లింపు జరుగుతుంది. ‘పటిష్టమైన ఆర్డర్ బుక్, మార్కెట్ షేరును పెంచుకుంటూ ఉండటం తదితర అంశాలతో కంపెనీ భవిష్యత్ అవకాశాలపై మరింత ధీమాగా ఉన్నాం‘ అని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ చెప్పారు. జీతాల పెంపు.. ఉద్యోగుల జీతాల పెంపును అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు టీసీఎస్ తెలిపింది. సెప్టెంబర్ ఆఖరుకి కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 4,53,540గా ఉంది. ‘కష్టకాలంలో అసాధారణ స్థాయి లో పనిచేసిన టీసీఎస్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. అక్టోబర్ 1 నుంచి జీతాల పెంపును అమలు చేయబోతున్నాం‘ అని సంస్థ గ్లోబల్ హెడ్ (మానవ వనరుల విభాగం) మిలింద్ లాకడ్ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం ప్రారంభించామని, సెప్టెంబర్ క్వార్టర్లో అంతర్జాతీయంగా రిక్రూట్మెంట్ పెంచామని వివరించారు. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) ఆల్‌టైమ్ కనిష్టమైన 8.9%గా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇతర విశేషాలు... ► క్యూ2లో విభాగాల వారీగా చూస్తే బీఎఫ్ఎస్ఐ (6.2 శాతం), రిటైల్ (8.8 శాతం), లైఫ్ సైన్సెస్–హెల్త్‌కేర్ (6.9 శాతం), టెక్నాలజీ–సర్వీసెస్ (3.1 శాతం) తయారీ (1.4 శాతం) విభాగాలు వృద్ధి నమోదు చేశాయి. కమ్యూనికేషన్స్ మీడియా విభాగం 2.4 శాతం క్షీణించింది. ► సీక్వెన్షియల్‌గా ఉత్తర అమెరికా మార్కెట్ 3.6 శాతం, బ్రిటన్ 3.8 శాతం, యూరప్ 6.1 శాతం వృద్ధి చెందింది. వర్ధమాన దేశాల్లో భారత మార్కెట్ 20 శాతం వృద్ధి నమోదు చేసింది. ► సెప్టెంబర్ క్వార్టర్లో 8.6 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ కుదిరాయి. తాజాగా డీల్స్ కుదుర్చుకున్న సంస్థల్లో టీపీజీ టెలికం, టయోటా మోటార్స్ నార్త్ అమెరికా మొదలైనవి ఉన్నాయి. ► చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వి. రామకృష్ణన్ 2021 ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు. మే 1 నుంచి ఆయన స్థానంలో సమీర్ సక్సారియా బాధ్యతలు చేపడతారు. 1999లో టీసీఎస్‌లో చేరిన సక్సారియా ప్రస్తుతం ఫైనాన్స్ విభాగం వైస్–ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ► బీఎస్ఈలో టీసీఎస్ షేరు బుధవారం 0.78 శాతం పెరిగి రూ. 2,737 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. -
రైట్స్ బైబ్యాక్‌కు.. రైట్‌రైట్
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రభుత్వ రంగ కంపెనీ.. రైట్స్(RITES) లిమిటెడ్ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బైబ్యాక్‌లో భాగంగా రూ. 265 ధర మించకుండా 9.69 మిలియన్ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ. 257 కోట్లను వెచ్చించనున్నట్లు మినీరత్న కంపెనీ రైట్స్ తాజాగా వెల్లడించింది. 2018 జులైలో లిస్టయిన ఈ పీఎస్యూలో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 72 శాతానికిపైగా వాటా ఉంది. కంపెనీ ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉన్నట్లు రైట్స్ చైర్మన్, ఎండీ రాజీవ్ మెహ్రోత్రా తెలియజేశారు. అంతేకాకుండా రుణరహిత కంపెనీ కావడంతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు తెరతీసినట్లు వివరించారు. ఇది కంపెనీ వృద్ధి అవకాశాలు, పటిష్టతపట్ల యాజమాన్యానికున్న నమ్మకానికి నిదర్శనమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా.. బైబ్యాక్‌కు ఈ నెల 30 రికార్డ్ డేట్‌గా బోర్డు నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా.. శుక్రవారం ఎన్ఎస్ఈలో రైట్స్ షేరు 0.8 శాతం పుంజుకుని రూ. 255 వద్ద స్థిరపడింది. ఎంఆర్‌పీఎల్ వారాంతాన జరిగిన వార్షిక సమావేశంలో భాగంగా రూ. 5,000 కోట్లవరకూ నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్(ఎంఆర్‌పీఎల్) తెలియజేసింది. ఇందుకు వీలుగా మార్పిడికి వీలుకాని డిబెంచర్లు(ఎన్సీడీలు), బాండ్లు తదితరాల జారీని చేపట్టే వీలున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంఆర్‌పీఎల్ షేరు ఎన్ఎస్ఈలో శుక్రవారం దాదాపు యథాతథంగా రూ. 29 వద్ద ముగిసింది. -
ధనుకా అగ్రి- హెచ్ఎస్ఐఎల్ బైబ్యాక్ జోష్
సరిహద్దువద్ద చైనాతో వివాదాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 261 పాయింట్లు క్షీణించి 39,042 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా అగ్రికెమికల్స్ కంపెనీ ధనుకా అగ్రిటెక్, శానిటరీవేర్, హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రొడక్టుల దిగ్గజం హెచ్ఎస్ఐఎల్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ధనుకా అగ్రిటెక్ షేరుకి రూ. 1,000 ధర మించకుండా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ధనుకా అగ్రిటెక్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్‌లో భాగంగా 10 లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. బైబ్యాక్‌కు ఈ నెల 28 రికార్డ్ డేట్‌కాగా.. ఇందుకు రూ. 100 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత ఈ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లి రూ. 839ను అధిగమించింది. ప్రస్తుతం 6.3 శాతం లాభంతో రూ. 817 వద్ద ట్రేడవుతోంది. హెచ్ఎస్ఐఎల్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి ప్రతిపాదించినట్లు హెచ్ఎస్ఐఎల్ తాజాగా వెల్లడించింది. బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 21న(సోమవారం) బోర్డు సమావేశమవుతున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తొలుత హెచ్ఎస్ఐఎల్ షేరు ఎన్ఎస్ఈలో 11 శాతం జంప్‌చేసి రూ. 75ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ. 72 వద్ద ట్రేడవుతోంది. కాగా.. లాక్‌డవున్‌ల కారణంగా ఈ ఏడాది క్యూ1లో హెచ్ఎస్ఐఎల్ రూ. 17 కోట్ల నికర నష్టం ప్రకటించిన విషయం విదితమే. -
ఇక మార్కెట్లో షేర్ల డీలిస్టింగ్ వేవ్!
దాదాపు దశాబ్ద కాలం తరువాత దేశీ స్టాక్ మార్కెట్లలో కార్పొరేట్లు కంపెనీల డీలిస్టింగ్‌వైపు దృష్టి పెడుతున్నారు. ఇటీవల గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పవర్, బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్ కంపెనీ వేదాంతా డీలిస్టింగ్ ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ బాటలో ఐటీ సేవల కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ సైతం స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ కానున్నట్లు తెలియజేసింది. కోవిడ్-19 కారణంగా తలెత్తిన పరిస్థితులు ఇందుకు ప్రధానంగా ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క కంపెనీ సంబంధ అంశాలు సైతం ప్రమోటర్లను డీలిస్టింగ్‌వైపు నడిపిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ఇకపై మరిన్ని కంపెనీలు ఈ బాటలో నడిచే వీలున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతక్రితం 2009లో.. దశాబ్ద కాలం క్రితం అంటే 2008లో ఆర్థిక సంక్షోభం తలెత్తాక పతనమైన స్టాక్ మార్కెట్లు ఏడాది తిరిగేసరికల్లా రికవర్ అయ్యాయి. ఆ సమయంలో అంటే 2009లో పలు కంపెనీలు డీలిస్టింగ్‌కు మొగ్గు చూపాయి. తిరిగి గత రెండు నెలల్లో పబ్లిక్ వద్దగల వాటాను కొనుగోలు చేయడం ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి కంపెనీలను డీలిస్ట్ చేసేందుకు వేదాంతా, అదానీ పవర్, హెక్సావేర్ ప్రమోటర్లు ప్రణాళికలు ప్రకటించాయి. ఈ బాటలో దేశీ లిక్కర్ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్‌ను డీలిస్ట్ చేసే యోచనలో యూకే దిగ్గజం డియాజియో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఐటీ సేవల యూఎస్ దిగ్గజం ఒరాకిల్ సైతం ఇదే బాటలో నడవనున్నట్లు మార్కెట్లో అంచనాలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. సింగపూర్ బాటలో.. గత రెండేళ్లలో సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజీ నుంచి పలు కంపెనీలు డీలిస్టింగ్ బాట పట్టినట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. 2017- 2019 జులై మధ్య కాలంలో కంపెనీల డీలిస్టింగ్, టేకోవర్ల కారణంగా పలు షేర్లు సగటున 15 శాతం ప్రీమియం సాధించినట్లు డీబీఎస్ బ్యాంక్ ఒక నివేదికలో పేర్కొంది. కాగా.. డీలిస్టింగ్ వేవ్‌పై అంచనాలతో ఇటీవల ఒక మ్యూచువల్ ఫండ్ ఇందుకు అవకాశాలున్న కౌంటర్లపై దృష్టిపెట్టినట్లు నిపుణులు ప్రస్తావించారు. కోవిడ్-19 ప్రభావంతో షేర్ల ధరలు దిగిరావడం, నగదు నిల్వలు పుష్కలంగా కలిగి ఉండటం వంటి అంశాల నేపథ్యంలో కొన్ని దేశ, విదేశీ దిగ్గజ కంపెనీలు డీలిస్టింగ్‌పై చూపు సారించే అవకాశమున్నట్లు ఈక్వినామిక్స్ రీసెర్చ్ నిపుణులు చొక్కలింగం ఈ సందర్భంగా వివరించారు. జనవరి- మే నెల మధ్యకాలంలో వేదాంతా, అదానీ పవర్ కౌంటర్లు 40 శాతం వరకూ పతనమైన సంగతి తెలిసిందే. -
టీసీఎస్ మరోసారి బంపర్ ఆఫర్
ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) వద్ద భారీ మొత్తంలో నగదు నిల్వలు ఉన్నాయి. గత ఏడాదే ఇన్వెస్టర్ల నుంచి రూ.16,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేసిన టీసీఎస్, ఈ ఏడాది కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 16,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించినట్టు పేర్కొంది. ఒక్కో షేర్‌ను రూ. 2,100 ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 1.99 శాతం అంటే రూ.16 వేల కోట్ల షేర్ బైబ్యాక్‌కు బోర్డు ఆమోదం తెలిపినట్టు టీసీఎస్ ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం 2.35కు బోర్డు మీటింగ్ ముగిసిన అనంతరం కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.2100 చెల్లించనుంది. ఇది నేటి స్టాక్ ప్రారంభ ధర రూ.1800కు 17 శాతం ప్రీమియం. ‘ముందుగా ప్రకటించిన మాదిరిగా కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు నేడు సమావేశమయ్యారు. 7,61,90,476 వరకు ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. ఆ మొత్తం రూ.16 వేల కోట్ల వరకు ఉంటుంది. అంటే మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 1.99 శాతం. ఒక్కో షేరుకు రూ.2100 చెల్లించనున్నాం’ అని టీసీఎస్ నేడు మార్కెట్ ఫైలింగ్‌లో తెలిపింది. . గత ఏడాది బైబ్యాక్ చేసిన తరవాత కంపెనీ బోనస్ ఇష్యూ కూడా ఇచ్చింది. షేర్ బైబ్యాక్ ప్రకటించగానే.. టీసీఎస్ షేర్లు భారీగా ర్యాలీ చేపట్టాయి. సుమారు 3 శాతం మేర పైకి ఎగిసి, 52 పాయింట్ల లాభంలో రూ.1840.90 వద్ద ముగిశాయి. -
పీసీ జువెల్లరీ షేర్ బైబ్యాక్, స్టాక్ ర్యాలీ
న్యూఢిల్లీ : ప్రముఖ జువెల్లరీ సంస్థ పీసీ జువెల్లరీ షేర్ బైబ్యాక్ ప్రకటించింది. రూ.424 కోట్ల విలువైన బైబ్యాక్ చేపడుతున్నట్టు పీసీ జువెల్లరీ పేర్కొంది. ఒక్కో యూనిట్ ధర రూ.350గా నిర్ణయించింది. ఇది గురువారం స్టాక్ ముగింపు ధర 209 రూపాయలకు 67 శాతం అధికం. గురువారం జరిగిన బోర్డు మీటింగ్‌లో 1.21 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ఆమోదించినట్టు ఈ జువెల్లరీ సంస్థ తెలిపింది. ఈ షేర్ల బైబ్యాక్‌లో ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూప్ పాల్గొనదు. మార్చి క్వార్టర్ డేటా ప్రకారం ఈ కంపెనీలో ప్రమోటర్లు 57.63 శాతం వాటాను కలిగి ఉన్నారు. షేర్ బైబ్యాక్ ప్రకటనతో కంపెనీ స్టాక్ ప్రారంభ ట్రేడింగ్‌లోనే 18 శాతం పైకి ఎగిసింది. ఇంట్రాడేలో రూ.247 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. గత కొన్ని సెషన్లలో ఈ కంపెనీ షేరు తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. కానీ ఆరు ట్రేడింగ్ సెషన్ల నుంచి మాత్రం పీసీ జువెల్లరీ స్టాక్ సుమారు 88 శాతం ర్యాలీ జరుపుతూ వస్తోంది. మే 2న రూ.110.65గా ఉన్న పీసీ జువెల్లరీ స్టాక్, మే 10 తేదీకి రూ.209కు పెరిగింది. కానీ మే 3 తేదీన మాత్రం స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయిలకు పడిపోయింది. మరోవైపు మరికొన్ని రోజుల్లో కంపెనీ తన మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించబోతోంది. 2018 మే 25న బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ సమావేశంలోనే 2017 ఏప్రిల్ నుంచి 2017 సెప్టెంబర్ 1 మధ్య వరకు ఉన్న ప్రిఫరెన్స్ షేర్లపై డివిడెండ్ ప్రతిపాదనలను నిర్ణయించనున్నారు. పీసీ జువెల్లరీ ప్రస్తుతం మార్కెట్లో జువెల్లరీలను తయారీచేయడం, రిటైల్ చేయడం, ఎగుమతి చేయడం వంటి వ్యాపారాలను చేస్తోంది. 2005లో ఏర్పాటైన ఈ సంస్థ, దేశీయంగా రెండో అతిపెద్ద లిస్టెడ్ జువెల్లరీ రిటైలర్‌గా ఉంది. -
ఇన్ఫీ బైబ్యాక్‌పై ప్రమోటర్లు ఆసక్తి
సాక్షి, బెంగళూరు : దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మొట్టమొదటిసారి ప్రకటించిన బైబ్యాక్‌లో ప్రమోటర్లు పాల్గొననున్నట్టు తెలిసింది. ఆగస్టు 19న ఇన్ఫీ ప్రకటించిన రూ.13వేల కోట్ల షేరు బైబ్యాక్‌లో పాల్గొనడానికి కొంతమంది ప్రమోటర్లు ఆసక్తి చూపుతున్నట్టు కంపెనీ తెలిపింది. సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామా అనంతరం ఒక్కరోజులోనే ఇన్ఫోసిస్ ఈ బైబ్యాక్ ప్రకటన చేసింది. ఒక్కో షేరును రూ.1,150తో బైబ్యాక్ చేపట్టనున్నట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. మొత్తం 11,30,43,478 కోట్ల షేర్లను ఇన్ఫీ తిరిగి కొనుగోలు చేస్తోంది. బైబ్యాక్ ప్రకటన చేసిన రోజు షేరు విలువకు 25 శాతం ప్రీమియంతో ఇన్ఫీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తోంది. దీంతో కంపెనీ వద్దనున్న మిగులు నిధులను తమ వాటాదారులకు అందించనుంది. '' బైబ్యాక్ నిబంధనల ప్రకారం, టెండర్ ఆఫర్ మార్గం ద్వారా ప్రమోటర్లు ఈ బైబ్యాక్‌లో పాల్గొనే అవకాశం ఉంది. మేము ఈ విషయాన్ని ప్రమోటర్ సభ్యులకు తెలియజేశాం. కంపెనీ ప్రమోటర్ల గ్రూప్ కూడా ఈ బైబ్యాక్ ప్రతిపాదనలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతుంది'' అని ఇన్ఫోసిస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే ఏ ప్రమోటర్లు దీనిలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారో వారి వివరాలను మాత్రం కంపెనీ అందించలేదు. ఇన్ఫీ ప్రమోటర్లందరికీ కలిపి 12.74శాతం వాటా ఉంది. ప్రత్యేక రిజల్యూషన్ ద్వారా కంపెనీ షేర్‌హోల్డర్స్ ఈ బైబ్యాక్ ప్రతిపాదనను ఆమోదించారు. వ్యవస్థాపకులకు, బోర్డుకు గత కొంత కాలంగా సాగుతున్న వివాదం నేపథ్యంలో ఇన్ఫీ ఈ బైబ్యాక్ చేపడుతోంది. బైబ్యాక్ ప్రకటించడానికి ఒక్కరోజు ముందే సిక్కా రాజీనామా చేశారు. సిక్కా రాజీనామా అనంతరం తలెత్తిన పరిస్థితులను చక్కబెట్టడానికి నందన్ నిలేకని కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఇన్ఫీలోకి రీఎంట్రీ ఇచ్చారు. -
షేర్ల బైబ్యాక్ సైజు పెంచాలి
♦ ఈ చర్య ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతుంది ♦ మూర్తిపై బోర్డు నిందలు తప్పులను కప్పిపుచ్చుకోవడమే ♦ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో బాలకృష్ణన్ న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ కంపెనీ ప్రకటించిన షేర్ల బైబ్యాక్ మొత్తం చాలదని ఆ సంస్థ మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. తాజా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేందుకు బైబ్యాక్ పరిమాణాన్ని పెంచాలని ఆయన సూచించారు. ‘‘రూ.13,000 కోట్ల విలువ మేర షేర్ల బైబ్యాక్ ప్రకటించిన సమయం అసాధారణమైనది. ఒక్కో షేరుకు రూ.1,150 అన్నది సరైనదే. కానీ, మరింత ధరను నిర్ణయించాల్సి ఉంది. రూ.1,200 ధర ఇన్వెస్టర్లలో తగినంత నమ్మకాన్ని కలిగించగలదు’’ అని బాలకృష్ణన్ పేర్కొన్నారు. విశాల్ సిక్కా ఎండీ, సీఈవో పదవులకు రాజీనామా చేసిన మరుసటి రోజు ఇన్ఫోసిస్ బోర్డు, ఒక్కో షేరును రూ.1,150 చొప్పున 11.3 కోట్ల షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేయాలని (బైబ్యాక్) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సీఈవో బయటకు వెళ్లిపోవడం, వ్యవస్థాపకులతో వివాదం సమసిపోని అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్ఫోసిస్ బోర్డు కేవలం బైబ్యాక్‌ను ప్రకటించి ఊరుకోవడం సరికాదని బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. బైబ్యాక్ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానన్నారు. అమెరికాలో నాలుగు న్యాయ సంస్థలు ఇన్ఫోసిస్‌పై విచారణ మొదలుపెట్టినందున బైబ్యాక్‌పై దాని ప్రభావం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. క్లాస్ యాక్షన్ సూట్‌ను దాఖలు చేయాలా అన్నదానిపై అమెరికా న్యాయ సంస్థలు విచారణ చేస్తున్నాయని, ఈ ప్రక్రియలో భాగంగా లాసూట్ దాఖలు చేసే ముందు తగిన మద్దతు సమీకరిస్తాయని వివరించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే: సీఈవోగా సిక్కా తప్పుకోవడంతో కంపెనీ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిపై బోర్డు నిందలు వేయడం తన స్వీయ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకేనని బాలకృష్ణన్ ఆరోపించారు. కఠిన పరిస్థితులను తట్టుకోగలం: సీఈవో ఇన్ఫోసిస్నీలో అనిశ్చితి ఉద్యోగులపై ప్రభావం చూపించకుండా కంపెనీ తాత్కాలిక సీఈవో, ఎండీ యూబీ ప్రవీణ్‌రావు ఉద్యోగులకు ఈ మెయిల్ పంపారు. కంపెనీ తాజా పరిణామాలను తట్టుకుని నిలబడగలుగుతుందని భరోసా ఇచ్చారు. ముందున్న ప్రయాణం అంత సులభం కాదని, అయినప్పటికీ తమ విధులపై దృష్టి సారించాలని ఉద్యోగులను ప్రవీణ్‌రావు కోరారు. ఈ తరహా కఠిన సవాళ్లు ఇన్ఫోసిస్‌కు ఇదే మొదటి సారి కాదని, ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, నాయకత్వం కంపెనీ నుంచి వెళ్లిపోవడం వంటివి గతంలో ఎదుర్కొన్నవేనని, వాటిని తట్టుకుని నిలబడిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలని కోరారు. ట్రేడింగ్ ఖాతాలు ఆధార్‌తో లింక్ కావాల్సిందే: సెబీ ఇన్ఫోసిస్ షేరు కదలికలను తాము పరిశీలిస్తున్నట్టు సెబీ తెలిపింది. గత శుక్రవారం ఇన్ఫోసిస్ షేరు 10 శాతం నష్టపోగా, సోమవారం మరో 5 శాతం తగ్గిన విషయం తెలిసిందే. దీనిపై సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి స్పందిస్తూ ఇన్ఫోసిస్ షేరు ధరలను తాము పరిశీలిస్తున్నామని చెప్పారు. ట్రేడింగ్ ఖాతాలను ఆధార్ నంబర్‌తో అనుసంధానానికి విధించిన డిసెంబర్ గడువుకు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. డిసెంబర్ 31 నాటికి ఆధార్‌తో అనుసంధానం కాని వాటిని ఆ వివరాలు ఇచ్చేంత వరకు సస్పెన్షన్‌లో ఉంచనున్నట్టు త్యాగి చెప్పారు. నల్లధన ప్రవాహం, పన్నుల ఎగవేతను అరికట్టేందుకే ఈ చర్య అని చెప్పారు. క్లయింట్ల ఆధార్ వివరాలు అందించేందుకు గల సన్నద్ధత గురించి ఈ నెల 23 నాటికి వివరాలు తెలియజేయాలని గత వారం బీఎస్ఈ ట్రేడింగ్, క్లియరింగ్ సభ్యులను ఆదేశించిన విషయం తెలిసిందే. మార్కెట్ విలువలో టాప్–10 నుంచి ఇన్ఫోసిస్ ఔట్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సీఈఓ సిక్కా అర్థాంతరంగా వైదొలగడం, ఈ పరిణామ నేపథ్యంతో ఇన్ఫోసిస్ షేరు మార్కెట్ విలువ రూ. 2.01,074 కోట్లకు పడిపోయింది. దాంతో అత్యధిక మార్కెట్ విలువకలిగిన టాప్–10 కంపెనీల జాబితాలో ఇన్ఫీకి స్థానం లేకుండా పోయింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో మార్కెట్ విలువరీత్యా ఇన్ఫోసిస్ 11వ స్థానానికి దిగిపోయింది. వరుసగా రెండురోజుల్లో రూ. 33,911 కోట్ల విలువను కంపెనీ కోల్పోయింది. రూ. 5.08 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో వుండగా, టీసీఎస్ (రూ. 4.78 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.4.51 లక్షల కోట్లు), ఐటీసీ (రూ. 3.45 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ (రూ. 2.79 లక్షల కోట్లు), హెచ్‌యూఎల్ (రూ. 2.60 లక్షల కోట్లు), ఎస్బీఐ (రూ. 2.37 లక్షల కోట్లు), మారుతి సుజుకి (రూ.2.27 లక్షల కోట్లు), ఐఓసీ (రూ. 2.05 లక్షల కోట్లు), ఓఎన్జీసీ (రూ. 2.04 లక్షల కోట్లు) తర్వాతి స్థానాల్లో వున్నాయి. జైట్లీతో ఇన్ఫోసిస్ కో–చైర్మన్ రవి భేటీ ఇన్ఫోసిస్ సహ చైర్మన్ రవి వెంకటేశన్ మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. విశాల్ సిక్కా అనూహ్యంగా కంపెనీ ఎండీ, సీఈవో పదవుల నుంచి తçప్పుకున్న అనంతరం ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల్లో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇన్ఫోసిస్‌లో జరుగుతున్న పరిణామాలు, వాటాదారులకు సంబంధించి తీసుకున్న చర్యల్ని వెంకటేశన్ వెల్లడించారు. -
ఇన్ఫీ బైబ్యాక్ రెడీ..!
► 19న బోర్డు సమావేశంలో నిర్ణయం... ► రూ.13,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ► కంపెనీ చరిత్రలో తొలి బైబ్యాక్... ► భారీగా ఉన్న నగదు నిల్వలను వాటాదారులకు పంచడమే లక్ష్యం ► తాజా ప్రకటనతో 5 శాతం దూసుకెళ్లిన షేరు బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్.. షేర్ల బైబ్యాక్‌కు రంగం సిద్ధమైంది. వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేసే(బైబ్యాక్) ప్రతిపాదనపై ఈ నెల 19న(శనివారం)బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు కంపెనీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎంతమొత్తంలో బైబ్యాక్ ఉంటుందనేది ఇన్ఫీ వెల్లడించనప్పటికీ.. సుమారు రూ.13,000 కోట్లుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వలను వాటాదారులకు పంచాలంటూ కొంతమంది ప్రమోటర్లు, ఇతర మాజీ ఎగ్జిక్యూటివ్‌లు చాన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ లేదా షేర్ల బైబ్యాక్ లేదా రెండింటి రూపంలో వాటాదారులకు దాదాపు రూ.13,000 కోట్లను చెల్లించనున్నట్లు ఇన్ఫోసిస్ ఏప్రిల్‌లోనే ప్రకటించింది. కాగా, 36 ఏళ్ల ఇన్ఫోసిస్ చరిత్రలో ఇదే తొలి షేర్ల బైబ్యాక్ కానుండటం గమనార్హం. ఇతర దిగ్గజాల బాటలోనే... దేశీ సాఫ్ట్వేర్ అగ్రగామి టీసీఎస్ మొదలు... విప్రో, హెచ్‌సీఎల్ టెక్, కాగ్నిజెంట్, మైండ్‌ట్రీ ఇతరత్రా పలు ఐటీ కంపెనీలు ఇటీవల వరుసపెట్టి షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీసీఎస్ రూ.16,000 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయగా... కాగ్నిజెట్ 3.4 బిలియన్ డాలర్ల బైబ్యాక్‌ను చేపట్టింది. ఈ వరుస బైబ్యాక్‌ల ఒత్తిడితో ఇన్ఫోసిస్ కూడా ఎట్టకేలకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ ఏడాది జూన్ చివరినాటికి ఇన్ఫోసిస్ వద్ద 6 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.39,000 కోట్లు) నగదు నిల్వలు ఉన్నాయి. జూన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లోనే రూ.13,000 కోట్ల నగదు నిల్వల కేటాయింపు ప్రణాళికలపై కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా, బైబ్యాక్‌కు తమ బోర్డు ఆమోదం తెలిపితే... అమెరికాలో కూడా ఏడీఆర్ ల బైబ్యాక్ కోసం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే బైబ్యాక్ చేపట్టేందుకు వీలవుతుందని తెలిపింది. వెంటాడుతున్న అనిశ్చితి...: మార్కెట్ పరిస్థితులు సరిగ్గాలేనప్పుడు షేరు ధరకు పునరుత్తేజం కల్పించడం కోసం, అదేవిధంగా మిగులు నగదును వాటాదారులకు పంచడం కోసం కంపెనీలు ఈ షేర్ల బైబ్యాక్‌ను ప్రకటిస్తూ ఉంటాయి. మార్కెట్లో ప్రస్తుత ధరతో పోలిస్తే భారీగానే ప్రీమియం రేటును ఆఫర్ చేస్తుంటాయి. వాటాదారుల నుంచి షేర్లను వెనక్కి తీసుకోవడంతో షేర్ల సంఖ్య తగ్గి ఒక్కో షేరుపై రాబడి(ఈపీఎస్) మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది. అమెరికా సహా పలు దేశాలు ఇటీవల వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీకి డిమాండ్ మందగిండచంతో దేశీ సాఫ్ట్వేర్ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. లాభాలను నిలబెట్టుకోవడం కోసం ఉద్యోగాల కోతలకు కూడా వెనుకాడటం లేదు. ఈ మందగమన పరిస్థితులు కూడా ఐటీ సంస్థల వరుస బైబ్యాక్‌లకు ఒక కారణంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. షేరు రయ్... బైబ్యాక్ ప్రకటన వెలువడటంతో ఇన్ఫోసిస్ షేరు దూసుకుపోయింది. గురువారం బీఎస్ఈలో దాదాపు 5 శాతంపైగానే ఎగబాకి రూ.1,026ను తాకింది. చివరకు 4.5 శాతం లాభంతో రూ.1,021 వద్ద ముగిసింది. ఒక్కరోజులోనే కంపెనీ మార్కెట్ విలువ రూ.10,190 కోట్లు దూసు కెళ్లి రూ.2,34,555 కోట్లకు చేరింది. ప్రమోటర్ల ఒత్తిడితో... ఎన్ఆర్ నారాయణ మూర్తి సహా కొందరు ప్రమోటర్లు కొంతకాలంగా ఇన్ఫోసిస్ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా కంపెనీ సీఈఓ విశాల్ సిక్కాతో పాటు ఇతరత్రా కొందరు టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతన ప్యాకేజీలను భారీగా పెంచడం, కంపెనీని వీడిపోయిన కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లకు భారీమొత్తంలో వీడ్కోలు ప్యాకేజీలను ఇవ్వడాన్ని ప్రమోటర్లు తీవ్రంగా తప్పుబట్టారు. కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదంటూ ఆరోపణలు కూడా గుప్పించారు. మరోపక్క, మోహన్‌దాస్ పాయ్ వంటి ఇతర మాజీ ఎగ్జిక్యూటివ్‌లు కూడా యాజమాన్య నిర్ణయాలపై నిరసన గళం వినిపిస్తున్నారు. భారీగా ఉన్న నగదు నిల్వలను ఇష్టానుసారం ఖర్చుచేయకుండా వాటాదారులకు పంచాలని, బైబ్యాక్‌ను ఆఫర్ చేయాలనేది వారి దీర్ఘకాల డిమాండ్. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ బైబ్యాక్ ప్రక్రియకు తెరతీసింది. 2014లో తాను ఇన్ఫీ చైర్మన్ పదవినుంచి వైదొలగడం పట్ల ఇప్పుడు చింతిస్తున్నానని.. కొనసాగాలంటూ తన సహచరులు(కో–ఫౌండర్స్) ఇచ్చిన సూచనలను వినిఉండాల్సిందంటూ మూర్తి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీలో మళ్లీ ఏదైనా బాధ్యతలను చేపట్టాలని నారాయణమూర్తి భావిస్తే.. పరిశీలించేందుకు తాము సిద్ధమేనంటూ ఇటీవల ఇన్ఫీ సహ–చైర్మన్ రవి వెంకటేశన్ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. -
విప్రో 11వేల కోట్ల బైబ్యాక్ ఆఫర్
న్యూఢిల్లీ : దేశీయ మూడో అతిపెద్ద టెక్నాలజీ సంస్థ విప్రో అంచనాల్లో అధిగమించినప్పటికీ, లాభాల్లో పడిపోయింది. గురువారం ప్రకటించిన 2017-18 జూన్ క్వార్టర్ ఫలితాల్లో విప్రో 8 శాతం సీక్వెన్షియల్ డ్రాప్‌ను నమోదుచేసి, నికర లాభాలు రూ.2,076.50 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. గత మార్చి క్వార్టర్లో ఈ లాభాలు రూ.2,261.10 కోట్లగా ఉన్నాయి. కంపెనీ రెవెన్యూలు రూ.13,205.6 కోట్లగా ఉన్నాయి. ఇవి విశ్లేషకులు అంచనావేసిన రూ.12,828 కోట్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఈబీఐటీ మార్జిన్లు కూడా విశ్లేషకుల అంచనాల కంటే అధికంగానే 16.8 శాతం నమోదయ్యాయి. కానీ కంపెనీ డాలర్ రెవన్యూ గైడెన్స్‌లో నిరాశపరిచింది. తమ ఐటీ సర్వీసుల నుంచి వచ్చే రెవెన్యూలు -0.5 శాతం నుంచి 1.5 శాతం వరకు ఉంటాయని కంపెనీ అంచనావేస్తోంది. కాగ కంపెనీ మొత్తం ఆదాయం రూ. 13,661.40 కోట్లకు పెరిగింది. ఇది మార్చి క్వార్టర్లో రూ.14,470.20 కోట్లగా ఉంది. ముందస్తు ప్రకటించిన మాదిరిగానే షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై విప్రో స్పష్టతనిచ్చింది. రూ.11వేల కోట్ల షేర్ల బైబ్యాక్‌కు బోర్డు ఆమోదించినట్టు కంపెనీ తెలిపింది. ఈ బైబ్యాక్‌లో ఒక్కో షేరును రూ.320కు కొనుగోలు చేయనుంది. 343.75 మిలియన్ల వరకు షేర్ బైబ్యాక్‌ను విప్రో చేపడుతోంది. వరుసగా రెండేళ్ల నుంచి విప్రో బైబ్యాక్ ప్రకటన చేస్తూ వస్తోంది. గతంలో 40 మిలియన్ షేర్లను మాత్రమే బైబ్యాక్ చేసింది. ఒక్కో షేరుకు రూ.625 చొప్పున మొత్తం రూ.2500 కోట్ల మేర బైబ్యాక్‌ను చేపట్టింది. ఇప్పటికే పెద్ద కంపెనీల్లో ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్‌లు, మిడ్‌క్యాప్, చిన్న కంపెనీల్లో మైండ్‌ట్రి బైబ్యాక్‌లను ప్రకటించాయి. -
టీసీఎస్ షేర్ల బై బ్యాక్‌కు షేర్‌హోల్డర్ల ఆమోదం
ముంబై: టాటా గ్రూప్‌కు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) బోర్డు సోమవారం కీలక నిర్ణయం ప్రకటించింది. దేశీయ అతి పెద్ద ఐటీ సర్వీసుల టీసీఎస్ ఇటీవల ప్రకటించిన రూ.16,000 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించింది. కంపెనీ షేర్‌హోల్డర్ల ఆమోదం లభించిందనీ టీసీఎస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ బైబ్యాక్‌ను ప్రతింపాదించగా మొత్తం వచ్చిన ఓట్లలో 99.81 శాతం చెల్లుబాటయ్యే ఓట్లు అనుకూలంగా వచ్చినట్టు సమాచారం ఇచ్చింది. మొత్తం 2.85 ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించగా.. ఒక్కో షేర్‌కు రూ. 2850 చొప్పున వెచ్చించి కొనుగోలు చేయనున్నారు. దీంతో రూ. 16 వేల కోట్లతో 5.61 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు టీసీఎస్‌కు అన్ని అనుమతులు లభించాయి. భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో షేర్ల బ్యాక్‌ను ప్రకటించిన టీసీఎస్ సుమారు 5.61 కోట్ల షేర్లు లేదా క్యాపిటల్ షేర్లో 2.85 శాతం వాటాను రూ.2,850 చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తీపి కబురు చెప్పిన హెచ్‌సీఎల్ టెక్
ముంబై: ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు తీపి కబురును అందించింది. భారీ షేర్ల బై బ్యాక్ చేయనుంది. ఈ మేరకు సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. గరిష్టంగా రూ.3500 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్ చేయనుంది. దేశంలో నాల్గవ అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ షేరు ధర. రూ.1000దగ్గర ఈ బై బ్యాక్ చేపట్టనున్నట్టు మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఇన్వెస్టర్ల వ్యాల్యూ పెంచేందుకు గాను టీసీఎస్, కాగ్నిజెంట్బాటలో పయనించిన సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది. కాగా డిసెంబర్ 31 వరకు కంపెనీ వద్ద సుమారు1,88 5 మిలియన్ల డాలర్ల నిల్వలున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లు మరో రూ.10,507 కోట్లున్నాయి. కంపెనీ 1.41 బిలియన్ ఈక్విటీ షేర్లు కలిగి ఉంది. గత 56 వరుస త్రైమాసికాల్లో డివిడెండ్లను చెల్లించింది. టీసిఎస్ తరహలో మెగా బై బ్యాక్ ఆఫర్ చేయకపోయినా బై బ్యాక్ మాత్రం తప్పనిసరి అని గతంలోనే సంస్థ ప్రకటించింది. మరోవైపు టాటా కన్సల్టెన్సీ ,కాగ్నిజెంట్ సంస్థలు షేర్ల బై బ్యాక్ ను ప్రకటించగా, మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే నెల ప్రకటించే అవకాశం ఉంది. -
ఎంఫసిస్ బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం
1.73కోట్ల షేర్ల బైబ్యాక్ @రూ.1,103 కోట్లు న్యూఢిల్లీ: ఎంఫసిస్ సంస్థ షేర్ల బైబ్యాక్‌కు వాటాదారుల ఆమోదం లభించింది. 1.73 కోట్ల షేర్లను (8.26% వాటా) బైబ్యాక్ చేయడానికి తమ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపినట్లు సంస్థ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. ఒక్కో షేర్‌ను రూ.635 ధరకు మించకుండా బైబ్యాక్ చేస్తామని, ఈ బైబ్యాక్ విలువ రూ.1,103 కోట్లని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్ నాటికి ఈ కంపెనీలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌కు 60.42% వాటా ఉంది. ప్రజల వద్ద 39.58% వాటా ఉంది. గత శుక్రవారం బీఎస్ఈలో ఈ షేర్ స్వల్పంగా నష్టపోయి రూ.573 వద్ద ముగిసింది. ప్రస్తుతం కంపెనీలో మెజారిటీ వాటా పీఈ సంస్థ బ్లాక్‌స్టోన్ చేతిలో ఉంది. -
ఇన్ఫీ చరిత్రలోనే తొలిసారి బై బ్యాక్?
ముంబై: నగదు నిల్వలతో తులతూగుతున్న ఐటీ దిగ్గజాలు కంపెనీ ఈక్వీటీబేస్ తగ్గించుకునేందుకు షేర్ల బైబ్యాక్ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. దేశీయ అతి పెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా బై బ్యాక్ నిర్ణయం తీసుకోనుందట. ఇటీవల షేర్ల బై బ్యాక్ కు తాము వ్యతిరేకంగా కాదని ప్రకటించిన ఇన్పీ చివరికి టీసీఎస్ బాటలో పయినిస్తూ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దాదాపు రూ.16,680కోట్లకు పైగా (2.5మిలియన డాలర్లు) విలువైన షేర్ల బైబ్యాక్ కు ఫౌండర్స్ ఆమోదం లభించింది. ఈ మేరకు కంపెనీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. బహుశా ఏప్రిల్ నెలలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇటీవల దీనిపై భారీ కసరత్తు నిర్వచించిన ఇన్ఫీ.. ఈ ప్రతిపాదనను బోర్డు ముందు పెట్టనుంది. దీనికి బోర్డు ఆమోదం లభిస్తే షేర్ బై బ్యాక్ ఆఫర్ చేయడం ఇన్ఫోసిస్ చరిత్రలో ఇదే తొలిసారి కానుంది. అయితే ఇన్ఫీ మాజీ సీఎఫ్‌వో మోహన్ దాస్ పాయ్ షేర్ల బై బ్యాక్ పై పట్టబడుతున్నారు. కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు ప్రకటించినపుడు అది పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోదని వాదిస్తున్నారు. మరోవైపు తాము బై బ్యాక్ వ్యతిరేకంగా కాదని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఇటీవల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు ప్రకటించడం గమనార్హం. దీంతో మరిన్ని ఐటీ కంపెనీలు కూడా ఇదే బాటపట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ఐటీ దిగ్గజం టీసీఎస్ బోర్డు రూ.16 వేల కోట్లకు మించకుండా రూ. 2,850 ధర వద్ద 5.61 శాతం ఈక్విటీ షేర్లను బైబ్యాక్ నిర్ణయం తీసుకుంది. కాగ్నిజంట్ టెక్నాలజీస్ 340 కోట్ల డాలర్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్ టెల్ షేర్ల బైబ్యాక్ పై 27న నిర్ణయం
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్ టెల్ ఈ నెల 27న జరుపనున్న బోర్డు సమావేశంలో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ను పరిగణలోకి తీసుకోనుంది. ఎంత మొత్తంలో షేర్లు బైబ్యాక్ చేయనుందో వెల్లడికాలేదు. ఈ సమావేశంలో కంపెనీ బైబ్యాక్ ఈక్విటీ షేర్ల పరిశీలనతో పాటు 2016 మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సర తుది డివిడెంట్ పై కూడా నిర్ణయం తీసుకోనున్నట్టు బీఎస్ఈ సెన్సెక్స్ కు భారతీ ఎయిర్ టెల్ కంపెనీ నివేదించింది. మార్చి 31న ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.21 శాతం ఉండగా, ప్రమోటర్లు వాటా 66.74 శాతం కలిగి ఉన్నారు. భారత్ లోనే అతిపెద్ద మొబైల్ ఆపరేటర్ గా ఉన్న భారతీ ఎయిర్ టెల్ ఓపెన్ మార్కెట్ ట్రేడ్ డీల్ ద్వారా 5శాతం ఇన్ ఫ్రాటెల్ టవర్ వాటాను అమ్మకం పెట్టనుంది. ఈ డీల్ తో రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల వరకూ రాబట్టనుంది. ఈ వాటా అమ్మకం కేవలం కంపెనీ రుణాన్ని తగ్గించుకోవడానికే చేపట్టనుందని తెలుస్తోంది. కానీ వాటా అమ్మకం ఎప్పుడు చేపడుతుందో కంపెనీ వెల్లడించలేదు. 2015 డిసెంబర్ నాటికి ఎయిర్ టెల్ నికర రుణం రూ.78,816 కోట్లుగా ఉంది.