ఇన్ఫీ బైబ్యాక్‌పై ప్రమోటర్లు ఆసక్తి
ఇన్ఫీ బైబ్యాక్‌పై ప్రమోటర్లు ఆసక్తి
Published Mon, Aug 28 2017 7:57 PM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM
సాక్షి, బెంగళూరు : దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మొట్టమొదటిసారి ప్రకటించిన బైబ్యాక్‌లో ప్రమోటర్లు పాల్గొననున్నట్టు తెలిసింది. ఆగస్టు 19న ఇన్ఫీ ప్రకటించిన రూ.13వేల కోట్ల షేరు బైబ్యాక్‌లో పాల్గొనడానికి కొంతమంది ప్రమోటర్లు ఆసక్తి చూపుతున్నట్టు కంపెనీ తెలిపింది. సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామా అనంతరం ఒక్కరోజులోనే ఇన్ఫోసిస్ ఈ బైబ్యాక్ ప్రకటన చేసింది. ఒక్కో షేరును రూ.1,150తో బైబ్యాక్ చేపట్టనున్నట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. మొత్తం 11,30,43,478 కోట్ల షేర్లను ఇన్ఫీ తిరిగి కొనుగోలు చేస్తోంది. బైబ్యాక్ ప్రకటన చేసిన రోజు షేరు విలువకు 25 శాతం ప్రీమియంతో ఇన్ఫీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తోంది. దీంతో కంపెనీ వద్దనున్న మిగులు నిధులను తమ వాటాదారులకు అందించనుంది.
'' బైబ్యాక్ నిబంధనల ప్రకారం, టెండర్ ఆఫర్ మార్గం ద్వారా ప్రమోటర్లు ఈ బైబ్యాక్‌లో పాల్గొనే అవకాశం ఉంది. మేము ఈ విషయాన్ని ప్రమోటర్ సభ్యులకు తెలియజేశాం. కంపెనీ ప్రమోటర్ల గ్రూప్ కూడా ఈ బైబ్యాక్ ప్రతిపాదనలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతుంది'' అని ఇన్ఫోసిస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే ఏ ప్రమోటర్లు దీనిలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారో వారి వివరాలను మాత్రం కంపెనీ అందించలేదు. ఇన్ఫీ ప్రమోటర్లందరికీ కలిపి 12.74శాతం వాటా ఉంది. ప్రత్యేక రిజల్యూషన్ ద్వారా కంపెనీ షేర్‌హోల్డర్స్ ఈ బైబ్యాక్ ప్రతిపాదనను ఆమోదించారు. వ్యవస్థాపకులకు, బోర్డుకు గత కొంత కాలంగా సాగుతున్న వివాదం నేపథ్యంలో ఇన్ఫీ ఈ బైబ్యాక్ చేపడుతోంది. బైబ్యాక్ ప్రకటించడానికి ఒక్కరోజు ముందే సిక్కా రాజీనామా చేశారు. సిక్కా రాజీనామా అనంతరం తలెత్తిన పరిస్థితులను చక్కబెట్టడానికి నందన్ నిలేకని కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఇన్ఫీలోకి రీఎంట్రీ ఇచ్చారు.
Advertisement
Advertisement