ఇన్ఫీ చరిత్రలోనే తొలిసారి బై బ్యాక్?
ముంబై: నగదు నిల్వలతో తులతూగుతున్న ఐటీ దిగ్గజాలు కంపెనీ ఈక్వీటీబేస్ తగ్గించుకునేందుకు షేర్ల బైబ్యాక్ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. దేశీయ అతి పెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా బై బ్యాక్ నిర్ణయం తీసుకోనుందట. ఇటీవల షేర్ల బై బ్యాక్ కు తాము వ్యతిరేకంగా కాదని ప్రకటించిన ఇన్పీ చివరికి టీసీఎస్ బాటలో పయినిస్తూ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దాదాపు రూ.16,680కోట్లకు పైగా (2.5మిలియన డాలర్లు) విలువైన షేర్ల బైబ్యాక్ కు ఫౌండర్స్ ఆమోదం లభించింది. ఈ మేరకు కంపెనీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. బహుశా ఏప్రిల్ నెలలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇటీవల దీనిపై భారీ కసరత్తు నిర‍్వచించిన ఇన్ఫీ.. ఈ ప్రతిపాదనను బోర్డు ముందు పెట్టనుంది. దీనికి బోర్డు ఆమోదం లభిస్తే షేర్ బై బ్యాక్ ఆఫర్ చేయడం ఇన్ఫోసిస్ చరిత్రలో ఇదే తొలిసారి కానుంది.
అయితే ఇన్ఫీ మాజీ సీఎఫ్‌వో మోహన్ దాస్ పాయ్ షేర్ల బై బ్యాక్ పై పట్టబడుతున్నారు. కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు ప్రకటించినపుడు అది పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోదని వాదిస్తున్నారు. మరోవైపు తాము బై బ్యాక్ వ్యతిరేకంగా కాదని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఇటీవల చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు ప్రకటించడం గమనార్హం. దీంతో మరిన్ని ఐటీ కంపెనీలు కూడా ఇదే బాటపట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా ఐటీ దిగ్గజం టీసీఎస్ బోర్డు రూ.16 వేల కోట్లకు మించకుండా రూ. 2,850 ధర వద్ద 5.61 శాతం ఈక్విటీ షేర్లను బైబ్యాక్ నిర్ణయం తీసుకుంది. కాగ్నిజంట్ టెక్నాలజీస్ 340 కోట్ల డాలర్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించిన సంగతి తెలిసిందే.