promoters
-
ప్రమోటర్లు వాటాలు అమ్మేస్తున్నారు!
ఇటీవల సెకండరీ మార్కెట్లు బుల్ వేవ్‌లో పరిగెడుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 79,000, నిఫ్టీ 24,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. ఈ నేపథ్యంలో పలు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు కొంతమేర సొంత వాటాలను విక్రయించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..ముంబై: రోజుకో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకుతూ దౌడు తీస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు సైతం కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. దీంతో కొన్ని కంపెనీల ప్రమోటర్లు ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తమ వాటాలో కొంతమేర విక్రయిస్తున్నారు. తద్వారా నిధులను సమకూర్చుకుంటున్నారు. వీటిని రుణ చెల్లింపులు, విస్తరణ ప్రణాళికలు, పబ్లిక్కు కనీస వాటా తదితరాలకు వినియోగిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వివరాల ప్రకారం 2024 తొలి ఆరు నెలల్లోనే ఎన్ఎస్ఈ–500లోని కొన్ని కంపెనీల ప్రమోటర్లు 10.5 బిలియన్ డాలర్ల(రూ. 87,000 కోట్లకుపైగా) విలువైన ఈక్విటీలను విక్రయించారు. మరొక విశ్లేషణ ప్రకారం గత రెండు నెలల్లోనే సుమారు 200 లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు రూ. 33,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయించడం తాజా ట్రెండ్‌కు అద్దం పడుతోంది. వెరసి దేశీ ఈక్విటీల విలువలు అత్యంత ప్రీమియంస్థాయికి చేరాయన్న సంకేతాలు వెలువడుతున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందువల్లనే కొన్ని లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు తమతమ బిజినెస్‌లలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేíÙంచారు. కరోనా ఎఫెక్ట్...ప్రస్తుత మార్కెట్లలో పలు కంపెనీల షేర్లు గరిష్ట విలువలకు చేరడంతో బ్లాక్ డీల్స్ లేదా బల్క్ డీల్స్ ద్వారా ప్రమోటర్లు కొంతమేర వాటాలను అమ్మివేస్తున్నారు. వీరికితోడు ఇటీవల పీఈ దిగ్గజాలు, ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం తమ పెట్టుబడులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుత ట్రెండ్ కారణంగా 2023 జనవరి–డిసెంబర్లో నమోదైన 12.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,04,000 కోట్లు) విక్రయ రికార్డ్ 2024 కేలండర్ ఏడాదిలో తుడిచిపెట్టుకుపోయే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2023లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు వాటాలు విక్రయించిన విషయం విదితమే. 2024లో ఇప్పటివరకూ దేశ, విదేశీ ప్రమోటర్లు మొత్తంగా రూ. 87,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. కోవిడ్–19 నేపథ్యంలో 2020 జనవరి–డిసెంబర్‌లోనూ రికార్డు నెలకొల్పుతూ రూ. 78,500 కోట్ల విలువైన షేర్లను వివిధ కంపెనీల ప్రమోటర్లు అమ్మివేశారు.జూన్‌లో పలువురు ప్రమోటర్లు బ్లాక్ డీల్స్ ద్వారా భారీగా వాటాలను విక్రయించారు. రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలతో ఇండస్ టవర్స్‌లో యూకే దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ 18 % వాటాను విక్రయించింది. ఇక ఎంఫసిస్‌లో 15% వాటాను పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ 80 కోట్ల డాలర్లకు అమ్మింది. దేశీ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌లో ప్రమోటర్ వేదాంతా రిసోర్సెస్ 2.63% వాటా విక్రయం ద్వారా రూ. 4,184 కోట్లు సమీకరించింది. ఇక జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్లో వాబ్కో ఏషియా 30 కోట్ల డాలర్ల విలువైన వాటాను విక్రయించింది.విక్రయ తీరు(రూ. కోట్లలో)కంపెనీ పేరు షేర్ల విలువ ఇండస్ టవర్స్ 15,300 ఎంఫసిస్ 6,680 వేదాంతా 4,184 ఇంటర్‌గ్లోబ్ 3,300 జెడ్ఎఫ్ సీవీ 2,194 గ్లాండ్ ఫార్మా 1,754 -
డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: కీలక వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ హోల్డింగ్స్‌ను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జరిమానా, వడ్డీ, రికవరీ వ్యయాలతో కలిపి మొత్తం రూ. 22 లక్షలు రాబట్టేందుకు ఈ మేరకు ఆదేశాలిచి్చంది. వివరాల్లోకి వెడితే..డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌లో డీహెచ్ఎఫ్ఎల్కి గల వాటాలను అనుబంధ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ ఇన్వెస్ట్మెంట్స్కి గతంలో బదలాయించారు. అప్పట్లో డీహెచ్ఎఫ్ఎల్కి (ప్రస్తుతం పిరమల్ ఫైనాన్స్) సీఎండీగా కపిల్ వాధ్వాన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ ఉన్నారు. షేర్ల బదలాయింపునకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ నోటీసులో పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి వారిద్దరూ బాధ్యులని సెబీ తన విచారణలో తేలి్చంది. 2023 జూలైలో చెరి రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు ఇచ్చింది. కానీ దాన్ని చెల్లించడంలో వారు విఫలం కావడంతో తాజాగా రెండు వేర్వేరు అటాచ్మెంట్ నోటీసులు ఇచి్చంది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలకు అనుమతించరాదని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యుచువల్ ఫండ్స్‌కి సూచించింది. వాధ్వాన్లు తమ బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల్లోని నిదులను మళ్లించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నామని, అలా జరిగితే జరిమానాను రాబట్టడం కుదరదనే ఉద్దేశంతో ఈ నోటీసులు ఇస్తున్నట్లు సెబీ తెలిపింది. -
సఫైర్ ఫుడ్స్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఓమ్ని చానల్ రెస్టారెంట్ల నిర్వాహక కంపెనీ సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌లో రెండు ప్రమోటర్ సంస్థలు తాజాగా 5.9 శాతం వాటాను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా సమర క్యాపిటల్ పార్ట్నర్స్ ఫండ్–2.. 4,49,999 షేర్లు(0.71 శాతం వాటా), సఫైర్ ఫుడ్స్ మారిషస్ 33,37,423 షేర్లు(5.24 శాతం) అమ్మివేశాయి. బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం ఒక్కో షేరుకి రూ. 1,400 సగటు ధరలో విక్రయించిన వాటా విలువ రూ. 530 కోట్లు. కేఎఫ్‌సీ, పిజ్జా హట్, టాకో బెల్ తదితర యమ్ బ్రాండ్ల అతిపెద్ద ఫ్రాంచైజీగా సఫెర్ ఫుడ్స్ వ్యవహరిస్తోంది. తాజా లావాదేవీల తదుపరి కంపెనీలో మారిషస్ ప్రమోటర్ వాటా 29.28 శాతం నుంచి 24.04 శాతానికి తగ్గింది. ఇక సమర క్యాపిటల్ పార్ట్నర్స్ ఫండ్–2.. కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగినట్లయ్యింది. సింగపూర్ ప్రభుత్వం 10.05 లక్షల షేర్లు, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ 22 లక్షల షేర్లు కొనుగోలు చేశాయి. కాగా.. ఈ నెల మొదట్లో మరో ప్రమోటర్ సంస్థ అరింజయ మారిషస్.. రూ. 378 కోట్లకు సఫైర్ ఫుడ్స్‌లో 4.2 శాతం వాటాను విక్రయించిన విషయం విదితమే. వాటా విక్రయం నేపథ్యంలో సఫైర్ ఫుడ్స్ షేరు బీఎస్ఈలో 0.26 శాతం నీరసించి రూ. 1,403 వద్ద ముగిసింది. ఆర్కియన్ కెమ్‌లో వాటా అమ్మకం స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్‌లో ఇండియా రిసర్జెన్స్ ఫండ్ స్కీ మ్–1, స్కీమ్–2, పిరమల్ నేచురల్ రిసోర్సెస్ ఉమ్మడిగా 3.4% వాటాకు సమానమైన 42 లక్షల షేర్లను విక్రయించాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 600–601 సగటు ధరలో విక్రయించిన వాటా విలువ రూ. 252 కోట్లు. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ 14.06 లక్షల షేర్లు, డీఎస్పీ ఎంఎఫ్ 10 లక్షల షేర్లు, గోల్డ్‌మన్ శాక్స్ 6.23 లక్షల షేర్లు చొప్పున సొంతం చేసుకున్నాయి. వాటా విక్రయం నేపథ్యంలో ఆర్కియన్ కెమికల్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.3% పతనమై రూ. 610 దిగువన ముగిసింది. ప్రైకోల్లో వాటా విక్రయం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఆటో విడిభాగాల కంపెనీ ప్రైకోల్లో పీహెచ్‌ఐ క్యాపిటల్ సొల్యూషన్స్ 14,40,922 షేర్లను విక్రయించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 1.2 శాతం వాటాకు సమానమైన వీటిని షేరుకి రూ. 347 సగటు ధరలో అమ్మివేసింది. డీల్ విలువ రూ. 50 కోట్లుకాగా.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్ వీటిని కొనుగోలు చేసింది. తాజా లావాదేవీల తదుపరి కంపెనీలో పీహెచ్‌ఐ క్యాపిటల్ వాటా 5.73 శాతం నుంచి 4.55 శాతానికి తగ్గింది. వాటా విక్రయం నేపథ్యంలో ప్రైకోల్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ. 344 దిగువన ముగిసింది. -
రూ.10 వేల ధరలో షావొమీ 5జీ!
న్యూఢిల్లీ: స్మార్ట్ ఉపకరణాల తయారీలో ఉన్న షావొమీ రూ.10–15 వేల ధరల శ్రేణిలో 5జీ మోడళ్లను పెద్ద ఎత్తున తీసుకు రానుంది. మార్కెట్ వాటాను తిరిగి చేజిక్కించుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘ప్రస్తుతం 5జీ మోడళ్లు ఎక్కువగా రూ.20 వేలకుపైగా ధర పలుకుతున్నాయి. రూ.15–20 వేల ధరల శ్రేణిలో విస్తృతి పెరిగింది. రూ.10–15 వేల ధరల విభాగంలో మార్కెట్ ఉండబోతోంది. షావొమీకి ఈ సెగ్మెంట్లో భారీ అవకాశాలు ఉన్నాయి. 4జీ స్మార్ట్ఫోన్ల రంగంలో అమలు చేసిన విధానాన్ని పునరావృతం చేయడానికి, 5జీ మ్యాజిక్‌ను మళ్లీ సృష్టించడానికి కంపెనీకి స్పష్టమైన అవకాశం ఉంది’ అని షావొమీ ఇండియా ప్రెసిడెంట్ బి.మురళీకృష్ణన్ తెలిపారు. రిటైల్ స్టోర్ల లో సేల్స్ ప్రమోటర్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 4,000 నుంచి 2023 డిసెంబర్ నాటికి రెండింతలకు చేస్తామన్నారు. -
జీల్ ప్రమోటర్లకు శాట్ షాక్
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మధ్యంతర ఆదేశాలకు వ్యతిరేకంగా మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) ప్రమోటర్లు చేసిన అప్పీల్‌ను సెక్యూరిటీస్ అపిల్లేట్ ట్రిబ్యునల్(శాట్) కొట్టివేసింది. (దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్‌తో పోలిస్తే?) ఏడాదిపాటు లిస్టెడ్ కంపెనీలలో ఎలాంటి బాధ్యతలూ చేపట్టకుండా సెబీ నిలువరించడాన్ని వ్యతిరేకిస్తూ సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకా శాట్‌ను ఆశ్రయించారు. నిధుల మళ్లింపు కేసులో వీరిరువురూ లిస్టెడ్ కంపెనీలలో ఎలాంటి డైరెక్టర్లు లేదా కీలక యాజమాన్య బాధ్యతలు చేపట్టకుండా సెబీ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా అïప్పీల్పై ఆదేశాలను జూన్ 27కు శాట్ రిజర్వులో ఉంచింది. (ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పుడు వివరాలిచ్చారో : స్ట్రాంగ్ వార్నింగ్) -
ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ ఏం చేశారంటే?
సాక్షి,ముంబై: ప్రముఖ టీవీ ఛానల్ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులు, ప్రముఖ జర్నలిస్టు ప్రణయ్ రాయ్, అతని భార్య రాధిక రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆలస్యంగా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం తక్షణమే అమలులోకి వచ్చేలా ఇద్దరూ డైరెక్టర్ పదవులకు గుడ్ బై చెపారు. అయితే 32.26 శాతం వాటా ఉన్న ప్రమోటర్లుగా ఛానెల్ బోర్డుకు రాజీనామా చేయలేదు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ట్విటర్లో ఎన్డీటీవీని అన్‌ఫాలో చేస్తున్నానంటూ తెలంగాణా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇంతవరకూ చేసిన సేవకు వారికి ధన్యవాదాలు తెలిపారు. Unfollowing @ndtv Thanks for the good work thus far 👍 https://t.co/7IsU6TljjJ — KTR (@KTRTRS) November 30, 2022 కొత్త డైరెక్టర్లు ఈ క్రమంలో సుదీప్త భట్టాచార్య, సంజయ్ పుగ్లియా, సంథిల్ సమియా చంగళవరాయన్లు ఎన్డీటీవీకి కొత్త డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ఇవి తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్ఆర్పిఆర్ హోల్డింగ్ ప్రకటించింది. పుగాలియా అదానీ గ్రూప్‌లో మీడియా కార్యక్రమాలకు సీఈవో, ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు. ఎన్డీటీవీ షేరు జోరు మరోవైపు ఓపెన్ ఆఫర్ ప్రకటించిన దగ్గర్నించి జోరుమీదున్న ఎన్డీటీవీ స్టాక్ తాజా వార్తలతో 5 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ తాకింది. గత 5 రోజుల్లో 22 శాతానికి పైగా జంప్ చేయగా,ఆరు నెలల కాలంలో స్టాక్ 161 శాతం పెరిగింది. Radhika and Dr. Prannoy Roy have resigned from NDTV's holding company RRPR's board of directors, effectively immediately. pic.twitter.com/LX7J9QuJDx — Abhishek Baxi (@baxiabhishek) November 29, 2022 కాగా అదానీ గ్రూప్ ఎన్డీటీవీ వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈఏడాది ఆగస్ట్ 23న, అదానీ ఎంటర్ప్రైజెస్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్, విశ్వప్రదన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 100శాతం ఈక్విటీ వాటాలను రూ.113.74 కోట్లకు కొనుగోలు చేసింది. నెల తర్వాత,వీపీసీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18 శాతంవాటాను కొనుగోలు చేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే ఎలాంటి నోటీసు లేకుండానే టేకోవర్ జరిగిందని ఎన్డీటీవీ వాదించింది. దీంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. చివరికి ఐపీవో కోసం అదానీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నవంబర్ 22, డిసెంబర్ 5 మధ్య నిర్వహిస్తున్న ఓపెన్ ఆఫర్‌కు స్పందన బాగానే లభిస్తోంది -
దేశానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి
శాన్ ఫ్రాన్సిస్కో: ’బ్రాండ్ ఇండియా’కు ప్రచారకర్తలుగా వ్యవహరించాలని భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు (సీఏ) కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. దేశంలోకి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని, దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం 3.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్ వచ్చే 30 ఏళ్లలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని గోయల్ చెప్పారు. ‘భారత్‌లో పెట్టుబడుల అవకాశాల గురించి మీరు అంతర్జాతీయ క్లయింట్లకు వివరించండి. ఆ విధంగా అమెరికాలోను ఇతర ప్రాంతాల్లోను ఉన్న భారతీయ సీఏలు ఆయా దేశాలకు, భారత్‌కు మధ్య వారధిగా నిల్చినవారవుతారు‘ అని ఆయన పేర్కొన్నారు. అలాగే అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు, సేవలను భారత్ అందుబాటు ధరల్లోనే అందిస్తున్న విషయాన్ని కూడా ఇతర దేశాలకు తెలియజేయాలని గోయల్ సూచించారు. ఐసీఏఐ సభ్యులు పండుగలు మొదలైన సందర్భాల్లో బహుమతులు ఇచ్చేందుకు మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. దేశీ సీఏ సంస్థలు అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలుగా ఎదిగే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. -
సెబీ అనుమతి తప్పనిసరి
న్యూఢిల్లీ: కంపెనీకి చెందిన ప్రమోటర్ల వాటా కొనుగోలుకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి తప్పనిసరి అంటూ వార్తా చానళ్ల మీడియా సంస్థ ఎన్డీటీవీ తాజాగా స్పష్టం చేసింది. చెల్లించని రుణాలస్థానే ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ లిమిటెడ్‌లో వాటాను చేజిక్కించుకునేందుకు వీసీపీఎల్.. సెబీ అనుమతి పొందవలసి ఉన్నట్లు పేర్కొంది. 2020 నవంబర్ 27న కంపెనీ వ్యవస్థాపక ప్రమోటర్లు ప్రణయ్, రాధికా రాయ్‌లను సెబీ రెండేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించింది. తద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీల కొనుగోలు, విక్రయం లేదా సెక్యూరిటీల మార్కెట్లలో ఏ ఇతర కార్యకలాపాలు చేపట్టకుండా ఆంక్షలు విధించింది. ఈ నిషేధం 2022 నవంబర్ 26న ముగియనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఎన్డీటీవీ వివరించింది. దీంతో గడువుకంటే ముందుగానే ఆర్ఆర్పీఆర్లో వీసీపీఎల్ వాటాను సొంతం చేసుకునేందుకు సెబీ అనుమతి తప్పనిసరిగా తెలియజేసింది. మంగళవారం వీసీపీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18% వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. దీంతో సాధారణ వాటాదారుల నుంచి మరో 26% వాటా కొనుగోలుకి షేరుకి రూ. 294 ధరలో ఓపెన్ ఆఫర్‌ను సైతం ప్రకటించిన విషయం విదితమే. వారెంట్ల నిబంధనలు కీలకం ఎన్డీటీవీ బలవంతపు టేకోవర్‌కు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలలో వారెంట్ల జారీలో చోటుచేసుకున్న నిబంధనలు కీలకంగా నిలవనున్నట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. అదానీ గ్రూప్‌నకు చెందిన వీసీపీఎల్ నుంచి వారెంట్ల జారీ ద్వారా ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ గతంలో దాదాపు రూ. 404 కోట్ల రుణాలు పొందింది. వీటిని ఈక్విటీగా మార్పిడి చేసుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్లో 99.9 శాతం వాటాను పొందినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. వెరసి ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ప్రమోటర్లకు ఈ విషయం తెలియదంటూ ఎన్డీటీవీ పేర్కొంది. దీంతో వారెంట్ల జారీలో అంగీకరించిన నిబంధనలు ఇకపై కీలక పాత్ర పోషించనున్నట్లు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. రేటింగ్‌పై ఎఫెక్ట్... బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ ఇతర కంపెనీల కొనుగోళ్ల ద్వారా భారీగా విస్తరిస్తోంది. అయితే రుణాల ద్వారా చేపడుతున్న ఈ కొనుగోళ్లు కంపెనీ రేటింగ్‌పై ఒత్తిడిని పెంచుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా పేర్కొంది. 1988లో కమోడిటీల ట్రేడర్‌గా ప్రారంభమైన గ్రూప్ మైనింగ్, పోర్టులు, విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాలు తదితర పలు రంగాలలో భారీగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇటీవలే సిమెంట్ రంగంలో 10.5 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లకు తెరతీసింది. -
వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తుల జప్తు!
ముంబై: వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తుల స్తంభన, జప్తునకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ముంబై బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల వల్ల ప్రమోటర్లు తమ ఆస్తుల తనఖా, వేలం, అమ్మకంసహా వాటిపై ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేరు. కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్సీఎల్టీ తాజా ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. కీలక ఆదేశాల్లో అంశాలను పరిశీలిస్తే... ► సీడీఎస్ఎల్, ఎన్‌ఎస్‌డీఎల్‌లకు..: వీడియోకాన్ ప్రమోటర్లకు ఏదైనా కంపెనీ లేదా సొసైటీలో ఉన్న షేర్లను స్తంభింపజేయలని, ఎటువంటి అమ్మకం, బదలాయింపునైనా నిషేధించాలని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)లను ఎన్సీఎల్టీ ఆదేశించింది. ఆలాగే ఆయా వివరాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు తెలియజేయాలని కూడా సూచించింది. ► సీబీడీటీకి..: వీడియోకాన్ ప్రమోటర్ల ఆస్తులకు సంబంధించి తెలిసిన వివరాలను వెల్లడించాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ)ను కూడా ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రమోటర్ల బ్యాంక్ అకౌంట్లు, లాకర్ల వివరాలను వెల్లడించాలని, తక్షణం ఆయా అకౌంట్లను లాకర్లను స్తంభింపజేయడానికి చర్యలు తీసుకోవాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు ఆదేశాలు ఇచ్చింది. ► పీఎంసీఏకు సూచనలు: వీడియోకాన్ ప్రమోటర్లకు ఉన్న చరాస్తుల వివరాలను గుర్తించి తెలియజేయలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు లేఖలు రాయడానికి కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ)కు ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. కేసు వివరాలు ఇవీ... కంపెనీలోఆర్థిక అవకతవకలు, కుంభకోణాల విషయంలో వీడియోకాన్ వ్యవస్థాపకుడు, సీఎండీ వేణుగోపాల్ ధూత్, ఇతర మాజీ డైరెక్టర్లు, సీనియర్ అధికారులను విచారించి తగిన చర్యలు తీసుకోడానికి, అక్రమ సంపాదన రికవరీకి తగిన అనుమతులు ఇవ్వాలంటూ కంపెనీల చట్టం సెక్షన్ 241, 242 కింద కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. వీడియోకాన్ లిమిటెడ్‌లో మిగులు, నిల్వలు మొత్తంగా రూ.10,028.09 కోట్లని 2014 ఫైనాన్షియల్ రిపోర్ట్ పేర్కొంది. కేవలం ఐదేళ్ల కాలంలో (2018–19 నాటికి) కంపెనీ రూ.2,972.73 కోట్ల నష్టాల్లోకి వెళ్లిపోవడంపై భాస్కర పంతుల్ మహన్, నారిన్ కుమార్ భోలాలతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కంపెనీరుణాలు రూ.20,149.23 కోట్ల నుంచి రూ.28,586.87 కోట్లకు పెరిగిపోవడం గమనార్హం. ‘‘మునిగిపోతున్న నౌకకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ భారీగా రుణాలను మంజూరు చేయడం, అదే సంస్థ దివాలా కోడ్ సెక్షన్ 7 కింద పిటిషన్ దాఖలు చేయడం అశ్చర్యంగా ఉంది’’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఆయా అంశాలన్నింటిపై సమగ్రంగా విచారించాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు ఇచ్చింది. తీవ్ర మోసపూరితమైన కేసులను విచారించే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)కు కూడా తన ఉత్తర్వు ప్రతిని అందించాలని ఆదేశించింది. -
జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా చేతికి సెలన్ ల్యాబ్స్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌కు చెందిన స్పెషాలిటీ జనరిక్స్ ఫార్మా కంపెనీ సెలన్ ల్యాబ్స్‌లో జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా2 మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. యూకే బయోఫార్మా కంపెనీ జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా ఇందుకు రూ. 364 కోట్లను వెచ్చిస్తోంది. తద్వారా సెలన్ ల్యాబ్స్‌లో 74 శాతం వాటాను సొంతం చేసుకుంది. జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా2లో సీడీసీ గ్రూప్, డెవలప్మెంట్ పార్టనర్స్ ఇంటర్నేషనల్, పునర్నిర్మాణ, అభివృద్ధి యూరోపియన్ బ్యాంక్ ప్రధాన వాటాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇటీవల మూడు ఇన్వెస్ట్మెంట్ సంస్థల ద్వారా జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా 25 కోట్ల డాలర్లను(రూ. 1,850 కోట్లు) సమీకరించింది. ఈ నిధులలో రూ. 200 కోట్లను సెలన్ ల్యాబ్స్ విస్తరణకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. 26 శాతం వాటా క్రిటికల్ కేర్, అంకాలజీ విభాగాలలో ఓరల్, ఇంజక్టబుల్స్ ఔషధాల తయారీకి వీలుగా హైదరాబాద్‌లో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సెలన్ ల్యాబ్స్ ఎండీ మిద్దే నగేష్ కుమార్ తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో సెలన్ ల్యాబ్స్ రూ. 200 కోట్ల ఆదాయం సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో రూ. 250 కోట్ల అమ్మకాలు నమోదుకాగలవని అంచనా వేస్తున్నట్లు నగేష్ పేర్కొన్నారు. సెలన్ విక్రయం నేపథ్యంలో కంపెనీ ప్రమోటర్లు విమల్ కుమార్ కావూరు, విజయ్ కుమార్ వాసిరెడ్డి తమ ఫార్మసీ బిజినెస్‌పై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. సెలన్‌లో 26 శాతం వాటాతో ప్రమోటర్లు కొనసాగనున్నట్లు నగేష్ తెలియజేశారు. జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా అజమాయిషీలో కంపెనీని ప్రొఫెషనల్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫార్మా సిటీలో సెలన్ ల్యాబ్స్ కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంటును హైదరాబాద్‌లోని షామీర్పేట లేదా త్వరలో ప్రారంభంకానున్న ఫార్మా సిటీ వద్ద ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు నగేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త రెగ్యులేటెడ్ మార్కెట్లపై దృష్టితో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీ ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, సీఐఎస్ తదితర 45 దేశాలకు ప్రొడక్టులను విస్తరించినట్లు తెలియజేశారు. అయితే కొత్త ప్లాంటు ద్వారా రెగ్యులేటెడ్ మార్కెట్లకు సైతం విస్తరించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పారిశ్రామికవాడలోగల రెండు యూనిట్ల ద్వారా కంపెనీ అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలలో ప్రొడక్టులను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
కిర్లోస్కర్ బ్రదర్స్ ప్రమోటర్లపై సెబీ జరిమానా
న్యూఢిల్లీ: ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, సాధారణ షేర్హోల్డర్లను మోసగించారని ఆరోపణలపై కిర్లోస్కర్ బ్రదర్స్ (కేబీఎల్) ప్రమోటర్లు, ఇతరులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 31 కోట్ల జరిమానా విధించింది. అలాగే వీరు మూడు నుంచి ఆరు నెలల పాటు క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు జరపరాదంటూ ఆదేశించింది. అనుచితంగా ఆర్జించిన రూ. 16.6 కోట్ల లాభాలను 4 శాతం వడ్డీ రేటు, రూ. 14.5 కోట్ల పెనాల్టీతో పాటు మొత్తం రూ. 31.21 కోట్లు కట్టాలంటూ సెబీ ఆదేశాలు ఇచ్చింది. తమ దగ్గరున్న కీలక సమాచారాన్ని ఉపయోగించుకుని షేర్లలో లావాదేవీలు జరపడం ద్వారా కేబీఎల్ ప్రమోటర్లు, డైరెక్టర్లు లబ్ధి పొందారని విచారణలో వెల్లడైంది. -
లాక్డౌన్ : బిలియనీర్ల విందు, ఉన్నతాధికారిపై వేటు
సాక్షి, ముంబై: యస్ బ్యాంక్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు బిలియనీర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ లను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా -19 లాక్డౌన్ నిబంధలను ఉల్లంఘించి, మహారాష్ట్ర హిల్ రిసార్ట్‌లోని వారి ఫామ్‌హౌస్ లో విందు చేసుకుంటున్న వీరిని అరెస్ట్ చేశారు. అంతేకాదు వీరికి అక్కడికి వెళ్లేందుకు అనుమతిచ్చిన ఐఎఎస్ అధికారిపై వేటు వేశారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న వేళ, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ భౌతికదూరాన్నిపాటిస్తోంటే, వీరు మాత్రం కుటుంబ సభ్యులతో మహాబలేశ్వర్‌లోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఆరు హై-ఎండ్ వాహనాలను గుర్తించిన స్థానికులు వెంటనే మునిసిపల్ అధికారులకు తహశీల్దార్ కు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇద్దరు డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లతో సహా మొత్తం 23 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అత్యవసరం పరిస్థితి పేరుతో పాస్‌లు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అమితాబ్ గుప్తాను బలవంతపు సెలవుపై పంపారు. వీరు తన కుటుంబ స్నేహితులనీ, కుటుంబ అత్యవసర పరిస్థితుల నిమిత్తం ఖండాలా నుండి మహాబలేశ్వర్ వరకు వెళ్లేందుకు అనుమతించాలంటూ అమితాబ్ గుప్తా పాసులు జారీ చేశారు. దీంతో వీరంతా బుధవారం రాత్రి ఐదు కార్లలో ముంబైకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నఫామ్‌హౌస్ తరలివెళ్లారు. వాధ్వాన్ల వంటవారు, సేవకులు ముఖ్యంగా కరోనా వైరస్ సంక్షోభంలో అత్యంత ప్రభావితమైన దేశం ఇటలీకి చెందిన వాధ్వాన్ బాడీగార్డ్ ఇందులో వుండటం గమనార్హం. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు వీరందరిపైనా కేసు నమోదు చేశారు. వీరిని క్వారంటైనకు తరలించామని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) మరోవైపు పీఎంసీ బ్యాంకు కుంభకోణం సహా, పలు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు, కపిల్, ధీరజ్ వాధ్వాన్ మీద సీబీఐ లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. గత నెలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా, మూడుస్లారు నిందితులు తప్పించుకున్నారు. అయితే క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకోవాలని సీబీఐ భావిస్తోంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తుందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. -
వాటాల విక్రయం : ‘జీ’ షేర్లు జంప్
సాక్షి, ముంబై: ప్రమోటర్ల వాటా విక్రయ వార్తలతో దేశీయ అతిపెద్ద లిస్టెడ్ మీడియా కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజె భారీగా లాభపడుతోంది.గురువారం ఉదయం ట్రేడింగ్ సెషన్ ఆరంభంలోనే ఏకంగా 15 శాతం ర్యాలీ చేసింది. హై స్థాయిలో ట్రేడర్ల లాభాల స్వీకరణ కనిపించినప్పటికీ మిడ్ సెషన్ తరువాత తిరిగి పుంజుకుంది. గత రెండు రోజుల్లో 16.89 శాతం పెరిగింది. ప్రమోటర్ సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ 16.5 శాతం వరకు వాటాను ఆర్థిక పెట్టుబడిదారులకు విక్రయించనున్నారు. జీల్ లోని 16.5 శాతం వాటాను ఆర్థిక పెట్టుబడిదారులకు విక్రయించాలని ఎస్సెల్ గ్రూప్ యోచిస్తోందని మీడియా సంస్థ బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు అందించిన సమాచారంలోతెలిపింది. ఒప్పంద పత్రం ప్రకారం మూడు ప్రమోటర్లు ఈఎంవీఎల్ 77 మిలియన్ షేర్లను, క్వైతర్ గ్రూప్ 61 మిలియన్ షేర్లను, ఎస్సెల్ గ్రూప్ 11 మిలియన్ల ఈక్విటీ షేర్లను మొత్తం 15.72 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఒక్కో ఈక్విటీ ధరను బుధవారం నాటి ముగింపు ధర(రూ.307)తో పోలిస్తే 10శాతం డిస్కౌంట్‌తో రూ.277 గా నిర్ణయించారు. ఈ మొత్తం ఒప్పందం విలువ దాదాపు రూ.4,132 కోట్లుగా ఉండవచ్చు. సిటీ గ్రూప్ సంస్థ డీల్స్‌కు బుక్ రన్నర్‌గా వ్యవహరించారు. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను సంస్థ రుణాల చెల్లింపునకు వినియోగించుకోనుంది. ఈ 16.50శాతంలో ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్సీ గ్లోబల్ చైనా ఫండ్‌కు 2..3శాతం వాటాను విక్రయించనుంది. ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిడెలో 8.7శాతం వాటాను కలిగి ఉంది. సెప్టెంబర్ 30 నాటికి, జీ ప్రమోటర్లు 22.37 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. షేర్‌హోల్డింగ్ డాటా ప్రకారం 96 శాతానికి సమానమైన వాటాను రుణదాతల వద్ద తనఖా పెట్టింది. ఈ లావాదేవీ తరువాత, సంస్థలో ఎస్సెల్ హోల్డింగ్ ఐదు శాతానికి పడిపోతుంది, వీటిలో ఎన్కంబర్డ్ హోల్డింగ్ 1.1 శాతంగా ఉంటుంది. సుభాష్ చంద్ర తన కుటుంబంతో కలిసి మ్యూచువల్ ఫండ్లతో సహా దేశీయ రుణదాతలకు, రష్యన్ రుణదాత విటిబితో సహా రూ 7,000 కోట్ల బాకీ పడిన సంగతి తెలిసిందే. -
ఇండిగో సంక్షోభానికి తెర : షేరు జూమ్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటార్ల వివాదానికి తెరపడినట్టు తెలుస్తోంది. ప్రధాన విభేదాలు పరిష్కరించుకనే దిశగా ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. వివాదాన్ని పరిష్కరించే దిశగా ఇరువురు కృషి చేస్తున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనిపై సీఎన్బీసీతో మాట్లాడుతూ కొనసాగుతున్న బోర్డు చర్చలపై వ్యాఖ్యానించడానికి గంగ్వాల్ ఇష్టపడలేదు. అయితే ,తాము సమస్యలను పరిష్కరించగలమని ఆశిస్తున్నానన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జూలై 19, 20 తేదీలలో రెండు రోజుల జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు ఒక రాజీ కుదిరింది. ముఖ్యంగా గంగ్వాల్ ప్రధాన డిమాండ్ బోర్డు విస్తరణ. మరింతమంది ఇండిపెండెంట్ డైరెక్టర్లను చేర్చుకోవాలని, వీరిలోఒక మహిళా ఉండాలన్న గంగ్వాల్ డిమాండ్ ఇండిగో బోర్డు ఆమోదించింది. నలుగురు స్వతంత్ర డైరెక్టర్లతో సహా బోర్డును గరిష్టంగా పదిమందికి విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకు సంస్థ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ సవరించనున్నారు. ఈ సవరణ రాబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారుల ఆమోదానికి లోబడి ఉండనుంది. మరోవైపు ఈ వార్తలు స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లను బాగా ఉత్సాహపర్చింది. బేర్ మారెట్లో ఇండిగో కౌంటర్లో కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో 2 శాతం లాభాలతో ఇండిగో ఎట్రాక్టివ్‌గా ఉంది. కాగా ఇండిగో సంస్థలో కార్పోరేట్ పాలన నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని, ఇండిగో నుంచి భాటియా ఐజీఈ గ్రూప్‌లోని ఇతర యూనిట్లకు అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని గంగ్వాల్ సెబీకి జులై 9న లేఖ రాశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని కూడా కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండిగోలో గంగ్వాల్ 37 శాతం, భాటియా గ్రూప్‌నకు 38 శాతం వాటా ఉంది. -
ఆ విభేదాల ప్రభావం వుండదు - ఇండిగో సీఈవో
సాక్షి, ముంబై : బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో కంపెనీ సీఈవో రనుంజాయ్ దత్తా స్పందించారు. బుధవారం ఆయన ఇండిగో ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ఇవి కేవలం ప్రమోటర్ల మధ్య విభేదాలు మాత్రమేనని, దీనికి ఇండిగోకు ఎలాంటి సంబంధ లేదనీ, ఇండిగో కార్యకలాపాలపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం ఉండదని వివరణ ఇచ్చారు. అలాగే ఎయిర్‌లైన్స్ మిషన్, డైరెక్షన్, గ్రోత్ స్ట్రాటజీలో ఎలాంటిమార్పు ఉండదని స్పష్టం చేశారు. సంస్థ కార్యకలాపాలు, వృద్ధి పైనే దృష్టి సారించడం ప్రస్తుతం ముఖ్యమన్నారు. ప్రమోటర్ల మధ్య విభేదాలుతో ఉద్యోగులకు, ఎయిర్‌లైన్స్‌కు ఏమీ నష్టం జరగదని సీఈవో ప్రకటించారు. శక్తిసామర్థ్యాల మేరకు తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానని, ఉద్యోగుల నుంచి కూడా ఇదే ఆశిస్తున్నానని చెప్పారు. ఈ సదర్భంగా టార్గెట్లను రీచ్ అయ్యేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న ఉద్యోగులందరికీ ఆయన ధన్యవాదాలు అన్నారు. మరోవైపు ఇండిగోలో సంక్షోభంముదిరిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఇండిగో షర్లలో అమ్మకాలకు దిగారు. దీంతో ఇండిగో షేర్లు 11 శాతానికి పైగా పతనమమ్యాయి. అమ్మకాల సెగతో సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 6423 కోట్ల సంపద ఆవిరైపోయింది. ఒక దశలో 19 శాతానికి పైగా నష్టపోయి, గత మార్చి తర్వాత తొలిసారి ఇంత భారీ నష్టాలను మూటగట్టకుంది. ముగింపులో స్వల్పంగా కోలుకున్నప్పటికీ, 2016 జనవరి తర్వాత ఇండిగోకు ఇదే అతి పెద్ద పతనమని ఎనలిస్టులు చెబుతున్నారు. కాగా ప్రమోటర్లు రాకేష్ గాంగ్వాల్, రాహుల్‌భాటియా మధ్య విభేదాల నేపథ్యంలో జోక్యం చేసుకోవాల్సిందిగా గాంగ్వాల్ మార్కెట్ రెగ్యులేటరీ సెబీనికోరిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇండిగో సంస్థను సెబీ కోరింది. -
పాన్ షాపుకన్నా అధ్వానం!!
న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రమోటర్ల మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని కోరుతూ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేష్ గంగ్వాల్ తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి లేఖ రాశారు. ఇండిగోలో గవర్నెన్స్ లోపాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, దానితో పోలిస్తే కనీసం పాన్ షాపు నిర్వహణైనా మెరుగ్గా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థను నేడు అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన విలువలకు తిలోదకాలిచ్చి.. కంపెనీ పక్క దారి పడుతోందని గంగ్వాల్ ఆరోపించారు. మరో ప్రమోటరు రాహుల్ భాటియా, ఆయన సంస్థలు సందేహాస్పద లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. చిరకాల మిత్రుడైన భాటియాకు కంపెనీపై అసాధారణ నియంత్రణాధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డర్ల ఒప్పందం ఉందని గంగ్వాల్ ఆరోపించారు. ‘సందేహాస్పద లావాదేవీలతో పాటు కనీసం ప్రాథమికమైన గవర్నెన్స్ నిబంధనలు, చట్టాలను కూడా పాటించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం సరిదిద్దే చర్యలు తీసుకోవాలి‘ అని లేఖలో పేర్కొన్నారు. దీని కాపీని అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు కూడా పంపారు. 19లోగా వివరణివ్వండి..: రాకేష్ గంగ్వాల్ చేసిన ఫిర్యాదులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కీలక వివరాలు ఇవ్వాలంటూ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను ఆదేశించింది. దీనికి జూలై 19 గడువు విధించింది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇండిగో ఈ విషయాలు తెలిపింది. సెబీకి గంగ్వాల్ రాసిన లేఖ ప్రతి తమకు కూడా అందినట్లు వివరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు స్వల్పంగా నష్టపోయి రూ. 1,565.75 వద్ద క్లోజయ్యింది. వివాదం ఇదీ.. ఇండిగో సహవ్యవస్థాపకుడు అయిన గంగ్వాల్‌కు కంపెనీలో 37% వాటాలు ఉన్నాయి. మరో సహవ్యవస్థాపకుడు రాహుల్ భాటియా, ఆయన సంబంధ సంస్థల (ఐజీఈ గ్రూప్)కు 38% వాటాలున్నాయి. సంబంధ పార్టీల మధ్య సందేహాస్పద లావాదేవీలపై ఇద్దరు ప్రమోటర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో అత్యవసర షేర్‌హోల్డర్ల సమావేశం నిర్వహించాలంటూ గంగ్వాల్ గతంలో ప్రతిపాదించగా భాటియా దాన్ని తిరస్కరించారు. అసమంజసమైన ఆయన డిమాండ్లను కంపెనీ బోర్డు ఒప్పుకోనందున గంగ్వాల్ ఇలాంటివన్నీ చేస్తున్నారంటూ భాటియా ఆరోపించారు. దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగోకు దాదాపు 49%మార్కెట్ వాటా ఉంది. 200 పైచిలుకు విమానాలతో రోజూ 1,400 ఫ్లయిట్స్ నడుపుతోంది. భాటియాకు అసాధారణ అధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డరు ఒప్పందం ఉన్నప్పటికీ.. సుదీర్ఘ మిత్రత్వం దృష్టిలో ఉంచుకుని, కంపెనీపై నియంత్రణాపేక్ష పెట్టుకోకుండా అగ్రిమెంటు తాను అంగీకరించానని గంగ్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భాటియాకు చెందిన ఐజీఈ గ్రూప్‌నకు ఆరుగురిలో ముగ్గురు డైరెక్టర్లను, చైర్మన్, సీఈవో, ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాలు ఉంటాయి. ప్రస్తుత చైర్మన్ స్వతంత్రతను తాను ప్రశ్నించడం లేదని కానీ స్వతంత్ర చైర్మన్ పేరిట జరిపే నియామక ప్రక్రియే సెబీ నిబంధనలను తుంగలో తొక్కేలా ఉందని గంగ్వాల్ ఆరోపించారు. -
ఇండిగో ప్రమోటర్లు : ముదురుతున్న పోరు
సాక్షి, ముంబై : ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇండిగో బ్రాండు విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కో ప్రమోటర్, అమెరికాకు చెందిన రాకేష్ గాంగ్వాల్ , సహ ప్రమోటర్ రాహుల్ భాటియాపై సెబీకి ఫిర్యాదు చేశారు. భాటియాపై గతంలో తాను చేసిన ఫిర్యాదులపై రెగ్యులేటరీ జోక్యం కోరుతూ సోమవారం సెబీకి లేఖ పంపారు. 49 పేజీల ఈ లేఖలో సంస్థలో గవర్నన్స్‌పై తాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశానని గాంగ్వాల్ తెలిపారు. దీనిపై స్పందించిన సెబీ జూలై 19 లోగా ఈ లేఖపై స్పందన తెలియజేయాల్సిందిగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను కోరింది. మరోవైపు గాంగ్వాల్ ఆరోపణలను రాహుల్ భాటియా తీవ్రంగా ఖండించారు. కంపెనీని బలహీన పర్చేందుకే గాంగ్వాల్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్ ఇండిగో బోర్డుకు లేఖ రాశారు. కాగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను నిర్వహిస్తున్న యాజమాన్యంలో రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరిన నేపథ్యంలో ఇద్దరూ విడిగా న్యాయ సలహాల కోసం విభిన్న సంస్థలను ఆశ్రయించారు. రాహుల్ భాటియాకు ఇంటర్‌గ్లోబ్ మాతృ సంస్థ ఇండిగోలో 38 శాతం వాటా ఉండగా, గంగ్వాల్ కు 37 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2006లో భాటియా, గంగ్వాల్ సంయుక్తంగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
బలరామ్‌పూర్ చినీ షేర్ల బైబ్యాక్
న్యూఢిల్లీ: పంచదార దిగ్గజం బలరామ్‌పూర్ చినీ షేర్లను బైబ్యాక్ చేస్తోంది. షేర్ల బైబ్యాక్‌లో భాగంగా రూ.148 కోట్ల విలువైన 3.69 శాతం వాటాకు సమానమైన 84 లక్షల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు చేస్తామని బలరామ్‌పూర్ చినీ తెలిపింది. ఒక్కో షేర్‌ను రూ.175కు కొనుగోలు చేస్తామని పేర్కొంది. శుక్రవారం ముగింపు ధర(రూ.145)తో పోల్చితే ఇది 20 శాతం అధికం. దాదాపు 40 శాతం వాటా ఉన్న ప్రమోటర్లు కూడా బైబ్యాక్‌లో పాల్గొంటారని కంపెనీ తెలిపింది. కాగా షేర్ల బైబ్యాక్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో బలరామ్‌పూర్ చినీ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, 146ను తాకింది. 5.5% లాభంతో రూ.145 వద్ద ముగిసింది. -
అమ్మకానికి రహదారి ప్రాజెక్టులు
ముంబై: గత కొన్నాళ్లుగా పలు రహదారి ప్రాజెక్టులు అమ్మకానికి వస్తున్నాయి. నిధుల కొరత తదితర కారణాలతో ప్రమోటర్లు లేదా వాటి నిర్మాణం కోసం ఏర్పాటైన స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ) వీటిని విక్రయిస్తున్నాయి. 2015–18 మధ్యకాలంలో ఏకంగా 52 రహదారి ప్రాజెక్టులను ప్రమోటర్లు విక్రయించారు. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక ప్రకారం వీటి విలువ సుమారు రూ. 37,019 కోట్లుగా ఉంటుంది. 52 ప్రాజెక్టుల్లో ఆరు డిస్కౌంటుకే అమ్ముడు కాగా.. మిగతా ప్రాజెక్టులు 2–21 శాతం ప్రీమియంకి అమ్ముడయ్యాయి. ‘చాలా మటుకు రహదారి ప్రాజెక్టులు..ప్రమోటర్లకు చాలా తక్కువ రాబడులే ఇచ్చాయి. ఆర్థికంగా బలంగా లేని డెవలపర్లు నిధుల సంక్షోభం కారణంగా నష్టానికే తమ అసెట్స్‌ను అమ్ముకున్నారు‘ అని ఇక్రా పేర్కొంది. మెరుగుపడిన ప్రాజెక్టుల రేటింగ్.. యాజమాన్యం చేతులు మారడంతో ఆయా ప్రాజెక్టులకు నిధుల లభ్యత మెరుగుపడిందని ఇక్రా వివరించింది. చాలా ప్రాజెక్టులకు మరింత తక్కువ వడ్డీ రేటుపై, మరింత దీర్ఘకాలానికి రుణాల రీఫైనాన్సింగ్ సదుపాయం లభించిందని పేర్కొంది. మూడో వంతు ప్రాజెక్టుల రేటింగ్స్ గణనీయంగా పెరిగాయి. 2014 – 2018 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ప్రాజెక్టుల అమలు వృద్ధి రేటు వార్షికంగా 23 శాతం మేర నమోదైందని ఇక్రా తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో 6,715 కి.మీ. మేర రహదారుల నిర్మాణం జరిగినట్లు పేర్కొంది. నిల్చిపోయిన ప్రాజెక్టుల సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించడం, క్లియరెన్సుల కోసం ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి తేవడం, దాదాపు 80% స్థల సమీకరణ పూర్తయ్యాకే కేటాయించడం వంటి విధానపరమైన చర్యలతో ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమైనట్లు ఇక్రా తెలిపింది. 2014 ఆర్థిక సంవత్సరంలో 3,621 కి.మీ. ప్రాజెక్టులను కేటాయించగా.. 2018 ఆర్థిక సంవత్సరానికి ఇది 47% వృద్ధితో 17,055 కి.మీ.కు చేరినట్లు వివరించింది. ఇందులో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 7,397 కి.మీ. ప్రాజెక్టులను గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించింది. రహదారుల రంగంపై స్థిరమైన అంచనాలు.. త్వరలో పెద్ద సంఖ్యలో ప్రాజెక్టుల కేటాయింపులతో రహదారి డెవలపర్లు, ఈపీసీ కాంట్రాక్టర్లకు పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రాగలవని ఇక్రా అంచనా వేస్తోంది. దీంతో ఈ రంగం భవిష్యత్ స్థిరంగా ఉండగలదని పేర్కొంది. ఇక లాభదాయకత విషయానికొస్తే ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉండటం.. ఈపీసీ కాంట్రాక్టర్లకు సానుకూలమని వివరించింది. మొత్తం మీద చూస్తే 2020 ఆర్థిక సంవత్సరంలో టోల్ వసూళ్లు కనిష్టంగానైనా రెండంకెల స్థాయిలో ఉండొచ్చని ఇక్రా పేర్కొంది. అయితే, భారీ రుణాలపై అధిక వడ్డీ వ్యయాల కారణంగా కాంట్రాక్టర్ల నికర లాభాలపై ఒత్తిడి నెలకొనవచ్చని వివరించింది. -
తనఖా.. తడాఖా!
(సాక్షి, బిజినెస్ విభాగం): ప్రమోటర్లు తమ వాటాలను తనఖా పెట్టి... వాటిపై భారీగా రుణాలు తీసుకుని... ఆ రుణాలను వేరేచోట పెట్టుబడులుగా పెట్టడం ఇపుడు కొత్త సమస్యలకు దారితీస్తోంది. జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ షేర్ల ఉదంతంతో ఇలాంటి కంపెనీలపై ఇన్వెస్టర్లు ఫోకస్ చేయాల్సిన అవసరం మళ్లీ తెరపైకి వచ్చింది. జీ షేర్ల పతనాన్ని అడ్డుకోవడంలో ప్రమోటర్ కంపెనీ ఎస్సెల్ గ్రూప్ విఫలం కావడంతో... 3 రోజుల క్రితం వాటిని తనఖా ఉంచుకున్న ఫైనాన్షియల్ సంస్థలు కొన్ని మార్కెట్లో విక్రయిచేశాయి. ఫలితంగా ఒకేరోజు ఈ షేరు 30 శాతానికి పైగా పతనమైంది. తరవాత కొంత కోలుకున్నా... మొత్తంగా జీ ఎంటర్టైన్మెంట్ షేర్ ఈ నెలలో 20 శాతానికి పైగా పతనమైంది. ఈ నేపథ్యంలో షేర్ల తనఖా వ్యవహారమేంటి? ప్రమోటర్లు షేర్లను ఎందుకు తనఖా పెడతారు? తనఖా షేర్లను ఆర్థిక సంస్థలు విక్రయించవచ్చా? ఇలాంటి సంస్థల షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చా ? ఈ అంశాలపై సాక్షి బిజినెస్ ప్రత్యేక కథనమిది... షేర్ల తనఖా అంటే.... లిస్టెడ్ కంపెనీలైనా, అన్‌లిస్టెడ్ కంపెనీలైనా ప్రతి కంపెనీలో ప్రమోటరుకు కొంత వాటా ఉంటుంది. ఈ వాటాగా ఉండే షేర్లను ప్రమోటర్లు తనఖా పెట్టి రుణం తీసుకుంటారు. ప్రమోటర్లు నిధులు సమీకరించే విధానాల్లో ఈ తనఖా ఒకటి. కంపెనీ అవసరాల కోసమో, తమ వ్యక్తిగత అవసరాల కోసమో, లేదంటే కంపెనీ విస్తరణ కోసమో.. ప్రమోటర్లు ఈ రుణాలు తీసుకుంటారు. లిస్టెడ్ కంపెనీలైతే మార్కెట్ ధరకన్నా తక్కువే ఆర్థిక సంస్థలు రుణంగా మంజూరు చేస్తాయి. ఈ సందర్భంగా ప్రమోటరుకు– సదరు ఆర్థిక సంస్థకు మధ్య కుదిరే ఒప్పందంలో... ఒక కటాఫ్ ధరను నిర్ణయించుకుంటారు. ఒకవేళ ఈ షేరు గనక మార్కెట్లో నిర్దేశిత ధరకన్నా తక్కువకు పతనమైతే... రుణంగా ఇచ్చిన మొత్తాన్ని రాబట్టుకోవటానికి ఆర్థిక సంస్థలు షేర్లను మార్కెట్లో విక్రయించవచ్చనేది ఒప్పందంలోనే ఉంటుంది. ఇదే సందర్భంలో ఆర్థిక సంస్థలు గనక ఆ షేర్లను మార్కెట్లో అమ్మకుండా ఉండాలంటే... తీసుకున్న రుణానికి సరిపోయేలా మరిన్ని షేర్లు తనఖా పెట్టాలని (మార్జిన్ కాల్) ప్రమోటర్‌ను సదరు ఆర్థిక సంస్థ అడుగుతుంది. ఒకవేళ షేర్లు కాకున్నా అప్పటికప్పుడు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రమోటర్ విఫలమైనా, ఈ రుణాలను ప్రమోటర్ చెల్లించలేకపోయినా, తనఖా షేర్లను విక్రయించుకునే హక్కు రుణదాతలకు ఉంటుంది. ఇలా రుణదాతలు ఓపెన్ మార్కెట్లో షేర్లను తెగనమ్మితే షేర్ ధర మరింతగా పతనమవుతుంది. ఒక్కోసారి షేర్ల తనఖా కారణంగా ప్రమోటర్ల వాటా కరిగిపోయి కంపెనీలు చేతులు మారే పరిస్థితులూ రావచ్చు. పెరుగుతున్న షేర్ల తనఖా... బీఎస్ఈలో లిస్టయిన 195 కంపెనీల ప్రమోటర్లు తమ వాటాలో దాదాపు సగానికి పైగా షేర్లను తనఖా పెట్టారని ప్రైమ్ డేటాబేస్ వెల్లడించింది. గతేడాది ఒక్క డిసెంబర్ క్వార్టర్‌లోనే తనఖా పెట్టిన షేర్ల విలువ రూ.2.50 లక్షల కోట్లకు పెరిగింది. ఇది బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో రెండు శాతం. నిఫ్టీ 50 కంపెనీల్లో అధికంగా తనఖా పెట్టిన షేర్ల కంపెనీల జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్ ఉంది. ప్రమోటర్లు తమకున్న వాటాలో దాదాపు సగానికి పైగా (59.40 శాతం) షేర్లను తనఖా పెట్టారు. ప్రమోటర్లు తమ వాటాలో దాదాపు 80% వాటా షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకున్న కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిలో స్టెరిలైట్ టెక్నాలజీస్, రిలయన్స్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, డిష్ టీవీ, రిలయన్స్ క్యాపిటల్, ఫ్యూచర్ కన్సూమర్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లు... ఈ కంపెనీ ప్రమోటర్లు తమ తమ వాటాల్లో 80 శాతానికి పైగా షేర్లను తనఖా పెట్టారని అంచనా. ఇలా అధిక భాగం తనఖాలో ఉన్న ప్రమోటర్ల కంపెనీల షేర్లు గత ఏడాది దాదాపు 80 శాతం వరకూ పతనమయ్యాయంటే తనఖా షేర్ల తీరుకు నిదర్శనం. ఈ జాబితాలో అట్లాంటా, పార్శ్వనాధ్ డెవలపర్స్, డీబీ రియల్టీ, ఓమాక్సీ, కాఫీడే ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీల షేర్లున్నాయి. తనఖా షేర్లు కొనచ్చా? సాధారణంగా ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న కంపెనీల షేర్లనే కొనుగోలు చేయాలని విశ్లేషకులు సూచిస్తుంటారు. ప్రమోటర్ల షేర్లలో అధిక భాగం తనఖాలో ఉంటే ఇలాంటి కంపెనీల షేర్లకు దూరంగా ఉంటేనే మేలన్నది నిపుణుల సూచన. అయితే కంపెనీ భవిష్యత్తు అంచనాలు బాగా ఉంటే, షేర్ల తనఖా నిధులతో విస్తరణ చేపడితే అది మంచి అవకాశమేనని వారంటున్నారు. ప్రమోటర్ల షేర్ల తనఖా అంతకంతకూ పెరిగిపోతుంటే కంపెనీ ఫండమెంటల్స్‌పై సందేహాలు రావడం సహజం. 10 శాతం వరకూ షేర్లను తనఖా పెడితే ఆందోళన చెందాల్సిన పనిలేదని నిపుణులు అంటున్నారు. అయితే క్వార్టర్ క్వార్టర్‌కు షేర్ల తనఖా పెరిగిపోతే మాత్రం ఆందోళనకరమేనన్నది వారి అభిప్రాయం. మార్కెట్ పతన బాటలో ఉన్నప్పుడు షేర్ల తనఖా వార్తలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరుస్తాయనేది బ్రోకరేజ్ సంస్థల మాట!! తనఖాలో టాప్...జీఎంఆర్, అపోలో రాష్ట్రానికి చెందిన మౌలిక సదుపాయాల కంపెనీ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆసుపత్రులు నిర్వహించే అపోలో తనఖా విషయంలో టాప్‌లో ఉన్నాయి. జీఎంఆర్ ఇన్ఫ్రాలో ప్రమోటర్లకు దాదాపు 63 శాతం వాటా ఉంది. కాకపోతే ఈ వాటాలో ఏకంగా 83 శాతం వరకూ తనఖాలోనే ఉంది. ప్రస్తుతం జీఎంఆర్ షేరు ధర రూ.15.50గా ఉండగా... కంపెనీ మార్కెట్ విలువ 9,300 కోట్ల వరకూ ఉంది. ఒకదశలో రూ.126 వరకూ వెళ్లిన ఈ షేరు ప్రస్తుతం రూ.15.50కి చేరింది. భారీ రుణ భారంలో కూరుకుపోయిన ఈ కంపెనీ షేరు ధర పతనమవుతున్న కొద్దీ.. ప్రమోటర్లు మరిన్ని షేర్లను తనఖా పెడుతూ వస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే రాష్ట్రానికి చెందిన హెల్త్‌కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించి ప్రమోటర్ల దగ్గర 34 శాతం వాటా ఉండగా... దాన్లో 74 శాతాన్ని తనఖా పెట్టినట్లు ప్రైమ్ డేటాబేస్ వెల్లడించింది. -
రీడ్ అండ్ టేలర్ కేసులో మరో మలుపు
ముంబయి: రీడ్ అండ్ టేలర్ కంపెనీ దివాలా ప్రక్రియ మరో మలుపు తిరిగింది. ప్రమోటర్ నితిన్ కస్లివాల్ రూ.3,524 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డాడని, ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) వెంకటేశన్ శంకర్ నారాయణన్ పేర్కొన్నారు. మరోవైపు రీడ్ అండ్ టేలర్‌ను గట్టెక్కించడానికి కాకుండా లిక్విడేషన్ కోసమే రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) ప్రయత్నాలు చేస్తున్నారని రీడ్ అండ్ టేలర్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ ఆసోసియేషన్ వ్యాఖ్యానించింది. వివరాలివీ.. రూ.3,524 కోట్ల మేర మోసాలు... రీడ్ అండ్ టేలర్ కంపెనీ రూ.4,100 కోట్ల బకాయిలు చెల్లించడంలో విఫలం కావడంతో ఆ కంపెనీపై దివాలాప్రక్రియ కొనసాగుతోంది. ఈ కంపెనీ ప్రమోటర్ నితిన్ కస్లివాల్ రూ.3,524 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డాడని రిసొల్యూషన్ ప్రొఫెషనల్ వెంకటేశన్ శంకర్ నారాయణన్ వెల్లడించారు. అందుకని ఆయనపై క్రిమినల్ కేసు పెట్టడానికి అనుమతివ్వాలని ఎన్సీఎల్టీ ముంబై ధర్మాసనాన్ని ఆయన కోరారు. కేపీఎమ్‌జీ నిర్వహించిన ప్రత్యేక ఆడిట్లో నితిన్ కస్లివాల్ రూ.3,524 కోట్ల మేర అవకతవకలకు పాల్పడ్డాడని తేలిందని ఆర్పీ, వెంకటేశన్ నారాయణన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎన్సీఎల్టీకి ఈ నెల 1న ఒక లేఖ రాశారు. నేడు విచారణ : కంపెనీని టేకోవర్ చేయడానికి తమకు అవకాశమివ్వాలన్న ఉద్యోగుల సంఘం అభ్యర్థనపై నేడు (మంగళవారం) విచారణ జరగనున్నది. కస్లీవాల్ రూ.3,524 కోట్ల అవకతవకల అంశంపై కూడా విచారణ జరగవచ్చు. -
‘టోటెం’ ప్రమోటర్ల అరెస్టు
న్యూఢిల్లీ/చెన్నై: రూ. 1,394 కోట్ల మేర ఎనిమిది బ్యాంకుల కన్సార్టియంను మోసగించిన కేసులో టోటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు తొట్టెంపూడి సలలిత్, తొట్టెంపూడి కవితలను సీబీఐ శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు. టోటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇచ్చిన రూ. 313.84 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టారని, 2012లో ఆ రుణం నిరర్ధక ఆస్తుల జాబితాలో చేరిందని ఫిర్యాదులో యూబీఐ పేర్కొం ది. ఆ కంపెనీ మొత్తం రూ. 1394.84 కోట్ల మేర బ్యాంకుల కన్సార్టియంకు బకాయి పడిందని, వివిధ ప్రాజెక్టుల కోసం బ్యాంకుల నుం చి రుణాలు తీసుకుని సొంత పనులకు నిధుల్ని దారి మళ్లించిందని సీబీఐ ఆరోపించింది. నిధుల్లో కొంతమేర ప్రమోటర్ల వ్యక్తిగత ఖాతా ల్లోకి చేరాయని తెలిపింది. కాగా 2015లో ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసిన అతిపెద్ద పన్ను ఎగవేతదారుల జాబితాలో రూ. 400 కోట్ల ఎగవేతతో ఈ కంపెనీ కూడా ఉంది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌పై సీబీఐ కేసు యునైటెడ్ ఇండియా ఇన్సూ్యరెన్స్ కంపెనీ లిమిటెడ్(యూఐఐసీ)కి రూ. 30.54 కోట్ల మేర నష్టం కలిగించారన్న ఆరోపణలపై డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్(డీసీహెచ్ఎల్), దాని చైర్మన్ టి.వెంకటరామ్రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ముంబైకి చెందిన కేర్ రేటింగ్ లిమిటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కో లిమిటెడ్, ఇద్దరు యూఐఐసీ మాజీ ఉద్యోగులు ఏ.బాల సుబ్రమణియన్, కె.ఎల్ కుంజిల్వర్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది. కంపెనీకి చెందిన ప్రీమియం డబ్బుల్ని ఆ ఇద్దరు ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా డీసీహెచ్ఎల్లో డిబెంచర్ల రూపంలో పెట్టబడి పెట్టారని, ఆ సమయంలో కేర్ రేటింగ్ లిమిటెడ్ సాయంతో రుణ అర్హత సామర్థ్యాన్ని డీసీహెచ్ఎల్ ఎక్కువ చేసి చూపించిందని ఫిర్యాదులో యూఐఐసీ పేర్కొంది. -
ఇన్ఫీ బైబ్యాక్‌పై ప్రమోటర్లు ఆసక్తి
సాక్షి, బెంగళూరు : దేశంలో రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మొట్టమొదటిసారి ప్రకటించిన బైబ్యాక్‌లో ప్రమోటర్లు పాల్గొననున్నట్టు తెలిసింది. ఆగస్టు 19న ఇన్ఫీ ప్రకటించిన రూ.13వేల కోట్ల షేరు బైబ్యాక్‌లో పాల్గొనడానికి కొంతమంది ప్రమోటర్లు ఆసక్తి చూపుతున్నట్టు కంపెనీ తెలిపింది. సీఈవోగా విశాల్ సిక్కా రాజీనామా అనంతరం ఒక్కరోజులోనే ఇన్ఫోసిస్ ఈ బైబ్యాక్ ప్రకటన చేసింది. ఒక్కో షేరును రూ.1,150తో బైబ్యాక్ చేపట్టనున్నట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. మొత్తం 11,30,43,478 కోట్ల షేర్లను ఇన్ఫీ తిరిగి కొనుగోలు చేస్తోంది. బైబ్యాక్ ప్రకటన చేసిన రోజు షేరు విలువకు 25 శాతం ప్రీమియంతో ఇన్ఫీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తోంది. దీంతో కంపెనీ వద్దనున్న మిగులు నిధులను తమ వాటాదారులకు అందించనుంది. '' బైబ్యాక్ నిబంధనల ప్రకారం, టెండర్ ఆఫర్ మార్గం ద్వారా ప్రమోటర్లు ఈ బైబ్యాక్‌లో పాల్గొనే అవకాశం ఉంది. మేము ఈ విషయాన్ని ప్రమోటర్ సభ్యులకు తెలియజేశాం. కంపెనీ ప్రమోటర్ల గ్రూప్ కూడా ఈ బైబ్యాక్ ప్రతిపాదనలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతుంది'' అని ఇన్ఫోసిస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే ఏ ప్రమోటర్లు దీనిలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారో వారి వివరాలను మాత్రం కంపెనీ అందించలేదు. ఇన్ఫీ ప్రమోటర్లందరికీ కలిపి 12.74శాతం వాటా ఉంది. ప్రత్యేక రిజల్యూషన్ ద్వారా కంపెనీ షేర్‌హోల్డర్స్ ఈ బైబ్యాక్ ప్రతిపాదనను ఆమోదించారు. వ్యవస్థాపకులకు, బోర్డుకు గత కొంత కాలంగా సాగుతున్న వివాదం నేపథ్యంలో ఇన్ఫీ ఈ బైబ్యాక్ చేపడుతోంది. బైబ్యాక్ ప్రకటించడానికి ఒక్కరోజు ముందే సిక్కా రాజీనామా చేశారు. సిక్కా రాజీనామా అనంతరం తలెత్తిన పరిస్థితులను చక్కబెట్టడానికి నందన్ నిలేకని కంపెనీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఇన్ఫీలోకి రీఎంట్రీ ఇచ్చారు. -
అభిజీత్ గ్రూప్ ప్రమోటర్ల అరెస్ట్
న్యూఢిల్లీ: భారీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిజీత్ గ్రూప్ ప్రమోటర్లను సీబీఐ షాక్ ఇచ్చింది. ప్రధాన మైనింగ్ కంపెనీ నాగపూర్ కి చెందిన అభిజిత్ గ్రూపు ప్రమోటర్లు మనోజ్ జైస్వాల్, అభిషేక్ జైస్వాల్ సీబీ ఐ అరెస్ట్ చేసింది. దాదాపు రూ. 11 వేల కోట్ల భారీ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ మంగళవారం అరెస్టులు చేపట్టింది. రూ. 290కోట్ల నష్టానికి పాల్పడిందనే అభియోగాలతో కెనరా బ్యాంక్ మాజీ డిజిపిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. అభిజిత్ గ్రూప్ కుచెంఇన 13 కంపెనీలు 20 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయని దర్యాప్తులో వెల్లడైంది. తద్వారా 2014 నుంచి రూ.11,000 కోట్ల ఆస్తులు ఎన్పీఏలుగా మారడంతో సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. బ్యాంకుల్లో రుణాల ద్వారా అభిజిత్ గ్రూపు మనోజ్ జైస్వాల్, కెనరా బ్యాంకు మాజీ డిజిఎమ్ టి.బి.పాయ్లు కెనరా, విజయ బ్యాంకులకు రూ. 290 కోట్ల మేర నష్టం చేశారని సిబిఐ ప్రతినిధి ఆర్ కె గౌర్ చెప్పారు. కాగా నేరపూరిత కుట్ర మరియు మోసం ఆరోపణలపై వీరిపై సీబీఐ 2015 లో కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంకుకు రూ .18.85 కోట్లు, విజయా బ్యాంక్‌కు రూ .71.92 కోట్లు చెల్లించిందని సిబిఐ పేర్కొంది. 2011-13 సంవత్సరానికి క్రెడిట్ సదుపాయాల ద్వారా రూ.. 290.77(దాదాపు) కోట్లు అక్రమాలకు పాల్పడినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఫిర్యాదుపై సీబీఐ ఈచర్యలు తీసుకుంది. -
ఇండస్ట్రీలో అలజడి: అమ్మకానికి ఆ టెక్ దిగ్గజం?