న్యూఢిల్లీ: కీలక వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ హోల్డింగ్స్‌ను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జరిమానా, వడ్డీ, రికవరీ వ్యయాలతో కలిపి మొత్తం రూ. 22 లక్షలు రాబట్టేందుకు ఈ మేరకు ఆదేశాలిచి్చంది.
వివరాల్లోకి వెడితే..డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కి గల వాటాలను అనుబంధ సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి గతంలో బదలాయించారు. అప్పట్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కి (ప్రస్తుతం పిరమల్ ఫైనాన్స్) సీఎండీగా కపిల్ వాధ్వాన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ ఉన్నారు. షేర్ల బదలాయింపునకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ నోటీసులో పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి వారిద్దరూ బాధ్యులని సెబీ తన విచారణలో తేలి్చంది.
2023 జూలైలో చెరి రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు ఇచ్చింది. కానీ దాన్ని చెల్లించడంలో వారు విఫలం కావడంతో తాజాగా రెండు వేర్వేరు అటాచ్‌మెంట్ నోటీసులు ఇచి్చంది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలకు అనుమతించరాదని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యుచువల్ ఫండ్స్‌కి సూచించింది. వాధ్వాన్‌లు తమ బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల్లోని నిదులను మళ్లించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నామని, అలా జరిగితే జరిమానాను రాబట్టడం కుదరదనే ఉద్దేశంతో ఈ నోటీసులు ఇస్తున్నట్లు సెబీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment