attached
-
డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాల జప్తు
న్యూఢిల్లీ: కీలక వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘనకు గాను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ ప్రమోటర్ల బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ హోల్డింగ్స్‌ను అటాచ్ చేయాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో విధించిన జరిమానా, వడ్డీ, రికవరీ వ్యయాలతో కలిపి మొత్తం రూ. 22 లక్షలు రాబట్టేందుకు ఈ మేరకు ఆదేశాలిచి్చంది. వివరాల్లోకి వెడితే..డీహెచ్ఎఫ్ఎల్ ప్రామెరికా లైఫ్ ఇన్సూరెన్స్‌లో డీహెచ్ఎఫ్ఎల్కి గల వాటాలను అనుబంధ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ ఇన్వెస్ట్మెంట్స్కి గతంలో బదలాయించారు. అప్పట్లో డీహెచ్ఎఫ్ఎల్కి (ప్రస్తుతం పిరమల్ ఫైనాన్స్) సీఎండీగా కపిల్ వాధ్వాన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ ఉన్నారు. షేర్ల బదలాయింపునకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ నోటీసులో పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి వారిద్దరూ బాధ్యులని సెబీ తన విచారణలో తేలి్చంది. 2023 జూలైలో చెరి రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు ఇచ్చింది. కానీ దాన్ని చెల్లించడంలో వారు విఫలం కావడంతో తాజాగా రెండు వేర్వేరు అటాచ్మెంట్ నోటీసులు ఇచి్చంది. ఆయా ఖాతాల నుంచి డెబిట్ లావాదేవీలకు అనుమతించరాదని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యుచువల్ ఫండ్స్‌కి సూచించింది. వాధ్వాన్లు తమ బ్యాంకు, డీమ్యాట్ ఖాతాల్లోని నిదులను మళ్లించే అవకాశం ఉందని విశ్వసిస్తున్నామని, అలా జరిగితే జరిమానాను రాబట్టడం కుదరదనే ఉద్దేశంతో ఈ నోటీసులు ఇస్తున్నట్లు సెబీ తెలిపింది. -
వార్నింగ్‌తోనే సరి!
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 28 మంది పోలీస్ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులు ఓ జాబితా విడుదల చేసిన నేపథ్యంలో పోలీసుశాఖలో తీవ్ర దుమారం చెలరేగింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడంతో చర్యలు తీ సుకునేందుకు ఉన్నతాధికారులు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేవలం వీఆర్‌కు అటాచ్ చేసి ఆ తర్వాత హెచ్చరికలతో సరిపెట్టనున్నట్లు సమాచారం. వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో నిఘా వర్గాలు నివేదికను హైదరాబాద్‌కు పంపించాయి. ఒకవేళ వీరిపై చర్యలు తీసుకుంటే తాము చేసే వసూళ్లలో వాటా తీసుకునే ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీల పేర్లు బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కచ్చితంగా తెరపైకి వస్తాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. పోలీసు సంక్షేమ సంఘం కూడా ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసే ఆస్కారం ఉందని ప్రస్తావించినట్లు సమాచారం. చివరకు ఈ వివాదం రచ్చకెక్కి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ప్రతికూల ప్రభావం ఎన్నికల సీజన్ కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంటే వీరంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉండడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని సూచించినట్లు తెలుస్తోంది. వీటన్నంటికంటే ముఖ్యంగా తమతో వసూళ్లు చేయించిన వారిపై చర్యలు తీసుకోకుం డా ఎందుకు వదిలేస్తారని సిబ్బంది రోడ్డెక్కే ప రిస్థితి వస్తే ఇది ధిక్కారస్వరంగా మారి పోలీస్ శా ఖ పరువుపోతుంది. ఇప్పటి వరకు పోలీసు సి బ్బంది నిరసన గళం విప్పి రోడ్లపైకి వచ్చిన దా ఖాలాలు లేవని, ఇదే జరిగితే ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చి ఇరకాటంలో పడాల్సి వస్తుందని కొంత వరకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ‘ఆర్డర్లీ’పై ఆరా ఆర్డర్లీ వ్యవస్థ కింద ఏయే అధికారుల ఇళ్లల్లో ఎంతమంది సిబ్బంది ఏయే పనులు చేస్తున్నారు? ఇలా సొంత పనులకు కానిస్టేబుళ్లు, హోంగార్డులను వినియోగించుకోవడం కూడా తప్పేకదా? అనే భావన క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందిలో వచ్చింది. పనులు చేయించుకునే పోలీసు అధికారుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉంటుందని, వీరిలో అసంతృప్తి చెలరేగితే సమస్య పక్కదారిపట్టి అకాశం ఉందని నిఘావర్గాలు సూచించినట్లు సమాచారం. హెచ్చరించి వదిలేస్తారా? చర్యలు తీసుకునే అంశం తేనే తుట్టెను కదిపినట్టేనని స్పష్టం కావడంతో పోలీస్ బాసులు పునరాలోచనలో పడ్డారు. ఇంత జరిగిన తర్వాత ఏమీ చే యకుండా వదిలేయడం మంచిది కాదని భావిస్తున్నట్లు తెలిసింది. సస్పెన్షన్లు, బదిలీ వేటు కాకుండా మెమోలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మెమోలు ఇచ్చినా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిసి కూడా విరమించుకోనున్నట్లు సమాచారం. చివరకు వీరిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంకోసారి ఆరోపణలకు తావులేకుండా చూసుకోవాలని హెచ్చరించి పంపించే అవకాశాలు ఉన్నట్లు పోలీస్‌శాఖలో చర్చ సాగుతోంది. -
పీఎన్బీ స్కాం: ఖరీదైన ఫాం హౌస్ పాయే
సాక్షి, ముంబై: పీఎన్బీ మెగాస్కాంలో ఈడీ దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు నీరవ్‌మోదీకి చెందిన విలువైన పలు స్థిర ఆస్తులను శనివారం ఈడీ అధికారులు సీజ్ చేశారు. ముఖ్యంగా ఈ స్కాం వెలుగులోవచ్చిన తరువాత వార్తల్లో నిలిచిన మోదీ విలాసవంతమైన ఫాం హౌస్‌ను ఈడీ స్వాధీనం చేసుకుంది. వీటితోపాటు ముంబయిలో ఆరు నివాస, పది కార్యాలయాలు, పూణెలో రెండు ఫ్లాట్లను కూడా ఎటాచ్ చేసింది. మనీ లాండరింగ్ చట్టంకింద మోదీ, ఆయన కంపెనీ నియంత్రణలో ఉన్న 21 స్థిరాస్తులను ఈడీ అధికారులు ఎటాచ్ చేశారు. అలీబాగ్‌లో ఫాం హౌస్, సోలార్ పవర్ ప్లాంట్, అహ్మద్ నగర్‌లోని 135 ఎకరాల భూమి, ముంబై, పూణేలోని నివాస, కార్యాలయాల ఆస్తులు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ. 523.72 కోట్లుగా ఈడీ తేల్చింది. కాగా అలీబాగ్‌లోని ఫాంహౌస్‌ను సీబీఐ ఇప్పటికే సీల్ చేయగా, తాజాగా దీన్ని ఈడీ ఎటాచ్ చేసింది. అలాగే మోదీకి చెందిన విలువైన తొమ్మిదికార్లను, దాదాపు 10వేల ఖరీదైన విదేశీ వాచ్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. -
షారూక్ ఖాన్ ఫాంహౌస్ అటాచ్
ముంబై: మహారాష్ట్ర అలీబాగ్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ పేరిట ఉన్న ఫాంహౌస్‌ను ఆదాయ పన్ను శాఖ తాత్కాలికంగా అటాచ్చేసింది. వ్యవసాయం కోసం అనుమతి తీసుకున్న భూమిలో నిబంధనలు ఉల్లంఘించి విలాసవంతమైన ఫాంహౌస్‌ను నిర్మించారని ఆరోపించింది. షారూక్ ఐటీ శాఖకు 90 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే వ్యవహారంలో రాయ్‌గడ్ జిల్లా కలెక్టర్ కూడా షారూక్‌కు నోటీసులు పంపారు. షారూక్ బంధువులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీ దెజావు ఫార్మ్స్ వ్యవసాయ కార్యకలాపాలకు 19,960 చ.మీ. భూమిని కొనుగోలు చేసింది. కానీ ఆ స్థలంలో పెద్ద భవంతి, ఈత కొలను, హెలిప్యాడ్లను నిర్మించారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని, అందుకే షారూక్‌కు నోటీసులు పంపామని ఓ అధికారి తెలిపారు. -
87 నోటీసులు, రూ.42 కోట్లు అటాచ్
న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా 2016 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన బినామీ లావాదేవిల చట్టం కింద దేశవ్యాప్తంగా 87 నోటీసులు పంపామని, రూ.42 కోట్ల డిపాజిట్లను స్వాధీనం చేసుకున్నామని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. నోట్ల రద్దు తర్వాత పెద్ద మొత్తంలో సొమ్ము బినామీ అకౌంట్లు, జన్ ధన్ ఖాతాల్లో జమయ్యాయని.. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసిన అకౌంట్లను జల్లెడ పట్టేందుకు ఐటీ అధికారులు చర్యలు మొదలుపెట్టారంది. -
మాఫీమంటలు
కొవ్వూరు రూరల్ : డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడి హామీ పేద కుటుంబాలను నిలువునా దహించివేస్తోంది. మాట తప్పిన సర్కారు వివిధ రూపాల్లో మహిళల ఉసురు పోసుకుంటోంది. ఓ వైపు కోర్టు సమన్లు, మరోవైపు నడ్డివిరిచే వడ్డీలతో బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులతో డ్వాక్రా మహిళలు తల్లడిల్లిపోతుండగా.. తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఉపాధి హామీ పథకం పనులు చేసుకుంటున్న మహిళా కూలీలకు చెల్లించే కూలి డబ్బులను బ్యాంకులు డ్వాక్రా రుణాలకు జమ చేసుకుంటున్నాయి. దీంతో డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళా కూలీల కుటుంబాలు పట్టెడన్నం తినే అవకాశం లేక ఆకలితో అలమటిస్తున్నాయి. కడుపు కాల్చడమూ ప్రయోగాత్మకమే కొవ్వూరు మండలంలో ఈ విధానం ప్రయోగాత్మకంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకూ ఉపాధి హామీ పనులు చేసుకునే కూలీలకు ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా కూలి సొమ్ము చెల్లించేది. త్వరలో ఈ విధానాన్ని మార్చి రాష్ట్రవ్యాప్తంగా జాతీయ బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేయాలని నిర్ణయిం చారు. తొలి విడతగా కొవ్వూరు మండలంలోని ధర్మవరం, దొమ్మేరు గ్రామాలతోపాటు నియోజకవర్గంలోని 9 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వచ్చేనెల నుంచి అన్ని గ్రామాల్లోని ఉపాధి కూలీలకు బ్యాంకుల ద్వారానే కూలి డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో సుమారు 20 మంది ఉపాధి కూలీల సొమ్ము రూ.50 వేల వరకు బ్యాంకులు డ్వాక్రా రుణాల ఖాతాల్లో జమ చేసుకున్నాయి. పైగా ఈ మొత్తాలను ఆయా మహిళల వ్యక్తిగత ఖాతాల్లో కాకుండా గ్రూప్ ఖాతాల్లో జమ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాటలు నమ్మి ఆయనకు ఓటేస్తే.. రెక్కలు ముక్కలు చేసుకునే తమ నోటిదగ్గర కూడు లాగేసుకుంటున్నారని బాధిత మహిళలు వాపోతున్నారు. ఇదేం దారుణమయ్యా నాలుగు వారాలు కష్టపడితే రూ.4 వేలు కూలి డబ్బులు వచ్చాయి. ఆ సొమ్మును బ్యాంకు ఖాతాలో వేశామని అధికారులు చెప్పారు. తీసుకోవడానికి వెళితే డ్వాక్రా రుణానికి జమ చేసుకుంటున్నామని బ్యాంకోళ్లు చెప్పారు. మా తండ్రి దినకర్మలు ఉన్నాయని చెప్పి బతిమాలడంతో రూ.2 వేలు అప్పుకు జమ చేసుకుని రూ.2 వేలు ఇచ్చారు. మా గ్రూపు సభ్యులంతా కలిసి తీసుకున్న అప్పుకు ఆ సొమ్ము జమ చేశామంటున్నారు. నేను తీసుకున్న వ్యక్తిగత బాకీలో రాసుకోమంటే కుదరదంటున్నారు. నమ్మి ఓటేస్తే మా కడుపులు కాలుస్తారా. ఇదేం దారుణమయ్యా. – వానపల్లి దుర్గ, ఉపాధి కూలీ, ధర్మవరం ఎలా బతకాలి ఏ పనులూ దొరక్కపోవడంతో ఉపాధి పనులకు వెళుతున్నాం. చేతిదాకా వచ్చిన కూడు నోటిదాకా రావడం లేదు. కూలి డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో వేశారు. బ్యాంకుకెళితే డ్వాక్రా రుణానికి జమ చేసుకున్నామని చెప్పారు. కూలి డబ్బులు లేకపోతే మాలాంటోళ్లు ఎలా బతికేది. ఊరి పెద్దల సాయంతో వెళ్లి బ్యాంకోళ్లను బతిమాలుకుంటే రూ.2 వేలు కట్ చేసుకుని మిగిలిన సొమ్ము ఇచ్చారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు డ్వాక్రా రుణాలు చెల్లించవద్దంటే మానేశాం. ఇప్పుడు కూలి డబ్బులు కూడా మాకు దక్కనివ్వటం లేదయ్యా. ఇలాగైతే మేమెలా బతకాలి. – పొలుమాటి వెంకాయమ్మ, ఉపాధి కూలి, ధర్మవరం కూలీలకు ఇబ్బందే కూలీలకు ఉపాధి కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ పనులు చేసిన కూలీలకు బ్యాంకుల ద్వారా కూలి డబ్బు చెల్లిస్తున్నాం. డ్వాక్రా రుణాలు బకాయి ఉన్నారన్న కారణంగా మహిళా కూలీల వేతనాలను బ్యాంకర్లు ఆ ఖాతాలకు జమ చేసుకుంటున్నారని తెలిసింది. ప్రభుత్వం కూలీలకు జీవనోపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తోంది. వారి కూలి డబ్బుల్ని బకాయిలకు జమ చేసుకోవడం వల్ల ఆయా కుటుంబాలు ఇబ్బందిపడతాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం – ఎ.రాము, ఎంపీడీవో, కొవ్వూరు -
రూ.1000 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసిన ఈడీ
అహ్మదాబాద్: వేల కోట్ల అప్పుకు ఎగనామం పెట్టి విదేశాల్లో దాక్కున్న జూమ్ డెవలపర్స్ ప్రమోటర్ విజయ్ చౌదరికి ఈడీ చెక్ పెట్టింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మొట్టమొదటిసారి అమెరికాలో చర్యలకు పూనుకుంది. కాలిఫోర్నియాలోని 1000కోట్ల రూపాయల విలువైన 1,280 ఎకరాల భూమిని ఈడీ అటాచ్ చేసింది. దీనికి సంబంధించి స్థానిక కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. దీంతోపాటు ఈ భూమిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరపడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ మోసమని ఈడీ పేర్కొంది. విదేశాల్లోని ఆస్తులను ఈడీ ఎటాచ్ చేయడం ఇదే మొదటిసారి. ఈ కేసులో దేశంలోని బ్యాంకుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నామని ఈడి వెల్లడించింది. చౌదరి పేరిట అమెరికాలోని కాలిఫోర్నియాలోని కోట్ల విలువైన ఆస్తులను ప్రివెన్షన్ ఆప్ మనీ లాండరింగ్ చట్టం కింద ఎటాచ్ చేసినట్టు తెలిపింది. ఇండోర్, ముంబై కేంద్రంగా వ్యాపారం చేస్తున్న జూమ్ డెవలపర్స్ ప్రమోటర్ విజయ్ చౌదరి యూరప్‌లో రియల్ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పేరిట దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి రూ.2200కోట్లు రుణాలు తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఎలాంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టకుండా నిధులను మళ్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత నెలలో కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన శారద కబ్రాను అరెస్టె చేసిన ఇండోర్ ఈడీ శాఖ చౌదరిపై కూడా అరెస్టు వారంట్ జారీ చేసింది.