రూ.1000 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసిన ఈడీ | For The First Time, Enforcement Directorate Attaches Land in US in Loan Fraud Case | Sakshi
Sakshi News home page

రూ.1000 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసిన ఈడీ

Published Fri, Jul 3 2015 12:36 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

రూ.1000 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసిన ఈడీ - Sakshi

రూ.1000 కోట్ల ఆస్తులను ఎటాచ్ చేసిన ఈడీ

అహ్మదాబాద్:  వేల కోట్ల అప్పుకు ఎగనామం పెట్టి  విదేశాల్లో దాక్కున్న  జూమ్ డెవలపర్స్  ప్రమోటర్ విజయ్ చౌదరికి  ఈడీ చెక్ పెట్టింది.  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మొట్టమొదటిసారి అమెరికాలో  చర్యలకు పూనుకుంది. కాలిఫోర్నియాలోని 1000కోట్ల  రూపాయల విలువైన  1,280 ఎకరాల భూమిని ఈడీ అటాచ్ చేసింది.  దీనికి సంబంధించి స్థానిక కోర్టు నుంచి  అనుమతి తీసుకుంది. దీంతోపాటు ఈ భూమిలో ఎలాంటి క్రయవిక్రయాలు జరపడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  ఈడీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇది దేశంలోనే అతి పెద్ద బ్యాంక్  మోసమని ఈడీ  పేర్కొంది.  విదేశాల్లోని ఆస్తులను ఈడీ ఎటాచ్ చేయడం ఇదే మొదటిసారి. ఈ కేసులో  దేశంలోని  బ్యాంకుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నామని ఈడి వెల్లడించింది. చౌదరి పేరిట అమెరికాలోని కాలిఫోర్నియాలోని కోట్ల విలువైన ఆస్తులను ప్రివెన్షన్ ఆప్ మనీ లాండరింగ్ చట్టం కింద ఎటాచ్ చేసినట్టు తెలిపింది.  


ఇండోర్, ముంబై కేంద్రంగా వ్యాపారం చేస్తున్న జూమ్ డెవలపర్స్ ప్రమోటర్ విజయ్ చౌదరి యూరప్‌లో రియల్‌ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పేరిట దేశంలోని వివిధ బ్యాంకుల నుంచి రూ.2200కోట్లు రుణాలు తీసుకున్నారు.  వాటిని తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఎలాంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టకుండా  నిధులను మళ్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  గత నెలలో కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన శారద కబ్రాను అరెస్టె చేసిన ఇండోర్ ఈడీ శాఖ చౌదరిపై కూడా అరెస్టు వారంట్ జారీ చేసింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement