హైదరాబాద్: చక్కిలం ట్రేడ్ హౌస్ లిమిటెడ్ కేసులో నిందితులకు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. పదేళ్ల క్రితం నాటి కేసులో నిందితులకు తాజాగా ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది.
ఎస్బీఐలో రెండు కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకుని దారి మళ్లించిన కేసులో ఎట్టకేలకు నిందితులకకు జైలు శిక్ష పడినట్లు ఈడీ తెలిపింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులకు శిక్ష ఖరారు చేసింది నాంపల్లి కోర్టు. అప్పట్లో కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లతో పాటు బ్యాంకుకు చెందిన ముగ్గురిపై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment