సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 28 మంది పోలీస్ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులు ఓ జాబితా విడుదల చేసిన నేపథ్యంలో పోలీసుశాఖలో తీవ్ర దుమారం చెలరేగింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడంతో చర్యలు తీ సుకునేందుకు ఉన్నతాధికారులు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేవలం వీఆర్‌కు అటాచ్ చేసి ఆ తర్వాత హెచ్చరికలతో సరిపెట్టనున్నట్లు సమాచారం. వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో నిఘా వర్గాలు నివేదికను హైదరాబాద్‌కు పంపించాయి. ఒకవేళ వీరిపై చర్యలు తీసుకుంటే తాము చేసే వసూళ్లలో వాటా తీసుకునే ఎస్‌ఐలు, సీఐలు, డీఎస్పీల పేర్లు బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కచ్చితంగా తెరపైకి వస్తాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. పోలీసు సంక్షేమ సంఘం కూడా ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసే ఆస్కారం ఉందని ప్రస్తావించినట్లు సమాచారం. చివరకు ఈ వివాదం రచ్చకెక్కి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే ఆస్కారం ఉందని తెలుస్తోంది.
ప్రతికూల ప్రభావం
ఎన్నికల సీజన్ కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంటే వీరంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉండడంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని సూచించినట్లు తెలుస్తోంది. వీటన్నంటికంటే ముఖ్యంగా తమతో వసూళ్లు చేయించిన వారిపై చర్యలు తీసుకోకుం డా ఎందుకు వదిలేస్తారని సిబ్బంది రోడ్డెక్కే ప రిస్థితి వస్తే ఇది ధిక్కారస్వరంగా మారి పోలీస్ శా ఖ పరువుపోతుంది. ఇప్పటి వరకు పోలీసు సి బ్బంది నిరసన గళం విప్పి రోడ్లపైకి వచ్చిన దా ఖాలాలు లేవని, ఇదే జరిగితే ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చి ఇరకాటంలో పడాల్సి వస్తుందని కొంత వరకు వెనక్కి తగ్గినట్లు సమాచారం.
‘ఆర్డర్లీ’పై ఆరా
ఆర్డర్లీ వ్యవస్థ కింద ఏయే అధికారుల ఇళ్లల్లో ఎంతమంది సిబ్బంది ఏయే పనులు చేస్తున్నారు? ఇలా సొంత పనులకు కానిస్టేబుళ్లు, హోంగార్డులను వినియోగించుకోవడం కూడా తప్పేకదా? అనే భావన క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందిలో వచ్చింది. పనులు చేయించుకునే పోలీసు అధికారుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉంటుందని, వీరిలో అసంతృప్తి చెలరేగితే సమస్య పక్కదారిపట్టి అకాశం ఉందని నిఘావర్గాలు సూచించినట్లు సమాచారం.
హెచ్చరించి వదిలేస్తారా?
చర్యలు తీసుకునే అంశం తేనే తుట్టెను కదిపినట్టేనని స్పష్టం కావడంతో పోలీస్ బాసులు పునరాలోచనలో పడ్డారు. ఇంత జరిగిన తర్వాత ఏమీ చే యకుండా వదిలేయడం మంచిది కాదని భావిస్తున్నట్లు తెలిసింది. సస్పెన్షన్లు, బదిలీ వేటు కాకుండా మెమోలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మెమోలు ఇచ్చినా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిసి కూడా విరమించుకోనున్నట్లు సమాచారం. చివరకు వీరిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంకోసారి ఆరోపణలకు తావులేకుండా చూసుకోవాలని హెచ్చరించి పంపించే అవకాశాలు ఉన్నట్లు పోలీస్‌శాఖలో చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment