serious warning
-
జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదు
-
సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు.. అనంతపురం మేయర్ సీరియస్ వార్నింగ్
-
గుర్తుపెట్టుకో.. జగన్ ఎవడ్నివదలడు.. వడ్డీతో కలిపి ఇచ్చేస్తాం
-
వైఎస్సార్సీపీపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు.. నారాయణ స్వామి సీరియస్ వార్నింగ్
-
ఇది మంచి పద్ధతి కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి వార్నింగ్
-
టీడీపీ నేతలకు చెప్తున్నా.. అధికారం శాశ్వతం కాదు..
-
టీడీపీ నేతలపై కొట్టు సత్యనారాయణ ఫైర్
-
దీపక్ మిశ్రా పై మోపిదేవి ఫైర్
-
టీడీపీ నేత ప్రవీణ్ కు వాలంటీర్లు స్ట్రాంగ్ వార్నింగ్
-
డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: డీప్ ఫేక్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమైన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. ఈ వివరాలను కేంద్ర సహయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. ‘డీఫ్ ఫేక్’ ఫొటోలు, వీడియోల సృష్టికర్తల ఆగడాలను ఊపేక్షించేదిలేదని, భారీ జరిమానాలను వి«ధిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ సంస్థల సమావేశంలో హెచ్చరించిన విషయం తెల్సిందే. సంబంధిత మార్గదర్శకాలను, త్వరలో తీసుకురాబోయే చట్టాలను, నిబంధనలను రాజ్యసభ దృష్టికి తీసికెళ్లినట్లు మంత్రి పేర్కొన్నారు. సెక్షన్ 66డీ కింద కంప్యూటర్ ఆధారిత సాంకేతికతతో ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ.1 లక్ష జరిమానా విధిస్తామని మంత్రి చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. -
టీడీపీ నేతలకి బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్
-
కార్పొరేటర్లకు మంత్రి ‘కేటీఆర్’ సీరియస్ వార్నింగ్
-
నోరు ముయ్.. నీకు అన్నీ చెప్పాలా: బాబా రాందేవ్
ఛండీగఢ్: యోగా గురు బాబా రామ్‌దేవ్ సహనం కోల్పోయారు. లైవ్‌లోనే ఓ జర్నలిస్టుపై అసహనం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. రామ్‌దేవ్ బుధవారం హర్యానాలోని కర్నాల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, అంతకు ముందు 2014లో బాబా రామ్ దేవ్ ప్రజలు లీటర్‌కు రూ. 40 పెట్రోల్, రూ. 300 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. ఈ సందర్బంగా ఓ మీడియా విలేకరి గతంలో బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నలపై ప్రశ్నించారు. దీంతో బాబా రామ్ దేవ్ సహనం కోల్పోయి లైవ్‌లోనే బెదిరించారు. తాజాగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విలేకరి, రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ‘‘అవును, ఇప్పుడు ఏం చేయమంటారు..? ఇలాంటి ప్రశ్నలు అడగకండి.. నేనేమీ మీ కాంట్రాక్టర్‌ను కాదు.. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు..’’ అన్నారు. ఇంతో సదరు విలేకరి మరోసారి ప్రశ్నించగా.. అతడిపై రామ్ దేవ్ సీరియస్‌గా చూస్తూ..‘‘ నేను, ఆ వ్యాఖ్య చేశాను. అబ్ క్యా కర్ లేగా (నువ్వేం చేస్తావు)? నోరు మూసుకో. మళ్లీ అడగకు.. ఇలా మాట్లాడకు.. మంచిది కాదు.. నువ్వు మీ పేరెంట్స్‌కు మంచి కొడుకుగా ఉండాలి’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం బాబా రామ్ దేవ్ మాట్లాడుతూ.. కష్ట సమయాల్లో మరింత కష్టపడి పనిచేయాలని రామ్‌దేవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘ఇంధన ధరలు తగ్గితే పన్ను రాదని, దేశాన్ని ఎలా నడుపుతారని, జీతాలు చెల్లిస్తారని, రోడ్లు ఎలా వేస్తారని ప్రభుత్వం చెబుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవును, ద్రవ్యోల్బణం తగ్గాలి, అందుకు ఒప్పుకుంటాను.. అయితే ప్రజలు కష్టపడి పనిచేయాలి. తాను కూడా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి రాత్రి 10 గంటల వరకు పని చేస్తాను" అని అన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై మరో 80 పైసలు పెరిగింది. దీంతో గత తొమ్మిది రోజులలో లీటరుకు రూ. 5లకు పైగా పెరిగాయి. Yoga Guru Ramdev was seen on camera losing his cool and threatening a journalist, who asked him about his comments in the past on reducing petrol price. @ndtv pic.twitter.com/kHYUs49umx — Mohammad Ghazali (@ghazalimohammad) March 30, 2022 -
ఫామ్‌హౌజ్‌లో అడుగుపెడితే ఆరు ముక్కలైతవ్: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీని వదిలే ప్రశ్నే లేదని.. వెంటాడుతూనే ఉంటానని కేసీఆర్ నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫామ్‌హౌజ్‌లో అడుగుపెడితే ఆరు ముక్కలైతవ్ అంటూ బండి సంజయ్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. తెలంగాణ ఉద్యమంలో కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. మీ గురువు నేర్పిన సంస్కారం ఇదేనా.. అని హితవు పలికారు. నా ఫామ్ హౌస్ దున్నడానికి బండి సంజయ్ ట్రాక్టర్ డ్రైవరా? అంటూ ఎద్దేవా చేశారు. నాది ఫామ్‌హౌస్ కాదు.. ఫార్మర్ హౌస్. తాను వ్యవసాయ కుటుంబంలో పుట్టానని కేసీఆర్ తెలిపారు. సూట్ కేసులు ఇచ్చేది మీరు.. మేము కాదని కేసీఆర్.. బీజేపీపై రాష్ట్ర అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు. -
వార్నింగ్‌తోనే సరి!
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 28 మంది పోలీస్ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులు ఓ జాబితా విడుదల చేసిన నేపథ్యంలో పోలీసుశాఖలో తీవ్ర దుమారం చెలరేగింది. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడంతో చర్యలు తీ సుకునేందుకు ఉన్నతాధికారులు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేవలం వీఆర్‌కు అటాచ్ చేసి ఆ తర్వాత హెచ్చరికలతో సరిపెట్టనున్నట్లు సమాచారం. వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో నిఘా వర్గాలు నివేదికను హైదరాబాద్‌కు పంపించాయి. ఒకవేళ వీరిపై చర్యలు తీసుకుంటే తాము చేసే వసూళ్లలో వాటా తీసుకునే ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీల పేర్లు బయటపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కచ్చితంగా తెరపైకి వస్తాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. పోలీసు సంక్షేమ సంఘం కూడా ఈ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసే ఆస్కారం ఉందని ప్రస్తావించినట్లు సమాచారం. చివరకు ఈ వివాదం రచ్చకెక్కి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే ఆస్కారం ఉందని తెలుస్తోంది. ప్రతికూల ప్రభావం ఎన్నికల సీజన్ కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకుంటే వీరంతా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉండడంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని సూచించినట్లు తెలుస్తోంది. వీటన్నంటికంటే ముఖ్యంగా తమతో వసూళ్లు చేయించిన వారిపై చర్యలు తీసుకోకుం డా ఎందుకు వదిలేస్తారని సిబ్బంది రోడ్డెక్కే ప రిస్థితి వస్తే ఇది ధిక్కారస్వరంగా మారి పోలీస్ శా ఖ పరువుపోతుంది. ఇప్పటి వరకు పోలీసు సి బ్బంది నిరసన గళం విప్పి రోడ్లపైకి వచ్చిన దా ఖాలాలు లేవని, ఇదే జరిగితే ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చి ఇరకాటంలో పడాల్సి వస్తుందని కొంత వరకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ‘ఆర్డర్లీ’పై ఆరా ఆర్డర్లీ వ్యవస్థ కింద ఏయే అధికారుల ఇళ్లల్లో ఎంతమంది సిబ్బంది ఏయే పనులు చేస్తున్నారు? ఇలా సొంత పనులకు కానిస్టేబుళ్లు, హోంగార్డులను వినియోగించుకోవడం కూడా తప్పేకదా? అనే భావన క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందిలో వచ్చింది. పనులు చేయించుకునే పోలీసు అధికారుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉంటుందని, వీరిలో అసంతృప్తి చెలరేగితే సమస్య పక్కదారిపట్టి అకాశం ఉందని నిఘావర్గాలు సూచించినట్లు సమాచారం. హెచ్చరించి వదిలేస్తారా? చర్యలు తీసుకునే అంశం తేనే తుట్టెను కదిపినట్టేనని స్పష్టం కావడంతో పోలీస్ బాసులు పునరాలోచనలో పడ్డారు. ఇంత జరిగిన తర్వాత ఏమీ చే యకుండా వదిలేయడం మంచిది కాదని భావిస్తున్నట్లు తెలిసింది. సస్పెన్షన్లు, బదిలీ వేటు కాకుండా మెమోలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మెమోలు ఇచ్చినా ఇబ్బందికరంగా ఉంటుందని తెలిసి కూడా విరమించుకోనున్నట్లు సమాచారం. చివరకు వీరిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంకోసారి ఆరోపణలకు తావులేకుండా చూసుకోవాలని హెచ్చరించి పంపించే అవకాశాలు ఉన్నట్లు పోలీస్‌శాఖలో చర్చ సాగుతోంది. -
ట్రంప్‌కు మహిళా లాయర్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌కు అంతర్జాతీయ హక్కుల ప్రముఖ న్యాయవాది అమల్ క్లూనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు కొన్ని నైతిక కట్టుబాట్లు ఉన్నాయని, వాటిని ఆయన గౌరవించాలని లేదంటే హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో అమెరికాయేతరులపట్ల చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను గుర్తు చేసేలా కొన్ని సంఘటనలు అప్పుడే వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రచారం కోసం ఆయన చేసిన వ్యాఖ్యలను ఆచరణలో చూపడానికి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని అన్నారు. అమల్ క్లూనీ హక్కుల న్యాయవాదిగానే కాకుండా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన బాధితులకు కూడా ఆమె అండగా ఉంటారు. అంతేకాదు, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ప్రతినిధిగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా ఆమె స్పందిస్తారు. గత వారం టెక్సాస్ లో జరిగిన మహిళల సదస్సులో ఆమె మాట్లాడుతూ ట్రంప్ కు ఈ హెచ్చరిక చేశారు. ట్రంప్ ప్రచార సమయంలో అమెరికా మొత్తం మత పరీక్షలు వంటివి నిర్వహించాలన్నారని, ఉగ్రవాదులుగా అనుమానం ఉన్న కుటుంబాలను అంతమొందించాలని వ్యాఖ్యానించారని ఇవన్నీ కూడా అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన నేరం కిందకు వస్తుందని క్లూనీ చెప్పారు. ఇప్పటికే ప్రపంచాల్లోని కొన్ని దేశాల్లో అమెరికాలో ఉన్న తమ వాళ్లకు సంబంధించి కొంత ఆందోళన నెలకొందని, దానిని పోగొట్టాల్సిన బాధ్యత ట్రంప్‌కే ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే అమెరికా నుంచి కొన్ని హక్కుల ఉల్లంఘనల ఘటనలకు సంబంధించి తనకు ఫోన్లు వస్తున్నాయని నైతిక నిబంధనలు అమెరికా తప్పకుండా పాటించాలని గుర్తు చేశారు. మతపరమైన విద్వేషాలకు తావివ్వకుండా చూడాలని కోరారు.