సాక్షి, న్యూఢిల్లీ: డీప్ ఫేక్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమైన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. ఈ వివరాలను కేంద్ర సహయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు.
‘డీఫ్ ఫేక్’ ఫొటోలు, వీడియోల సృష్టికర్తల ఆగడాలను ఊపేక్షించేదిలేదని, భారీ జరిమానాలను వి«ధిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ సంస్థల సమావేశంలో హెచ్చరించిన విషయం తెల్సిందే. సంబంధిత మార్గదర్శకాలను, త్వరలో తీసుకురాబోయే చట్టాలను, నిబంధనలను రాజ్యసభ దృష్టికి తీసికెళ్లినట్లు మంత్రి పేర్కొన్నారు. సెక్షన్ 66డీ కింద కంప్యూటర్ ఆధారిత సాంకేతికతతో ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ.1 లక్ష జరిమానా విధిస్తామని మంత్రి చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment