fake video
-
ఫేక్ రీల్ వైరల్ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతోంది. యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ కోసం ప్రాణాలకు తెగించి మరీ, ఫ్యామస్ అయిపోవాలనే తాపత్రయంతో కొంతమంది ప్రాణాలు మీదికి తెచ్చు కుంటోంటే.. మరికొందరు బూటకపు వేషాలు, తప్పుడు వీడియోలతో వెర్రి చేష్టలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. మరోవైపు ఈ వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా… pic.twitter.com/Eia1GCSxyr— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 21, 2024బస్సు కిందకి యువకుడు, పిచ్చి రీల్హైదరాబాద్లోని ఓ రోడ్డుపై ఆర్టీసీ బస్సు కింద ఒక యువకుడు అకస్మాత్తుగా బస్సు కింద పడుకోవడం, బస్సు వెళ్లిపోయాక, ఎలాంటి గాయాలు లేకుండానే, తీరిగ్గా షర్ట్‌కి అంటిన దుమ్ము దులుపుకుంటూ వెళ్లిపోయినట్టుగా చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇది ఎడిటెడ్ వీడియో అని ఇట్టే తెలిసిపోతుందని నెటిజన్లు కమెంట్స్ చేశారు. ఇది ఫేక్ అంటూ తీవ్ర చర్చ సాగింది కూడా. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్‌లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిట్ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను తెలంగాణా ఆర్టీసీ సీరియస్‌గా తీసుకుంటుంది అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. కాగా ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియోలను కానీ, ఇమేజెస్‌ను గానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇది నిజమో, కాదో. ఇట్టే అర్థమవుతుంది. లేదంటే గూగుల్స్ లెన్స్ ద్వారా ఇమేజ్ను ఫ్యాక్ట్ చెక్ చేయవచ్చు. వీడియో అయితే ‘ఇన్విడ్’ అనే టూల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. -
చిత్తూరులో పులి హల్చల్.. అసలు కథ ఇదీ!
ఒక పల్లెటూరులో తండ్రిని ఓ పిల్లవాడు నాన్న పులి వచ్చిందంటూ రెండుసార్లు ఆటపట్టిస్తాడు. పావుగంట అయ్యాక మళ్లీ పులి అంటూ పిల్లవాడు కేకలు వేయడంతో ఎవరు పట్టించుకోరు. తీరా నిజంగానే పులి వచ్చి గొర్రెలను తీసుకెళుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్దాలు ఆడితే పరిహారం తప్పదని.. సరిగ్గా ఇదే విధంగా ప్రస్తుతం జిల్లాలో పలువురు ‘పులి సంచరిస్తోందని’ తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని భయపెడతున్నారు. ఇవన్నీ ఫేక్‌గా అటవీశాఖ అధికారులు గుర్తించి ఆకతాయిలను హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. చిత్తూరు కార్పొరేషన్: అదిగో ఇక్కడ పులి వచ్చింది.. అంటూ వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాలలో కొందరు ఫొటోలు పెడుతున్నారు. దీంతో సంబంధిత ప్రాంత వాసులు భయాందోళనకు లోనవుతున్నారు. దీన్ని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో నిజాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అటువంటిదేమీ లేదని సృష్టత ఇస్తున్నప్పటికీ ఆగడాలు ఆగడం లేదు. గడిచిన 9 నెలల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందరిని భయాందోళనకు గురిచేయాలనే శాడిజం మనస్వత్తంతో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తున్నారని నిపుణులు అంటున్నారు. జిల్లాలో ఇలా.. 👉 చిత్తూరు రూరల్ మండలం బీఎన్‌ఆర్‌పేట సమీపంలో రోడ్డు పనుల వద్ద బెంగాల్ టైగర్ కనిపించిందని వీడియోను వైరల్ చేశారు. తీరా క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలిస్తే అది అస్సాంలో జరిగిన వీడియోగా, సామాజిక మాధ్యమాల నుంచి డౌన్లోడ్ చేసినట్లు అధికారులు తేల్చారు. 👉గుడిపాల మండలం పసుమంద పంచాయతీలో బెంగాల్ టైగర్‌ను చూశామని ఫోటోలు పెట్టారు. దీంతో మండల వాసులు భయాందోళనకు లోనయ్యారు. అక్కడికెళ్లి అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేస్తే ఇక్కడి వీడియో కాదని తేలింది. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్‌లో తీసినట్లుగా గుర్తించారు. 👉గుడిపాలలోని గొల్లమడుగు అటవీ ప్రాంతంలో పులి కూనలను వదిలి వెళ్లిందని వీడియో పెట్టారు. తల్లి కోసం పిల్లలు ఎదురుచూస్తున్నట్లు ఆ వీడియో సారాంశం. డీఎఫ్ఓ చైతన్యకుమార్‌రెడ్డి నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఎఫ్ఆర్వో థామస్ సిబ్బందితో కలిసి కొండలు, గుట్టలను రెండు రోజులు పాటు జల్లెడ పెట్టి కూనలు లేవని నిగ్గుతేల్చారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన సంఘటన వీడియో పెట్టారని అధికారులు తెలుసుకున్నారు. చిత్తూరు ఈస్ట్ రేంజ్లో వైరల్ చేసిన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కారి్మకులు పెట్టినట్లుగా గుర్తించారు. వాటిని స్థానికులు వైరల్ చేసినట్లు తెలుస్తోంది. 👉పాకాల మండలం నేండ్రగుంట వద్ద పులి రోడ్డుపై వచ్చినట్లు ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లు వీడియో పెట్టారు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్ వీడియో అని అధికారులు తేల్చారు. 👉వడమాలపేట మండలం బంగారెడ్డి కండ్రిగ సమీపం ప్రాంతంలో పులి వచ్చిందని వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులు పెట్టడంతో ప్రాంతవాసులు బిత్తరపోయారు. తీరా అధికారులు రంగంలో దిగి విచారించడంతో గత సంవత్సరం నవంబరులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సురేష్ బెంగళూరులో తీసిన ఫోటోగా తేల్చారు. ఇన్‌స్టాలో పెట్టిన వీడియోలో నుంచి తీసిన ఫోటోగా నిర్దారించారు. ఇలాంటి విషయాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా పలువురు వాట్సాప్ స్టేటస్ట్‌లు పెడుతున్నారు. చదువుకున్న వారు సైతం ఇలా చేయడం సరికాదని అధికారులు సూచిస్తున్నారు.చర్యలు తప్పవు ఇప్పటి వరకు అవాస్తవ వీడియోలపై ఆకతాయిలను హెచ్చరించి వదిలేశాం. వీటిని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకపై ఎలాంటి అవాస్తవ వీడియోలు వచ్చినా అటవీచట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. యువత సమాజశ్రేయస్సు కోసం బాటలు వేయాలి. – థామస్, ఎఫ్ఆర్వో, చిత్తూరు ఈస్ట్ -
TS: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఫేక్ వీడియో వైరల్
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ‘ఎక్స్’ఖాతాలో ఓ ఫేక్ వీడియో వైరల్ అయింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచి పోవడంతో కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్‌ఫోన్ వెలుగులో వైద్యసేవలు అందించారని, ఈ క్రమంలో ఓ బాలుడు మృతి చెందాడని, గొప్పులు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పనితీరు దరిద్రంగా ఉందని, గుంపు మేస్త్రీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ వీడియోను పెట్టారు. ఓ తెలుగు చానల్ లోగోతో ఉన్న వీడియో క్లిప్పింగ్‌ను జత చేస్తూ ‘బీఆర్ఎస్ యూఎస్ఏ’ఎక్స్ ఖాతాలో ఇది పోస్ట్ అయింది. దీనిపై సీఎం కార్యాలయం విచారణ చేపట్టగా అంతా ఉత్తదే అని తేలింది. పాత క్లిప్పింగ్‌తో డీప్‌ఫేక్ ద్వారా తప్పుడు వీడియోను సృష్టించారని విచా రణలో వెల్లడైంది. సీఎం పేషీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు చిలకలగూడ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. బీఆర్ఎస్ యూఎస్ఏ ఎక్స్ ఖాతాలో హరీశ్‌రెడ్డి అనే వ్యక్తి ఈ ఫేక్ వీడియోను అప్లోడ్ చేసినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. ఐటీ, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ ఎస్హెచ్ఓ అనుదీప్ తెలిపారు. వైద్యులు, సిబ్బందిపై నిందలు వే యడం తగదని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
గత కొన్ని రోజులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ‘డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో’ కేసులో అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.అరుణ్ రెడ్డిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్' అనే ఎక్స్ (ట్విటర్) అకౌంట్ హ్యాండిల్ చేసేవారు. ఇటీవల విడుదలైన డీప్ ఫేక్ మార్ఫింగ్ వీడియో దేశంలోని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ నిలుస్తుందని కేంద్ర హోం మంత్రి చెప్పినట్లు వినిపిస్తోంది. ఈ వైరల్ వీడియో క్లిప్ ఫేక్ అని బీజేపీ స్పష్టం చేసింది.డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని వివిధ సెక్షన్ల కింద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నలుగురు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సభ్యులకు (శివ కుమార్ అంబాల, అస్మా తస్లీమ్, సతీష్ మన్నె, నవీన్) పోలీసులు గతంలో సమన్లు జారీ చేశారు.అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేసి అరెస్టయిన ఐదుగురు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులకు నాంపల్లి కోర్టు బెయిల్ ఈ రోజు (శుక్రవారం) కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు అరుణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.Delhi Police arrest Arun Reddy, who handles the 'Spirit of Congress' X account, in the Union Home Minister Amit Shah doctored video case: Delhi Police pic.twitter.com/gB5L6Pzcbp— ANI (@ANI) May 3, 2024 -
కాంగ్రెస్ ‘సోషల్’ టీంలో ఐదుగురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగం వీడియో డీప్ ఫేక్ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గురువారం ఉదయమే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీం ఇన్చార్జి సతీశ్‌తోపాటు యాక్టివిస్ట్‌లు నవీన్, తస్లిమా, గీత, వంశీలను అదుపులోకి తీసుకున్నారు. వారిని బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌లో ఉన్న సైబర్ క్రైమ్ ఠాణాకు తరలించారు. సాయంత్రానికి వారి అరెస్టును ప్రకటించారు. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ రావడంతో రోజంతా కాస్త హైడ్రామా నడిచింది.రోజంతా హైడ్రామా.. ఢిల్లీ పోలీసుల నిరీక్షణ..అమిత్ షా ప్రసంగం వీడియో డీప్ ఫేక్ కేసులో ఇవే ఆరోపణలకు సంబంధించి ఢిల్లీలో మరో కేసు నమోదు కావడంతో రాష్ట్రానికి చెందిన ఆ ఐదుగురు నిందితులను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు గురువారం హైదరాబాద్ వచ్చారు. అయితే అప్పటికే సీసీఎస్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో ఢిల్లీ పోలీసులు సైబర్ క్రైం ఠాణా వద్దకు చేరుకున్నారు. కానీ ఠాణా లోపలకు మీడియా సహా ఎవరినీ సైబర్ క్రైం పోలీసులు అనుమతించలేదు.దీంతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంను తాము అరెస్టు చేయకుండా అడ్డుకోవడానికే సైబర్ క్రైం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారని స్పెషల్ సెల్ అధికారులు భావించారు. నిందితులను ప్రశ్నించాక నోటీసులు ఇచ్చి పంపిస్తారనే ఉద్దేశంతో సాయంత్రం వరకు బషీర్‌బాగ్ ప్రాంతంలోనే కాపు కాశారు. అయితే సీసీఎస్ పోలీసులు ఐదుగురి అరెస్టును సాయంత్రం ప్రకటించడంతో స్పెషల్ సెల్ పోలీసులు ఆ ప్రాంతం విడిచి వెళ్లారు. నిందితులకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తే ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై ఢిల్లీ తరలించాలని స్పెషల్ సెల్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.ఇదీ కేసు..గత నెల 25న సిద్దిపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తానని మాట్లాడినట్లు ఓ డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు అన్ని హ్యాండిల్స్ దీన్ని పోస్టు చేయడమో లేదా షేర్ చేయడమో చేశాయి. ఈ వీడియోపై బీజేపీ తెలంగాణ జనరల్ సెక్రటరీ జి.ప్రేమేందర్‌రెడ్డి గత నెల 27న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీని ఆధారంగా అధికారులు ఐపీసీతోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో టీపీసీసీ ‘ఎక్స్’ ఖాతాను నిందితుల జాబితాలో చూపారు. మరోవైపు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా ఈ అంశంపై గత నెల 28న కేసు నమోదు చేశారు. దీని దర్యాప్తులో భాగంగా సీఎం ఎ.రేవంత్‌రెడ్డి సహా పలువురి కి నోటీసులు జారీ చేశారు. ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో కొందరు కాంగ్రెస్ నేతల వ్యక్తిగత సహాయకులు, సోషల్ మీడియా టీం సభ్యులను అరెస్టు చేశారు. ఇందులో భాగంగా టీకాంగ్రెస్ సోషల్ మీడియా సభ్యులను అరెస్టు చేసేందుకు ఓ ప్రత్యేక బృందం గురువారం హైదరాబాద్ వచ్చింది. -
ఫేక్ వీడియోలపై విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫేక్ వీడియోల సర్క్యులేషన్‌పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, విచారణ జరుగుతోందని, నివేదిక అందిన తర్వాత చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు వచ్చిన ఫేక్ వీడియోల ఆరోపణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయి అధికారుల నుంచి నివేదిక కోరామన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13న జరగనున్న ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ఇప్పటికే 47 శాతం పూర్తయిందని, మరో రెండు, మూడు రోజుల్లో వంద శాతం పూర్తి చేస్తామని చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీలు, అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాలని కోరారు. తద్వారా పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు, అనుమానా లకు తావు ఉండదన్నారు.ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు 1950లోక్‌సభ ఎన్నికల విధుల్లో 2.94 లక్షల మంది ఉద్యోగులు, సిబ్బంది పాల్గొననున్నారని వికాస్ రాజ్ వెల్లడించారు. ఏడు లోక్‌సభస్థానాల్లో 3 బ్యాలెట్ యూనిట్లు, 9 స్థానాల్లో 2 బ్యాలెట్ యూని ట్లు వాడాల్సి వస్తుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి అదనపు బ్యాలెట్ యూనిట్లు రప్పిస్తున్నామని వెల్లడించారు. పోలింగ్‌కేంద్రాల వద్ద ఎండ తగలకుండా టెంట్లు..షెడ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎన్నికల ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబరు 1950 ఏర్పాటు చేశామని చెప్పిన ఆయన టోల్ ఫ్రీ నంబరు ద్వారా 1,227 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఆన్లైన్లో వివిధ రకాలుగా 18 వేల ఫిర్యాదులు వచ్చాయని.. అందులో 16 వేలు పరిష్కరించామన్నారు. రాష్ట్రంలో 3,32,32,318 మంది ఓటర్లురాష్ట్ర వ్యాప్తంగా 3,32,32,318 మంది ఓటర్లు ఉన్నారని వికాస్‌రాజ్ తెలిపారు. మొత్తం 35,809 పోలింగ్ స్టేషన్లు ఉండగా, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9,900 ఉన్నట్లు చెప్పారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 3,226 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు.పోలింగ్‌శాతం పెంచాలని..పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని వికాస్‌రాజ్ వెల్లడించారు. 5 వేల పోలింగ్ కేంద్రాల్లో తక్కువ పోలింగ్ శాతం రికార్డు అవుతున్నట్టు గుర్తించామన్నారు. పోలింగ్ సమయంలో సెక్టార్ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని, ఎక్కడైనా పోలింగ్ ప్రక్రియ నిదానంగా జరిగినా, తక్కువ పోలింగ్ నమోదవుతున్నా వెంటనే అలర్ట్ అయి పరిస్థితిని చక్కదిద్దు్దతారన్నారు. 5, 6 తేదీల్లో హోం ఓటింగ్ఇంటి వద్ద పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసేందుకు 23,248 మంది దరఖాస్తులను ఆమోదించినట్టు వికాస్‌రాజ్ వెల్లడించారు. ఇందులో వయోవృద్ధులు 10,362 మంది, దివ్యాంగులు 11,032 మంది, అత్యవసర సర్వీసుల్లో ఉండే ఓటర్లు 1,854 మంది ఉన్నారని వివరించారు. ఈ నెల 5, 6న వీరికి వారి ఇంటి దగ్గరే ఓటేసే సదుపాయం కల్పిస్తామన్నారు. ఇప్పటికి 7,185 కేసులు7185 కేసులు నమోదు చేసినట్టు వికాస్‌రాజ్ తెలిపారు. ఆబ్కారీ శాఖ 6560 కేసులు, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ కింద 287 కేసులు, ఐపీసీ కేసులు 309, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద 21 కేసులు నమోదైనట్లు వివరించారు. రూ. 81 కోట్లు నగదు, రూ.46 కోట్లు విలువైన లిక్కర్, రూ. 26 కోట్లు విలువైన డ్రగ్స్, రూ.27 కోట్లు విలువ చేస్తే ఇతర వస్తువులు కలిపి మొత్తం రూ.212 కోట్ల విలువైన నగదు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. -
సత్యానికి సవాల్!
కంటికి కనిపిస్తున్నదంతా నిజమేనా? ఏది సత్యం? ఏదసత్యం? వేసవి తాపానికి తోడు సార్వత్రిక ఎన్నికల ప్రచారపు వేడి ఎక్కువై, నేతలు పరస్పరం మాటల ఈటెలు విసురుకుంటున్న వేళ... కృతిమ మేధ (ఏఐ) సాయంతో ఇష్టారాజ్యపు మార్పుచేర్పుల నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో ప్రచార మవుతున్నందున... ఇప్పుడు అందరూ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి. సాక్షాత్తూ కేంద్ర హోమ్‌మంత్రి రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వీడియో ప్రచారమవుతుంది. ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ కాంగ్రెస్‌కు మద్దతుగా మాట్లాడినట్టు మరో వీడియో ప్రత్యక్షమవుతుంది. మరో ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ కాశీలోని గంగాతీరంలో తన పుణ్యక్షేత్ర దర్శనానుభూతిని పంచుకుంటే ఆ మాటలు మోదీ, బీజేపీలకు మద్దతు పలికినట్టుగా నకిలీ వీడియోలో మారిపోతాయి. ఇదీ వర్తమాన ఎన్నికల్లో రాజకీయ వీడియోల వైచిత్రి. గడచిన 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు వాట్సప్ యూనివర్సిటీల్లో తప్పుడు సమాచారం వీరవిహారం చేస్తే, ఈసారి ఏఐ ఆధారిత విశ్వామిత్ర సృష్టి వీడియోలు నేతలకూ, ఓటర్లకూ సరికొత్త సవాళ్ళు విసురుతున్నాయి. నాటి ఐటీ బాట్ల నుంచి నేటి ఏఐ డీప్‌ఫేక్‌ల దాకా మన ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తి వెనక్కి రాలేనంత దూరం వెళ్ళిపోయింది.తాజాగా ఈ నకిలీ వీడియోల సెగ అధికార బీజేపీ నేతలకు గట్టిగానే తగిలింది. సాక్షాత్తూ ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్‌షాలు ఈ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే అందుకు నిదర్శనం. రిజర్వేషన్ల అంశంపై హోమ్ మంత్రి అనని మాటలను అన్నట్టుగా మార్చి చూపించిన ఫేక్ వీడియో ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారమైంది. సంచలనం రేపింది. తమతో సహా పలువురు బీజేపీ నేతల నకిలీ వీడియోలను ప్రచారంలో పెట్టి, శాంతియుత ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయ డానికి ప్రతిపక్షాల వారు ప్రయత్నిస్తున్నారంటూ మోదీ ఆరోపించారు. ఎన్నికల వేళ పెద్ద తల నొప్పిగా మారిన ఈ అబద్ధపు వీడియోల వ్యాప్తిపై బీజేపీ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పోలీసులకూ ఫిర్యాదు చేసింది. అమిత్‌షాకు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారనే ఆరోపణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వడంపై సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం నడుస్తోంది. మరోపక్క ఈ వీడియో వ్యవహారంపై అసోమ్‌లో ఒకరితో పలువురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఏడు విడతల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మంత్రం ఆశించినంతగా ఫలించడం లేదనీ, ‘ఈసారి 400 సీట్ల పైనే’ (అబ్ కీ బార్ 400 పార్) అన్న బీజేపీ నినాదం మంచి కన్నా చెడు చేస్తోందనీ ఒక విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో ఈ డీప్ ఫేక్ వీడియోలు మరిన్ని వర్గాలను అధికార పార్టీకి దూరం చేసే ప్రమాదం లేకపోలేదు. అయితే, ఈ నకిలీ వీడియోల ముప్పు అధికార పార్టీకే కాదు... ప్రతిపక్షం సహా అన్ని పార్టీలకూ ఉంది. ఇంకా చెప్పాలంటే, గడచిన 2019 ఎన్నికలు ‘సోషల్ మీడియా ఎన్నిక’లైతే, ఈ 2024 ఎన్నికలు ‘ఏఐ యుగపు ఎన్నికల’ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. సగటు ఓటరుకు మునుపెన్నడూ లేనంతగా తప్పుడు సమాచారమందే ప్రమాదం ఈసారి పెరిగింది. చేతిలో ప్రపంచాన్ని ఇమిడ్చిన స్మార్ట్‌ఫోన్‌లో వస్తున్నదంతా నిజమని నమ్మే ధోరణిని మార్చుకోక పోతే కష్టమే. వాట్సప్ సహా వివిధ మాధ్యమాల్లో షేర్ అవుతున్న వాటిలో ఏది అసలో, ఏది ఏఐతో మార్చిన నకిలీయో తెలుసుకోవడం తెలీక సామాన్యులు మోసపోయే ప్రమాదం మరీ ఎక్కువైంది. గతంలోనూ విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రత్యర్థిని దెబ్బతీసే ప్రచారాలు లేకపోలేదు. కాకపోతే ఫలానా వర్గం ఎక్కువ మంది పిల్లల్ని కంటోంది, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తే మంగళ సూత్రాలను సైతం లాగేసుకుంటుంది లాంటి మాటలు ఈ తడవ మాత్రమే ఏలికల నోట విని పిస్తున్నాయి. సాంకేతికత వెర్రితలలు వేయడంతో ఈసారి మరింత చిక్కొచ్చి పడింది. మొత్తం మన రాజకీయ సమాచార ప్రసార, ప్రచారాలు శరవేగంతో మారిపోయాయి. 2019 ఎన్నికల ముందు మన ‘జనగణమన’ను ప్రపంచ అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో ప్రకటించిందనే మెసేజ్ వాట్సప్‌లో తెగ తిరిగితే... ఇప్పుడు జనరేటివ్ ఏఐ సాయంతో మోదీ పెదాల కదలికకు అచ్చు గుద్దినట్టు సరిపోయేలా మూడు భాషల్లో ఆయన ప్రసంగపు యూట్యూబ్ షార్ట్ వంతు వచ్చింది. జనాన్ని ఎలాగోలా బురిడీ కొట్టించి, బుట్టలో వేసుకోవాలనే తపన, తాపత్రయం గడచిన అయి దేళ్ళలో కొత్త పుంతలు తొక్కింది. నిజానికి, సోషల్ మీడియా సంస్థలు సైతం ఫేక్ న్యూస్, ప్రాపగాండాలను అరికట్టడానికి కిందా మీదా పడుతున్నాయి. ఆన్‌లైన్‌లోనూ డీప్‌ఫేక్‌ను అడ్డుకొనేందుకు ప్రస్తుత చట్టాలను నవీకరించేందుకు భారత ప్రభుత్వమూ ప్రయత్నిస్తోంది. ఓట్లు, సీట్లు, అధికారమే పరమావధిగా మారిన కాలంలో ప్రతి పార్టీ ఒక సోషల్ మీడియా సైన్యాన్ని పెంచి పోషిస్తోంది. ఆన్లైన్ అసత్య ప్రచారాన్ని సైతం ఎన్నికల వ్యూహంలో ఒక భాగంగా అందరూ అనుసరిస్తున్న రోజులొచ్చిపడ్డాయి. సమాచారాన్ని వైరల్ చేసే బాట్లకు ఇప్పుడు విశ్వామిత్ర సృష్టి జనరేటివ్ ఏఐ కూడా జతపడేసరికి అగ్నికి ఆజ్యం తోడైంది. ఉచితంగా, కాదంటే కారుచౌకగా ఏఐ సహా రకరకాల ఉపకరణాలు అందుబాటులోకి రావడం ఆకతాయిలకూ వరమైంది. ఓ డీప్‌ఫేక్ వీడియో సృష్టికి మూడేళ్ళ క్రితం పది రోజులు పడితే, ఇప్పుడు మూడు నిమి షాల్లో చేయగలుగుతున్నారు. ఇవన్నీ సత్యాన్వేషణలో నేటి సవాళ్ళు. ఎన్నికల్లో అనియంత్రిత ఏఐ వినియోగానికి తక్షణం అడ్డుకట్ట వేయకుంటే అనర్థం తప్పదు. నేతలు, జర్నలిస్టులు, నటీనటులు ప్రధాన లక్ష్యంగా సాగుతున్న విషం చిమ్ముడుకు విరుగుడు వెతకాలి. లేదంటే, వ్యవస్థపైనే నమ్మకం పోతుంది. యావత్ సమాజం, ప్రజాస్వామ్యం నకిలీలతో నిండిపోతుంది. -
అమిత్ షా ఫేక్ వీడియో: పోలీసు నోటీసులకు సీఎం రేవంత్ రిప్లై..
ఢిల్లీ: రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఆ నోటీసులపై సీఎం రేవంత్‌రెడ్డి తరఫున న్యాయవాది సౌమ్య గుప్త వివరణ ఇచ్చారు.‘‘కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేయడానికి నాకు సంబంధం లేదు. ఐఎన్సి తెలంగాణ ట్విటర్ ఖాతాకి నేను ఓనర్ కాదు. ఆ ఖాతాను నేను నిర్వహించడం లేదు. నేను కేవలం రెండు ట్విటర్ ఖాతాలను (సీఎంఓ తెలంగాణా, నా వ్యక్తిగత ఖాతా) మాత్రమే వినియోగిస్తున్నాను’’ అని న్యాయవాది సౌమ్య గుప్త ద్వారా ఢిల్లీ పోలీసులకు రేవంత్‌రెడ్డి సమాధానం పంపారు. రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు ఆయన తరపు న్యాయవాది సౌమ్య గుప్త అందజేసినట్లు తెలిపారు.మరోవైపు.. ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతా ఫోన్ సీజ్ చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్ శాంతినగర్‌కు చెందిన గీతకి ఢిల్లీ పోలీసులు సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇచ్చారు. ఈ నెల 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు.తెలంగాణలో ఇటీవల ఓ సభలో పాల్గొని అమిత్ షా ప్రసంగిస్తూ.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగవిరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను వారికే కల్పిస్తామని చెప్పారు. అమిత్ షా మాటలను కొంతమంది వక్రీకరించారు. రిజర్వేషన్లు అన్నింటినీ పూర్తిగా రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపణలు చేసింది.మరోవైపు.. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ఓ ప్రచార సభలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆరోపించారు. అమిత్ షా వీడియోను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారని బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసు కేసు నమోదు చేసుకోని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరికి వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు. -
ఫేక్ వీడియోల వెనుక రాహుల్ హస్తం
ఫేక్ వీడియోల వెనుక కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ హస్తం ఉంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులు సైతం ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా షేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. ఉన్న కొద్దిపాటి ఓటుబ్యాంక్‌ను కాపాడుకోవడానికి తంటాలు పడుతోంది. – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాగువాహటి: కాంగ్రెస్‌లో నిరాశ, అసంతృప్తి తీవ్రస్థాయికి చేరాయని, అందుకే ఆ పార్టీ ఫేక్ వీడియోలు సృష్టిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోల వెనుక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హస్తం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో ఆ పార్టీ అధ్యక్షులు సైతం ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా షేర్ చేస్తున్నారని దుయ్యబట్టారు. సిద్ధాంతాలు, విలువలు, మేనిఫెస్టో ఆధారంగా ఎన్నికల్లో పోటీ పడాలి తప్ప ఫేక్ వీడియోలను నమ్ముకోవడం ఏమిటని కాంగ్రెస్‌ను నిలదీశారు. మంగళవారం అస్సాం రాజధాని గౌహతిలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆమేథీ, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసే ధైర్యం రాహుల్ గాం«దీకి, ప్రియాంక గాం«దీకి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, ఉన్న కొద్దిపాటి ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడానికి తంటాలు పడుతోందని చెప్పారు. ఈసారి కూడా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదని అన్నారు. దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. అన్ని మతాల పౌరులకు ఒకే పౌరచట్టం ఉండాలన్నారు. లౌకిక దేశంలో మతానికో చట్టం ఉండడం సరైంది కాదని, రాజ్యాంగ స్ఫూర్తికి అది విరుద్దమేనని అన్నారు. అధికారంలోకి వస్తే సివిల్ కాంట్రాక్టులు మైనార్టీలకు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని ఆక్షేపించారు. తక్కువ బిడ్ దాఖలు చేసిన వారికి కాంట్రాక్టులు అప్పగిస్తారు తప్ప ఇలా మతం ఆధారంగా కాంట్రాక్టులు ఇస్తామనడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా మతపరమైన రిజర్వేషన్ ఉందా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధాలకు అంతు లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. ఓటర్లను మైనారీ్టగా, మెజార్టీగా చూసే అలవాటు తమకు లేదని కాంగ్రెస్‌కు చురక అంటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని స్పష్టంచేశారు. బడుగు బలహీన వర్గాల హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం, రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన బీజేపీకి ఎంతమాత్రం లేదని పునరుద్ఘాటించారు. -
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
షోలాపూర్: విపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, సమస్యలు.. కవల పిల్లలు అని విమర్శించారు. దశాబ్దాలపాటు పరిపాలించిన కాంగ్రెస్ మన దేశానికి ఇచ్చింది పేదరికాన్ని తప్ప ఇంకేమీ లేదని ధ్వజమెత్తారు. మంగళవారం మహారాష్ట్రలోని లాతూర్, ధారాశివ్, షోలాపూర్ జిల్లాల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి బీజేపీకి వ్యతిరేకంగా కృత్రిమ మేధ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి, సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి తీసుకొస్తోందని ఆరోపించారు. తన రూపాన్ని, గొంతును అనుకరిస్తూ.. తాను అనని మాటలు అన్నట్లుగా, తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ నకిలీ వీడియోలు తయారు చేస్తున్నారని, సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ వీడియోలను కాంగ్రెస్ ప్రేమ దుకాణంలో అమ్మకానికి పెట్టారని అన్నారు. ఎన్నికల పోరాటంలో బీజేపీని ఎదుర్కొనే దమ్మూ ధైర్యం లేక విపక్షాలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అబద్ధాలను ప్రజలెవరూ నమ్మడం లేదని, అందుకే తప్పుడు దారులు ఎంచుకుందని విమర్శించారు. కాంగ్రెస్ అబద్ధాల దుకాణం మూతపడక తప్పదని తేచ్చిచెప్పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. పాకిస్తాన్‌కు విజ్ఞాపన పత్రాలు బంద్ ‘‘కాంగ్రెస్ పాలనలో మన దేశంలో ఉగ్రవాద దాడులు జరిగిన వెంటనే పాకిస్తాన్‌కు విజ్ఞాపనలు పంపించే పరిస్థితి ఉండేది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ పాకిస్తాన్‌కు విజ్ఞప్తులు చేసేవారు. అది చూసి మీడియాలో కొందరు మిత్రులు కాంగ్రెస్‌ను పొగుడుతూ చప్పట్లు కొడుతూ ఉండేవారు. అప్పట్లో ఇలాంటి వినతిపత్రాలపై పత్రికల్లో నిత్యం పతాక శీర్షికలతో వార్తలు వస్తుండేవి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ముష్కరుల దాడులు ఆగిపోయాయి.విజ్ఞాపన పత్రాలను మనం నమ్ముకోవడం లేదు. శత్రువుల భూభాగంలోకి అడుగుపెట్టి మరీ గట్టిగా బుద్ధిచెబుతున్నాం. దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడడం లేదు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహించాం. నవభారత్ ప్రగతికి ఇదొక సూచిక. ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉండే బలహీన ప్రభుత్వం బలమైన దేశాన్ని నిర్మించలేదు. ఈ ఎన్నికల్లో మన దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు. ప్రపంచ అభివృద్ధికి నేడు భారత్ వేగాన్ని అందిస్తోంది. గత పదేళ్లలో మనం ఎన్నో ఘనతలు సాధించాం. బలమైన ప్రభుత్వంతోనే అనుకున్నది సాధించగలం. ఓటు వృథా చేసుకోవద్దు దేశ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసింది. నేను ఏక్ భారత్, శ్రేష్ట భారత్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ యువరాజుకు జ్వరం వచ్చేస్తోంది. దేశాన్ని దోచుకున్న నేతలు ఇప్పుడు జైల్లో ఉన్నారు. జనం సొమ్ము మింగేసినవారు తిరిగి కక్కాల్సిందే. అవినీతిపరుల నుంచి డబ్బు తిరిగి వసూలు చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్‌కు ఒక్క కుటుంబమే ముఖ్యం. మాకు దేశంలోని ప్రతి కుటుంబం ముఖ్యమే. 2014, 2019లో ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని వారికి మేలు చేయడానికే ఉపయోగించాం. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోంది.ఇప్పుడు సాక్షాత్తూ బాబాసాహెబ్ అంబేడ్కర్ వచ్చినా రిజర్వేషన్లను రద్దు చేయలేరు. విద్య, ఉద్యోగాల్లో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. వాటిని రద్దు చేయడం ఎవరివల్లా కాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత వేసి, ఓటు బ్యాంక్‌కు కట్టబెట్టాలన్నదే కాంగ్రెస్ కుట్ర. ఎస్సీ, ఎస్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ ఎదగనివ్వలేదు. గత పదేళ్లలో పార్లమెంట్లో, అసెంబ్లీల్లో అడుగుపెట్టిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం బీజేపీ, ఎన్డీయేకు చెందినవారే.ఈ ఎన్నికల్లో కనీసం 275 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితితో కాంగ్రెస్ ఉంది. అలాంటి పారీ్టకి ఎన్నికల్లో మద్దతు పలికి ఎవరూ ఓటు వృథా చేసుకోవద్దు. మహారాష్ట్రలో సంచరించే ఆత్మ(శరద్ పవార్) ఒకటి ఉంది. ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు చేసింది సున్నా. ఎన్నికల సమరంలో ప్రజలు ఆయనను ఓటుతో శిక్షించే సమయం వచ్చింది. ప్రధాని పదవిని ముక్కలు చేస్తారట! దేశ ప్రజలను, రైతులను కాంగ్రెస్ దగా చేసింది. వారి కలలను విచ్చిన్నం చేసింది. కాంగ్రెస్ హయాంలో రైతన్నలకు దక్కాల్సిన నిధులను, ఎరువులను కూడా లూటీ చేశారు. సాగునీటి వసతి కల్పించలేదు. ప్రాజెక్టులు పూర్తిచేయలేదు. ప్రతిభావంతులైన మన దేశ యువతకు కాంగ్రెస్ వల్ల అన్యాయం జరిగింది. మన దేశం ముక్కలు కావడాన్ని కళ్లారా చూసినవారు ఇప్పుడు ప్రధానమంత్రి పదవిని ముక్కలు చేయాలని అనుకుంటున్నారు. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని పదవిని ఇన్స్టాల్మెంట్లలో పంచుకుంటారట! ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు అనేది దేశాన్ని దోచుకొనే పథకమే. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన ఆట ఆడుతోంది’’ అని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎజెండాపై ఓటర్లను అప్రమత్తం చేయండిఎన్డీయే అభ్యర్థులకు ప్రధాని మోదీ లేఖ విపక్ష కాంగ్రెస్ దురుద్దేశాలు, ఎజెండాపై ఓటర్లను అప్రమత్తం చేయాలని ప్రధానమంత్రి మోదీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ఓటు బ్యాంక్‌కు మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆ పార్టీ ఎత్తుగడ అని పేర్కొన్నారు. వారసత్వ పన్ను విధించి, ప్రజల ఆస్తులను లాక్కొని ఓటు బ్యాంక్‌కు అప్పగించాలన్నదే కాంగ్రెస్ ఎజెండా అని విమర్శించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు విభజన, వివక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రమాదకరమైన కాంగ్రెస్ ఎజెండాను ఓటర్లకు వివరించి, అప్రమత్తం చేయాలని ఎన్డీయే అభ్యర్థులను మోదీ కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీకి ఒక విలువైన కార్యకర్త అని ఆయన రాసిన లేఖలో ప్రధాని ప్రశంసించారు. గతంలో గుజరాత్ మంత్రిగా, ఇప్పుడు కేంద్రమంత్రిగా అమిత్ షా చక్కటి పనితీరు ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. -
ఫేక్ వీడియోపై అమిత్ షా సంచలన కామెంట్స్
-
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
-
కాంగ్రెస్ మరింత దిగజారింది: అమిత్ షా మండిపాటు
ఢిల్లీ, సాక్షి: రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తామో చెప్పి పోరాడాలని, అంతేగానీ తప్పుడు వీడియోలతో కాదని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. తనపై ఫేక్ వీడియో ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించిన ఆయన.. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు మరింత దిగజారిపోయానని మండిపడ్డారు.మంగళవారం ఢిల్లీలో ఆయన పలువురు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బీజేపీ 400 సీట్ల లక్ష్యంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీజేపీకే గనుక 400 సీట్లు దాటితే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని చెబుతోంది. కానీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల కోటాల్లో కోత విధించింది కాంగ్రెస్సే. ఆంధ్రా, కర్ణాటకలో రిజర్వేషన్లపై కోత పెట్టింది.మాకు(బీజేపీ) గత రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీ వచ్చింది. కానీ, కాంగ్రెస్ మాదిరిగా మేం ఎమర్జెన్సీ విధించలేదు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు కోసం ఆ సంపూర్ణ అధికారాన్ని ఉపయోగించాం. ఈ దఫా బీజేపీ 400 సీట్లు సాధిస్తుంది. ముగిసిన రెండు విడతల ఎన్నికల్లోనే వందకు పైగా సీట్లు వస్తాయని నమ్మకం ఉంది. దక్షిణ భారతంలోనూ బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయి అని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మరింతగా దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ఫేక్ వీడియోలు సృష్టించి ప్రచారం చేయడం బాధాకరం. కాంగ్రెస్ కూటమి ఓటమి భయంలో ఉండి పోయాయి. అందుకే అమేథీలోనూ పోటీకి కాంగ్రెస్ భయపడుతోంది అని షా అన్నారు. -
ఫేక్ వీడియో పై అమిత్ షా సంచలన కామెంట్స్
-
అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
-
అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో కేసులో రేవంత్‌కు నోటీసులు.. సీఎంకు ఫేక్ ‘షా’క్
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దుచేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నట్టుగా వైరల్ అయిన డీప్ ఫేక్ వీడియో వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం శాఖ.. ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన, షేర్ చేసిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డికి, పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీడియోను షేర్ చేసిన ఎలక్ట్రానిక్ డివైస్ (మొబైల్/ల్యాప్‌టాప్/ట్యాబ్లెట్)తో సహా మే 1వ తేదీన స్పెషల్ సెల్ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్నవారిలో టీపీసీసీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీష్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీం ఉన్నారు. వీరికి సంబంధించిన నోటీసులను గాందీభవన్‌లో కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్చార్జి రామచంద్రారెడ్డికి ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. రేవంత్‌కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడి పేరిట 91/160 సీఆర్పీసీ కింద నోటీసులను ఆయన నివాసంలో ఇచ్చినట్టు తెలిసింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్.. తనకు నోటీసులు వచ్చిన విషయాన్ని వెల్లడించారు కూడా. సిద్దిపేటలో మాట్లాడిన వీడియో డీప్ ఫేక్‌తో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల సిద్దిపేటలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ.. మతపరంగా ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని.. వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని వ్యాఖ్యానించారు. అయితే కొందరు ఆ వీడియోను డీప్‌ఫేక్‌తో మార్ఫింగ్ చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్‌షా అన్నట్టుగా ఎడిట్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్)లో కాంగ్రెస్ పార్టీ, టీపీసీసీ, రేవంత్ పేరిట ఉన్న ఖాతాల నుంచి కూడా ఈ వీడియో షేర్ అయింది. దీనిపై బీజేపీ రాష్ట్ర శాఖ ఇక్కడి పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది కూడా. అయితే ఈ వీడియో దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుండటం.. ముఖ్యంగా కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా విస్తృత ప్రచారంలోకి రావడంతో కేంద్రం హోం శాఖ అలర్ట్ అయింది. ఉదయమే గాంధీభవన్‌కు సమాచారం అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో వ్యవహారానికి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి ఢిల్లీ పోలీసులు వస్తున్నారని సోమవారం ఉదయమే గాం«దీభవన్‌కు సమాచారం అందింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఐఎఫ్ఎస్ఓ స్పెషల్ సెల్ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి నేతృత్వంలోని బృందం గాం«దీభవన్‌కు చేరుకుంది. టీపీసీసీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె సతీష్, శివకుమార్ అంబాలా, నవీన్, ఆస్మా తస్లీంలకు నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. వారి తరఫున కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్చార్జి, అడ్వొకేట్ రామచంద్రారెడ్డి ఆ నోటీసులను తీసుకున్నారు. ఎవరి ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చారని రామచంద్రారెడ్డి ప్రశ్నించగా.. కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఫిర్యాదు అని ఇన్స్పెక్టర్ వివరించారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని తమకు పంపాలని.. పూర్వాపరాలు పరిశీలించి ముందుకు వెళ్తామని, ఇందుకోసం 15 రోజుల గడువు కావాలని ఇన్స్పెక్టర్ను రామచంద్రారెడ్డి కోరారు. ఈ మేరకు రాతపూర్వకంగా విజ్ఞప్తిని అందజేశారు. దీనితో ఢిల్లీ పోలీసులు వెళ్లిపోయారు. కాంగ్రెస్ నేతల ఆగ్రహం ఢిల్లీ పోలీసులు గాం«దీభవన్‌కు వచ్చిన విషయం తెలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీ నాయకురాలు శోభారాణి తదితరులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఢిల్లీ పోలీసుల తీరును తప్పు పట్టారు. ఏ వీడియోను ఎవరు, ఎందుకు సోషల్ మీడియాలో పెట్టారో తెలియకుండా, ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేకుండా గాం«దీభవన్‌కు వచ్చి నోటీసులు ఇవ్వడం శోచనీయమని పేర్కొన్నారు. ఐటీ చట్టం, సీఆర్పీసీల కింద కేసు నమోదు చేసి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో విషయంలో తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ ‘ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)’ని ఆదేశించింది. ఐ4సీ డిప్యూటీ కమిషనర్ సింకూ శరణ్ సింగ్ ఆదివారమే ఢిల్లీ ‘ఇంటెలిజెన్స్ ఫ్యూజియన్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్ఓ)’ స్పెషల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం సెక్షన్ 66సీ, ఐపీసీలోని 153/153ఏ/465/469/171జీ సెక్షన్ల కింద కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 177/24) నమోదు చేసింది. అమిత్ షా వీడియోను డీప్‌ఫేక్ మార్ఫింగ్ చేసిందెవరు? ‘ఎక్స్’, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా వైరల్ చేసిందెవరనే దానిపై దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా 91/160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ వీడియోను వైరల్ చేసిన వారిపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ చర్యలు చేపట్టారు. ఫేస్బుక్, ‘ఎక్స్’లకూ నోటీసులు ఈ వీడియో వ్యవహారానికి సంబంధించి ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్) సంస్థలకు కూడా స్పెషల్ సెల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎవరు ఆ వీడియోను మొదట పోస్ట్ చేశారు? ఇప్పటివరకు ఎందరు ఆ వీడియోను సర్క్యులేట్ చేశారనే వివరాలను వెబ్ లింకులతో సహా ఇవ్వాలని ఆదేశించారు. స్పెషల్ సెల్‌కు చేసిన ఫిర్యాదులో ఏముంది? ‘‘ఒక సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించిన వీడియోను మార్చేసి (డీప్‌ఫేక్, ఎడిట్, బోగస్ చేసి) కొందరు వ్యక్తులు ఎక్స్, ఫేస్బుక్ పేజీల్లో పోస్ట్ చేశారు. వాస్తవానికి అమిత్ షా మాట్లాడినది వేరు, వాళ్లు పోస్ట్ చేసిన ప్రసంగం వేరు. ఏయే పేజీల్లో (ఎక్స్, ఫేస్బుక్) ఆ వీడియోను పోస్ట్ చేశారనేది లింకులతో సహా ఇస్తున్నాం. సమాజాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కొందరు భావిస్తున్నారు. అందుకే వాళ్లు అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారు. ఆ అసత్య వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఎక్స్, ఫేస్బుక్ ఖాతాలను నిర్వహిస్తున్న వారిని, వాటికి సంబంధించిన ఇన్చార్జులు, నకిలీ వీడియోతో ప్రచారానికి శ్రీకారం చుట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని స్పెషల్ సెల్‌కు చేసిన ఫిర్యాదులో ఐ4సీ డిప్యూటీ కమిషనర్ సింకూ శరణ్ సింగ్ పేర్కొన్నారు. మరోవైపు అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటే బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఎన్నికల వేళ కలకలం.. సోషల్ మీడియాలో అమిత్ షా ఫేక్ వీడియో!
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కామెంట్స్ ఉన్నాయి. దీంతో.. హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడం గురించి అమిత్ షా కామెంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా మాట్లాడినట్టుగా ఉంది. అయితే, అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడినట్టు బీజేపీ స్పష్టం చేసింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయడంపై అమిత్ షా ఏమీ మాట్లాడలేదని బీజేపీ తెలిపింది. .@INCTelangana is spreading an edited video, which is completely fake and has the potential to cause large scale violence.Home Minister Amit Shah spoke about removing the unconstitutional reservation given to Muslims, on the basis of religion, after reducing share of SCs/STs and… pic.twitter.com/5plMsEHCe3— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 27, 2024 ఇక, వీడియోపై కాంగ్రెస్ స్పందించింది. రిజర్వేషన్‌ను అంతం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోందని పేర్కొంటూ కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ల అధికారిక ఖాతాలతో సహా పలు సోషల్ మీడియా ఖాతాల్లో ఆ వీడియో షేర్ చేశారు. దీంతో బీజేపీ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను పూర్తిగా ఎడిట్ చేశారని పిటిషన్లో పేర్కొంది. ఈ క్రమంలో దీనిపై కేసు నమోదు చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ వీడియోపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ ఫేక్ వీడియోపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మాలవీయా.. కాంగ్రెస్ పార్టీ ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తోంది. చట్టపరమైన చర్యలకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఫేక్, ఎడిట్ చేసిన వీడియోలను ప్రచారం చేయడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అది ఫేక్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అమీర్ ఖాన్
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ 'అమీర్ ఖాన్' రాబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు తెలిపే ఒక నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఖాన్ స్పందించారు. బాలీవుడ్ నటుడు 'అమీర్ ఖాన్' రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నట్లు వస్తున్న వీడియోలు ఫేక్ అని కొట్టి పారేశారు. ఏ ఒక్క రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదని, ఏ పార్టీని తాను ప్రమోట్ చేయలేదని స్పష్టం చేశారు. నా 35 సంవత్సరాల కెరీర్లో ఏ రాజకీయ పార్టీని ఎన్నడూ ఆమోదించలేదని పేర్కొన్నారు. ఎన్నికలలో.. ఎన్నికల సంఘం కోసం ప్రచారం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మాత్రమే ప్రయత్నం చేసినట్లు వివరించారు. మిస్టర్ ఖాన్ ఒకే పార్టీని ప్రమోట్ చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇటీవల వైరల్ అవుతున్న వీడియోలు నకిలీవని ప్రకటించారు. దీనిపైన ముంబై పోలీసుల సైబర్ క్రైమ్ సెల్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు ఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఓటర్లకు అమీర్ ఖాన్ సందేశం ఇచ్చారు. భారతీయులందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని, ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని కోరారు. అయితే ఇప్పటికి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసినట్లు తెలిసింది. भारत का हर नागरिक लखपति है क्योंकि सबके पास काम से कम 15 लाख तो होने ही चाहिए .. क्या कहा आपके अकाउंट में 15 लाख नहीं है.. तो आपके 15 लाख गए कहां ??? तो ऐसे जुमलेबाजों से रहे सावधान नहीं तो होगा तुम्हारा नुकसान 🇮🇳🇮🇳🇮🇳देशहित में जारी🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/hJkEFEL5vG — Mini Nagrare (@MiniforIYC) April 14, 2024 -
అలా చేయడం తప్పు, అందుకు ఇదే ఒక ఉదాహరణ: రష్మిక
హీరోయిన్ రష్మికా మందన్నా అంటూ మార్ఫింగ్ చేసిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా రష్మికా మందన్నా స్పందించారు. ‘‘ఢిల్లీ పోలీసులకు ధన్యవాదాలు. నన్ను అభిమానిస్తూ, నాకు అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. అలాగే ఇలాంటి ఘటనలకు (మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను ఉద్దేశించి) పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అమ్మాయిలు... అబ్బాయిలు... ఎవరైనా కావొచ్చు. మీ అనుమతి లేకుండా మీ ఫొటోలను మార్ఫింగ్ చేయడం, దుర్వినియోగం చేయడం అనేవి తప్పు’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు రష్మికా మందన్నా. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారామె. అలాగే ‘ది గాళ్ ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ అనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నారీ బ్యూటీ. వీటితో పాటు కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. -
డీప్‌ఫేక్ బారిన సోనూసూద్.. వీడియో వైరల్!
సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే రష్మిక, అలియా భట్, కృతిసనన్ లాంటి స్టార్ హీరోయిన్లకు సబంధించిన డీప్‌ఫేక్ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. తాజాగా ప్రముఖ నటుడు, ‘రియల్ హీరో’ సోనూసూద్ సైతం డీప్‌ఫేక్ బారిన పడ్డాడు. సైబర్ నేరగాళ్లు సోనుసూద్ డీప్‌ఫేక్ వీడియోతో మోసాలకు పాల్పడుతున్నారు. అతని ఫేస్‌తో ఫేక్ వీడియో రెడీ చేసి.. అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోనూసూద్ తన ట్విటర్(ఎక్స్) ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. (చదవండి: రష్మిక వీడియో.. డీప్ ఫేకర్ అరెస్ట్) ‘కొందరు నా డీప్‌ఫేక్ వీడియోని క్రియేట్ చేసి అభిమానులతో చాటింగ్, వీడియో కాల్స్ చేస్తూ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఈ వీడియోలో ఉన్నది నేనే అనుకొని సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ఇలాంటి వీడియో కాల్స్ వస్తే నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. నిజ జీవితంలో జరిగిన ఇలాంటి ఘటనల మీదే నేను ఫతే అనే సినిమా తీస్తున్నాను. ఫేక్ వీడియోస్, లోన్ యాప్స్ వల్ల జరుగుతున్న సైబర్ నేరాలను ఆ సినిమాలో చూపించబోతున్నాం’అని సోనూసూద్ తెలిపారు. రష్మికకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో డీప్‌ఫేక్ వ్యవహారం బయటపడింది. ఆ తర్వాత సినీ సెలెబ్రిటీలు వరుసగా డీప్‌ఫేక్ బారిన పడ్డారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో కూడా ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. వీటిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ వీడియోను క్రియేట్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా రష్మిక డీప్‌ఫేక్ వీడియోను తయారు చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తియే ఈ ఫేక్ వీడియో తయారు చేసినట్లు తెలుస్తోంది. My film FATEH is inspired by real life incidents involving Deep Fake and fake loan apps. This is the latest incident where someone tried to extract money from an unsuspecting family, by chatting with them through video call pretending to be Sonu sood. Many innocent individuals… pic.twitter.com/cXNBsa4nvC — sonu sood (@SonuSood) January 18, 2024 -
అప్పుడు సారా.. ఇప్పుడు సచిన్ టెండుల్కర్!
సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలకు అదుపులేకుండా పోతోంది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు డీప్‌ఫేక్ బారిన పడగా.. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా తాజాగా ఆ బాధితుల జాబితాలో చేరాడు. ఓ గేమింగ్ అప్లికేషన్‌ను సచిన్ ప్రమోట్ చేస్తున్నట్లుగా నకిలీ వీడియోను రూపొందించి నెట్టింట వదిలారు సైబర్ నేరాలకు అలవాటు పడ్డ మాయగాళ్లు. ఇది కాస్తా తన వరకు చేరడంతో.. ఎక్స్ వేదికగా స్పందించాడీ బ్యాటింగ్ లెజెండ్. ఇవన్నీ నకిలీ వీడియోలు ‘‘ఈ వీడియోలు నకిలీవి. టెక్నాలజీని ఇంతలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే మనసు కలచివేస్తోంది. ఇలాంటి వీడియోలు, యాడ్స్, అప్లికేషన్లు గనుక మీ దృష్టికి వస్తే ప్రతి ఒక్కరు తప్పక రిపోర్టు చేయండి’’ ని సచిన్ టెండుల్కర్.. తన ఫాలోవర్లకు సూచించాడు. అదే విధంగా.. ‘‘ఇలాంటి ఫిర్యాదుల పట్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా వేగంగా స్పందించి సత్వరమే చర్యలు తీసుకోవాలి. డీప్‌ఫేక్స్, తప్పు సమాచారవ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి’’ అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మేనేజ్మెంట్లకు విజ్ఞప్తి చేశాడు సచిన్ టెండుల్కర్. గిల్‌తో ఉన్నట్లుగా ఫొటో మార్ఫ్ చేసి కాగా సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ కూడా డీప్‌ఫేక్ బారిన పడిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోను సృష్టించారు. తన తమ్ముడు అర్జున్ టెండుల్కర్తో సారా దిగిన ఫొటోను మార్ఫ్ చేసి లీక్ చేశారు. అంతేకాదు ఆమె పేరిట ఫేక్ అకౌంట్లు సృష్టించి గిల్ పట్ల ప్రేమను చాటుకుంటున్నట్లుగా పోస్టులు పెట్టారు. ఈ విషయంపై స్పందించిన సారా టెండుల్కర్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎక్స్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేసింది. చదవండి: చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే! -
డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: డీప్ ఫేక్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమైన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. ఈ వివరాలను కేంద్ర సహయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. ‘డీఫ్ ఫేక్’ ఫొటోలు, వీడియోల సృష్టికర్తల ఆగడాలను ఊపేక్షించేదిలేదని, భారీ జరిమానాలను వి«ధిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ సంస్థల సమావేశంలో హెచ్చరించిన విషయం తెల్సిందే. సంబంధిత మార్గదర్శకాలను, త్వరలో తీసుకురాబోయే చట్టాలను, నిబంధనలను రాజ్యసభ దృష్టికి తీసికెళ్లినట్లు మంత్రి పేర్కొన్నారు. సెక్షన్ 66డీ కింద కంప్యూటర్ ఆధారిత సాంకేతికతతో ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ.1 లక్ష జరిమానా విధిస్తామని మంత్రి చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. -
ఫేక్ వీడియోలు వైరల్ కావొచ్చు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలకు తేదీ దగ్గర పడడంతో.. ప్రచార శైలి కూడా భిన్నమార్గంలోనే సాగుతోంది. ఒకవైపు ఓటర్లతో నేరుగా ఇంటెరాక్షన్తో పాటు మరోవైపు సోషల్‌మీడియాలోనూ నేతల ‘ఆరోపణ-ప్రత్యారోపణల’ జోరు కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియా ద్వారా పార్టీ శ్రేణుల్ని, సోషల్ మీడియా సైన్యాన్ని అప్రమత్తం చేశారు. ఎన్నికలకు కొద్ది సమయమే ఉంది. స్కామ్‌గ్రెస్ స్కామర్ల నుండి రాబోయే కొద్ది రోజులలో అనేక తప్పుడు/డీప్ ఫేక్ వీడియోలు & ఇతర రకాల అసంబద్ధ ప్రచారాలు ప్రచారంలోకి రావొచ్చు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఎవరూ మోసపూరిత వలలో చిక్కుకోవద్దు. అలాగే తప్పుడు ప్రచారాల వలలో ఓటర్లు పడకుండా చూడాలని కేటీఆర్ కోరారు. డీప్‌ఫేక్ కంటెంట్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న తరుణంలో.. కేంద్రం అలాంటి కంటెంట్ వ్యాప్తి కట్టడికి ప్రయత్నిస్తున్న తరుణంలో తెలంగాణ ఎన్నికల్లోనూ ఆ తరహా కంటెంట్ వైరల్ కావొచ్చంటూ కేటీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. Want to alert @BRSparty cadre and all SM Soldiers There will be many False/Deep Fake Videos & other forms of Nonsensical Propaganda over the next few days from Scamgress scammers Let us make sure no gullible voter falls into their trap Jai Telangana ✊#TelanganaWithKCR — KTR (@KTRBRS) November 24, 2023 -
స్టార్స్‌ను భయపెడుతోన్న డీప్ ఫేక్.. తాజాగా మరో స్టార్ హీరోయిన్!
ఇటీవలే నేషనల్ క్రష్ రష్మిక డీప్ ఫేక్ వీడియో సంచలనంగా మారింది. ఆ తర్వాత కత్రినా కైఫ్ సైతం డీప్ ఫేక్ బారిన పడింది. టైగర్-3 చిత్రంలోని ఓ సీన్‌ను ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. ఈ సంఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ నటి కాజోల్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తన దుస్తులు మార్చుకుంటున్నట్లుగా వీడియోను రూపొందించారు. ఇది కూడా డీప్‌ఫేక్ సాయంతోనే ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో ఉన్నది కాజోల్ కాదని..ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్దని ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ సంస్థ బూమ్ వెల్లడించింది. ఈ వీడియో ఈ ఏడాది జూన్ 5న పోస్ట్ చేశారని తెలిపింది. అయితే మనదేశంలో టిక్ టాక్‌పై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రష్మిక మందన్నా వీడియో వైరల్ కావడంతో.. ఈ డీప్‌ఫేక్ వీడియో తాజాగా బయటకొచ్చింది. దీనికి సంబంధించిన ఒరిజినల్ వీడియో గతంలో టిక్‌టాక్‌లో అప్లోడ్ చేశారని బూమ్ తన నివేదికలో వెల్లడించింది. అయితే ఈ వీడియోనూ ఎవరు సృష్టించారో మాత్రం తెలియరాలేదు. అయితే గతంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లపై ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. -
రష్మిక డీప్ ఫేక్ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా?
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఘటనలో కీలక పరిణామంచోట చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు బిహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఆ యువకుడిని ప్రశ్నించినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. నిందిత యువకుడి సోషల్ మీడియా ఖాతానుండే అప్లోడ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తరువాత ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. మరోవైపు విచారణ సందర్భంగా వేరే ఇన్‌స్టా ఖాతానుంచి ఆ వీడియోను తాను డౌన్లోడ్ చేసుకున్నట్లు యువకుడు చెప్పినప్పటికీ, విచారణ కొనసాగుతుందని సంబంధిత సీనియర్ అధికారులు తెలిపారు. (వర్క్ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే:ఆ దిగ్గజాలు ఇపుడేమంటాయో?) మొబైల్ ఫోన్‌తో సహా బిహార్‌కు చెందిన యువకుడిని ఐఎఫ్ఎస్ఓ యూనిట్ ముందు హాజరుకావాలని పోలీసులు అదేశించారు. అలాగే FIR నమోదు చేసిన వెంటనే, IFSO యూనిట్ కూడా నిందితుడిని గుర్తించడానికి URL ఇతర వివరాల కోసం సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు లేఖ రాసింది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనలో నవంబర్ 10న, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO)లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 465 (ఫోర్జరీకి శిక్ష) , 469 (పరువుకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 66C , 66E కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. (దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్ ఢమాల్) కాగా నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో ఆన్లైన్లో మహిళల సెక్యూరిటీపై ఆందోళన రేపింది. బిగ్‌బీ అమితాబ్ సహా పలువురు నటీ నటులు, ఇతర సెలబ్రిటీలు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చివరికి కేంద్ర ఐటీ శాఖ కూడా స్పందించి మరోసారి సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని గుర్తు చేసింది. (చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!) -
ఇంటర్నెట్ ను ముంచెత్తుతున్న డీప్ ఫేక్ లు
-
రష్మిక మరో ఫేక్ వీడియో.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!
సినీనటి రష్మిక మందన్నాపై కొద్ది రోజుల్లోనే రెండు ఫేక్ వీడియోలు వైరల్ కావడంపై కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. రష్మిక డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇలాంటి వీడియోలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చిన్న పిల్లలు, మహిళలపై ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ..'డీప్ ఫేక్ వీడియోలపై దృష్టి సారించాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మార్ఫింగ్ లాంటివి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇలాంటి పరిస్థితి రావడం చాలా ప్రమాదకరం. గత రెండేళ్లుగా ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాం. సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటాం. ఫిబ్రవరి నుంచి నిబంధనలు మరింత కఠినతరం చేస్తాం.' అని అన్నారు. ఇటీవల నేషనల్ క్రష్ రష్మికకు సంబంధించిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. భారత సంతతికి చెందిన జరా పటేల్ వీడియోను కొందరు డీప్ ఫేక్ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేశారు. ఈ సంఘటనపై పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో మరవకముందే.. మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు విజ్ఞప్తి చేశారు. రష్మికతో పాటు బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ టైగర్-3 సినిమాలో ఓ ఫోటోను అలాగే మార్ఫింగ్ చేశారు. దీంతో రోజు రోజుకు ఇలాంటి వాటి బారిన పడే వారిసంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. -
Deep Fake: ఇది లోతైన సమస్య!
మేధ అవసరం. సవ్యంగా వాడితే ఆధునిక సాంకేతికత అందించిన కృత్రిమ మేధ (ఏఐ) కూడా అవసరాలు తీర్చవచ్చు. కానీ, దాన్ని అపసవ్యంగా వాడి, అసత్య ప్రచారానికీ, అసభ్య వీడియోలకూ వినియోగిస్తే ఏమవుతుందో నాలుగైదు రోజులుగా తాజా ఉదాహరణలతో చూస్తున్నాం. లిఫ్టులో అడుగిడుతున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సరైన ఓ బ్రిటిష్ ఇండియన్ మహిళ వీడియోను తీసుకొని, ఆమె ముఖం బదులు ప్రముఖ సినీ నటి రష్మికా మందన్న ముఖాన్ని తగిలించిన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, వివాదం రేపింది. నటి కత్రినా కైఫ్ పైనా ఇలాగే మరో నకిలీ వీడియో బయటకొచ్చింది. పెరిగిన ఏఐ సాంకేతిక వినియోగంతో ఈజీగా మారి, ఇంటర్నెట్ను ముంచెత్తుతున్న ఈ డీప్ ఫేక్‌లపై మళ్ళీ చర్చ రేగింది. వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, గౌరవం మొదలు జాతీయ భద్రత దాకా అన్నిటికీ ముప్పుగా మారుతున్న ఈ సాంకేతికతకు ప్రభుత్వం ముకుతాడు వేయాల్సిన అవసరాన్ని తెరపైకి తెచ్చింది. రకరకాల సాంకేతిక విధానాల ద్వారా బొమ్మలు, వీడియోలు, ఆడియోల్లో ఒక మనిషి స్థానంలో మరో మనిషి రూపాన్నీ, గొంతునూ అచ్చు గుద్దినట్టు ప్రతిసృష్టించి, డిజిటల్‌గా తిమ్మినిబమ్మిని చేయడమనే ‘డీప్ ఫేక్’ ఇప్పడు ప్రపంచమంతటినీ పట్టిపీడిస్తున్న చీడ. నిజానికి, ఫోటో–షాపింగ్ ద్వారా బొమ్మలు మార్చే పద్ధతి చాలా కాలంగా ఉన్నదే. కానీ, శక్తిమంతమైన మెషిన్ లెర్నింగ్,కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇట్టే బురిడీ కొట్టించేలా వీడియోలు, ఆడియోలు చేయడం డీప్ ఫేక్ను పదునైన అస్త్రంగా మార్చేశాయి. అసలు ఏదో, నకిలీ ఏదో కనిపెట్టేందుకు పలు పద్ధతులు లేకపోలేదు. అయితే, అసలు సంగతి వివరించేలోగా సోషల్ మీడియా పుణ్యమా అని నకిలీ సమాచారం క్షణాల్లో లోకాన్ని చుట్టేస్తోంది. చివరకు నాసిరకం డీప్‌ఫేక్‌లు సైతం జనం మనసులో అనుమానాలు రేపి, అసలు సిసలు సమాచారాన్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. పోనుపోనూ సాంకేతికత పదును తేరి, అందరికీ అందుబాటులోకి వస్తే, డీప్‌ఫేక్‌లు నైసు తేలతాయి. అప్పుడిక అసలు, నకిలీలలో తేడాలు పసిగట్టడం ఇంకా కష్టం. ఇవాళ కంపెనీలు, రాజకీయ పార్టీలు, నేతలు తమకంటూ సొంత ఇమేజ్ సృష్టించుకోవడానికీ, పెంచుకోవడానికీ, చివరకు ప్రత్యర్థులపై బురదచల్లడానికి ఫేక్ న్యూస్‌ను ఆసరాగా చేసుకుంటున్న తీరు చూస్తున్నాం. ఫలితంగా, అవి జనం మానసిక స్థితిపై ముద్ర వేసి, వారు తీసుకొనే నిర్ణయాలను ప్రభావితం చేయడమూ జరుగుతోంది. సమాచారం కోసం ఆన్‌లైన్‌పై అధికంగా ఆధారపడడం, సామాన్యుల్లో సైతం ఇంటర్నెట్ వినియోగం పెరిగాక వచ్చిన కొత్త తలనొప్పులివి. బాట్లు, ట్రోల్స్, ప్రభావం చూపే ప్రచారాలు... ఇలా పేర్లు ఏమైనా, అన్నిటి పనీ ఒకటే! ఆన్లైన్లో తమకు కావాల్సినట్టు కథనాలు వండివార్చడమే! మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ వగైరా ఆధునిక సాంకేతికతల పుణ్యమా అని త్వరలోనే పూర్తిగా ఏఐ సృష్టించిన వార్తా కథనాలు, పాడ్ కాస్ట్‌లు, డీప్ ఫేక్ చిత్రాలు, వీడియోలతో కూడిన డిజిటల్ ప్రపంచాన్ని మనం పంచుకోవాల్సిన పరిస్థితి. మనం ఊహించలేనంత స్థాయిలో, వేగంతో ఇవన్నీ డిజిటల్ ప్రపంచాన్ని ముంచెత్తనున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం 2018 నాటికి కనిపెట్టిన డీప్‌ఫేక్‌లు 10 వేల లోపే! ఇవాళ ఆన్లైన్లో వాటి సంఖ్య లక్షల్లోకి చేరింది. కొత్త కృత్రిమ మీడియా సమాచారం ఆందోళనకరం. నిరుడు ఉక్రెయిన్‌పై దాడిని సమర్థించుకొనేందుకు రష్యా డీప్ ఫేక్‌లను వాడే ప్రమాదం ఉందని పాశ్చాత్య దేశాలు అనుమానించాయి. ఈ ఏడాది మే నెలలో వైట్‌హౌస్ సమీపంలో పొగ వస్తున్న డీప్‌ఫేక్ చిత్రం దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. డీప్‌ఫేక్ కాకున్నా, రచయితల సమ్మె వేళ స్వర్గీయ తారల్ని తెరపై పునఃసృష్టించే పనికి హాలీవుడ్ స్టూడియోలు దిగడమూ నైతికతపై చర్చ రేపింది. సైబర్ ఆర్థిక నేరాలు, అసలును పోలిన నకిలీ సృష్టితో శీలహననం నుంచి దేశ భద్రత దాకా సాంకేతికత నీలినీడ పరుస్తోంది. సినీ తారలు ఇవాళ ఎదుర్కొన్న ఇబ్బంది సామాన్యులకు ఎదురవడానికి ఎంతో కాలం పట్టదు. ఈ ఏడాది ప్రపంచంలో 5 లక్షల డీప్‌ఫేక్ ఆడియో, వీడియోలు సోషల్ మీడియాలో షేరవుతాయని అంచనా. పైగా, డీప్‌ఫేక్ వీడియోల్లో 98 శాతం ఆడవారిపై చేసినవే. బాధిత ప్రపంచ దేశాల్లో 6వ స్థానం మనదే! ఆ మాటకొస్తే, 2020లోనే అజ్ఞాత సేవగా సాగిన ‘డీప్ న్యూడ్’ గురించి పరిశోధకులు బయటపెట్టారు. ఒక వ్యక్తి ఫోటోలను వారి అంగీకారంతో సంబంధం లేకుండా, క్రమం తప్పక అందించడం ద్వారా నకిలీ నగ్నచిత్రాలను సృష్టించే ఆ సర్వీస్‌పై రచ్చ రేగింది. పలు పాశ్చాత్య దేశాల్లో అరెస్టులు, దర్యాప్తులు, చట్టాల్లో మార్పులు జరిగాయి. కాలంతో పాటు సాంకేతికత మారి, జనజీవితంపై దాడి చేస్తున్న సమయంలో మన ప్రభుత్వాలు అవసరమైన కట్టుదిట్టాలు, చట్టాలు చేయకపోవడం సమస్య. ఫిర్యాదు చేసిన 24 గంటల్లో సోషల్ మీడియా సంస్థలు సదరు మార్ఫింగ్ కంటెంట్‌ను తొలగించాలన్న రూలు ఇప్పటికే ఉంది. కానీ, డీప్ ఫేక్‌లను ముందే అరికట్టే చర్యలు అవసరం. అమెరికా లాంటి చోట్ల అరకొర చట్టాలతోనైనా ఆపే ప్రయత్నం జరుగుతోంది. బ్రిటన్‌లో డీప్‌ఫేక్ అశ్లీల వీడియోల తయారీ చట్టరీత్యా నేరం. చైనాలో ఏకంగా నిషేధమే ఉంది. వీడియోను మార్చినా, మార్పు చేసిన వీడియో అని రాయాల్సిందే. యూరోపియన్ యూనియన్ లాంటివీ కఠిన నియమాల రూపకల్పనకు కిందా మీదా పడు తున్నాయి. మన దేశంలోనూ అలాంటి ప్రయత్నం తక్షణమే జరగాలి. బాహ్య ప్రపంచంలో లానే వర్చ్యువల్ లోకంలోనూ వనితలను లక్ష్యంగా చేసుకొని, వారిపై సాగుతున్న ఈ హేయమైన దాడిని అడ్డకుంటే అది సభ్య సమాజానికే అవమానం. -
రష్మిక ఫేక్ వీడియో : సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం మరోసారి రెడ్ సిగ్నల్
న్యూఢిల్లీ: తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి నటి రష్మిక మందన్నకు చెందినడీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66డీ ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష, జరిమానా తప్పదంటూ రిమైండర్ జారీ చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో డీప్‌ఫేక్‌లకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను, ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను తాజా సర్క్యులేషన్లో మరోసారి గుర్తు చేసింది. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66డీ ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి ఎవరైనా వ్యక్తుల పట్ల మోసపూరితంగా వ్యవహరించినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా నేరం రుజువైతే మూడేళ్ల దాకా జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది. ప్రభుత్వం, లేదా బాధిత వ్యక్తులు కోరిన వెంటనే సోషల్ మీడియా వెబ్ సైట్లు ఆయా కంటెంట్ వివరాలను 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుంది. IT మధ్యవర్తి నియమాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు 10 రకాల కంటెంట్‌కి సంబంధించిన పోస్టులను తప్పక తొలగించాలి. ముఖ్యంగా దేశ సమగ్రత, శాంతి భద్రతలు, సార్వభౌమత్వం, విదేశాలతో సంబంధాలు, ఇతర దేశాలను అవమానించడం, నేరాలకు పాల్పడేందుకు ప్రోత్సహించే చర్యలు, ఒక వ్యక్తి లేదా ప్రభుత్వాన్ని కించపర్చేలా మాట్లాడడం నేరంగా పరిగణిస్తారు. అలాగే అసభ్యకరమైన కంటెంట్, లింగ విద్వేషం రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల ప్రైవసీని దెబ్బ తీసే కంటెంట్, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేలా ప్రోత్సహించడం, జాతి, మతం, రంగును అవమానించడం, భారతీయ చట్టాలలో నేరంగా వెల్లడించిన పనులను ప్రోత్సహించే కంటెంట్ వంటివి ఎవరైనా పోస్ట్ చేస్తే వాటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రభుత్వం కోరితే ఆ సమాచారాన్ని ముందుగా పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో స్పందించిన కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులకు భద్రత, విశ్వాసం కల్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇవ్వడం తోపాటు ఇలాంటి ఫేక్ వీడియోపై సోషల్ మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!
Deeply Disturbed Zara Patel Reacts: నటి రష్మిక మందన్న వైరల్ డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన ఒరిజినల్ వీడియో బ్రిటిష్-ఇండియన్ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్‌దే. ఈ నేపథ్యంలో తన ఫేస్‌తో రష్మిక ముఖంతో ఏఐ ద్వారా క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియో వివాదంపై జారా పటేల్ స్పందించారు. ఈ సంఘటన తనను చాలా ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ సంఘటనతో ఇంటర్నెట్లో మహిళలు, అమ్మాయిల భద్రతపై మరింత ఆందోళన కలుగుతోందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ నటి ముఖాన్ని ఉపయోగించి ఎవరో డీప్‌ఫేక్ వీడియోను రూపొందించినట్లు తన దృష్టికి వచ్చిందనీ, ఈ వీడియోతో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఫేక్ వీడియో చూసి చాలా ఆందోళన చెందాను అంటూ జారా పటేల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా రష్మికకు తను సానుభూతిని ప్రకటించారు. ఇకపై సోషల్ మీడియాలో యువతులు, మహిళలు ఏదైనా పోస్ట్ చేయాలంటేనే భయపడాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇంటర్నెట్లో వస్తున్న ప్రతీదీ నిజం కాదు. దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అంటూ ఆమె నెటిజన్లుకు సూచించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్) కాగా సంచలనం రేపిన టాలీవుడ్ నటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరో భయంకర కోణంపై ఆందోళన రాజేసింది. సోషల్ మీడియాలో బిగ్‌బీ, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ) హీరోయిన్లు, సెలబ్రిటీ మహిళలతోపాటు, సాధారణ మహిళలు, టీనేజ్ అమ్మాయిల ఉనికికి ముప్పుగా మారుతోందంటూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (రష్మిక డీప్ ఫేక్ వీడియో : ఎమ్మెల్సీ కవిత రియాక్షన్) -
మొన్న సమంత..నేడు రష్మిక.. స్టార్ హీరోయిన్లే టార్గెట్!
ఇది టెక్నాలజీ యుగం. సాంకేతిక అభివృద్ధి కారణంగా అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా ఊహించని పనులు జరుగున్నాయి. అదే సమయంలో కత్తికి రెండు వైపుల పదును అన్నట్లుగా.. ఇదే టెక్నాలజీ కొన్ని తప్పుడు పనులు కూడా చేయిస్తుంది. కొంతమంది ఏఐ సహాయంతో నకీలీ ఫోటోలు, వీడియోలను సృష్టించి పలువురు ప్రముఖుల పరవును బజారున పడేస్తున్నారు. మార్ఫింగ్ టెక్నాలజీ సినీ హీరోయిన్లను ఇబ్బందులకు గురి చేస్తుంది. అసభ్యకరమైన వీడియోలకు.. స్టార్ హీరోయిన్ల ముఖాలను మార్ఫింగ్ చేసి..వాటిని సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. తాజాగా రష్మిక మందన్నకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాను కుదిపేసింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ వీడియోపై చర్చించింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సైతం ఈ ఫేక్ వీడియో పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: రష్మిక మందన్న ఫేక్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగ చైతన్య) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఏది నకిలీదో ఏది ఒరిజినలో గుర్తుపట్టడం కష్టంగా మారింది. ఈ టెక్నాలజీని వాడుకొని గతంలో సమంత, సాయి పల్లవి, కాజల్ అగర్వాల్, కత్రినా కైఫ్, తమన్నా బాటియా లాంటి స్టార్ హీరోయిన్ల ఫోటోలను మార్పింగ్ చేసి ఫేక్ వీడియోలు సృష్టించారు. మహేశ్‌బాబు గుంటూరు కారం సినిమా పోస్టర్ని సైతం ఏఐ సహాయంతో సృష్టించి, సోషల్ మీడియలో సర్కులేట్ చేశారు. పలువురు హీరోయిన్ల ఫోటోలను మార్పింగ్ చేసి అశ్లీల వీడియోలను రూపొందిస్తున్నారు. (చదవండి: ఇదే అప్పుడు జరిగి ఉంటే.. ఊహించుకుంటేనే భయంగా ఉంది: రష్మిక) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి స్టార్ హీరోయిన్ల నగ్న ఫోటోలను సృష్టించి, నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. రష్మికలాగే రేపు మరో హీరోయిన్ కూడా ఇలాంటి ఫేక్ వీడియోల బారిన పడొచ్చు. ఈ డిజిటల్ యుగంలో నకిలీ వీడియోలను, ఫోటోలను కట్టడి చేయడం సవాలే అయినా..ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తే కొంతవరకు అయినా తగ్గించే అవకాశం ఉంటుంది. -
రష్మిక డీప్ ఫేక్ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్
నటి రష్మిక్ డీప్ ఫేక్ వీడియో ఉదంతం, ఫేక్ న్యూస్, తప్పుడు వీడియోలు, ఫోటోలపై పెద్ద చర్చకు దారి తీస్తోంది. అభ్యంతరకరంగా మార్ప్ చేసిన రష్మిక వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు స్వయంగా బిగ్‌బీ దీనిపై ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు సాక్షాత్తూ కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. ఇది చాలా ప్రమాదకరంగా పరిణ మిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రమంత్రి సోషల్ మీడియా సంస్థలకు కీలక హెచ్చరికలు కూడా జారీ చేశారు. తాజాగా ప్రముఖ గాయని, మీటూ ఉద్యమానికి భారీ మద్దతిచ్చిన చిన్మయి శ్రీపాద కూడా ఎక్స్ (ట్విటర్)లో స్పందించారు. డీప్ ఫేక్ వీడియో రష్మిక ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశాను. ఈ వీడియోతో నిజంగా ఆమె కలవరపడుతునట్టు కనిపిస్తోందన్నారు. ప్రతిరోజూ మహిళల శరీరాలు దోపిడీకి గురవుతున్న దేశంలో, అమ్మాయిలను వేధించేందుకు ఒక సాధనంగా మారుతోంది... వారిని భయపెట్టేందుకు, బ్లాక్మెయిల్ చేసేందుకు, లైంగికంగా దాడి చేసేందుకు కూడా తీవ్రమైన ఆయుధంగా డీప్ ఫేక్స్ మారబోతోందన్నారు. అలాగే అమ్మాయిల గౌరవానికి ప్రమాదంగా మారిన ఏఐ, డీప్ ఫేక్ లాంటి వాటిపై అవగాహన లేని చిన్న గ్రామం లేదా పట్టణాల్లోని కుటుంబాల పరిస్థితి ఏంటి? అంటూ చిన్మయి ప్రశ్నించారు. ఈ సందర్భంగా జైలర్ సినిమాలోని సెన్సేషనల్ ‘నువ్వు కావాలయ్యా’ పాట విడుదల తరువాత వచ్చిన ఒకప్పటి హీరోయిన్ సిమ్రన్ ఫేక్ వీడియోను ప్రస్తావించారు. ఏఐ మాయ అంటూ సిమ్రన్ ఇన్‌స్టాలో షేర్ చేసేదాకా దాదాపు ఎవ్వరికీ దీని గురించి తెలియదు.. అంటూ ఈ ఫేర్ వీడియో గురించి చిన్నయి గుర్తు చేశారు. అంతేకాదు డీప్‌ఫేక్‌ల ప్రమాదం, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేలా సాధారణ ప్రజలకు , బాలికలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్త ప్రచారాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మార్పింగ్ ఫోటోలతో అమ్మాయిలను, మహిళా రుణ గ్రహీతలను వేధిస్తున్న లోన్ యాప్‌ల అరాచకాలను ఆమె ప్రస్తావించారు. ఎంతో కొంత పరిజ్ఞానం, శిక్షణ ఉంటే తప్ప డీప్ ఫేక్ను సాధారణ ప్రజలు గుర్తించడం కష్టం అంటూ తప్పుడు కథనాలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను మరోసారి నొక్కి చెప్పారు. Several months ago, a video of one of our most favourite actors in an AI avatar performed to Kaavaalaa from Jailer released - only it wasn’t her. It was a Deep Fake. Nobody knows for sure whether Ms Simran had consented in advance to her likeness to be used in the Deep Fake AI… — Chinmayi Sripaada (@Chinmayi) November 6, 2023 View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) -
రష్మిక డీప్ ఫేక్ వీడియో : ఎమ్మెల్సీ కవిత రియాక్షన్
Rashmika Mandanna AI deepfake video టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియోపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆన్లైన్లో అత్యంత సులువుగా వ్యాప్తి చెందుతున్న మానిప్యులేషన్స్‌కు ఇదొక తీవ్ర హెచ్చరిక లాంటిదంటూ రష్మిక టార్గెట్‌గా వచ్చిన డీప్ ఫేక్ వీడిమోపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ బెదిరింపుల నుంచి భారతీయ మహిళలను రక్షించేలా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందు కోసం ప్రత్యేక పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి, సమగ్ర చర్యలు తీసుకోవాలంటూ కవిత సోమవారం ట్వీట్ చేశారు. అలాగే వీటిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఐటీ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌తోపాటు మరో కేంద్రం రాజీవ్ చంద్రశేఖర్‌కి విజ్ఞప్తి చేశారు. పనిలో పనిగా సుదీర్ఘ ప్రసంగాలు తరువాత కాంక్రీట్ చర్యలు కావాలంటూ కేంద్ర సర్కార్‌పై చురకలు వేశారు. రష్మికాకు సంబంధించిన అభ్యంతరకరమైన ఫేక్‌వీడియో ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. ఇలాంటి నకిలీ వీడియోలపై తక్షణమే చర్యలు చేపట్టాలని పలువురు ప్రముఖులతోపాటు, నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ) రష్మిక ఆవేదన అటుఇన్స్ట్రాగ్రామ్ వేదికగా రష్మిక తన స్పందన తెలిపారు. డీప్‌ఫేక్ వీడియో విచారం వ్యక్తం చేసిన ఆమె టెక్నాలజీ మిస్ యూజ్ అవుతోందనీ, ఇది తనోపాటు పాటు చాలామందిని బాధపెడుతోందంటూ ఒక పోస్ట్ పెట్టారు. దీనిపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందున్నారు. అలాగే తనకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం మరింతగా న్యాయపోరాటం చేసేందుకు కవిత సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీం కోర్టులో ఈ అంశంపై పెండింగ్ లో ఉన్న పిటిషన్ లో ఇంప్లీడ్ అవుతామని ఇటీవల కవిత ప్రకటించిన సంగతి తెలిసిందే. Recent deepfake targeting Actor Rashmika Mandanna exposes the alarming ease of narrative manipulation online. Urgent action is needed to safeguard Indian women from cyber threats. I appeal to Hon’ble President @rashtrapatibhvn, Hon’ble PM @narendramodi, Minister of Electronics… — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 6, 2023 -
ఇదే అప్పుడు జరిగి ఉంటే.. ఊహించుకుంటేనే భయంగా ఉంది: రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎవరిదో వీడియోను డీప్ ఫేక్ టెక్నాలజీ సాయంతో మార్ఫింగ్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మిక ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలా చేయడాన్ని సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. బాధ్యులను తగిన విధంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సైతం ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. (ఇది చదవండి: రిసెప్షన్లో లావణ్య ధరించిన చీర చాలా స్పెషల్.. ధర ఎంతో తెలుసా..?) అయితే తాజాగా నెట్టింట వైరలవుతున్న వీడియో పట్ల రష్మిక మందన్నా స్పందించింది. టెక్నాలజీని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తలుచుకుంటే నిజంగా భయంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. ట్వీట్లో రష్మిక ప్రస్తావిస్తూ..' ఇలాంటి విషయం గురించి మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. ఆన్లైన్లో వైరల్ అవుతున్న నా డీప్‌ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఇలాంటివి నాకే కాదు..టెక్నాలజీని దుర్వినియోగం అవుతున్న ఈ కాలంలో ప్రతి ఒక్కరికి చాలా భయంగా ఉంటుంది. ఈ రోజు నేను ఒక మహిళగా, నటిగా మాట్లాడుతున్నా. నాకు మద్దతుగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. కానీ నేను స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే.. దీన్ని ఎలా తట్టుకోలగనో నా ఊహకు అందడం లేదు. ఇలాంటి వాటి బారిన మనలో ఎక్కువ మంది పడకముందే ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలి.' అంటూ ట్వీట్లో రాసుకొచ్చింది. ఇప్పటికే ఈ ఫేక్ వీడియోను అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు ఖండించారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. (ఇది చదవండి: సలార్ ట్రైలర్ విడుదల తేదీ లాక్..?) I feel really hurt to share this and have to talk about the deepfake video of me being spread online. Something like this is honestly, extremely scary not only for me, but also for each one of us who today is vulnerable to so much harm because of how technology is being misused.… — Rashmika Mandanna (@iamRashmika) November 6, 2023 -
#RashmikaMandanna: ట్రెండింగ్‌లో రష్మిక మందన్న (ఫోటోలు)
-
ఫేక్ అరెస్ట్ వీడియో.. నటిపై క్రిమినల్ కేసు నమోదు
ఉర్ఫీ జావెద్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే ఆమె పాపులారిటీ సంపాదించుకుంది. విచిత్రమైన డ్రెస్సులు ధరించి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తు అభిమానులను అలరిస్తుంది. ఆమెకు ఉన్న వింత ఫ్యాషన్ పిచ్చి కారణంగా అప్పుడప్పుడు విమర్శల పాలవుతుంటుంది. కొన్నిసార్లు అయితే ఆమె షేర్ చేసే ఫోటోలు కాంట్రవర్సీకి దారి తీస్తాయి. ఈ మధ్యే ఆమె భూల్ భులయ్యలోని ఛోటా పండిత్ పాత్ర గెటప్‌లో ఫోటో షూట్ చేసి.. వాటిని నెట్టింట్లో పెట్టగా..ఓ వర్గం బెదిరింపులకు దిగింది. ఆ ఫోటోలు డిలీట్ చేయకపోతే చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగారు. అయినప్పటికీ.. ఉర్ఫీ మాత్రం వాటిని తొలగించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఉర్ఫీ షేర్ చేసిన ఓ వీడియా కారణంగా..ఆమెపై కేసు నమోదైంది. ఏం జరిగింది? తనను ముంబై పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ఉర్ఫీ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఓ కేఫ్ వద్ద ఉర్ఫీని ఇద్దరు మహిళా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ఉంది. నన్నుందుకు అరెస్ట్ చేస్తున్నారని ఉర్ఫీ ప్రశ్నించగా.. ‘చిన్న చిన్న దుస్తులు ధరించి ఎవరైనా తిరుగుతారా? అంటూ పోలీసులు ఫైర్ అవుతున్నారు. కాసేపు వాదనలు జరిగాక.. ఉర్ఫీ వెళ్లి పోలీసు వాహనంలో ఎక్కింది. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ‘చిన్న దుస్తులు ధరిస్తే అరెస్ట్ చేస్తారా’ అని నెటిజన్స్ ముంబై పోలీసులను ట్రోల్ చేశారు. ఫేక్ వీడియో.. కేసు నమోదు అయితే ఉర్ఫీని అరెస్ట్ చేసినట్లు వచ్చిన వీడియో ఫేక్‌ది. ప్రచారం కోసం ఉర్ఫీనే ఆ వీడియో రెడీ చేయించుకుంది. ముంబై పోలీసులు స్పందించేవరకు ఆ విషయం బయటకు రాలేదు. వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. ఉర్ఫీని అరెస్ట్ చేసింది నకిలీ పోలీసులని విచారణలో తేలింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఉర్ఫీతోపాటు, వీడియోలో ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పబ్లిసిటీ కోసం ఇలా చట్టంతో ఆటలాడటం మంచిదికాదని అన్నారు. ఈ వీడియోలో పోలీస్ యూనిఫాం, సింబల్స్‌ను దుర్వినియోగపరిచినందుకు గానూ వారిపై ఐపీసీ 171, 419, 500, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు -
ఏఐ టెక్నాలజీతో పుట్టుకొస్తున్న ఫేక్‌న్యూస్, ఇలా గుర్తించండి
నిజం నిలబడి ఉండగానే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందంటారు.. ఈ సామెత సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పుట్టుకువచ్చే ఫేక్‌న్యూస్ విషయంలో సరిగ్గా సరితూలుతుంది. ఈ ఫేక్ న్యూస్ వల్ల నిజమేదో తెలుసుకోవడం కష్టంగా మారింది. అబద్దాన్ని నిజం అనుకునే ప్రమాదమూ ఉంటోంది. అలాగే.. ఫొటోలు, వీడియోలు కూడా ఫేక్‌వి పుట్టుకొస్తున్నాయి. లైవ్ వీడియోలోనూ ఇటీవల ఏఐ టెక్నాలజీ ద్వారా అబద్ధం కొత్తగా సోషల్‌మీడియాను ఏలుతోంది. నిజమేంటో తెలుసుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటోంది. ఎందుకంటే, అబద్దాల వల్ల కలిగే మోసాలు ఎన్నో. వాటి బారిన పడకుండా జాగ్రత్త పడాలంటే ముందుగా నిజాలేమిటో తెలుసుకుందాం... వార్తలకు సంబంధించిన సమాచారం, డేటా, నివేదికలు పూర్తిగా నిజమైనవి కానివి ప్రజల ముందుకు వస్తున్నాయి. అందుకని, మూలాధారాలు లేకుండా వచ్చిన సమాచారం అవాస్తవం అని గ్రహించాలి. అబద్ధపు వార్తలు విస్తృతంగా షేర్ అవుతుంటాయి. వీటికి ఎలాంటి సెన్సార్షిప్ ఉండదు. నకిలీ వార్తల పుట్టుకకు.. తమకు తెలిసిన విషయాన్ని నలుగురికి తెలియజేయాలనే ఆత్రుత. స్వీయ లాభం, రాజకీయ ప్రభావం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. కేవలం తమకు తెలిసినవి మరికొందరికి తెలియజేద్దామని నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు అదేపనిగా షేర్ చేస్తుంటారు. సమాచారం అబద్ధమే కావచ్చు కానీ, దానిని షేర్ చేసే వ్యక్తి అది నిజమని నమ్ముతారు. తప్పుడు సమాచారం అని తెలిసీ ఉద్దేశపూర్వకంగానే షేర్ చేస్తారు. ఏదైనా సమస్యకు లేదా వ్యక్తికి సంబంధించిన కంటెంట్ అబద్ధమైతే మనల్ని ఆ వార్త తప్పుదారి పట్టించవచ్చు. ముఖ్యాంశాలు, విజువల్స్, క్యాప్షన్లు కంటెంట్‌కు సరిపోని విధంగా ఉంటాయి. మోసగించడానికి ఫొటోలు, కంటెంట్‌ను తారుమారు చేస్తుంటారు. తనిఖీ చేసే విధానం.. ►వీడియో మూలం ఎక్కడ ఉందో చెక్ చేయాలి. అది విశ్వసనీయమైనదే అని నిర్ధారించుకోవడానికి ప్రయత్నించాలి. ►సమాచారం నిజమైనదైనా ప్రత్యామ్నాయంగా ఇతర మూలాధారాల కోసం వెతకాలి. ► వీడియోలో అసహజమైన కదలికలు ఉన్నాయేమో గమనించాలి. ► డీప్ ఫేక్స్ గుర్తించడానికి ‘డీప్ ఫేక్ డిటెక్షన్ మోడల్’ వంటి స్పెషల్ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ► వీడియోలోని సంఘటనలు నమ్మదగినవేనా? ఆ వీడియో ఏ సందర్భాన్ని బట్టి తీశారో ఆ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. ► వీడియోలో ఉన్న వ్యక్తిని మెయిల్, ఫోన్ ద్వారా సంప్రదించి, ప్రామాణికతను ధృవీకరించుకోవడానికి ప్రయత్నించవచ్చు. వాస్తవం తెలుసుకోవాలంటే.. గూగుల్ రివర్స్ ఇమేజ్ చెక్ చేయాలి. లేదా ఫొటో వెరిఫికేషన్ కోసం www.tineye.comని ఉపయోగించాలి. ఫొటో లేదా వీడియో (https://www.invid-project.eu/tools-and-services/invid-verification-plugin/) కోసం ఇన్విడ్ టూల్‌కిట్ ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేయాలి. ఫార్వర్డ్ చేసే ముందు ఏదైనా ఒక అంతర్జాతీయ ఫాక్ట్–చెకింగ్ నెట్వర్క్ ఆర్గనైజేషన్‌తో www.factly.in ని వాస్తవాన్ని చెక్ చేయాలి. ఇలా గుర్తించాలి... ►డీప్ ఫేక్ వీడియో లేదా అడియోలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో జాగ్రత్తగా పరిశీలించడం, వినడం చేయాలి. ► డీప్ ఫేక్ వీడియో లేదా ఫొటోలలో లైటింగ్ నీడలను చెక్ చేయాలి. కొన్నింటిలో నీడలు కచ్చితంగా కనిపించకపోవచ్చు. ► ఇవే కాకుండా ఇంకేమైనా లోపాలు ఉన్నాయేమో చెక్ చేయాలి. వీడియోలలోని బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయాలి. ► సబ్జెక్ట్‌కు వీడియోలోని వ్యక్తుల కదలికల సరిపోలకపోవచ్చు. అంటే, ఎఐ టెక్నాలజీ ద్వారా నకిలీ వ్యక్తుల సృష్టి అయి ఉండవచ్చు. ► వీడియోలో వ్యక్తి కనురెప్పలు ఆర్పుతున్నారో లేదో పరిశీలించాలి. ► లైవ్ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు ముఖాన్ని ఎడమ లేదా కుడికి కదిలించమని సదరు వ్యక్తిని ఉద్దేశించి అడగాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వరదలపై మురికి మనసులు..బురద పనులు
-
నయా సైబర్ క్రైం.. డీప్ ఫేక్!
సోషల్ మీడియాలో ఫొటోలు, ఆడియో, వీడియోలు విరివిగా పోస్ట్ చేస్తుంటారా.. అయితే జరభద్రం.. సైబర్ నేరాల్లో కొత్తగా పుట్టుకొచ్చిన డీప్ ఫేక్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. వీడియోలో మీ ముఖమే కనిపిస్తూ ఉంటుంది... కానీ అది మీరు కాదు. ఆడియోలో మీ మాటలే వినిపిస్తూ ఉంటాయి... కానీ మాట్లాడేదీ మీరు కాదు. మీరు చేయని అభ్యంతరకరమైన పనులు కూడా మీరే చేసినట్లు మారుస్తారు.. ఎలాగంటే.. మీ వాయిస్, వీడియో, ఫొటోలను వినియోగించి అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి మీరే వీడియో కాల్ చేసినట్లు సృష్టిస్తారు. లేదంటే కిడ్నాప్ అయ్యాననో, అత్యవసరమనో మీ ఫేక్ వీడియోలు సృష్టించి వాటిలో చెప్పిస్తారు. ఆ వీడియోలను కుటుంబీకులకు చూపించి అందినకాడికి దండుకుంటారు. ఈ నేరాలు ఘోరాలు చేసేందుకు అవసరమైన ఫోన్ నంబర్లు, వివరాలన్నీ తెలుసుకునేందుకు నేరగాళ్లు పెద్ద కష్టపడక్కర లేదు.. కేవలం మన సోషల్ మీడియా ఖాతాల నుంచే సంగ్రహిస్తున్నారు.. సాక్షి, హైదరాబాద్: ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా జరుగుతున్న సరికొత్త సైబర్ నేరమే డీప్ ఫేక్. ఈ నయా తరహా సైబర్ నేరాలు పాల్పడేందుకు నేరగాళ్ళకు అవసరమైన డేటా డార్క్ వెబ్‌తో పాటు సోషల్ మీడియాలో తేలిగ్గా లభిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు, ఆడియో, వీడియోలను సంగ్రహిస్తున్న ఈ–కేటుగాళ్ళు వాటిని సేకరిస్తున్నారు. డార్క్ వెబ్ సహా ఇంటర్నెట్ నుంచి ఖరీదు చేసిన టూల్స్ వినియోగించి సింథసిస్ ప్రక్రియ చేయడుతున్నారు. ఇది కేవలం నేరగాళ్ళు మాత్రమే కాదు... సాంకేతికతపై పట్టున్న వాళ్లు కూడా చేస్తున్న వ్యవహారం కావడం ఆందోళన కలిగించే అంశం. ఈ నయా సైబర్ క్రైం డీప్ ఫేక్‌తో బాధితులు ఆర్థికంగా నష్టపోవడమే కాదు... కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళుతోంది. యువతీ యువకులతో పాటు మధ్య వయస్సుల్లో జరుగుతున్న ‘కారణం తెలియని’ సూసైడ్స్‌కి ఈ సింథసిస్ ప్రక్రియ కూడా ఓ కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్లాంక్ వీడియో కాల్స్‌తో... సెక్సార్షన్ నుంచి ఎక్సార్షన్ వరకు వినియోగం... ఇటీవల కాలంలో అనేకమందికి వర్చువల్ నంబర్ల నుంచి బ్లాంక్ వీడియో కాల్స్ వస్తున్నాయి. వీటిని స్పందించి ఫోన్ ఎత్తితే.. అవతలి వారు కనిపించరు, మాట్లాడరు. ఎవరు కాల్ చేశారో తెలుసుకోవడానికి కొద్దిసేపు ఫోన్లో ప్రశ్నిస్తుంటాం. ఆ సమయంలో సైబర్ నేరగాళ్ళు రిసీవర్ వీడియో రికార్డు చేస్తారు. దీన్ని అశ్లీల వీడియోలతో సింథసిస్ చేసి వాళ్ళే ఆ వీడియోలో ఉన్నట్లు రూపొందిస్తారు. ఈ వీడియోను చూపించి బాధితుడిని భయపెట్టి వీలున్నంత దండుకుంటారు. ప్రధానంగా యువకులు, మధ్య వయసు్కలే ఈ నేరంలో టార్గెట్‌గా మారుతున్నారు. నేరగాళ్ళే కాదు అవసరార్థులూ వాడేస్తున్నారు.. ఈ సింథసిస్ ప్రక్రియను సైబర్ నేరగాళ్ళతో పాటు మరికొందరూ వాడేస్తున్నారు. ఆన్లైన్ ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువత కూడా సింథసిస్ టెక్నిక్ వాడి అడ్డదారిలో గట్టెక్కుతోంది. బ్యాంకులు, ఇతర సంస్థలకు వీడియో అథెంటికేషన్ చేయాల్సిన వచ్చినప్పుడూ ఈ ప్రక్రియ వాడుతున్నారు. ఈ కారణంగానే ఇటీవల కార్పొరేట్ సంస్థలు ఆన్లైన్ ఇంటర్వ్యూలను రికార్డు చేస్తూ, అభ్యర్థిని హెచ్ఆర్కు పిలిచి పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్ని మోసం చేయడానికి వీడియో సింథసిస్ వినియోగిస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. భర్త గొంతును రికార్డు చేసి.. వేధిస్తున్నట్టు మార్చి... మనస్పర్ధల నేపథ్యంలో తన భర్తపై ఫిర్యాదు చేయాలని భావించిన ఓ భార్య వాయిస్ సింథసిస్ టెక్నిక్ వాడారు. తన భర్త గొంతును రికార్డు చేసి తనను దూషిస్తున్నట్లు, వేధిస్తున్నట్లు మార్చేశారు. ఆ రికార్డునే ఆధారంగా చూపించి భర్తపై ఆరోపణలు చేశారు. అయ్యో తాను అసలు అట్లా మాట్లాడలేదంటూ భర్త గోడువెళ్లబోసుకోవడంతో కౌన్సెలింగ్ చేసిన పెద్దల విచారణలో అసలు విషయం బయటపడింది. ఆ వీడియోలు చూడగానేతొందరపడొద్దు.. ఈ సింథసిస్ ప్రక్రియను ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లోనూ పూర్తి స్థాయిలో నిర్థారించడం సాధ్యం కావట్లేదు. కొన్ని అభ్యంతరకర అంశాలకు సంబంధించి తమ వారికి సంబంధించిన వీడియోలు, ఆడియోలను చూసిన కుటుంబీకులు తొందర పడకూడదు. అవి ఆడియో–వీడియో సింథసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యాయేమోనని అనుమానించాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్‌ను వర్తింపజేయాలి. బాధితులుగా మారిన వారికి దన్నుగా ఉంటే ఒంటరితనం, కుంగిపోవడం జరగక ఆత్మహత్యలు వంటి వాటికి ఆస్కారం ఉండదు. – పెండ్యాల కృష్ణశాస్త్రి, సైబర్ నిపుణుడు -
నకిలీ వీడియో కేసు.. పోలీసుల కస్టడీలో యూట్యూబర్!
చెన్నై: తమిళనాడులోని బీహార్ వలస కార్మికులపై దాడులు చేశారంటూ నకిలీ వీడియోలను పోస్ట్ చేసిన కేసులో యూట్యూబర్ మనీష్ కశ్యప్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని మధురై కోర్టు ముందు హాజరుపరచగా.. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం న్యాయస్థానం కశ్యప్‌కు మూడు రోజుల కస్టడీని విధించింది. మార్చి 18న జగదీష్పూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన తర్వాత బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOU) కశ్యప్‌ను అరెస్టు చేసింది. పోలీసుల ప్రత్యేక బృందం ట్రాన్సిట్ రిమాండ్‌పై బీహార్ నుంచి తమిళనాడుకు తీసుకువచ్చింది. నకిలీ వీడియోలను వ్యాప్తి చేసినందుకు అతనిపై మధురైలో నమోదైన ఫిర్యాదు ఆధారంగా, అతనిపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇటీవల, తమిళనాడులో వలస కార్మికులపై దాడికి గురైన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఫ్యాక్ట్ చెక్ కమిటీ, పోలీసు శాఖ ద్వారా ఈ వీడియోలు ఫేక్ అని తేలింది. దీంతో వెంటనే అతనిపై చర్యలు తీసుకున్నారు. వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోల అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇటువంటి పుకార్లను వ్యాప్తి చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో అవసరమైన అన్ని సహాయాన్ని వలస కార్మికులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. -
ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్‌తో టీడీపీ మరోసారి దొరికిపోయింది: ఎంపీ గోరంట్ల మాధవ్
-
Gorantla Madhav: చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్
సాక్షి, అనంతపురం: ఫేక్ వీడియోపై తెలుగుదేశం పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు అమెరికా నుంచి దొంగ సర్టిఫికెట్ తెప్పించున్నాడని ధ్వజమెత్తారు. టీడీపీ సర్క్యూలేట్ చేస్తున్న సర్టిఫికెట్ తాము ఇచ్చింది కాదని ఎక్లిప్స్ సంస్థ ప్రకటించిందని వెల్లడించారు. ఈ మేరకు అనంతపురంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఒకసారి ఆలోచించండి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. ఓటుకు నోటు కేసుపై ఎల్లో మీడియాలో ఏనాడైనా చర్చలు పెట్టారా?. ముఖ్యమంత్రి పదవి కాపాడుకునేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతి వచ్చారు. చదవండి: (టీడీపీ మరో కుట్ర.. ఆ ప్రచారం నమ్మొద్దు) ఆడపిల్ల కనిపిస్తే ముద్దాయినా పెట్టాలి.. లేదంటే కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎల్లో మీడియా ఎందుకు చర్చకు పెట్టలేదు?. లోకేష్ అశ్లీల చిత్రాలపై చర్చ ఎందుకు పెట్టరు?. ఫేక్ వీడియో తీసుకొచ్చి బీసీ ఎంపీపై కక్ష సాధిస్తారా?. చంద్రబాబు, ఎల్లో మీడియాది కుల దురహంకారం కాదా?’ అంటూ ఎంపీ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ 'ఓటుకు నోటు కేసులో ఆ వాయిస్ తనది కాదని చంద్రబాబు ప్రమాణం చేయగలరా? అని ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. పట్టుబడిన రూ.50 లక్షల లంచం తనది కాదని చెప్పగలరా అని నిలదీశారు.చంద్రబాబు మనసూస్పర్తిగా కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేస్తే.. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. చదవండి: (ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్) -
బాబు జీవితమంతా గ్రాఫిక్సే: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: నాడు టీడీపీ అధికారంలో ఉండగా రాజధాని అమరావతిపై గ్రాఫిక్స్ సృష్టించిన చంద్రబాబు నేడు వైఎస్సార్సీపీ నాయకులపై గ్రాఫిక్స్ సృష్టిస్తూ ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. ఆయన జీవితమంతా గ్రాఫిక్సేనని ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఫేక్ వీడియో రూపొందించింది టీడీపీనేనని ఇప్పుడు తేటతెల్లమైందని స్పష్టం చేశారు. కుట్ర రాజకీయాలకు చంద్రబాబు దేశంలోనే ఒక చిరునామా అని తెలిపారు. నాడు ఎన్టీ రామారావును సీఎం పదవి నుంచి దింపడం కోసం లక్ష్మీపార్వతిని సాకుగా చూపి కుట్ర చేశారన్నారు. ప్రతి ఒక్కరిని మోసం చేసి, ఎదగాలనుకోవడం చంద్రబాబు నైజం అని ధ్వజమెత్తారు. ‘ఎంపీ మాధవ్‌పై టీడీపీ వారే ఒక ఫేక్ వీడియో రూపొందించారు. వారే విదేశాలకు పంపి అప్లోడ్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేసి, వారే ట్రోల్ చేశారు’ అని మండిపడ్డారు. ఇందుకు కారకులైన టీడీపీ నేతలందరిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాపు ఉద్యమంలో ముద్రగడ కుటుంబాన్ని హింసిస్తే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని మంత్రి ప్రశ్నించారు. ఇదీ చదవండి: ‘టీడీపీ పెద్ద ఫేక్.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబూ ఫేక్’ -
టీడీపీ కుట్ర బట్టబయలు: మంత్రి కారుమూరి
తణుకు అర్బన్: ఆ ఫోరెనిక్స్ రిపోర్టు తాను ఇచ్చింది కాదని అమెరికాలోని ల్యాబ్‌కు చెందిన జిమ్ స్టాఫర్డ్ స్వయంగా స్పష్టం చేయడంతో టీడీపీ కుట్ర బట్టబయలైందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. రిపోర్టును మార్చడానికి ఆయన సమ్మతించక పోవడంతో ఏకంగా సర్టిఫికెట్‌నే మార్చడం టీడీపీ దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని తన నివాసంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనను ఇబ్బంది పెట్టారని ఏ మహిళా.. ఎటువంటి ఫిర్యాదు చేయకపోయినా ఒక మార్ఫింగ్ వీడియోతో చంద్రబాబు అండ్ కో నీచ రాజకీయాలకు తెరతీశారని దుయ్యబట్టారు. సాంకేతికతను ఉపయోగించుకుని కుట్రలకు తెరతీయడంలో దిట్ట అయిన చంద్రబాబు, లోకేశ్ గ్యాంగ్ ఎంతటి నీచానికైనా ఒడిగడతారని మండిపడ్డారు. తప్పుడు రిపోర్ట్‌తో దొరికిపోయిన బాబు అండ్ గ్యాంగ్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆ వీడియో చూశామని టీడీపీకి చెందిన కొందరు మహిళలు సభ్యత మరచి.. అడ్డగోలుగా మాట్లాడుతుండడం పట్ల సభ్య సమాజం తల దించుకుంటోందని అన్నారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేస్తున్న లోకేశ్ చిత్రాలు చూసి కూడా ఏమీ మాట్లాడని చంద్రబాబు అండ్ కోను ఏమనుకోవాలని నిలదీశారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆయన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: ‘టీడీపీ పెద్ద ఫేక్.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబూ ఫేక్’ -
‘టీడీపీ పెద్ద ఫేక్.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబూ ఫేక్’
కొత్తపేట: ‘తెలుగుదేశం పార్టీ పెద్ద ఫేక్.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడూ ఫేక్.. అలాంటి బాబుకు ఫేక్ ప్రచారం చేయడం అలవాటే’ అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ అయినప్పటికీ, అది ఒరిజినల్ అంటూ.. అమెరికాలోని ఓ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఇచ్చిందంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తుండటంపై తీవ్రంగా మండిపడ్డారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన టీడీపీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. గోరంట్ల మాధవ్ ఫేక్ వీడియోను పట్టుకుని.. ఒక ఫేక్ సర్టిఫికెట్ సృష్టించుకుని గవర్నర్ దగ్గరకు వెళ్లటం దారుణం అని చెప్పారు. ‘వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేయడం టీడీపీకి అలవాటుగా మారింది. అది ఒరిజినల్ కాదని అమెరికాలోని ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ వారే స్వయంగా ఈ మెయిల్ ద్వారా తెలిపారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరుతున్నాం’ అని తెలిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ఏ విధంగా టీడీపీకి ఫేక్ అధ్యక్షుడయ్యారో అందరికీ తెలుసని చెప్పారు. ఇదీ చదవండి: ఫేక్ రిపోర్ట్.. ఫేక్ పార్టీ.. ఫేక్ లీడర్ -
టీడీపీ మరో కుట్ర.. ఆ ప్రచారం నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేతలు ప్రతీరోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల, మతాల పేరుతో చంద్రబాబు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఆయనకు తోడు ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ‘‘గోరంట్ల మాధవ్‌పై ఫేక్ వీడియో ప్రచారం చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ అంటూ మరో కుట్ర చేశారు. గోరంట్ల వీడియోపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫేక్ వీడియోతో పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే టీడీపీ ప్రయత్నం చేస్తోందని’’ కొడాలి నాని మండిపడ్డారు. చదవండి: ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ‘‘వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు. ఫేక్ డాక్యుమెంట్‌ను స్పష్టించి దుష్ప్రచారానికి తెరలేపారు. మహిళలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు రాజకీయంగా దిగజారిపోయారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీకి ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారు. తన రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారు. ఓ జిల్లాకు బిఆర్ అంబేద్కర్ పేరు పెడితే తప్పేముంది. పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓడిపోయినా బుద్ధి రాలేదు. పవన్.. చంద్రబాబుకు భజన చేస్తున్నారు. టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని’’ కొడాలి నాని అన్నారు. -
బలంగా ‘బాదినా’ బుద్ధి రాలేదా?
రాయదుర్గం: ‘ప్రజల సంక్షేమాన్ని విస్మరించినందుకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేసినా మీకు బుద్ధి రాలేదా..? ‘బాదుడే.. బాదుడు’ కార్యక్రమం పేరుతో వీధినాటకాలకు తెర తీస్తారా? పేదలపై వివక్ష, విద్వేషాలను రెచ్చగొట్టే ‘పచ్చ’ కుట్రలకు స్వస్తి పలకకపోతే 2024 ఎన్నికల్లో మూడు సీట్లు కూడా దక్కవు’ అంటూ మాజీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుపై రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం రాయదుర్గంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘పచ్చ బ్యాచ్’ ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం చేస్తుండడంపై మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క మంచి పనైనా చేశావా అంటూ కాలవను ప్రశ్నించారు. ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకునే నీకు ధరల పట్ల కనీస జ్ఞానం లేకపోవడం విచారకరమన్నారు. ‘పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలోని మొలకాల్మూరు, చిత్రదుర్గం, బళ్లారికి నాతో కలిసి నీవు, నీ పచ్చ బ్యాచ్, మీడియాతో వస్తే అక్కడ మీరు చెప్పిన దుకాణాల్లో నిత్యావసర ధరలు విచారిద్దాం.. ఆ తర్వాత రాయదుర్గం, అనంతపురం వచ్చి ఇక్కడెలా ఉన్నాయో బేరీజు వేద్దాం. ధరల్లో వ్యత్యాసం కనిపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా?’ అంటూ సవాల్ విసిరారు. రాజకీయ స్వార్థం కోసం ప్రజలను మోసం చేయాలని చూడొద్దని హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వ అభిమతమని, పేదలందరికీ కడుపునిండా అన్నం పెట్టాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని గుర్తుచేశారు. అసత్య ఆరోపణలు మానుకోకపోతే ‘చీపుర్లతో బాదుడు’ తప్పదని హెచ్చరించారు. సోషల్ మీడియా తోకలు కత్తిరిస్తాం.. ‘సొంత డబ్బుతో నిస్వార్థంగా సామాజిక సేవ చేస్తున్న నాపై విమర్శలు చేసినా సహించా. దీన్ని అలుసుగా తీసుకుని నా కుటుంబంపై అక్కసు వెళ్లగక్కుతూ అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టించేలా కుట్రలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు. ఖబడ్దార్’ అంటూ కాలవకు విప్ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ‘రెడ్‌క్రాస్ సంస్థకే వన్నె తెచ్చేలా జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి.. ఆపద సమయంలో ప్రజలకు రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే బాధ్యత సంస్థ చైర్‌పర్సన్‌గా కాపు భారతి తీసుకుంటే ప్రశంసించాల్సిందిపోయి.. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టిస్తావా..? ఇదా రాజకీయంలో నీవు నేర్చుకున్న నీతి’ అంటూ విరుచుకుపడ్డారు. అసభ్యకర పోస్టింగ్‌లపై ఇప్పటికే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు. అయినా పద్ధతి మార్చుకోకపోతే అభిమానులు, కార్యకర్తలు, ప్రజల ద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కాలవ శ్రీనివాసులు చీకటి బతుకు గురించి తెలిస్తే ప్రజలే ముఖాన ఉమ్మేస్తారని, పరిస్థితి అంతదాకా తెచ్చుకోవద్దని అన్నారు. నీతిమాలిన రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచావని దుమ్మెత్తి పోశారు. కరోనా లాంటి కష్టకాలంలో రోడ్డు మీదకొచ్చి తాము ప్రజలకు సేవ చేస్తే ప్రతిపక్ష పార్టీ నేతలు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. కులాలు, మతాల మధ్య కుంపట్లు పెట్టి ప్రశాంతంగా ఉండే రాయదుర్గాన్ని రావణకాష్టగా మార్చాలని చూస్తే సహించేది లేదన్నారు. మార్ఫింగ్ వీడియో పోస్టు చేయించి డ్రామాలా? బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో టీడీపీ ఆడిన డ్రామాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయని విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ‘ఐ– టీడీపీ’ అనే ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా అర్ధరాత్రి మారి్ఫంగ్ వీడియో పోస్ట్ చేసి నీచమైన కుట్రకు ఒడిగట్టి.. ఏదో జరిగిపోయిదంటూ డ్రామాలు ఆడతారా అంటూ నిలదీశారు. వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ చెబుతున్నా.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం తగదన్నారు. 2024 ఎన్నికలే టీడీపీకి ఆఖరివి కానున్నాయన్నారు. ఇందుకు చాలామంది టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరడమే నిదర్శనమన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు శ్రీనివాస్‌యాదవ్, వలిబాషా, వైఎస్సార్సీపీ పట్టణ కనీ్వనర్ ముస్తాక్, గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు పీఎస్ మహే‹Ù, మండల కనీ్వనర్ బోయ మంజునాథ, సీనియర్ నాయకుడు గొల్లపల్లి కాంతారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్) -
నెట్టింట్లో అంజలి అసభ్యకర వీడియో వైరల్.. కన్నీరు పెట్టుకున్న నటి
సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్‌తో ఎంతో మంది స్టార్లు అయ్యారు. అలాంటి వారిలో అంజలి అరోరా ఒకరు. అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించిన పాట 'కచ్చా బాదమ్'. ఈ సాంగ్‌కు ఎంతోమంది రీల్ చేసి అదరగొట్టారు. అయితే ఈ పాటపై అంజలి అరోరా చేసిన రీల్ నెట్టింట్లో అందరికంటే ఎక్కువగా ఆకర్షించింది. దీంతో అంజలి ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాకుండా వివాదస్పద బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరించిన 'లాకప్' షోలో పాల్గొంది కూడా. ఈ షో తర్వాత మరింత పాపులారిటీ సంపాందించుకుంది అంజలి అరోరా. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అంజలి అరోరా ఎమ్ఎమ్ఎస్ పేరిట ఒక ఫేక్ అసభ్యకర వీడియో నెట్టింట్లో లీక్ అయింది. ఆ వీడియోలో అంజలి ముఖం స్పష్టంగా కనిపించడం, అందులోనూ ఆమెతో సన్నిహితంగా మెలిగే వ్యక్తి ఆ వీడియోలో ఉండంటంతో అది నిజమైన వీడియోగా అందరు భావిస్తున్నారు. అయితే ఆ వీడియో ఒరిజినల్ కాదని, అందులో ఏమాత్రం నిజం లేదని, అదొక ఫేక్ వీడియో అని అంజలి క్లారిటీ ఇచ్చింది. అది ఎవరు సృష్టించారో? ఎందుకు అలా చేశారో? తెలియడం లేదని ఎమోషనల్ అయింది. ''ఆ వీడియోలో ఉంది నేను కాదు. అసలు నాకు సంబంధం లేని వీడియోకు నా పేరును యాడ్ చేశారు. అసలు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ వీడియోలో నా ఫొటో అతికించి, కావాలనే వైరల్ చేస్తున్నారు. నన్ను ఒకప్పుడు మెచ్చుకున్న ప్రేక్షుకులే ఇప్పుడు తిడుతున్నారు. నాకూ ఓ ఫ్యామిలీ ఉంది. మా ఇంట్లో వాళ్లు కూడా ఈ వీడియోలు చూస్తారని కనీసం ఆలోచించకుండా ఇలాంటివి చేయడం దారుణం. కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసమే ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాటిని తట్టుకునే శక్తి నాకు లేదు'' అని ఎమోషనలై కన్నీరు పెట్టుకుంది అంజలి అరోరా. -
వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్
సాక్షి, సత్యసాయి జిల్లా: టీడీపీ నేతలు కుట్రపూరితంగా తనపై ఫేక్ వీడియోలు సృష్టించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఐటీడీపీ సోషల్ మీడియా ద్వారా యూకే నుంచి ఫేక్ వీడియోలను పంపారు. ఏబీఎన్ రాధాకృష్ణ, పచ్చ మీడియా కలిసి ఈ వీడియోలను ప్రసారం చేశారు. రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు.. చంద్రబాబుతో చేతులు కలిపారు. వీరంతా కలిసి బడుగు, బలహీన వర్గాలను అణచివేస్తున్నారు. మంచి, చెడులు తెలియకుండా దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక అబద్ధాన్ని నిజం చేయాలని పచ్చ ఛానళ్లు చూస్తున్నాయి' అంటూ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (ఆ వీడియో ఒరిజినల్ కాదు) -
ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్
-
మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు ఉంటాయ్: సజ్జల
తాడేపల్లి: ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై స్పందించారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అది వాస్తవం కాదని, పోలీసు కేసు కూడా పెట్టానని గోరంట్ల తనతో చెప్పారన్నారు. ఆ విషయంలో నిజంగా ఆయన తప్పు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘మా పార్టీ మహిళల పక్షపాత పార్టీ. నిజంగా తప్పు ఉంటే మా నాయకుడు ఊరుకోరు. టీడీపీ రాద్దాంతం చేస్తోంది. మా నాయకుడు చేతల్లో చూపిస్తారు. గోరంట్ల మాధవ్ పోలీస్ కేసు పెట్టారు. వాస్తవాలు తెలియాల్సి ఉంది. నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాము’ అని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదీ చదవండి: నకిలీ వీడియోపై స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్ -
నా మీద నకిలీ వీడియో ప్రచారం చేస్తున్నారు : గోరంట్ల మాధవ్
-
నకిలీ వీడియోపై స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్
సాక్షి, ఢిల్లీ: తనను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. నకిలీ వీడియోపై స్పందించిన ఆయన.. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఓ వీడియోలో తాను ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారని.. ఏ విచారణకైనా, ఫోరెన్సిక్ టెస్టుకైనా సిద్ధమన్నారు. ఆ వీడియో నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఈనాడు వండివార్చిన వట్టి మాటల స్టోరీ! అసలు విషయం ఇదే.. కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ ఉన్నారన్నారు. ఇప్పటికే ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఎంపీ తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే నన్ను స్ట్రయిట్‌గా ఎదుర్కోవాలన్నారు. ఈ వీడియోను సర్క్యులేట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘నేను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి ఈ చెత్త వీడియోలను సృష్టించారు. బాధ్యులపై పరువు నష్టం దావా వేస్తాను’’ అని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. -
వీడెవడండీ బాబూ.. ఎలన్ మస్క్ షాకయ్యే సీన్ ఇది!
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. అనని మాటలు అన్నట్లు, చెయ్యని చేష్టలు చేసినట్లు చూపించగలిగే జిమ్మిక్కు చేయగలుగుతున్నారు. అందుకే ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకునేందుకు చాలా టైం పడుతోంది. ఇదిలా ఉంటే ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోపై రకరకాల రియాక్షన్లు వెలువడుతున్నాయి. ఎలన్ మస్క్.. టెస్లా కంపెనీ సీఈవోగా, ప్రపంచంలో అత్యధిక సంపద కలిగి ఉన్న వ్యక్తిగా కొనసాగుతున్నాడు. అలాంటి వ్యక్తిని పోలి ఉన్న మరో వ్యక్తి వీడియో ఒకటి ఇంటర్నెట్లో సర్క్యూలేట్ అవుతోంది. చైనీస్ టిక్‌టాక్ యాప్ డౌయిన్ నుంచి గత రెండు వారాలుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. బ్లాక్ జాకెట్ వేసుకున్న ఓ వ్యక్తి అచ్చం ఎలన్ మస్క్‌లా ఉండడం, అదే తరహా హవభావాలు ప్రదర్శించడం ఆ వీడియోలో ఉంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసిన ఆ వీడియోను తాజాగా ఫేస్బుక్, ట్విటర్ ఇతర మాధ్యమాల ద్వారా వైరల్ చేస్తున్నారు. REPORT: Elon Musk doppelganger discovered in China.pic.twitter.com/tivuhbS97w — New Granada (@NewGranada1979) December 5, 2021 ఆ వీడియో ఒరిజినలేనా? లేదంటే డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా రూపొందించిందా? ఇంతకీ అతని పేరు, ఊరు, ఐడెంటిటీ గురించి తెలియాల్సి ఉంది. ఈ లోపు ‘యి లాంగ్ మస్క్’ అంటూ వెటకారంగా చైనీస్ వెర్షన్ అంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు చాలా మంది. ఇంకొందరు ఏకంగా ఎలన్ మస్క్‌కే ట్యాగ్ చేసినప్పటికీ.. ఆయన ఇంకా స్పందించలేదు. ఒకవేళ చూసి ఉంటే కచ్చితంగా తన స్టయిల్లో స్పందించేవాడేమో. అది డీప్ ఫేక్ వీడియో గనుక అయితే మాత్రం.. ఇలాంటి వ్యవహారం కొత్తేం కాదు. గతంలో జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్‌ల మీద స్టార్ ట్రెక్ డీప్‌ఫేక్ వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. లేదు అది నిజమే అయితే గనుక ఆ చైనీస్వెర్షన్ ఎలన్ మస్క్ ఫేమ్ చాలాకాలం పాటు పదిలంగా ఉండడం ఖాయం. చదవండి: ఆ టైంలో చేతిలో చిల్లి గవ్వ లేదు: ఎలన్ మస్క్ -
Bipin Rawat : హెలికాప్టర్ ప్రమాదం.. వైరల్ అవుతున్న ఫేక్ వీడియో
చెన్నై: తమిళనాడు కూనురు నీలగిరికొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందినట్లు వాయుసేన ధృవీకరించింది. అయితే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాద దృశ్యాలు ఇవే అంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత ఇలా సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో.. ఆకాశంలో ఉన్నప్పుడే హెలికాప్టర్లో మంటలు చెలరేగాయి. మంటల మధ్యనే దాదాపు రెండు నిమిషాల పాటు హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో అందులో ఉన్న కొందరు హెలికాప్టర్ నుంచి బయటకు దూకే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్ పూర్తిగా అదుపు కోల్పోయి నిటారుగా వేగంగా నేలను ఢీ కొట్టింది. ఈ ఘటన ప్రత్యక్ష సాక్షులు సైతం మీడియాలో ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ఆకాశంలోనే మంటలు చెలరేగాయని.. కొందరు బయటకు దూకారని చెపుతున్న మాటలు టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. దీంతో ఈ వీడియో బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్దే అని అంతా భావించారు. చదవండి: కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 13 మంది మృతి అయితే వాస్తవానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఫేక్. ఇది ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి సంంబంధించినది కాదు. 2020 ఫిబ్రవరిలో సిరియాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో. అక్కడ ఆకాశంలో మంటల్లో చిక్కుకున్నప్పుడు వీడియో తీశారు. తాజాగా కొందరు ఈ ఫేక్ వీడియోను ప్రచారంలోకి తెచ్చారు. Bipin Rawat Helicopter Crashed In Tamil Nadu live Video #bipinrawat #helicopter #IndianArmy #BIGBREAKING pic.twitter.com/CgwCqZ0bSr — Marwadi Club (@MarwadiClub) December 8, 2021 -
500 నోటుపై పుకార్లు.. క్లారిటీ!
Rs 500 notes latest news: కరెన్సీకి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కొత్తేం కాదు. నోట్ల రద్దు, కరోనా టైంలో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఫేక్ కథనాలెన్నో వైరల్ అయ్యాయి కూడా. తాజాగా 500రూ. నోటు మీద ఓ ప్రచారం వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా 500 రూపాయల నోటు విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే నడుస్తోంది. అదేంటంటే.. ఐదు వందల రూపాయల నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ (సెక్యురిటీ థ్రెడ్).. ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా మహాత్మా గాంధీ బొమ్మకు దగ్గరగా ఉంటే గనుక ఆ నోటు ఫేక్ అని, చెల్లదు అని!. ఈమేరకు ఆర్బీఐ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయంటూ ఓ వీడియో వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అవుతోంది కూడా. దీంతో 500 రూపాయల నోటు తీసుకునేందుకు వ్యాపారులు వణికిపోతున్నారు. ఒకవేళ తీసుకున్నా.. ఒకటికి పదిసార్లు తీక్షణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ప్రచారం సాధారణ జనాల్లోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. Factcheck On 500 Currency Note అయితే 500 నోట్లపై ఉండే గ్రీన్ స్ట్రిప్.. ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా గాంధీ బొమ్మకు దగ్గరిగా ఉంటే ఆ నోటు చెల్లదు అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, RBI సైతం ఎలాంటి అలర్ట్ జారీ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోPress Information Bureau స్పష్టంచేసింది. అంతేకాకుండా ఆ రెండు నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని పీఐబి (PIB) తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ వీడియో నకిలీదంటూ ఓ పోస్ట్‌ను ట్విటర్లో ఉంచింది. Press Information Bureau అనేది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వెబ్సైట్. నిజనిర్ధారణ విషయాలతో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటుంది. एक वीडियो में यह चेतावनी दी जा रही है कि ₹500 का ऐसा कोई भी नोट नहीं लेना चाहिए, जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास न होकर गांधीजी की तस्वीर के पास हो।#PIBFactCheck: ▶️यह वीडियो #फ़र्ज़ी है ▶️@RBI के अनुसार दोनों ही नोट वैध हैं विवरण:https://t.co/DuRgmS0AkN pic.twitter.com/SYyxG9MBs6 — PIB Fact Check (@PIBFactCheck) December 7, 2021 -
మైపాడు బీచ్‌లో జలకన్య? అసలు నిజం ఏంటంటే..
సాక్షి, ఇందుకూరుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రం మైపాడు బీచ్‌లో జలకన్య కలకలం అని వస్తున్న వార్తలో నిజం లేదని, ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆక్వా కోఆపరేటివ్ మార్కెట్ డైరెక్టర్ పామంజి నరసింహులు స్పష్టం చేశారు. మైపాడు బీచ్‌లో ఓ జలకన్య మత్స్యకారులకు చిక్కినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన విషయంపై ఆయన స్పందించారు. చదవండి: ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రంపైనే.. ఇందుకూరుపేటలో ఆయన మాట్లాడుతూ, కొందరు ఆకతాయిలు ఓ వీడియోని సృష్టించి.. పది రోజుల కిందట కర్ణాటక రాష్ట్రంలో ఈ సంఘటన జరిగినట్లు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారన్నారు. తాజాగా గత నాలుగైదు రోజుల నుంచి ఇదే వీడియోలను మైపాడు బీచ్‌లో జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి.. లేనిది ఉన్నట్లు చూపుతున్నారని తెలిపారు. వీటిని పోస్టు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నరసింహులు కోరారు. చదవండి: ఊర్లున్నాయి.. ప్రజలు లేరు! -
తిక్క కుదిరింది: సోషల్ మీడియా స్టార్ ‘ఆత్మహత్య నాటకం’
ముంబై: సోషల్ మీడియాలో స్టార్‌గా ఎదిగేందుకు కొందరు పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేస్తారు. అందరి దృష్టిలో పడేందుకు వెర్రి వేషాలు వేస్తుంటారు. తాజాగా ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి పోలీసుల వరకు చేరింది. దీంతో ప్రస్తుతం ఆ యువకుడు కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇర్ఫాన్‌ఖాన్ (28) ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నాడు. ఇప్పీఖాన్ అనే పేరిట ఇన్‌స్టా, యూట్యూబ్ ఖాతాలు ఉన్నాయి. అతడికి 44 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మరింత మందిని పెంచుకునేందుకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో రూపొందించాడు. ఓ అమ్మాయి తనను ప్రేమించి మోసం చేసిందని.. ఇది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెబుతూ ఖార్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై కూర్చున్నాడు. ఈ సమయంలో తనకు రైలు ఢీకొట్టినట్లు వచ్చేలా ఎడిట్ చేశాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బాంద్రా పోలీసులు ఇర్ఫాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను ఆత్మహత్య చేసుకోకూడదని ఉద్దేశంతో అవగాహన కల్పించేందుకు ఆ వీడియో రూపొందించినట్లు పోలీసులకు ఇర్ఫాన్ తెలిపాడు. దీనిపై అతడు క్షమాపణలు చెప్పి ఆ వీడియోను డిలీట్ చేశాడు. ఏది ఏమైనా అతడిపై పోలీసులు కేసు మాత్రం తప్పలేదు. -
కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డ మనీశ్ సిసోడియా! జరిగింది ఇది..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై.. సొంత పార్టీ నేతనే తీవ్ర విమర్శలు గుప్పించాడు. వ్యాక్సినేషన్లో విఫలమవుతూనే.. మరోపక్క యాడ్ల పేరుతో ప్రజా ధనాన్ని వృథాగా ఖర్చు చేస్తున్నాడంటూ సీఎం కేజ్రీవాల్‌పై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మండిపడ్డాడు. ఈ మేరకు ఓ వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతోంది. న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై, ఆప్ కీలక నేత.. డిప్యూటీసీఎం మనీశ్ సిసోడియా మండిపడ్డట్లు 30 సెకండ్ల నిడివి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓవైపు సిసోడియా మాట్లాడుతుండగా.. మరోవైపు ఆప్ యాడ్లతో ఉన్న పేపర్ క్లిప్పులు, యాడ్ కట్టింగ్లు కనిపిస్తున్నాయి ఆ వీడియోలో. యాడ్ల పేరుతో ఎంత వృథా చేస్తారు. వ్యాక్సిన్లు దొరక్క ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. అని అందులో డైలాగులు ఉన్నాయి. దీంతో వీడియో విపరీతంగా షేర్ అయ్యింది. ఆప్‌లో ముసలం మొదలైందని, కీలక నేతల మధ్య వైరం షురూ అయ్యిందని రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. Mr. Handsome Sisodia Slams Kejriwal For "No Vaccination, Only Ads". pic.twitter.com/rNMs1fuQro — अमित शर्मा (@AmitsharmaGRENO) June 24, 2021 ఫ్యాక్ట్ చెక్.. ఆ రెండు వేర్వేరు వీడియోలు. ఎవరో ఎడిట్చేసి వైరల్ చేశారు. మనీశ్ సిసోడియా జూన్ 21న నిర్వహించిన ట్విటర్ లైవ్ మీడియా సమావేశంలో ఢిల్లీ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి మాట్లాడాడు. అదేరోజు ఉదయం ‘‘ ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన ఘనత’ పేరుతో బీజేపీ పాలిత రాష్రా్టల్లో ఫుల్ పేజ్ యాడ్లు పబ్లిష్ అయ్యాయి. అయితే వాస్తవ పరిస్థితి మరోలా ఉందని, గప్పాలు మానుకోవాలని, ప్రచారానికి ఖర్చు పెట్టే డబ్బును వ్యాక్సిన్ల కోసం ఉపయోగించాలని బీజేపీకి సూచిస్తూ సిసోడియా ప్రెస్ మీడియాలో మాట్లాడాడు. అందులోని పోర్షన్లను కట్ చేసి.. ఎవరో ఎడిట్ చేశారు. సో.. మనీష్ సిసోడియా విమర్శించింది సొంత ప్రభుత్వాన్ని కాదు.. కేంద్ర ప్రభుత్వాన్ని. Addressing an important Press Conference | LIVE https://t.co/CCdbez8UeJ — Manish Sisodia (@msisodia) June 21, 2021 చదవండి: రాష్ట్రపతి జీతం, కట్టింగ్‌లపై గోల -
ట్విటర్‌కు హైదరాబాద్ పోలీసుల నోటీసులు
హైదరాబాద్: మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్‌కు షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి కేంద్రం నోటీసులు ఇవ్వగా, తాజాగా హైదరాబాద్ పోలీసులు ట్విటర్‌కు నోటీసులు జారీ చేశారు. ఫేక్ వీడియో సర్క్యులేట్ కేసులో నోటీసులు పంపినట్లు హైదరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నటి మీరాచోప్రా ఫిర్యాదుపై ట్విట్టర్ వెంటనే స్పందించాలంటూ నోటీసులు పంపినట్లు సమాచారం. కాగా, జూన్ 5న వృద్ధ ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన కేసులో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కూడా మంగళవారం రాత్రి థర్డ్ పార్టీకి సంబంధించిన మొదటి కేసు నమోదైంది. బాధితుడు తప్పుడు సమాచారమని వివరించినా ట్విటర్ చర్య తీసుకోలేదని ఆరోపించారు. తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ట్విటర్ తొలగించలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. చదవండి: ట్విటర్‌కు మరో షాక్, కేసు నమోదు -
FactCheck: ఆ పాడు పని చేసింది వాళ్లిద్దరూ కాదు
బాకు: ‘‘లైవ్‌లో ఉన్న సంగతి మర్చిపోయి మరీ ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అజర్ బైజాన్ ప్రధాని అలీ అసదోవ్’’.. ఈ క్యాప్షన్‌తో ఓ వీడియో ఈమధ్య ఫేస్బుక్లో బాగా వైరల్ అయ్యింది. కొన్ని ఇంటర్నేషనల్ వెబ్‌సైట్స్, టాబ్లాయిడ్స్ అసదోవ్ తీరును తప్పుబడుతూ ఆ వార్తను ప్రచురించేశాయి. అయితే ఈ వీడియోకు సంబంధించి ఓ ట్విస్ట్ ఇప్పుడు బయటపడింది. అందులో ఉంది ఆయన కాదంటూ అసలు విషయం తెలిసొచ్చింది. వీడియోలో ఏముందంటే.. జూమ్ మీటింగ్ జరుగుతుండగా.. అందులో పెద్దాయన సడన్‌గా వెనక్కి తిరుగుతాడు. అక్కడే ఉన్న ఓ మహిళ వెనుక భాగాన్ని తన చేత్తో తాకుతాడు. దీంతో ఉలిక్కి పడ్డ ఆ మహిళ.. ఆయనతో వాగ్వాదానికి దిగుతుంది. ఆ వెంటనే అక్కడి నుంచి భయంతో పరుగులు తీస్తుంది. వెంటనే ఆయన కెమెరా ఆఫ్ చేస్తాడు. అయితే కొందరు ఫేస్బుక్ యూజర్లు.. ఇది అజర్ బైజాన్ అధ్యక్షుడి పనే అని, కాదు ప్రధాని అలీ అసదోవ్ పనే అని మరికొందరు ప్రచారం చేశారు చేశారు. జూమ్ మీటింగ్‌కు ఎగ్జిట్ కొట్టని సంగతి మరిచి.. అలా ప్రవర్తించారని కామెంట్స్ చేశారు. అయితే అందులో ఉంది అజర్ బైజాన్ అధ్యక్షుడో, ప్రధానో కాదని ఇప్పుడు తేలింది. పాత వీడియో కానీ.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించింది అజర్ బైజాన్ మాజీ ఎంపీ, యూనివర్సిటీ ప్రొఫెసర్ హుసేయిన్బలా మిరాలమోవ్. పోయిన నెలలో ఆయన ఈ పాడు పనికి పాల్పడ్డాడు. పైగా ఈ వీడియో రిలీజ్ అయ్యి నెలపైనే అయితోంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేయగా, ఆయన్ని న్యూ అజర్ బైజాన్ పార్టీ బహిష్కరించింది కూడా. అయితే ఈ వ్యవహారం అధికారిక జూమ్ మీటింగ్‌లోనే జరగడం విశేషం. ఇక పోలికలు కూడా పట్టించుకోకుండా కథనాలు ప్రచురించిన వెబ్సైట్లపై దావాకు అజర్ బైజాన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: మనిషికి బర్డ్‌ఫ్లూ.. ఇది అసలు విషయం -
‘కోవిడ్‌కు సంబంధించి ఆ వార్తల్లో నిజం లేదు’
న్యూఢిల్లీ: భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీంతో అకస్మాత్తుగా కేసులు పెరగడంతో పాటు అనేక రాష్ట్రాలు లాక్డౌన్ వంటి చర్యలు చేపడుతున్నాయి. కరోనాకు సంబంధించి ప్రజల మనస్సులలో భయాందోళనలను సృష్టించే లక్ష్యంతో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నకిలీ సందేశాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇదే తరహాలో కరోనావైరస్ కారణంగా ఏప్రిల్ 15 నాటికి భారతదేశంలో 50,000 మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసిందని పేర్కొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే కరోనా కారణంగా ఏప్రిల్ 15 లోపు ఇండియాలో 50 వేల మంది చనిపోతారని వార్తల్లో నిజం లేదని డబ్యూహెచ్‌వో స్పష్టం చేసింది. తాము ఎలాంటి హెచ్చరికలు చేయలేదని చెప్పింది. డబ్ల్యూహెచ్‌వో పేరిట వైర్ల్ అవుతున్న ఓ వీడియో ఫేక్ న్యూస్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయం ట్వీట్ చేసింది. A video claiming @WHO has warned of 50,000 #COVID-19 deaths in India by 15 April is FAKE NEWS. WHO has NOT issued any such warning. #IndiaFightsCorona #pandemic @MoHFW_INDIA @PIB_India @ICMRDELHI @ANI — WHO South-East Asia (@WHOSEARO) April 6, 2021 ( చదవండి: ఆస్ట్రాజెనెకా టీకా: రక్తం గడ్డకట్టి ఏడుగురు మృతి ) -
అది ఫేక్ వీడియో: కేసులు పెడతాం!
ఆసిఫాబాద్ జిల్లా : నిన్న బెజ్జూర్ మండలంలోని అంబగట్ట అటవి ప్రాంతంలో రైతులకు కనపడిన పెద్ద పులి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ వీడియో అని ఎఫ్డీఓ విజయ్ కుమార్ తెలిపారు. ఆ వీడియో మహారాష్ట్రకు చెందిన యవాత్మల్ జిల్లా, అంజనీ వాడకు సంబంధించినదని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ దహెగాం మండలం, దిగిడ గ్రామంలో దాడి చేసిన పులి మహారాష్ట్రకు వెళ్లినట్లు గుర్తించాం. ఎక్కడా కెమెరాలకు పులి చిక్కలేదు. ( అదిగో పెద్దపులి.. చచ్చాంరా దేవుడో! ) ప్రస్తుతం ఉన్న 30 మంది టీంతో సెర్చ్ ఆపరేషన్ మరోవారం పొడిగించాము. యువత తప్పుడు వీడియో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు దృష్టికి వస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము. పులిని బంధించడానికి రెండు బోనులు ఏర్పాటు చేశాం. 30 కెమెరాలతో బెజ్జూర్ పెంచికల్ పేట్ దహెగాం మండలాల్లో గట్టి నిఘా కొనసాగుతుంది. -
ఫేక్ వీడియో: బీజేపీ నేతపై కేసు
సాక్షి, సిద్దిపేట : సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న దుబ్బాక బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీఆర్ఎస్ పార్టీ దిమ్మెల కూల్చివేతకు సంబంధించిన పాత వీడియోలను తాజా వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్థానిక నేత శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. దుబ్బాక రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ద్వారా ఇలాంటి అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం రిటర్నింగ్ అధికారి చెన్నయ్య హెచ్చరించారు. కాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన దిమ్మెలను ఆ పార్టీ నేతలే కూల్చుతున్నారంటూ శ్రీనివాస్ ఓ వీడియోను షేర్ చేశారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు అది పాత వీడియో అని, ఎన్నికల సమయంలో ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చెన్నయ్య బీజేపీ నేత బెన్నయ్యపై పోలీసులు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు. -
బాహుబలిని తలపించే ఫేక్ వీడియో వైరల్
సాక్షి, జైనూర్(ఆసిఫాబాద్): సోషల్ మీడియాలో ఓ ఫేక్ వీడియో జిల్లావాసులను కాసేపు గందరగోళానికి గురిచేసింది. జైనూర్ మండలం చింతకర్రకు చెందిన ఓ పసికందు తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా, వైద్యం కోసం వాగు దాటిస్తున్నట్లు ఈ వీడియో, ఫొటోలో ఉంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మారుమూల గ్రామాల ప్రజలకు ఇలాంటి ఇక్కట్లు తప్పడం లేదంటూ సదరు పోస్టు ఉద్దేశం. ఈ పోస్టు అనేక గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. బాహుబలి సినిమాను తలపిస్తూ పసికందును వాగు దాటిస్తుండడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కొద్ది సేపటికే అది ఫేక్ అని తేలింది. చింతకర్రకు వాగు కష్టాలు ఉన్నా గత వారం రోజులుగా ఇలాంటి పరిస్థితి ఏమీ లేదని గ్రామస్తులు, అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వీడియో, ఫొటో 2006లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినదిగా తెలుస్తోంది. దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని ఎస్సై తిరుపతి తెలిపారు. -
కరోనా: వాటి మాయలో పడకండి!
సాక్షి, న్యూ ఢిల్లీ: సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, నకిలీ సమాచారం వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వదంతులకు అడ్డుకట్ట పడడంలేదు. ముఖ్యంగాం కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో తీవ్ర ఆందోళన పెరుగుతున్న క్రమంలో ఇలాంటి అవాంఛనీయ ధోరణి పెరుగుతుండటం కలవరం పుట్టిస్తోంది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఆంక్షల సమయంలో కూడా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ లో నకిలీ సమాచారంతో పలు వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి ఇలాంటి వీడియోలను నమ్మవద్దని, నకిలీ వార్తల పట్ల జాగ్రత్తగా వుండాలని ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఢిల్లీ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం గత ఐదు రోజులుగా ఓ వర్గానికి చెందిన ప్రజలను లక్ష్యంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఈ ధోరణి బాగా పెరిగింది. దీంతో వైరలవుతున్న 30 వేలకు పైగా వీడియోలను నిపుణులు విశ్లేషించారు. హిందీ, ఉర్దూ భాషల్లో తప్పుడు సమాచారంతో అనేక పోస్టులను గుర్తించారు. చేతులు పదే పదే కడుక్కోవద్దు, మాస్క్ లు ధరించవద్దు, భౌతిక దూరాన్ని పాటించవద్దు, వ్యాధిని విరివిగా వ్యాప్తి చేయండి. అంటూ ముస్లింలకు తప్పుడు సలహా ఇస్తున్న భయంకరమైన ఫేక్ వీడియోలు షేర్ అవుతున్నాయని, వీటి మాయలో పడకుండా, అప్రతమత్తంగా ఉండాలని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా చైనాకు చెందిన యాప్ టిక్‌టాక్ ద్వారా ఇవి బాగా వ్యాప్తి చెందుతున్నాయని, అనంతరం ఈ వీడియోలు వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లలో విరివిగా షేర్ అవుతున్నాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అనంతరం మొదటివారంలో వాట్సాప్, టిక్ టాక్ వంటి యాప్ లలో మతపరమైన విద్వేషంతో, మత నాయకులపై ఆరోపణలతో, ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక వీడియోలను కనుగొన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. కరోనా వైరస్ అడ్డుకునే రోగనిరోధక శక్తిని ముస్లింలకు వుంటుందనీ, కనుక వారు భౌతిక దూర నియమాలను పాటించవద్దనే తప్పుడు సమాచారంతో ప్రజలకు సలహా ఇచ్చే వీడియోలు ఇందులో ప్రముఖంగా ఉన్నాయన్నారు. దీంతో మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇవి తీవ్రమైన సవాలుగా పరిణమించాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దిష్ట ప్రేక్షకుల కోసం ఎక్కువగా హిందీ, ఉర్దూ భాషల్లో నకిలీ సమాచారం, వీడియోలు సృష్టించినట్లు తెలిపారు. ఈ వీడియోలు చాలావరకు పాకిస్తాన్ మిడిల్ ఈస్ట్ లలో చిత్రీకరించినట్లుగా తెలుస్తోందనీ, అయితే భారతదేశంలో షూట్ చేసినట్టుగా సూపర్ ఇంపోజ్ చేస్తున్నారన్నారు. భద్రతా పరిశోధకులు, ఫ్యాక్ట్ చెకర్స్. డేటా ఎనలిస్టుల సహాయంతో ఈ వీడియోలను విశ్లేషించామన్నారు. అయితే కోటిగా పైగా ప్రజలు ఇప్పటికే ఈ వీడియోలను వీక్షించారని పేర్కొన్నారు. చాలావరకు ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో వీటిని సృష్టించి , సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వీడియోలను గుర్తించి, సంబంధిత ఖాతాలను తొలగిస్తున్నామని చెప్పారు. అయితే ఫేక్ వీడియోల వ్యాప్తిలో విదేశీయుల పాత్రపై మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వైద్య సిబ్బందిపై దాడులు, ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమానికి హాజరైన వారివల్లేనన్న అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో పోలీసులు తాజా నివేదికలను వెలువరించారు. ఇలాటి తప్పుడు సమాచారం, వీడియోల వ్యాప్తి ముస్లింలను తోటి ముస్లింల నుండి దూరంగా ఉంచే కుట్రగా పేర్కొన్నారు. మరోవైపు మౌలానా సాద్ కంధల్వి అధికారికంగా ఒక తన అనుచరులనుద్దేశించి ఆడియో సందేశాన్ని జారీ చేశారు. కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరులో ప్రభుత్వంతో అందరూ సహకరించాలని కోరారు. జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యుల మార్గదర్శకత్వాలను పాటించాలని, ప్రజలు సమూహాలుగా రాకుండా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధం ఎంతమాత్రం కాదని ఆయన పేర్కొన్నారు. కాగా ఐరోపా, అమెరికాలతో పోలిస్తే భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి చాలా పరిమితంగా ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
షహీన్ బాగ్‌పై మరో నకిలీ వీడియో!
సాక్షి, న్యూఢిల్లీ : ‘సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా షహీన్ బాగ్‌లో ధర్నా చేస్తున్న ఆడవాళ్లంతా డబ్బులు తీసుకుంటున్నారు. 500, 700 రూపాయలు తీసుకొని షిప్టుల పద్ధతిలో ధర్నాకు కూర్చుంటారు...అవును బాయ్’ అని ఇద్దరు హిందీలో మాట్లాడుకుంటుండగా, ‘సబ్ కాంగ్రెస్ కా ఖేల్ హై (అదంతా కాంగ్రెస్ పార్టీ డ్రామా) ’ అని మూడో వ్యక్తి వ్యాఖ్యానించిన ఓ వీడియోను బీజేపీ సోషల్ మీడియా హెడ్ అమిత్ మాలవియా జనవరి 15వ తేదీన ట్వీట్ చేశారు. అంతా కాంగ్రెస్ డ్రామా అంటూ ఆయన కూడా నొక్కి చెప్పారు. (షహీన్ బాగ్ శిశువు మృతి) ఆ వీడియోలో ఉన్న వాస్తవాస్తవాలను తెలుసుకోకుండానే ‘టైమ్స్ నౌ’ టీవీ ఆ వీడియోను ప్రసారం చేసింది. ‘ఇది స్టింగ్ ఆపరేషన్ లా ఉంది. షహీన్ బాగ్‌లో డబ్బులు తీసుకొని ధర్నా చేస్తున్న ఆడవాళ్ల గురించి అక్కడ మాట్లాడుకుంటున్న గుర్తుతెలియని వ్యక్తులను రహస్యంగా చిత్రీకరించినట్లుంది. వాస్తవం ఏదో మనకు స్పష్టంగా తెలియదు. బీజేపీ చేతికి ఈ వీడియో ఎలా వచ్చిందో తెలియదు. బీజేపీయే స్వయంగా ఈ స్టింగ్ ఆపరేషన్ చేసిందా? ఎవరైనా చేసి బీజేపీ చేతికి ఇచ్చారా? తెలియదు’ అంటూ జర్నలిస్ట్ మెఘా ప్రసాద్ వ్యాఖ్యానంతో ఆ వీడియోను ‘టైమ్స్ నౌ’ పూర్తిగా ప్రసారం చేసింది. ‘ప్రొటెస్ట్ఆన్హైర్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో ‘రిపబ్లిక్ టీవీ’ చర్చా కార్యక్రమాన్ని చేపట్టగా, ‘డబ్బులకు ఆందోళన చేస్తున్నారా?’ అంటూ ‘ఇండియా టుడే’ టీవీ కూడా చర్చా కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. బీజేపీ గుజరాత్ ఎమ్మెల్యే హర్ష్ సాంఘ్వీ, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ప్రీతీ గాంధీ, మాజీ శివసేన సభ్యులు రమేశ్ సోలంకి, బీజేపీ ఢిల్లీ ఐటీ సెల్ హెడ్ పునీత్ అగర్వాల్, సినీ నిర్మాత అశోక్ పండిట్లు తమ తమ వ్యాఖ్యానలతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నకిలీ వీడియోలను, వార్తలను ఎప్పటికప్పుడు కనిపెట్టే ‘ఆల్ట్ న్యూస్, లాండ్రీన్యూస్’లు వీడియోను ఫ్రేమ్, ఫ్రేమ్ తనిఖీ చేయగా, ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్న వెనకాల ఓ షాపు అద్దం మీద స్పష్టంగా ‘9312484044’ అనే నెంబర్ కనిపించింది. ఆల్ట్ న్యూస్, లాండ్రీ న్యూస్‌కు చెందిన ఇద్దరు రిపోర్టర్లు ఆ నెంబర్ పట్టుకొని గూగుల్ సర్చ్ ద్వారా వెళ్లగా ‘కుస్మీ టెలికమ్ సెంటర్’ అనే మొబైల్ షాప్ కనిపించింది. ఆ ఫోన్ నెంబర్ ఆ షాపుదే. వీడియోలో కనిపించే గోడ, దాని మీద పోస్టర్లు కూడా అచ్చం అలాగే షాపు రెక్క మీద ఉన్నాయి. షహీన్ బాగ్‌కు 8 కిలోమీటర్ల దూరంలో పూల్ ప్రహ్లాద్‌పూర్‌లో ఆ షాపు ఉంది. తుగ్లకాబాద్ మెట్రో స్టేషన్‌కు సమీపంలో 134 నెంబర్ షాపది. అశ్వని కుమార్ అనే 38 ఏళ్ల వ్యక్తి ఆ షాపు యజమాని. ఆయనకు 70 ఏళ్ల తండ్రి కూడా ఉన్నారు. 8–10 చదరపు గజాల వెడల్పుతో ఉన్న ఆ షాపులో సిగరెట్లు, గుడ్లు, డేటా ప్లాన్స్, చిప్స్ అమ్ముతున్నారు. ఆ షాపుకు ఎయిర్టెల్, వొడాఫోన్ అడ్వర్టయిజ్ బోర్డులు కూడా ఉన్నాయి. (ఇర్ఫాన్ పఠాన్‌పై ఫేక్ వీడియో!) ఆ షాపులో సిగరెట్లు కొనుక్కున్న ఇద్దరు రిపోర్టర్లు అశ్వని కుమార్‌తో పిచ్చాపాటిగా రాజకీయాలు మాట్లాడుతు వచ్చారు. ఆ షాపు గోడలకు మోదీ, ఇతర బీజేపీ నేతల ఫొటోలు ఉన్నాయి. బీజేపీలో పనిచేస్తారా? అని ప్రశ్నించగా, తనను తాను సిన్సియర్ కార్యకర్తనని చెప్పుకున్నారు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియో తన షాపు ముందు తీసిందే అని మాటల సందర్భంలో అంగీకరించారు. అయితే తాను తీయలేదని, ఎవరో తీశారని చెప్పారు. ‘మీ వృద్ధులకు ప్రభుత్వం ఏం చేస్తోంది’ అని అశ్వని కుమార్ తండ్రిని ప్రశ్నించగా బీజేపీ ఏమీ చేయడం లేదు, ఆప్ ఏమీ చేయడం లేదని చెప్పారు. ‘సబ్ కాంగ్రెస్ కా ఖేల్ హై’ అని వీడియోలో ఉన్న గొంతను పోలినట్టే ఆయన స్వరం ఉంది. (సీఏఏకు వ్యతిరేకం.. ఇది మరో షాహీన్ బాగ్) మరోసారి వీడియో ఫ్రేమ్‌లను ఆ ఇరువురు రిపోర్టర్లు పరిశీలించగా, షాపు బయటి నుంచి కాకుండా షాపు లోపలి నుంచే తీసినట్లు తెలుస్తోంది. రిపోర్టర్లు సిగరెట్ తాగుతున్నప్పుడే అశ్వని కుమార్ తన సెల్ ఫోన్‌తో వారిని వీడియోతీసి ‘నా అనుమతి లేకుండా సిగరెట్లు తాగుతున్నారు’ అని కాప్షన్ పెడితే ఎలా ఉంటుందని కూడా వారిని ప్రశ్నించారు. ఆ తర్వాత స్థానిక బీజేపీ నాయకులు బన్వర్ సింగ్ రాణాను రిపోర్టర్లు పరిచయం చేసుకొని షహీన్ బాగ్ గురించి ‘స్టింగ్ ఆపరేషన్’ ఎవరు చేశారని ప్రశ్నించగా, తమ పోరగాడేనని, సమీపంలో మొబైల్ షాపు నడుపుతున్నారని చెప్పారు. పరిచయం చేయమని అడగ్గా ఫిబ్రవరి 8వ తేదీన ఢిల్లీ ఎన్నికలయ్యాక వస్తే పరిచయం చేస్తానని చెప్పారు. (ఆ ‘వీడియో’ చైనా మార్కెట్‌ది కాదు!) -
ఇర్ఫాన్ పఠాన్‌పై ఫేక్ వీడియో!
సాక్షి, న్యూఢిల్లీ : సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఢిల్లీలోని షహీన్ బాగ్‌కు ‘మరో సింహం వచ్చింది. దాని పేరు ఇర్ఫార్ పఠాన్’ అంటూ 13 సెకన్ల ఓ వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా పలు ఫేస్బుక్ గ్రూపుల్లో చక్కెర్లు కొడుతుంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 78 వేల వ్యూస్, 3,100 షేర్స్, 666 లైక్స్ వచ్చాయి. ఆ వీడియోను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అందులో ఇర్ఫాన్ పక్కన కూర్చున్న వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు మదన్ మిశ్రా అని సులభంగానే గుర్తించవచ్చు. ఇర్ఫాన్ పఠాన్ ఫేస్బుక్, ట్విటర్‌ను తనిఖీ చేయగా జనవరి 14వ తేదీన ఆయన ఇదే వీడియోను పోస్ట్ చేశారు. అదే రోజున మదన్ మిశ్రా తాను ఇర్ఫాన్ పఠాన్‌తో ఉన్న ఫొటోను ట్విటర్లో విడుదల చేశారు. ఇర్ఫాన్ పఠాన్ పోస్ట్ చేసిన వీడియో, ట్విటర్లో మదన్ మిశ్రా చేసిన వ్యాఖ్యలను పరిశీలించగా, జనవరి 14వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని కమర్హటిలో కమర్హటి డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రీమియర్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్‌కు ఇర్ఫాన్ పఠాన్ ముఖ్య అతిథిగా హాజరైన వీడియో అది. ఢిల్లీ ఎన్నికల్లో ఎలాగైన అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ఓడించాలని చూస్తున్న శక్తులు ఈ వీడియోను వక్రీకరించినట్లు తెలుస్తోంది. -
అది రాజస్థాన్‌లో జరిగిన ‘ఘోరం’
-
అది రాజస్థాన్‌లో జరిగిన ‘ఘోరం’
సాక్షి, న్యూఢిల్లీ : ‘పాకిస్థాన్‌లో నేడు హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఘోరాలకు తార్కాణం ఈ వీడియో. ఓ హిందూ యువతిని ఆమె కన్న తల్లి ముందే బలవంతంగా ఇద్దరు ముస్లిం యువకులు ఎత్తుకు పోయారు. అడ్డు వచ్చిన తల్లిని చితకబాదారు. ఇప్పటికైనా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తున్న ప్రజలు కళ్లు తెరవాలి. పాకిస్తాన్లో 1951లో అక్కడి జనాభాలో హిందువులు 12.9 శాతం ఉండగా, నేడు 1.6 శాతం మాత్రమే ఉన్నారు’ అన్న వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్బుక్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అదే వీడియో 2019, డిసెంబర్ నెలలో కూడా మరో వ్యాఖ్యానంతో వైరల్ అయింది. రాజస్థాన్‌లో అందరి ముందే ఓ పేద యువతిని ఎత్తుకుపోయి గ్యాంగ్ రేప్ చేశారన్నది నాటి వ్యాఖ్యానం. వాస్తవానికి రాజస్థాన్‌లోని జోద్పూర్ జిల్లాలో నిజంగా జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో అది. కలు ఖాన్ కీ ధని గ్రామానికి చెందిన నేమత్, అహ్మద్ ఖాన్ దంపతుల కూతురుతో షౌకత్ అనే యువకుడికి చిన్నప్పుడే పెళ్లయింది. అమ్మాయిని తమ ఇంటికి పంపించాల్సిందిగా షౌకత్ కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచే గొడవ చేస్తున్నప్పటికీ కూతురికి 18 ఏళ్లు వచ్చాకే పంపిస్తానంటూ తల్లి నేమత్ చెబుతూ వచ్చింది. 2017, సెప్టెంబర్ నెలలో షౌకత్ తన మిత్రుడు ఖాసింతో కలిసి ట్రాక్టర్‌పై వచ్చి తన మైనర్ భార్యను ఎత్తుకుపోయాడు. పోలీసుల కథనం మేరకు ఈ వార్త ‘దైనిక్ భాస్కర్’ పత్రికలో 2017, సెప్టెంబర్ 27వ తేదీన ప్రచురితమైంది. ఈ వీడియో నకిలీదని తెలుసుకోవడానికి ఇదంతా కూడా తెలుసుకోనక్కర్లేదు. ఆ బాలిక, ఆమె తల్లి వేషాధారణ, భాషనుబట్టి వారు ముస్లింలని స్పష్టంగా తెలిసిపోతుంది. వారిద్దరు హిందువులంటే ఎలా నమ్ముతారో! పైగా పాకిస్థాన్‌కు సంబంధించి హిందువుల సంఖ్యను తప్పుగా పేర్కొన్నారు. పాక్‌లోని హిందూ కౌన్సిల్ ప్రకారం ప్రస్తుతం అక్కడ 85 లక్షల మంది హిందువులు ఉన్నారు. దేశ విభజన అనంతరం అక్కడి నుంచి దాదాపు 47 లక్షల మంది హిందువులు భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. -
అమెరికా డ్రోన్ దాడి : ఆ వీడియో అసలైనదేనా !
సాక్షి, న్యూఢిల్లీ : ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానిని హతమార్చడానికి అమెరికా డ్రోన్ విమానం క్షిపణులతో పేల్చివేసిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ప్రచారంలోకి వచ్చాయి. సులేమానీ ప్రయాణిస్తున్న వాహన శ్రేణిపై డ్రోన్ ద్వారా బాంబులు ప్రయోగించి పేల్చిన ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ అంటూ తెర ప్రచారంలోకి వచ్చిన ఈ వీడియో నకిలీది కావడం గమనార్హం. ఒక వీడియో గేమ్‌లోని వీడియో క్లిప్పును ఈ రకంగా ప్రచారంలోకి తెచ్చారు. ఈ వీడియో క్లిప్పింగ్ వాస్తవానికి ‘వీడియో వార్ గేమ్–ఆర్మా 3’లోనిది. ఇదే వీడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఫిబ్రవరి నెలలోనే ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా, అప్పుడు రెండు లక్షల మంది వీక్షించారు. అందులో ఇద్దరు టర్కీ సైనికులు వాకీ టాకీలో మాట్లాడుతుండగా, వెనక బ్యాక్ గ్రౌండ్లో టర్కీ సంగీతం కూడా వినిపిస్తుంది. సిరియాలోని ఆఫ్రిన్ ప్రాంతంలో టర్కీ డ్రోన్ దాడులు జరిపిన వీడియో అంటూ నాడు టర్కీ ప్రభుత్వ టీవీ ఇదే వీడియోను ప్రసారం చేసింది. ఎలాంటి యుద్ధ వార్తలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన ‘వీడియో గేమ్’ దృశ్యాలను ప్రసారం చేయడం టర్కీ టీవీ ఛానళ్లకు మొదటి నుంచి అలవాటు. ఇప్పుడు ఆ జబ్బు ప్రపంచ వ్యాప్తంగా చాలా టీవీ ఛానళ్లకు పట్టుకుంది. అమెరికా, ఇరాక్ దేశాలు కుమ్మక్కయ్యాయంటూ ఒకప్పుడు రష్యా ప్రభుత్వం కూడా ‘ఏసీ–130 గన్‌షిప్ సిములేటర్’ మొబైల్ గేమ్ క్లిప్పును ప్రసారం చేసింది. వాటిని వీక్షించిన వాళ్లు ఆ క్లిప్పింగ్‌లను కాపీ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం అలవాటుగా మారిపోయింది. నాడు భారత్ వైమానిక దళం పాక్ భూభాగంలోకి చొచ్చుకుపోయి పాక్ టెర్రరిస్టుల స్థావరాన్ని పేల్చివేసిన దృశ్యాలంటూ భారత్ టీవీ ఛానళ్లలో కూడా వార్ వీడియో గేమ్ క్లిప్పింగ్‌లను ప్రసారం చేశాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న క్లిప్పింగ్‌కు సంబంధించిన ‘ఆర్మా 3 వీడియో వార్ సిములేషన్ గేమ్’ వీడియోను యూట్యూబ్ గత ఏప్రిల్ నెలలోనే లోడ్ చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్‌లోని టర్కీష్ మాటల స్థానంలో ఇంగ్లీష్ మాటలను లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఏ నకిలీ వీడియోనైనా ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ పద్ధతిలో పట్టుకోవచ్చు. ఇందుకు ‘ఇన్విడ్, రివ్‌ఐ’ అన్న టూల్స్ కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. లేదంటే వీడియోలో చెబుతున్న లొకేషన్, వాస్తవంగా సంఘటన జరిగిన లొకేషన్ ఒక్కటేనా అన్న విషయాన్ని గూగుల్ ఎర్త్, వికీమాపియా ద్వారా కూడా సులభంగానే తెలుసుకోవచ్చు. ఇరాన్ జనరల్ సులేమాన్‌పై అమెరికా జరిపిన డ్రోన్ దాడికి సంబంధించిందేనా వైరల్ వీడియో అన్నది తేల్చుకోవడానికి ఇంత సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం లేదు. కామన్ సెన్స్ ఉంటే చాలు. ఆ రోజు సులేమాన్, ఆయన ఇరాక్ మద్దతుదారు అబూ మెహదీ అల్‌తో కలిసి ఒక టయోటా ఎస్యూవీ కారులో బాగ్దాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరగా, వారి ఇద్దరికి సంబంధించిన 8 మంది బాడీ గార్డులు మరో టయోటా ఎస్‌యూవీలో బయల్దేరారు. అమెరికా డ్రోన్ ద్వారా వాటిపైకి మూడు క్షిపణులను ప్రయాగించగా ఆ రెండు ఎస్యువీ కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కరు కూడా బయట పడలేదు. పైగా అమెరికా డ్రోన్‌కు ఒకే సారి నాలుగు క్షిపణులను మాత్రమే తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో పదులు, ఇరవై సంఖ్యలో క్షిపణులు ప్రయోగించగా ఏడెనిమిది సైనిక వాహనాలు ధ్వంసం అవడం, ధ్వంసమవుతున్న వాహనాల నుంచి తుపాకులు పట్టుకున్న సైనికులు బయటకు రావడం కనిపిస్తోంది. కొసమెరుపు : ఏసీ 130 గన్‌షిప్ సిమ్యులేటర్ కాన్వాయ్ ఎంగేజ్మెంట్ పేరుతో 2015 లోనే ఒక వీడియో గేమ్ యూట్యూబ్‌లో పబ్లిష్ కాగా 57 లక్షలకుపైగా వీక్షించారు. అందులోని క్లిప్పులే ఇలాంటి సందర్భాల్లో అనేక రకాలుగా వాడుకలోకి తెచ్చి వైరల్ చేస్తున్నారు. -
ఈ వీడియోలు అసలువా, నకిలీవా!?
-
ఇమ్రాన్‌పై ఒవైసీ ఫైర్
హైదరాబాద్ : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై పోలీసుల దౌర్జన్యం అని ఒక నకిలీ వీడియోను ట్వీట్ చేసిన ఇమ్రాన్ ఖాన్ నెటిజన్లకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ఒవైసీ స్పందిస్తూ.. భారత్ ముస్లింల గురించి బాధపడేకన్నా.. ముందుగా పాకిస్తాన్లో పరిస్థితిని చూసుకోవాలని ఇమ్రాన్‌కు హితవు పలికారు. ‘బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘటనను.. భారత్‌లో జరిగినట్టుగా తప్పుడు పోస్ట్ చేశాడు. ఇమ్రాన్ తొలుత నీ దేశం గురించి నువ్వు ఆలోచించు. భారత ముస్లింలుగా తాము గర్వపడుతున్నామని.. ఎప్పటికీ అలాగే ఉంటామ’ని అసదుద్దీన్ స్పష్టం చేశారు.. అలాగే బీజేపీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ వంటి చట్టాలను తీసుకువస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్ఆర్సీ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తనను చంపేందుకు కేంద్రం, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తున్నాయని.. దమ్ముంటే ముందు తనను చంపాలని సవాలు విసిరారు. సిక్కులకు రక్షణ కల్పించాలి : అసదుద్దీన్ అలాగే కర్తార్‌పూర్‌లో పాకిస్తాన్‌లోని చారిత్రక నాన్కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన రాళ్ల దాడిపై అసదుద్దీన్ స్పందించారు. సిక్కులకు రక్షణ కల్పించాలని కోరిన అసదుద్దీన్.. గురుద్వారా రళ్ల దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సూర్యుడు ఓం అంటున్నాడు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న వీడియోలు నకిలీవా?, ఒరిజినల్‌వా అని తేల్చుకోలేని పరిస్థితి ఉంది. కొందరు సెలబ్రిటీలు సైతం తమ ట్విట్టర్ ఖాతాల్లో నకిలీ వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్ల ట్రోల్స్ బారిన పడిన వారు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ. ఇంతకీ విషయమేమిటంటే.. ‘సూర్యుడు ఓం అని పలుకుతున్నాడు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా దాన్ని రికార్డు చేసింది’ అని ఆమె ఒక వీడియోను ట్విట్టర్ ఖాతా ద్వారా శనివారం పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ ట్వీట్‌ను 7వేల మందికి పైగా రీట్వీట్ చేయడంతో పాటు వందల మంది దానిపై స్పందించారు. అయితే వాస్తవానికి ఇదో నకిలీ వీడియో. ఇది భారత వాట్సాప్ గ్రూపుల్లో చాలాకాలాంగా సర్క్యులేట్ అవుతోంది. అందులో ఎలాంటి ఓం వినిపించదు. దీంతో పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ‘‘సూర్యుడు.. ‘వాహ్ మోదీజీ.. వాహ్’ అని అనడం కూడా ప్రారంభిస్తాడు’’ అంటూ కిరణ్ బేడీపై వ్యంగ్య వ్యాఖ్యలు కనిపించాయి. అసలు సంగతి ఏంటంటే ‘సూర్యుడు నిశ్శబ్దంగా ఉండడు. సూర్యుడి గుండెచప్పుడు వినడం ద్వారా శాస్త్రవేత్తలు దానిలోని సౌర పదార్థాల ప్రవాహాలను, తరంగాలను, అలజడులను మరింత విస్తృతంగా శోధిస్తున్నారు. దీంతో గతంలో తెలియని అనేక సౌర రహస్యాలను తెలుసుకునేందుకూ వీలు ఏర్పడింది’ అని 2018లో నాసా ఒక ట్వీట్ చేసింది. -
ఫేక్ ట్వీట్‌తో దొరికిపోయిన ఇమ్రాన్
న్యూఢిల్లీ: భారత్ లోని ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలపై పోలీసుల దౌర్జన్యం అని ఒక నకిలీ వీడియోను ట్వీట్ చేసి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నెటిజన్లకు దొరికిపోయారు. ఆ వీడియో 2013 బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో అని నెటిజన్లు వెల్లడించి, ట్రోల్ చేయడంతో ఆ ట్వీట్‌ను, వీడియోను ఆయన తొలగించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందించారు. ‘నకిలీ వార్తలను ట్వీట్ చేయండి.. దొరికిపోండి.. ఆ ట్వీట్లను డిలీట్ చేయండి.. మళ్లీ రిపీట్ చేయండి’ అని రవీశ్ శుక్రవారం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. -
భాగమతి నటి ఫేక్ వీడియో.. కేసు నమోదు
సినిమాను రూపొందించటమే కాదు ఆ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయటంలోనూ సినీ వర్గాలు సరికొత్త దారులు వెతుకుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ప్రయత్నం బెడిసి కొడుతుంది. తాజాగా ఓ మలయాళ నటికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. భాగమతి సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన ఆశా శరత్ ఇటీవల తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆశా మేకప్ లేకుండా కనిపించిన ఆ వీడియోలో ‘తన భర్త కనిపించటం లేదని, ఆచూకి తెలిసిన వారు కేరళలోని కట్టప్పన్ పోలీస్ స్టేషన్లో తెలియజేయాల’ని కోరారు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు నిజమే అనుకున్నారు. విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన ఆశా శరత్ నెమ్మదిగా అసలు విషయాన్ని బయటపెట్టారు. తాను ఆ వీడియోను కేవలం ‘ఎవిడే’ సినిమా ప్రమోషన్లో భాగంగానే రిలీజ్ చేశానని, నిజంగా తన భర్త కనిపించకుండా పోలేదని వెల్లడించారు. దీంతో ఆశా చేసిన పనిపై నెటిజన్లు మండి పడుతున్నారు. ఇలాంటి పోస్ట్‌లతో నిజమైన వీడియోలను కూడా ప్రజలు నమ్మడం మానేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళకు చెందిన లాయర్ శ్రీజిత్, ఫేక్ వీడియో సర్క్యూలేట్ చేసినందుకు ఆశా శరత్ పై చర్యలు తీసుకోవాలంటూ ఇడుక్కి పోలీస్ స్టేషన్లో కేసు వేశారు. -
ఫేక్ వీడియో; చిక్కుల్లో ఎమ్మెల్యే!
అహ్మదాబాద్ : నకిలీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కారణంగా గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ చిక్కుల్లో పడ్డారు. నకిలీ వీడియోను షేర్ చేసి తమ పరువుకు భంగం కలిగించారన్న ప్రైవేటు పాఠశాల ఫిర్యాదుతో పోలీసులు శనివారం ఆయనపై కేసు నమోదు చేశారు. గత నెల 20న జిగ్నేష్ మేవానీ.. ఓ వ్యక్తి విద్యార్థిని కొడుతున్న వీడియోను ఓ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. విద్యార్థిని అర్థనగ్నంగా నిలుచోబెట్టి.. చితకబాదుతున్నట్లుగా ఉన్న ఈ వీడియోలో ఉన్నది ఆర్‌ఎమ్‌వీఎమ్ పాఠశాల ఉపాధ్యాయుడు అని జిగ్నేష్ పేర్కొన్నారు. అంతేగాకుండా.. ‘ ఈ పాఠశాలను మూసివేసి.. అందులోని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు ఇదంతా ఏంటి’ అంటూ ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు.. ఇది గుజరాత్‌కు సంబంధించిన వీడియో కాదని..ఈజిప్టుకు చెందినది అని జిగ్నేష్‌కు తెలిపారు. దీంతో ఆయన వెంటనే తన ట్వీట్‌ను తొలగించారు. అయితే అప్పటికే ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఆర్‌ఎమ్‌వీఎమ్ హెడ్ మాస్టర్ పోలీసులను ఆశ్రయించారు. తమ పాఠశాల పరువు తీశారంటూ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 505(2)(అసత్యాలు ప్రచారం చేయడం), 500(పరువునష్టం) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా గుజరాత్‌లోని వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్రంగా పోటీ చేసిన మేవానీ ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. -
ఫేక్ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన పాక్
న్యూఢిల్లీ : పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. అసత్య ఆరోపణలతో అడ్డంగా బుక్కైంది. ఓ పాత వీడియో తీసుకొచ్చి భారత్‌పై బురదజల్లేందుకు సిద్ధమైంది. భారత్‌కు చెందిన సబ్‌మెరైన్ తమ జలలాల్లోకి చొరబడేందుకు యత్నించిందని, ఆ ప్రయత్నాన్ని పాక్ నౌకాదళం దీటు తిప్పికొటి్ందని వెల్లడించింది. ‘భారత్ సబ్‌మెరైన్‌ను కనుకొన్న ఫుటేజ్ ఇదే’ అంటూ 50 సెకన్ల నిడివి గల ఓ వీడియో ఫుటేజీని పాక్ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన పాక్ ప్రభుత్వానికి అక్కడి మీడియా వంత పాడింది. (వైరల్ : సర్జికల్ స్ట్రైక్స్-2 ఫేక్ వీడియో) ‘అవును, భారత సబ్‌మెరైన్ మా జలాల్లోకి రావడానికి యత్నించింది’ అంటూ పాక్ మీడియా బ్రేకింగ్‌లతో ఊదరగొట్టింది. సోషల్ మీడియాలో సైతం ఇదే తరహా ప్రచారం సాగింది. అయితే, ఇదంతా భారత్‌పై దష్ప్రచారం అని తేలింది. పాక్ ప్రభుత్వం, అక్కడి మీడియా చూపిస్తున్న వీడియో ఫుటేజీ పాతదని ఇండియా టుడే యాంటి ఫేక్ న్యూస్ వార్ రూమ్ (ఏఎఫ్‌డబ్ల్యూఏ) కనుగొంది. అసత్య ఆరోపణలు చేస్తున్న పాక్ వైఖరిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఈ ఫేక్ వీడియో ఫుటేజీని పాక్ ప్రభుత్వం విడుదల చేసే ముందే మీడియాలో ప్రత్యక్షమవడం గమనార్హం. (సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫేక్ వీడియో) అది 2016 వీడియో.. 2016కు చెందిన వీడియోపై తాజా తేదీ, సమయం అంటించి పాక్ గగ్గోలు పెడుతోందని ఇండియా టుడే ఏఎఫ్‌డబ్ల్యూఏ స్పష్టం చేసింది. డాష్వేర్ అనే సాఫ్ట్‌వేర్‌తో ఈ ఫేక్ వీడియో గుట్టు రట్టు చేశామని వెల్లడించింది. కాగా, 2016లో సైతం ఇదే వీడియో చూపెట్టిన పాక్ భారత్‌పై నిందలు మోపింది. తమ జలాల్లోకి భారత సబ్‌మెరైన్ దూసుకొచ్చేందుకు యత్నించిందని ఆరోపించింది. ఆ ఆరోపణలను భారత్ ఖండించింది. -
అడ్డంగా దొరికిపోయిన పాక్
-
వైరల్: అభినందన్ భార్యనంటూ ఫేక్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: భారత వింగ్ కమాండర్ విక్రం అభినందన్ భార్య పేరుతో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని తేలింది. ‘‘నేను పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న అభినందన్ భార్యని. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులను రాజకీయ నాయకులు సొంతం లాభం కోసం వాడుకోకండి. సైనికుల త్యాగాలను రాజకీయ లబ్ధి కోసం ప్రచారం చేసుకోకండి’’ అంటూ 1.08 నిమిషాల పాటు సాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వీడియో వైరల్ అవ్వడంతో బూమ్ లైవ్ అనే ఫ్యాక్ట్ చెకింగ్ ఏజన్సీ దానిని గుర్తించి.. అది ఫేక్ వీడియో అని తేల్చింది. ఆ వీడియోలో మాట్లాడుతున్నది హర్యానా రాష్టంలోని గుర్గావ్కు చెందిన శిరీష రావ్‌గా గుర్తించింది. బూమ్ ఏజన్సీ ఆమెను సంప్రదించగా.. ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది తానేని శిరీషరావ్ తెలిపారు. తనకు తెలియకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దానిని మార్ఫింగ్ చేశారనీ, తన భర్త ఇండియన్ ఆర్మీలో ఉద్యోగి అని పేర్కొన్నారు. సైనికుల త్యాగాలను బీజేపీ నేతలు వారి సొంత రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారనీ వీడియో విమర్శించారు. అయితే ఆమె ఆమ్ఆద్మీ పార్టీకి చెందిన సామాజిక కార్యకర్త అని తెలిసింది. మార్ఫింగ్ చేసి వీడియోను యూత్ కాంగ్రెస్‌కు సంబంధించిన యువ దేశ్ అనే ట్విటర్ ఖాతానుంచి షేర్ చేశారు. కాగా సర్జికల్ స్ట్రైక్స్-2కు సంబంధించిన ఫేక్ వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది తాలిబన్ ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ 2015లో తయారైన ‘ఆర్మా-2’ అనే వీడియో గేమ్ అని బూమ్ లైవ్ అనే ఫ్యాక్ట్ చెకింగ్ ఏజన్సీ గుర్తించింది. సర్జికల్ స్ట్రైక్స్-2 ఫేక్ వీడియో