చెన్నై: తమిళనాడు కూనురు నీలగిరికొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందినట్లు వాయుసేన ధృవీకరించింది. అయితే బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాద దృశ్యాలు ఇవే అంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
చదవండి: Bipin Rawat: హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూత
ఇలా సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలో.. ఆకాశంలో ఉన్నప్పుడే హెలికాప్టర్‌లో మంటలు చెలరేగాయి. మంటల మధ్యనే దాదాపు రెండు నిమిషాల పాటు హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో అందులో ఉన్న కొందరు హెలికాప్టర్ నుంచి బయటకు దూకే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్ పూర్తిగా అదుపు కోల్పోయి నిటారుగా వేగంగా నేలను ఢీ కొట్టింది. ఈ ఘటన ప్రత్యక్ష సాక్షులు సైతం మీడియాలో ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నారు. ఆకాశంలోనే మంటలు చెలరేగాయని.. కొందరు బయటకు దూకారని చెపుతున్న మాటలు టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. దీంతో ఈ వీడియో బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌దే అని అంతా భావించారు.
చదవండి: కుప్పకూలిన బిపిన్ రావత్ హెలికాప్టర్, 13 మంది మృతి
అయితే వాస్తవానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఫేక్. ఇది ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి సంంబంధించినది కాదు. 2020 ఫిబ్రవరిలో సిరియాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో. అక్కడ ఆకాశంలో మంటల్లో చిక్కుకున్నప్పుడు వీడియో తీశారు. తాజాగా కొందరు ఈ ఫేక్ వీడియోను ప్రచారంలోకి తెచ్చారు.
Bipin Rawat Helicopter Crashed In Tamil Nadu live Video #bipinrawat #helicopter #IndianArmy #BIGBREAKING pic.twitter.com/CgwCqZ0bSr
— Marwadi Club (@MarwadiClub) December 8, 2021
Comments
Please login to add a commentAdd a comment