bipin rawat
-
బిపిన్ రావత్ తర్వాత సీడీఎస్‌గా అనీల్ చౌహాన్
సాక్షి, న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం సుమారు 9 నెలల తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. బిపిన్ రావత్ తర్వాత సీడీఎస్‌గా లెఫ్టినెట్ జనరల్ అనిల్ చౌహాన్(రిటైర్ట్) పేరును ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ 2021, మే నెలలో తూర్పు కమాండ్ చీఫ్‌గా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ చేశారు. సైన్యంలో పలు ఉన్నత పదవులను నిర్వర్తించారు చౌహాన్. జమ్ముకశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రకార్యకలాపాలను నిలువరించటంలో విస్తృత అనుభవం ఉంది. త్రివిద దళాలను ఏకతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేసింది కేంద్రం. దేశ తొలి సీడీఎస్‌గా జనరల్ బిపిన్ రావత్ 2020, జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2021 డిసెంబర్లో తమిళనాడులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మిలిటరీ హెలికాప్టర్లో వెళుతుండగా ప్రమాదం జరిగి రావత్, ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు మరో 11 మంది మరణించారు. అప్పటి నుంచి సీడీఎస్ పోస్ట్ ఖాళీగానే ఉంది. దాదాపు 9 నెలల తర్వాత కొత్త సీడీఎస్‌ను నియమించింది కేంద్రం. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్? -
‘పద్మ’ అవార్డుల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: 2022 సంవత్సరానికి 64 మందికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సోమవారం పద్మ పురస్కారాలను అందించారు. ఇందులో రెండు పద్మ విభూషణ్, 8 పద్మభూషణ్, 54 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తరఫున ఆయన కుమార్తెలు కృతిక రావత్, తరిణి రావత్, గీతాప్రెస్ అధినేత దివంగత రాధేశ్యామ్ ఖేమ్కా తరఫున ఆయన కుమారుడు కృష్ణ కుమార్ ఖేమ్కాలు పద్మ విభూషణ్ పురస్కారాలను స్వీకరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, సీరం ఇన్స్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలా, పంజాబీ జానపద గాయకుడు గుర్మీత్ బావా (మరణానంతరం), టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహర్షి, దేవేంద్ర ఝఝరియా, రషీద్ ఖాన్, సచ్చిదానంద స్వామి తదితర ప్రముఖులు పద్మభూషణ్ పురస్కారాలను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి మహా సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు, కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, నాదస్వర వాయిద్యకారుడు గోసవీడు షేక్ హసన్ సాహెబ్ (మరణానంతరం)లు పద్మశ్రీ అవార్డులను స్వీకరించారు. 2022 పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం ఈ నెల 28న జరుగనుంది. ఏటా మాదిరిగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 128 పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రెండు విడతల్లో 34 మంది మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్ఆర్ఐలు ఉండగా, 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు. -
Padma Awards 2022: బిపిన్‌కు విభూషణ్..
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డులు వరించిన వాళ్ల జాబితాను మంగళవారం విడుదల చేసింది. నలుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మ భూషణ్, 107 మంది పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణకు ఒక పద్మ భూషణ్‌తో పాటు 3 పద్మశ్రీ, ఏపీకి 3 పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. పూనావాలా, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లకు పద్మ భూషణ్ దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌కు ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్ సింగ్ (మరణానంతరం), ప్రభా ఆత్రే ఎంపికయ్యారు. పద్మ భూషణ్‌కు మాజీ కాంగ్రెస్ లీడర్ గులాం నబీ ఆజాద్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, సీపీఐ (ఎం) నేత బుద్ధదేవ్ భట్టాచార్య, కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా, కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, పంజాబీ ఫోక్ సింగర్ గుర్మీత్ బవ, నటుడు విక్టర్ బెనర్జీ, కేంద్ర మాజీ హోం సెక్రటరీ రాజీవ్ మెహ్రిశ్రీలను కేంద్రం ఎంపిక చేసింది. తమిళనాడు రాష్ట్రం నుంచి నటి షావుకారు జానకి, అలాగే ఒలింపిక్స్‌లో బంగారు పథకం సాధించిన నీరజ్ చోప్రా, సింగర్ సోనూ నిగమ్‌లు పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఈసారి 34 మంది మహిళలు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వాళ్లకు ఏటా ఈ అవార్డులను ఇస్తుంటారు. ఈసారి మొత్తం 128 అవార్డులను ప్రకటించారు. అవార్డులు పొందిన వాళ్లలో 34 మంది మహిళలున్నారు. 10 మందిని విదేశీ, ఎన్నారై, పీఐఓ, ఓసీఐ విభాగంలో ఎంపిక చేసింది. 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించింది. ఇద్దరికి కలిపి ఒకే అవార్డును ఈసారి రెండు సందర్భాల్లో ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లకే.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఉన్నారు. పద్మ భూషణ్‌కు తెలంగాణ నుంచి భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులు ఎంపికయ్యారు. అలాగే తెలంగాణ నుంచి దర్శనం మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు).. ఏపీ నుంచి గోసవీడు షేక్ హాసన్ (కళలు) (మరణానంతరం), డాక్టర్ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం), గరికపాటి నరసింహారావు (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించింది. -
బీజేపీలో చేరిన బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయ పార్టీల్లో చేరికలు, రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్ బీజేపీలో చేరారు. బుధవారం ఉదయం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి.. రిటైర్డ్ కల్నల్ విజయ్ రావత్‌ను ఢిల్లీలో కలిశారు. సాయంత్రం విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా విజయ్ రావత్ మాట్లాడుతూ.. బీజేపీలో చేరే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీలో చేరి ప్రజాసేవ చేయాలని ఉన్నట్లు తెలిపారు. పార్టీ ఆమోదిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. రిటైర్మెంట్ అనంతరం తన తండ్రి బీజేపీలో చేరడంతో ఇప్పుడు తనకు కూడా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. అయితే దోయివాలా అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ రావత్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. -
బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం: ప్రతికూల వాతావరణమే కారణం
న్యూఢిల్లీ: మేఘావృతమైన ప్రతికూల వాతావరణంలోకి హఠాత్తుగా హెలికాప్టర్ ప్రవేశించడంతో.. అది పైలట్ అధీనంలో ఉన్నప్పటికీ దాని పథం మారి కిందకు దూసుకొచ్చి కూలిందని సీడీఎస్ రావత్ ఘటనపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దర్యాప్తులో వెల్లడైన ప్రాథమిక వివరాలు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి చేరాయని భారత వాయుసేన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ముందుస్తు కుట్ర, ఉగ్రవాద దుశ్చర్చ, హెలికాప్టర్లో లోపాలు, పైలట్ తప్పిదం.. ఇలాంటి వాదనలు అన్నీ అవాస్తవం’ అని స్పష్టంచేసింది. చదవండి: కోడలి నగలు భద్రపరచడం క్రూరత్వం కాదు ఫ్లైట్ డాటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో నమోదైన సమాచారంతోపాటు ఘటనాస్థలిలో సేకరించిన సమాచారాన్ని పరిశీలించి ప్రాథమిక అంచనాకు వచ్చారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికసహా 14 మంది ప్రయాణిస్తున్న భారత వాయుసేన హెలికాప్టర్ గత ఏడాది డిసెంబర్ ఎనిమిదిన కూనూర్‌లో నీలగిరి కొండల్లో నేలకూలిన విషయం తెల్సిందే. -
Bipin Rawat: సైనిక్ స్కూల్‌కు జనరల్ బిపిన్ రావత్ పేరు
లక్నో: దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరును మెయిన్‌పురి జిల్లాలోని ఒక సైనిక్ స్కూల్‌కు పెట్టాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెలికాప్టర్ ప్రమాదంలో నీలగిరి కొండల్లో నేలకొరిగిన రావత్‌కు నివాళిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం కార్యాలయం గురువారం ఒక ట్వీట్‌చేసింది. 2019 ఏప్రిల్ ఒకటిన ఈ స్కూల్‌ను ప్రారంభించారు. కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దంపతులుసహా 13 మంది అమరులైన విషయం విదితమే. -
రక్షణమంత్రికి సీడీఎస్ చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదిక
-
బిపిన్ రావత్ హెలికాప్టర్ దుర్ఘటన.. ప్రమాదమే!
సాక్షి, న్యూఢిల్లీ: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతి చెందిన చాపర్ క్రాష్ దర్యాప్తు నివేదికను దర్యాప్తు బృందం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేసింది. హెలికాప్టర్ కూలిపోయిన ఘటన ప్రమాదమేనని ట్రై సర్వీస్ దర్యాప్తు బృందం రిపోర్టులో తేల్చిచెప్పింది. డిసెంబర్ 8న తమిళనాడులో బిపిన్ రావత్ ప్రయాణించిన భారత వాయుసేనకు చెందిన MI-17V5 హెలికాప్టర్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 14మంది దుర్మరణం పాలయ్యారు. ‘కోయంబత్తూరు నుంచి వెల్లింగ్టన్కు బయల్దేరిన MI-17V5 హెలికాప్టర్ కనూర్ సమీపంలో దట్టమైన మేఘాలల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా దారి స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్ ఇబ్బందులు పడ్డాడు. మేఘాల్లో చిక్కుకోవడంతో ముందున్న దృశ్యాలు అస్పష్టంగా కనిపించాయి. దారి కోసం రైల్వే లైన్‌ను హెలికాప్టర్ పైలట్ అనుసరించాడు. ఎత్తయిన శిఖరం అంచును హెలికాప్టర్ అనూహ్యంగా ఢీకొట్టింది. అదేవేగంతో హెలికాప్టర్ కిందికి పడిపోయింది’ అని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నివేదికలో వెల్లడించింది. -
కొత్త సీడీఎస్ ‘ఎంపిక’ షురూ
న్యూఢిల్లీ: దివంగత జనరల్ బిపిన్ రావత్ స్థానంలో తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) నియామక ప్రక్రియ మొదలైందని అధికార వర్గాలు తెలిపాయి. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన జనరల్ బిపిన్ రావత్ స్థానంలో మరొకరిని ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సీనియర్ కమాండర్లతో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్యానెల్ ప్రతిపాదించిన పేర్లతో కూడిన జాబితా త్వరలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు అందుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తదుపరి ఈ జాబితా కేబినెట్ నియామకాల కమిటీకి పరిశీలనకు అందుతుంది. ఆ కమిటీ అంతిమంగా సీడీఎస్ పేరును ఖరారు చేస్తుంది. అత్యున్నత స్థాయి ఈ పోస్టుకు అత్యంత సీనియర్ అయిన ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జనరల్ నరవణె వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిటైర్ కానున్నారు. ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ఇద్దరూ కూడా ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్లలో బాధ్యతలు స్వీకరించారు. ఒక వేళ సీడీఎస్‌గా జనరల్ నరవణెను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే, తదుపరి సీడీఎస్‌గా ఎవరిని నియమించాల్సింది కూడా ఇప్పుడే నిర్ణయించాల్సి ఉంటుంది. తదుపరి ఆర్మీ చీఫ్‌గా వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతి, నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందిన సీనియర్ మోస్ట్ కమాండర్లు. ఇద్దరూ కూడా జనవరి 31వ తేదీన రిటైర్ కావాల్సి ఉంది. దేశ మొట్టమొదటి సీడీఎస్‌గా గత ఏడాది జనవరి ఒకటో తేదీన జనరల్ బిపిన్ రావత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. -
కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూత
Captain Varun Singh Passed Away: ఆర్మీహెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ బుధవారం తుదిశ్వాస విడిచారు. కాగా, డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ కూలిన ఘటనలో 14 మందిలో 13 మంది అదే రోజు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ ఈరోజు కన్నుమూశారు. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిపట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదని అన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. చదవండి: ఈ ప్రమాదాలు యక్షప్రశ్నలేనా! Group Captain Varun Singh served the nation with pride, valour and utmost professionalism. I am extremely anguished by his passing away. His rich service to the nation will never be forgotten. Condolences to his family and friends. Om Shanti. — Narendra Modi (@narendramodi) December 15, 2021 IAF is deeply saddened to inform the passing away of braveheart Group Captain Varun Singh, who succumbed this morning to the injuries sustained in the helicopter accident on 08 Dec 21. IAF offers sincere condolences and stands firmly with the bereaved family. — Indian Air Force (@IAF_MCC) December 15, 2021 -
ఈ ప్రమాదాలు యక్షప్రశ్నలేనా!
భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు, వారి సిబ్బందితో సహా ప్రయాణిస్తున్న ప్రత్యేక సైనిక రవాణా రష్యన్ హెలికాప్టర్ తమిళ నాడులోని నీలగిరి కొండల్లో ఆకస్మిక ప్రమాదానికి గురై కూలిపోయింది. విమానం కెప్టెన్ మినహా అందరినీ బలిగొన్న ఆ ప్రమాదం రష్యన్ సైనిక వాహనాల వినియోగం, వాటి సాంకేతిక నాణ్యతపై పలు సందేహాలను రేకెత్తిస్తోంది. పౌరవిమానయాన దుర్ఘటనలకు, సైనిక రవాణా సంబంధిత హెలికాప్టర్ల పతనానికి కారణాలను శోధించే విచారణ సంస్థలు వెలువరించే ఏ నివేదికలూ ఒక పట్టాన వాస్తవాలను బహిర్గతం కానివ్వవు. ఆ నివేదికల్లో దాగి ఉన్న పలు వాస్తవాలను ప్రజలు ఎప్పటికి తెలుసుకోగల్గుతారన్నది మరొక యక్షప్రశ్నగానే మిగిలిపోతోంది. ఈ నెల 8వ తేదీన కూలిపోయిన ప్రత్యేక సైనిక రవాణా రష్యన్ హెలికాప్టర్ ‘ఎంఐ– 17వీ5’ తమిళనాడులోని నీలగిరి కొండల్లో అకస్మాత్తుగా అంత ర్థానమైన విషయం తెలిసిందే, ఈ దుర్ఘటనలో 13 మంది సైనిక సిబ్బందిని (భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా) దేశం కోల్పోయింది. ఈ సందర్భంగా భారత రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ప్రకటన చేశారు. ఈ ప్రమాద నేపథ్యంలో, రష్యన్ హెలికాప్టర్ల కోసం భారత ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందం గురించి గానీ, వాటి సామర్థ్యం గురించి కానీ ఎవరూ ఎలాంటి ఊహాగానాలు చేయరాదని ఆయన కట్టడి చేశారు. కాని గత పదేళ్ళుగా ఈ రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ల వల్ల సంభవించిన వరసవారీ ఘటనలు వాటి సామర్థ్యాన్ని అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ వస్తున్నాయి. ఈ సందర్భంగా 1966–2021 మధ్యకాలంలో రష్యాకి చెందిన పౌర, సైనిక రవాణా హెలికాప్టర్ల వల్ల ఎన్ని దుర్ఘటనలు సంభవించాయో వివరిస్తూ సుప్రసిద్ధ ఐటీ, మీడియా సంస్థలు గూగుల్, వికీపీడియాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో కొన్ని సివిలియన్ హెలికాప్టర్లు, కొన్ని సైనిక రవాణా హెలి కాప్టర్ల పతనానికి సంబంధించి కొందరు రాజకీయ పాలకులు, సైనికా ధికారులు చెప్పే కథనాలు తీవ్రమైన గందరగోళం కలిగిస్తున్నాయని వైమానిక నిపుణులు పేర్కొంటున్నారు. పరస్పర విరుద్ధమైన ఈ కథనాలవల్ల ఎవరి తొందరపాటు నిర్ణయాలు ఈ దుర్ఘటనలకు కార ణమో చెప్పలేని దుస్థితిని ఎదుర్కొనవలసి వస్తుందని ప్రముఖ రిటైర్డ్ ఎయిర్‌లైన్ ఇన్స్ట్రక్టర్ పైలట్, వైమానిక భద్రతా సలహాదారు కెప్టెన్ ఎ. మోహన్ రంగనాథన్ వివరించారు. ప్రమాదాల బారిన అధునాతన హెలికాప్టర్లు ఎందుకంటే రష్యన్ ప్రత్యేక హెలికాప్టర్లు ‘మనకెంత ముద్దయినా’, గత పదేళ్ళకు పైగా ఆ ప్రత్యేక హెలికాప్టర్లు అనేక ప్రమాదాలకు కారణమయ్యాయని చెప్పక తప్పదు. రష్యాతో 2008లో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 2011లో భారత వైమానిక దళానికి ఈ ప్రత్యేక హెలికాప్టర్లను అందజేయడం మొదలైంది. 2012 నుంచి వాటి సేవల్ని మనం పొందుతున్నాం. అది మొదలు అధునాతనమైన ‘ఎంఐ–17 వి5’ రష్యన్ హెలికాప్టర్లు అనేక దుర్ఘటనలకు కారణమయ్యాయన్నది నిపుణుల అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఈ రష్యన్ సైనిక, రవాణా హెలికాప్టర్లను ఎన్నిదేశాలు వినియోగిస్తున్నాయన్నది ఇక్కడ ప్రధానం కాదు, అవి ఆయా దేశాల్లో ఎన్ని ప్రమాదాలకు కారణమయ్యాయ న్నదే ఇక్కడ కీలకం. ముఖ్యంగా కెప్టెన్ మోహన్ రంగనాథన్ అంచనా ప్రకారం, సైనిక రక్షణ హెలికాప్టర్ ప్రమాద కారణాల విచారణకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఎన్నటికీ లేదు! అలాగే అధికారంలో ఉన్న రాజకీయ పాల కులు తమ ప్రత్యేక విమాన ప్రయాణాలకు సంబంధించిన ప్రమాద కారణాలను తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఎందు కంటే తమ కార్యక్రమాల్ని ముగించుకుని రావడంలో ఎవరి తొందర వారిది! పైలట్ల మానసిక స్థితిపై తీవ్ర ఒత్తిడి తమ ప్రయాణాలు, కార్యక్రమాలపై రాజకీయ నాయకుల తొందర, దాంతో తీసుకుంటున్న ఆకస్మిక నిర్ణయాలు హెలికాప్టర్లను నడిపే పైలట్ల మానసిక స్థితిపైన తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే హెలికాప్టర్ని నడిపి తీరాల్సిందే అని ఒత్తిడి చేసే రాజకీయ పాలకుడిని ఆ సమయంలో ఏ పైలట్ కూడా శాసిం చలేడు. ఇందుకు గతంలోనూ ఎన్నో ఉదాహరణలున్నాయి. 2001లో మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి మాధవరావు సింథియా తన అవసరం కొద్దీ కాన్పూరు వెళ్లవలసి వచ్చింది. కానీ, వాతావరణం ఏమాత్రం సహకరించని ఘడియల్లో పైలట్‌ను ఆయన బలవంతాన ఒత్తిడిచేసి బయలుదేరడంతో విమానం కూలి అందు లోని వారంతా ప్రాణాలు విడిచారు. అలాగే 2002లో లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి. బాలయోగి భారీవర్షంలో పైలట్‌ను ఒత్తిడికి గురిచేసి బయలుదేరి నప్పుడు ఆ హెలికాప్టర్ కాస్తా కుప్పకూలింది. గగనతల ప్రమాదాలకు అసలు కారణాల గురించి ఇన్ని అనుభవాలు చెప్తున్న గుణపాఠం ఏమిటో కూడా కెప్టెన్ మోహన్ రంగనాథన్ ఈ సందర్భంగా వివ రించారు. ‘పైలట్‌ను ఎన్నడూ మేం ఒత్తిడి చేయలేదు అని పాలకులు పైకి చెప్పడం అయితే చెబుతారు. కానీ విచారణ నివేదికలు మాత్రం ఆ ప్రమాద కారణాల్ని బహిరంగంగా వెల్లడించకుండా చడీ చప్పుడూ లేకుండా వాటిని తొక్కి పడతాయి’. అలాగే ఈ నెల 8వ తేదీన భారత సర్వసేనాధిపతి బిపిన్ రావత్ వినియోగించిన రష్యన్ సైనిక రవాణా వాహనం అననుకూల వాతా వరణ పరిస్థితుల్లో ప్రయాణించవలసి రావడానికి కారణం కూడా అలాంటిదే అయిఉండాలి! ఏది ఏమైనప్పటికీ, ఇటీవల తూర్పు అరు ణాచల్ప్రదేశ్లో, ఉత్తరాఖండ్‌లోని కేదారనాథ్‌లో, గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ దగ్గర్లో ఇవే రష్యన్ సైనికరవాణా హెలి కాప్టర్లు పరస్పరం ఢీకొని వైమానికదళ సభ్యులు ప్రాణాలు విడవ వలసి వచ్చింది! ఇందువల్ల రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ల విని యోగ సాంకేతికతలోనే తీవ్రమైన లోపం ఉండి ఉండాలన్న నిపుణుల అంచనాను విశ్వసించవలసి వస్తోంది! అంతేకాదు... చివరికి పాకిస్తాన్ సైన్యం వాడుతున్న ‘మిగ్–17’ రష్యన్ సైనిక రవాణా హెలికాప్టర్ కూడా గిల్గిత్–బల్తిస్తాన్లోని ‘నల్తార్’ ప్రాంతంలో ఆకస్మికంగా కుప్పకూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నార్వే, ఫిలిప్పైన్, మలేషియన్, ఇండోనేషియా రాయ బారులు, వారి భార్యలతోపాటు, పాకిస్తాన్ సైన్యం పైలట్లు ఇద్దరు కూడా చనిపోయారు! బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన రష్యన్ ‘మిగ్– 17’ హెలికాప్టర్ కూడా ఇలాగే కూలిపోయిందని సాధికార వార్తా సంస్థలు ప్రకటించాయి. బ్లాక్‌బాక్స్ వివరాలు వెల్లడించరెందుకు? ఇలా 1955 నుంచి 2021వ సంవత్సరం దాకా ప్రపంచ దేశాలలో సైనిక వైమానిక రవాణా హెలికాప్టర్ల ద్వారా జరిగిన దుర్ఘటనలపై ప్రపంచ మీడియా వ్యవస్థలు సాధికార నివేదికలను ప్రచురించాయి! చివరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలు సమీపం లోని కొండల్లో వాతావరణ పరిస్థితులు వికటించిన ఫలితంగా చెట్లను ఢీకొని కూలిపోయింది. వై.ఎస్. అర్ధంతరంగా దివంగతులయ్యారు. అయితే, ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌లోని ‘బ్లాక్‌బాక్స్’లో నిక్షిప్తమై ఉన్న వివరాల్ని మాత్రం వెల్లడించకుండా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ శాఖ జాయింట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన అధికారి ‘చాలా జాగ్రత్త’ పడ్డారు! ఆమాట కొస్తే ఆ బాక్స్‌లోని వివరాల్ని ‘తూ.తూ’ మంత్రంగా తేల్చారు! అందువల్ల ఆ బ్లాక్‌బాక్స్ వివరాల్ని మభ్యపర్చడం ద్వారా ఆరోజుకీ, ఈ రోజుకీ వాస్తవాలను బయటపడనీయకుండా కనుమరుగుచేశారు. ఆ పరిస్థితుల్లో ఆ ప్రమాదానికి సంబంధించిన అనేక వాస్తవాలు కనుమరుగయ్యాయన్నది ‘బ్లాక్ బాక్స్’ వివరాల్ని తొక్కిపెట్టిన ఆఫీ సర్కి మాత్రమే తెలియాలి. అందుకే కెప్టెన్ మోహన్ రంగనాథన్ అన్నట్టు అటు పౌరవిమానయాన దుర్ఘటనలకు, సైనిక రవాణా సంబంధిత హెలికాప్టర్ల పతనానికీ కారణాలను విచారించే విచారణ సంస్థలు వెలువరించే ఏ నివేదికలు కూడా ఒకపట్టాన వాస్తవాలను బహిర్గతం కానివ్వవు. ఆ నివేదికల్లో దాగిఉన్న పలు వాస్తవాలను ప్రేక్ష కులైన ప్రజలు ఎప్పటికి తెలుసుకోగల్గుతారన్నది మరొక యక్షప్రశ్న గానే మిగిలిపోతోంది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఆ వీడియో వాస్తవమేనా..?
Bipin Rawats Chopper Crash Video: ఆర్మీ హెలికాప్ట్టర్ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు తీసిన వీడియో వాస్తవమేనా అన్న పరిశోధన సాగుతోంది. ఈ వీడియో చిత్రీకరించిన నాజర్ అనే వ్యక్తి వద్ద క్యూబ్రాంచ్ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. ఈమేరకు ఘటనా స్థలంలోని కార్మికుల వద్ద ఆదివారం విచారణ సాగింది. వివరాలు.. నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని ఆర్మీ హెలికాçప్టర్ కుప్పుకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) ఈ ఘటనపై ఓ వైపు ఆర్మీ వర్గాలు, మరోవైపు రాష్ట్ర పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో హెలికాప్ట్టర్ కుప్పకూలేందుకు ముందుగా చిట్ట చివరి దృశ్యం అంటూ ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం అన్నది పసిగట్టేందుకు క్యూబ్రాంచ్ రంగంలోకి దిగింది. విచారణను ముమ్మరం చేయగా, ఆ వీడియోను కోయంబత్తూరుకు చెందిన నాజర్ చిత్రీకరించినట్టు ఆదివారం వెలుగు చూసింది. దీంతో ఆయన వద్ద విచారణ జరుపుతున్నారు. తాము పరాట్యక ప్రాంత సందర్శనకు వెళ్లిన సమయంలో ఆ వీడియో చిత్రీకరించినట్టు ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, రైల్వే ట్రాక్ వైపుగా నడుచుకురావాల్సిన అవసరం ఏమిటో అన్న ప్రశ్నలతో నాజర్ వద్ద విచారణ చేపట్టారు. అలాగే, ఆయన సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, ఆ వీడియో వాస్తవమేననా అన్నది నిగ్గుతేల్చేందుకు కోయంబత్తూరులోని పరిశోధన కేంద్రంలో çపరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్మీ వర్గాల నేతృత్వంలో సంఘటన జరిగిన ప్రదేశం పరిసరాల్లో మరోమారు పరిశీలన సాగింది. అయితే, ఆ పరిసరాల్లో 60 కుటుంబాలు ఉండగా, ఇందులో 12 మంది ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినట్టు సమాచారం. దీంతో హెలికాప్టర్ గాల్లో నుంచి కింద పడ్డ అనంతరం పేలిందా..? లేదా, గాల్లోనే ఏదేని మంటలు చెలరేగినట్టుగా కింద పడిందా...? అన్న కోణంలో వారిని ప్రశ్నించినట్లు సమాచారం. పాకిస్తానీ ట్విట్టర్లపై చెన్నై సైబర్ క్రైం కేసు పాకిస్తానీ ట్విట్టర్ ఖాతాదారులు పలువురిపై సీబీసీఐడీ సైబర్ క్రైం ఆదివారం కేసులు నమోదు చేసింది. బిపిన్‌రావత్ మరణం, హెలికాప్ట్టర్ ప్రమాద ఘటనపై పాకిస్తాన్‌కు చెందిన కొన్ని ట్విట్టర్ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారం, ఆధార రహిత ఆరోపణలు, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే రీతిలో సంభాషణలు సాగినట్టు తమిళనాడు సీబీసీఐడీ అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఖాతాలపై చర్యలకు తగ్గట్టు ట్విట్టర్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా కేసులు నమోదు చేశారు. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!) -
ఆ కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియా.. ప్రభుత్వ ఉద్యోగం: సీఎం
భోపాల్: డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నాయక్ జితేంద్ర కుమార్ వర్మ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఆదివారం ఉదయం ధామండ గ్రామంలో జితేంద్ర కుమార్ వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం చౌహాన్ నివాళులర్పించారు. అనంతరం చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘అమర్ షహీద్ జితేంద్ర కుమార్ జీ ధమందాకే కాదు.. యావత్ దేశానికే గర్వకారణం. ఈ పుణ్యాత్ముడికి, ఆయన తల్లిదండ్రులకు, భార్యకు నేను వందనం చేస్తున్నాను' అని అన్నారు. చదవండి: (అడగండి అది మన హక్కు..పెట్రోల్ బంకుల్లో ఈ ఆరు సేవలు ఉచితం) అనంతరం తన ట్విటర్ ఖాతాలో.. 'హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుడు జితేంద్ర కుమార్ జీకి నేను నివాళులర్పిస్తున్నాను. అతని కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుంది. అమరవీరుని భార్య, కుమార్తె సునీతను ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటాం. అతని పేరు మీద ఒక పాఠశాలకు 'అమర్ షహీద్ జితేంద్ర కుమార్ విద్యాలయ' అని పేరు పెట్టడం జరుగుతుంది. ధమండ గ్రామంలో సైనికుని జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మించబడుతుంది అంటూ సీఎం చౌహాన్ ట్వీట్ చేశారు. చదవండి: (గంట వ్యవధిలో మూడు ఒమిక్రాన్ కేసులు.. థర్డ్‌వేవ్ తప్పించుకోలేమా?) కాగా, సెహోర్ జిల్లాకు చెందిన వర్మ అంత్యక్రియలు పూర్వీకుల గ్రామమైన ధమండాలో నిర్వహించారు. కార్యక్రమం మొత్తం అతని సోదరుడు దగ్గరుండి నిర్వహించాడు. ఆ సమయంలో వర్మ తండ్రి, 13 నెలల కొడుకు కూడా అక్కడే ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
సెలవిక.. సైనికా!
బి.కొత్తకోట: ‘సాయితేజ అమర్ రహే.. జై జవాన్.. భారత్ మాతాకీ జై’ అంటూ వేలాదిగా తరలివచ్చిన ప్రజల నినాదాలతో ఎగువరేగడి గ్రామం ప్రతిధ్వనించింది. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన లాన్స్‌నాయక్ బి.సాయితేజ అంత్యక్రియలు అతడి కుటుంబీకులు, సన్నిహితులు, బంధువుల అశ్రునయనాల నడుమ సైనిక, పోలీసు లాంఛనాలతో పూర్తయ్యాయి. బెంగళూరులోని ఆర్మీ బేస్ ఆస్పత్రి నుంచి సాయిజేజ మృతదేహం ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కురబలకోట మండలం ఎగువరేగడి గ్రామానికి చేరుకుంది. అప్పటికే వేలాదిగా తరలివచ్చిన ప్రజలు సాయితేజ భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. పార్థివదేహాన్ని తొలుత సాయితేజ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే మైదానానికి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం గంటకుపైగా ఉంచారు. అనంతరం ఇంటి సమీపంలో సిద్ధం చేసిన సమాధి వద్దకు శవ పేటికను ప్రజలు మోసుకొచ్చారు. అక్కడ సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ చేత తమ్ముడు మహేష్‌బాబు అంతిమ సంస్కారాలు చేయించారు. తర్వాత శవపేటికతో సహా సమాధి చేశారు. మధ్యాహ్నం 3:20 గంటలకు కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. నినాదాలు, ఆర్తనాదాల నడుమ.. సాయితేజ మృతదేహం ఉన్న శవపేటికను మైదానంలోకి తీసుకురావడంతో జనం ఒక్కసారిగా జై జవాన్ నినాదాలతో హోరెత్తించారు. దర్శనార్థం జనం దూసుకొచ్చారు. పోలీసులు, ఆర్మీ సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లకు అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అరగంట వరకు ఇదేపరిస్థితి నెలకొనగా పోలీసులు జనాన్ని అదుపు చేశాక శవపేటిక వద్దకు భార్య శ్యామల, తల్లిదండ్రులు భువనేశ్వరి, మోహన్, తమ్ముడు జవాన్ మహేష్‌బాబు, బంధువులు చేరుకోగా ఒక్కసారిగా ఆర్తనాదాలతో వాతావరణం ఆవేదనాభరితంగా మారింది. కొంతసేపు భార్య శ్యామల భర్త శవపేటిక వద్ద మౌనంగా ఉండిపోయింది. అర్తనాదాలు, జనం నినాదాలు, తోపులాటలు ఇవేమీ అర్థంకాని సాయితేజ కుమారుడు మోక్షజ్ఞ జాతీయ పతాకం చేతపట్టి తండ్రి శవపేటిక వద్ద కూర్చున్న దృశ్యం కలచివేసింది. ఇక తండ్రి లేడన్న విషయం తెలియని మోక్షజ్ఞ తల్లి ఒడిలో కూర్చోని అటుఇటూ చూస్తూ జెండా ఊపుతూ కనిపించాడు. జనం జై జవాన్ నినాదాలు చేస్తుంటే సాయితేజ తమ్ముడు జవాన్ మహేష్‌బాబు వారితో గొంతు కలిపి జై జవాన్ అంటూ చేతులెత్తి నినాదాలు చేశాడు. అంత్యక్రియల సందర్భంగా రెండుచోట్ల అధికారిక లాంఛనాలు జరిపారు. తొలుత మైదానంలో శవపేటిక ఎదుట బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనికులు గౌరవ వందనం చేశారు. అనంతరం గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. ఆర్మ్డ్ పోలీసులు కూడా గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమానికి బెంగళూరు సైనిక విభాగం నుంచి నలుగురు అధికారులు, ఐదుగురు జాయింట్ కమెండో ఆఫీసర్లు, 30 మంది సైనికులు హాజరయ్యారు. సమాధి చేసేముందు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకా లతో జనం నినాదాలు చేశారు. చిత్తూరు, తిరుపతి ఎస్పీలు సెంథిల్‌కుమార్, వెంకట అప్పలనాయుడు సాయితేజ శవపేటికపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) వెంకటేశ్వర, బెంగళూరు నుంచి వచ్చిన 11వ పారా సైనిక విభాగం అధికారులు, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, స్థానిక అధికారులు, ప్రముఖులు నివాళులర్పించారు. మదనపల్లె జెడ్పీ, హోప్, సీటీఎం, తంబళ్లపల్లె, చెంబకూరు హైస్కూళ్లు, మిట్స్, బీటీ కళాశాలకు చెందిన 200 మంది ఎన్సీసీ క్యాడెట్లు హాజరై నివాళులర్పించారు. అనంతరం సమాధి వద్దకు ప్రజలు శవపేటికను మోసుకొచ్చారు. శ్యామలకు జాతీయ పతాకం అందజేత సాయితేజ మృతదేహం ఉంచిన శవపేటికకు చుట్టిన జాతీయ పతాకాన్ని సైనిక అధికారులు అతడి భార్య శ్యామలకు అందజేశారు. దేశం కోసం సాయితేజ అమరుడైనాడని, మీకు దేశం అండగా ఉంటుందని దైర్యం చెప్పారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మాటిచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..!
ఇండోర్: 'క్షమించండి.. మేము కత్రినా పెళ్లి ఫోటోను ప్రింట్ చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం మరొకటి ప్రచురిస్తున్నాం!’ ఈ లైన్లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రచురించింది. పై ఇమేజ్‌లో న్యూస్ పేపర్ కంటింగ్ దానికి సంబంధించిందే. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు అనేక మంది ఈ వార్తా పత్రిక చర్యను ప్రశంసిస్తున్నారు కూడా! ఎందుకో మీరే తెలుసుకోండి.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులిక దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసిన జంటకు సంబంధించిన పవిత్రమైన స్మరణ కోసం గ్లామర్‌ను విస్మరించవచ్చు. జీవన మార్గంలో కలిసి నడవాలనే వాగ్దానం ఇంత విషాదకరమైన రీతిలో వెలుగులోకి రావడం దురదృష్టకరం అనే క్యాప్షన్‌తో పాటు జనరల్ బిపిన్ రావత్ పెళ్లి పత్రికను కూడా ప్రచురించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఈ వార్తాపత్రిక కటింగ్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇక ట్విట్టర్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఇది పెళ్లి సంబరాలను జరుపుకునే తరుణం కాదని, భారతమాత ముద్దుబిడ్డకి తలవంచి నమస్కరించాలని కొందరు, ఈ సమయంలో మన దేశానికి అండగా నిలవాలని మరికొంత మంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ వివాహానికి ఒక రోజు ముందు సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన గత బుధవారం తమిళనాడులోని కూనూర్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సీడీఎస్ రావత్, ఆయన భార్య మధులిక సహా 13 మంది జవాన్లు మృతి చెందారు. చదవండి: స్కూల్‌కు సెలవులివ్వడం లేదని విషం కలిపాడు! -
బిపిన్ రావత్‌కు నివాళులు అర్పించిన ఎన్నారైలు
న్యూ జెర్సీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌కు న్యూజెర్సీలో సాయి దత్త పీఠం నివాళులు అర్పించింది. న్యూజెర్సీ ఎడిసన్‌లో శివ, విష్ణు ఆలయంలో బిపిన్ రావత్ చిత్రపటం ముందు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించింది. బిపిన్ రావత్‌తో పాటు సైన్యం లో సేవలందించిన రిటైర్డ్ కల్నల్ వీరేంద్ర ఎస్ తవాతియాఈ కార్యక్రమానికి వచ్చారు. బిపిన్ రావత్ తో తనకున్న అనుబంధాన్ని ఆయన స్మరించుకున్నారు. వీర సైనికులకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసారు. ఈ సందర్భంగా సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చివుకుల, మాతా రాజ్యలక్ష్మి (స్పిరిట్యుయల్ గురు, కమ్యూనిటీ లీడర్), సాయి దత్త పీఠం బోర్డు సభ్యులు, ఆలయ భక్తులు, మాతృభూమి కోసం బిపిన్ రావత్ చేసిన సేవలను గుర్తు చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌తో పాటు మరణించిన ఇతర సైనికులందరికీ నివాళులు అర్పించారు. బిపిన్ రావత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు రఘు శర్మ శంకరమంచి తెలిపారు. -
బిపిన్ రావత్ మరణం దేశానికి తీరని లోటు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశసైన్యం స్వయం సమృద్ధి సాధించేదిశగా సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఎంతో కృషి చేశారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో రూ.9,800 కోట్లతో చేపట్టిన సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు. భారతదేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణం ప్రతి దేశభక్తునికి తీరని లోటు. అతను ధైర్యవంతుడు. దేశంలోని సాయుధ బలగాలను స్వావలంబనగా మార్చడానికి చాలా కష్టపడ్డాడు, దీనికి దేశం సాక్షి' అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కాగా, 'భారతదేశం ప్రస్తుతం శోకసంద్రంలో ఉంది. అయితే దేశం సవాళ్లను అధిగమించి అభివృద్ధి దిశగా పనిచేస్తూనే ఉంటుంది. భారతీయులమైన మనం కష్టపడి పనిచేస్తాము. దేశం లోపల, దేశం బయట కూడా సవాళ్లను, ప్రతి సవాళ్లను ఎదుర్కొంటాము. భారతదేశాన్ని మరింత శక్తివంతంగా, సంపన్న దేశంగా తీర్చిదిద్దుతాం' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చదవండి: ('పగ, ద్వేషం ఉంటే నాపై తీర్చుకోండి.. వారు మీకేం అన్యాయం చేశారు') -
బిపిన్ రావత్‌కి వినూత్న నివాళి!... ఆకు పై ప్రతి రూపం చెక్కి!!
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో యావత్ భారత దేశం తుది వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే ఈ తరుణంలో చాలా మంది ప్రముఖులు, సెలబ్రెటీలు, పౌరులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. (చదవండి: డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!) అందరికంటే భిన్నంగా ఇక్కడొక వ్యకి తన కళా నైపుణ్యంతో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కి నివాళులర్పించాడు. ఈ మేరకు కళాకారుడు శశి అడ్కర్ అనే వ్యక్తి రావి ఆకుపై పై బిపిన్ రావత్ ముఖచిత్రాన్ని రూపొందించి నివాళులర్పించాడు. అంతేకాదు ఆ కళాకారుడు ఆకు కళను చేతితో భూమి నుంచి ఆకాశంలోకి చూపిస్తున్నట్లుగా పైకి లేపి వెనుక నుంచి 'తేరి మిట్టి' పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయ్యేలా ఒక వీడియోను తీసి మరీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఐపిఎస్ అధికారి హెచ్‌జిఎస్ ధాలివాల్, నటుడు అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది. దీంతో కేంద్ర మంత్రి 'నీ కళాకృతికి సెల్యూట్" అని ఆ కళాకారుడిని ప్రశసిస్తూ ట్వీట్ చేశారు.ఈ క్రమంలో నెటిజన్లు కూడా స్పందిస్తూ... 'సీడీఎస్ జనరల్ శ్రీ బిపిన్ సింగ్ రావత్‌కు సెల్యూట్ ' అని ఒకరు, 'అల్విదా జనరల్ మీరు మా హృదయాలలో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు' అని మరొకరు ఇలా రకరకాలుగా ట్వీట్ చేశారు. ఈ మేరకు సీడిఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తూ భారత సైన్యం ఇక వెబ్ లింక్‌ని కూడా జారీ చేసింది. (చదవండి: "సాయం" అనే పదానికి అంతరాలు ఉండవంటే ఇదేనేమో...!!) Salute! pic.twitter.com/BVb8grqpgX — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 9, 2021 -
వీరుడా.. వీడ్కోలు
న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికకు పూర్తి సైనిక అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. రావత్ దంపతుల పార్థివ దేహాలకు ఢిల్లీలోని కంటోన్మెంట్ బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో శుక్రవారం సాయంత్రం వారి కుమార్తెలు కృతికా, తరిణి దహన సంస్కారాలు నిర్వహించారు. రావత్ దంపతుల పార్థివదేహాలను పక్కపక్కనే ఉంచి చితి పేర్చారు. మత గురువు సంస్కృత శ్లోకాలు పఠిస్తుండగా, కుమార్తెలిద్దరూ తల్లిదండ్రుల చితికి నిప్పంటించారు. ఈ సందర్భంగా ఉద్విగ్నభరితమైన వాతావరణం నెలకొంది. ప్రజలు భావోద్వేగానికి గురై కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అంతకుముందు రావత్, మధులికకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేంద్ర మంత్రులు, ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్, బ్రిటష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్‌తోపాటు పలు దేశాల రక్షణశాఖ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. రావత్‌కు సైనికులు 17 శతఘ్నులతో గన్ సెల్యూట్ సమర్పించారు. రావత్ అమర్ రహే.. తొలుత శుక్రవారం ఉదయం రావత్, మధులిక భౌతికకాయాలకు వారి అధికారిక నివాసంలో అధికారులు, ప్రజలు కన్నీటి నివాళులర్పించారు. నివాసం ఎదుట భారీగా జనం గుమికూడారు. భారత్ మాతా కీ జై, జనరల్ రావత్ అమర్ రహే, ఉత్తరాఖండ్ కా హీరా అమర్ రహే అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, యూపీ సీఎం యోగి, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ, హరియాణా సీఎం ఖట్టర్, రాజ్యసభ సభ్యుడుఖర్గే, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులు, మత గురువులు రావత్ దంపతుల పార్థివ దేహాల వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. మధ్యాహ్నం 2.20 గంటలకు అంతిమ యాత్ర మొదలైంది. వందలాది మంది యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో త్రివిధ దళాల నుంచి 800 మంది సీనియర్ సైనికులు పాల్గొన్నారు. జవాన్ల కవాతు మధ్య అంతిమ యాత్ర 10 కిలోమీటర్ల మేర కొనసాగి, శ్మశాన వాటికకు చేరుకుంది. ఈ యాత్ర పొడవునా జనం రావత్ దంపతుల భౌతిక కాయాలపై పూలు చల్లి నివాళులర్పించారు. అంత్యక్రియలను దేశవ్యాప్తంగా లక్షలాది మంది టీవీల్లో వీక్షించారు. నేడు హరిద్వార్‌కు చితాభస్మం రావత్ దంపతుల చితాభస్మాన్ని శనివారం ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌కు తీసుకెళ్లనున్నట్లు వారి కుమార్తె తరిణి చెప్పారు. చితాభస్మాన్ని హరిద్వార్‌లో గంగానదిలో నిమజ్జనం చేస్తామని అన్నారు. నా భర్తను నవ్వుతూ సాగనంపాలి బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్ భార్య గీతికా లిడ్డర్ న్యూఢిల్లీ: ‘‘నా భర్తకు ఘనమైన వీడ్కోలు పలకాలి. నవ్వుతూ సాగనంపాలి’’ అని బ్రిగేడియర్ లఖ్వీందర్‌సింగ్ లిడ్డర్ భార్య గీతికా లిడ్డర్ వ్యాఖ్యానించారు. హెలికాప్టర్ నేలకూలిన ఘటనలో జనరల్ రావత్ దంపతులతోపాటు మృతిచెందిన బ్రిగేడియర్ లిడ్డర్ అంత్యక్రియలను శుక్రవారం ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హరియాణా సీఎం ఖట్టర్‌తోపాటు సీనియర్ సైనికాధికారులు అంతకుముందు లిడ్డర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గీతికా లిడ్డర్ మాట్లాడుతూ.. విధులకు వెళ్లిన తన భర్త ఇలా నిర్జీవంగా తిరిగి వస్తారని ఊహించలేదని చెప్పారు. ఆయన మరణం తమ కుటుంబానికి పూడ్చలేని నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుడి భార్యనని, చెదరని నవ్వుతో తన భర్తకు వీడ్కోలు పలుకుతానన్నారు. తన తండ్రి ఒక హీరో, గొప్ప స్ఫూర్తి ప్రదాత అని లిడ్డర్ కుమార్తె ఆష్నా(17) చెప్పారు. తండ్రి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు. 17 గన్ సెల్యూట్ ఎవరికి? రాష్ట్రపతి, అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల అంతిమ వీడ్కోలు సందర్భంగా 21 గన్ సెల్యూట్ సమర్పిస్తుంటారు. నేవీ చీఫ్, ఆర్మీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మరణిస్తే 17 గన్ సెల్యూట్ సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. భారత తొలి డీసీఎస్ జనరల్ రావత్ ర్యాంక్.. ఆర్మీ చీఫ్, వాయుసేనాధిపతి, నావికా దళాధిపతిల ర్యాంక్‌లతో సమానం. అందుకే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లతో సమానంగా అంత్యక్రియల్లో 17 గన్ సెల్యూట్ సమర్పించారు. ‘2233 ఫీల్డ్ రెజిమెంట్’కు చెందిన 17 శతఘ్నులతో రావత్‌కు గన్ సెల్యూట్ చేయించారు. ఇతర దేశాల అధినేతలు, అతిథులు భారత్‌కు వచ్చినప్పుడు 19 గన్ సెల్యూట్‌తో గౌరవ వందనం సమర్పించడం ఆనవాయితీ. హెలికాప్టర్ ప్రమాదంపై ఊహాగానాలు వద్దు న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: 13 మందిని బలిగొన్న హెలికాప్టర్ దుర్ఘటనపై ఎలాంటి ఊహాగానాలు వద్దని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) విజ్ఞప్తి చేసింది. కచ్చితమైన సమాచారం లేకుండా అవాస్తవాలను ప్రచారంలోకి తీసుకురావొద్దని శుక్రవారం ట్వీట్ చేసింది. ప్రమాదంపై ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రమాదంవెనుక కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమంటూ కొందరు నేతలు చెబుతున్న నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాఉండగా,హెలికాప్టర్ ప్రమాదంపై ఎలాంటి అనుమానాలకు తావులేదని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు శుక్రవారం చెప్పారు. నీలగిరి ప్రాంతంలో ఎల్లప్పుడూ కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందని తెలిపారు. -
వీరుడికి వీడ్కోలు....
-
కన్నీరు పెట్టిస్తోన్న సైనిక వీరుడి వీడ్కోలు దృశ్యాలు..
-
బిపిన్ రావత్ మృతి.. ‘దయచేసి ఆ ఊహాగానాలకు చెక్ పెట్టండి’
న్యూఢిల్లీ: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13మంది ప్రాణాలు కోల్పోయిన హెలికాఫ్టర్ ప్రమాదంపై వదంతులు ప్రచారం చేయొద్దని భారతీయ వాయుసేన విజ్ఞప్తిచేసింది. ఊహాగానాలకు దూరంగా ఉండాలని కోరింది. ఘటనపై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తునకు ఆదేశించామని.. దర్యాప్తు బృందం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని పేర్కొంది. విచారణను త్వరితగతిన పూర్తిచేసి.. ప్రమాదానికి గల కారణాలు వెల్లడిస్తుందని ట్విట్టర్లో వెల్లడించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. అప్పటివరకూ ఎలాంటి వదంతులు వ్యాప్తిచేయవద్దని విజ్ఞప్తిచేసింది. మరణించినవారి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరింది. బుధవారం తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ వద్ద హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో సీడీఎస్ రావత్ దంపతులు సహా 13మంది మరణించారు. (చదవండి: అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) -
బిపిన్ రావత్ అంత్యక్రియలు: 17 తుపాకీ వందనాలే ఎందుకు..
సాక్షి, వెబ్‌డెస్క్: తమిళనాడు కూనూర్ సమీపంలో డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో రావత్‌తో పాటు ఆయన భార్య కూడా మరణించారు. రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నారు. ప్రోటోకాల్ ప్రకారం వారికి తుపాకీ వందనం (గన్ సెల్యూట్) సమర్పిస్తారు. అంత్యక్రియల సందర్భంగా బిపిన్ రావత్‌కు 17 గన్ సెల్యూట్ సమర్పిస్తారు. ఈ క్రమంలో మన మదిలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఈ గన్ సెల్యూట్ ఎందుకు, ఎవరికి సమర్పిస్తారు. వేర్వేరు సందర్భాలలో ఈ తుపాకీ గౌరవ వందనం వేర్వేరుగా ఉండటానికి కారణం ఏంటి అనే ప్రశ్నలు మనలో చాలా మందికి వస్తాయి. వాటన్నింటికి సమాధానాలు.. ఇక్కడ లభిస్తాయి. అంత్యక్రియలో సమయంలో తుపాకీ వందనం సమర్పించడం అంటే.. ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అర్థం. అయితే ఎవరికి ఈ గౌరవం లభిస్తుంది అంటే.. రాజకీయం, సాహిత్యం, న్యాయ, విజ్ఞాన, కళా రంగాల్లో విశిష్ట సేవ చేసిన వారికి తుపాకీ వందనం సమర్పిస్తారు. అలానే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున కూడా గన్ సెల్యూట్ ఉంటుంది. దీంతో పాటు భారత సైన్యం.. యుద్ధ, శాంతి సమయాల్లో విశేష కృషి చేసిన వారికి సైనిక వందనం సమర్పిస్తోంది. ఫిరంగి వందనం కూడా సమర్పిస్తారు. ఎవరికి, ఎన్ని తుపాకీ వందనాలు సమర్పిస్తారంటే.. భారత రాష్ట్రపతి, మిలిటరీ, సీనియర్ అధికారులు చనిపోయినప్పుడు.. 21 తుపాకీ వందనాలు (గాల్లోకి 21 సార్లు కాల్పులు జరుపుతారు) సమర్పిస్తారు. త్రివిధ దళాలలో పని చేసిన ఉన్నతాధికారులు మరణిస్తే.. 17 తుపాకీ వందనాలు సమర్పిస్తారు. గతంలో మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఆయన గౌరవార్ధం.. ఢాకాలో 19 తుపాకీ వందనాలు సమర్పించారు. మాజీ రాష్ట్రపతులు, ప్రధాని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సీఎంలు మరణించినప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి.. తుపాకీ వందనం సమర్పిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తే.. దేశవ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించడం, జాతీయ జెండాను అవనతం చేయడం, దేశం అంతటా సెలవు ప్రకటించడం వంటివి చేస్తారు. తొలిసారి మహత్మ గాంధీకి ఇటీవలి కాలంలో మరణించిన వ్యక్తికి సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలో.. లేదో నిర్ణయించే విధంగా నిబంధనలు మార్చబడ్డాయి. భారతదేశంలో తొలిసారిగా మహాత్మా గాంధీకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అప్పటి వరకు దీనికి సంబందించి ఎలాంటి నియమ నింబధనలు రూపొందించలేదు. తుపాకీ వందనం వెనక ఉన్న చరిత్ర... బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి భారతదేశం 21 తుపాకీ వందన సంప్రదాయాన్ని వారసత్వంగా పొందింది. స్వాతంత్య్రానికి ముందు అత్యధికంగా 101 తుపాకీ వందనం ఉండేది. దీనిని రాయల్ సెల్యూట్ అని పిలుస్తారు. దీనిని భారత చక్రవర్తికి (బ్రిటీష్ క్రౌన్) మాత్రమే అందించారు. దీని తర్వాత 31-గన్ సెల్యూట్, రాయల్ సెల్యూట్ ఉంటుంది. ఇది రాణి, రాజ కుటుంబ సభ్యులకు సమర్పిస్తారు. ఇదే పద్దతిని వైస్రాయ్, భారత గవర్నర్ జనరల్‌కు కూడా పాటిస్తారు. దేశాధినేత, విదేశీ సార్వభౌమాధికారులు, వారి కుటుంబ సభ్యులకు 21 గన్ సెల్యూట్ సమర్పించారు. ఇక భారత రాష్ట్రపతికి పలు సందర్భాల్లో.. 21 తుపాకీ వందనం సమర్పిస్తారు. నూతనంగా ఎన్నుకోబడిన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం రోజున తుపాకీ వందనం స్వీకరిస్తారు. ఇక స్వాంతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేయడంతో పాటు.. 21 తుపాకీ వందనం స్వీకరిస్తారు. చదవండి: మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ సాయితేజ మృతి: కన్నీటి సుడులు.. సంద్రమైన ఓదార్పులు -
పప్పా నా హీరో, బిగ్గెస్ట్ మోటివేటర్: బ్రిగేడియర్ లిడ్డర్ కుమార్తె కన్నీరు
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడులోని ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన బాసిన బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్ క్రిమటోరియంలో శనివారం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా లిడ్డర్ సతీమణి గీతిక, కుమార్తె అస్నా భావోద్వేగానికి లోనుకావడం అక్కడున్న వాందరి కళ్ళల్లో కన్నీరు నింపింది. (రావత్ మంచి నీళ్లు అడిగారు.. కాపాడుకోలేకపోయా: ప్రత్యక్ష సాక్షి కంటతడి) ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి అమరుడయ్యారన్న దుఃఖాన్ని గుండెల్లో దాచుకుంటూ కుమార్తె అస్నా తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తండ్రి పార్థివ దేహాన్ని ముద్దు పెట్టుకుని కడసారి వీడ్కోలు పలికిన ఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది. ఈ సందర్భంగా ఆస్రా మాట్లాడుతూ ఆయన అకాల మరణం జాతికి తీరని నష్టం. నన్ను చాలా గారాబం చేసేవారు.. ఇపుడు భయంగా ఉంది. నాకిపుడు 17 ఏళ్లు. ఈ 17 ఏళ్లు నాన్న నాతో ఉన్నారు. ఆ సంతోషకరమైన జ్ఞాపకాలతో ముందుకు వెళ్తా. మా పప్పా నా హీరో, నా బెస్ట్ ఫ్రెండ్. ఆయనే నా బిగ్గెస్ట్ మోటివేటర్ అంటూ కంటతడి పెట్టారు. #WATCH | Daughter of Brig LS Lidder, Aashna Lidder speaks on her father's demise. She says, "...My father was a hero, my best friend. Maybe it was destined & better things will come our way. He was my biggest motivator..." He lost his life in #TamilNaduChopperCrash on Dec 8th. pic.twitter.com/j2auYohtmU — ANI (@ANI) December 10, 2021 బ్రిగేడియర్ లిడ్డర్ పార్థివదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు. ఆ పతాకాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు గీతిక. అనంతరం సతీమణి గీతిక మాట్లాడుతూ ‘‘ఆయన చాలా మంచి మనిషి, స్నేహ శీలి..అందుకే నవ్వుతూ సాగనంపుతామని వచ్చా ఆయన మంచి తండ్రి. నా బిడ్డ ఆయనను చాలా మిస్ అవుతుంది. ఆయన లేకుండా జీవించాల్సిన జీవితం ఇంకా చాలా ఉంది. చాలా నష్టం. కానీ విధి అలా ఉంది..గర్వంగా కంటే చాలా బాధగా ఉంది’’ అని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లిడ్డర్తోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్, మరో 11మంది అసువులు బాసిన సంగతి తెలిసిందే. లిడ్డర్ జనరల్ రావత్‌కు రక్షణ సలహాదారుగా ఉన్నారు. లిడ్డర్ మేజర్ జనరల్ ర్యాంక్‌కి పదోన్నతి పొందాల్సి ఉంది. లిడ్డర్‌కు 2020లో సేన మెడల్, విశిష్ట సేన పతకం లభించింది. గతంలో కశ్మీర్లో ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్స్‌కు నేతృత్వం వహించారు. #WATCH | "...We must give him a good farewell, a smiling send-off, I am a soldier's wife. It's a big loss...," says wife of Brig LS Lidder, Geetika pic.twitter.com/unLv6sA7e7 — ANI (@ANI) December 10, 2021 -
మృత్యువుతో పోరాడుతున్న వరుణ్ సింగ్.. వైరలవుతోన్న లేఖ
న్యూఢిల్లీ: తమిళనాడు కూనూర్ వద్ద డిసెంబర్ 8న చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో సహా 13 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో 14 మంది ఉండగా.. వీరిలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వరుణ్ సింగ్ ప్రస్తుతం బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో వరుణ్ సింగ్ రెండు నెలల క్రితం అనగా సెప్టెంబర్ 21, 2021న తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపల్‌కు రాసిన ఓ లేఖ తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. చండి టెంపుల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వరుణ్ సింగ్ చదువుకున్నారు. చదవులో సామాన్య ప్రతిభ కనబరిచే విద్యార్థులనుద్దేశించి ఈ లేఖ రాశారు వరుణ్ సింగ్. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) ‘‘మీరు చదువులో యావరేజ్ స్టూడెంట్స్ అని ఎప్పుడు బాధపడకండి. చదువులో సామాన్యమైన విద్యార్థిగా ఉండటం తప్పేం కాదు. ప్రతి ఒక్కరు 90 శాతం మార్కులు తెచ్చుకోలేరు. ఒకవేళ మీరు మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులు అయితే మీకు నా అభినందనలు. ఒకవేళ మీరు ర్యాంకర్ కాకపోయినా బాధపడకండి. చదువులో సామాన్య విద్యార్థి అయినందున మీ జీవితం కూడా అలానే ఉంటుంది అని భావించకండి’’ అని వరుణ్ సింగ్ సూచించారు. ‘‘మీకు దేని మీద ఆసక్తో దాన్ని గుర్తించండి. సంగీతం, నటన, రచన ఏది అయినా కావచ్చు. దానిలో రాణించేందుకు శ్రమించండి. చదువులో నేనూ యావరేజ్ స్టూడెంట్‌నే. ఎప్పుడు టాప్ మార్కులు రాలేదు. ఇక తొలిసారి నన్ను స్క్వాడ్రన్‌లో యువ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నియమించిన్పుడు చాలా కంగారు పడ్డాను. ఆ తర్వాత నాకు ఓ విషయం అర్థం అయ్యింది. నేను కనుక నా మనసు, బుద్ధిని దీని మీదే కేంద్రీకరిస్తే.. చాలా అద్భుతంగా పని చేయగలనని తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి నేను అత్యుత్తమంగా పని చేయడం ప్రారంభించాను’’ అని వరుణ్ సింగ్ రాసుకొచ్చారు. (చదవండి: ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు) ‘‘నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నప్పుడు నేను చదువలో, క్రీడల్లో రాణించలేదు. కానీ ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా నియమించినప్పుడు నేను దాని మీద మనసు పెట్టాను. ఆ తర్వాత నాకు విమానాల పట్ల మక్కువ పెరిగింది. అలా నేను మెరుగ్గా పని చేస్తూ.. జీవితంలో ఎదిగాను. తొలుత నేను నా వాస్తవ సామర్థ్యాలను విశ్వసించలేదు. ఈ విషయం నాకు అర్థం అయిన తర్వాత నేను వెనుతిరిగి చూడలేదు. మీరు కూడా మీ మీద నమ్మకం పెట్టుకొండి. మీకు నచ్చిన రంగంలో రాణించేందుకు కృషి చేయండి. మార్కులు మన జీవితానికి కొలమానం కాదు’’ అన్నారు వరుణ్ సింగ్. అంతేకాక తాను శౌర్య చక్ర అవార్డు అందుకోవడానికి ఆర్మీ స్కూలే కారణమని వరుణ్ సింగ్ తన లేఖలో తెలిపారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేలా ఉన్న ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 'It's ok to be mediocre' Inspiring letter of Group Captain Varun Singh, lone survivor in helicopter crash, to principal of his school with request to share it with teenaged students to motivate them. Sharing the wonderful journey & beautiful thoughts of the braveheart with u. pic.twitter.com/vSpymhMg0p — Arun Bothra 🇮🇳 (@arunbothra) December 9, 2021 చదవండి: ఊరే అతడింటికి కదిలొచ్చింది