List Of Famous Persons Died In Helicopter Crash: ప్రముఖులను కబళించిన హెలికాప్టర్‌ ప్రమాదాలు - Sakshi
Sakshi News home page

ప్రముఖులను కబళించిన హెలికాప్టర్‌ ప్రమాదాలు 

Published Thu, Dec 9 2021 7:56 AM | Last Updated on Thu, Dec 9 2021 1:10 PM

Bipin Rawat Death Helicopter Crash That Devastate Celebrities In India - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

List Of Famous Persons Died In Helicopter Crash: దూరాభారాలను ఆఘమేఘాల మీద చేరుకునేందుకు ఉపయోగపడే హెలికాప్టర్లు ఒక్కోమారు మృత్యువాహనాలుగా మారుతున్నాయి. తెలుగురాష్ట్రాలకు సంబంధించి హెలికాప్టర్‌ ప్రమాదం అనగానే దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గుర్తుకువస్తారు. జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన హెలికాప్టర్‌ 2009లో నల్లమల అడవుల ప్రాంతంలో కూలిపోయింది. గతంలో పలువురు మిలటరీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఛాపర్‌ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.  

రక్షణ, మిలటరీ ప్రముఖులు..
1963 జమ్ముకాశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో లెఫ్టినెంట్‌ జనరల్‌ దౌలత్‌సింగ్‌ సహా ఆరుగురు మిలటరీ అధికారులు మృతి చెందారు.  
1997లో రక్షణ శాఖ సహాయమంత్రి ఎన్‌వీఎన్‌ సోము, మేజర్‌ జనరల్‌ రమేశ్‌ చంద్ర నాగ్‌పాల్‌ పయనిస్తున్న హెలికాప్టర్‌ అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్‌ సమీపంలో కుప్పకూలింది.  మొత్తం నలుగురు మరణించారు.  
1993లో ఒక మిలటరీ హెలికాప్టర్‌ భూటాన్‌లో కూలిపోయింది. ఇందులో భారతీయ తూర్పు ప్రాంత ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ జమీల్‌ మొహ్మద్‌తో సహా 8మంది మిలటరీ అధికారులు మరణించారు. అధికారిక పర్యటనలో భాగంగా వారు భూటాన్‌కు వెళ్లారు.  

ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు..
2009 సెప్టెంబర్‌ 2న అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితో సహా ఐదుగురు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. 
2011 ఏప్రిల్‌ 30న అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి దోర్జీఖాండూ పయనిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదానికి గురై ఆయనతో పాటు నలుగురు దుర్మరణం పాలయ్యారు.  
2005లో హరియాణా విద్యుత్‌శాఖ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఓపీ జిందాల్, వ్యవసాయశాఖ మంత్రి సురేందర్‌ సింగ్‌ యూపీలోని షహరాన్‌పూర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.  
2002 మార్చి 3న అప్పటి లోక్‌సభ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి కృష్ణా జిల్లాలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు హెలికాప్టర్‌ కైకలూరులోని ఒక చెరువులో కూలిపోయింది.  

గతంలో త్రుటిలో బయటపడ్డారు..
2015లో రావత్‌ ప్రయాణిస్తున్న ఛాపర్‌ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయన నాగాలాండ్‌లోని దీమాపూర్‌ ఆర్మీక్యాంపునకు వెళ్తున్నారు. రంగపహర్‌ హెలిపాడ్‌ నుంచి చీతా హెలిక్యాప్టర్‌ టేకాఫ్‌ అయిన కొద్ది సెకన్లలోనే కూలిపోయింది. ముక్కుభాగం నేరుగా నేలను ఢీ కొట్టింది. అయితే ఆ సమయంలో రావత్‌తో పాటు అందులో పయనిస్తున్న ఒక కల్నల్, ఇద్దరు పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆరేళ్ల తర్వాత అలాంటి ఛాపర్‌ ప్రమాదమే రావత్‌ను బలితీసుకుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement