Balayogi
-
చంద్రబాబు ద‘మనీ’యం
సాక్షి అమలాపురం: లోక్ సభ మాజీ స్పీకర్, దివంగత జీఎంసీ బాలయోగి వారసుడు గంటి హరీష్ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ దమన నీతికి బలైపోతున్నారు. అమలాపురం నుంచి ఎంపీ టికెట్ రేసులో ఉన్న హరీష్‌కు డబ్బు లేదనే ఉద్దేశంతో మొండిచేయి చూపేందుకు టీడీపీ అధిష్టానం యత్నిస్తోంది. ఈ విషయంపై అలిగిన హరీష్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. దీంతో బాలయోగి అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. హరీష్ ప్రస్తుతం టీడీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ త్రిమెన్ కమిటీలోనూ సభ్యునిగా కొనసాగుతున్నారు. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని తొలి నుంచీ ఆసక్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో హరీష్‌ను ఎంపీగా బరిలోకి దింపారు. 39,996 ఓట్ల తేడాతో హరీష్ ఓడిపోయారు. పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కన్నా హరీష్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి పార్లమెంటు స్థానంలో పోటీ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అయితే టీడీపీ అధిష్టానం డబ్బు లేదనే ఉద్దేశంతో హరీష్‌ను పక్కన పెట్టేందుకు యత్నిస్తోంది. హరీష్‌కు క్యాడర్లో పట్టు లేదని సాకుగా చూపుతోంది. హరీష్ మరీ పట్టుబడితే పి.గన్నవరం, లేదా అమలాపురం అసెంబ్లీకి పంపించాలని పార్టీ అదినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ విషయాన్ని హరీష్‌కు చెప్పేశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీంతో అలిగిన హరీష్ వారం పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయినా అధిష్టానం చలించలేదు. డబ్బు లేనందున హరీష్‌కు ఎంపీ సీటు ఇవ్వలేమని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. పాము‘కొనేనా’! హరీష్ స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ ఏజేవీబీ మõßæశ్వరరావు కుమార్తె, పాము సత్యశ్రీని పార్లమెంట్‌కు పంపితే ఎలా ఉంటుంది అనేదానిపై టీడీపీ ఆలోచన చేస్తోంది. ఆమె పార్టీలో కొత్తగా చేరినా.. ఆర్థికంగా స్థితిమంతురాలు కావడంతో అధినేత మొగ్గు చూపుతున్నారని తెలిసింది. గుంటూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త కూడా అమలాపురం ఎంపీ టికెట్‌పై ఆశతో త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఆయన అభ్యర్థిత్వాన్నీ బాబు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీంతో బాలయోగి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ‘ఆనంద’రావుకు దుఃఖమేనా! హరీష్ అసెంబ్లీకి వెళ్లేందుకు అంగీకరిస్తే అమలాపురం, పి. గన్నవరంలో ఒక దానిని ఎంపిక చేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించిందని తెలిసింది. ఆయనను అమలాపురం నుంచి అసెంబ్లీ బరిలో నిలపాలని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా యత్నిస్తున్నట్టు సమాచారం. రాజప్పతోపాటు ఆయన వర్గం హరీష్‌ను ఒప్పించే యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హరీష్‌ను అమలాపురం అసెంబ్లీ బరిలో నిలపడం ద్వారా ఈ సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు చెక్ పెట్టాలని రాజప్ప యోచిస్తున్నారు. ఒకప్పుడు తన శిషు్యడైన ఆనందరావు ఎదురు తిరగడంతో గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకుండా రాజప్ప చివరి వరకు విఫలయత్నం చేశారు. ఈసారి ఆనందరావుకు ఎలాగైనా సీటు రాకుండా చేయాలని పావులు కదుపుతున్నారు. -
ప్రముఖులను కబళించిన హెలికాప్టర్ ప్రమాదాలు
List Of Famous Persons Died In Helicopter Crash: దూరాభారాలను ఆఘమేఘాల మీద చేరుకునేందుకు ఉపయోగపడే హెలికాప్టర్లు ఒక్కోమారు మృత్యువాహనాలుగా మారుతున్నాయి. తెలుగురాష్ట్రాలకు సంబంధించి హెలికాప్టర్ ప్రమాదం అనగానే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకువస్తారు. జిల్లా పర్యటనకు వెళ్తున్న ఆయన హెలికాప్టర్ 2009లో నల్లమల అడవుల ప్రాంతంలో కూలిపోయింది. గతంలో పలువురు మిలటరీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఛాపర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రక్షణ, మిలటరీ ప్రముఖులు.. ►1963 జమ్ముకాశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో లెఫ్టినెంట్ జనరల్ దౌలత్సింగ్ సహా ఆరుగురు మిలటరీ అధికారులు మృతి చెందారు. ►1997లో రక్షణ శాఖ సహాయమంత్రి ఎన్వీఎన్ సోము, మేజర్ జనరల్ రమేశ్ చంద్ర నాగ్‌పాల్ పయనిస్తున్న హెలికాప్టర్ అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్ సమీపంలో కుప్పకూలింది. మొత్తం నలుగురు మరణించారు. ►1993లో ఒక మిలటరీ హెలికాప్టర్ భూటాన్‌లో కూలిపోయింది. ఇందులో భారతీయ తూర్పు ప్రాంత ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ జమీల్ మొహ్మద్‌తో సహా 8మంది మిలటరీ అధికారులు మరణించారు. అధికారిక పర్యటనలో భాగంగా వారు భూటాన్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు.. ►2009 సెప్టెంబర్ 2న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా ఐదుగురు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ►2011 ఏప్రిల్ 30న అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీఖాండూ పయనిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై ఆయనతో పాటు నలుగురు దుర్మరణం పాలయ్యారు. ►2005లో హరియాణా విద్యుత్‌శాఖ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఓపీ జిందాల్, వ్యవసాయశాఖ మంత్రి సురేందర్ సింగ్ యూపీలోని షహరాన్‌పూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ►2002 మార్చి 3న అప్పటి లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కృష్ణా జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు హెలికాప్టర్ కైకలూరులోని ఒక చెరువులో కూలిపోయింది. గతంలో త్రుటిలో బయటపడ్డారు.. 2015లో రావత్ ప్రయాణిస్తున్న ఛాపర్ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయన నాగాలాండ్‌లోని దీమాపూర్ ఆర్మీక్యాంపునకు వెళ్తున్నారు. రంగపహర్ హెలిపాడ్ నుంచి చీతా హెలిక్యాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే కూలిపోయింది. ముక్కుభాగం నేరుగా నేలను ఢీ కొట్టింది. అయితే ఆ సమయంలో రావత్‌తో పాటు అందులో పయనిస్తున్న ఒక కల్నల్, ఇద్దరు పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆరేళ్ల తర్వాత అలాంటి ఛాపర్ ప్రమాదమే రావత్‌ను బలితీసుకుంది. -
రెండోసారి పోటీ హుళక్కే!
అమలాపురం అసెంబ్లీ టికెట్ విషయంలో టీడీపీలో చరిత్ర పునరావృతం అవుతుందా? అమలాపురం (పాత అల్లవరం నియోజకవర్గంలో) టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేకు.. ఆ తరువాత టికెట్ దక్కదన్న సెంటిమెంట్ నిజం కానుందా? అంటే అవునంటున్నాయి టీడీపీ వర్గాలు. సిటింగ్ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కించుకునే అవకాశాలు లేవంటున్నారు. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్, పార్టీలో మరో సీనియర్ నాయకుడు పరమట శ్యామ్ రూపంలో ఆనందరావుకు టికెట్ విషయంలో అడ్డంకి ఏర్పడనుంది. తూర్పుగోదావరి , అమలాపురం: రూ.కోట్లతో అభివృద్ధి చేశానని గొప్పలకు చెప్పుకుంటున్న అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుకు గెలుపు అవకాశాలు లేవంటూ టీడీపీ సొంత సర్వే నివేదికలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీకి దన్నుగా ఉన్న ఒక ప్రధాన సామాజిక వర్గం ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉండి పార్టీకి దూరంగా ఉంది. కొంతమంది పార్టీ కూడా మారుతున్నారు. ఇవి కూడా ఆయన టికెట్ పొందడానికి ప్రధాన అవరోధంగా ఉన్నాయంటున్నారు. దీంతో పార్టీ అధిష్టానం కొత్త అభ్యర్థుల అన్వేషణలో పడిందని కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోంది. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి వారసుడు హరీష్ అయితే బాగుంటుందనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ సీనియర్ నాయకుడు, గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌ను త్రుటిలో చేజార్చుకున్న పరమట శ్యామ్ పేరును మరో ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు. అయితే బాలయోగి వారసుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, తిరిగి సిటింగ్ ఎమ్మెల్యే ఆనందరావుదే టికెట్ అంటూ ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో, సంక్రాంతి సందర్భంగా బాలయోగి అభిమానుల పేరుతో హరీష్ ఫ్లెక్సీలను అమలాపురం పట్టణంతోపాటు పలుచోట్ల ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. హరీష్ రాజకీయాల్లోకి వస్తాడన్న ప్రచారం జోరందుకుంది. హరీష్ రాకను ఉప ముఖ్యమంత్రి రాజప్ప వర్గం అంతర్గతంగా స్వాగతిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజకీయ గురువు బాలయోగి తనయుడిని రంగంలోకి తీసుకురావడం ద్వారా ఆయన రుణం తీర్చుకోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో బలమైన పోటీదారుడిని రంగంలో నిలపాలన్న పార్టీ అధిష్టానం యోచనకు మార్గం ఏర్పడుతుందని రాజప్ప వర్గీయులు అంటున్నారు. అయితే హరీష్‌ను లోక్‌సభకు పంపుతారనే ప్రచారం కూడా సాగుతోంది. మార్పు కోరుకుంటున్న రాజప్ప? అమలాపురం నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థిని మార్చాలని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప భావిస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. పార్టీపరంగా ఎమ్మెల్యే అయిన వ్యక్తికి రెండోసారి అవకాశం ఇచ్చేందుకు రాజప్ప అంగీకరించరనే సెంటిమెంట్ కూడా ఉంది. 1999 ఎన్నికల్లో అల్ల వరం సిటింగ్ ఎమ్మెల్యే ఏజేవీబీ మహేశ్వరావును కాదని చిల్లా జగదీశ్వరికి టికెట్ ఇప్పించారు. 2004 ఎన్నికల్లో ఆమెను కాదని పండు స్వరూపరాణిని నిలబెట్టారు. తాజాగా సిటింగ్ ఎమ్మెల్యేకు మొండిచేయి చూపుతారన్న ప్రచారం సాగుతోంది. శిష్యుడిగా భావించి ఆనందరావుకు టికెట్ ఇచ్చే విషయంలో రాజప్పతో ఇటీవల ఏర్పడిన అధిప్యత పోరే కారణమని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో రాజప్ప వర్గం పెత్తనం ఎమ్మెల్యే వర్గానికి మింగుడ పడడం లేదు. ఎమ్మెల్యే వర్గంలో కీలకంగా ఉన్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గునిశెట్టి చినబాబు రెండోసారి చైర్మన్ పదవి ఇవ్వలేదని రాజప్పపై అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న ఆయను ఎమ్మెల్యే వారించకపోవడంపై రాజప్ప గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల వివాదంలో చిక్కుకున్న సోదరుడు జగ్గయ్యనాయుడిని ఎమ్మెల్యే వెనకేసుకు రాకపోవడం కూడా రాజప్ప వర్గం అసంతృప్తి ఉందంటున్నారు. అమలాపురం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఖరారవుతుం దన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
జస్టిస్ బాలయోగికి హైకోర్టు ఘన సన్మానం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నక్కా బాలయోగి ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయనకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు కావడంతో శుక్రవారమే కార్యక్రమం నిర్వహించారు. జస్టిస్ బాలయోగికి వీడ్కోలు పలికేందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, రిజిష్ట్రార్ జనరల్, ఇతర రిజిష్ట్రార్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఏసీజే ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థకు జస్టిస్ బాలయోగి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం బాలయోగి మాట్లాడుతూ ఇన్నేళ్ల తన న్యాయప్రస్థానంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి హైకోర్టులో ఉన్నప్పుడు తాను జడ్జి పదవికి రాజీనామా చేశానని, అయితే న్యాయమూర్తుల సంఖ్య తక్కువ ఉన్న నేపథ్యంలో రాజీనామాను ఉపసంహరించుకోవాలని ఉమ్మడి హైకోర్టు సీజే చేసిన సూచన మేరకు రాజీనామాను ఉపసంహరించుకున్నానని ఆయన చెప్పారు. అంతకు ముందు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామన్నదొర మాట్లాడారు. జస్టిస్ బాలయోగిని న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. -
చార్జిషీట్ మీడియాకు ఎలా లీకైంది?
కొన్ని పత్రికల్లో దీనిపై కథనాలెలా వస్తున్నాయి? వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ కోర్టు జడ్జి ప్రశ్న ఈ కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన జగన్ న్యాయవాది హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ సమర్పించిన చార్జిషీట్ మీడియాకు ఎలా లీక్ అయిందని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎన్.బాలయోగి ప్రశ్నించారు. ‘చార్జిషీట్‌ను మీడియాకు ఎవరు ఇస్తున్నారు? నేనే ఇంకా చదవలేదు. చార్జిషీట్లో పేర్కొన్న ఆరోపణలు తదితర అంశాలపై యథాతథంగా కొన్ని పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నాయి’ అని అన్నారు. చార్జిషీట్లోని సమాచారాన్ని సీబీఐ ఇస్తోందా? నిందితుల తరఫు న్యాయవాదులు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. చార్జిషీట్లోని అంశాలను పేర్కొంటూ కథనాలను ప్రచురిస్తుండడంపై జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిశీలనలో ఉన్న చార్జిషీట్లోని అంశాలను పేర్కొంటూ మీడియా కథనాలను ఎలా ప్రచురిస్తుందని ప్రశ్నించారు. మీడియా ట్రయల్స్ చేయడం సరికాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసినా... చార్జిషీట్ దాఖలు చేసిన వెంటనే, కోర్టు పరిశీలనలో ఉండగానే అందులోని అంశాలను పేర్కొంటూ వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు. ‘సీబీఐ సమర్పించిన చార్జిషీట్ కోర్టు పరిశీలనలో ఉంది. కోర్టు నుంచి బయటకు వెళ్లే అవకాశం లేదు. చార్జిషీట్లోని అన్ని అంశాలను, డాక్యుమెంట్లను పరిశీలించి విచారణకు స్వీకరించిన తర్వాతే నిందితుల తరఫు న్యాయవాదులకు కోర్టు అందజేస్తుంది. కోర్టు నుంచి గానీ, మా నుంచి గానీ చార్జిషీట్ లీక్ అయ్యే అవకాశం లేదు. సీబీఐ మాత్రమే దాన్ని లీక్ చేసే అవకాశం ఉంది’ అని తెలిపారు. చార్జిషీట్ మీడియాకు ఎలా అందిందో తమకు తెలియదని సీబీఐ స్పెషల్ పీపీ కోర్టుకు నివేదించారు. నిబంధనలకు లోబడే తమకు భూకేటాయింపులు జరిగాయని, ఈ కేసు నుంచి తమ పేరును తొలగించాలని కోరుతూ హెటిరో డ్రగ్స్ ఎండీ శ్రీనివాసరెడ్డి, హెటిరో సంస్థ వేర్వేరుగా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను మంగళవారం విచారించిన సందర్భంగా న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కంపెనీల్లో ఫార్మా కంపెనీల పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్లో ఎలాంటి ఆధారాలు లేకుండానే డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ వాదనలు వినిపిస్తోందని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అభియోగాలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆధారంగా చూపించి, వాదనలు వినిపిస్తే వాటికి తాము వివరణ ఇస్తామని నివేదించారు. ఈ సందర్భంగా చార్జిషీట్లోని పేర్కొన్న అంశాలను సీబీఐ తరఫు న్యాయవాది చదివి వినిపిస్తూ.. నిందితులపై అభియోగాలు నమోదు చేయవచ్చని నివేదించారు. ఈ పిటిషన్‌పై వాదనలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. -
కాంగ్రెస్సోళ్లందరూ చెడ్డోళ్లు కాదు: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చోట కాంగ్రెస్ నుంచి వచ్చే వారిని చేర్చుకుంటున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేర్చుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారందరూ చెడ్డోళ్లు కాదంటూ కితాబిచ్చారు. మంచివారినే టీడీపీలో చేర్చుకుంటున్నామని అన్నారు. సోమవారం రాత్రి తన నివాసంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలను చేర్చుకోవటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యవహారాలపై ఎవరూ మీడియాకు ఎక్కవద్దని హెచ్చరించారు. ఎవరినైనా పార్టీలో చేర్చుకునే ముందు స్థానిక నేతలందరితో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంటున్నానని చెప్పారు. తెలంగాణతో పాటు సీమాంధ్ర ప్రాంతానికి కమిటీ వేస్తానని తాను నేతలతో పాటు మీడియాకూ చెప్పానని, ఈ విషయంలో డప్పు కొట్టుకుంటూ ఊరూరా తిరగాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోరుునా తాను భయపడేది లేదన్నారు. తెలంగాణ వచ్చేంత వరకూ టీడీపీలో కొనసాగిన నేతలు, ఎమ్మెల్యేలు కేవలం స్వార్థంతోనే ఇప్పుడు బయటకు వెళ్లిపోతున్నారని విమర్శించారు. తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తూ ఎర్రబెల్లి దయాకరరావు రాసిన లేఖ తనకు అందలేదని చెప్పారు. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ప్రణాళికను తయారు చేసేందుకు యనమల రామకృష్ణుడు నేతృత్వంలో పయ్యావుల కేశవ్, రావులపాటి సీతారామారావు తదితరులతో ఒక కమిటీ వేశానని చెప్పారు. సాధారణ ఎన్నికలకు ముందు పురపాలక ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సంక్షోభమేనని విమర్శించారు. పురపాలక ఎన్నికలకు ప్రత్యేకంగా ప్రణాళికను విడుదల చేస్తామన్నారు. పురపాలక ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ తరహాలో ఇక్కడ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు తినుబండారాలు అందిస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరించేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ విలేకరుల సమావేశానికి సాక్షిని అనుమతించలేదు. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్త ఇస్తున్నాం. సాక్షిని అనుమతించి ఉంటే కొన్ని ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు కోరేది. 1. కాంగ్రెస్ వారిని చేర్చుకోవడాన్ని కోడెల శివప్రసాదరావు, అయ్యన్నపాత్రుడు లాంటి మీ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు కదా? 2. పార్టీ ఏర్పాటు చేసిన 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ వాళ్లను చేర్చుకుని వారికే టికెట్లు ఇచ్చి పార్టీని నడిపించుకోవలసిన దుస్థితి రావడానికి కారణమెవరంటారు? 3. చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన వారే. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానని సవాలు విసిరారు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఎన్టీఆర్‌ను గద్దెదింపారు. అలాంటిది మేము టీడీపీలో చేరితే తప్పేమిటని కాంగ్రెస్ నేతలంటున్నారు. దీనిపై మీరేమంటారు? బాలయోగికి నివాళులు: లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి 12వ వర్ధంతి సభను సోమవారం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. బాలయోగి విలువలతో కూడిన రాజకీయాల కోసం పనిచేశారని చంద్రబాబు నివాళులర్పించారు.