సాక్షి అమలాపురం: లోక్ సభ మాజీ స్పీకర్, దివంగత జీఎంసీ బాలయోగి వారసుడు గంటి హరీష్ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ దమన నీతికి బలైపోతున్నారు. అమలాపురం నుంచి ఎంపీ టికెట్ రేసులో ఉన్న హరీష్‌కు డబ్బు లేదనే ఉద్దేశంతో మొండిచేయి చూపేందుకు టీడీపీ అధిష్టానం యత్నిస్తోంది. ఈ విషయంపై అలిగిన హరీష్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. దీంతో బాలయోగి అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. హరీష్ ప్రస్తుతం టీడీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు.
పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ త్రిమెన్ కమిటీలోనూ సభ్యునిగా కొనసాగుతున్నారు. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని తొలి నుంచీ ఆసక్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో హరీష్‌ను ఎంపీగా బరిలోకి దింపారు. 39,996 ఓట్ల తేడాతో హరీష్ ఓడిపోయారు. పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కన్నా హరీష్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి పార్లమెంటు స్థానంలో పోటీ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
అయితే టీడీపీ అధిష్టానం డబ్బు లేదనే ఉద్దేశంతో హరీష్‌ను పక్కన పెట్టేందుకు యత్నిస్తోంది. హరీష్‌కు క్యాడర్‌లో పట్టు లేదని సాకుగా చూపుతోంది. హరీష్ మరీ పట్టుబడితే పి.గన్నవరం, లేదా అమలాపురం అసెంబ్లీకి పంపించాలని పార్టీ అదినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ విషయాన్ని హరీష్‌కు చెప్పేశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీంతో అలిగిన హరీష్ వారం పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయినా అధిష్టానం చలించలేదు. డబ్బు లేనందున హరీష్‌కు ఎంపీ సీటు ఇవ్వలేమని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది.
పాము‘కొనేనా’!
హరీష్ స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ ఏజేవీబీ మõßæశ్వరరావు కుమార్తె, పాము సత్యశ్రీని పార్లమెంట్‌కు పంపితే ఎలా ఉంటుంది అనేదానిపై టీడీపీ ఆలోచన చేస్తోంది. ఆమె పార్టీలో కొత్తగా చేరినా.. ఆర్థికంగా స్థితిమంతురాలు కావడంతో అధినేత మొగ్గు చూపుతున్నారని తెలిసింది. గుంటూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త కూడా అమలాపురం ఎంపీ టికెట్‌పై ఆశతో త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఆయన అభ్యర్థిత్వాన్నీ బాబు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీంతో బాలయోగి అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
‘ఆనంద’రావుకు దుఃఖమేనా!
హరీష్ అసెంబ్లీకి వెళ్లేందుకు అంగీకరిస్తే అమలాపురం, పి. గన్నవరంలో ఒక దానిని ఎంపిక చేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించిందని తెలిసింది. ఆయనను అమలాపురం నుంచి అసెంబ్లీ బరిలో నిలపాలని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా యత్నిస్తున్నట్టు సమాచారం. రాజప్పతోపాటు ఆయన వర్గం హరీష్‌ను ఒప్పించే యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
హరీష్‌ను అమలాపురం అసెంబ్లీ బరిలో నిలపడం ద్వారా ఈ సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు చెక్ పెట్టాలని రాజప్ప యోచిస్తున్నారు. ఒకప్పుడు తన శిషు్యడైన ఆనందరావు ఎదురు తిరగడంతో గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకుండా రాజప్ప చివరి వరకు విఫలయత్నం చేశారు. ఈసారి ఆనందరావుకు ఎలాగైనా సీటు రాకుండా చేయాలని పావులు కదుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment