Amalapuram Assembly Constituency
-
ఒకరి వెంట మరొకరు..
సాక్షి అమలాపురం: అమలాపురం అసెంబ్లీ పరిధిలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలలో సీనియర్లకు, కొన్ని సామాజికవర్గాల వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. చివరకు పార్టీలను వీడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుమానంతో అడుగడుగునా వేధింపులకు గురి చేయడంతో వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆ పార్టీల అధిష్టానాలు స్పందించకపోవడం దారుణం. జనసేనకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం దక్కకపోవడంతో ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్చార్జులు డీఎంఆర్ శేఖర్, శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడారు. వీరితో పాటు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ వెళ్లిపోయింది. వీరంతా వైఎస్సార్ సీపీలో చేరారు. ఇప్పుడు టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ప్రధానంగా కాపు సామాజికవర్గానికి చెందినవారు టీడీపీని వీడుతుండడం గమనార్హం. నాయకులే కాదు, వందలాది మంది పార్టీల కార్యకర్తలు సైతం ఆ రెండు పార్టీలకు గుడ్‌బై చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పరమట శ్యామ్ రెబల్‌గా పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరితో పాటు పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఏకంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. టీడీపీ రెబల్ అభ్యర్థి శ్యామ్‌కు జగ్గయ్యనాయుడు మద్దతు ఉందని టీడీపీ అభ్యర్థి ఆనందరావు మద్దతుదారులు బహిరంగంగా ఆరోపిస్తుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.జనసేన, టీడీపీలను వీడుతున్నవారిలో కాపు సామాజికవర్గం వారు అధికంగా ఉండడం విశేషం. జనసేనతో భవిష్యత్ లేదని తేలిపోవడంతోపాటు టీడీపీలో గుర్తింపు కరువడడంతో వారు పార్టీని వీడిపోతున్నారు. పార్టీ జిల్లా అధిష్టానం కలుగజేసుకుంటుందా? అంటే అదీ లేదు. జనసేన పారీ్టకి జిల్లాలో ఒక యంత్రాంగం అంటూ లేదు. టీడీపీలో తగువులు తీర్చాల్సిన నేతలు గొడవలు పెడుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు పారీ్టకి గుడ్‌బై చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేనల్లో వలసలు ఆగకపోవడంతో ఆ ప్రభావం ఫలితంపై పడుతోందని రాజకీయ విశ్లేషకుల భావన.హేళన చేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్నాను. ఇప్పుడు నియోజకవర్గ పెద్దలు నన్ను పట్టించుకోవడం లేదు. పైగా నా సామాజికవర్గాన్ని కించిపరుస్తూ హేళన చేశారు. ఇప్పటికి నాలుగుసార్లు పోటీ చేశారు. మీరు ఒకసారి మాత్రమే గెలిచారు. ఈసారి అల్లవరం నుంచి అవకాశం ఇవ్వాలని పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావును కోరితే మమ్మల్ని పక్కన బెట్టారు. – అడపా కృష్ణ ప్రసాద్, అల్లవరం మండలం. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడుఇదేనా పార్టీ ఇచ్చే గుర్తింపు పార్టీ సీనియర్ అనే గౌరవం లేకుండా చాలా సందర్భాలలో తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పార్టీ నాయకులు మమ్మల్ని అడుగడుగునా అవహేళన చేస్తున్నారు. ఇదేనా పార్టీ మాకు ఇచ్చే గుర్తింపు. పార్టీ బాధ్యులే వర్గాలు కడుతున్నారు. – లింగోలు వెంకన్న (పెదకాపు), జనుపల్లి మాజీ సర్పంచ్, ఆత్మ మాజీ చైర్మన్, టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడురాజకీయాల నుంచి తప్పుకుంటున్నా పార్టీలో ఎంతోమంది సీట్లు ఆశిస్తారు. వారంతా మమ్మల్ని కలిసి మద్దతు కోరతారు. అంతమాత్రాన మాకు వర్గాలు కడతారా? మా కుటుంబం టీడీపీ విజయానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. – నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, మాజీ హోం మంత్రి చినరాజప్ప సోదరుడుపట్టించుకోవడం లేదు జనసేన పార్టీ పల్లకీ మోసినా మాకు గుర్తింపు లేదు. టీడీపీ నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అడగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయి. మా సేవలకు గుర్తింపు దక్కడం లేదు. – మోకా బాలయోగి, మాజీ సర్పంచ్, రెళ్లుగడ్డ, అల్లవరం మండలంటీడీపీకి మద్దతు ఇవ్వడం తప్పు గ్రామంలో 1,200 పార్టీ సభ్యత్వాలు చేయించగా జనసేన పెద్దలు ఘనంగా సత్కరించారు. కానీ ఇప్పుడు నేనే పార్టీ వీడి వెళ్లాల్సి వస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు గుర్తింపు లేక జనసేనకు వచ్చాను. ఇప్పుడు అదే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వడం చాలా తప్పు. – గొలకోటి వెంకటేష్, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు అందుకే స్వతంత్ర అభ్యరి్థగా పోటీ ఐదుసార్లుగా పార్టీ టిక్కెట్ ఆశించినా నాకు అవకాశం దక్కలేదు. ఈసారి టిక్కెట్ ఇవ్వలేదు సరికదా.. అడుగడుగునా నన్ను అవమానించారు. నన్ను ఎవరో ప్రభావితం చేస్తే పోటీలో ఉన్నానని తప్పుడు ప్రచారం చేశారు. నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటే వారి వద్ద నుంచి స్పందన లేదు. అందుకే స్వతంత్ర అభ్యరి్థగా నేను పోటీలో ఉన్నాను. – పరమట శ్యామ్, టీడీపీ రెబల్ అభ్యర్థి -
చంద్రబాబు ఝలక్.. జనసేన కౌంటర్!
సాక్షి అమలాపురం: ఓ వైపు జనసేనతో పొత్తు ఉందని చెబుతారు..మరోవైపు తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తారు..ఇదీ బాబు మార్కు మిత్ర ధర్మం. రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉందని ఇరు పార్టీల అధినేతలూ ప్రకటించారు. కానీ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ఇప్పటివరకూ కొలిక్కి రాలేదు. అయినప్పటికీ టీడీపీ చేపట్టిన ‘రా.. కదలి రా’ సభల్లో మాత్రం తమపార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ చంద్రబాబు పిలుపునివ్వడం జనసేన నేతలకు, ఆశావహులకు మింగుడుపడడం లేదు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు ‘రా... కదలిరా..’ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంటరీ జనసేన ఇన్చార్జీలు, నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం వారు ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. వాస్తవానికి సభలో టీడీపీ కార్యకర్తలకన్నా జన సైనికుల సందడే అధికంగా ఉంది. ఇంతమంది ఉన్న సభలో చంద్రబాబు.. మండపేట నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వేగుళ్ల జోగేశ్వరరావును మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో జనసేన మండపేట ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ అక్కడే ఉన్నారు. సభలో తమ అభ్యర్థి జోగేశ్వరరావు అని బాబు ప్రకటించడంతో లీలాకృష్ణతో పాటు జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. బాబు పక్కనే ఉన్న గంటి హరీష్‌ను మాత్రం పార్లమెంట్‌కు పంపాలని బాబు పిలుపునివ్వకపోవడం గమనార్హం. ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారు? సీట్ల సర్దుబాటు ఖరారు కాకున్నా.. చంద్రబాబు ఏకపక్షంగా తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించడం చూసి, జనసేన ఆశావహులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రమేయం లేకుండా ఇలా ఏకపక్షంగా జోగేశ్వరరావును మళ్లీ గెలిపించండంటూ చంద్రబాబే పిలుపునివ్వడంపై జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా బాబు ప్రవర్తించడంతో టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలెవ్వరూ వెళ్లవద్దంటూ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి లీలాకృష్ణ ఆదేశించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లీలాకృష్ణ తానలా చెప్పలేదన్నా.. జనసేన అనుకూల సోషల్ మీడియాలో టీడీపీపై సెటైర్లు కొనసాగుతూనే ఉన్నాయి. చాలాచోట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు తమదే సీటు అంటూ ప్రచారం చేస్తుండడం కూడా జనసేన ఇన్చార్జిలకు మింగుడు పడడంలేదు. ‘మా పార్టీ అధినేత పొత్తుకు వెళ్లినట్టు లేదు.. కాళ్ల బేరానికి వెళ్లినట్టుంది’ అంటూ సగటు జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు ద‘మనీ’యం
సాక్షి అమలాపురం: లోక్ సభ మాజీ స్పీకర్, దివంగత జీఎంసీ బాలయోగి వారసుడు గంటి హరీష్ టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ దమన నీతికి బలైపోతున్నారు. అమలాపురం నుంచి ఎంపీ టికెట్ రేసులో ఉన్న హరీష్‌కు డబ్బు లేదనే ఉద్దేశంతో మొండిచేయి చూపేందుకు టీడీపీ అధిష్టానం యత్నిస్తోంది. ఈ విషయంపై అలిగిన హరీష్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లినా పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. దీంతో బాలయోగి అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. హరీష్ ప్రస్తుతం టీడీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ త్రిమెన్ కమిటీలోనూ సభ్యునిగా కొనసాగుతున్నారు. అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని తొలి నుంచీ ఆసక్తిగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో హరీష్‌ను ఎంపీగా బరిలోకి దింపారు. 39,996 ఓట్ల తేడాతో హరీష్ ఓడిపోయారు. పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కన్నా హరీష్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అప్పటి నుంచి పార్లమెంటు స్థానంలో పోటీ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అయితే టీడీపీ అధిష్టానం డబ్బు లేదనే ఉద్దేశంతో హరీష్‌ను పక్కన పెట్టేందుకు యత్నిస్తోంది. హరీష్‌కు క్యాడర్లో పట్టు లేదని సాకుగా చూపుతోంది. హరీష్ మరీ పట్టుబడితే పి.గన్నవరం, లేదా అమలాపురం అసెంబ్లీకి పంపించాలని పార్టీ అదినేత చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ విషయాన్ని హరీష్‌కు చెప్పేశారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీంతో అలిగిన హరీష్ వారం పాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. అయినా అధిష్టానం చలించలేదు. డబ్బు లేనందున హరీష్‌కు ఎంపీ సీటు ఇవ్వలేమని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. పాము‘కొనేనా’! హరీష్ స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ ఏజేవీబీ మõßæశ్వరరావు కుమార్తె, పాము సత్యశ్రీని పార్లమెంట్‌కు పంపితే ఎలా ఉంటుంది అనేదానిపై టీడీపీ ఆలోచన చేస్తోంది. ఆమె పార్టీలో కొత్తగా చేరినా.. ఆర్థికంగా స్థితిమంతురాలు కావడంతో అధినేత మొగ్గు చూపుతున్నారని తెలిసింది. గుంటూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త కూడా అమలాపురం ఎంపీ టికెట్‌పై ఆశతో త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఆయన అభ్యర్థిత్వాన్నీ బాబు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. దీంతో బాలయోగి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ‘ఆనంద’రావుకు దుఃఖమేనా! హరీష్ అసెంబ్లీకి వెళ్లేందుకు అంగీకరిస్తే అమలాపురం, పి. గన్నవరంలో ఒక దానిని ఎంపిక చేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించిందని తెలిసింది. ఆయనను అమలాపురం నుంచి అసెంబ్లీ బరిలో నిలపాలని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా యత్నిస్తున్నట్టు సమాచారం. రాజప్పతోపాటు ఆయన వర్గం హరీష్‌ను ఒప్పించే యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హరీష్‌ను అమలాపురం అసెంబ్లీ బరిలో నిలపడం ద్వారా ఈ సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు చెక్ పెట్టాలని రాజప్ప యోచిస్తున్నారు. ఒకప్పుడు తన శిషు్యడైన ఆనందరావు ఎదురు తిరగడంతో గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాకుండా రాజప్ప చివరి వరకు విఫలయత్నం చేశారు. ఈసారి ఆనందరావుకు ఎలాగైనా సీటు రాకుండా చేయాలని పావులు కదుపుతున్నారు. -
కోనసీమ జిల్లా: టీడీపీ నేతలకు అంగన్వాడీల ఝలక్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో టీడీపీ నేతలకు అంగన్వాడీలు ఝలక్ ఇచ్చారు. ధర్నాలో ఉన్న అంగన్వాడీలకు మద్దతు పలికేందుకు వచ్చిన టీడీపీ నేతలను పొమ్మంటూ అంగన్వాడీలు తెగేసి చెప్పారు. తమను గుర్రాలతో తొక్కించి, తమపై దాష్టీకం ప్రదర్శించిన చంద్రబాబు మద్దతు తమకు అవసరం లేదని తేల్చి చెప్పడంతో అంగన్వాడీల రియాక్షన్‌కు టీడీపీ నాయకులు బిత్తరపోయారు. ఏం మాట్లాడాలో తెలియక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు గుర్తు చేస్తారంటూ టీడీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా వదిలిపెట్టని అంగన్వాడీలు... మీ మద్దతు మాకు అవసరం లేదంటూ మొహం మదే చెప్పేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు బిక్క మొహంతో వెనుదిరిగారు. ఇదీ చదవండి: అంగన్వాడీల సమస్యలపై సర్కారు సానుభూతి