
అమలాపురంలో టీడీపీ నేతలకు అంగన్వాడీలు ఝలక్ ఇచ్చారు
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో టీడీపీ నేతలకు అంగన్వాడీలు ఝలక్ ఇచ్చారు. ధర్నాలో ఉన్న అంగన్వాడీలకు మద్దతు పలికేందుకు వచ్చిన టీడీపీ నేతలను పొమ్మంటూ అంగన్వాడీలు తెగేసి చెప్పారు. తమను గుర్రాలతో తొక్కించి, తమపై దాష్టీకం ప్రదర్శించిన చంద్రబాబు మద్దతు తమకు అవసరం లేదని తేల్చి చెప్పడంతో అంగన్వాడీల రియాక్షన్‌కు టీడీపీ నాయకులు బిత్తరపోయారు.
ఏం మాట్లాడాలో తెలియక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు గుర్తు చేస్తారంటూ టీడీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా వదిలిపెట్టని అంగన్వాడీలు... మీ మద్దతు మాకు అవసరం లేదంటూ మొహం మదే చెప్పేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు బిక్క మొహంతో వెనుదిరిగారు.
ఇదీ చదవండి: అంగన్‌వాడీల సమస్యలపై సర్కారు సానుభూతి