Dr.B.R.Ambedkar Assembly Constituencies
-
కోనసీమ జిల్లా: టీడీపీ నేతలకు అంగన్వాడీల ఝలక్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో టీడీపీ నేతలకు అంగన్వాడీలు ఝలక్ ఇచ్చారు. ధర్నాలో ఉన్న అంగన్వాడీలకు మద్దతు పలికేందుకు వచ్చిన టీడీపీ నేతలను పొమ్మంటూ అంగన్వాడీలు తెగేసి చెప్పారు. తమను గుర్రాలతో తొక్కించి, తమపై దాష్టీకం ప్రదర్శించిన చంద్రబాబు మద్దతు తమకు అవసరం లేదని తేల్చి చెప్పడంతో అంగన్వాడీల రియాక్షన్కు టీడీపీ నాయకులు బిత్తరపోయారు. ఏం మాట్లాడాలో తెలియక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు గుర్తు చేస్తారంటూ టీడీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా వదిలిపెట్టని అంగన్వాడీలు... మీ మద్దతు మాకు అవసరం లేదంటూ మొహం మదే చెప్పేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు బిక్క మొహంతో వెనుదిరిగారు. ఇదీ చదవండి: అంగన్వాడీల సమస్యలపై సర్కారు సానుభూతి -
వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
సాక్షి, అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సామాజిక సాధికార నినాదం మార్మోగింది. శుక్రవారం మలికిపురం ప్రధాన రహదారి నుంచి వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరితో ప్రధాన రహదారి నిండిపోయింది. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ‘జై జగన్.. జై వైఎస్సార్సీపీ’ నినాదాలతో హోరెత్తించారు. వీరికి స్థానిక ప్రజలు జేజేలు పలికారు. అనంతరం జరిగిన సామాజిక సాధికార సంభ జన సంద్రాన్ని తలపించింది. హోదా పెంచారు: మోపిదేవి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో పెద్ద పీట వేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గౌరవం ఇచ్చారని, సమాజంలో హోదాను పెంచారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ తెలిపారు. తనతో పాటు బీదా మస్తాన్రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపించారంటే బీసీల పట్ల జగన్కు ఉన్న ప్రేమను అర్థం చేసుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనార్టీలకు అధికారంలో సముచిత స్థానం ఇచ్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. అంబేడ్కర్, పూలే కన్న కలలను సీఎం జగన్ నిజం చేశారన్నారు. సామాజిక విప్లవం: మంత్రి విశ్వరూప్ సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా బడుగు, బలహీన వర్గాలు ఆర్థి కంగా ఉన్నత స్థితికి ఎదిగేందుకు తోడ్పడ్డారన్నారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాలు ఉన్నత స్థితికి రావాలంటే చదువుతోనే సాధ్యమని జగన్ సంపూర్ణంగా విశ్వసించారని, అందుకే నాడు–నేడులో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్ కానుకను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచారని చెప్పారు. పేదల పక్షాన : మంత్రి చెల్లుబోయిన వేణు రాష్ట్రంలో పేద వర్గాల పక్షాన నిలబడింది సీఎం జగన్ ఒక్కరేనని, ప్రతి సంక్షేమ పథకం లబ్ధిని పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందజేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను బానిసలుగా చూసిన చంద్రబాబుకు, ఈ వర్గాల వారిని అందలం ఎక్కించిన జగన్కు మధ్య పాలనను బేరీజు వేసుకుని, వచ్చి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మేలును చూసి చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఓర్చుకోలేక, నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
Konaseema: ‘ఏపీలో సామాజిక విప్లవం.. సీఎం జగన్ చేతల్లో చూపించారు’
సాక్షి, కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మల్కిపురంలో బస్సు యాత్ర సాగింది. మలికిపురంలోని కేఎస్ఎన్రాజు నివాసంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం రెండు గంటలకు శివకోడు లాకుల నుండి బస్సుయాత్ర ప్రారంభమైంది. మలికిపురం ప్రధాన సెంటర్లో నిర్వహించిన బహిరంగలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, విశ్వరూప్, ఎంపీలు అనురాధ, మోపిదేవి తదితరులు హాజరయ్యారు. మలికిపురంలో సామాజిక సాధికార సభ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం జగన్: మంత్రి విశ్వరూప్ సభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి సీఎం జగన్ హయాంలోనే జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేర్చారన్నారు. సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో అమలు చేసి చూపించారని, రాష్ట్రంలో సామాజిక విప్లవం నడుస్తోందని మంత్రి అన్నారు. 2024లో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉంది. అంబేద్కర్ స్ఫూర్తితో నడుస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్. అభివృద్ధి చదువు ద్వారానే సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన నాయకుడు. బీసీ, ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన వ్యక్తి జగన్’’ అని మంత్రి కొనియాడారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు: మంత్రి వేణు మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాజోలు నియోజకవర్గం నాకు పుట్టిల్లు. ఇక్కడ నేతలు కృష్ణంరాజు, జక్కంపూడిల సహకారంతో ఎదిగాను. వైఎస్సార్, సీఎం జగన్ నాకు రాజకీయంగా గుర్తింపునిచ్చారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఆత్మగౌరవం గుర్తించిన వ్యక్తి సీఎం జగన్ మాత్రమే. అబద్ధం 14 ఏళ్ల పాటు పాలించింది.. జగన్ అనే నిజం వెలుగులోకి వచ్చి ప్రజల సమస్యలు తీర్చింది’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. వారు తలెత్తుకుని జీవించగలుగుతున్నారు: మోపిదేవి రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ, పేదల సమస్యల గురించి మాట్లాడే నాయకులను మాత్రమే గతంలో చూశాం.. సమస్యలను పరిష్కరించి, చేతల్లో అభివృద్ధిని చూపిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే. అంబేద్కర్ ఆలోచన విధానాలను అక్షరాల అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. చిన్న వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు చెందిన అనేక మందికి సీఎం జగన్ మార్కెట్ చైర్మన్లుగా, దేవాలయాలు చైర్మన్లుగా పదవులిచ్చి సమాజంలో గౌరవం కల్పించారు’’ అని ఎంపీ చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు తలెత్తుకుని జీవించగలుగుతున్నారంటే అది వైఎస్ జగన్ వల్లే సాధ్యమైంది. ఈ వర్గాలకు నిజమైన సాధికారత చేకూరింది. ఎవరి దగ్గర చేయి చాచకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు వాళ్ల కాళ్లపై వాళ్లు జీవించగలిగే పరిస్థితిని జగన్ కల్పించారు. దేశంలోని అత్యున్నతమైన రాజ్యసభ పదవులు నలుగురు బీసీలకు జగన్ కట్టబెట్టారు. చంద్రబాబు తన పార్టీలో డబ్బున్న వారికి రాజ్యసభ స్థానాలు అమ్ముకుంటాడు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు బీసీలకు చిన్నపాటి రాజకీయ హోదా కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయాడు. 2024లో కూడా సీఎంగా జగనే రావాలి’’ అని మోపిదేవి పేర్కొన్నారు. ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ!