Konaseema: ‘ఏపీలో సామాజిక విప్లవం.. సీఎం జగన్‌ చేతల్లో చూపించారు’ | Ysrcp Samajika Sadhikara Bus Yatra In Malikipuram Konaseema District | Sakshi
Sakshi News home page

Konaseema: ‘ఏపీలో సామాజిక విప్లవం.. సీఎం జగన్‌ చేతల్లో చూపించారు’

Published Fri, Jan 5 2024 4:57 PM | Last Updated on Tue, Jan 30 2024 4:56 PM

Ysrcp Samajika Sadhikara Bus Yatra In Malikipuram Konaseema District - Sakshi

సాక్షి, కోనసీమ జిల్లా: వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మల్కిపురంలో బస్సు యాత్ర సాగింది. మలికిపురంలోని కేఎస్‌ఎన్‌రాజు నివాసంలో వైఎస్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం అనంతరం రెండు గంటలకు శివకోడు లాకుల నుండి బస్సుయాత్ర ప్రారంభమైంది.

మలికిపురం ప్రధాన సెంటర్‌లో నిర్వహించిన బహిరంగలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, విశ్వరూప్, ఎంపీలు అనురాధ, మోపిదేవి తదితరులు హాజరయ్యారు. మలికిపురంలో సామాజిక సాధికార సభ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం జగన్‌: మంత్రి విశ్వరూప్‌
సభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ,  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి సీఎం జగన్ హయాంలోనే జరిగిందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం నెరవేర్చారన్నారు. సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో అమలు చేసి చూపించారని, రాష్ట్రంలో సామాజిక విప్లవం నడుస్తోందని మంత్రి అన్నారు. 2024లో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉంది. అంబేద్కర్ స్ఫూర్తితో నడుస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్‌. అభివృద్ధి చదువు ద్వారానే సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన నాయకుడు. బీసీ, ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఆత్మ గౌరవాన్ని గుర్తించిన వ్యక్తి జగన్’’ అని మంత్రి కొనియాడారు.

చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు: మంత్రి వేణు
మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాజోలు నియోజకవర్గం నాకు పుట్టిల్లు. ఇక్కడ నేతలు కృష్ణంరాజు, జక్కంపూడిల సహకారంతో ఎదిగాను. వైఎస్సార్, సీఎం జగన్ నాకు రాజకీయంగా గుర్తింపునిచ్చారు. చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఆత్మగౌరవం గుర్తించిన వ్యక్తి సీఎం జగన్ మాత్రమే. అబద్ధం 14 ఏళ్ల పాటు పాలించింది.. జగన్ అనే నిజం వెలుగులోకి వచ్చి ప్రజల సమస్యలు తీర్చింది’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు.

వారు తలెత్తుకుని జీవించగలుగుతున్నారు: మోపిదేవి
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ, పేదల సమస్యల గురించి మాట్లాడే నాయకులను మాత్రమే గతంలో చూశాం.. సమస్యలను పరిష్కరించి, చేతల్లో అభివృద్ధిని చూపిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే. అంబేద్కర్ ఆలోచన విధానాలను అక్షరాల అమలు చేసిన నాయకుడు సీఎం జగన్. చిన్న వర్గాలకు చెందిన బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు చెందిన అనేక మందికి సీఎం జగన్ మార్కెట్ చైర్మన్లుగా, దేవాలయాలు చైర్మన్లుగా పదవులిచ్చి సమాజంలో గౌరవం కల్పించారు’’ అని ఎంపీ చెప్పారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు తలెత్తుకుని జీవించగలుగుతున్నారంటే అది వైఎస్‌ జగన్ వల్లే సాధ్యమైంది. ఈ వర్గాలకు నిజమైన సాధికారత చేకూరింది. ఎవరి దగ్గర చేయి చాచకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు వాళ్ల కాళ్లపై వాళ్లు జీవించగలిగే పరిస్థితిని జగన్ కల్పించారు. దేశంలోని అత్యున్నతమైన రాజ్యసభ పదవులు నలుగురు బీసీలకు జగన్ కట్టబెట్టారు. చంద్రబాబు తన పార్టీలో డబ్బున్న వారికి రాజ్యసభ స్థానాలు అమ్ముకుంటాడు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు బీసీలకు చిన్నపాటి రాజకీయ హోదా కూడా చంద్రబాబు ఇవ్వలేకపోయాడు. 2024లో కూడా సీఎంగా జగనే రావాలి’’ అని మోపిదేవి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Volunteer Jobs: ఏపీ బాటలో తెలంగాణ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement