amalapuram
-
బాబూ.. విద్యుత్ బాదుడు ఆపండి
సాక్షి, అమలాపురం: ‘ఆక్వాకు విద్యుత్ రాయితీ ఇస్తున్నామని పేరుకే చెబుతున్నారు. ఏదో ఒక రూపంలో భారీగా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. బాబూ... విద్యుత్ బాదుడు ఆపండి... ఆక్వా రైతులను ఆదుకోండి’ అంటూ కోనసీమకు చెందిన ఆక్వా రైతులు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కోనసీమ ఆక్వా రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆక్వా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సమితి నాయకులు మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వ విద్యుత్ విధానాల వల్ల రైతులపై పెనుభారం పడుతోంది. ఆక్వాకు విద్యుత్ సరఫరాలో తరచూ లో ఓల్టేజ్ సమస్య ఏర్పడుతోంది. దీనివల్ల విద్యుత్ వినియోగం అధికమవుతోంది. దానిని సాకుగా చూపించి కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకోవాలని, ఇందుకోసం రూ.లక్షలు చెల్లించాలని రైతులకు నోటీసులు పంపుతున్నారు. ఎస్పీఎల్ చార్జీలని, అదనపు లోడని, షార్ట్ ఫాల్ చార్జీలని ఆక్వా రైతుల నడ్డి విరుస్తున్నారు. చెరువుల్లో రొయ్యలు, చేపలు ఉన్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అదేవిధంగా రొయ్యల కొనుగోలుదారులు సిండికేటుగా మారి రైతులను ముంచేస్తున్నారు. చెరువుల్లో రొయ్యలు లేని సమయంలో కౌంట్ ధరలు పెంచుతున్నారు.పట్టుబడుల సమయంలో రేటు తగ్గించేస్తున్నారు. మేత, ఆయిల్‌పై కస్టమ్స్ డ్యూటీ ఎత్తేశామని బడ్జెట్లో ప్రకటించినా ధరలు యథాతథంగా ఉన్నాయి.’ అని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో టీడీపీ, జనసేనకు చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. రైతు సంఘాల ప్రతినిధులు యాళ్ల వెంకటానందం, రుద్రరాజు వెంకట రాజు (నానీరాజు), మోటూరి నాని, యేడిద శంకరం, బొలుసు రాంబాబు, టీడీపీ అల్లవరం మండల అధ్యక్షుడు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు, జనసేన నేత త్సవటపల్లి నాగభూషణం పాల్గొన్నారు. -
యూట్యూబర్ చర్యతో స్టేడియంలో గోతులు
అమలాపురం రూరల్: వ్యూస్ కోసం కొందరు యూట్యూబర్లు విచక్షణను వదిలేస్తున్నారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియం గ్రౌండ్‌ను ఓ యూట్యూబర్ అనుచరులు గోతులమయం చేశారు. ఈ చేష్టలను జిల్లా క్రీడాఅభివృద్ధి అధికారి అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. సుమారు 300 మందిని వెంటబెట్టుకుని ఓ యూట్యూబర్ (YouTuber) బాలయోగి స్టేడియం గ్రౌండ్లోకి(Balayogi Stadium Ground) ప్రవేశించాడు. ఈ గ్రౌండ్లో బంగారం పాతిపెట్టానని, అది ఎవరికి దొరికితే వారిదే అంటూ అక్కడ వచ్చిన యువకులను ఉసిగొల్పాడు. దాంతో వారు చేతికి దొరికిన వస్తువుతో గ్రౌండ్‌ను తవ్వడం మొదలెట్టారు. దీనిని గమనించిన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి సురేష్‌కుమార్ వారి చర్యలను నిలుపుదల చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
మందకొడిగా మొదలై...
సాక్షి, అమలాపురం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి ఎన్నికల పోలింగ్ ఉదయం మందకొడిగా మొదలై... మధ్యాహ్నం నుంచి జోరందుకుంది. ఓటు వేసేందుకు పట్టభద్రులు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. కూటమి పార్టీలతో పాటు పీడీఎఫ్ మద్దతుదారులు పోలింగ్ ప్రక్రియలో ఉత్సహంగా పాల్గొనడంతో అంచనాలకు మించి ఓటింగ్ నమోదయ్యింది.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి కోనసీమ జిల్లాలో 73.37 శాతం పోలింగ్ నమోదయ్యింది. జిల్లాలో 64,471 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు జిల్లావ్యాప్తంగా 47,301 మంది ఓటు హక్కును వినియోగించుకున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. వీరిలో పురుషులు 27,450 మంది కాగా, 19,850 మంది మహిళులో ఓటు వేశారు. ఒక ట్రాన్స్జండర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువకుల నుంచి వయసు మళ్లిన వారి వరకు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాయవరం తహసీల్దార్ కార్యాలయంలో నవ వధువులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.ఎల్.ఎన్.రాజకుమారి పరిశీలించారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని ఆమె తెలిపారు.ఉదయం అంతంత మాత్రమేజిల్లాలో పోలింగ్ ఉదయం అంతంత మాత్రంగానే సాగింది. ఉదయం 10 గంటలకు 12.74 శాతం ఓటింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 12 గంటలకు ఇది 32.36 వరకు సాగింది. మధ్యాహ్నం 2 గంటలకు 50.48 శాతం నమోదయ్యింది. తరువాత నుంచి ఓటింగ్ జోరందుకుంది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 73.37 శాతం నమోదయినట్టు జిల్లా అధికారులు తెలిపారు.రామచంద్రపురంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ రామచంద్రపురం కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్, అమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎస్కేబీఆర్ కాలేజీలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావులు, ఐ.వెంకటేశ్వరరావు, రావులపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఓటింగ్‌లో పాల్గొన్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.అడుగడుగునా అధికార దుర్వినియోగంఎన్నికల కేంద్రాల వద్ద కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల వద్ద మెప్పు కోసం ఓట్లు లేనివారు సహితం పోలింగ్ కేంద్రాలకు వెళుతూ హడావుడి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి ఓటు వేసేందుకు వచ్చినవారిని తమ పార్టీ అభ్యర్థి నంబరు, ఓటు వేయాల్సిన నంబరులు చెబుతూ వచ్చారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, ఇతర అధికారులు ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. పి.గన్నవరం పోలింగ్ కేంద్ర ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఓటర్లకు తమ కూటమి అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించడం గమనార్హం. అంబాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు 20 మంది ఓటర్లు ఉంటే బయట కూటమి నాయకులు 200 మంది వరకు మోహరించడం విశేషం.పోలింగ్‌లో కొరవడిన కూటమి నేతల ఉత్సాహంకొత్త ఓటర్ల నమోదులో చూపించిన ఉత్సాహం.. పోలింగ్ విషయంలో కూటమి నాయకులు చూపించి లేక పోయారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే కూటమి నేతలు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల బయట హడావుడి సృష్టించారు కాని అనుకూల ఓటింగ్ వేయించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇదే సమయంలో పీడీఎఫ్ ప్రతినిధులు వ్యూహాత్మకంగా వ్యవహరించి నిశ్శబ్దంగా తమ అనుకూల ఓటింగ్ వేయించుకున్నారు. కూటమి క్యాడర్ తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ పెద్దల వద్ద మార్కులు కొట్టేసేందుకు అన్నట్టుగా పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి చేశారు. అది చూసుకుని స్థానిక ఎమ్మెల్యేలు మురిసిపోయారు. కొత్తగా తమ ఆధ్వర్యంలో నమోదు చేసిన ఓటర్ల మీద కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌తోపాటు ఆయా పార్టీల మద్దతుదారులు భారీగా ఆశలు పెట్టుకున్నా ఆ ఓటర్లు సహితం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓటింగ్‌లో చూపించారని సమాచారం. మొత్తం మీద పోల్ మేనేజ్మెంట్లో కూటమి పార్టీలు విఫలమయ్యాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ప్రచారంలోనే కాకుండా పోలింగ్ రోజున కూడా పీడీఎఫ్ ప్రతినిధులు వారి అనుకూలురు చాప కింద నీరులా వ్యవహరించి తమకు అనుకూలమైన ఓటును అత్యధికంగా వేయించుకున్నారు.జిల్లాలో మొత్తం ఓటర్లు64,416 మంది ఓటర్లుజిల్లాలో 73.37 శాతం ఓటింగ్ -
అచ్చెన్నాయుడు సమక్షంలో కూటమి నేతల కుమ్ములాట
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో కూటమి నేతల సమావేశం రసాభాసగా మారింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలోనే కూటమి నేతలు కుమ్ములాటకు దిగారు. జనసేన నేతలను చిన్నచూపు చూస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పవన్ ఫొటో లేకపోవడంపై ఆందోళనకు దిగారు. సమావేశానికి జనసేన నేత కల్వకొలను తాతాజీ డుమ్మాకొట్టగా.. టీడీపీ నేత రమణబాబు సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు.పొత్తు ధర్మాన్ని విస్మరించిన టీడీపీ.. ఓ జనసైనికుడి ఆవేదన.. వీడియో వైరల్నరసరావుపేట: కూటమి ప్రభుత్వ పొత్తు ధర్మానికి టీడీపీ నాయకులు తూట్లు పొడుస్తున్నారని, జనసైనికులను పెదగార్లపాడులో బానిసలుగా చూస్తున్నారని జనసైనికుడు ఎన్.వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన అవేదనను వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో సోమవారం పొస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ వరకు ఈ వీడియో చేరేలా షేర్ చేయాలని ఆయన కోరాడు.టీడీపీ నాయకులు జనసైనికులను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో, బానిసలుగా ఎలా చూస్తున్నారో వీడియోలో వివరించాడు. ఎన్నికల వరకు తమతో ఎంతో ఉత్సాహంతో టీడీపీ నాయకులు కలిసి పనిచేశారని, అధికారం వచ్చాక టీడీపీ నేతల నిజస్వరూపం చూపిస్తున్నారని పేర్కొన్నాడు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా జనసైనికులు తొత్తుల్లాగా, బానిసలుగా ఉండాలనే విధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని వాపోయాడు.ఉపాధి అవకాశాలు కల్పించే విషయాల్లో టీడీపీ నాయకులు జనసేనని భాగస్వాములు చేయకుండా అన్ని టీడీపీ నాయకులే తీసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశాడు. ‘అసలు ఎవర్రా మీరు. మీరు వచ్చి మమ్మల్ని అడిగేది ఏందిరా’ అని టీడీపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, పదిలో తమకు కనీసం మూడు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరితే కుదరదని నాయకులు చెబుతున్నారని పేర్కొన్నాడు. ఇది కూటమి ప్రభుత్వానికి మంచి ప్రయాణం కాదని తెలిపాడు.ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు! -
అమలాపురంలో విస్ఫోటం
అమలాపురం టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని నల్ల వంతెన సమీపాన రావులచెరువు ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ ఇంట్లో విస్ఫోటం సంభవించింది. డాబా ఇల్లు నేల కూలి తునాతునాకలైంది. మొత్తం 14 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు... రావులచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న గొవ్వాల నాగేశ్వరరావుకు చెందిన డాబా ఇంట్లో ఉదయం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఇల్లు పూర్తిగా ధ్వంసమై నేలకూలిపోయింది. ఇరుగు పొరుగున ఉన్న నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి నాగేశ్వరరావు ఇంట్లో ఉన్న నలుగురు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. వారితోపాటు సమీపంలో ఉన్న మరో నలుగురు తీవ్రంగా, ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. రెండు బైక్‌లు కూడా ఎగిరి కింద పడి కాలిపోయాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరిగిన ఇంట్లో అప్పుడప్పుడూ బాణసంచా తయారు చేస్తారని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు గ్యాస్ సిలిండర్లు కూడా పేలినట్లు నిర్ధారించారు. ఘటనాస్థలాన్ని ఎస్పీ బి.కృష్ణారావు పరిశీలించారు. బాణసంచా పేలుడు వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేసినట్లు ఎస్పీ తెలిపారు. విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులను పిలిపిస్తున్నామని, వారి నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఆర్డీవో జి.కేశవవర్ధనరెడ్డి కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. -
బాణాసంచా గోడౌన్లో పేలిన సిలిండర్.. ఆరుగురికి తీవ్ర గాయాలు
-
అమలాపురం బాణసంచా కేంద్రంలో పేలుడు.. 14 మందికి గాయాలు
సాక్షి, కోనసీమ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ మండలం రావుల చెరువు సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించింది. ఇంట్లో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.దీంతో రెండంతస్తుల భవనం ధ్వంసమైంది.ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఆరుగురిని కిమ్స్ ఆసుపత్రికి, ఎనిమిది మందిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.కాగా రావుల చెరువోలని ఓ ఇంట్లో అక్రమంగా బాణా సంచా తయారు చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. అయితే గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఘటన జరిగే సమయంలో భవనంలో బాణాసంచా కేంద్రలో 150 కిలోల పేలుడు పటాస్ ఉన్నట్లు సమాచారం.. ప్రమాదం ధాటికి నలుగురు వ్యక్తులు గాల్లో ఎగిరిపడ్డారు. అనుమతులు లేకుండా బాణాసంచా తయారీ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాయపడిన బాధితుల వివరాలుగోపాల్ నాగేశ్వరరావు (60)గోపాల్ నాగలక్ష్మి (58)గోపాల్ రాజు (25)చొల్లంగి మారుతి (18)కట్ట వెంకట్ (17)కట్ట వేణు (35)పేలుడు దాటికి గాయపడిన పక్కన ఉన్న ఇంట్లో వ్యక్తులు...బొక్కా లిల్లీ (12)పాటి దేవి (23)దూనబోయిన సుబ్బలక్ష్మి (48)దునబోయిన గాయత్రి (20)పితాని చంటి (28)పాటి ప్రకాష్ (26)పాటి సుజాత (40)పాటి ప్రభాకర్ ( 45) చదవండి: ముంచేసిన బుడమేరు.. చెరువుల్లా పొలాలు -
భార్యను స్వదేశానికి తీసుకురావాలంటూ వేడుకోలు
అమలాపురం రూరల్: బెహ్రయిన్‌లో తన భార్య ఇబ్బందులు పడుతోందని, స్వదేశానికి తీసుకురావాలంటూ ఓ వ్యక్తి కలెక్టర్‌ను వేడుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నడిపూడికి చెందిన దుక్కిపాటి పావని ఓ ఏజెంట్ ద్వారా గత నెల 25న బెహ్రయిన్లోని ఓ ఇంట్లో పని నిమిత్తం వెళ్లింది. అక్కడ అనేక అవస్థలు పడుతున్నట్లు ఆమె ఫోన్లో ఆడియో రికార్డింగ్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపింది. అక్కడికి వెళ్లినప్పటి నుంచి తిండి, నీరు లేక అలమటిస్తున్నానని ఆమె పేర్కొంది. తన ఆరోగ్యం క్షీణించిందని తనను ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకురావాలని పావని వేడుకుంది. ఈ మేరకు భార్య ఆడియో రికార్డింగ్‌తో భర్త దుర్గాప్రసాద్, ఇద్దరు పిల్లలతో వచ్చి సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మహేష్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తన భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు. -
వైద్య, విద్యా ప్రాప్తిరస్తు
అమలాపురం టౌన్: చేరువలో చదువుల కోవెల ఉంటే.. ఆరోగ్యానికి పూర్తి భరోసా లభిస్తే ఆ ఆనందమే వేరు. అందుకే విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. పేదలకు సకల సౌకర్యాలూ కల్పిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు ప్రభుత్వ వైద్య విద్య, ఉచిత ప్రభుత్వ వైద్య సేవలు త్వరలో మరింత చేరువ కానున్నాయి. అమలాపురం మండలం కామనగరువు, సమనస గ్రామాల సరిహద్దుల్లో రాష్ట్ర ప్రభుత్వం 54 ఎకరాలను సేకరించి రూ.450 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మిస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు సైతం ప్రభుత్వపరంగా వైద్య విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమమవుతోంది.అమలాపురంలో ఈ వైద్య కళాశాలల నిర్మాణ పనుల వేగం పుంజుకుంది. ఇది అందుబాటులోకి వస్తే ఏటా దాదాపు 150 మెడికల్ సీట్లతో విద్యార్థులు వైద్యను అభ్యసించే అవకాశం ఏర్పడుతుంది. ఇంత వరకూ ప్రభుత్వ వైద్య విద్య కోసం ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అమలాపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితులన్నీ దాదాపు దూరం కానున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఎవరైనా వైద్య విద్య అభ్యసించాలంటే రూ.లక్షల్లో ఖర్చు అవుతుంది.ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అలాంటి విద్యార్థులకు వైద్య విద్యపరంగా జిల్లాలో ఓ భరోసాగా నిలువనుంది. ఇప్పటికే ఈ కళాశాల నిర్మాణ పనులు దాదాపు 65 శాతం పూర్తయ్యాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థకు చెందిన ఇంజినీర్లు ఈ భవనాలను త్వరితగతిన పూర్తి చేసే దిశగా శ్రమిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి మొత్తం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని ఆ సంస్థ ఇంజినీర్ యోగి తెలిపారు.చకచకా సదుపాయాల కల్పనప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా జిల్లా బోధనా ఆసుపత్రిగా అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 100 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రి 650 పడకలుగా జిల్లా స్థాయిలో పెద్దాసుపత్రిగా సేవలు అందించనుంది. ఇప్పటికే ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన పనులు చకచకా జరుగుతున్నాయి. ఏరియా ఆస్పత్రిలో బోధనా ఆసుపత్రి కోసం అప్పుడే ఆపరేషన్ థియేటర్లు, కన్సల్టింగ్ వార్డులు సిద్ధమవుతున్నాయి.ఆ దిశగా యంత్ర పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతోంది. ఇక ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఈ బోధనా ఆసుపత్రి జిల్లా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించనుంది. ఇప్పుడు ఆసుపత్రిలో 12 విభాగాలకు వైద్య నిపుణులు ఉంటే, అదే బోధనా ఆసుపత్రి హోదా వచ్చాక 24 విభాగాలు ఏర్పడి ఆయా విభాగాలకు ఒక్కో వైద్య నిపుణుడు అందుబాటులోకి రానున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు బోధనా ఆస్పత్రిలో కూడా సేవలు అందించి తమ వైద్య విద్యను పూర్తి చేయనున్నారు. ఇప్పటికే నాడు–నేడు పథకంలో రూ.570 కోట్లతో ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. ఈ అభివృద్ధి అంతా బోధనా ఆసుపత్రి అప్‌గ్రేడ్‌కు ఉపయోగపడుతోంది.వచ్చే ఏడాదికి అంతా సిద్ధంఅమలాపురంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనా ఆసుపత్రి వచ్చే ఏడాదికి జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అంచనా వేస్తున్నాం. ఏరియా ఆసుపత్రిలో బోధనా ఆసుపత్రికి అవసరమైన అన్ని సదుపాయాలూ సిద్ధమవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు ఉచిత వైద్యం మరింత చేరువవుతోంది. మెడికల్ స్పెషలిస్ట్‌లు, మెడికల్ ఎక్యూప్మెంట్లు వంటి విషయాల్లో అప్‌గ్రేడ్ సదుపాయాలు వస్తాయి. –డాక్టర్ పద్మశ్రీరాణి, సమన్వయకర్త, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు -
అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్
-
కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ
సాక్షి, కోనసీమ జిల్లా: కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు రాజీనామా చేశారు. అమలాపురంలో పార్టీ అధిష్టానం చాలా అన్యాయం చేసిందని రాజబాబు మండిపడ్డారు. అమలాపురంలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని.. జనసైనికులు, వీర మహిళల ఆశయాల మీద నీళ్లు చల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అమలాపురం సీటును టీడీపీకి కేటాయించారు. తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అనైతికంగా సీటు దక్కించుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాలు చేసి అమలాపురంలో జనసేన జెండాను నిలబెట్టాను. టీడీపీ జెండా మోయడానికి సిద్ధంగా లేము. పవన్ కల్యాణ్ ఓ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నాను’’ అని రాజబాబు తెలిపారు. -
జగన్ అంటే చంద్రబాబుకు అందుకే భయం
-
అమలాపురంలో ఎంపీ అభ్యర్థి రాపాక ప్రచారం
-
సై అంటున్న కోడి పుంజులు..
అమలాపురం టౌన్/సాక్షి నెట్వర్క్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి కోడి పందేలు ఆదివారం మొదలయ్యాయి. పండగ మూడు రోజులూ జరిగే ఈ పందేలను వీక్షించేందుకు, రూ.వేలు, రూ.లక్షల్లో కాసేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 80 బరులు ఏర్పాటైనట్టు సమాచారం. వీటిలో దాదాపు రూ.20 కోట్ల మేర పందేల రూపంలో చేతులు మారతాయని అంచనా వేస్తున్నారు. తొలి రోజే రూ.6 కోట్ల వరకూ పందేలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగాలు, వ్యాపారాలతో స్థిరపడిన వారందరూ కార్లలో సొంతూళ్లకు వచ్చి మరీ కోడి పందేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. బరుల వద్దకు మోటార్ సైకిళ్లు, కార్లలో అధిక సంఖ్యలో వస్తున్నారు. పలుచోట్ల బరుల వద్ద గుండాటలు కూడా ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వీటిని పోలీసులు అడ్డుకున్నారు. ►డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో భారీ బరి ఏర్పాటైంది. ఇక్కడ రూ.కోట్లలో పందేలు కాస్తున్నారు. మండల కేంద్రమైన మలికిపురంలో కూడా భారీ బరి ఏర్పాటు చేశారు. లక్కవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అల్లవరం, అమలాపురం రూరల్ మండలం కామనగరువు, ఇందుపల్లిలో సైతం పెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్వాహకులు క్రికెట్ పోటీలను తలపించే రీతిలో కోడి పందేలు సాగిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బారికేడ్లు, ఎల్ఈడీ స్క్రీన్లతో బరులు ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహించారు. ►తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. నల్లజర్ల మండలంలో పోలీసులు గుండాటకు ఎక్కడా అనుమతించలేదు. ఇక్కడ మధ్యాహ్నం తర్వాతే పందేలు ప్రారంభించారు. ఎక్కడా మునుపటి ఉత్సాహం కనపడలేదు. తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు ఉదయం కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ మండలంలోని మలకపల్లిలో ఏర్పాటు చేసిన బరి వద్ద బౌన్సర్లను పెట్టి మరీ పందేలు నిర్వహించారు. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని 25 బరుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ►కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం, మేడపాడులో భారీ ఎత్తున పందేలు జరిగాయి. ఉండూరు, పులిమేరు, అచ్చంపేటల్లో కూడా బరులు ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం, గైగోలుపాడు తదితర చోట్ల కోడి పందేలపై పోలీసులు దాడి చేశారు. డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సీఐ వైఆర్కే శ్రీనివాస్ తదితరులు సిబ్బందితో వెళ్లి గుండాట బోర్డులను తొలగించి, పందేలు నిర్వహిస్తున్న వారిని హెచ్చరించారు. కరప మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. -
అమలాపురంలో TNTUC నేతలకు ఝలక్ ఇచ్చిన అంగన్వాడీలు
-
కోనసీమ జిల్లా: టీడీపీ నేతలకు అంగన్వాడీల ఝలక్
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో టీడీపీ నేతలకు అంగన్వాడీలు ఝలక్ ఇచ్చారు. ధర్నాలో ఉన్న అంగన్వాడీలకు మద్దతు పలికేందుకు వచ్చిన టీడీపీ నేతలను పొమ్మంటూ అంగన్వాడీలు తెగేసి చెప్పారు. తమను గుర్రాలతో తొక్కించి, తమపై దాష్టీకం ప్రదర్శించిన చంద్రబాబు మద్దతు తమకు అవసరం లేదని తేల్చి చెప్పడంతో అంగన్వాడీల రియాక్షన్‌కు టీడీపీ నాయకులు బిత్తరపోయారు. ఏం మాట్లాడాలో తెలియక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు గుర్తు చేస్తారంటూ టీడీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినా వదిలిపెట్టని అంగన్వాడీలు... మీ మద్దతు మాకు అవసరం లేదంటూ మొహం మదే చెప్పేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు బిక్క మొహంతో వెనుదిరిగారు. ఇదీ చదవండి: అంగన్వాడీల సమస్యలపై సర్కారు సానుభూతి -
వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
సాక్షి, అమలాపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సామాజిక సాధికార నినాదం మార్మోగింది. శుక్రవారం మలికిపురం ప్రధాన రహదారి నుంచి వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వీరితో ప్రధాన రహదారి నిండిపోయింది. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. తమకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ‘జై జగన్.. జై వైఎస్సార్సీపీ’ నినాదాలతో హోరెత్తించారు. వీరికి స్థానిక ప్రజలు జేజేలు పలికారు. అనంతరం జరిగిన సామాజిక సాధికార సంభ జన సంద్రాన్ని తలపించింది. హోదా పెంచారు: మోపిదేవి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో పెద్ద పీట వేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గౌరవం ఇచ్చారని, సమాజంలో హోదాను పెంచారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ తెలిపారు. తనతో పాటు బీదా మస్తాన్‌రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్.కృష్ణయ్యలను రాజ్యసభకు పంపించారంటే బీసీల పట్ల జగన్‌కు ఉన్న ప్రేమను అర్థం చేసుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనార్టీలకు అధికారంలో సముచిత స్థానం ఇచ్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. అంబేడ్కర్, పూలే కన్న కలలను సీఎం జగన్ నిజం చేశారన్నారు. సామాజిక విప్లవం: మంత్రి విశ్వరూప్ సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో సామాజిక విప్లవం వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా బడుగు, బలహీన వర్గాలు ఆర్థి కంగా ఉన్నత స్థితికి ఎదిగేందుకు తోడ్పడ్డారన్నారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాలు ఉన్నత స్థితికి రావాలంటే చదువుతోనే సాధ్యమని జగన్ సంపూర్ణంగా విశ్వసించారని, అందుకే నాడు–నేడులో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్ కానుకను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచారని చెప్పారు. పేదల పక్షాన : మంత్రి చెల్లుబోయిన వేణు రాష్ట్రంలో పేద వర్గాల పక్షాన నిలబడింది సీఎం జగన్ ఒక్కరేనని, ప్రతి సంక్షేమ పథకం లబ్ధిని పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందజేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను బానిసలుగా చూసిన చంద్రబాబుకు, ఈ వర్గాల వారిని అందలం ఎక్కించిన జగన్‌కు మధ్య పాలనను బేరీజు వేసుకుని, వచ్చి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మేలును చూసి చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఓర్చుకోలేక, నిత్యం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో ఘోర ప్రమాదం.. ఏపీ ఎమ్మెల్యే బంధువుల దుర్మరణం
కన్సాస్, సాక్షి: అమెరికా సంయుక్త రాష్ట్రం కన్సాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వాసులుగా తెలుస్తోంది. అయితే.. జాన్సన్ కౌంటీ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు వేగంగా వచ్చి ఢీ కొట్టాయి. మృతి చెందిన వాళ్లు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులుగా తేలింది. టెక్సాస్ నుంచి డల్లాస్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు, ఆయన భార్య ,కుమార్తె మనవడు, మనమరాలు, మరో బంధువు అక్కడికక్కడే మృతి చెందారు. నాగేశ్వరరావు అల్లుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
అమలాపురం కోర్టుకు కాపు ఉద్యమ నేతలు
అమలాపురం టౌన్: కాపు ఉద్యమ సమయంలో పట్టణ పోలీస్‌స్టేషన్ ముట్టడికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో రాష్ట్ర కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు 30 మంది కాపు నేతలు గురువారం అమలాపురంలోని జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ముద్రగడతో పాటు రాష్ట్ర కాపు ఉద్యమ నాయకులు నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, నల్లా పవన్‌కుమార్, సూదా గణపతి, ఆకుల రామకృష్ణ తదితరులు కోర్టుకు వచ్చారు. టీడీపీ ప్రభుత్వం కాపులపై పెట్టిన అక్రమ కేసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 ఫిబ్రవరిలో ఎత్తివేయించారు. అక్రమ కేసులతో అవస్థలు పడుతున్న కాపు నాయకులకు విముక్తి కల్పించారు. అప్పట్లో ప్రభుత్వం జీవో నంబర్ 120 ద్వారా ఈ కేసులకు పుల్‌స్టాప్ పెట్టింది. ముద్రగడ పద్మనాభం గతంలో చట్టసభలకు ప్రాతినిథ్యం వహించిన నేత కావడంతో ఈ కేసును తొలుత విజయవాడ ప్రజా ప్రతినిధులు కేసుల కోర్టుకు బదిలీ చేశారు. ప్రస్తుతం తాను మాజీ మాత్రమేనని, ఈ కేసును అమలాపురం కోర్టుకు బదిలీ చేయాల్సిందిగా హైకోర్టును అభ్యర్థించారు. దీంతో కేసు అమలాపురం జ్యూడీషీయల్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేశారు. మేజిస్ట్రేట్ ఎ.హిమబిందు ఎదుట ఆ 30 మంది కాపు ఉద్యమ నాయకులు గురువారం హాజరయ్యారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎత్తివేసిన జీవోను మేజిస్ట్రేట్ పరిశీలించి కేసును కొట్టేసినట్టు వెల్లడించారని అమలాపురం పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీహెచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా కాపు నాయకులు అమలాపురం కోర్టుల సముదాయం ఎదుట హర్షం వ్యక్తం చేశారు. అప్పట్లో కేసులు ఎత్తివేస్తూ జీవో జారీ చేసి, ఇప్పుడు తమను కేసుల నుంచి విముక్తి కల్పించిన సీఎం జగన్‌కు కాపు ఉద్యమ నేత సూదా గణపతి కృతజ్ఞతలు తెలిపారు. -
పోలీస్ స్టేషన్ లో పూజారి ఫన్నీ పూజ
-
వాడీ వేడీ లేని బాబు ప్రసంగాలు.. అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటూ..
సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ మొదలయ్యింది. ప్రతిపక్ష టీడీపీకి ఈ ఎన్నికలు చావోరేవో అనే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకున్నా అది ఏమాత్రం కనిపించడం లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి సానుకూల ఓటు కనిపించడం టీడీపీకి కొరుకుడు పడటం లేదు. గెలుస్తామన్న ధైర్యం పార్టీ క్యాడర్లో నానాటికీ దిగజారిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక మాయ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ యాత్రకు ప్రజల మద్దతు కొరవడింది. ఈ యాత్ర ద్వారా పారీ్టకి ‘భవిష్యత్తు’ ఉంటుందనే భరోసాను కానీ, గెలుస్తామనే ‘గ్యారెంటీ’ని కానీ పార్టీ క్యాడర్‌కు ఆయన కల్పించలేకపోయారు. జిల్లాలోని మండపేట, కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు మూడు రోజులు పర్యటించారు. ఎన్నికల ముందు చేపట్టిన ఈ యాత్రతో పారీ్టలో కొత్త జోష్ వస్తుందని, దిశానిర్దేశం చేస్తారని, నియోజకవర్గ ఇన్చార్జిల నియామకం, నాయకుల మధ్య విభేదాల పరిష్కారానికి మార్గం చూపుతారని క్యాడర్ ఆశించింది. కానీ వీటిలో ఏ ఒక్కటీ చంద్రబాబు పర్యటనలో నెరవేరలేదు. జనం లేక వెలవెల మూడు నియోజకవర్గాల్లోనూ చంద్రబాబుకు పెద్దగా ఆదరణ లభించలేదు. వరుసగా మూడుసార్లు గెలిచిన మండపేట సభకు అంచనా వేసుకున్న జనంలో సగం మంది కూడా రాలేదు. సభను మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇరుకు సందులో ఏర్పాటు చేసినా నిండలేదు. రావులపాలెంలో అయితే బాబు ప్రసంగం ఆరంభం కాగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ‘పరారే పరారే’ అంటూ తిరుగుముఖం పట్టారు. జిల్లా కేంద్రం అమలాపురం సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. రోడ్డు షో చేస్తున్నా ఎక్కడా పట్టుమని పది మంది కూడా ఎదురేగి స్వాగతం పలకలేదు. రోడ్ షోలో జనం లేని విజువల్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టడం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరువు తీసింది. జనం కోసం సభలను ఆలస్యంగా ప్రారంభించాల్సి రావడం, జనాన్ని తీసుకురావాలంటూ అమలాపురంలో పార్టీ ఇన్చార్జి అయితాబత్తుల ఆనందరావు చివరి నిమిషం వరకూ క్యాడర్‌ను బతిమలాడుకోవడం కనిపించింది. అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటూ.. చంద్రబాబు ప్రసంగాల్లో వాడీవేడి లేదు. సర్వం గందరగోళం. రైతుల గురించి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెప్పారు. ఆ వెంటనే పోలవరం 75 శాతం తానే పూర్తి చేశానని, బాలయోగి హయాంలో కొబ్బరి కొనుగోలు చేశారని.. ఇలా ఒకదానికొకటి పొంతన లేకుండా ఇష్టానుసారం మాట్లాడారు. తన కొత్త విజన్–2047 గురించి బాబు చెప్పిన మాటలు ప్రజలకు అర్థం కాలేదు. అధికారంలోకి వస్తే చేస్తానన్న సూపర్ సిక్స్ హామీల వల్ల కలిగే లబ్ధిని వివరించినప్పుడు జనం నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో గత్యంతరం లేక అడిగి మరీ ప్రజలతో చప్పట్లు కొట్టించుకున్నారు. వ్యక్తిగత దూషణలు తాను అధికారంలోకి వస్తే ఎన్నో చేస్తానని చెబుతున్నా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో సహనం కోల్పోయిన చంద్రబాబు.. చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు. పలు సందర్భాల్లో సైకో, సైకో బ్యాచ్, మూర్ఖుడు.. ఇలా రకరకాలుగా దూషించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సైతం చిల్లర మనుషులంటూ విమర్శించి.. తన చిల్లర స్వభావాన్ని బయట పెట్టుకున్నారు. విన్నది తక్కువ.. చెప్పింది ఎక్కువ ‘ఆయన రేడియో లాంటి వారు.. మనం చెప్పింది వినరు. ఆయన చెప్పాలనుకున్నదే చెప్పుకుంటూ పోతారు’ అంటూ పాపులర్ అయిన ఓ సినిమా డైలాగ్... చంద్రబాబు విషయంలో అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఆయా నియోజకవర్గాల్లో మేధావులు, మహిళలు, రైతులు, పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో ఎదుటి వారు చెప్పింది తక్కువే అయినా.. బాబు మాత్రం గంటల తరబడి ప్రసంగాలు దంచికొట్టారు. మండపేట నియోజకవర్గం ఏడిదలో రైతులతో ఏర్పాటు చేసిన రచ్చబండలో ఏకంగా 45 నిమిషాలు మాట్లాడేశారు. చివరకు ఆలమూరులో ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు సైతం ప్రయాణికులు చెప్పింది వినకుండా.. మైకు తీసుకుని అక్కడ కూడా ప్రసంగించేయడం విశేషం. దిశానిర్దేశం చేయకుండానే... ఇంత హడావుడీ చేసిన చంద్రబాబు.. ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో పార్టీ క్యాడర్‌కు ఎటువంటి దిశా నిర్దేశం చేయలేదు. జిల్లాలో మూడు రోజులున్నా పి.గన్నవరం, రామచంద్రపురం నియోజకవర్గాలకు పూర్తి స్థాయి పార్టీ ఇన్చార్జిలను నియమించే విషయం తేల్చలేదు. అమలాపురం, కొత్తపేట, రాజోలు నియోజకవర్గాల్లో ఉన్న అసంతృప్తులను చల్లార్చలేదు.కొసమెరుపు ఏమిటంటే.. అధినేత పర్యటన టీడీపీ క్యాడర్లో జోష్ నింపలేదు. కానీ, అమలాపురం సభ అట్టర్‌ఫ్లాప్ అవ్వడం మాత్రం ఇక్కడి ఇన్చార్జి ఆనందరావు వ్యతిరేకులను ఖుషీ చేసింది. చంద్ర ‘బాబా’.. రావులపాలెం సభలో చంద్రబాబు చేసిన విచిత్ర ప్రసంగానికి అందరూ అవాక్కయ్యారు. తాను పంపే రాఖీలను దేవుని వద్ద 45 రోజులు ఉంచాలని, అవి చేతికి కట్టుకుని.. సమస్య వచ్చినప్పుడు తనను తలచుకుంటే పరిష్కారమవుతుందని చెప్పారు. ఏవో అతీంద్రియ మహిమలున్న ఓ బాబా మాదిరిగా చంద్రబాబు చెప్పిన ఆ మాటలు విని.. నివ్వెరపోవడం సభకు వచ్చిన మహిళల వంతయ్యింది. -
అమలాపురంలో నాలుగో ఏడాది సున్నా వడ్డీ పంపిణీ
-
సీఎం జగన్‌కు కోనసీమ బ్రహ్మరథం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కోనసీమలో మహిళలు, యువకులు బ్రహ్మరథం పట్టారు. అమలాపురం రూరల్ జనుపల్లిలో శుక్రవారం వైఎస్సార్ సున్నా వడ్డీ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అమలాపురం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి అక్కడికి ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఉన్న జనుపల్లిలోని స్టేడియం సభాస్థలికి చేరుకోవడానికి అరగంటకు పైగా పట్టింది. అడుగడుగునా ప్రజలు జైజగన్ నినాదాలు చేస్తుండగా.. వారందరికీ అయన అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు. ప్రాంగణం బయట, రోడ్లపైన జనం బారులు తీరారు. అమలాపురం, ఎర్రవంతెన–నల్లవంతెన మార్గం తిరునాళ్లను తలపించింది. బాధితులకు సీఎం ఓదార్పు.. తాడేపల్లి తిరిగి వెళ్లే సమయంలో హెలిప్యాడ్ వద్ద బాధితులు సీఎం జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వికలాంగులు, వృద్ధులు, అభాగ్యులు, అనారోగ్యంతో బాధపడుతున్న సుమారు 146 మంది విన్నపాలను సీఎం జగన్ రెండు గంటలపాటు ఎంతో ఓపికగా ఆలకించారు. తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆదేశించారు. వారంతా భోజనం చేయలేదని తెలుసుకుని, వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అంతకు ముందు సీఎం జగన్ అమలాపురం–బెండమూర్లంక మధ్య రూ.17.44 కోట్లతో 8 కిలోమీటర్ల రోడ్డు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. బెండమూర్లంక ఓహెచ్‌ఆర్‌సీ ట్యాంకు నుంచి ఓఎన్జీసీ ప్లాంట్ వరకు రూ.7.62 కోట్ల ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి, సాంఘిక సంక్షేమ నిధులు రూ.12.16 కోట్లతో అంబేడ్కర్ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. -
సీఎం జగన్‌కు జేజేలు.. పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
వైఎస్సార్ సున్నా వడ్డీ: కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
అమలాపురం బహిరంగ సభలో మహిళ సూపర్ స్పీచ్
-
అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది
-
శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడటం లేదు: సీఎం జగన్
సాక్షి, అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు పొలిటికల్ కౌంటరిచ్చారు. రాష్ట్రంలో మహిళలను మోసం చేసిన ఘన చరిత్ర చంద్రబాబుదే.. నారా వారిదేనని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాల మైండ్‌లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయని అన్నారు. అది నారా వారి ఘన చరిత్ర.. అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నిధులను సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2014-19 మధ్య డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రుణాలు మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు నడిరోడ్డు మీద నిలబెట్టారు. బాబు హయాంలో 14వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించామన్నారు. మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదే అని స్పష్టం చేశారు. అది వారి చరిత్ర.. అది నారా వారి చరిత్ర.. అది నారీ వ్యతిరేక చరిత్ర అని విమర్శించారు. చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుంది. 2016లో సున్నావడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి ఏ, బీ గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారాయి. ప్రతిపక్షాల ఫ్యూజులు ఔట్.. ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాల మైండ్‌లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి. ఇన్నిన్ని పథకాలు చంద్రబాబు హయాంలో చూశారా?. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం ఉందా?. మీ బిడ్డల భవిష్యత్ గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా?. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువుల్ని అడ్డుకున్నారు. 75ఏళ్ల చంద్రబాబు ఇళ్లు కట్టించే ప్రయత్నం చేశారా?. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా?. ఇలాంటి చంద్రబాబును ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నారు. తనకు గిట్టని వారి అంతుచూస్తాడట.. చంద్రబాబు వంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరగదు. చంద్రబాబు తనకు గిట్టని వారి అంతు చూస్తాడట. ఇందు కోసమే చంద్రబాబు అధికారం ఇవ్వాలట. చంద్రబాబు దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం వారికి నరకం చూపిస్తున్నాడు. ఎస్టీలకు చంద్రబాబు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు. బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెదిరించాడు. చంద్రబాబు మాటంటే విలువ లేదు, విశ్వసనీయత లేదు. వీరికి కావాల్సింది.. దోచుకోవడం.. పంచుకోవడం. ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఎందుకివ్వాలి.. మొన్నటి పుంగనూరు ఘటన చేస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలి. ఒక రూట్లో పర్మిషన్ తీసుకుని ఇంకో రూట్లో వెళ్లాడు. 47 మంది పోలీసులకు గాయాలు చేశాడు. చంద్రబాబు అరాచకంతో ఒక పోలీసు కన్ను పోగొట్టాడు. శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడటం లేదు. రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారు. మీ బిడ్డకు మీరే ధైర్యం. మీకు మేలు జరిగితే మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని అన్నారు. ఇది కూడా చదవండి: ఇది మన ప్రభుత్వ ఘన చరిత్ర: సీఎం జగన్ -
రావాలి జగన్..మళ్లీ కావాలి జగన్..
-
ఇది మన ప్రభుత్వ ఘన చరిత్ర: సీఎం జగన్
సాక్షి, అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బులను బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేశారు. అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ నాలుగున్నరేళ్లలో మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల సాధికారత కోసం అడుగులు వేశామన్నారు. అక్కచెల్లెమ్మలు సంతోషమే ముఖ్యం.. పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీభారం పడకూడదు. మహిళల జోవనోపాధి మెరుగుపడేలా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ చేస్తున్నాం. అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశామన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. దేశ చరిత్రలోనే చరిత్ర సృష్టించాం.. దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం తీసుకొచ్చాం. పేద పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చేశాం. పేదరికం నుంచి బయటపడాలంటే చదువే ఆయుధం. వైఎస్సార్ చేయూత ద్వారం 14వేల 129 కోట్లు అందిచామన్నారు. వసతి దీవెన కింద ప్రతీ ఏటా రూ.20వేలు ఇస్తున్నాం. పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. ఈ స్థాయిలో గతంలో ఇళ్ల పట్టాలు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా 22 లక్షల ఇళ్లు కూడా కట్టిస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా మహిళలకు ఇంతటి మేలు చేయలేదు. ఇది మన ప్రభుత్వ ఘన చరిత్ర.. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. సూర్యోదయం కంటే ముందే వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు అందిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో 2లక్షల 31వేల 123 కోట్లు ఇచ్చాం. బాలింతల కోసం 2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. బాలింతల కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.400 కోట్లే. ఇది మన ప్రభుత్వం సృష్టించిన చరిత్ర అని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చాం. దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్‌ను తీసుకువచ్చాం. కోటి 24లక్షల మంది దిశ యాప్‌లో రిజిస్టర్ అయ్యారు. దిశ యాప్ ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నాం. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చేస్తున్నారు. -
స్టాళ్లను పరిశీలించిన సీఎం వైఎస్ జగన్
-
అమలాపురం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
Live: అమలాపురంలో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
-
దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదు: సీఎం జగన్
Updates.. సీఎం జగన్ ప్రసంగం ►దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం ►అక్క చెల్లెమ్మల సాధికారిత కోసం అడుగులు వేశాం ►మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశాం ►కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుంది. ►గత ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను మోసం చేశారు. ►బాబు హయాంలో 14వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. ►మహిళలను గత ప్రభుత్వం రోడ్డున పడేసింది ►గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించాం ►1,05,13,365 మంది పొదుపు మహిళలకు లబ్ధి ►రూ.1353.76 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ ►ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం 4969.05 కోట్లు ►పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకూడదు ►మహిళల జీవనోపాధి మెరుగుపడేలా బ్యాంకులతో ఒప్పందాలు ►మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదే ►మన ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడే ప్రభుత్వం ►వడ్డీ మాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశారు ►చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుంది ►2016లో సున్నా వడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్ధు చేశారు ►అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. ►మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశాం. ►దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదు. ►లబ్దిదారులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఎంతో లబ్ధిచేరుకుంది. గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగే వాళ్లం. కానీ, ఇప్పుడు ఒక్క బటన్ నొక్కడంతో నేరుగా మా ఖాతాల్లోకి నిధులు జమ అవుతున్నాయి. పాదయాత్రలో అక్కచెల్లెలమ్మల బాధ చూసి మీరు మాకోసం ఎంతో చేస్తున్నారు. వాలంటీర్లపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలను సైతం లబ్ధిదారులు ఖండించారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. జగనన్న మా కోసం ఎంతో చేస్తున్నారని తెలిపారు. ► పొదుపు సంఘాల మహిళలతో సీఎం జగన్ ఫొటో దిగారు. ► స్టాళ్లను పరిశీలించిన సీఎం జగన్. ఈ క్రమంలోనే మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను కూడా సీఎం పరిశీలించారు. ► అమలాపురం చేరుకున్న సీఎం జగన్. ► సాక్షి, అమలాపురం/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో పర్యటిస్తున్నారు. ► ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును సీఎం జగన్ జమ చేస్తారు. ► అమలాపురంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేస్తారు. ► రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు అందించిన మొత్తం సాయం రూ.4,969.05 కోట్లు అవుతుంది. ► పేద అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పిస్తూ.. వారు చేస్తున్న వ్యాపారాలకు ఊతమిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరుస్తున్న సంగతి తెలిసిందే. ► ఈ క్రమంలో బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. ► అక్కచెల్లెమ్మలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా.. వారి జీవనోపాధి మెరుగుపడేలా బహుళజాతి దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాలతో సుస్థిర ఆర్థికాభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం బాటలు వేసింది. ► ప్రభుత్వం చొరవ తీసుకుని బ్యాంకులతో మాట్లాడి వడ్డీరేట్లు తగ్గింపచేయడంతో అక్కచెల్లెమ్మలపై రూ.1,224 కోట్ల మేర వడ్డీ భారం తగ్గింది. దీంతో ఏటా రూ.30 వేల కోట్లకు పైగా రుణాలు అందుకుని.. వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటూ.. రుణాల రికవరీలో సైతం 99.67 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి అక్కచెల్లెమ్మలు ఆర్థిక పరిపుష్టిని సాధించారు. ► ప్రభుత్వ సహకారంతో పశువుల కొనుగోలు, కిరాణా దుకాణాలు, వస్త్ర వ్యాపారాల వంటివి చేసుకుంటున్న 16,44,029 మంది అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.7,000 నుంచి రూ.10,000ల వరకు అదనపు ఆదాయం. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.20 వరకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. ► కార్యక్రమం అనంతరంఅమలాపురానికి వచ్చి.. అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు అమలాపురానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో పర్యటించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి అమలాపురంలోని పోలీస్ గ్రౌండ్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి జనుపల్లి గ్రామానికి చేరుకొని.. బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బును ముఖ్యమంత్రి జగన్ జమ చేస్తారు. కార్యక్రమం అనంతరంఅమలాపురానికి వచ్చి.. అక్కడి నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. -
సంక్షేమ పథకాలకు చిరునామా వై.ఎస్.ఆర్
-
సంకర జాతి మేకల బిజినెస్.. లాభాలు ఆర్జిస్తున్న ఎన్నారై రైతు
ఓ ప్రవాస భారతీయుడు చొరవతో మేలైన సంకరజాతి మేకల జాతిని ఉత్పత్తి చేశారు. ఇది మాంసోత్పత్తికి, పాల దిగుబడికి రెండు విధాలుగా ఉపయోగపడే మేకల జాతి కావడం విశేషం. వేగంగా పెరగడంతో పాటు రుచికరమైన మాంసాన్ని అందిస్తుంది. ఈ జాతి మేకలు రోజుకు రెండు లీటర్ల వరకు పాలు కూడా ఇస్తుండటంతో రైతుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రరల్ మండలం భట్లపాలెం చెందిన కె.నాగేశ్వరరావు 21 ఏళ్లుగా సింగపూర్‌లో ఓ నిర్మాణ సంస్థలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. కరోనా సమయంలో స్వస్థలానికి వచ్చిన ఆయన ఇక్కడే వ్యవసాయాన్ని వాణిజ్య స్థాయిలో చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలం ఆక్వా సాగు చేసిన తర్వాత మేకల పెంపకంపై దృష్టిసారించారు. మేలైన విదేశీ మేకలను తీసుకువచ్చి స్థానిక మేకలతో క్రాసింగ్ చేయించారు. అమలాపురం సమీపంలోని కామనగరువులోని వ్యవసాయ క్షేత్రంలో వీటిని పెంచుతూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు. దక్షిణాఫ్రికా బోయర్ రకం ఇటు మాంసం ఉత్పత్తికి, అటు పాల దిగుబడికి ఉపయోగపడే దక్షిణాఫ్రికాకు చెందిన బోయర్ రకం మేకల మాంసం రుచిగా ఉంటుంది. వేగంగా పెరుగుతుంది. ఒక్కోటి రూ.3 లక్షల వ్యయంతో దక్షిణ ఆఫ్రికా బోయర్ రకం విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకున్నారు. ఈ పొట్టేలు బరువు ఏకంగా 140 కేజీల వరకు ఉంటుంది. ఆ జాతి విత్తన పొట్టేళ్లను దిగుమతి చేసుకొని స్థానిక జాతులతో సంకరం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయని భావించారు. ఆ విధంగానే పొటేళ్లను దిగుమతి చేసుకొని.. రాజస్థాన్‌కు చెందిన అజ్మీర్, సిరోహి, కేరళకు చెందిన తలచేరి, పంజాబ్‌కు చెందిన బిటిల్ రకాల మేకలతో సంకరం చేయించారు. దీంతో ప్రయోగం విజయవంతమైంది. 8 నెలల్లోనే 40 కిలోలు.. తమ వ్యవసాయ క్షేత్రంలో ఈ క్రాస్ బ్రీడ్ (సంకర జాతి) మేకల సంతతి స్థానిక రకాల కన్నా వేగంగా బరువు పెరుగుతున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక దేశవాళి మేక రెండేళ్లలో గరిష్ఠంగా 40 కేజీలు బరువు పెరుగుతుంది. ఈ సంకరజాతి మేక 8 నెలల్లోనే ఈ బరువుకు పెరుగుతోంది. రెండేళ్లలో 70 కేజీలవుతోంది. ఆడ మేక రోజుకు రెండు లీటర్ల వరకు పాలు ఇస్తోందని ఆయన వివరించారు. ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో సంకర జాతి మేకలు పెంచుతున్నారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యహారమే అయినా మేకలు 2–3 రెట్ల బరువు పెరుగుతాయి. నాణ్యమైన, రుచికరమైన మాంసం ద్వారానే కాకుండా, పాల ద్వారా రోజువారీ ఆదాయాన్ని పొందే అవకాశముంది. బోయర్ జాతి లక్షణాలు 100 శాతం స్థానిక బ్రీడ్‌లో తెప్పించే దిశగా ప్రయత్నిస్తున్నారు. క్రాస్ బ్రీడింగ్ ద్వారా వచ్చే సంతతిని రైతులకు ఒక పొట్టేలుకు 20 మేకలను యూనిట్‌గా విక్రయిస్తున్నారు. మాంసం రిటెయిల్ విక్రయించడానికి అవుట్లెట్ ఏర్పాటు చేయబోతున్నామని నాగేశ్వరరావు వివరించారు. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ చేస్తే జబ్బుల బారినపడే అవకాశం చాలా తక్కువని నాగేశ్వరరావు అన్నారు. – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి, అమలాపురం నాణ్యమైన బ్రీడ్ అభివృద్ధే లక్ష్యంమన ప్రాంతంలో దేశవాళీ మేక మాంసం కన్నా నాణ్యమైన, రుకరమైన మాంసం అందించే సంకర జాతి బ్రీడ్‌ను అందుబాటులోకి తేవాలన్నదే నా కోరిక. విదేశీ బ్రీడ్ మేక పిల్లలను దిగుమతి చేసుకొని ఇక్కడ పెంతే స్థానిక వాతావరణానికి ఎంతగా తట్టుకుంటాయో చెప్పలేం. అందుకే దక్షిణాఫ్రికా బోయర్ రకంతో స్థానిక రకాలను సంకరం చేసి కొత్త బ్రీడ్‌ను రపొందిస్తున్నాం. తద్వారా మేలు రకం వంసం ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఈ సంకర జాతి మేకలు పూర్తిస్థాయిలో బోయర్ గుణగణాలను సంతరించుకునేందుకు మూడు, నాలుగేళ్ల సమయం పడుతుంది. ఈ సంకరజాతి మేకలు స్థానిక వాతావరణాన్ని తట్టుకుంటాయి. – కె. నాగేశ్వరరావు (99235 44777), కామనగరువు, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి ఉత్పత్తి స్థానిక దేశవాళీ మేకల పెంపకం కన్నా మేలైన రకాల నుంచి ఉత్పత్తి అయ్యే సంకర జాతి మేకలు త్వరగా ఎదుగుతాయి. నాణ్యమైన మాంసం ఉత్పత్తి అవుతుంది. రైతు నాగేశ్వరరావు శాస్త్రీయ పద్ధతిలో మేలు జాతి మేకలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ జాతి ద్వారా మేకల పెంపకందారులు అధిక మాంసం, పాల దిగుబడి సాధించే అవకాశముంది. – విజయ రెడ్డి, సహాయ సంచాలకులు, పశు సంవర్ధక శాఖ, అమలాపురం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్. -
సీఎం జగన్ మాట ఇచ్చారు.. నెరవేర్చారు
సాక్షి అమలాపురం: ‘మాట ఇస్తే.. చేస్తానంతే..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. బాధితులు కోరిన ఆర్థిక సహాయాన్ని 24 గంటల్లో రోగులకు, పేదలకు అందేలా చేసి వారిపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సీఎం జగన్ బుధవారం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడి వివాహానికి వచ్చిన సీఎం జగన్‌ను కలిసి బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 24 గంటలు తిరగకుండానే 25 మంది బాధితులకు రూ.26 లక్షలను కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా అందజేశారు. లబ్ధిపొందినవారిలో పలువురు దివ్యాంగులు, దీర్ఘకాలికవ్యాధుల బాధితులు ఉన్నారు. సీఎం సహాయనిధి నుంచి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అందించడంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యసేవలు అందించాలని సీఎం ఆదేశించినట్టు కలెక్టర్ శుక్లా తెలిపారు. వీరిలో టి.సుజాతకు రూ.రెండులక్షలు అందించారు. డీఎం అండ్ హెచ్‌వో ఎం. బాబూరావు దొర, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ రాధాకృష్ణ, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఏవో కాశీవిశ్వేశ్వరరావు పాల్గొన్నారు. చదవండి: గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగుల బదిలీలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం! -
అమలాపురం ఘటన.. కేసుల ఉపసంహరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, తాడేపల్లి: అమలాపురం ఘటనలతో ఏర్పడిన సామాజిక విభేదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ సామాజిక వర్గాలు మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని బలపరిచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపారు. క్యాంపు కార్యాలయంలో కోనసీమ నేతలు, సామాజికవర్గాల నాయకులతో సీఎం మంగళవారం సమావేశమయ్యారు. అమలాపురం ఘటనలో నమోదైన కేసులు ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సీఎం జగన్ నిర్ణయంపై కోనసీమ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ► తరతరాలుగా మీరంతా అదే ప్రాంతంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు ► అక్కడే పుట్టి.. అక్కడే పెరిగి… జీవిత చరమాంకం వరకూ అక్కడే ఉంటున్నారు ► రేపు అయినా.. అక్కడే పుట్టాలి.. అక్కడే పెరగాలి.. అక్కడే జీవితాల్ని ముగించాలి ► అందుకే భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు… వాటిని మరిచిపోయి… మునుపటిలా కలిసిమెలిసి జీవించాలి. లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుంది ► దీన్ని ఇలా లాగుతూ పోతే.. మనుషుల మధ్య దూరం పెరుగుతుంది ► దీనివల్ల నష్టపోయేది మనమే… అందుకే అందరం కలిసి ఉండాలి, ఆప్యాయతతో మెలగాలి ► చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, అపోహలు ఉన్నా పక్కనపెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందాం, ►తప్పులు భూతద్దంలో చూసుకోకుండా ఒకరికొకరు కలిసిపోదాం ► అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం, మిమల్ని ఒకటి చేయడం కోసం ఈ ప్రయత్నమంతా చేస్తున్నాం ► అందరికీ పార్టీలు చూడకుండా శాచురేషన్ బేసిస్ మీద పథకాలు అన్నీ ఇస్తున్నాం ► వలంటీర్లకు తోడుగా గృహ సారథులు కూడా ఉంటారు.. వ్యవస్ధలో పారదర్శకంగా ఉండాలనే ఈ నిర్ణయం ► అర్హత ఉన్న వారికి ఏ పథకమైనా అందని పరిస్థితి ఉండకూడదనేది మన విధానం ► కులం చూడకుండా, మతం చూడకుండా ఎవరికి అర్హత ఉంటే వారికి అన్నీ ఇస్తున్నాం. ► పార్టీలు చూడకుండా జరగాల్సిన మంచి చేస్తున్నాం. ► రూ. 2 లక్షల కోట్ల డీబీటీ దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. రూపాయి లంచం లేకుండా ఈ స్ధాయిలో ఎప్పుడూ జరగలేదు ► టీడీపీ హాయంలో నా పాదయాత్రలో లోన్ ల గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు లోన్ ల కోసం లంచం ఇవ్వాల్సిన పరిస్ధితి. అవికూడా అక్కడక్కడా అరకొర అందేవి ► ఇప్పుడు ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నాం. లంచాలు లేని ఇంత మంచి వ్యవస్ధను తీసుకొచ్చాం ► మంచి చేసే విషయంలో ఏం చూడకుండా చేస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ ఉంటేనే సమాజానికి మంచి జరుగుతుంది ► ఏ కారణం చేతనైనా ఎవరైనా మిస్ అయితే వారిని చేయి పట్టుకుని నడిపించడానికి కార్పొరేషన్లు కూడా ఏర్పాటుచేశాం ► ఇది మంచి పరిణామం, దేవుడి దయ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం ► మీరంతా మనస్ఫూర్తిగా ముందుకు వచ్చారు. మంచి వాతావరణం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. -
షీర్ వాల్ టెక్నాలజీతో పేదల ఇళ్లు.. పైలెట్‌గా మోడల్ ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణంలో షీర్ వాల్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30 లక్షలకు పైగా గృహాల నిర్మాణాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రెండు దశల్లో 18.63 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులివ్వగా ఇప్పటికే 17.22 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. ఆప్షన్–3(ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఇళ్లు) గృహాల నిర్మాణానికి షీర్ వాల్ పరిజ్ఞానాన్ని వినియోగించటాన్ని గృహ నిర్మాణ శాఖ పరిశీలిస్తోంది. అమలాపురం మున్సిపాలిటీలో.. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ఇస్తున్న రూ.1.80 లక్షలు, అదనపు సాయం కింద బ్యాంక్ రుణం రూపంలో అందచేసే రూ.35 వేలతోనే షీర్ వాల్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణానికి కొందరు నిర్మాణదారులు ముందుకొచ్చారు. వేగంగా ఇళ్ల నిర్మాణంతో పాటు భూకంపాలు, తుపాన్లను సైతం తట్టుకునేలా ఇంటి నిర్మాణం పూర్తవుతుండటంతో ఈ పరిజ్ఞానం వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించిన బోడసకుర్రు వద్ద వైఎస్సార్ జగనన్న కాలనీలో కొఫియ గ్రూప్‌నకు చెందిన అజయ్హోమ్స్ అనే సంస్థ పైలట్‌గా షీర్ వాల్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. నాణ్యతను పరీక్షించిన అనంతరం ఈ పద్ధతిని రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన లేఅవుట్లకు విస్తరించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులు నిర్ణయించారు. షీర్ వాల్ పద్ధతిలో ఇటుకలు అవసరం లేకుండా సిమెంట్, కాంక్రీట్, ఇనుముతో కాంక్రీట్ గోడలు నిర్మిస్తారు. ఉగాదికి ఐదు లక్షల ఇళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రెండు దశల్లో 17.22 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా ఇప్పటికే 3,00,986 గృహాల నిర్మాణం పూర్తయ్యింది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 25,573, చిత్తూరులో 25,072, పశ్చిమ గోదావరిలో 19,205 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఉగాది నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గడువులోగా లక్ష్యాన్ని చేరుకునేలా నిర్మాణ పనులను వేగవంతం చేశారు. నాణ్యత పరీక్షల అనంతరం.. షీర్ వాల్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణానికి నిర్మాణదారులు ముందుకొస్తున్నారు. అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో పైలెట్‌గా ఈ పద్ధతిలో ఒకటి రెండు ఇళ్లను నిర్మిస్తాం. వీటి నాణ్యతను పరీక్షించిన అనంతరం ఈ పద్ధతిని కొనసాగిస్తాం. – లక్ష్మి షా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ. -
మెగా వాటర్ గ్రిడ్‌కు లైన్ క్లియర్.. డెల్టా వాసుల కల నెరవేరుస్తున్న ప్రభుత్వం
సాక్షి అమలాపురం: గోదావరి చెంతనే ఉన్నా.. గుక్కెడు స్వచ్ఛమైన తాగునీరు అందని వారెందరో. శివారు ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు.. గోదావరి మధ్య ఉన్న లంకవాసులకు సైతం స్వచ్ఛమైన తాగునీరందదు. గుక్కెడు నీటి కోసం అలమటించేవారెందరో.. ఒకవైపు గోదావరి కాలువల్లో రెట్టింపవుతున్న కాలుష్యం.. మరోవైపు వేసవిలో శివారుకు తాగునీరు అందని దుస్థితి.. వీటన్నింటికీ ముగింపు పలుకుతూ ఇప్పటికే ‘జల్‌జీవన్ మిషన్’లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఇంటింటా కుళాయిల ఏర్పాటు పనులు వేగంగా చేస్తోంది. దీంతోపాటు ‘డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఇన్ కోస్టల్ ఏరియా’ అనే బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. జల్‌జీవన్ మిషన్‌లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం నిధులతో చేపట్టనున్న ఈ మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. రూ.1,650 కోట్లతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని 11 నియోజకవర్గాలు.. 32 మండలాల్లోని 451 గ్రామాలకు తాగునీరందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సుమారు 25 లక్షల మందికి నేరుగా గోదావరి నుంచి తాగునీరు అందించనుంది. ఈ నెలాఖరుకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకోనుంది. స్థల సేకరణ పూర్తయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రెండున్నరేళ్లలో దీని నిర్మాణం పూర్తి కానుంది. రెండు డెల్టాల పరిధిలో నిర్మాణం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో దీని నిర్మాణం జరుగనుంది. ఈ ప్రాజెక్టు వల్ల కోనసీమ జిల్లాకు అధికంగా మేలు జరగనుంది. జిల్లా పరిధిలోని మొత్తం 22 మండలాలకూ బ్యారేజీ నుంచి నేరుగా తాగునీరందనుంది. ఇక తూర్పు డెల్టా పరిధిలో కాకినాడ జిల్లాలో సామర్లకోట, కరప, తాళ్లరేవు, కాజులూరు మండలాలకు, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం రూరల్, కడియం, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండలాలకు లబ్ధి చేకూరనుంది. ఐదుచోట్ల ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ వాటర్ గ్రిడ్‌లో భాగంగా ఐదు ప్రాంతాల్లో ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల (ఆర్ఎస్ఎఫ్) నిర్మాణాలు చేయనున్నారు. గోదావరి నది నుంచి నేరుగా వచ్చే నీటిని ఇక్కడ శుద్ధి చేస్తారు. ఒక్కొక్క దానినీ 30 నుంచి 50 మిలియన్ లీటర్ పర్ డే (ఎంఎల్డీ) సామర్థ్యంతో నిర్మిస్తారు. ఇక్కడ నీటిని అధునాతన పద్ధతిలో ఫిల్టర్ చేసి, అక్కడి నుంచి ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(ఓహెచ్‌బీఆర్)లకు పంపిస్తారు. ఉమ్మడి జిల్లాలో వీటిని పది చోట్ల నిర్మిస్తారు. వీటిలో అంబాజీపేట మండలం ముక్కామల, పి.గన్నవరం మండలం బెల్లంపూడి, ఆలమూరు మండలం మడికి, మండపేట మండలం తాపేశ్వరం, ఎల్ఎన్ పురం వద్ద సంప్లతో కూడిన ఓహెచ్బీఆర్ల నిర్మించనున్నారు. ఈ ఓహెచ్బీఆర్ల ఎత్తు 200 మీటర్లు ఉంటుంది. వీటికి అనుబంధంగా మూడు జిల్లాల పరిధిలో మరో మూడు ఓహెచ్‌బీఆర్‌లు నిర్మించనున్నారు. వంద అడుగుల ఎత్తున లక్ష లీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మిస్తారు. నాలుగు ఇన్లెట్లు డెల్టా వాసులకు నేరుగా తాగునీరు తరలించేందుకు బ్యారేజీ ప్రాంతంలో నాలుగు ఇన్లెట్లు నిర్మించనున్నారు. మధ్య డెల్టాలోని 16 మండలాలకు (కోనసీమ జిల్లా) బొబ్బర్లంక వద్ద ఇన్లెట్ ఏర్పాటు చేయనున్నారు. తూర్పు డెల్టాలోని ధవళేశ్వరం వద్ద మూడు ఇన్లెట్లు నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి ఆలమూరు, కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, రామచంద్రపురం, కె.గంగవరం (కోనసీమ జిల్లా), సామర్లకోట, కరప, తాళ్లరేవు, కాజులూరు (కాకినాడ జిల్లా), రాజమహేంద్రవరం రూరల్, కడియం (తూర్పు గోదావరి జిల్లా)లకు నీరు అందుతుంది. ఇప్పుడున్న పథకాలకు అనుసంధానం తూర్పు, మధ్య డెల్టాల్లోని వాటర్ గ్రిడ్ పరిధిలో ఇప్పటికే పలు పథకాలున్నాయి. 31 సీడబ్ల్యూసీ, 390 పీడబ్ల్యూసీ స్కీమ్‌ల ద్వారా తాగునీరు అందుతోంది. వీటిని వాటర్ గ్రిడ్ పరిధిలోకి తీసుకురానున్నారు. కొత్తగా మరికొన్ని పథకాలు రానున్నాయి. వీటితో పాటు జల్‌జీవన్ మిషన్ ద్వారా నిర్మిస్తున్న పైప్లైన్ల ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరందించనున్నారు. రెండున్నరేళ్లలో పూర్తి మంచినీటి పథకాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. అన్ని అనుమతులూ వచ్చిన వెంటనే పనులు మొదలు కానున్నాయి. రెండు డెల్టాల్లోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 20 ఏళ్ల తరువాత అవసరాలు కూడా తీర్చేలే పథకాన్ని రూపొందించాం. – సీహెచ్ఎన్వీ కృష్ణారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి, అమలాపురం -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంట్లో షాకింగ్ ఘటన.. తలుపు తట్టి.. నెట్టుకు వచ్చి..
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ఓ ఆగంతకుడు చాకులతో దాడి చేసిన ఘటన అమలాపురం పట్టణంలో కలకలం రేపింది. పోతీసులు, బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రకాశం వీధిలో నివసిస్తున్న నందెపు రామాంజనేయులు కుమార్తె సూర్యప్రియాంక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఆమె భర్త విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నారు. నాలుగు నెలల బాలింతరాలు కావడంతో ఆమె చంటిబిడ్డతో అమలాపురంలోని పుట్టింట్లోనే ఉండి ఉద్యోగ విధులు నిర్వహిస్తోంది. బిడ్డకు అస్వస్థతగా ఉండటంతో ప్రియాంక ఆదివారం రాత్రి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చింది. రాత్రి 9 గంటల సమయంలో తలుపు తట్టిన శబ్దం వినిపించడంతో ప్రియాంక తలుపు తెరిచింది. అంతలోనే ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు వేసుకుని, రెండు చేతుల్లో రెండు చాకులు పట్టుకుని ఉన్న దుండగుడు ఒక్కసారిగా తలుపు నెట్టి.. ఇంట్లోకి చొరబడి, ఆమెపై దాడికి ఒడిగట్టాడు. రక్షణ కోసం అడ్డం పెట్టుకున్న చేతులపై చాకులతో పొడిచి బలంగా గాయపరిచాడు. ఈ హఠాత్పరిణామంతో హడలిపోయిన ప్రియాంక భయంతో పెద్ద పెట్టున కేకలు వేస్తూ తండ్రి ఉన్న గదిలోకి వెళ్లింది. అంతలోనే ఆ ఆగంతకుడు తన చేతిలోని రెండు చాకులను అక్కడే వదిలేసి, ఇంటి గోడ దూకి పరారయ్యాడు. చేతులకు తీవ్ర గాయాలైన ప్రియాంకను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో అమ్మ, తాను మాత్రమే ఉన్నామనుకుని ఆ ఆగంతకుడు చోరీకి వచ్చాడని ప్రియాంక పోలీసులకు చెప్పింది. తన తండ్రి ఇంట్లో ఉండబట్టే తాను, తన తల్లి బతికామని, లేకపోతే తమను చంపేసి నగలు దోచుకునేవాడని ఆమె కన్నీటిపర్యంతమైంది. చదవండి: ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ప్రియురాలు.. ఆ ఇంట్లో అసలేం జరిగింది? ఆ దుండగుడు చోరీకి విఫలయత్నం చేసి, ఈ దాడికి పాల్పడడ్డాడని రామాంజనేయులు కూడా చెబుతున్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుడు వదిలేసిన చాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుడు చోరీకి వచ్చాడా.. తెలిసున్న వ్యక్తే ఈ దాడికి ఒడిగట్టాడా.. మతిస్థిమితం లేక ఇలా ప్రవర్తించాడా అనే కోణాల్లో బాధిత కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పట్టణ ఎస్సై ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు ఆ ఇంటిని సోమవారం బాధిత కుటుంబ సభ్యులను విచారించారు. ఆ వీధిలో ఉన్న సీసీ ఫుటేజీలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ దాడి ఏ కారణంతో జరిగిందో దర్యాప్తు అనంతరం స్పష్టత వస్తుందని ఎస్సై ప్రభాకర్ చెప్పారు. -
ప్రమాదాల వేళ గోల్డెన్ అవర్‌లో స్పందించండి.. పోలీసుల సూచనలివీ
అమలాపురం టౌన్: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటారు. కళ్లెదుటే ప్రమాదం జరిగినా రోడ్డుపై వెళ్లే ఎందరో అయ్యో పాపం! అంటూ నిట్టూర్చుతారు. ఆ కీలక సమయంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తే బతుకుతారనే చైతన్యం చూపేవారు అరుదుగా ఉంటారు. ప్రమాద స్థలం నుంచి ఆస్పత్రికి తరలిస్తే ఆ కేసులో తమనూ పెడతారేమో.. లేదా సాక్ష్యంగా నమోదు చేస్తారేమోననే భయాలే కారణం. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులు 108 అంబులెన్స్ వచ్చే వరకూ రోడ్డు పైనే విలవిలలాడుతున్నారు. అలా కాకుండా ప్రమాదం జరిగిన మరుక్షణమే ఎవరో ఒకరు స్పందించి, ఆస్పత్రికి తరలిస్తే సకాలంలో వైద్యం అంది వారు బతుకుతారు. ఇలా క్షతగాత్రులను కాపాడినవారిని ‘సమారిటన్’ అని అంటున్నారు. ప్రమాదాలు జరినప్పుడు క్షతగాత్రులను రక్షించడంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా రాష్ట్ర పోలీసు శాఖ అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. కీలక సమయాల్లో ప్రజలను కాపాడిన వారికి గౌరవ సూచకంగా రూ.5 వేల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రమాద సమయాల్లో ప్రజలను కాపాడేందుకు ప్రజలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో తెలియజేస్తూ.. ఆ ఆపద సమయంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం వల్ల ప్రాణాలను ఎలా కాపాడవచ్చో వివరిస్తూ ఐదు అంశాలతో కూడిన సందేశాత్మక బోర్డులను ప్రతి పోలీసు స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసి, ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని 25 పోలీసు స్టేషన్లు, ఏడు సర్కిల్ కార్యాలయాలు, డీఎస్పీ కార్యాలయాల వద్ద ఆ బోర్డులను జిల్లా పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. పోలీసుల సూచనలివీ.. ప్రమాదాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను కాపాడిన వారిని పోలీసులు విచారణ, దర్యాప్తులో చేర్చరు. చెప్పాలనుకుంటే స్వచ్ఛందంగా సాక్ష్యం చెప్పవచ్చు. పోలీసుల నుంచి ఎటువంటి ఒత్తిడీ ఉండదు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్సకు డబ్బులు వసూలు చేయరు. చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించరు. కాపాడిన వారు తమ గుర్తింపును వెల్లడించాల్సిన అవసరం లేదు. కాపాడిన వ్యక్తిని పోలీసు శాఖ గుర్తించి, రూ.5 వేల నజరానాకు ఎంపిక చేస్తుంది. కలెక్టర్ ఆ బహుమతి మంజూరు చేస్తారు. ప్రమాదానికి కారణమైన వారు కూడా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించవచ్చు. అలా చేస్తే వారికి ప్రమాదం చేసి, తప్పించుకున్నారనే నేరం నుంచి మినహాయింపు లభిస్తుంది. పోలీసుల నుంచి పూర్తి సహకారం రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని కీలక సమయం(గోల్డెన్ అవర్)లో ఎవరైనా స్పందించి ఆస్పత్రికి తరలిస్తే వారి ప్రాణాలను కాపాడిన వారవుతారు. అలా చేసిన వారికి పోలీసు శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ప్రజల్లో ఈ చైతన్యం పెరగాలి. కేసులు, సాక్ష్యాలు అనే అపోహలు, భయాల నుంచి ప్రజలు బయటపడాలి. క్షతగాత్రుల ప్రాణాలను రక్షించడమే ప్రథమ కర్తవ్యం కావాలి. దీనిని సామాజిక బాద్యతగా భావించాలి. – సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
సీఎం జగన్ చొరవతో అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి చికిత్స
-
బిగ్‌షాట్‌లే టార్గెట్: కిడ్నాపులు, హత్యలే అతడి నైజం
సాక్షి, అమలాపురం టౌన్: కోటీశ్వరులను ఎంచుకుని అతడు తొలుత బెదిరింపులకు పాల్పడతాడు. దారికి రాకపోతే కిడ్నాపులు చేస్తాడు. దానికీ దిగిరాకపోతే హత్యలకు సైతం తెగబడతాడు. ఐ.పోలవరం మండలానికి చెందిన త్రినాథవర్మ ఒకటిన్నర దశాబ్దాల నేర చరిత్ర ఇది. గత నెలలో రావులపాలెంలోని ఓ ఫైనా న్స్ వ్యాపారి ఇంటి వద్ద తుపాకితో కాల్పులకు తెగబడ్డ ఘటనలో ఇతడే ప్రధాన నిందితుడని పోలీసులు గుర్తించారు. రెండు రోజుల కిందట అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. పోలీసు రికార్డుల ప్రకారం ఒకటిన్నర దశాబ్దాల కాలంలో త్రినాథవర్మ రెండు హత్యలు, నాలుగు కిడ్నాపులకు పాల్పడ్డాడు. 2011 ఆగస్టు 28న అమలాపురంలో ఆక్వా రైతు కేవీ సత్యనారాయణరాజును డబ్బుల కోసం కిడ్నాప్ చేశాడు. శ్రీశైలం అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లి సత్యనారాయణరాజుకు సజీవదహనం చేశాడు. సాక్ష్యాధారాలు మా యం చేశాడు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో ధనికుడిని డబ్బుల డిమాండ్ చేశాడు. చివరకు అతడి ని కూడా కిడ్నాప్ చేసి, హతమార్చాడు. అప్పట్లో ఈ కేసు అమలాపురంలో సంచలనం రేపింది. డబ్బుల డిమాండ్ చేస్తూ బెదిరింపులు, కిడ్నాప్‌లకు సంబంధించి త్రినాథవర్మపై నాలుగు కేసులు ఉన్నాయి. డబ్బుల కోసమే రావులపాలెం కాల్పులు రావులపాలెంలో పైనాన్షియర్ గుడిమెట్ల వెంకట సత్యనారాయణరెడ్డి (కాటా బాస్) కుమారుడు ఆదిత్యరెడ్డిని కూడా బెదిరించి డబ్బులు గుంజాలనే లక్ష్యంతోనే గత నెల ఐదున త్రినాథవర్మ గ్యాంగ్ వెళ్లింది. ఆదిత్యరెడ్డి అనూహ్యంగా ఎదురు తిరగడంతో దుండగులు తుపాకి కాల్పులకు తెగబడ్డారు. ఈ తరహా నేరాలకు త్రినాథవర్మే సూత్రధారి అని, అతడి అనుచరులు పాత్రధారులని పోలీసులు చెబుతున్నారు. పోలీసు తనిఖీల్లో వర్మ రెండుసార్లు తుపాకులతో పట్టుబడ్డాడు. రావులపాలెం కాల్పుల ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ వై.మాధవరెడ్డి, రావులపాలెం ఇన్చార్జి సీఐ డి.ప్రశాంతకుమార్లు ఈ కేసులో తీగ లాగారు. దీంతో త్రినాథవర్మ నేరాల డొంక కదిలింది. అతడిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు. -
నిజాయితీకి నిలువెత్తు రూపమై.. రూ.4 లక్షల విలువైన నగను..
సాక్షి, అమలాపురం: స్థానిక భూపయ్య అగ్రహారం మహానంద అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా ఉంటున్న మల్లేశ్వరరావు దంపతులు నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచారు. తమ వద్దకు బ్యాగ్‌లో ఉన్న రూ.4 లక్షల విలువైన బంగారు నగను సంబంధిత వ్యక్తులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలివీ.. మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు కుమార్తె డాక్టర్ ఆర్.సాయిశిల్ప పట్టణంలో సాయి సంజీవిని ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. మాసిన తన వస్త్రాలను ఉతికి ఇస్త్రీ చేసేందుకు రజకులైన మల్లేశ్వరరావు దంపతులకు ఆమె ఇస్తారు. ఎప్పటిలాగే రెండు రోజుల కిందట డాక్టర్ సాయిశిల్ప మాసిన వస్త్రాలను ఓ బ్యాగ్‌లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. అప్పటికే ఆ బ్యాగ్‌తో ప్రయాణించి వచ్చిన ఆమె తనకు చెందిన రూ.4 లక్షల విలువైన బంగారు నగ ఉన్న కవర్‌ను అదే బ్యాగ్‌లో మరచిపోయారు. మాసిన వస్త్రాలను అదే బ్యాగ్‌లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. ఈలోగా బంగారు నగ కనిపించకపోవడంతో డాక్టర్ సాయిశిల్ప కుటుంబీకులు మధనపడుతున్నారు. ఇంతలో ఆ బ్యాగ్‌లో మాసిన వస్త్రాలను ఉతికేందుకు బయటకు తీసిన మల్లేశ్వరరావు దంపతులకు ఆ బంగారు నగ కనిపించింది. దీంతో ఆ బంగారు నగను ఆ దంపతులు నిజాయితీగా తీసుకువెళ్లి డాక్టర్ సాయిశిల్పకు అందజేశారు. వారి నిజాయితీకి మెచ్చిన సాయిశిల్ప తల్లిదండ్రులైన మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు, ఉషాకుమారి దంపతులు.. మల్లేశ్వరరావు దంపతులను సోమవారం సత్కరించారు. వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు. మల్లేశ్వరరావు దంపతుల నిజాయితీని భూపయ్య అగ్రహారం ప్రజలు అభినందించారు. చదవండి: (చెవిలో చెబితే.. కోరికలు తీర్చే స్వామి) -
సీసాల పడవ.. భలే ఉందిరా బుల్లోడా!
అమలాపురం రూరల్: వరద నీటిలో వెళ్లేందుకు బాధితులు తాత్కాలికంగా అరటి బొందలు, కలపతో తెప్పలు తయారు చేసుకోవడం పరిపాటి. కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామ శివారు దొమ్మేటివారిపాలెంలో వరద నీటిలో చిన్న పిల్లల కోసం వారి కుటుంబీకులు ఖాళీ డ్రింక్ బాటిల్స్‌తో చిన్న తెప్పలను తయారు చేశారు. వాటిపై పిల్లలు కూర్చుని వీధుల్లోనే తిరుగుతున్నారు. వీడని ముంపు గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో కొన్ని లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. అయితే కొన్ని గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. వివిధ పనులపై స్థానికులు పడవల పైనే రాకపోకలు సాగిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ యంత్రాంగం సహాయ చర్యలు ముమ్మరం చేసింది. ప్రజారోగ్యం, పారిశుధ్యం తదితర అంశాలపై దృష్టి సారించింది. వరదల కారణంగా పొలాలతో అన్ని ప్రాంతాలు నీట మునగిపోవడంతో పశువుల మేతకు ఇబ్బంది వచ్చింది. దీంతో రైతులు పడవలపైనే పశువుల కోసం గడ్డిని తరలిస్తున్నారు. (క్లిక్: నిర్విఘ్నంగా.. నిర్విరామంగా.. అర్ధరాత్రి నుంచే వంటావార్పు) -
నిర్విఘ్నంగా.. నిర్విరామంగా.. అర్ధరాత్రి నుంచే వంటావార్పు
సాక్షి అమలాపురం: రోజూ అర్ధరాత్రి ఒంటి గంటకే అమలాపురం తహసీల్దార్ కార్యాలయం తలుపులు తెరచుకుంటున్నాయి. ఎదురుగా ఖాళీ స్థలంలో వేసిన టెంట్లలో వంటావార్పు పనులు ఆరంభమవుతున్నాయి. వారికి రెవెన్యూ ఉద్యోగులు సహకారం అందిస్తున్నారు. రాత్రి మూడు గంటలకల్లా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అక్కడకు చేరుకుని అల్పాహారాన్ని ప్యాకింగ్ చేస్తున్నారు. 5 గంటలకు సచివాలయ మహిళా ఉద్యోగులు, వలంటీర్లు వచ్చి ప్యాకింగ్‌లో సహాయం చేస్తున్నారు. అలా మొదలవుతున్న పనులు సాయంత్రం 4గంటల వరకూ నిర్విఘ్నంగా సాగుతూనే ఉన్నాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను వంటవారు తయారు చేయడం.. వీరు ప్యాకింగ్ చేయడం.. వెంటనే సచివాలయ సిబ్బంది, వలంటీర్లు వాటిని ఆయా ప్రాంతాలకు పంపిణీ చేయడం జరుగుతోంది. ఒక్కో షిఫ్టుకు 50 నుంచి 60 మంది వరకూ వస్తున్నారు. ఉదయం అల్పాహారం అందించేందుకు తెల్లవారకుండానే వరద బాధితుల ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. వలంటీర్ల సేవలు మరువలేం.. కోనసీమ జిల్లా అమలాపురం, మామిడికుదురు, పి.గన్నవరం మండలాల పరిధిలోని వరద బాధితులకు జిల్లా యంత్రాంగం ఈ విధంగా వంటలు చేయించి ప్రతిరోజూ అందిస్తోంది. పి.గన్నవరం, మామిడికుదురు మండలాల్లో 18 వేల మందికి ఆహార ప్యాకెట్లు అందిస్తున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు ‘సాక్షి’కి తెలిపారు. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ లేదా బజ్జీ, మధ్యాహ్నం అన్నంతో పాటు పప్పు, కూరగాయలతో చేసిన మరో కూర, సాంబారు అందిస్తున్నారు. వీటిని ప్యాకింగ్ చేయడం, బాధితులకు అందజేయడంలో కీలకంగా పని చేస్తున్న సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు అటు ఉన్నతాధికారుల నుంచి, ఇటు బాధితుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ‘వంట చేయడం సులువైన పనే. కానీ వాటిని శ్రద్ధగా, పాడవకుండా ప్యాకింగ్ చేయడం ఇబ్బందికరం. వరద ముంపులో వాటిని పంపిణీ చేయడం కష్టతరం. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల సేవలను మరువలేం’ అని అమలాపురం తహసీల్దార్ శ్రీవల్లి అన్నారు. ఇదీ చదవండి: సీఎం జగన్‌కు అత్యంత ప్రీతిపాత్రులు వలంటీర్లు -
పర్ర భూములను చెరబడుతున్న ఆక్వా చెరువులు
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): వేలాది ఎకరాల పంట భూముల నుంచి ముంపు నీరు, ఇతర డ్రెయిన్ల నీరు దిగడానికి సముద్రపు మొగలు ఎంతో అవసరం. సరిగ్గా ఇక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి, అక్రమంగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడంతో మొగలు పూడుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, కోనసీమ రైతులు భారీగా నష్టపోతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్), మద్రాస్ కన్జర్వెన్స్ యాక్టులను తోసిరాజని మరీ పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నా.. వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొల్లేరు ఆపరేషన్ తరహాలో అక్రమ చెరువులను ధ్వంసం చేసి, రెగ్యులేటర్లు నిర్మిస్తేనే ఇక్కడ ముంపు సమస్యకు మోక్షం కలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు, రైతులు చెబుతున్నారు. పులికాట్, కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన మండలం వృద్ధ గౌతమి నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకూ సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయి. మధ్య డెల్టాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రామేశ్వరం, కూనవరం మొగల ద్వారా సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 45 వేల ఎకరాలు వరి ఆయకట్టు ఉంది. మిగిలింది ఆక్వా చెరువులుగా మారిపోయింది. మొత్తం 45 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు ఈ మొగల ద్వారానే దిగాల్సి ఉంది. అయితే మొగలు పూడుకుపోవడం, వీటిని తెరచినా ముంపునీరు దిగకపోవడంతో రైతులు ఏటా రూ.60 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని అంచనా. పర్ర భూముల కబ్జా మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూముల్లోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్రయానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమొగ వద్ద సముద్రంలోకి వెళ్లేది. దీనివల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపు బారిన పడినా రెండు మూడు రోజుల్లోనే నీరు తీసేది. కొన్నేళ్లుగా పర్ర భూముల్లో పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఏర్పాటయ్యాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్రయానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడటంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్ర భూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. ఆక్వా చెరువుల వల్ల ముంపునీరు పర్రభూముల ద్వారా కాకుండా మొగల ద్వారానే సముద్రంలో కలవాల్సి వస్తోంది. ఇసుక మేటలు వేయడంతో మొగల వెడల్పు కుదించుకుపోతోంది. కూనవరం స్ట్రెయిట్ కట్ ద్వారా 25 క్యూమిక్స్ (క్యూబిక్ మీటర్ పర్ సెకన్) నీరు సముద్రంలోకి దిగాల్సి ఉండగా, మొగ తెరచిన తరువాత కూడా 10 క్యూమిక్స్ కూడా దిగడం లేదు. కొల్లేరు తరహాలోనే.. పూర్వపు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులో కబ్జాలు చేసి, ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధ్వంసం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అక్కడ రూ.412 కోట్లతో మూడుచోట్ల రెగ్యులేటర్లు నియమిస్తున్నారు. ఇదేవిధంగా పర్ర భూముల్లోని ఆక్రమణలను సైతం తొలగించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మొగల పరిస్థితిపై గతంలో కూనా ఓషనోగ్రఫీ, ఉస్మానియా ఓషనోగ్రఫీ విభాగాలు సర్వేలు చేశాయి. డ్రెయిన్ నుంచి మొగ దాటుకుని సముద్రంలోకి 200 మీటర్ల మేర లాంగ్ రివిట్మెంట్లు నిర్మించాలని సూచించాయి. వీటికి ఆటోమెటిక్ రెగ్యులేటర్లు నిర్మించాలని సిఫారసు చేశాయి. డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తెరచుకునేలా.. సముద్రం పోటు సమయంలో మూసుకుపోయేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం రెగ్యులేటర్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. అనధికార చెరువులపై చర్యలు పర్ర భూముల్లో అనధికారికంగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాగే పంచనదిని ఆనుకుని కూడా చెరువులున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆర్.నాగార్జున,డీఈఈ, డ్రెయిన్ అమలాపురం మొగల స్వరూపమిదీ.. కూనవరం ప్రధాన మురుగు కాలువ ద్వారా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల్లోని ముంపునీరు దిగాల్సి ఉంది. రంగరాజు, ఓల్డ్ సమనస, అయినాపురం, గొరగనమూడి మీడియం డ్రెయిన్ల నీరు కూడా దీని ద్వారానే వస్తోంది. 1996 తుపాను సమయంలో దీనికి గండి పడింది. తరువాత ఏప్రిల్ నుంచి జూలై వరకూ పూడుకుపోయి, మిగిలిన సమయంలో అప్పుడప్పుడు కొద్దిమేర తెరచుకుంటోంది. అల్లవరం మండలం రామేశ్వరం మొగ ద్వారా వాసాలతిప్ప, పంచనది డ్రెయిన్ల నుంచి వస్తున్న ముంపునీరు దిగుతోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లోని ముంపునీరు దీని ద్వారా దిగాల్సి ఉంది. ముంపునీరు రామేశ్వరం మొగ వద్దకు వచ్చి ఇక్కడున్న పర్ర భూమిలోకి చేరుతోంది. అక్కడి నుంచి కిలోమీటరు ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. (క్లిక్: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
CM Jagan: వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి,అమరావతి: అమలాపురం వైఎస్సార్సీపీ నేత వంటెద్దు వెంకన్నాయుడు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. మంగళవారం విజయవాడ ఎ–కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో వరుడు సురేంద్ర నాయుడు, వధువు ప్రత్యూషలను సీఎం జగన్ ఆశీర్వదించారు. చదవండి: (ముస్లిం మైనారిటీలకు అండగా సీఎం వైఎస్ జగన్) -
54.69 లక్షల మందికి తొలిరోజే పింఛను
సాక్షి, అమరావతి/దేవరాపల్లి: ఎండలు మండుతున్నా అవ్వాతాతలకు చిన్న కష్టం కూడా తెలియకుండా గ్రామ, వార్డు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను డబ్బులు అందజేశారు. జూన్ నెలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 60,75, 256 మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.1,543.80 కోట్లను విడుదల చేసింది. ఒకటో తేదీనే 90.02 శాతం మందికి డబ్బుల పంపిణీ పూర్తయింది. ఆన్లైన్ బయోమెట్రిక్ విధానంలో 53,69,548 మందికి రూ.1,364.53 కోట్లు పంపిణీ చేశారు. కోనసీమ జిల్లాలో పలు మండలాల్లో ఇంటర్నెట్ వసతి లేని కారణంగా మరో లక్షమంది వరకు లబ్ధిదారుల నుంచి ఆఫ్‌లైన్ విధానంలో వేలిముద్ర లేదా సంతకం తీసుకుని పింఛన్లు పంపిణీ చేసినట్లు సెర్ప్ అధికారులు వెల్లడించారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో మొత్తం 54.69 లక్షల మందికి రూ.1,390.53 కోట్లను తొలిరోజే పంపిణీ చేసినట్లు చెప్పారు. మరో నాలుగు రోజులు వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలిపారు. పింఛన్ల పంపిణీ వివరాలను ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తారువలోని క్యాంప్ కార్యాలయంలో వెల్లడించారు. స్వయంగా పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్ సాక్షి, అమలాపురం: కోనసీమ జిల్లా అమలాపురంలో విధ్వంసం జరిగిన నేపథ్యంలో గత నెల 24వ తేదీ నుంచి ఇంటర్నెట్ సేవల్ని నిలిపేశారు. కొన్ని మండలాల్లో మాత్రం ఈ సేవల్ని పునరుద్ధరించారు. ఇంటర్నెట్ సదుపాయం నిలిపేసిన మండలాల్లో పెన్షన్‌దారులకు, రేషన్‌దారులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెన్షన్‌కు, రేషన్‌కు బయోమెట్రిక్ అవసరం లేకుండా లబ్ధిదారుల సంతకాలు, వేలిముద్రలు తీసుకుని పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా స్వయంగా వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. రేషన్‌ను అందజేశారు. -
అజ్ఞాత వాసం.. టీడీపీ, జనసేన నేతల గుండెల్లో గుబులు
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో ఈ నెల 24న విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోపక్క పోలీసులు ఆధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో సీసీ కెమెరా ఫుటేజ్‌లు, కాల్ డేటాలతో ఆందోళనకారులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేశారు. 46 మందిపై కేసులు నమోదు చేశారు. మరో 23 మందిని అదుపులోకి తీసుకుని, కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. పోలీసులు దాదాపు 150 మందిని అనుమానితులుగా గుర్తించడంతో ఆందోళనకారుల్లో వణుకు పుడుతోంది. చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు పోలీసుల కంట పడకుండా అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. కొందరు సొంత ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసేస్తే.. మరికొందరు ఫోన్ కాల్స్ వస్తున్నా లిఫ్ట్ చేయకుండా మిన్నకుండిపోతున్నారు. మరికొందరు హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లి తలదాచుకున్నట్లు తెలిసింది. విధ్వంస కాండకు పాల్పడిన వారిలో అధిక శాతం టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన క్రియాశీలక కార్యకర్తలే ఉన్నారు. కేసులు నమోదైన ముగ్గురు బీజేపీ నాయకులు, ఇద్దరు టీడీపీ, ఆరుగురు జనసేన కార్యకర్తలు అజ్జాతంలోకి వెళ్లిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆందోళనకారుల ఫోన్ నంబర్ల కాల్ డేటా, ఫోన్లు ఏ టవర్ పరిధిలో ఉన్నాయో పోలీసులు ఆధునిక టెక్నాలజీతో పసిగడుతున్నారు. ఆ రెండు పార్టీ నేతల్లో గుబులు విధ్వంసకర ఘటనల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఉన్నారు. దీంతో ఆయా పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోలీసు విచారణలో తమ పేర్లు ఎక్కడ బయట పడతాయోనని పలువురు గుబులు చెందుతున్నారు. తమ ఫోన్లు ట్రాప్ చేస్తున్నారేమోనన్న అనుమానంతో ఆ పార్టీల నేతలు సొంత ఫోన్లకు బదులు కొత్త ఫోన్లు, నంబర్ల నుంచి మాట్లాడుతున్నారు. ఇంకా నిఘా నీడలోనే.. విధ్వసంకర ఘటనలతో అట్టుడికిన అమలాపురం పూర్తిగా కుదుటపడింది. జిల్లా వ్యాప్తంగా పోలీసు నిఘా మాత్రం కొనసాగుతోంది. దాదాపు వెయ్యి మంది పోలీసులు ముఖ్య కూడళ్ల వద్ద పహారా కాస్తున్నారు. రోడ్లపై వాహనాల విస్తృత తనిఖీలకు పోలీసులు శనివారం నుంచి తెర వేశారు. ఆందోళనకారులను దీటుగా కట్టడి చేసేందుకు తగిన బందోబస్తుతో పోలీసు శాఖ సంసిద్ధమై ఉంది. -
అమలాపురం విధ్వంసం కేసులో మరో 25 మంది అరెస్ట్
అమలాపురం టౌన్: అమలాపురంలో ఈ నెల 24న జరిగిన విధ్వంసకర ఘటనల్లో మరో 25 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జి.పాలరాజు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసుల్లో 19 మంది అరెస్ట్ చేశామని, తాజా అరెస్టులతో ఆ సంఖ్య మొత్తం 44కు చేరిందని చెప్పారు. ఆదివారం మరికొందరిని అరెస్ట్ చేస్తామన్నారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో కోనసీమ, కాకినాడ జిల్లాల ఎస్పీలు కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఏఎస్పీలు లతామాధురి, చక్రవర్తితో కలసి డీఐజీ పాలరాజు శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. శనివారం అరెస్ట్ చేసిన నిందితుల్లో అమలాపురం పట్టణం, అంబాజీపేట, అల్లవరం, అయినవిల్లి మండలాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్ల దహనం, బస్సులు, పోలీసు వజ్ర వాహనం ధ్వంసం కేసుల్లో వీరంతా నిందితులని పేర్కొన్నారు. 20 వాట్సాప్ గ్రూపుల స్క్రీన్ షాట్స్, గూగుల్ ట్రాక్స్, టవర్ లోకేషన్లు, సీసీ ఫుటేజీలు ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా బయలుదేరాలి వంటి సూచనలు వాట్సాప్ గ్రూపుల్లో వెళ్లాయని తెలిపారు. మరో వారంపాటు 144 సెక్షన్ కోనసీమలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధించిన సెక్షన్ 144ను మరో వారం రోజులపాటు పొడిగిస్తున్నట్లు డీఐజీ చెప్పారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేత కూడా మరో 24 గంటలపాటు కొనసాగుతుందన్నారు. సోమవారం నుంచి ఇంటర్నెట్ను పునరుద్ధరించే అవకాశాలున్నాయని తెలిపారు. నష్టాలు నిందితుల నుంచే రికవరీ ఆందోళనకారులు ఆ రోజు ప్రభుత్వ,ప్రైవేటు ఆస్తులను ధ్వసం చేసి అపార నష్టాన్ని కలిగించారని డీఐజీ పాలరాజు తెలిపారు. వీరిపై ప్రివెన్షన్ ఆప్ డ్యామేజ్ పబ్లిక్ ప్రాపర్టీ (పీడీపీపీ) యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల నష్టాలను నిందితుల వ్యక్తిగత ఆస్తుల నుంచి రికవరీ చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారుల ద్వారా నిందితుల వ్యక్తిగత ఆస్తులను విలువ గట్టి వాటిని సీజ్ చేశామని చెప్పారు. ఆస్తులు ధ్వంసం చేసిన దృశ్యాలను, వాట్సాప్ గ్రూపుల్లో విధ్వంసానికి వ్యూహరచనతో మెసేజ్‌లను డీఐజీ పాలరాజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విలేకరులకు చూపించారు. -
అమలాపురం అల్లర్ల కేసు: మరో 25 మంది అరెస్ట్
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో అల్లర్లకు పాల్పడిన మరో 25 మందిని అరెస్ట్ చేసినట్లు డీఐజీ పాలరాజు వెల్లడించారు. 20 వాట్సాప్ గ్రూప్‌లను పరిశీలిస్తున్నామని, 350కి పైగా సీసీ ఫుటేజ్‌లను విశ్లేషిస్తున్నామని డీఐజీ తెలిపారు. మరిన్ని అరెస్టులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు అమలాపురంలో అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సాగిన విధ్వంసకాండ కుట్ర వెనుక సూత్రధారులు, దాడుల్లో పాత్రధారులను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వీడియో క్లిప్పింగులు, సోషల్ మీడియా పోస్టులు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా 70 మందికిపైగా నిందితులను గుర్తించారు. -
కోనసీమ ఘటన.. ఆర్.నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కోనసీమకు అంబేడ్కర్ జిల్లా పేరు పెట్టడం శుభ పరిణామం అని నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. అమలాపురం ఘటనపై ఆయన స్పందిస్తూ.. దాడులు దారుణమని, నాయకుల ఇళ్లు తగులబెట్టడం సమంజసం కాదన్నారు. అంబేడ్కర్ పేరు జిల్లాకే కాదు.. దేశానికే పెట్టాలన్నారు. దేశానికి అంబేడ్కర్ ఇండియాగా పేరు మార్చాలన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ మాట తప్పారన్నారు. చదవండి: ‘కోన’లో కుట్ర కోణం! -
అమలాపురం ఘటన: పోలీస్ వాహనాలపై రాళ్లు.. 46 మందిపై కేసు..
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో 46 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 307,143,144,147,148,151,152, 332, 336,427,188, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సామర్లకోటకు చెందిన హోంగార్డ్ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు. చదవండి: ‘కోన’లో కుట్ర కోణం! వడగాన నాగబాబు, నూకల పండు, కురసాల నాయుడు, దున్నాల దిలీప్, అడపా శివ, చిక్కాల మధుబాబు, దువ్వా నరేష్, లింగోలు సతీష్, నల్ల నాయుడు, నక్కా హరి, కిశోర్, అడపా సత్తిబాబు, నల్ల రాంబాబు, యాళ్ల రాధ, గాలిదేవర నరసింహమూర్తి, సంసాని రమేష్, కడాలి విజయ్, తోట గణేష్, అన్యం సాయి, దూలం సునీల్, కల్వకొలను సతీష్, కానిపూడి రమేష్, ఈదరపల్లి జంబు, చింతపల్లి చిన్నా, పోలిశెట్టి కిషోర్, నల్లా కరుణ, పాటి శ్రీను, చిక్కం బాలాజీ, పెద్దిరెడ్డి రాజా, మద్దిశెట్టి ప్రసాద్, వినయ్, శివ, సాధనాల మురళీ, నల్లా అజయ్, వాకపల్లి మణికంఠ, కాసిన ఫణీంద్ర, కొండేటి ఈశ్వర్రావు, అరిగెల తేజ, అరిగెల వెంకటరామారావు, రాయుడు స్వామిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరి కొందరి కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. బస్సును దగ్ధం చేసిన కేసులో.. ఎర్ర వంతెన వద్ద బస్సును దగ్ధం చేసిన కేసులో 46 మందిపై మరో ఎఫ్ఐఆర్ అమలాపురం పీఎస్‌లో నమోదు చేశారు. 341,143, 144,147,148,151,336,435,188,149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ గిరిబాబు ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
‘కోన’లో కుట్ర కోణం!
సాక్షి, అమరావతి: కోనసీమలో విధ్వంసం వెనుక కుట్ర కోణం బట్టబయలవుతోంది. అమలాపురంలో ర్యాలీని అసాంఘిక శక్తులు హైజాక్ చేసి అల్లర్లకు పాల్పడటం వెనుక కొన్ని రాజకీయ శక్తుల ముందస్తు కుట్ర దాగి ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. కోనసీమ పరిరక్షణ సమితి ముసుగులో టీడీపీ, జనసేన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలే ఈ కుట్రలో పాలు పంచుకున్నారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవలే డిమాండ్ చేయగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పార్టీ నేతలతో ఈమేరకు ఏకంగా దీక్షలు కూడా చేయించారు.మరోవైపు ఇందుకు విరుద్ధంగా అమలాపురంలో అల్లర్లకు పాల్పడేలా టీడీపీ, జనసేన శ్రేణులను ఆ పార్టీల అధినేతలు ఉసిగొల్పడంపై సామాజికవేత్తలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫుటేజీలు, క్లిప్పింగుల పరిశీలన అమలాపురంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసు శాఖ ఈ విధ్వంసం వెనుక కుట్ర కోణంపై దర్యాప్తును ముమ్మరం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం 46మందిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీలు, వీడియో క్లిప్పింగుల ఆధారంగా విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించే ప్రక్రియ చేపట్టారు. దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొని విధ్వంసం సృష్టించిన 72 మందిని ఇప్పటివరకు గుర్తించారు. వారిలో 12 మందిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. కోనసీమతోపాటు పొరుగు జిల్లాల్లో రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో విస్మయకర అంశాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది. అసాంఘిక శక్తులు పక్కా పన్నాగంతోనే కుట్రను అమలు చేశాయి. ఎర్రవంతెన వద్ద బస్సులు దగ్ధమైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అడిషనల్ డీజీపీ శంకర్ భక్షీ, ఇతర పోలీసు అధికారులు టీడీపీ, జనసేన నేతల పనే! ► అమలాపురంలో విధ్వంసం వెనుక టీడీపీ, జనసేన నేతల ప్రమేయం ఉందని పోలీసుల దర్యాప్తుల్లో ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. హింసకు పాల్పడి తిరిగి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేలా రెండు పార్టీలకు చెందిన నేతలు పథకం రచించారు. ► విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించిన 72 మందిలో ఇప్పటివరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 9 మంది జనసేన, ఇద్దరు టీడీపీకి చెందిన వారున్నారు. ఒకరు మాత్రం ఏ పార్టీతోనూ సంబంధంలేని యువకుడని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ► హింసకు పాల్పడినట్లు గుర్తించిన వారిలో 60 మంది పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. జనసేన, టీడీపీతో అనుబంధం ఉన్నవారే వీరిలో ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ► ఇటీవల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు వ్యతిరేకంగా ఆందోళనలకు నేతృత్వం వహించిన ఓ నేత అమలాపురం అల్లర్ల వెనుక కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తనను తాను తటస్థుడినని చెప్పుకునే ఆయన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్నది బహిరంగ రహస్యమే. ర్యాలీకి జనసమీకరణ, అవసరమైన సామగ్రి సమకూర్చడం, ర్యాలీలో ఎవరు ముందుండాలి? ఎప్పుడు, ఏ దిశగా తీసుకువెళ్లాలి? అనే అంశాలను మరికొందరితో కలసి నిర్దేశించినట్లు తెలుస్తోంది. దాడుల్లో పాల్గొన్న కొందరిని పోలీసులు విచారించగా ఆ నేత పేరు వెల్లడించినట్లు సమాచారం. ► అక్కడకు అత్యంత సమీపంలో ఉన్న ఉన్న మాజీ హోంమంత్రి, పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నివాసాల వైపు రౌడీమూకలు కన్నెత్తి కూడా చూడలేదు. ► అల్లర్ల వెనుక ప్రతిపక్ష పార్టీలు పక్కా ప్రణాళికతో వ్యవహరించాయన్నది స్పష్టమవుతోంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న జనసేన కార్యకర్త అన్యం సాయి తీరే దీనికి నిదర్శనం. కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడానికి వ్యతిరేకంగా మూడు రోజుల క్రితం జరిగిన కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా అతడు ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీ నేతలతో కలసి ఫొటోలు దిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. వైఎస్సార్సీపీతో అతడికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు స్పష్టమైంది. వాస్తవానికి అన్యం సాయి జనసేనలో క్రియాశీల కార్యకర్త. పవన్ కల్యాణ్ పర్యటనలో సైతం పాల్గొన్నాడు. పవన్ కల్యాణ్‌తోపాటు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌తో జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ► కుట్రలో పాత్రధారులే కాకుండా తెరవెనుక సూత్రధారులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. వీరిలో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు డిలీట్ చేసినట్లు గుర్తించారు. మొబైల్ టెక్నాలజీ సహకారంతో వాటిని వెలికి తీయనున్నారు. కీలక అనుమానితుల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. కనుసైగతో విధ్వంసం అసాంఘిక శక్తులు కొద్ది రోజులుగా కుట్రకు పదును పెట్టాయి. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కోనసీమ పరిరక్షణ సమితి భారీగా యువతను తరలించింది. ర్యాలీలో చొరబడ్డ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల సమయంలో కుట్రను అమలు చేశాయి. పెద్ద సంఖ్యలో రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు పెట్రోల్ బాటిళ్లు, డబ్బాలు, రాళ్లు, సోడాబుడ్లతో అమలాపురం వీధుల్లో, సందుల్లో మాటేశాయి. ర్యాలీలో ముందు భాగంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నేతలు సైగ చేయగానే ఒక్కసారిగా చొరబడి బీభత్సం సృష్టించాయి. నినాదాలు చేస్తూ ప్రణాళిక ప్రకారం యువకులను దారి మళ్లించాయి. ఏమాత్రం జాప్యం జరిగినా.. బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులు ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఈ ర్యాలీని వేదికగా మార్చుకున్నాయి. దళిత, బీసీ వర్గాలకు చెందిన మంత్రి పినిపె విశ్వరూప్, వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ను అసాంఘిక శక్తులు లక్ష్యంగా చేసుకుని ర్యాలీని వారి నివాసాల వైపు మళ్లించాయి. అందుకు రెండు రోజులుగా పక్కా పన్నాగం పన్నినట్టు పోలీసులు గుర్తించారు. ర్యాలీలో చొరబడ్డ రౌడీషీటర్లు అమలాపురంలోని ఎర్రవంతెన వైపు యువకులను పరుగులు తీయించారు. మార్గమధ్యంలో మూడు బస్సులను దగ్ధం చేసి రౌడీమూకలు అటు చేరుకున్నాయి. పెట్రోల్ బాటిళ్లు ఇంట్లోకి విసిరి నిప్పు పెట్టాయి. అనంతరం మంత్రి విశ్వరూప్ కొత్తగా నిర్మిస్తున్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని అటువైపు కదిలాయి. ఆ ఇంటికి కూడా నిప్పంటించి విధ్వంసానికి పాల్పడ్డాయి. కుట్రలో తరువాత ఘట్టంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపైకి దండెత్తాయి. ఎమ్మెల్యే సతీష్ కుటుంబ సభ్యులతో సహా మొదటి అంతస్తులోగా ఉండగా గ్రౌండ్ ఫ్లో్లర్లోని ఆయన కార్యాలయాన్ని తగలబెట్టారు. రెండో అంతస్తుకు కూడా మంటలు వ్యాపించేసరికి పోలీసులు అతికష్టం మీద ఎమ్మెల్యే సతీష్, ఆయన కుటుంబ సభ్యులను అక్కడి నుంచి తరలించారు. కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే సతీష్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకునే దాడికి దిగారు. పోలీసులు తక్షణం అప్రమత్తం కాకుంటే ఘోరం జరిగిపోయేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడం గమనార్హం. ఎమ్మెల్యేను అంతమొందించే లక్ష్యంతోనే పెట్రోల్ బాటిళ్లు విసిరేశారని దర్యాప్తులో గుర్తించినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా మహనీయుడి పేరు ► రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును దేశవ్యాప్తంగా> ఎన్నో ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు, విమానాశ్రయాలు, జిల్లాలకు పెట్టారని సామాజికవేత్తలు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ జిల్లాలో ఓ డివిజన్‌ను విభజించి 1995 సెప్టెంబరు 29న అంబేడ్కర్‌నగర్ జిల్లాగా పేరు పెడితే ఆ ప్రాంత ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ► జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సమయంలో స్థానికులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన మేరకు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడుతూ ఈనెల 18న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే అన్ని వర్గాల ఏకాభిప్రాయంతోనే కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టినట్లు స్పష్టమవుతోంది. దిగజారుడుకు పరాకాష్ట.. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆపార్టీ శ్రేణులతో దీక్షలు చేయించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సైతం ఇటీవల కాకినాడ జిల్లా తాళ్లరేవు పర్యటన సందర్భంగా కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వారిద్దరూ రెండు నాలుకల ధోరణితో వ్యవహరించడం దిగజారుడుకు పరాకాష్టగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అన్ని వర్గాలు అభిమానించే అంబేడ్కర్‌ను ఓ కులానికి పరిమితం చేసే కుట్రకు టీడీపీ, జనసేనలు పాల్పడ్డాయని మండిపడుతున్నారు. మంగళవారం మంటల్లో కాలిపోతున్న బస్సు ప్రజాస్వామ్యం అపహాస్యం.. ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షాలకు అంతే బాధ్యత ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీల డిమాండ్ల మేరకే కోనసీమకు అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పెట్టింది. దీనిపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆయా వర్గాలకు చెందిన నేతలు అంబేడ్కర్ గొప్పతనాన్ని వివరించి చైతన్యం చేయాలన్సిన బాధ్యత ఉంటుంది. ప్రతిపక్ష టీడీపీ, జనసేన మాత్రం తమ శ్రేణులను పురిగొల్పి విధ్వంసం సృష్టించి హింసకు పాల్పడటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. -
పవన్ కల్యాణ్ తీరుని ఎండగట్టిన అంబటి.. ‘ప్రొసీజర్ తెలియకుండా ఏంటిది?’
సాక్షి, తాడేపల్లి: అమలాపురం అల్లర్ల ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరు దారుణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కల్యాణ్ పార్టీకి చెందిన వారు ఎందుకు నిరాహార దీక్షలు చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రజల నుంచి డిమాండ్ వచ్చినపుడు పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అంబటి స్పష్టం చేశారు. మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. చదవండి👉 పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు? ‘మీ డిమాండ్, ప్రజల డిమాండ్‌నీ ప్రభుత్వం అంగీకరించింది కదా. మేమే మా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను దగ్దం చేసుకున్నామా? ఎక్కడా పవన్ ఇవాళ ఇది దురదృష్టకరం, ఖండిస్తున్నాం అన్న మాట అనలేదు. శ్రీలంక అవుతుంది అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పుడు శ్రీలంకలా చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. చివరికి మంటలను ఆర్పడానికి ఫైర్ ఇంజన్ రాకుండా అడ్డుకున్నారు. మంత్రి ఇంటిని తగలబెట్టి శ్రీలంకలా రాష్ట్రం మారింది అని చూపించాలి అనుకుంటున్నారు. అభ్యంతరాలు చెప్పడానికి 30 రోజులు ఎందుకు అంటాడు పవన్.. అది ప్రొసీజర్. తుని సంఘటనను దీనికి ముడి పెడుతున్నారు. ఆరోజు కడప వాళ్లు అన్నారు. చంద్రబాబు మాటలే ఈయన నోటి నుంచి వస్తున్నాయి. మా విశ్వరూప్ ఇల్లు, మా సతీష్ ఇల్లు మేము తగలేసుకున్నామా? డైవర్షన్ అనడానికి పవన్ కల్యాణ్‌కు అసలు అవగాహన ఉందా? అసలు జరిగిన దాడులను ఖండించకుండా ఏదేదో ఎందుకు మాట్లాడతాడు. కోనసీమలో జరిగిన సంఘటనలో కఠినంగా వ్యవహరించాలి. ఉక్కుపాదంతో అణచివేయాలి... అలా పవన్ ఎందుకు డిమాండ్ చేయడు?’ అని పవన్ తీరుని మంత్రి అంబటి రాంబాబు ఎండగట్టారు. చదవండి👇 చంద్రబాబు స్క్రిప్టు పవన్ చదువుతున్నాడు: మంత్రి రోజా అమలాపురం అల్లర్లపై స్పీకర్ సీరియస్.. అప్పుడుంటది బాదుడే బాదుడు! -
అమలాపురం అల్లర్ల ఘటన: ‘ఆ రెండు పార్టీలు ఎందుకు ఖండించడం లేదు’
సాక్షి, తిరుపతి: అమలాపురం అల్లర్ల ఘటనను తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన దురదృష్టకరమని.. దానిని అందరూ ముఖ్త కంఠంతో ఖండించాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ఘటనను ఎందుకు ఖండించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. కుట్ర పూరిత రాజకీయాలు మానండని ప్రతి పక్షాలకు ఆయన హితవు పలికారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని కుట్రలో భాగంగా ఇలా చేశారని ఎంపీ ఆరోపించారు. రాజకీయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక కులాల మధ్య ఇలాంటి చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి, ప్రతి పక్ష పార్టీల నుంచి, సామజిక సేవా సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లాల పేర్లను ప్రకటించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్వార్ధ రాజకీయాల కోసం యువతను పెడతోవ పట్టించవద్దని ఎంపీ గురుమూర్తి కోరారు. -
అమలాపురం అల్లర్ల ఘటన: పోలీసుల అదుపులో అనుమానితుడు అన్యం సాయి
-
పోలీసుల అదుపులో కోనసీమ అల్లర్ల కేసు అనుమానితుడు?
సాక్షి,అమలాపురం: అమలాపురం అల్లర్ల కేసులో అనుమానితుడు అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20న కలెక్టరేట్ వద్ద.. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టొంద్దంటూ అన్యం సాయి ఒంటిపై పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేశాడు. జనసేన కార్యక్రమాల్లో అనుమానితుడు సాయి చురుగ్గా పాల్గొన్నట్టు తెలుస్తోంది. పవన్, నాగబాబు, జనసేన నాయకులతో అతను దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోనసీమ అల్లర్ల కేసులో సాయి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతనిపై గతంలో రౌడీషీట్ నమోదై ఉందని పోలీసులు తెలిపారు. (చదవండి: అమలాపురం ఘటన వెనుక కుట్ర.. వదిలేదే లేదు: మంత్రి బొత్స) -
అమలాపురంలో పరిస్థితి పూర్తి అదుపులో ఉంది: హోంమంత్రి తానేటి వనిత
-
ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై దాడి.. ఇల్లు తగలబెట్టిన దుండగులు
-
అమలాపురానికి అదనపు బలగాలు
-
అమలాపురానికి అదనపు బలగాలు.. నిలిచిపోయిన బస్సులు
సాక్షి, కోనసీమ జిల్లా: అమలాపురంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదనపు బలగాలను పోలీసులు మోహరించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి ప్రత్యేక దళాలను అధికారులు తరలించారు. అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. కాకినాడ, రాజమండ్రి నుంచి కోనసీమ బస్సు సర్వీసులను రద్దు చేశారు. అమలాపురంలో పరిస్థితి అదుపులోకి తెచ్చామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. డీఐజీ, ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. ఆందోళనలపై విచారణ చేపడతామని డీజీపీ పేర్కొన్నారు. చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'! ‘సాక్షి’తో ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు మాట్లాడుతూ, అమలాపురంలో ఆందోళనల్లో పాల్గొని విధ్వంసం సృష్టించిన వారిని గుర్తిస్తున్నామని, ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలగకూడదని అమలాపురంలో కర్ఫ్యూ విధించడం లేదన్నారు. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. ఇది కొన్ని కులాలు, వర్గాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావటంతో పోలీసులు పూర్తిస్థాయిలో సంయమనం పాటించగా... దాన్ని అలుసుగా తీసుకున్న ఆ వర్గాలు విచ్చలవిడిగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తుల్ని ధ్వంసం చేశాయి. -
మంత్రి విశ్వరూప్ క్యాంపు కార్యాలయంపై ఆందోళనకారుల దాడి
-
తాళ్లరేవులో కొవ్వొత్తుల ర్యాలీ
తాళ్లరేవు: కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ ఇళ్లకు నిప్పుపెట్టడాన్ని నిరసిస్తూ తాళ్లరేవులో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి దళిత, ప్రజాసంఘాల నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దళిత నాయకులు కాశి లక్ష్మణస్వామి, జక్కల ప్రసాద్, రెడ్డి బాబు మాట్లాడుతూ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను కొనసాగించాలని కోరారు. అరాచక శక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షుడు వడ్డి ఏడుకొండలు, ప్రజాసంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, కె.ఈశ్వరీబాయి పాల్గొన్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి అమానుషం అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు పొన్నాడ వెంకటసతీష్‌కుమార్ ఇళ్లపై దాడిచేసి తగులబెట్టడం అమానుషమని తాళ్లరేవు ఎంపీపీ రాయుడు సునీత పేర్కొన్నారు. శాంతియుత మార్గంలో నిరసన తెలియజేయాలి తప్ప ఇటువంటి ఘటనలకు పాల్పడడం దురదృష్టకరమని చెప్పారు. -
జైలులో కుదిరిన స్నేహం.. బయటకు వచ్చాక ఇలా చేశారు.. అలా పట్టుబట్టారు..
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): ఆ ముగ్గురూ పలు చోరీ కేసుల్లో నిందితులు. జైలులో శిక్ష అనుభవించిన సమయంలో వారి మధ్య స్నేహం కుదిరింది. చోరీల ద్వారా కాజేసిన బంగారు నగలు, వెండి వస్తువులతో ఎప్పటికైనా కర్ణాటక రాష్ట్రంలో ఓ జ్యూయలరీ షాపు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నదే తడవుగా జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత వరుస చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 25 చోరీల్లో దోచుకున్న సొత్తుతో కారులో కర్ణాటకకు బయలుదేరారు. చదవండి: పరువు తీస్తానని భార్య బెదిరింపు.. భర్త ఆత్మహత్య ఈ క్రమంలో రామచంద్రపురం డివిజన్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.కోటి సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. అమలాపురంలోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ కేఎఎస్ఎస్వీ సుబ్బారెడ్డి, రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, మండపేట సీఐ పి.శివగణేష్ ఈ దొంగల ముఠా చోరీల చిట్టాను వివరించారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును విలేకర్లకు చూపించారు. వీరు దోచుకున్న బంగారు నగలు, వెండి వస్తువులు, బంగారం కరిగించే పరికరాలు జ్యూయలరీ షాపును తలపించింది. ఇదీ చోరీల నేపథ్యం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెద్ద అమిరం గ్రామానికి చెందిన తోటకూర రామకృష్ణంరాజు, నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరానికి చెందిన సద్దుల కుమార్‌రాజాలు 2016లో పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి పోలీసు స్టేషన్ పరిధిలో పలు చోరీ కేసులలో పోలీసులకు పట్టుబడ్డారు. పది నెలల జైలు శిక్ష అనుభవించి, బయటకు వచ్చాక వారికి నర్సాపురంలో బంగారం కరిగించే వ్యక్తి.. కర్నాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన విజయ్ తవారు పవార్‌తో పరిచయం ఏర్పడింది. దొంగ సొత్తును కొనుగోలు చేసే రిసీవర్‌గా పవార్‌తో వారి అనుబంధం పెరిగింది. 2018లో ఈ ముగ్గురూ రాజోలు పోలీసు స్టేషన్లో పరిధిలో పలు చోరీల్లో అరెస్టయ్యారు. ఆ సందర్భంగా వారికి జైలుశిక్ష పడింది. దీంతో వారి స్నేహం మరింత బలపడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ముగ్గురూ కలిసి చోరీలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో రామచంద్రపురం, అమలాపురం పోలీసు డివిజన్ల పరిధిలో 25 చోరీలు చేసి రూ.కోటి విలువైన సొత్తు కూడగట్టారు. ఇలా పట్టుబడ్డారు చోరీల్లో దోచుకున్న 1,360 గ్రాముల బంగారు నగలు, 30 కిలోల వెండి వస్తువులు, రూ.40 వేలు నగదు, బంగారం కరిగించే పరికరాలు, కట్టర్లు, రాడ్లు తదితర సామగ్రితో ఓ కారులో సోమవారం ఉదయం కర్ణాటక రాష్ట్రానికి ఆ ముగ్గురూ బయలుదేరారు. అక్కడ జ్యూయలరీ షాపు పెట్టాలన్నది వారి లక్ష్యం. వారి కారు అంగర పోలీసు స్టేషన్ పరిధిలోని టేకి గ్రామ శివారుకు వచ్చేసరికి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వీరి కారుపై అనుమానం వచ్చి ఆరా తీశారు. మండపేట సీఐ శివగణేష్, అంగర, ఆలమూరు ఎస్సైలు బి.సంపత్‌కుమార్, ఎన్.శివప్రాద్లు ఆ కారు నంబరును ఆన్లైన్లో తనిఖీ చేసి, తప్పుడు నంబరుగా గుర్తించారు. దీంతో కారును, కారులోని సొత్తును, ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకుని లోతుగా విచారించడంతో వారు ఐదేళ్ల నుంచి చేస్తున్న చోరీల చిట్టా వెలుగు చూసింది. ఈ ముఠా ఆలమూరు పోలీసు స్టేషన్ పరిధిలో 6, మండపేట రూరల్‌లో 2, అంగర పరిధిలో 3, రాయవరం పరిధిలో 1, మండపేట పట్టణ పరిధిలో 1, ద్రాక్షారామ పరిధిలో 1, పామర్రు పరిధిలో 2, రామచంద్రపురం పరిధిలో 1, అల్లవరం పరిధిలో 2, పి.గన్నవరం పరిధిలో 4, కడియం పరిధిలో 1, భీమవరం పరిధిలో 1 చొప్పున చోరీలు చేసినట్టు గుర్తించారు. వారిని సోమవారం అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. -
కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులకి అస్వస్థత
అమలాపురం రూరల్: కోనసీమ జిల్లా అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలల్లో వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న డెంటల్, నర్సింగ్ కాలేజీల్లో చదువుతోన్న విద్యార్థినులు బుధవారం వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కళాశాలల్లో గ్రాండ్ 9 అనే అవుట్ సోర్స్ ఏజెన్సీ ఇక్కడ మెస్ నిర్వహిస్తోంది. బుధవారం మధ్యాహ్నం విద్యార్థులు మెస్‌లో భోజనం చేశాక అస్వస్థతకు గురయ్యారు. 30 మంది బుధవారం రాత్రి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కోలుకున్న కొందరిని నుంచి డిశ్చార్జి చేయడంతో తిరిగి హాస్టల్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం 15 మంది చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఆర్డీవో విచారణ చేపట్టారు. కలుషిత ఆహారం వల్లే అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. విద్యార్థులందరూ కోలుకుంటున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సుబ్బారావు తెలిపారు. -
ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా: పినిపే విశ్వరూప్
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా): ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో మళ్లీ చోటు దక్కడంతో ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ తన రాజకీయ ప్రయాణంలో నాలుగోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సచివాలయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సాయంత్రానికి అమలాపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్‌తో ‘సాక్షి’ ముచ్చటించింది. ప్రశ్న: ఆర్టీసీ నష్టాల్లో ఉంది. డీజిల్ ధర పెరిగి సంస్థకు భారమవుతున్న తరుణంలో మీ ప్రణాళికలు ఏంటి? మంత్రి: డీజిల్ ధరల పెరుగుదలే ఆర్టీసీకి పెనుభారం. ఉన్నతాధికారులతో సమీక్షించి సంస్థను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రశ్న: ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి సంస్థకు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. తదుపరి మీ చర్యలు ఎలా ఉంటాయి? జవాబు: ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం చరిత్రాత్మకం. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్టీసీని మరింత సంరక్షిస్తాను. ప్రశ్న: శాఖాపరంగా కొత్త నిర్ణయాలుంటాయా? జవాబు: వాహన కాలుష్య నివారణపై ప్రత్యేక దృష్టి పెడతాం. దశల వారీగా విద్యుత్ బస్సులను ప్రవేశపెడతాం. టీటీడీ బస్సుల నుంచే ఈ విధానానికి శ్రీకారం చుడతాం. కొండ పైన, కిందన 50 చొప్పున వంద బస్సులను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. మే 15వ తేదీ నుంచి స్వామివారి సన్నిధి నుంచే తొలి బస్సును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. ప్రశ్న: విద్యుత్ బస్సుల ప్రయోగాన్ని ఎలా కొనసాగిస్తారు? జవాబు: తిరుపతిలో విజయవంతమైతే వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా రాష్ట్రంలో దశల వారీగా ఎంపిక చేసిన నగరాల్లో, ఆ తర్వాత పట్టణాల్లో ఈ బస్సులను ప్రారంభిస్తాం. ప్రశ్న: రవాణా రంగంలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలేమిటి? జవాబు: ఆర్టీఏ లేదా అధికారిక కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ– బ్రేక్ ఇన్స్పెక్టర్లు) పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. త్వరలోనే 90 పోస్టులను భర్తీ చేస్తాం. ప్రశ్న: ప్రైవేటు రంగ రవాణా, హైటెక్ బస్సులకు అనుమతులు తదితర విషయాల్లో అక్రమాల నివారణకు చర్యలేమిటి? జవాబు: ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుపై తొలుత ప్రత్యేక దృష్టి పెడతాను. బస్సులకు నిర్ణీత కాలంలో అనుమతులు (పర్మిట్లు) తీసుకోకుండా ఒకే నంబరుతో నాలుగైదు రిజిస్ట్రేషన్లు చేయించి, హైటెక్ బస్సులను అక్రమంగా నడపడానికి అడ్డుకట్ట వేస్తాను. ప్రశ్న: ఆటో, చిన్న రవాణా వాహనాలతో జీవనోపాధి పొందే చిన్న కుటుంబాల వారి విషయంలో? జవాబు: ప్యాసింజర్ ఆటోలు, గూడ్స్ ఆటోల వంటి వాహనాలు రవాణా రంగంపై ఆధారపడి వేలాది వాహనదారులు, కారి్మకులు జీవనోపాధి పొందుతున్నారు. వీరికి పోలీసులు లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వేధింపులు లేకుండా సాధ్యమైనంత వరకూ మానవతా దృక్పథంతో చూసేలా అధికారులతో సమీక్షించి ఆదేశాలిస్తాను. ప్రశ్న: వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో రెండోసారి మంత్రి అయ్యారు. మీ స్పందన? జవాబు: చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్ నాపై ఉంచిన బాధ్యతలను అప్పుడు ప్రతిపక్షంలో.. ఇప్పుడు ప్రభుత్వంలో నెరవేర్చాను. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో నాకు మంత్రి పదవి ఇచ్చారు. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూనే విధేయుడిగా ఉంటాను. -
కాలిఫోర్నియా టు అనాతవరం.. సొంతూరిలో సాఫ్ట్వేర్ కంపెనీ
సాక్షి, అమలాపురం టౌన్(తూ.గో): ఆయనో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఉపాధ్యాయుడిగా 1999లో రాష్ట్రపతి అవార్డు పొందారు. ఉద్యోగ జీవితంలో వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేసిన ఆదర్శ ఉపాధ్యాయుడు. పేరు ఓరుగంటి శ్రీరామ్మూర్తి. ఊరు ముమ్మిడివరం మండలం అనాతవరం. ఆయన కుమారుడి పేరు రమేష్. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన ఆయన.. కాలిఫోర్నియాలో ‘టెక్ మంత్రా నౌ’ పేరిట ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దానికి ఫౌండర్, సీఈఓగా పని చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ పుట్టి, పెరిగిన ఊళ్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి, గ్రామీణ యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలన్నది శ్రీరామ్మూర్తి ఆశయం. ఈ విషయాన్ని అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న తనయుడు రమేష్ దృష్టిలో పెట్టారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చే లక్ష్యంతో టెక్ మంత్రా నౌ కంపెనీ శాఖను రమేష్ అనాతవరంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ కంపెనీ శాఖలు హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నైలో ఉన్నాయి. ఈ క్రమంలోనే సొంతూరు అనాతవరంలో.. అదీ పూర్తి గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కంపెనీ కొత్త శాఖ శనివారం ప్రారంభమవుతోంది. ఈ వివరాలను శ్రీరామ్మూర్తి, అమెరికా నుంచి వచ్చిన ఆయన తనయుడు రమేష్‌లు అమలాపురంలోని కన్యకా పరమేశ్వరి కల్యాణ మంటపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ప్రాథమికంగా 100 మందికి ఉద్యోగాలు అనాతవరంలో జాతీయ రహదారి 216 చెంతన నెలకొల్పిన ఈ కంపెనీలో ప్రాథమికంగా 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే 25 మందిని నియమించామని రమేష్ తెలిపారు. కాలిఫోర్నియాలో 2014లో స్థాపించిన తమ కంపెనీ ఏడో శాఖను అనాతవరంలో నెలకొల్పుతున్నామన్నారు. తాను అనాతవరం హైస్కూలులోనే పదో తరగతి వరకూ చదువుకున్నానని తెలిపారు. తమ కంపెనీలో ట్రైనింగ్ హెచ్ఆర్గా పని చేస్తున్న పేరి విశాలి, డెలివరీ స్ట్రాటజీ డైరెక్టర్‌గా పని చేస్తున్న నూకల చిన వెంకటరత్నంలు కూడా కోనసీమకు చెందిన వారేనని చెప్పారు. వారు అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల పూర్వ విద్యార్థులని తెలిపారు. తండ్రి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, తన ఆశయానికి అనుగుణంగా పుట్టిన ఊళ్లోనే సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్న కుమారుడు రమేష్ ప్రయత్నాన్ని అభినందించారు. -
సీనియర్ పాత్రికేయుడు శ్రీరంగనాథ్ మృతి
సాక్షి, అమరావతి/అమలాపురం: కోనసీమకు చెందిన సీనియర్ పాత్రికేయుడు నిమ్మకాయల శ్రీరంగనాథ్ (78) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం మునిపల్లికి చెందిన శ్రీరంగనాథ్ పాత్రికేయ ప్రస్థానం నాలుగు దశాబ్దాల పాటు సాగింది. శ్రీరంగనాథ్ ఉదయం దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్‌గా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, విజయవాడ ప్రాంతాల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఉదయం స్టేట్ బ్యూరోలో కూడా పనిచేశారు. వార్త దిన పత్రిక ఢిల్లీ బ్యూరో చీఫ్‌గా, ఏపీ టైమ్స్ ఆంగ్ల పత్రిక బ్యూరో చీఫ్‌గా, ఆంధ్రప్రభ దినపత్రిక న్యూస్ నెట్ వర్క్ ఇన్ఛార్జిగా, సాక్షి దినపత్రిక కాలమిస్ట్‌గా పనిచేశారు. కమ్యూనిస్ట్ నేత తరిమెల నాగిరెడ్డి ఆంగ్లంలో రాసిన ఇండియా మార్ట్గేజ్డ్ పుస్తకాన్ని తెలుగులో శ్రీరంగనాథ్ తాకట్టులో భారతదేశం పేరుతో అనువదించారు. శ్రీరంగనాథ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. సీఎం సంతాపం శ్రీరంగనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీరంగనాథ్ మృతి పత్రికా లోకానికి తీరని లోటని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. జీవితాంతం బలమైన వామపక్ష రాజకీయ దృక్పథాన్ని ఆచరిస్తూ.. నీటిపారుదల రంగంలో డెల్టా వ్యవస్థ మెరుగుదలపై అనేక పరిశోధనాత్మక కథనాలు రాశారని కొనియాడారు. మంగళవారం శ్రీరంగనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరంగనాథ్ ఎంతో మంది జర్నలిస్టులను సమాజానికి అందించారన్నారు. -
మెహబూబ్ సిస్టర్స్.. అరవై దాటినా పతకాల వేట
అమలాపురం టౌన్ (తూర్పుగోదావరి): పట్టణానికి చెందిన మెహబూబ్ సిస్టర్స్ షకీలా, షాహీరా మాస్టర్ అథ్లెటిక్ పోటీలకు దేశంలో ఎక్కడికి వెళ్లినా పతకాలు గెలిచి వస్తారు. ఇద్దరికీ అరవై ఏళ్ల వయస్సు దాటినా ఇరవై ఏళ్ల వయసులో ఉన్నట్లే చలాకీగా ఆటలాడేస్తారు. వయసులు మా శరీరానికే గాని మనసులకు కాదని అంటారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు ఎస్పీవీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఈ నెల 8,9 తేదీల్లో జరిగిన 40వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ స్పోర్ట్స్ మీట్–2022 పోటీల్లో మెహబూబ్ సిస్టర్స్ షాట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రోలో నాలుగు బంగారు, రెండు వెండి పతకాలు సాధించారు. చదవండి: చిట్టివలస టూ అమెరికా.. రూ. కోటి ఉపకారవేతనంతో రేష్మ ఎంపిక షకీలా 60 ప్లస్ విభాగంలో షాట్ పుట్, లాంగ్ జంప్, డిస్కస్ త్రోలో మొదటి స్థానాల్లో నిలిచి మూడు బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. షాహీరా 70 ప్లస్ విభాగంలో లాంగ్ జంప్‌లో మొదటి స్థానాన్ని సాధించి బంగారు పతకాన్ని, లాంగ్ జంప్, డిస్కస్ త్రోలో ద్వితీయ స్థానాలు సాధించి రెండు వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. విజేతలైన మెహబూబ్ సిస్టర్స్‌ను జిల్లా మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి.కృష్ణమూర్తి, ఎం.బాపిరాజు అభినందించారు. -
వెండి తెరపైకి అమలాపురం కుర్రాడు
అమలాపురం: చిన్నప్పటి నుంచీ ఫ్యాషన్ రంగమంటే అతనికి ప్రాణం.. యాక్టింగ్ అంటే ఇష్టం.. ఈ రెండింటిలో స్థిరపడాలన్నదే లక్ష్యం.. అందుకే బీటెక్ పూర్తి చేసినా ఉద్యోగం కోసం చూడకుండా తన టాలెంట్‌తో నచ్చిన రంగాల్లో ప్రతిభ చాటాలని అమలాపురానికి చెందిన మేడిద నాగేంద్ర అడుగులు వేస్తున్నారు. మోడలింగ్‌లో తన కలలు సాకారం చేసుకుంటున్నారు. ఆ రంగంలో వేసిన అడుగులు విజయవంతమై అతనిని విజేతను చేయడమే కాకుండా అవార్డు వరించింది. ఇక సినిమా రంగంలో తొలి అడుగు ఇటీవలే పడింది. హీరోగా ఇంకా పేరు పెట్టని ఓ చిత్రంలో నటిస్తున్నారు. కళాశాల విద్య నుంచే నాగేంద్ర మోడలింగ్, సినీ రంగాలపై దృష్టి పెట్టారు. కళాశాలలో ఏ వేడుక జరిగినా అతని డ్యాన్స్‌తో అదరగొట్టేవారు. కొడుకు తాను ఎంచుకున్న రంగాల్లో రాణిస్తున్న తీరును చూసి తల్లిదండ్రులూ స్వాగతిస్తున్నారు. చిన్న చిన్నగా ఎదుగుతూ.. మోడలింగ్‌లో చిన్న చిన్న షోలకు వెళ్లి నాగేంద్ర ర్యాంప్‌పై వాక్ చేసేవారు. 2020 జనవరిలో హైదరాబాద్‌లో టాలింటికా సంస్థ నిర్వహించిన ఫ్యాషన్ పోటీల్లో తన అదిరేటి డ్రస్‌తో సౌత్ ఇండియా టాప్ మోడల్‌గా నిలిచారు. ఈ సంస్థ ఎంపిక చేసిన టాప్ 10 విజేతల్లో ఒకరిగా తొలి విజయం నమోదు చేసుకున్నారు. గత అక్టోబర్‌లో గోవాలో జరిగిన జాతీయ ఫ్యాషన్ మోడలింగ్‌లో మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ పోటీలకు ఆంధ్ర రాష్ట్రం తరఫున హాజరయ్యారు. అక్కడ విజేత కాకపోయినా మోడలింగ్‌లో అదీ జాతీయ పోటీల్లో పాల్గొనడం అరుదైన అవకాశంగా... అంతా అభినందిస్తున్నారు. నాగేంద్ర ప్రతిభను గుర్తించి హైదరాబాద్ బిజినెస్ మింట్ సంస్థ ఈ నెల 27న నిర్వహించిన నేషన్ వైడ్ అవార్డ్స్–2021 వేదికపై ఇన్స్పైరింగ్ ఫ్యాషన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రదానం చేసింది. సినీ హీరో కావాలన్న ఆకాంక్షతో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ యాక్షన్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా సంస్థలో శిక్షణ, మెళకువలు నేర్చుకున్నారు. దీంతో లోలుగు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో హీరోగా నటించే దక్కింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కథాంశంతో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శ్రీకాకుళం, విశాఖపట్నం, లంపసింగ్ ప్రాంతాల్లో జరుగుతోంది. ‘మాలి’ అనే చిత్రంలో నెగెటివ్ పాత్రను పోషిస్తున్నారు. అమలాపురం వైఎస్సార్ సీపీ నాయకుడు మేడిద రమేష్‌బాబు కుమారుడు నాగేంద్ర. ప్రతిభ, శ్రమనే నమ్ముకున్నా.. నేను ఎంచుకున్న మోడలింగ్, సినిమా రంగాల్లో రాణించగలననే నమ్మకం ఉంది. నాకు ఎవరి సిఫార్సులూ లేవు. నా వెనుక ఆ రెండు రంగాలకు సంబంధించి పెద్దలూ లేరు. కేవలం నా ప్రతిభ, క్రమశిక్షణ, శ్రమనే నమ్ముకుని ముందుకు వెళ్తున్నా. దీనిని ఓ చాలెంజ్‌గా తీసుకుని ముందడుగు వేస్తున్నా. – మేడిద నాగేంద్ర, మోడల్, సినీ నటుడు, అమలాపురం -
Chedi Talimkhana: గంతలు కట్టినా.. గురి తప్పదు..
అలనాటి భారత స్వాతంత్య్ర పోరాటం నుంచే చెడీ తాలింఖానా విద్య ఆవిర్భవించిందని చెబుతారు. పండగలను ఇళ్లలో జరపడం కాకుండా బయటకు వచ్చి ఊరేగింపులు, ప్రదర్శనల ద్వారా ప్రజలు ఐక్యతను చాటాలని స్వాంతంత్య్ర సమర యోధుడు బాలగంగాధర్ తిలక్ ఆనాడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో 1830–50 సంవత్సరాల మధ్య చెడీ తాలింఖానా వీరవిద్యకు ఇక్కడ బీజం పడింది. ఈ అరుదైన కళ, ప్రదర్శనల ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించింది. క్రమంగా అమలాపురం దసరా ఉత్సవాలు ఏడు వీధులకు విస్తరించి, చెడీ తాలింఖానా ప్రదర్శనలకు వేదికలుగా నిలుస్తున్నాయి. ఈ ఏడు వీధుల వాహనాల ఊరేగింపు రాత్రంతా జరుగుతుంది. తెల్లారువారుజామున ఆ ఏడు ఉత్సవాలు, చెడీ తాలింఖానా ప్రదర్శనల సమ్మేళనం నిర్వహించడమే ఈ ఉత్సవాల ప్రత్యేకత. (చదవండి: ఇళ్ల మధ్యే సమాధులు.. మంచమే వాడని వింత ప్రపంచం) అమలాపురం టౌన్: కోనసీమ కేంద్రం అమలాపురం దసరా ఉత్సవాల ప్రస్తావన వస్తే ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచే వీరవిద్య.. చెడీ తాలింఖానా గుర్తుకు రాక మానదు. కర్రలు, కత్తులు, బల్లాల వంటి ఆయుధాలతో సాగించే ఈ సాహస విన్యాసాలు పూర్వపు రాచరిక వ్యవస్థలోని యుద్ధరంగాన్ని, వీరుల పోరాట పటిమను తలపిస్తాయి. వీరత్వానికి, ఐకమత్యానికి, క్రమశిక్షణకు సూచనగా నిలుస్తాయి. మహాభారతంలో పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచినట్లు.. ఈ వీరవిద్యకు సంబంధించిన ఆయుధాలను కూడా ప్రదర్శకులు ఏడాదంతా ఓచోట దాచి పెట్టి, దసరా ఉత్సవాలకు ముందు వాటికి జమ్మి కొట్టి.. భేతాళస్వామి పూజలు చేసి చెడీ తాలింఖానా ప్రదర్శనలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్కంఠభరితంగా ఆయుధ ప్రదర్శనలు ►రెప్పపాటులో కర్రలు, కత్తులు ప్రదర్శకుల తలలపై, శరీరంపై పడుతున్నప్పుడు.. అంతే వేగంగా అవే కత్తులు, కర్రలతో కాపు కాచుకునే ప్రక్రియ ఎంతో ఉత్కంఠను రేపుతుంది. ►కత్తులతో విన్యాసం చేసే వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని నేలపై పడుకున్న వ్యక్తి పొట్టపై ఉంచిన కొబ్బరి కాయ, కూరగాయలను ఒకే ఒక్క వేటుతో నరకడం చూపరులకు భయంగొలుపుతుంది. ఈ వేటు వెంట్రుక వాసి తేడా పడినా పడుకున్న వ్యక్తి పొట్టలో ఈ కత్తి దిగిపోతుంది. కానీ అటువంటి ప్రమాదమేమీ లేకుండానే ఆ వ్యక్తి క్షేమంగా ఉండటం ఈ ప్రదర్శన ప్రత్యేకత. ►గిరాగిరా తిప్పే అగ్గిబరాటాల విన్యాసాలు, లేడి కొమ్ములతో తలపడడం వంటి ప్రదర్శనలు కూడా కూడా గగుర్పాటుకు గురి చేస్తాయి. ►చెడీ తాలింఖానాకు ఉపయోగించే కత్తులు, కర్రలు, బల్లాలు, లేడి కొమ్ములపై ఆయా వీధులకు సంబంధించిన ట్యాగ్లు వేస్తారు. వాటిని మాత్రమే ప్రదర్శనల్లో ఉపయోగిస్తారు. వీధివీధికో చరిత్ర కొంకాపల్లి వీధి: అమలాపురం దసరా ఉత్సవాలకు పట్టణంలోని కొంకాపల్లి వీధి 1835లో శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచీ గత 186 ఏళ్లుగా కొంకాపల్లి వీధి దసరా ఉత్సవాలు నిరాటంకంగా సాగుతూనే ఉన్నాయి. ఈ వీధి వాహనం ఐరావతం, హంస. ఈ వాహనంతోనే దసరా ఉత్సవాలు, ఊరేగింపు, చెడీ తాలింఖానా ప్రదర్శనలు చేస్తారు. ఈ వీధికి తూము తిమ్మరాజు, లింగోలు దానయ్య, గుండుమోగుల అయ్యన్న చెడీ తాలింఖానా గురువులుగా వ్యవహరించారు. కొంకాపల్లి ఉత్సవాలకు అప్పటి బ్రిటిషు ప్రభుత్వం తామ్రపత్రం కూడా బహూకరించింది. మహిపాల వీధి: ఈ వీధే చెడీ తాలింఖానాకు అంకుర్పాణ చేసింది. ఆ తర్వాతే పట్టణంలోని ఏడు వీధులకు ఈ వీరవిద్య విస్తరించింది. 1856లో అప్పటి చెడీ తాలింఖానా ఆది గురువు అబ్బిరెడ్డి రాందాసు ఈ సాహస విద్యను అమలాపురానికి పరిచయం చేసి, దసరా ఉత్సవాలకు వినూత్న వన్నె తీసుకు వచ్చారు. నాటి నుంచి నేటి వరకూ అంటే 166 సంవత్సరాలుగా చెడీ తాలింఖానా అమలాపురానికి ఓ బ్రాండ్‌గా చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత ఆయన కుమారుడు నరసింహరావు, ఆ తర్వాత ఆయన కుమారుడు రాందాసు.. ఆయన కుమారుడు మల్లేశ్వరరావు.. ఇలా నాలుగు తరాలుగా ఆ కుటుంబంలోని వారే చెడీ తాలింఖానా గురువులుగా ఉన్నారు. ప్రస్తుతం నాలుగో తరం గురువుగా మల్లేష్ కొనసాగుతున్నారు. ఈయన ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్నా ప్రతి దసరా ఉత్సవాలకు 20 రోజుల ముందు అమలాపురం వచ్చి చెడీ తాలింఖానా ప్రదర్శనల్లో పాల్గొంటారు. పై మూడు తరాల గురువులు అబ్బిరెడ్డి రాందాసు, నరసింహరావు, రాందాసుల విగ్రహాలను మహిపాలవీధిలో నెలకొల్పారు. ఏటా ఆ విగ్రహాల వద్దే దసరాకు ఆయుధ పూజలు చేయడం ఆనవాయితీ. ఈ వీధి వాహనం రాజహంస. ఆకట్టుకునే అగ్గి బరాటాలు.. గండు వీధి: ఈ వీధి వాహనం శేషశయన. 1911లో ఈ వీధిలో దసరా ఉత్సవాలు, చెడీ తాలింఖానా ప్రదర్శనలు మొదలయ్యాయి. అప్పటి నుంచి నేటి దాకా అంటే 111 సంవత్సరాలుగా ఇక్కడ చెడీ తాలింఖానా ప్రదర్శనల పరంపర కొనసాగుతోంది. ఈ వీధికి చెందిన తండ్రీ కొడుకులు గండు రాజు, గండు సూర్యప్రకాశరావులు చెడీ తాలింఖానా గురువులుగా ఇక్కడి వారికి శిక్షణ ఇచ్చారు. కత్తియుద్ధ కాంతారావులు : చెడీ తాలింఖానా ప్రదర్శనలో యువకుల విన్యాసాలు రవణం మల్లయ్యవీధి: ఈ వీధి దసరా ఉత్సవాలు, చెడీ తాలింఖానా ప్రదర్శనలు 1915లో ప్రారంభమయ్యాయి. ఈ వీధి వాహనం గరుడ విష్ణు. ఈ వీధి వారికి చెడీ తాలింఖానా గురువులుగా నాగులాపల్లి సూర్యనారాయణ, వాండ్రపు లక్ష్మణస్వామి శిక్షణ ఇచ్చారు. రవణం సూర్యచంద్రరావు కుటుంబం ఈ ఉత్సవాల నిర్వహణ బాధ్యతలు చేపడుతోంది. శ్రీరామపురం: ఈ వీధిలో దసరా ఉత్సవాలు, చెడీ తాలింఖానా ప్రదర్శనలు 1945లో మొదలయ్యాయి. కడలి వెంకట్రావు, కడలి సత్యం, గంజా మీరా సాహెబ్, కముజు సత్యం చెడీ తాలింఖానా వీరవిద్యకు గురువులుగా వ్యవహరించి ఈ వీధి ప్రజలకు శిక్షణ ఇచ్చారు. ఈ వీధి వాహనం శేషపాన్పు, వినాయక, హంస. కర్రలతో అనేకమంది దాడికి దిగినప్పుడు ఒడుపుగా కాసుకుంటున్న యువకుడు రవణం వీధి: ఈ వీధిలో దసరా ఉత్సవాలు 1947లో ప్రారంభమయ్యాయి. ఈ వీధి వాహనం మహిసాసుర మర్దిని. 74 ఏళ్లుగా రవణంవీధి యువజన సంఘం ఈ ఉత్సవాలు, చెడీ తాలింఖానా ప్రదర్శన నిర్వహిస్తోంది. నల్లా వీధి: ఈ వీధిలో చెడీ తాలింఖానా, దసరా ఉత్సవాలు 1966లో ప్రారంభమయ్యాయి. ఇక్కడి గురువు కోన ఆంజనేయులు. గత ఏడాది మృతి చెందిన ఈయన విగ్రహాన్ని నల్లా వీధిలో నెలకొల్పారు. ఈ వీధి వాహనం విజయదుర్గా అమ్మవారు. ఏటా దసరాకు అమెరికా నుంచి వస్తాను మా తాతలు, తండ్రి చెడీ తాలింఖానా గురువులుగా వేలాది మందికి శిక్షణ ఇచ్చారు. నేను కూడా మా తండ్రి అబ్బిరెడ్డి రాందాసు వద్ద శిక్షణ పొందాను. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డాను. కానీ నేర్చుకున్న చెడీ తాలింఖానా విద్యను ఎప్పుడూ మరచిపోలేదు. ఏటా దసరా ఉత్సవాలకు విధిగా అమలాపురంలో వాలిపోతాను. ఉత్సవాల్లో నేనూ చెడీ తాలింఖానా ఆయుధాల ప్రదర్శనలు చేస్తాను. అమలాపురం దసరా ఉత్సవాలు, చెడీ తాలింఖానా వీరవిద్య ప్రదర్శనపై అమెరికాలోని నా స్నేహితులకు వీడియో చూపించి దీని ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపించేలా కృషి చేశాను. – అబ్బిరెడ్డి మల్లేష్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, అమెరికా -
రెండు కుటుంబాల్లో చిచ్చు రేపిన వివాహేతర సంబంధం
అమలాపురం టౌన్(తూర్పు గోదావరి): అక్రమ సంబంధం రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది. ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితులకు దారి తీసింది. ఇందులో ఓ కుటుంబానికి చెందిన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందితే.. ఆ రెండు కుటుంబాల్లోని భార్యలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమలాపురం పట్టణ సీఐ ఆర్ఎస్కే బాజీలాల్ కథనం ప్రకారం.. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానానికి చెందిన పలచోళ్ల సూర్య కొండలరావు, సంధ్యాకుమారి భార్యభర్తలు. సూర్య కొండలరావు ఎస్.యానంలోని చమురు సంస్థలో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. (చదవండి: రోకలి బండతో మోది.. భర్తను హతమార్చి) వీరి కుటుంబం అమలాపురం రవణం మల్లయ్యవీధిలో కాపురం ఉంటోంది. ఇదే ప్రాంతంలో చెందిన గండు సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. సుబ్బారావుకు సూర్యకొండలరావు భార్య సంధ్యాకుమారికి అక్రమ సంబంధం ఉన్న విషయం ఆ రెండు కుటుంబాల్లో తెలిసి గొడవలు మొదలయ్యాయి. తర్వాత భార్యభర్తలు సూర్యకొండలరావు, సంధ్యా కుమారి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో అక్రమ సంబంధం తెచ్చిన చిచ్చుతో మనస్తాపం చెందిన సుబ్బారావు భార్య నాగలక్ష్మి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తర్వాత సూర్య కొండలరావు, సంధ్యాకుమారి దంపతులు సోమవారం సాయంత్రం అల్లవరం మండలం బోడసకుర్రు వంతెన వద్ద పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తక్షణమే స్థానికులు స్పందించి ఆ భార్యాభర్తలను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ భర్త సూర్య కొండలరావు బుధవారం ఉదయం మృతి చెందినట్టు సీఐ బాజీలాల్ తెలిపారు. అతడి భార్య సంధ్యాకుమారి పరిస్థితి విషమంగానే ఉంది. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న నాగలక్ష్మి కూడా అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సూర్యకొండలరావు ఆత్మహత్యకు, అతడి భార్య ఆత్యహత్యాయత్నానికి కారణమైన సుబ్బారావు, నాగలక్ష్మి దంపతులతోపాటు రవణం సాయమ్మ అనే మహిళపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాజీలాల్ తెలిపారు. చదవండి: Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు -
ఒలింపిక్స్‌లో కోనసీమ కుర్రాడికి తొలి మ్యాచ్
అమలాపురం: ఒక తండ్రి 30 ఏళ్ల కల నిజం అయ్యింది. ఒక తల్లి చేసిన పూజలు.. వ్రతాలు ఫలించాయి. ఒక యువకుడి జీవిత లక్ష్యం నెరవేరింది. ప్రతి క్రీడాకారుడు కలలుకనేది ఒలింపిక్స్ క్రీడల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించడం. అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్, అతని తల్లిదండ్రుల కల కూడా అదే. ఒలిపింక్ క్రీడావేదికపై సాత్విక్ ప్రతిభాపాటవాల ప్రదర్శించాలనే. ఆ కల శనివారం నెరవేరనుంది. విశ్వక్రీడల్లో క్రీడా యుద్ధానికి సాత్విక్ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాడు. టోక్యోలో శనివారం బ్యాడ్మింటన్ విభాగంలో డబుల్స్‌లో తొలి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో సాత్విక్ ఆడనున్నాడు. సాత్విక్, చిరాగ్ శెట్టిల జంటపై క్రీడాభిమానుల్లో అంచనాలు పెరిగాయి. సాత్విక్ తన గురువు పుల్లెల గోపీచంద్ ఆకాడమీలో సాధన చేస్తున్నాడు. బ్యాడ్మింటన్, ఒలింపిక్స్ అసోసియేషన్ల ప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు ఇక్కడి క్రీడాభిమానులు బంగారు పతకం సాధించాలని కోరుకుంటున్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే కల నెరవేరింది. మనదేశం తరఫున ఆడుతున్నానే ఫీలింగ్ ఉత్సాహాన్ని నింపిందని టోక్యో వెళుతూ సాత్విక్ ‘సాక్షి’తో అన్నాడు. ట్రాక్ రికార్డు ► 2018 ఆస్ట్రేలియా కామన్వెల్త్ పోటీల్లో మిక్స్డ్ డబుల్స్ టీమ్ విభాగంలో అశ్వనీ పొన్నప్పతో కలిసి గోల్డ్ మెడల్ ► డబుల్స్ విభాగంలో చిరాగ్ శెట్టితో కలిసి సిల్వర్ మెడల్ ► 2018లో హైదరాబాద్ ఓపెన్, 2019లో థాయిలాండ్ ఓపెన్ డబుల్స్ విభాగంలో స్వర్ణపతకాలు ► 2018 సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీ, 2019 ఫ్రెంచ్ ► డబుల్స్‌లో చిరాగ్ శెట్టితో 2016లో మౌరిటీస్ ఇంటర్ నేషనల్, ఇండియన్ ఇంటర్నేషనల్ సిరీస్, టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్, బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్, 2017లో వియత్నామ్ ఇంటర్నేషనల్, 2019 బ్రేజిల్ ఇంటర్నేషనల్ టోర్నీలలో విజయం చాలా సంతోషంగా ఉంది నేను షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడ్ని. అందుకే నా ఇద్దరు కుమారులను ఆ క్రీడలో ప్రోత్సహించాను. ఒక్కరైనా దేశం తరఫున ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించాలన్నదే నా కల. అది నెరవేరబోతోంది. ఆ కోరిక తీరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వ్యాయామోపాధ్యాయుడిగా ఎంతోమంది క్రీడాకారులకు ఒలింపిక్స్ గురించి గర్వంగా చెప్పేవాడిని. ఇప్పుడు నా కొడుకు ఆ క్రీడల్లో పాల్గొనడం.. చెప్పేందుకు మాటలు రావడం లేదు. – ఆర్.కాశీవిశ్వనాథ్, సాత్విక్ తండ్రి, అమలాపురం -
కుడిపూడి చిట్టబ్బాయి చివరి మాటలు
-
మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి చివరి మాటలు ..
-
మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూత
-
మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూత
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూశారు. కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. చిట్టబ్బాయి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. చిట్టబ్బాయి మృతితో కోనసీమలో తీవ్ర విషాదం అలుముకుంది. కుడిపూడి చిట్టబ్బాయి మృతి పట్ల వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు వైఎస్సార్సీపీ నాయకులు చిట్టబ్బాయి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ధర్మాన ప్రసాదరావు సంతాపం.. కుడిపూడి చిట్టబ్బాయి మరణం చాలా బాధాకరమని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. చిట్టబ్బాయి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. చిట్టబ్బాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: దారుణం: తల్లి, ఇద్దరు పిల్లల హత్య మాస్క్ పెట్టుకోమన్నందుకు కార్పొరేటర్‌పై దాడి -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
అమలాపురం టౌన్(తూర్పుగోదావరి): అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్న సమాచారం అందుకున్న పట్టణ సీఐ ఆర్ఎస్కే బాజీలాల్ గురువారం ఉదయం నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు వ్యాపారులు, ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు సీఐ బాజీలాల్ చెప్పారు. సెక్స్ వర్కర్లకు హెచ్ఐవీ పరీక్షలు, ఇతర సలహాలు ఇచ్చే ముమ్మిడివరానికి చెందిన ఓ మహిళ ఇటీవల అమలాపురంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న కడియం రవితో పరిచయం ఏర్పడింది. వారిద్దరు కలసి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇతర ప్రాంతాల నుంచి కొందరిని తీసుకువచ్చి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం రావడంతో సీఐ బాజీలాల్, ఎస్సై సురేష్‌బాబు ఆ గృహంపై దాడిచేసి ఒక అమ్మాయి, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు నిర్వాహకులు పట్టుబడ్డారు. అమలాపురం రూరల్ మండలం నల్లమిల్లికి చెందిన గెడ్డం ప్రసాద్, అల్లవరం మండలం మొగళ్లమూరుకు చెందిన తాడి పౌలు, ఇద్దరు ఆటో డ్రైవర్లు రెడ్ హ్యాండెడ్‌గా దొరకారని సీఐ చెప్పారు. పట్టుబడ్డ అమ్మాయిని మహిళా సంరక్షణాలయానికి పంపిస్తామన్నారు. వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న మహిళతో పాటు రవితో పాటు ప్రసాద్, పౌలులను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. చదవండి: ప్లీజ్ డాడీ.. అమ్మను ఏం చేయొద్దు ఫేస్బుక్ ప్రేమ... పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని.. -
నే గెలిచా... లేవండీ!
అమలాపురం టౌన్: ఏవండీ.. లేవండీ.. ఎన్నికల్లో నే గెలిచా.. నన్ను ఆశీర్వదించండి. మీరిచ్చిన ధైర్యమే నాకు అండండీ.. మీరు లేరనే మాట నన్ను కుంగదీస్తుందండీ... అంటూ అమలాపురం మున్సిపాలిటీలో 10వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ కౌన్సిలర్‌గా గెలిచిన కొల్లాటి నాగవెంకట దుర్గాబాయి ఆమె భర్త మృతదేహం వద్ద విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దుర్గాబాయి తల్లి శనివారం తెల్లవారు జామున మరణించారు. ఆ బాధను దిగమింగుకుని తప్పని పరిస్థితుల్లో అమలాపురం ఎస్కేబీఆర్ కౌంటింగ్ హాలుకు ఆదివారం ఉదయం ఆమె వచ్చారు. లెక్కింపు సమయంలో బరువెక్కిన హృదయంతోనే ఆమె ఉన్నారు. పదో వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించడంతో అంతా కృతజ్ఞతలు చెబుతుండగా.. ఇంతలో ఆస్పత్రిలో ఉన్న తన భర్త కూడా మరణించినట్లు సమాచారం తెలియడంతో కుంగిపోయింది. రెండు రోజుల వ్యవధిలోనే తల్లీ, భర్త చనిపోవడంతో ఆమె పడుతున్న బాధ వర్ణనాతీతం. వారిద్దరూ ఐసీయూల్లో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నా ఆ బాధను దిగమింగి మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేసిన బాధ్యతతో ప్రచారం చేశారు. చివరికి తల్లీ భర్త మరణించడంతో కౌన్సిలర్‌గా గెలిచిన ఆనందం పంచుకునే అవకాశం లేకుండా పోయింది. దుర్గాబాయి దీన గాథను చూసి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే కాకుండా స్థానిక ప్రజలు చలించిపోయారు. ఆమె వద్దకు వెళ్లి ఓదార్చారు. మంత్రి పినిపే విశ్వరూప్, బేబీ మీనాక్షి దంపతులు, పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర సంతాపం తెలిపారు. చదవండి: ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు.. మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ సీనియర్లకు షాక్ -
పలకరింపే పులకరింపైతే.. ప్రతిరోజూ పండగే
పండగ అంటే ఆధ్యాత్మిక.. సంప్రదాయాల వేదిక.. ఏడాదికోసారి వచ్చే తెలుగువారి పెద్ద పండగంటే.. ఆ ప్రత్యేకతే వేరు.. చుట్టాల పిలుపులు.. తోబుట్టువులతో మాటలు.. ఆత్మీయతాను బంధాలను ఓ చోటకు చేర్చి జరుపుకొనే ఆనందాల వేడుక.. రక్త సంబంధాల సరదా కలయిక.. అలాంటి పండగలు ప్రస్తుత యాంత్రిక జీవన వేగంలో అంతే మెరుపు వేగంతో సాదాసీదాగా వెళ్లనీయకుండా అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలతో.. నూరు శాతం పండగల్లానే జరుపుకొనేలా మనమంతా సంక్రాంతి మూడు రోజుల పండగలను మనసారా స్వాగతిద్దాం. తీయని జ్ఞాపకాలను ప్రతి మదిలో దాచుకుందాం.. సాక్షి, అమలాపురం : మా చిన్న తనంలో పండగలు ఎంతో గొప్పగా జరిగేవి.. పూర్వం పెద్దలు పండగలను సంప్రదాయబద్ధంగా జరిపేవారు...వంటి గత వైభవ మాటలను పక్కన పెట్టి ఆ సంప్రదాయాలను.. ఆ అనుభూతులను మన తరం కూడా ఆస్వాదించేలా.. అచ్చమైన.. స్వచ్ఛమైన. పండగలను ఆవిష్కరించుకుందాం. ఇందుకు మనం చేయాల్సిందల్లా యాంత్రిక జీవనంలో కొన్ని అలవాట్లను కాస్త పక్కన పెట్టి ఊరును, ఊళ్లో జరిగే పండగలను.. వాటి ప్రాధాన్యాన్ని ముందు తరాలకు తెలియజేద్దాం. ప్రతి ఇంట ప్రతిరోజూ పండగ అనేలా చేద్దాం. ఉమ్మడి భోజనమే ముద్దు సంక్రాంతి మూడు రోజులూ బయట స్నేహితులతో డిన్నర్లు, పార్టీలంటూ కుటుంబ ఆత్మీయత వాతావరణాన్ని దూరం చేసుకోవద్దు. మామూలు సమయాల్లో తరచూ పార్టీలు, డిన్నర్లు అంటూ సరదాగా గడిపేస్తాం. కనీసం ఆ పండగ మూడు రోజులైనా ఎక్కడెక్కడో ఉన్న వారంతా సొంతింట్లో అయిన వాళ్ల మధ్య పూర్తి సమయం కేటాయిస్తే అదే పెద్ద పండగ. భోజనాలు, అల్పాహారాలు ఇంట్లోనే ఆత్మీయులందరూ ఒకే చోట కూర్చుని ఒకేసారి కలసిమెలిసి భుజిస్తే ఆ ఆనందం విలువ చాలా గొప్పగా ఉంటుంది. వ్యసనాలనూ పక్కన పెడదాం సంక్రాంతి పండగల కోసమని సుదూరాల నుంచి సొంతిళ్లకు చాలా మంది వస్తారు. అలాగే ఈ పండగల పేరుతో ఇళ్లన్నీ చుట్టాలతో నిండిపోతాయి. అయితే రోజూ చేసే తన వ్యసనాల పనిని పండగల నాడూ చేసి పండగ సంతోషాలకు దూరం కాకండి. మద్యం సేవించడం, పేకాట ఆడుతూ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటే.. మీరు పండగలను ఆస్వాదించలేరు. మామూలు రోజుల్లో ఎలాగూ తాగుతారు, తిరుగుతారు.. ఈ మూడు రోజులైనా తమ వాళ్లతో, నా అనుకున్న వాళ్లతో కబుర్లు, కాలక్షేపాలతో ఆనందంగా ఉంటే.. అదే పెద్ద పండగ.. పెద్దలను గౌరవిద్దాం.. పండగలకు సొంతిళ్లకు వచ్చే వారంతా తమ మూలాలైన పెద్దలు జీవిత చరమాంకంలో వృద్ధాప్యంతో ఇంట్లో ఓ గదిలోనే గడిపే వారితో కొన్ని క్షణాలైనా గడపాలి. వారిని గౌరవిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలి. వారిపై ప్రేమ చూపిస్తూ.. వారిపై అనురాగాన్ని కురిపించాలి. మనవళ్లు అయితే వారితో కొంతసేపు కూర్చొని నాటి సంక్రాంతి వైభవాలను వారి మాటలతో చెప్పించుకోవాలి. అందరూ గ్రూప్ ఫొటోలు దిగి పండగ జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలి. గతించిన మన ఇంటి పెద్దల పేరు చెప్పి ఎవరికైనా నూతన వస్త్రాలు కానుకగా ఇవ్వాలి. ‘సెల్’ఫిష్‌గా వద్దు మనిషితో మనిషి ఆప్యాయంగా నేరుగా మాట్లాడుకునే రోజులు తగ్గాయి. పక్క రూమ్‌లో ఉన్నా సెల్ఫోన్లో చాటింగ్ చేసుకునే రోజులొచ్చేశాయి. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతుందని సంబరపడాలో.. లేక సంబంధబాంధవ్యాలను దూరం చేస్తుందని బాధ పడాలో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో ఎక్కడెక్కడో స్థిరపడి పండగలకు కార్లు, బైక్‌లపై సొంతూళ్లకు వారు ఈ సెల్ ఫోన్లు పట్టుకుని వాటితో గడిపేయకండి. పండగల మూడు రోజులూ వాటిని కాస్త పక్కన పెట్టి మీ రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులతో సంతోషంగా పండగ చేస్కోండి. జాగ్రత్తగా నడుపుదాం పండగలను సొంతూళ్లలో జరుపుకోవాలని హైదరాబాద్, విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాల్లో స్థిర పడ్ద వారు కార్లలో కుటుంబ సమేతంగా రెక్కలు కట్టుకుని మరీ బయలుదేరతారు. అలాంటి వారు అప్రమత్తతో డ్రైవింగ్‌ను అప్రమత్తతతో చేయాలి. అందరూ ఒకేసారి సొంతూళ్లకు బయల్దేరడంతో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో ఉంటాయి. ఆ ట్రాఫిక్‌లో నెమ్మదిగా డ్రైవ్ చేసుకుని రావాలి. అతివేగం వల్ల నీ సొంతింటికి ఓ గంట ముందే చేరుకోగలవు. అదే నెమ్మదిగా రావడం వల్ల ఓ గంట ఆలస్యంగా వస్తావు. ఏదైనా ప్రమాదం జరిగితే నీ పయనమే కాదు నీ వేగమూ ఎందుకూ...ఎవరికీ పనికి రాదు. పండగను పండగలానే జరుపుకోవాలి పండగను పండగలానే జరుపుకోవాలి. ఏదో క్యాజువల్‌గా అన్నట్టుగా ఫ్యాషన్, టెక్నాలజీ పేరుతో పైపైనే జరుపుకోకూడదు. మనకు ఎన్ని పనుల ఒత్తిడి ఉన్నా.. ఎంతటి బిజీ లైఫైనా సంక్రాంతి పండగల మూడు రోజులూ సంప్రదాయ దుస్తుల దగ్గర నుంచి రుచులు, వినోదాలు, ఆచారాలు అన్నీ నిండైన పండగలో మనమంతా మమేకం కావాలి. ఎక్కడెక్కడో ఉన్న వారంతా సొంతింటికి చేరుకుని ఉమ్మడి కుటుంబంలా పండగలను జరుపుకొంటాం. – పేటేటి శాంకరీ, మురమళ్ల, ఐ.పోలవరం మండలం బంధాలను బలపరిచేవే పండగలు నా దృష్టిలో అన్ని పండగల కంటే సంక్రాంతి పండగలు మనుషుల మధ్య బంధాలను బాగా బలపరుస్తాయి. ఉద్యోగాల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఏ పండగలు ఎలా ఉన్నా సంక్రాంతి పండగలకు మాత్రం వచ్చి వాలిపోతారు. అందుకే సంక్రాంతి పండగలు ప్రతి ఊరే కాదు.. ప్రతి కుటుంబం ఓ సంబరాల సందడిగా మారిపోతాయి. పిల్లలు, పెద్దలు ఇలా అన్ని వయసుల వారిని మూడు పండగలు సంతోషపెడతాయి. – పేరి లక్ష్మీనరసింహం, విశ్రాంత బ్యాంక్ అధికారి, అమలాపురం -
ప్రియుడి మోసం.. నర్సు ఆత్మహత్య
సాక్షి. అమలాపురం : ప్రియుడు మోసం చేశాడనే మనస్తాపంతో అల్లవరం మండలం డి.రావులపాలెం శివారుసావరం పేటకు చెందిన కందికట్ల శాంతికుమారి(32) అనేనర్సు ఆత్మహత్యకు పాల్పడింది. తాలూకా పోలీసు స్టేషన్ ఏఎస్సై విప్పర్తి సత్యనారాయణ కథనం ప్రకారం.. శాంతికుమారి అమలాపురం కిమ్స్ ఆసుత్రిలో పదేళ్లుగా నర్సుగా పనిచేసింది. ఐదేళ్ల పాటు దుబాయ్‌లో ఉద్యోగం కూడా చేసింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత 11 నెలల క్రితం మళ్లీ కిమ్స్ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. నెల రోజుల నుంచి అమలాపురం రూరల్ మండలం కామనగరువు శివారు అబ్బిరెడ్డివారి కాలనీలో ఓ గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటోంది. ఈమె కొన్నేళ్లుగా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన జంగా శ్రీనుతో సహజీవనం సాగిస్తోంది. చదవండి: టెన్త్ అబ్బాయి.. డిగ్రీ అమ్మాయి ఈనెల 21న పెద్ద మనుషుల సమక్షంలో వీరి పెళ్లి విషయమై చర్చలు జరిగాయి. ఆ సమయంలో శ్రీను ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, తనకు ఇది వరకే పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పడంతో మనస్తాపం చెందిన శాంతికుమారి మంగళవారం తన ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తెకు ఫోన్ చేసినా స్పందిచకపోవడంతో తండ్రి నాగరాజు ఇంటికి వచ్చి చూస్తే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపింంది. తండ్రి నాగరాజు ఫిర్యాదుతో రూరల్లౖ సీఐ జి.సురేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం కేసు నమోదు చేశారు. -
కరోనా మృతుల అంత్యక్రియలు చూస్తారా
అమలాపురం టౌన్ : ఇప్పటి వరకూ కరోనాతో ఎవరైనా మరణిస్తే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు రూ.వేలల్లో డిమాండ్ చేసిన పరిణామాలు చూశాం. అమలాపురం ప్రాంతంలో కొంతమంది మరో అడుగు ముందుకేసి కరోనాతో మృతి చెందిన కుటుంబ సభ్యులతో ఫోన్ల ద్వారా సరికొత్త బేరసారాలకు దిగుతున్న వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. కరోనాతో ఆస్పత్రుల్లో చనిపోతున్న వారి మృతదేహాలను కుటుంబీకులు, బంధువులు వచ్చి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితులు లేవు. ఈ భయాన్ని, బలహీనతలను ఆసరా చేసుకొని అమలాపురంలో కొందరు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కో మృతదేహానికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ డిమాండ్ చేస్తున్న సంఘటనలు ‘సాక్షి’ దృష్టికి వచ్చాయి. ఆసుపత్రి వద్దే నిఘా... అమలాపురం కోవిడ్ ఆస్పత్రుల్లో ఎవరైనా మృతి చెందితే చాలు...ఆ సమాచారం కోసం అంత్యక్రియలు చేసేవారు ఆ ఆస్పత్రుల వద్ద కాచుకుని కూర్చుంటున్నారు. సీరియస్‌గా ఉండే కోవిడ్ బాధితుల కుటుంబీకుల ఫోన్ నంబర్లు ముందుగానే సేకరించి మరీ ఫోన్లు చేసి బేరసారాలు కుదుర్చుకుంటున్నారు. అంత్యక్రియలు మీరు దగ్గరుండి చూసే అవకాశం లేదు కాబట్టి మృతుని అంత్యక్రియలను వీడియో తీసి ఆ తృప్తిని మీకు అందిస్తాం ... అందుకు రూ.10 వేలు ఖర్చవుతుంద’ని బేరసారాలకు దిగుతున్నారు. మృతదేహానికి సంప్రదాయ బద్ధంగా చేయాల్సిన ప్రక్రియంతా శాస్త్రోక్తంగా శ్మశానంలో పూర్తి చేస్తాం...ఇందుకు రూ.5 వేలు ఖర్చవుతుందంటూ లిస్టు రాసి ఇచ్చేస్తున్నారు. వామ్మో... వదిలించుకోవడం ఎలా... అమలాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పట్టణంలోని ఓ కోవిడ్ ఆస్పత్రిలో మృతి చెందారు. మరణించిన పది నిమిషాలకు ఈ తరహా ఫోన్లు మొదలయ్యాయి. మరణించిన వ్యక్తికి ముగ్గురు కుమారులు. ఓ కుమారుడు ఉన్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటారు. తండ్రి మరణించాక కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అమలాపురం రాలేకపోయారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉన్న ఆయనకు కూడా పదేపదే ఫోన్లు చేసి ‘వీడియో తీస్తా’మంటూ విసిగించడంతో ఆ బాధితుడు మీడియాకు సమాచారం అందించాడు. ఇక్కడ ఉన్న ఇద్దరు కుమారులకు కూడా సెంటిమెంట్ మాటలతో వీడియో...శాస్త్రోక్త పక్రియలంటూ ఫోన్లు చేసి ప్యాకేజీలంటూ వెంటపడ్డారు. ఇలాంటి అనుభవాలు గత రెండు వారాలుగా అమలాపురంలో మొదలయ్యాయని పలు బాధిత కుటుంబాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అంత్యక్రియలకు రూ.వేలు గుంజుతున్న వైనంపై ఇటీవల మున్సిపల్ కమిషనర్ రాజు దృష్టి సారించారు. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ ఫోన్ల బేరసారాలపై కూడా ఆయన దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎస్బీఐలో రూ.కోటికి టోకరా!
అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచిలో బినామీ గోల్డ్ లోన్లతో ఆ బ్యాంక్ నగదు అధికారే రూ.కోటికి టోకరా వేశాడు. బ్యాంక్‌లో మూడు వారాలుగా జరుగుతున్న ఆడిట్లో ఈ బినామీ గోల్డ్ లోన్ల అవినీతి వెలుగు చూసింది. బ్యాంక్‌లో దాదాపు రెండు వేల గోల్డ్ లోన్లకు సంబంధించిన నగలను భద్రపరిచిన బ్యాగ్‌లు ఉన్నాయి. అధికారులు ఆడిట్ నిర్వహించినప్పుడు గోల్డ్ లోన్లకు సంబంధించి బ్యాగ్‌ల లెక్కల ప్రకారం 25 బ్యాగులు కనిపించకపోవడంతో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించి మరోసారి ఆడిట్ నిర్వహించారు. అసలు బంగారు నగలు లేకుండానే.. బ్యాగ్లనేవి ఉంచకుండానే బినామీ పేర్లతో అంటే ఆ నగదు అధికారి కుటుంబీకులు, బంధువుల పేరుతో బినామీ గోల్డ్లోన్లు తానే తీసుకుని రూ.కోటి వరకు బ్యాంక్ సొమ్ములను రుణాల రూపంలో నొక్కేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నగదు అధికారి ఆక్వా చెరువులు సాగు చేస్తున్నట్లు సమాచారం. చెరువుల్లో నష్టం రావడం వల్లే వాటి భర్తీకి బ్యాంక్‌లో బినామీ గోల్డ్ లోన్ల పేరుతో పనిచేసే బ్యాంక్‌కే కన్నం వేసినట్లు తెలుస్తోంది. సోమవారం విజయవాడ నుంచి మరో ఆడిట్ అధికారుల బృందం సమనస బ్యాంక్‌కు రానుంది. అవకతకలపై ఆరోజు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. -
బ్యాంకు ఖాతాలో రూ.5లక్షలు మాయం
-
సెక్షన్ 30.. సెక్షన్ 144 పెట్టినప్పుడు ఏమయ్యారు?
సాక్షి, అమలాపురం: ‘గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏడాది పొడువునా సెక్షన్ 30 పెట్టారు. రైతుల సమావేశం అంటే 144 సెక్షన్ ఉందని హెచ్చరించేవారు. సమావేశం పెట్టుకుంటే పోలీసులు వచ్చి మైకులు విరగ్గొట్టారు. సాగు సమ్మె చేయమని పిలుపునిస్తే చూస్తూ ఊరుకోబోమని సాక్షాత్తూ నాటి హోంశాఖ మంత్రి హెచ్చరించారు. అప్పుడెందుకు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు. మాకెందుకు మద్దతుగా నిలవలేదు. ఇప్పుడెందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు?’ అంటూ కొంతమంది రైతు సంఘం నాయకులు నిలదీయడంతో టీడీపీ అనుకూల రైతు సంఘం నాయకులకు నోరు పెగల్లేదు. అమరావతి రైతులకు అనుకూలంగా తీర్మానం చేయించాలనే ఉద్దేశంతో టీడీపీ అనుకూల రైతులు కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతు సమావేశం నిర్వహించగా వారికి ఝలక్ తగిలింది. స్థానిక విద్యుత్ నగర్లో బుధవారం కోనసీమ రైతు పరిరక్షణ సమితి, భారతీయ కిసాన్ సంఘల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తీర్మానంతోపాటు ధాన్యం సొమ్ములు రావడం లేదని, నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామనే తీర్మానాలు చేయాలని టీడీపీ అనుకూల రైతులు తలపోశారు. ఈ విషయాలు తెలుసుకున్న రైతు సంఘం నాయకులు కొంతమంది స్పందించారు. స్థానిక సమస్యలపై చర్చిద్దాం.. ‘ఎక్కడో రైతుల సమస్యలు తరువాత.. ముందు ఇక్కడ విషయాలు మాట్లాడదాం?’ అని బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల జమ్మి అన్నారు. కొంతమంది రైతులు ఇటీవల ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ములు రాలేదని ప్రస్తావించగా ‘ధాన్యం బాగానే పండింది. ప్రభుత్వం మంచిగానే కొనుగోలు చేసింది. సొమ్ములు రేపో, ఎల్లుండో వస్తాయి. 2011 సాగు సమ్మె తరువాత నుంచి ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాల నుంచి మనకు పంట నష్టం పరిహారం ఇవ్వలేదు. రైతు రుణమాఫీ సొమ్ములు పూర్తిగా అందలేదు. పనిలో పని వాటి మీద కూడా చర్చిస్తే మంచిది’ అని జమ్మి తేల్చిచెప్పారు. విజయవాడలో రైతులకు కాని, రైతు కూలీలకు కాని నష్టం జరిగితే మాట్లాడదాం, అంతేకాని రాజధాని మార్పు విషయం గురించి ఇక్కడ మాట్లాడతామంటే కుదరదు’ అని తెగేసి చెప్పాడు. ఆయనకు రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి), డీసీసీబీ మాజీ డైరెక్టర్ గోదాశి నాగేశ్వరరావు తదితరులు దన్నుగా నిలిచారు. గోదాశి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కేసుల నమోదు, అప్పటి ఆర్డీవో కార్యాలయంలో రైతులతో జరిగిన చర్చలో రైతు సంఘం నాయకుడు రంబాల బోస్‌కు జరిగిన అవమానం గుర్తు చేయడంతో కొంతమంది టీడీపీ అనూకూల రైతులు అభ్యంతరం చెప్పారు. జరిగిన విషయం చెప్పుకుంటే మీకు ఉలికెందుకని కొంతమంది ప్రశ్నించడంతో టీడీపీ అనుకూల రైతులు మిన్నకుండా ఉండిపోయారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్ర వివిధ కారణాలతో ప్రభుత్వం భూములు తీసుకున్న రైతులకు న్యాయం చేయాలంటూ ముక్తసరిగా మాట్లాడారు. అనంతరం ధాన్యం అమ్మకాలు చేసిన రైతులకు సొమ్ములు విడుదల చేయాలని, రబీకి నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేశారు. ఈ సమావేశానికి కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం అధ్యక్షత వహించారు. రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు రంబాల బోస్, బీకేఎస్ నాయకుడు ఉప్పుగంటి భాస్కరరావు, రైతు సంఘం నాయకులు రాయుపురెడ్డి జానకీరామయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు. -
హైటెక్ మోసం
అమలాపురం టౌన్: అది ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గోరక్‌పూర్ కేసీ జైన్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు హైటెక్ బస్సు.. అయితే ఇదే బస్సు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో నకిలీ నంబరుతో మన రాష్ట్రంలో పన్ను ఎగవేస్తూ అక్రమ ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. ఎదుర్లంక–హైదరాబాద్ మధ్య ట్రావెల్స్ నిర్వహిస్తోంది. అమలాపురం కలశం సెంటరులో గురువారం రాత్రి 9 గంటలకు ఈ నకిలీ నంబరుతో ఉన్న హైటెక్ బస్సు రోడ్డుపై నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న సమయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేవీ శివప్రసాద్ తన సిబ్బందితో ఆకస్మిక దాడి చేసి ఆ బస్సు రికార్డులను తనిఖీ చేశారు. బస్సు వాస్తవ రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రిజి్రస్టేషన్ నంబర్ యూపీ 53 ఎఫ్టీ 3509గా ఆయన గుర్తించారు. అయితే ఇదే బస్సు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబరు ఏపీ07 టీజీ 0222ను పెట్టుకుని అక్రమ సర్వీస్ చేస్తున్నట్లు గమనించారు. ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఇదే నంబరు గల హైటెక్ బస్సు కాకినాడ నుంచి రిజిస్ట్రేషన్ అయినట్లు కూడా శివప్రసాద్ గుర్తించారు. అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్సు మన రాష్ట్రానికి చెందిన వేరే హైటెక్ బస్సు నంబర్‌ను పెట్టుకుని కోనసీమలోని ఎదుర్లంక నుంచి హైదరాబాద్‌కు సర్వీసు నడుపుతోంది. ఎంవీఐ శివప్రసాద్ అమలాపురంలో బస్సును తనిఖీ చేసేసరికి అందులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వేరే నంబరుతో అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆధారాలతో గుర్తించిన ఆయన బస్సును తక్షణమే సీజ్ చేశారు. అంతే గాకుండా ఆ బస్సుకు చెందిన ఇద్దరు డ్రైవర్లను బైండోవర్ చేశారు. రికార్డులను స్వాదీ నం చేసుకున్నారు. అయితే ఏపీ నంబర్‌తో తిరుగుతున్నప్పటికీ ఎక్కడా టాక్స్ చెల్లించిన దాఖలాలు లేకపోవడంతో గవర్నమెంట్ టాక్స్ ఎగవేతకు ఉద్ధేశపూర్వకంగానే అనుమ తి లేకుండా సర్వీసు నడుతున్నట్లు అంచనాకు వచ్చారు. సీజ్ చేసిన హైటెట్ బస్సును స్థానిక ఆర్టీసీ డిపోకు తరలించారు. బస్సు డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో ఆ బస్సు యాజమాని పై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. -
400 అడుగుల భోగి పిడకల దండ
సాక్షి, అమలాపురం: సంక్రాంతి పండగకు భోగి పిడకల దండలు వేయడానికి చిన్నారులు పోటీపడుతుంటారు. ఎంత పెద్ద దండ వేస్తే అంత గొప్పగా చెప్తుంటారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస పంచాయతీ పరిధిలో రంగాపురంలో విశ్రాంత ఉపా«ధ్యాయుడు భూపతిరాజు విశ్వనాథరాజు కోడలు శ్రీరామసత్య 400 అడుగుల భోగి పిడకల దండ తయారు చేశారు. విశ్వనాథరాజు ఇంట్లోని గోమయం (ఆవు పేడ)తో ఈ దండను తయారు చేశారు. భోగి మంటలు వేయడంలో కొన్ని సైన్స్ సంబంధించిన అంశాలు ఉన్నాయని విశ్వనాథరాజు తెలిపారు. దేశీయ గోమయం పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుందని సూక్ష్మ క్రిములు నశించి పాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుందని, ఈ గాలిని పీల్చడం ఆరోగ్యానికి మంచిందన్నారు. రంగాపురంలో తొలిసారిగా చేసిన దండను చూడటానికి పలు గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. అంతరించిపోతున్న సాంప్రదాయాన్ని ఈ తరం పిల్లలకు తెలియజేయాలని ఈ దండను చేశామన్నారు. 14 తేదీన భోగి పండగ రోజున పూజలు చేసి ఈ దండను భోగి మంటలో వేస్తామని సత్య తెలిపారు. -
రూపాయికే చీర.. యజమానికి షాక్!
-
రూపాయికే చీర.. చివరికి..
సాక్షి, తూర్పుగోదావరి: కొత్త సంవత్సరంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రకటించిన బంపర్ ఆఫర్ ఓ షాపు యజమానికి తలనొప్పిగా మారింది. చేతికందిన చీరలను ఎవరికి వారు పట్టుకోవడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అమలాపురం గ్రాండ్లో ఒక రూపాయికే ఒక చీర ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. దీంతో చీరలను సొంతం చేసుకునేందుకు అధిక సంఖ్యలో మహిళలు బారులు తీరారు. ఒక్కసారిగా గుంపులు గుంపులుగా షాపులోకి ప్రవేశించి చీరలను పట్టుకుపోయారు. ఈ పరిణామంతో కంగుతిన్న షాపు యజమాని పోలీసుల దగ్గరికి పరిగెత్తుకువెళ్లాడు. (20 పైసలకే టీ షర్ట్, క్యూ కట్టిన జనం) -
అమలపురంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
భూమాయ కేసులో.. కీలక సూత్రధారుల అరెస్టు
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అమలాపురం భూమాయ కేసులో ప్రధాన నిందితులు, సూత్రధారులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వేదికగా సాగిన ఈ భూమాయలో ప్రధాన నిందితులైన ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి చిన తాతయ్యనాయుడు, లక్ష్మీనరసమ్మ, వారి కుమారుడు మోటూరి బలరామమూర్తిలను అమలాపురం డీఎస్పీ షేక్ మాసూమ్ బాషా ఆధ్వర్యంలో పట్టణ సీఐ జి.సురేష్‌బాబు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక ఎర్రవంతెన వద్ద అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వాస్తవంగా లేని 53 ఎకరాల భూములకు నకిలీ రికార్డులు సృష్టించి వాటిని అమలాపురం హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో తనఖా పెట్టి రూ.1.50 కోట్లు కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ మోసానికి పాల్పడిన, సహకరించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బేబీ జ్ఞానాంబతో పాటు మరో సూత్రధారి కామనగరువు వీఆర్వో బడుగు ప్రశాంత్‌కుమార్, అమలాపురం తహసీల్దార్ కార్యాలయ వెబ్ ల్యాండ్ కంప్యూటర్ ఆపరేటర్ వంశీకృష్ణ, కాట్రేనికోన మండలం కందికుప్ప, చిర్రయానాం వీఆర్వోలు ఏసురత్నం, విష్ణుమూర్తిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితులు భార్యాభర్తలు, వారి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయగా అదే రోజు ఈ కేసులో మరో నిందితుడైన బ్యాంక్ రుణానికి గ్యారంటీర్‌గా ఉన్న ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి చిన తాతయ్యనాయుడు పొలంలో పనిచేసే పాలేరు కాశి పల్లంరాజు కూడా కోర్టులో పోలీసులకు లొంగిపోయాడు. ఇక కేసులో అరెస్ట్ చేయాల్సిన ఒకే ఒక నిందితుడు విశ్రాంత తహసీల్దార్ నాగాబత్తుల రమేష్ పరారీలోనే ఉన్నాడు. అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సురేష్‌బాబు, ఎస్సై వి.శ్రీనివాసరావు నిందితుల వివరాలను వెల్లడించారు. మోసం బయటపడిందిలా.. బ్యాంక్‌ను బురిడీ కొట్టించి తీసుకున్న భారీ రుణానికి కొన్ని వాయిదాలు చెల్లించి మోటూరి కుటుంబీకులు మిన్నకున్నారు. అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు తమ వార్షిక తనిఖీల్లో భాగంగా తనఖా పెట్టిన ఈ 53 ఎకరాల భూములను వెబ్‌ల్యాండ్ చూసుకోవడంతో పాటు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. వెబ్ ల్యాండ్‌లో, క్షేత్రస్థాయిలో ఆ భూములు లేకపోవడంతో బ్యాంక్‌ను మోసం చేసినట్టు గత సెప్టెంబర్‌లో గుర్తించి రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అప్పటి నుంచి ఈ భూమాయ వెలుగు చూసింది. బ్యాంక్, రిజిస్ట్రార్ అధికారులపైవచ్చిన అభియోగాలపైనా విచారణ ఈ భూమాయలో అటు అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో లేని భూములకు ఈసీ, మార్టగేజ్ చేసిన ఆ కార్యాలయ అధికారులపైన, క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండా, లీగల్ ఒపీనియన్ సరిగా తీసుకోకుండా రుణం ఇచ్చేసిన బ్యాంక్ అధికారులపైన వస్తున్న అభియోగాలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని సీఐ సురేష్‌బాబు వెల్లడించారు. వారి పాత్ర కూడా ఉన్నట్టు తెలిస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నకిలీ రికార్డుల సృష్టి ఇలా.. మోటూరి చినతాతయ్యనాయుడు కుటుంబీకులు 2017 ఆగస్టులో తొలుత కాట్రేనికోన మండలం కందికుప్ప, చిర్రయానం గ్రామాల్లో లేని 53 ఎకరాలకు అప్పటికే అదే మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న ప్రశాంత్‌కుమార్ పథకంతో ఆ రెండు గ్రామాల వీఆర్వోల సహకారంతో నకిలీ రికార్డులు సృష్టించారు. అందుకు అప్పటి కాట్రేనికోన తహసీల్దార్ నాగాబత్తుల రమేష్ కూడా సహకారం అందించారు. ఈ నకిలీ రికార్డులను హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు సమర్పించి రూ.1.50 కోట్ల రుణం కోసం ప్రయత్నించారు. అయితే భూములు కాట్రేనికోన మండలానికి చెందినవి కావడంతో బ్యాంక్ అధికారులు ఈ దస్తావేజులను మార్ట్గేజ్ కోసం ముమ్మిడివరం రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపారు. అక్కడి రిజిస్ట్రార్ వాటిని పరిశీలించగా నకిలీ రికార్డులుగా గుర్తించి ఈ సమాచారాన్ని కాట్రేనికోన తహసీల్దార్ కార్యాలయానికి తెలిపారు. దీంతో అక్కడ వీరి అక్రమాలు పారకపోవడంతో వారి స్కెచ్‌ను అమలాపురం తహసీల్దార్ కార్యాయానికి మార్చారు. అప్పటికే అమలాపురం రూరల్ మండలం వీఆర్వోగా వచ్చిన ప్రశాంత్‌కుమార్ మరో స్కెచ్ వేశారు. అందుకు అప్పటి అమలాపురం తహసీల్దార్ బేబీ జ్ఞానాంబతో పాటు అదే కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ వంశీకృష్ణ అందుకు సహకరించారు. అంతే మరోసారి ఇదే మండలంలో లేని 53 ఎకరాలకు తప్పడు రికార్డులు తయారుచేయడం, వాటిని అదే బ్యాంక్‌లో తనఖా పెట్టడం చకాచకా జరిగిపోయాయి. ఈసారి ముమ్మిడివరం రిజిస్ట్రార్ కార్యాలయంలో దొరికిపోయినట్టు దొరికిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో లేని భూములకు మార్టగేజ్ అయ్యే వరకు వెబ్‌ల్యాండ్‌లో నకిలీ సర్వే నంబర్లు అలానే ఉంచి బ్యాంక్ రుణం మంజూరు చేసిన తర్వాత వెబ్ ల్యాండ్ నుంచి ఈ నంబర్లను రీవోక్ చేసేశారు. ఇదంతా 2018 జూన్‌లో జరగడం...బ్యాంక్ రుణం ఇచ్చేయడం జరిగిపోయింది. ఎవరికి ఎంతెంత లంచం? ఈ భూమాయలో సహకరించిన రెవెన్యూ అధికారులకు మోటూరి తాతయ్యనాయుడు కుటుంబీకులు బ్యాంక్ నుంచి అప్పనంగా తీసుకున్న రూ.1.50 కోట్ల రుణం నుంచి రూ.22 లక్షలు లంచాలుగా పంచేశారు. తొలుత కాట్రేనికోన తహసీల్దార్ కార్యాయంలో పుట్టించిన నకిలీ రికార్డుల కోసం అప్పటి తహసీల్దార్ రమేష్‌కు రూ.ఐదు లక్షలు, స్కెచ్ వేసిన వీఆర్వో ప్రశాంత్‌కుమార్‌కు రూ.ఐదు లక్షలు, కందికుప్ప, చిర్రయానాం వీఆర్వోలు ఏసురత్నం, విష్ణుమూర్తిలకు చెరో రూ.రెండు లక్షలు ఇచ్చారు. తర్వాత అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన నకిలీలకు తహసీల్దార్ బేబీ జ్ఞానాంబకు రూ.ఐదు లక్షలు, వీఆర్వో ప్రశాంత్‌కుమార్‌కు రూ.రెండు లక్షలు, కంప్యూటర్ ఆపరేటర్ వంశీకృష్ణకు రూ.లక్ష లంచాలు అందించారు. ఈ లంచాల వివరాలను సీఐ సురేష్‌బాబు గణాంకాలతో వివరించారు. -
కళ్లల్లో కారం కొట్టి.. ఇనుపరాడ్లతో..
సాక్షి, తూర్పుగోదావరి : అమలాపురంలో కోడిపుంజులకై నెలకొన్న వివాదం కలకలం రేపింది. రోళ్లపాలెంలో కోడిపుంజుల విషయంలో వాగ్వాదం తలెత్తడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై మహిళలు కారం కొట్టారు. మరికొందరు ఇనుపరాడ్లతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో పలువురు గాయాలపాలు కాగా ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ముసుగేసిన ముసురు
సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి): జిల్లాకు ముసురు పట్టింది. డెల్టా.. మెట్ట.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. అమలాపురంలో వరుసగా మూడు రోజులూ భారీ వర్షం కురవడంతో ముంపు తీవ్రత మరింత పెరిగింది. తీర ప్రాంత మండలాల్లో వరిచేలు వర్షానికి నేలనంటుతున్నాయి. ఇది రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. జిల్లాలో సగటున 21 మిల్లీవీుటర్ల చొప్పున 1345 మిల్లీవీుటర్ల వర్షం కురవగా, అత్యధికం అమలాపురం 64.2 మిల్లీవీుటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా మారేడుమిల్లిలో 2.4 మిల్లీవీుటర్లు పడింది. ఏజెన్సీలో విలీనల మండలాలు నాలుగు మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ, ప్రత్తిపాడు, సీతానగరం, గం గవరం, కోరుకొండ, గండేపల్లి, తుని ప్రాంతా ల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. ఇదే సమయంలో రౌతులపూడి, తొండంగి, కోటనందూరులో భారీ వర్షం కురిసింది. మెట్టలోని ఏలేశ్వరంలో 48.6 మిల్లీవీుటర్ల వర్షం పడింది. ఇక డెల్టాలో కపిలేశ్వరపురం, కె.గంగవరం, కాట్రేనికోన, కాకినాడ అర్బన్, రూరల్, రామచంద్రపురం, పెదపూడి, పిఠాపురం, ఉప్పలగుప్తం తదితర మండలాల్లో భారీ వర్షం కురిసింది. అడపా దడపా భారీ వర్షం కురవడం, తరువాత ఒక మోస్తరు వర్షం చొప్పున డెల్టా ప్రాంతంలో పడుతూనే ఉంది. రాజమహేంద్రవరం భారీ వ ర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగాయి. హైటెక్ బస్టాండ్, కంబాల చెరువు, సీతంపేట, మూలగొయ్యి తదితర ప్రాంతాలు నీట మునిగాయి. కాకినాడ నగరంలో సినిమారోడ్డు, రామారావు, రాజీవ్‌నగర్, విద్యుత్తు నగర్ వంటి శివారు ప్రాంతాలు నీట మునిగాయి. మున్సిపల్ కార్యాలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమలాపురం మరోసారి మునిగింది నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అమలాపురంలో లోతట్టు కాలనీలు మంపునకు గురయ్యాయి. ఈ నెల 19వ తేదీన అమలాపురంలో రికార్డుస్థాయిలో 182.4 మిల్లీవీుటర్లు, 20వ తేదీన 54.6 మిల్లీవీుటర్లు, 21న 8.2 మిల్లీవీుటర్లు, ఇక 22వ తేదీన 64.2 మిల్లీవీుటర్ల వర్షం కురిసింది. నాలుగు రోజుల్లో మూడు రోజులు భారీ వర్షం కురవడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీల్లో ముంపు కష్టాలు రెట్టింపయ్యాయి. శనివారం కురిసిన వర్షానికి జల దిగ్బంధంలో చిక్కుకున్న ఈ కాలనీలో నీరు దిగేందుకు మంత్రి పినిపే విశ్వరూప్ చొరవతో జేసీబీలు ఏర్పాటు చేసి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. ముంపునీరు దిగుతున్న సమయంలోనే వర్షాలు పడుతుండడంతో ఫలితం లేకుండా పోయింది. ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. వరి చేలకు నష్టం భారీ వర్షాలకు డెల్టాలో వరి చేలకు నష్టం కలిగే పరిస్థితులు తలెత్తుతున్నాయి. వర్షాలకు తూర్పుడెల్టా పరిధిలో రామచంద్రపురం, కపిలేశ్వరపురం, కాజులూరు, కరప, తాళ్లరేవు, మధ్యడెల్టా పరిధిలో ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు సబ్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున వరి చేలు నేలకొరిగాయి. ముఖ్యంగా ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన మండలాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేలు నేలనంటడంతో పొలాల్లో నీరు దిగే అవకాశం లేకుండాపోయింది. దీంతో వరి కంకులు నీట నానుతున్నాయి. ప్రస్తుతానికి పెద్దగా నష్టం లేకున్నా వర్షాలు కొనసాగితే ముప్పు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వర్షపాతం ఇలా డెల్టాతో పోల్చుకుంటే ఏజెన్సీలో వర్షం పెద్దగా లేదనే చెప్పాలి. విలీన మండలాలైన నెల్లిపాక, చింతూరు, కూనవరం, వరహరామచంద్రపురంలో వర్షం లేదు. మారేడుమిల్లి 2.4, దేవీపట్నంలో 3.4, వై.రామవరంలో 12.2, అడ్డతీగలలో 13.6, రాజవొమ్మంగిలో 9.4, రంపచోడవరం 6.8 మిల్లీవీుటర్ల వర్షం నమోదయింది. మెట్ట పరిధిలో కోటనందూరులో 26.2, తునిలో 12.2, రౌతలపూడిలో 34.2, శంఖవరం 27.4, ఏలేశ్వరం 48.6, గంగవరం 5.4, సీతానగరం 5.2, గోకవరం 7, జగ్గంపేట 9.2, కిర్లంపూడి 15.4, ప్రత్తిపాడు 4, తొండంగి 34.2, గొల్లప్రోలు 20.4, పెద్దాపురం 27.4, గెద్దనాపల్లి 10.4, కోరుకొండ 6.6, రాజమహేంద్రవరం అర్బన్ 17.6, రాజమహేంద్రవరం రూరల్ 17, రాజానగరం 21.4, రంగంపేట 20.2, సామర్లకోట 28.8, పిఠాపురం 32.2, కోటిపల్లి 36.4, కాకినాడ రూరల్ 38.2, కాకినాడ అర్బన్ 47, పెదపూడి 35.4, బిక్కవోలు 24.6, అనపర్తి 22.6, కడియం 16.4, ఆత్రేయపురం 20.2, మండపేట 36.6, రాయవరం 20.4, కరప 23.2, కాజులూరు 13.8, రామచంద్రపురం 32.6, ఆలమూరు 17.4, రావులపాలెం 21.8, కొత్తపేట 25.8, కపిలేశ్వరపురం 44.2, కె.గంగవరం 43.2, తాళ్లరేవు 23.2, ఐ.పోలవరం 26.4, ముమ్మిడివరం 19.2, అయినవిల్లి 22.6, పి.గన్నవరం 6.8, అంబాజీపేట 25, మామిడికుదురు 23.4, రాజోలు 13.4, మలికిపురం 15.6, సఖినేటిపల్లి 20, అల్లవరం 16.2, అమలాపురం 64.2, ఉప్పలగుప్తం 29.8, కాట్రేనికోన 40.6 మిల్లీవీుటర్ల చొప్పున వర్షం కురిసింది. -
సీఎం జగన్ ఫ్లెక్సీకి జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం
సాక్షి, అమలాపురం రూరల్: వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద సొంత ఆటోలు కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వడంపై ది సెంట్రల్ డెల్డా ఆటో వర్కర్స్ యూనియన్‌కు చెందిన డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నల్లవంతెన సెంటర్ ఆటోస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమస్యలను పాదయాత్రలో జగన్ తెలుసుకున్నారని, అధికారంలోకి రాగానే వారికి ఆర్థిక సాయం అందజేశారని తెలిపారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేయడం అభినందనీయమన్నారు. ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, తదితర నాయకులు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్టు చేస్తాం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): విధి నిర్వహణలో ఉన్న కోర్టు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించడం, తోయటం, మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, న్యాయమూర్తులను పరుషపదజాలంతో దూషించిన కేసులో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్టు చేస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి పోలీస్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో 93 మంది ఉన్నారని ప్రజలను, వ్యవస్థను తప్పుదోవ పట్టించారన్నారు. ఆయన వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వాలని నోటీసులు ఇచ్చినా ఎటువంటి స్పందన లేదన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ వద్ద 93 మంది ఉన్నట్టు సమాచారాన్ని అధికారులకు అందిస్తే తద్వారా ప్రభుత్వాధికారులు ఆవిధంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ కాని అటువంటివేమీ లేకుండా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవపట్టించి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించారన్నారు. గతనెల 28న రాజమహేంద్రవరం కోర్టుకు చెందిన స్థలంలో ఆక్రమణలు తొలగిస్తుండగా మాజీ ఎంపీ హర్షకుమార్ మధ్యాహ్నం 12 గంటలు, 3.30 గంటల సమయంలో వచ్చి జిల్లా న్యాయమూర్తిని పరుషపదజాలంతో మాట్లాడడం, అక్కడ ఉన్న కోర్టు ఉద్యోగులను బెదిరించడంతో పాటు, తోయడం, మహిళా ఉద్యోగినులతో అసభ్యకరంగా ప్రవర్తించారని జిల్లా కోర్టు పరిపాలనాధికారి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. హర్షకుమార్‌ను అరెస్టు చేసేందుకు వెళితే పరారయ్యారన్నారు. హర్షకుమార్‌ను అరెస్టు చేసేందుకు నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. హర్షకుమార్‌తో పాటు ఆయనకు సహకరించిన వారిని అరెస్టు చేస్తామన్నారు. ఈ విధంగా ధిక్కారధోరణిలో మాట్లాడి ప్రజలను తప్పుదోవపట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఐజీ ఏఎస్ ఖాన్ స్పష్టం చేశారు. త్రీటౌన్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ మాజీ ఎంíపీ జీవీ హర్షకుమార్‌ను అరెస్టు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన త్రీటౌన్ ఇన్స్పెక్టర్ ఎం.శేఖర్‌బాబును సస్పెండ్ చేసినట్టు ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ తెలిపారు. గత నెల 28న జిల్లా కోర్టు పరిపాలనాధికారి మాజీ ఎంపీ హర్షకుమార్‌పై ఇచ్చిన ఫిర్యాదును కేసు నమోదు చేసిన త్రీటౌన్ ఇన్స్పెక్టర్ ఎం.శేఖర్‌బాబుకు, సిబ్బందికి ఆయనను అరెస్టు చేయాలని అర్బన్ జిల్లా ఎస్పీ షీమోషీబాజ్పాయ్ ఆదేశాలు జారీ చేశారు. త్రీటౌన్ ఇన్స్పెక్టర్ శేఖర్‌బాబు గతనెల 29వతేదీ మధ్యాహ్నం వరకు ఇంటిలో ఉన్న హర్షకుమార్‌ను అరెస్టు చేయకుండా తాత్సారం చేశారన్నారు. ఇన్స్పెక్టర్, సిబ్బంది ముందు నుంచే మాజీ ఎంపీ పరారయ్యారన్నారు. అందువల్ల విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు శేఖర్‌బాబును విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు డీఐజీ ఏఎస్ ఖాన్ తెలిపారు. -
సరికొత్త ‘పట్టణం’
తూర్పుగోదావరి ,మండపేట: పట్టణ ప్రాంతాలు త్వరలో సరికొత్త రూపును సంతరించుకోనున్నాయి. వార్డుల్లోని వ్యత్యాసాలను సరిచేసి అభివృద్ధి ఫలాలను అక్కడి ప్రజలందరికీ చేరువ చేసేం దుకు ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ముసాయిదా జాబితాను జిల్లాలోని పురపాలక సంస్థలు, నగర పంచాయతీలు ప్రభుత్వానికి నివేదించాయి. పరిశీలన అనంతరం అక్టోబరు పదో తేదీన తుది నోటిఫికేషన్ జారీ కానుంది. ఇకపై వార్డుల్లోనిప్రజాప్రతినిధులకు సమాన ప్రాతినిధ్యం దక్కనుంది. జిల్లాలో రెండు నగర పాలక సంస్థలు, ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలుండగా, కార్పొరేషన్ల పరిధిలో 100 డివిజన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో 264 వార్డులున్నాయి. జిల్లాలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉన్న రాజమహేంద్రవరం కార్పొరేషన్‌తోపాటు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఇప్పటికే అధికారులు ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. ఒక్కో వార్డులో ఓటర్లు, జనాభా వివరాల్లో అధిక వ్యత్యాసం ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఒక వార్డులో నాలుగు వేల వరకు జనాభా ఉంటే, ఒక వార్డులో రెండు వేలు మాత్రమే ఉన్నాయి. తక్కువ జనాభా ఉన్న వార్డులతో పోలిస్తే అధిక జనాభా ఉన్న వార్డుల్లో పనిభారం అధికంగా ఉండటంతోపాటు పథకాల అమలులో తాత్సారం, పాలనాపరమైన సమస్యలకు ‘చెక్’ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని వార్డుల్లోను సమాన జనాభా ఉండే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజన చేయాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) ఆదేశాలిచ్చింది. వార్డుల్లోని జనాభా సమానంగా ఉండాలి. 10 శాతం హెచ్చతగ్గులు ఉండవచ్చు. ప్రస్తుత వార్డు జనాభాలో వ్యత్యాసం అంతకన్నా ఎక్కువగా ఉంటే వ్యత్యాసం ఉన్న జనాభాను సమీప వార్డుల్లో కలపాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లు, ముమ్మిడివరం నగరపంచాయతీ మినహా మిగిలిన మండపేట, అమలాపురం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, రామచంద్రపురం, తుని మున్సిపాల్టీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీలు వార్డుల పునర్విభజన నిమిత్తం గత నెలలో అధికారులకు ఆదేశాలందాయి. కాకినాడ కార్పొరేషన్లో ఇప్పటికే ఎన్నికలు జరగ్గా, రాజమహేంద్రవరం కార్పొరేషన్, ముమ్మిడివరం నగర పంచాయతీ లేకపోవడంతో వాటిలో సమీప గ్రామాల విలీన ప్రతిపాదన ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు 2011 జనాభా ప్రాతిపదికన అధికారులు జిల్లాలోని పురపాలక సంస్థలు, నగర పంచాయతీల వార్డుల పరిధిలో జనాభాను సమానం చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, పరిశీలన తదితర ప్రక్రియలను పూర్తి చేసి ముసాయిదా జాబితాను ఈ నెల 18వ తేదీన సీడీఎంఏకు నివేదించారు. పరిశీలన అనంతరం అక్టోబర్ 10వ తేదీన ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. -
సిగ్నల్ టవర్‌పైకి ఎక్కి యువకుల నిరసన!
సాక్షి, తూర్పుగోదావరి(అమలాపురం) : అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని అధికారులు తొలగించిన ఘటన ఉప్పలగుప్తంలో తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు రోజులుగా దళిత సంఘాలతో ఆందోళన, ధర్నాలు, రాస్తారోకోలతో ఉప్పలగుప్తం రగలిపోతుండగా తాజాగా బుధవారం ఉదయం ఐదుగురు దళిత యువకులు అధికారుల తీరును నిరసిస్తూ అక్కడే తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న సైక్లోన్ సిగ్నల్ టవర్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉప్పలగుప్తం మెయిన్ సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అనుమతులు లేవన్న కారణంతో ఆ విగ్రహాన్ని అధికారులు అక్కడి నుంచి తొలగించారు. దీనిపై దళిత సంఘాల నాయకులు నిరసనకు దిగడం... అధికారులను నిలదీయడం వంటి వరస పరిణామాలు తెలిసిందే. బుధవారం ఉదయం తిరిగి దళితుల ఉద్యమం మొదలైంది. ఆర్డీవో బి.వెంకటరమణ, డీఎస్పీ షేక్ మసూమ్ బాషా ఆధ్వర్యంలో అధికారులు కోనసీమ దళిత ఐక్యవేదిక నాయకులు డీబీ లోక్, ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సురేష్‌బాబు, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు, దళిత నాయకులు కొంకి వెంకట బాబ్జి, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, బీఎస్పీ రాష్ట్ర నాయకుడు గెడ్డం సంపదరావు తదితరులతో పలుమార్లు నిర్వహించిన చర్చలు సఫలం కాలేదు. సమస్య పరిష్కారానికి అధికారులు మూడు రోజులు గడువు కోరినా దళిత నాయకులు ససేమిరా అన్నారు. తొలుత తొలగించిన విగ్రహాన్ని యథాస్థానంలో ఉంచాలని...తొలగించిన అధికారులను సస్పెండ్ చేయాలన్న డిమాండ్లు అధికారుల ముందు ఉంచారు. ఇదే సమయంలో సమస్య పరిష్కారం కావడం లేదన్న అసహనం, ఆగ్రహంతో ఐదుగురు దళిత యువకులు అక్కడే ఉన్న సైక్లోన్ సిగ్నల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి దిగడంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పైన ఉన్న యువకులను దిగమని ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు దిగిరాలేదు. విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించకపోతే దూకి చనిపోతామన్న సంకేతాలు పంపించారు. వారు అన్నంత పని చేస్తారనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా అక్కడ నేలపై నెట్లు సిద్ధం చేశారు. సుమారు ఐదు గంటలపాటు టవర్‌పై యువకులు చేసిన హైరానాతో వాతావరణం వేడిక్కింది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దళితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరోవైపు వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహాన్ని అక్కడ పునః ప్రతిష్టించేందుకు వీల్లేదంటూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతాయని గ్రహించిన పోలీసులు అదనపు బలగాలను అక్కడకి రప్పించి భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. టవర్ ఎక్కిన యువకులు భార్యలు, తల్లులు వచ్చి దిగిపోమ్మని ఏడుస్తూ అభ్యర్ధించినా వారు దిగరాలేదు. పరిస్థితి చేజారిపోతుండడంతో దళిత నాయకులు సమన్వయం పాటించాలని యువకులను కోరారు. మరోసారి అధికారులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి మూడు రోజుల గడువు ఇవ్వాలని అధికారులు కోరడంతో దళిత నాయకులు ఆందోళనకారులకు నచ్చజెప్పి పంపించారు. చివరకు యువకులు టవర్ దిగిరావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
వైద్యం ఓడింది మూడత్వం గెలిచింది!
-
టీడీపీలో ఫేస్బుక్ ఫైట్
సాక్షి, అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు అమలాపురం పట్టణ టీడీపీలో చెలరేగిన వివాదం నేటికీ రగులుతూనే ఉంది. మున్సిపల్ చైర్మన్ పీఠం పదవిపై జరిగిన జెంటల్మన్ ఒప్పందం అమలు పట్టణ పార్టీలో వర్గ విభేదాలు మిగిల్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలయ్యాక నియోజకర్గంలో ముఖ్యంగా పట్టణంలో టీడీపీ చుక్కాని లేని పడవలా ఊగిసలాడుతోంది. నడిపించే నాయకుడు లేక తలో దారి అన్నట్టుగా మారింది. జెంటిల్మన్ ఒప్పందం అమలు తర్వాత పట్టణంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఇరు పక్షాలు మాటల తూటాలను పేల్చుతున్నారు. అది ఎంత వరకు వెళ్లిందంటే ఫేస్బుక్ ఫైట్ వరకూ వెళ్లింది. కొందరు సమర్థిస్తూ.. మరికొందరు వ్యతిరేకిస్తూ.. పార్టీలో ఓ వర్గానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి దాదాపు రూ.ఐదు కోట్లతో నిర్మించిన చంద్రబాబు ఆరోగ్య ఉద్యానవనం, డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు ఆరోగ్య ఉద్యానవనాల పనుల్లో దాదాపు రూ.మూడు కోట్ల మేర అవినీతి (స్కామ్) జరిగిందని, అదే పార్టీకి చెందిన మరో మాజీ ప్రజాప్రతినిధి వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ ఏకంగా తన ఫేస్బుక్లో ఆరోపణలు గుప్పిస్తూ తాను దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ ఫేస్బుక్ ఆరోపణలను స్పందిస్తూ అదే పార్టీకి చెందిన కొందరు సమర్థిస్తూ... మరికొందరు వ్యతిరేకిస్తూ పలు రకాల కామెంట్లు ఫేస్బుక్లో పెడుతున్నారు. ప్రస్తుతం అమలాపురం నియోజకవర్గ ప్రజల్లో ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో ఈ ఫేస్బుక్ ఫైట్‌పై ఆసక్తికరంగా మారింది. ఆ రెండు పార్కుల్లో ఎర్త్ వర్కుల నుంచి పార్కుల మొక్కలు, ప్రతిమలు కొనుగోళ్ల వరకూ ఇలా ప్రతి అంశంలోనూ అవినీతి జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలు వింటున్న.. ఫేస్‌బుక్‌ల్లో చూస్తున్న ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఈ విషయంలో ఎందుకో మౌనంగానే ఉన్నారు. అలాగే గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రస్తుత పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సైతం నియోజకవర్గ పార్టీపరమైన అంశాలకు దూరంగా ఉంటున్నారు. మధ్యే మార్గంగా పట్టణ టీడీపీకి దిక్సూచిలా ఉండే పార్టీ నేత మెట్ల రమణబాబు కూడా ఎన్నికల తర్వాత స్తబ్ధుగా ఉండడంతో ముఖ్యంగా పట్టణంలో పార్టీ సొంత కేడర్‌పై పట్టు కోల్పోతున్నట్టవుతోంది. ఆ రెండు పార్కుల్లో అవినీతి చోటుచేసుకుందని అప్పట్లో ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. అప్పట్లో కొందరు టీడీపీ నేతలు మున్సిపల్ పదవులను అడ్డుపెట్టుకుని ఈ పార్కుల్లో అధిక ధరలతో అంచనాలు, కొనుగోళ్లలో మాయాజాలం, ఎర్త్ వర్కుల్లో ఇంజినీరింగ్ ఎంబుక్‌ల రికార్డులు, పొక్లెయిన్ల అద్దెల్లో అవకతవకలు ఇలా పలు అంశాలపై ‘సాక్షి’ కథనాల్లో ప్రస్తావించిన విషయాలు విదితమే. -
డాక్టర్ కుటుంబం ఆత్మహత్యకు ఈ ముఠానే కారణం!
సాక్షి, అమలాపురం(తూర్పు గోదావరి) : అమలాపురంలో డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్యహత్య చేసుకున్న ఘటనలో లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చేస్తున్న దర్యాప్తులో రైస్ పుల్లింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. హైదరాబాద్ కేంద్రంగా నలుగురు వ్యక్తులతో కూడిన ఈ ముఠా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక మందిని ఈ రైసు పుల్లింగ్ ఊబిలోకి లాగి రూ.కోట్లు కాజేస్తోందని పోలీసులు గుర్తించారు. ఈ అంతర్రాష్ట్ర ముఠాలో సభ్యుడైన కృష్ణా జిల్లా కోడూరు గ్రామానికి చెందిన వరికూటి వెంకటవేణుధర ప్రసాద్‌ను అమలాపురం పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రోజే అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా ఆదేశాలతో నాలుగు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ముఠా సభ్యుడైన వేణుధర ప్రసాద్‌ను అమలాపురం బస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం పట్టణ సీఐ బి.సురేష్‌బాబు అరెస్ట్ చేశారు. రైస్ పుల్లింగ్ ముఠా సూత్ర, పాత్రధారి అయిన హైదరాబాద్‌కు చెందిన షావలిన్, ముఠాలోని మిగిలిన సభ్యులు అనంతరామ్, శ్రీనివాసరావులను అరెస్ట్ చేయాల్సి ఉందని డీఎస్పీ బాషా తెలిపారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్రంలో తమ పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని చెప్పారు. మన రాష్ట్రంలోనూ వీరి కోసం పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు. డాక్టర్ కుటుంబం నుంచి రూ.ఐదు కోట్లు గుంజుకున్న ముఠా ముఠా సభ్యుడైన వెంకట వేణుధర ప్రసాద్‌ను అరెస్ట్ అనంతరం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ బాషా మంగళవారం ఉదయం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అమలాపురం పట్టణ, రూరల్, ముమ్మిడివరం సీఐలు బి.సురేష్‌బాబు, ఆర్.భీమరాజు, రాజశేఖర్‌లతో కలిసి ముఠా వివరాలను వెల్లడించారు. ఏడాది నుంచి డాక్టర్ రామకృష్ణంరాజు ఈ ముఠా మాయమాటల్లో పడినట్టు చెప్పారు. తొలుత వేణుధరప్రసాద్ డాక్టర్‌కు పరిచయమై రైస్ పుల్లింగ్ ఆశ పుట్టించాడు. తర్వాత డాక్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రధాన నిందితుడు షావలిన్‌కు పరిచయం చేశాడు. దైవాంశ సంభూతమైన పురాతన విగ్రహాలు, నాణేలు, పాత్రల గురించి డాక్టర్‌కు వివరించి వాటి వల్ల రుణ విముక్తి కావడమే కాకుండా అష్టైశ్వర్యాలు ఎలా ప్రాప్తిస్తాయో తన ముఠాలోని సభ్యులతో ఆయనకు చెప్పించి నమ్మించాడు. రైస్‌పుల్లింగ్‌లో ఇవ్వబోయే పురాతన వస్తువు విలువ రూ.కోట్లలో ఉంటుందని మానసికంగా సిద్ధం చేశారు. మీ కోసం రైస్ పుల్లింగ్ వస్తువు తయారవుతోందని డాక్టర్ కుటుంబం నుంచి ముఠా దఫదఫాలుగా నగదు రూపంలో, బ్యాంక్ ఖాతాల ద్వారా తీసుకుంది. ఇందు కోసం డాక్టర్ అధిక మొత్తాలను అధిక వడ్డీలకు అప్పు చేసి రూ.ఐదు కోట్లు ముఠాకు అతికష్టంగా సరిపెట్టారు. చివరకు ఈ ముఠా చేసిన మోసాలకు బలి అయ్యానని డాక్టర్ కుటుంబం గ్రహించి ఇటీవల హైదరాబాద్ వెళ్లి రెండు వారాలు ఉండి పొగొట్టుకున్న రూ.ఐదు కోట్లను ఏలాగైనా రాబట్టుకోవాలని విశ్వప్రయత్నం చేసి విఫలమైంది. ఇంతటి ఘోరమైన మోసానికి గురైన డాక్టర్ కుటుంబం చివరకు తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్యకు ఒడిగట్టిందని డీఎస్పీ బాషా తెలిపారు. డాక్టర్ పెద్ద కుమారుడు, మృతుడు డాక్టర్ కృష్ణ సందీప్ సూసైడ్ నోట్, డాక్టర్ చిన్న కుమారుడు కృష్ణ వంశీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీ నయీమ్ అస్మీ ఆదేశాల మేరకు రైస్ పుల్లింగ్ మోసాలు, ముఠాపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వివరించారు. -
డాక్టర్ ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్ట్
-
ఆ ముగ్గురి మోసమే కొంపముంచింది
వైద్యుడి సూసైడ్ నోట్లో గుండెలు పిండేసే నిజాలు.. ఆత్మహత్య అంటే మరణాన్ని కోరుకోవడం కాదు.. బతకాలనే కోరికకు, బతకలేని నిస్సహాయతకు మధ్య పెనుగులాట... నన్ను రక్షించండంటూ... వేడుకొనే ఓ ఆర్తనాదం...ఆత్మహత్య చేసుకునేవారి స్థితిపై మానసిక నిపుణుల విశ్లేషణ... అమలాపురం వైద్య కుటుంబ విషాదం విషయంలో ఇది నిజం. వారు చేసిన అప్పు కొంతైతే...నమ్మించి కాటేసిన నమ్మక ద్రోహుల వెన్నుపోట్లు ఉన్నాయి. తమ ముగ్గురి మరణాలకు మరో ముగ్గురి మాయమాటలే కారణమని వైద్యుడు కృష్ణ సందీప్ తన నోట్లో ఆత్మహత్య చేసుకునే ముందు ఆవేదనా భరితంగా రాసుకున్నాడు. మా జీవితాలు ఇంత సిల్లీగా ముగిసిపోతాయని మేమెప్పుడూ ఊహించలేదు...మా నాన్నగారి అతి మంచితనమే మా తనువులను తుంచేది. సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి) పట్టణంలో సంచలనం కలిగించిన డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్యకు రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులు ముగ్గురు చేసిన మోసమే ప్రధాన కారణమని ఆయన పెద్దకుమారుడు డాక్టర్ కృష్ణసందీప్ రాసిన సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది. దానివల్లే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ కుటుంబం ఆత్మహత్య దిశగా అడుగులు వేసింది. డాక్టర్ కృష్ణ సందీప్ తమ సూసైడ్ నోట్లో ‘మా జీవితాలు ఇంత సిల్లీగా ముగిసిపోతాయని మేమెప్పుడు ఊహించలేదు.. నాన్నగారు అందరినీ సునాయాసంగా నమ్మేస్తారు. అందుకే కొందరి చేతుల్లో ఘోరంగా మోసపోయారు. చివరకు హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు నాన్నగారిని నమ్మించి రూ.ఐదు కోట్ల వరకూ మోసం చేశారు.’ అని పేర్కొన్నారు. ఈ నోట్లో కృష్ణ సందీప్ తమ తండ్రి మంచితనం, అందరినీ నమ్మే గుణాన్ని ఉటంకిస్తూ అప్పులు చేసే ముందు... ఏవేవో నమ్మకాలతో ఎవరివెరినో నమ్మే ముందు కుటుంబ సభ్యులమైన తమతో చర్చించకుండా తీసుకున్న నిర్ణయాల వల్లే తమ కుటుంబానికి ఇంతటి దారుణమైన ముగింపు వచ్చిందని రాశారు. ‘హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు నాన్నగారిని రైస్పుల్లింగ్తో మీ అప్పులన్నీ తీరిపోయి ధనిక స్థితి వస్తుందని సెంట్‌మెంట్‌తో నమ్మించారు’ అని డాక్టర్ కృష్ణ సందీప్ నోట్లో పేర్కొన్నారు. ‘బియ్యాన్ని ఆకర్షించే విగ్రహం లేదా దైవానికి సంబంధించిన వస్తువును మీ వద్ద ఉంచుకుంటే అది మీ జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తుంద’ని రైస్‌పుల్లింగ్ ముఠా సభ్యులు నమ్మిస్తారు. అత్యంత మహిమ కలిగినది అంటూ విగ్రహం లేదా దైవానికి సంబంధించిన వస్తువు చుట్టూ బియ్యాన్ని వలయాకారంలో ఉంచుతారు. కొన్ని శాస్త్రీయ ప్రక్రియలతో ఆ బియ్యం అయస్కాంతానికి ఇనుము ఆకర్షించబడినట్టు ఆ విగ్రహం లేదా వస్తువు వద్దకు వచ్చేస్తాయి. అలా హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు మోసగాళ్లు డాక్టర్ రామకృష్ణంరాజును ఈ రైస్ పుల్లింగ్లోకి లాగారు. వారికి ఆయన ఒకసారి రూ.రెండు కోట్లు, మరోసారి రూ.3 కోట్లు ఇచ్చారు. ఈ రైస్ పుల్లింగ్‌లో నిలువునా మోసపోయిన రామకృష్ణంరాజు ఈ రూ.5 కోట్ల కోసం అప్పులు చేశారు. బ్యాంక్‌లు, ప్రైవేటు ఫైనాన్సర్లనుంచి ఈ రుణాలు తీసుకున్నారు. ఈ ఒత్తిడి పెరగడానికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగిన ఆయనకు అది కూడా కలసి రాలేదు. అప్పుల భారం తడిసి మోపెడయ్యింది. ఇదే విషయాన్ని డాక్టర్ కృష్ణ సందీప్ సూసైడ్ నోట్లో అత్యంత దీనంగా వివరించారు. ‘అసలు మా అమ్మ, మా ఇద్దరి అన్నదమ్ముల సంతకాలు లేకుండా నాన్న గారి ఒక్క సంతకంతో మా ఆస్తులన్నీ కోల్పోవలసిందేనా?’ అని ఆయన ఆవేదనగా అక్షరరూపంలో ఆడిగారు. ‘ఎవరినీ క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాం’ అంటూ కృష్ణ సందీప్ ఆ నోట్లో సంతకం చేసి తన ఉత్తరాన్నే కాదు.. జీవితాన్నే ముగించారు. రైస్‌పుల్లింగ్ ముఠా కోసం హైదరాబాద్‌కు పోలీసు బృందాలు డాక్టర్ రామకృష్ణంరాజును రైస్‌పుల్లింగ్ పేరుతో మోసం చేసిన ముగ్గురు వ్యక్తుల కోసం గాలించేందుకు మూడు పోలీసు బృందాలను తెలంగాణ రాష్ట్రానికి పంపించారు. రామకృష్ణంరాజు స్వస్థలమైన కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చిలకలపేటకు కూడా ఓ పోలీసు బృందాన్ని పంపించారు. సూసైడ్ నోట్లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి పేర్లను డాక్టర్ కృష్ణ సందీప్ రాశారు. ఆ సూసైడ్ నోట్‌ను డాక్టర్ రామ కృష్ణంరాజు బంధువుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకుని దాని ఆధారంగా లోతుగా విచారణ చేస్తున్నారు. కాగా నాన్న, అమ్మ, అన్నయ్య మరణాలతో చిన్న కుమారుడు కృష్ణవంశీ కోలుకోలేకపోతున్నారు. బంధువులు అతనికి మానసిక ధైర్యం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. డాక్టర్ కుటుంబ సభ్యుల మృతదేహాలను శుక్రవారం సాయంత్రం పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాత్రి పది గంటలకు పోస్టు మార్టం పూర్తయ్యాక మృతదేహాలను బంధువులకు అప్పగించారు. మృత దేహాలకు రాజమహేంద్రవరం రోటరీ శ్మశాన వాటికలో శనివారం దహన సంస్కారం చేశారు. ఎంపీ అనురాధ పరామర్శ అమలాపురం టౌన్: డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దయనీయమని ఎంపీ చింతా అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె డాక్టర్ రామ కృష్ణంరాజు ఇంటిని శుక్రవారం సాయంత్రం సందర్శించి డాక్టర్ రెండో కుమారుడు కృష్ణ వంశీని పరామర్శించి ఓదార్చారు. అప్పటికీ అక్కడే ఉన్న డాక్టర్, ఆయన భార్య, పెద్ద కుమారుడు మృత దేహాలను చూసి చలించారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను రూరల్ సీఐ ఆర్.భీమరాజు ఎంపీ అనురాధకు వివరించారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ నాయకుడు, న్యాయవాది తాళ్ల సాంబమూర్తి తదితరులు ఉన్నారు. చదవండి : వైద్య వనంలో విషాదం.. -
ఒంటరైన కృష్ణవంశీ
తన వద్దకు వివిధ రోగాలతో వచ్చిన ఎంతో మంది రోగులకు సాంత్వన చేకూర్చే చేయి అది... వెంటాడిన రోగంతో జీవితంపైనే విసిగి, వేసారిన బాధాతప్త హృదయాలకు పలు సూచనలిచ్చి ధైర్యం నింపిన ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడాయన.భగవంతుడు ఇచ్చిన జీవితంలో లోపాలుంటే మంచి వైద్యంతో సరిదిద్దుకొని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని ధైర్యం నూరిపోసి జన జీవన స్రవంతిలో కలిసేటట్టు చేసిన వైద్యుడాయన..మానవ శరీరంలో ఎన్నో ఎముకలు, ఆ అమరికలో తేడాలొచ్చి మొరాయిస్తే సరి చేసి నొప్పులను మటుమాయం చేసే హస్తవాసి ఆయనది... అమలాపురంలో ఓ నర్సింగ్ హోం ...రోగులకు అందుబాటులో ఉండడమే కాదు ... తన ఇద్దరు కొడుకులను కూడా వైద్య విద్యవైపే అడుగులు వేయించిన ముందుచూపున్న తండ్రి ఆయన... పెద్ద కుమారుడు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎముకల వైద్యంలో ఎండీ చేయాలని సమాయత్తమవుతున్నాడు...చిన్న కుమారుడు కూడా ఎంబీబీఎస్ చదువుతూ అదే బాటలో పయనిస్తున్నాడు. సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి) : ఆస్తులకు మించి ఉన్న అప్పుల భారం నుంచి శాశ్వతంగా దూరమయ్యేందుకు ఆ వైద్యుడి కుటుంబం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడింది. రూ.కోట్లలో స్థిరాస్తులున్నా.. అంతకుమించిన రూ.10 కోట్లకు పైగా అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరకు తనతో పాటు తన భార్య, తన పెద్ద కుమారుడి ఊపిరి తీసుకున్నారు. అమలాపురం కాలేజీ రోడ్డులో సుబ్రహ్మణ్యస్వామి గుడి వీధిలో ఉన్న శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ అండ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పెన్మత్స రామకృష్ణంరాజు కుటుంబం శుక్రవారం ఉదయం ఈ అఘాయిత్యానికి పాల్పడింది. డాక్టర్ రామకృష్ణంరాజు (55), ఆయన భార్య లక్ష్మీదేవి (45), వారి పెద్ద కుమారుడు డాక్టర్ కృష్ణ సందీప్ (25) బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. వీరి చిన్న కుమారుడు కృష్ణవంశీ రాజమహేంద్రవరం జీఎస్ఎల్ వైద్య కళాశాలలో ఆఖరి సంవత్సరం వైద్య విద్య చదువుతున్నాడు. సామూహికంగా ఆత్యహత్య చేసుకునేందుకు చిన్న కుమారుడిని కూడా తండ్రి రమ్మని పిలిచినా పనుండి రాకపోవడంతో కృష్ణ వంశీ చావు నుంచి తప్పించుకున్నాడు. అయితే మొత్తం కుటుంబాన్నే కోల్పోయి కోలుకోలేని దెబ్బతిన్నాడు. శుక్రవారం ఉదయం డాక్టర్, మందుల షాపును నిర్వహించే ఆయన భార్య తాము నివాసం ఉండే పై అంతస్తు నుంచి కింద ఉన్న హాస్పిటల్‌కు రాకపోవడంతో సిబ్బంది పైకి వెళ్లి చూడగా మెట్ల వద్ద గేటుకు తాళం వేసి ఉంది. ఫోన్లు చేసినా స్పందన లేకపోవడంతో అనుమానంతో సిబ్బంది గోడ దూకి వెళ్లి తలుపులు గెంటి చూడగా డాక్టర్ కుటుంబీకులు నేలపై విగత జీవులై పడి ఉన్నారు. ఉలిక్కిపడిన అమలాపురం డాక్టర్ కుటుంబం ఆత్యహత్యతో అమలాపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చిలకలపేటకు చెందిన డాక్టర్ రామకృష్ణంరాజు సౌమ్యుడు. పాతికేళ్ల క్రితం కోనసీమకు చెందిన లక్ష్మీదేవిని ఆయన పెళ్లి చేసుకుని అమలాపురంలో ఆర్థోపెడిక్ వైద్యుడిగా స్థిరపడ్డారు. అమలాపురం కాలేజీ రోడ్డులో హస్పిటల్ భవనాన్ని, నివాస గృహాన్ని కలిపి సువిశాలంగా నిర్మించుకున్నారు. పది మంది సిబ్బందితో ఎప్పుడూ పేషంట్లతో హడావుడిగా ఉండే ఆ ఆసుపత్రి డాక్టర్ కుటుంబం ఆత్మహత్యతో ఒక్కసారిగా కళతప్పి నిస్తేజంగా మారింది. డాక్టర్ ద్వారా చికిత్సలు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న పట్టణానికి చెందిన అనేక మంది ఆయన కుటుంబం ఆత్మహత్య వార్త తెలిసి భారీగా అక్కడికి తరలివచ్చి విలపించారు. ఆత్యహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం ఆత్యహత్య చేసుకునే ముందు డాక్టర్ తన సొంత దస్తూరీతో సూసైడ్ నోట్ రాశారు. అందులో అప్పుల పాలు ఎలా అయ్యాను. ఎందుకు తీర్చలేకపోయాను. తనను ఎవరెవరు మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఎవరెవరు విపరీతంగా ఒత్తిళ్లు చేశారు. ఎవరు తన వద్ద నుంచి రూ.రెండు కోట్లు తీసుకుని మోసం చేశారు. తనకు ఇవ్వాల్సిన వారు ఇవ్వకుండా తనను ఎంత ఇబ్బంది పెట్టారో ఆ నోట్లో రాశారు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక తన కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతోందని ఆ నోట్లో రాశారు. ఈ సూసైడ్ నోట్‌ను డీఎస్పీ బాషా స్వాధీనం చేసుకున్నారు. ఈ నోట్లోని వివరాల దిశగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా, అమలాపురం పట్టణ సీఐ బి.సురేష్‌బాబు, రూరల్ సీఐ ఆర్.భీమరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించింది. డాక్టర్ రామకృష్ణంరాజు, భార్య లక్ష్మీదేవి, కుమారుడు డాక్టర్ కృష్ణ సందీప్ అప్పులపాలైంది ఇలా.. మూడేళ్ల క్రితం వరకూ డాక్టర్ రామకృష్ణంరాజు కుటుంబం, ఆసుపత్రి అంతా సజావుగా సాగిపోయింది. తన ఇద్దరు కుమారులను డాక్టర్లను చేయాలన్న కలను నెరవేర్చుకున్నారు. పెద్ద కుమారుడు డాక్టర్ అయ్యాడు. చిన్న కుమారుడు త్వరలో డాక్టర్ కాబోతున్నాడు. ఇటీవల కాలంలో డాక్టర్ కృష్ణంరాజు భూములు కొనుగోలు చేయడం, లాభాలకు విక్రయించడం ఇలా క్రమేపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు వెళ్లారు. రూ.కోట్లతో భూములు క్రయ, విక్రయాలు సాగేవి. వీటిలో ఆయన విపరీతంగా నష్టపోయారు. దీంతో విధిలేక తొలుత వాణిజ్య బ్యాంకుల్లో...తర్వాత ప్రైవేటు ఫైనాన్సర్ల వద్ద అప్పలు చేశారు. రూ.10 వడ్డీలకు ఆయన ప్రైవేటు అప్పులు చేశారు. వాటి చెల్లింపులపై నెల రోజులుగా విపరీతమైన ఒత్తిళ్లు పెరిగిపోయాయి. మూడు రోజుల్లో బ్యాంక్ అధికారులు, వడ్డీ వ్యాపారులు ఆసుపత్రికి, ఇంటికి వచ్చి ఆస్తులు జప్తు చేస్తామన్న హెచ్చరికలు కూడా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ తన ఇల్లు, ఆస్పత్రి కలిపి ఉన్న విశాలమైన భవనాన్ని కూడా ఇటీవల బేరం పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫైనాన్సియర్ ‘మీ అప్పులు పూర్తిగా తీర్చేలా మార్గం నేను చూస్తాను. అప్పు ఎంతో ఉందో అంత మొత్తం నేనే అప్పుగా ఇస్తాను. ముందు రూ.రెండు కోట్లు చెల్లించమ’ని చెప్పిన మాటలను డాక్టర్ నమ్మేసి అంత మొత్తం అతికష్టంగా సమకూర్చారు. తర్వాత ఆ ఆసామి ఆ డబ్బును కాజేసి నమ్మక ద్రోహం చేశాడు. ఆ మోసాన్ని కూడా డాక్టర్ తట్టుకోలేకపోయి మానసికంగా కుంగిపోయారు. ఆన్లైన్ లావాదేవీలతో తనను కొందరు మోసం చేసినట్టు ఆస్పత్రి సిబ్బంది వద్ద తరచూ చెప్పి డాక్టర్ విలపించేవారు. ఒంటరైన కృష్ణవంశీ నాన్న, అమ్మ, అన్నయ్య ఒకేసారి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాన్ని చూసి మృతుడు డాక్టర్ రామకృష్ణంరాజు చిన్న కుమారుడు, వైద్య విద్యార్థి కృష్ణ వంశీ తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన తండ్రి గురువారం సాయంత్రం ఫోన్ చేసి ‘అప్పుల భారాన్ని ఇక తట్టుకోలేను. మనమందరం కలసి ఆత్మహత్యలు చేసుకుందాం...నువ్వు కూడా రాజమహేంద్రవరం నుంచి వచ్చేయ్’అని అన్నారు. అయితే కృష్ణ వంశీ తన తండ్రిని ఫోన్లోనే సముదాయించి కంగారు పడకండి.. నాకు రేపు ఉదయం (శుక్రవారం) పరీక్ష ఉంది. అది రాసి రేపు సాయంత్రానికి వస్తాను. అప్పటి దాకా ఎలాంటి ఆలోచన్లు వద్దు అని చెప్పాడు. అయితే ఉదయాన్నే నాన్న, అమ్మ, అన్నయ్య ఆత్యహత్యలు చేసుకున్నారన్న ఫోన్‌తో కృష్ణవంశీ రాజమహేంద్రవరం జీఎస్ఎల్ వైద్య కళాశాల నుంచి వచ్చాడు. తన కుటుంబంలో అందరూ ప్రాణాలు తీసుకోవడంతో కృష్ణ వంశీ ఒంటరైపోవడాన్ని చూసి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి : డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..! -
అమలాపురంలో విషాదం
-
షాక్‌లో డాక్టర్ కృష్ణంరాజు బంధువులు
సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి జిల్లా): ప్రముఖ వైద్యుడు పెనుమత్స రామకృష్ణంరాజు తన భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడటంతో బంధువులు, శ్రీకృష్ణ ఆర్దోపెడిక్ ఆసుపత్రి సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. మంచి వైద్యుడిగా పేరుగాంచిన కృష్ణంరాజు బలవన్మరణాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. రామకృష్ణంరాజు రెండవ కుమారుడు కృష్ణవంశీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ కృష్ణంరాజు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనేది ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ప్రాణాలు తీసుకునివుండొచ్చని అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన కారణంగానే కుటుంబంతో కలిసి ఆయన ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేట్టారు. (ప్రాథమిక వార్త: డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..!) -
అమలాపురంలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య
-
డాక్టర్ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..!
సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలోని అమలాపురంలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ పెనుమత్స రామ కృష్ణంరాజు అలియాస్ కృష్ణంరాజు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్ కృష్ణంరాజు(55), ఆయన భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు కృష్ణసందీప్ (25) బలవన్మరణానికి పాల్పడ్డారు. కృష్ణసందీప్ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసినట్టు సమాచారం. రెండో కొడుకు కృష్ణవంశీ రాజానగరంలోని జీఎస్ఎల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులే ఈ ఆత్మహత్యలకు కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. పాయిజన్ ఇంజక్షన్ తీసుకోవడంతో ముగ్గురూ ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. అమలాపురంలోని సొంతింటిలో కృష్ణంరాజు కుటుంబం విగతజీవులుగా పడిఉండటాన్ని గమనించిన వారి ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హమ్మయ్య..!
ఒకటి కాదు.. రెండు కాదు తొమ్మిది రోజులుగా మహోగ్రరూపమెత్తిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ఇటు గోదావరి, అటు శబరి పోటెత్తడంతో విలవిలలాడిన ఏజెన్సీ వాసులు నెమ్మదిగా తేరుకుంటున్నారు. వరద ఉధృతి తగ్గుతున్నా కోనసీమ లంకలను ఇంకా ముంపు వీడలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం రాత్రి ఏడు గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 10.80 అడుగులకు తగ్గింది. సాక్షి, తూర్పుగోదావరి : ఈ నెల 2న మొదలైన గోదావరి వరద ఉధృతికి ఏజెన్సీ, కోనసీమ లంకల్లోని వందల ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వరద నీటిలో రోజుల తరబడి ఉండడంతో పలుచోట్ల ఇళ్లు నానిపోయి కుప్పకూలిపోతున్నాయి. ప్రభుత్వం పక్కాగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టడంతో బాధితులకు సాంత్వన చేకూరింది. ఆర్థిక సహాయం ప్రకటించడంతో సామాన్యులు, నిరుపేదలు, మత్స్యకారులకు, రైతులకు ఊరట కలిగింది. అయినప్పటికీ రోజుల తరబడి ముంపులో ఉండడంతో ఏజెన్సీ, లంక వాసుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. సోమవారం సాయంత్రం తరువాత కానీ ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపించడం లేదు. ఇంకా ముంపులోనే దేవీపట్నం ఏజెన్సీలో గోదావరి వరద తగ్గుముఖం పట్టినా కొన్ని ప్రాంతాల్లోని రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. దీంతో రాకపోకలు పూర్తిస్థాయిలో ఆరంభం కాలేదు. దేవీపట్నం కూడా ఇంకా ముంపులోనే ఉంది. ఇక్కడ వరద ఉధృతి చాలావరకూ తగ్గింది. మండల పరిధిలోని తొయ్యేరు చప్టా, దండంగి, వీరవరం వద్ద రహదారులు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఫలితంగా మండల పరిధిలోని గ్రామాల మధ్య రాకపోకలు పునరుద్ధరణ జరగలేదు. ఇళ్లలో చాలావరకూ నీరు తీసింది. తొమ్మిది రోజులుగా ముంపులో ఉన్న పూరిళ్లు నానిపోయి కూలిపోతున్నాయి. దేవీపట్నం మత్స్యకార కాలనీ, తొయ్యేరు, పూడిపల్లి ఎస్సీ కాలనీలను ముంపు వీడలేదు. చాలామంది పునరావాస కేంద్రాల నుంచి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటూండగా, మరికొంతమంది పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. ఇక్కడ సోమవారం సాయంత్రం నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముంది. గోదావరి తగ్గుముఖం పడుతూండడం, శబరి సాధారణ స్థితికి చేరడంతో విలీన మండలాల్లో రాకపోకలకు మార్గం సుగమమైంది. శనివారం వరకూ 30, 326 జాతీయ రహదారులపై వరద నీరు ప్రవహించడంతో ఇక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ముంపు వీడడంతో చింతూరు నుంచి ఆయా ప్రాంతాలకు ఆదివారం రాకపోకలు ఆరంభమయ్యాయి. రోడ్డు మునిగిపోవడంతో చింతూరు మండలం చట్టి వద్ద సుమారు 150 వరకూ లారీలు, బస్సులు నిలిచిపోయాయి. ఇది తెలిసి సుదూర ప్రాంతాలవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించారు. రహదారుల్లో ముంపు వీడిందని తెలియడంతో రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం నుంచి ఆయా రాష్ట్రాలకు వెళ్లే లారీలు, బస్సుల రాకపోకలు నెమ్మదిగా మొదలయ్యాయి. చింతూరు నుంచి వీఆర్ పురం మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై కూడా ముంపు తగ్గడంతో రాకపోకలు ఆరంభమయ్యాయి. అయితే వీఆర్ పురంలో కన్నాయిగూడెం – చింతరేవుపల్లి వద్ద వాగు ఇంకా పొంగుతూండడంతో ఎనిమిది గ్రామాల మధ్య రాకపోకలు ప్రారంభం కాలేదు. కూనవరం మండలంలో వరద ప్రభావం చాలావరకూ తగ్గింది. జలదిగ్బంధంలోనే కోనసీమ లంకలు కోనసీమలోని పి.గన్నవరం మండలంలో ఇంకా ఆరు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఐదు గ్రామాల ప్రజలు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. కె.ఏనుగుపల్లి రహదారిపై రెండడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీటిలోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. మామిడికుదురు మండలంలోని మూడు గ్రామాలు ఇప్పటివరకూ బాహ్య ప్రపంచంతో సంబంధాల పునరుద్ధరణకు నోచుకోలేదు. అప్పనపల్లి కాజ్వే వద్ద శుక్రవారం గల్లంతైన ఇద్దరు యువకుల్లో కాకినాడ రూరల్ మండల రేపూరుకు చెందిన షేక్ సమీర్ బాషా (23), పెదపట్నం గ్రామానికి చెందిన షేక్ రెహ్మాన్ అలియాస్ నాని (17) మృతదేహాలను ఆదివారం ఉదయం వెలికి తీశారు. మామిడికుదురు మండలంలోని పలు గ్రామాల్లో పడవల ద్వారా, అప్పనపల్లి ఉచ్చులవారిపేట వెళ్లే రహదారిపై వరద నీరు తగ్గడంతో ట్రాక్టర్ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయినవిల్లి మండలం ఎదురుబిడిం కాజ్‌వేపై కూడా ఇంకా పడవల పైనే రాకపోకలు జరుగుతున్నాయి. మండల పరిధిలోని ఏడు గ్రామాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. అల్లవరం మండలం బోడసకుర్రు కూడా ఇంకా ముంపులోనే ఉంది. ఇక్కడ ఒక అడుగు మాత్రమే వరద తగ్గింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మట్టితో నిర్మించిన మత్స్యకారుల ఇళ్లు కరిగి, కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. మండల వ్యాప్తంగా 114 ఇళ్లు ముంపు బారిన పడ్డాయి. బోడసకుర్రులో 180 ఎకరాల్లో నారుమళ్లు, వరినాట్లు నీట మునిగాయి. మరో రెండు రోజులు గడిస్తేనే కానీ ఇక్కడ ముంపు తగ్గే అవకాశం లేదు. మలికిపురం మండలం రామరాజులంక లోతట్టు ప్రాంతాలు, సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలోను ఇంకా పడవల మీదనే రాకపోకలు సాగిస్తున్నారు. ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు, ముమ్మిడివరం మండలాల్లో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. తీవ్రమవుతున్న నదీకోత గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నదీకోత తీవ్రత ఎక్కువగా ఉంది. ఆలమూరు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, పి.గన్నవరం, మామిడికుదురు మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో కోత తీవ్రమవుతోంది. వరద పెరిగిన సమయంలోను, తిరిగి తగ్గుతున్న సమయంలోను కోత తీవ్రత అధికంగా ఉందని రైతులు చెబుతున్నారు. వందల సంఖ్యలో కొబ్బరి చెట్లు నదిలో కలిసిపోతున్నాయి. ఆలమూరు మండలం బడుగువానిలంక, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం, కమిని, గురజాపులంక, లంకాఫ్ ఠాన్నేల్లంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వంటి ప్రాంతాల్లో కోత తీవ్రత అధికంగా ఉంది. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి గోదావరి వరద వీడిన తరువాత రెట్టింపు సమస్యలు ఎదురవుతాయి. బురద పేరుకుపోయిన రోడ్లు, ఎక్కడెక్కడి నుంచో కొట్టుకువచ్చే వ్యర్థాలు.. ఇళ్ల చుట్టూ ముంపునీరు.. కలుషితమయ్యే భూగర్భ జలాల వల్ల ప్రజలు అంటురోగాల బారిన పడే ప్రమాదముంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం పారిశుద్ధ్య చర్యలు పక్కాగా చేపట్టాల్సి ఉంది. -
ఆప్టింగ్ డ్రైవర్.. యాక్టింగ్ చోరీ
సాక్షి, అమలాపురం : ఓ డాక్టర్గారి కారుకు తరచూ ఆప్టింగ్ డైవర్‌గా వెళ్లే ఓ యువకుడు ఆ ఇంటి ఆనుపానులు అన్నీ తెలుసుకొని స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. డాక్టర్ హైదరాబాద్ వెళ్లగా ఇంట్లో ఆయన భార్య మాత్రమే ఉన్న సమయంలో తన స్నేహితులతో చోరీ చేయించాడు. ఆమె మెడలోని రూ.1.32 లక్షల విలువైన 44 గ్రాముల బంగారు నగలు కాజేశారు. ఈ సంఘటన జరిగిన పదిరోజులు కాకుండానే రాజోలు పోలీసులు నిందితులను అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపరిచారు. ఆ వివరాలను ఆదివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో అమలాపురం డీఎస్పీ షేక్ మసూమ్ బాషా రాజోలు సీఐ కె.నాగమోహరెడ్డి, ఎస్సై ఎస్.శంకర్‌లతో కలసి విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో డాక్టర్ గాదిరాజు నారాయణరాజు కొన్నేళ్లుగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన కొంబత్తుల శ్యామలరావు అలియాస్ శ్యామ్ కొన్నేళ్లుగా డాక్టర్ సూర్యనారాణరాజు కారుకు డ్రైవర్ అవసరమైతే ఆప్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. డాక్టర్ ఎక్కడకైనా వెళ్లాల్సివస్తే శ్యామ్‌కు ఫోన్ చేసి ఆప్టింగ్ డ్రైవర్‌గా తీసుకు వెళుతున్నారు. శ్యామ్ డాక్టర్ కుటుంబం నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. గత నెల 26వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ సూర్యనారాయణరాజు శ్యామ్‌కు ఫోన్ చేసి తాను హైదరాబాద్ వెళ్తున్నానని, కారుకు ఆప్టింగ్ డ్రైవర్‌గా రావాలని చెప్పారు. అయితే అదే సమయానికి తన ఆస్పత్రిలో డ్రైవింగ్ వచ్చిన కాంపౌండర్ అందుబాటులో ఉండడంతో డాక్టర్ నారాయణరాజు శ్యామ్‌కు ఫోన్ చేసి అవసరం లేదని చెప్పారు. డాక్టర్ ఊరు వెళ్లడంతో సాయంత్రం ఆరు గంటలైతే ఆసుపత్రి సిబ్బంది వెళిపోతారు. ఇంట్లో డాక్టర్ భార్య రాణి సంయుక్త (72) మాత్రమే ఉంటారు. ఆమె దివ్యాంగురాలు. ఈ పరిస్థితులను శ్యామ్ అదనుగా తీసుకున్నాడు. తన స్నేహితులైన ఏనుగుపల్లి ధర్మరాజు అలియాస్ ధర్మ, నేరేడుమిల్లి రాజువర్మ అలియాస్ రాజేష్, మాదాసి వెంకటేష్ అలియాస్ చిన్న, మర్లపూడి ప్రేమ్బాబుతో కలిసి డాక్టర్ ఇంట్లో చోరీకి ప్లాన్ చేశాడు. ఈ అయిదుగురూ యువకులే. డాక్టర్ భార్యపై దాడి..ఆపై చోరీ 26వ తేదీ సాయంత్రం ఆరు గంటలు దాటాక చీకటి పడ్డాక ఆసుపత్రి పై అంతస్తులో ఉన్న డాక్టర్ ఇంట్లోకి ధర్మ, రాజేష్ వెళ్లారు. ఆసుపత్రి గేటు వద్ద ఒకరు కాపలా ఉన్నారు. ఆసుపత్రి బయట రోడ్డుపై మరో స్నేహితునితో కలిసి రెండు మోటారు సైకిళ్లపై శ్యామ్ వేచి ఉన్నాడు. డాక్టర్ భార్యపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న నగలను దోచుకున్నారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి అభినందన ఈ చోరీ కేసును కేవలం ఎనిమిది రోజుల్లో ఛేదించి చోరీకి పాల్ప డిన డ్రైవర్ శ్యామ్, అతని నలుగురు స్నేహితులను అరెస్టు చేయడంతో పాటు బంగారు నగలను నూరు శాతం రికవరీ చేసిన రాజోలు సీఐ నాగమోహనరెడ్డి, ఎస్సై శంకర్, హెచ్‌సీలు కె.గణేష్, ఎ.ప్రభాకర్, బొక్కా శ్రీను, కానిస్టేబుల్ వీరేంద్ర, హోంగార్డ్ అనంద్లను జిల్లా ఎస్పీ నయిమ్ అస్మీ, డీఎస్పీ బాషా ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డు కూడా ప్రకటిస్తారని డీఎస్పీ తెలిపారు. చోరీకి ఉపయోగించిన రెండు మోటారు సైకిళ్లు, రెండు సెల్ఫోన్లను కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ అయిదుగుర్నీ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజోలు మండలం చింతలపల్లి కళింగుల సెంటరులో రెండు మోటారు సైకిళ్లపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. -
సముద్రంలో స్నానం చేస్తూ...
సాక్షి, తూర్పుగోదావరి : అల్లవరం మండలం ఓడలరేవు బీచ్‌లో గురువారం విషాదం చోటు చేసుకుంది. అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సానబోయిన హరి(19) ఓడలరేవు సముద్రంలో స్నానం చేస్తూ భారీ అలలకు మునిగి మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం బొండాయికోడుతూము గ్రామానికి చెందిన హరి తోటి విద్యార్థులతో పుట్టిన రోజు పార్టీకి హాజరయ్యాడు. అమలాపురం మండలం పేరూరు పల్లపు వీధికి చెందిన గంటి శివ(19) హరితో పాటుగా స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎస్కేబీఆర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 20 మంది విద్యార్థులు, తోటి స్నేహితుడు పుట్టిన రోజు వేడుకల నిమిత్తం ఓడలరేవు బీచ్‌లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు కావలసిన భోజన సదుపాయాలు తమతో బీచ్‌కు తీసుకెళ్లారు. తోటి విద్యార్థి పుట్టిన రోజు వేడుక పూర్తి చేసుకుని సముద్ర రిసార్ట్సు సమీపంలో సముద్రంలో స్నానానికి దిగారు. ఆ సమయంలో భారీ అలల ఉధృతికి సానబోయిన హరి, గంటి శివ గల్లంతయ్యారు. తమతో స్నానాలు చేస్తున్న హరి, శివలు కనిపించకపోవడంతో తోటి విద్యార్థుల్లో విషాదం అలుముకుంది. ఇంతలో భారీ అలలకు సానబోయిన హరి మృతదేహాం ఒడ్డుకి కొట్టుకొచ్చింది. అప్పటి వరకు సరదాగా తమతో గడిపి అంతలోనే విగతజీవుగా కనిపించడంతో విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరో విద్యార్థి గల్లంతైన శివ జాడ కోసం విద్యార్థులు నిరీక్షించడం తప్ప ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయారు. ఈ సంఘటనపై అల్లవరం పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించగా ఎస్సై కె.చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్కేబీఆర్ కాలేజీ నుంచి పుట్టిన రోజు పార్టీ నేపథ్యంలో బీచ్‌కు వచ్చిన విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. సముద్రంలో గల్లంతైన శివ ఆచూకీ కోసం పోలీసులు, కుటుంబసభ్యులు గాలిస్తున్నారు, గురువారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండడంతో గాలింపు చర్యలకు అడ్డంకి మారిందని ఎస్సై చిరంజీవి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు. విద్యార్థుల గల్లంతుపై కోనసీమ జాక్ సంతాపం ఓడలరేవు సముద్రంలో స్నానానికి దిగి మృతి చెందిన హరి, గల్లంతైన శివ పట్ల కోనసీమ జాక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఓడలరేవులో తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరిగి విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని, ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. -
గోదావరిలో ప్రమాద సుడిగుండాలు
సాక్షి, అమలాపురం : గోదావరిలో పడవలు, లాంచీల ప్రమాదాలు జరిగినప్పుడు చోటు చేసుకునే పెనువిషాదం గురించి తెలుసుకునేందుకు.. గత ఏడాది మే, జూలై నెలల్లో మంటూరు, పశువుల్లంక దుర్ఘటనలు చాలు. ఇవే కాదు ఇంతకన్నా పెద్ద ప్రమాదాలు జరగడం, పదుల సంఖ్యలో లంకవాసులు, రైతులు మృత్యువాత పడడం సర్వసాధారణంగా మారింది. గోదావరి మీద ప్రయాణం ఎప్పుడూ ప్రమాదకరమే. వరదల సమయంలోనైతే ప్రమాదాలు మరింత అధికంగా జరిగే అవకాశముంటుంది. అప్పుడు జరిగే ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలం ఆరంభమైంది. గోదావరికి వరద నీరు వస్తోంది. దీంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పడవల మీద.. లాంచీల మీద ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ధవళేశ్వరం బ్యారేజ్ ఎగువన ఇటు మన జిల్లాలోని దేవీపట్నం, చింతూరు.. అటు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం తదితర మండలాల పరిధిలో పలు గ్రామాలు ఉన్నాయి. కొండలు, గోదావరి మధ్య ప్రాంతంలో ఉండడంతో వీటికి రహదారి సౌకర్యం అంతంతమాత్రమే. దీంతో పోలవరం, కొవ్వూరు, దేవీపట్నం, పురుషోత్తపట్నం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు వివిధ పనులపై నిత్యం వచ్చే ఆయా గ్రామాల ప్రజలు పూర్తిగా లాంచీలు, పడవలపై ఆధారపడి ప్రయాణించాల్సిందే.ఇక బ్యారేజ్ దిగువన గోదావరి పాయల మధ్య ఉన్న లంక గ్రామాల్లో పరిస్థితి ఇందుకు భిన్నం. ఇక్కడ కేవలం నాటు పడవల మీదనే ప్రయాణాలు చేయాల్సి ఉంది. వ్యవసాయం మాత్రమే జరిగే లంక ప్రాంతాలకు సహితం వరదల సమయంలో పడవల మీద దాటాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా పడవలు, లాంచీలు మీద రాకపోకలు సాగించే గ్రామాలు 70 వరకూ ఉంటాయని అంచనా. వరద ఉధృతంగా ఉన్న సమయంలో సహితం లంకవాసులు దైనందిన కార్యక్రమాల కోసం పడవల మీదనే రాకపోకలు సాగిస్తూంటారు. ఇవికాకుండా కోటిపల్లి – ముక్తేశ్వరం, సఖినేటిపల్లి – నర్సాపురం, కరవాక – ఓడలరేవు, గోగన్నమఠం – బెండమూర్లంక, సలాదివారిపాలెం – పశువుల్లంక, పల్లంకుర్రు – జి.మూలపొలం, పురుషోత్తపట్నం – పోలవరం వంటి రేవుల్లో ప్రయాణికుల రాకపోకలు నిత్యం పడవలు, పంటులపై సాగుతూనే ఉంటాయి. వీటిలో కోటిపల్లి, సఖినేటిపల్లి, పశువుల్లంక(గత ఏడాది ప్రమాదం తరువాత)ల్లో పంటుల మీద రాకపోకలు సాగుతున్నాయి. పురుషోత్తపట్నం నుంచి లాంచీల ప్రయాణం సాగుతోంది. మిగిలిన అన్ని రేవుల్లోనూ ఇంజిన్ పడవలే శరణ్యం. ఆ ప్రాంతాలకు పడవలే గతి ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం మండలాల పరిధిలోకి వచ్చే సలాదివారిపాలెం, కమిని, గురజాపులంక, శేరులంక, కొత్తలంక, గోగుల్లంక గ్రామాల ప్రజలు బయటి ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే పడవ ప్రయాణాలే దిక్కవుతున్నాయి. ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వెలిచేరు, వాడపల్లి గ్రామాల ప్రజలు లంక భూములకు వెళ్లేందుకు పడవలే గతి. తాళ్లరేవు మండలం గోవలంక, పిల్లంక, అరటికాయలంకలకు వెళ్లే రైతులు పడవల మీదనే ప్రయాణాలు సాగించాల్సి వస్తోంది. మామిడికుదురు, అల్లవరం మండలాల్లో ప్రవహిస్తున్న వైనతేయ నదీపాయల మధ్య కరవాక – ఓడలరేవు, గోగన్నమఠం – బెండమూర్లంక, పెదపట్నంలంక – ముంజువరం కొట్టు మధ్య పడవ ప్రయాణాలు సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కనకాయలంక – దొడ్డిపట్ల మధ్య పడవ ప్రయాణాలు సాగుతున్నాయి. పడవ మీదనే జిల్లా వాసులు పశ్చిమ గోదావరికి వెళ్తూంటారు. అలాగే ఎల్.గన్నవరం – కోడేరులంక గ్రామాల ప్రజలు పడవల పైనే ప్రయాణం సాగిస్తున్నారు. కపిలేశ్వరపురం – కేదార్లంక మధ్య నాటు పడవ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు నుంచి రామాలయంపేట, జి.మూలపొలం మధ్య; కుండలేశ్వరం – కేశనకుర్రుపాలెం మధ్య పడవల మీదనే రాకపోకలు సాగిస్తున్నారు. సీతానగరం మండలం వంగలపూడి నుంచి గూటాల వరకూ వెళ్లేందుకు, పురుషోత్తపట్నం నుంచి పోలవరం వెళ్లేందుకు లాంచీలను వినియోగిస్తున్నారు. వీఆర్ పురం మండలం తమ్మిలేరు, కొండేపూడి, కొల్లూరు, గొందూరు; కూనవరం మండలం కూనవరం నుంచి రుద్రంకోట వరకూ పడవలపై వెళ్తూంటారు. గోదావరిలో ప్రమాదాల పరంపర 1990 : ఆత్రేయపురం మండలం పేరవరం, వద్దిపర్రు, వెలిచేరు, వాడపల్లి గ్రామాల ప్రజలు లంక భూములకు వెళ్తూండగా పడవ మునిగి 10 మంది చనిపోయారు. 1992 : ఐ.పోలవరం మండలం గోగుల్లంక, భైరవలంకల మధ్య చింతేరుపాయలో పడవ బోల్తాపడి 9 మంది మృతి చెందారు. 1995 : పాపికొండలు మార్గంలో జరిగిన అతి పెద్ద ప్రమాదంలో సుమారు 98 మంది మృత్యువాత పడ్డారు. 2004 : తాళ్లరేవు మండల పరిధిలో గోదావరి పాయపై జరిగిన పడవ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. 2009 : దేవీపట్నం మండలం కొండమొదలు వద్ద నాటు పడవ ప్రమాదంలో 10 మంది జలసమాధి అయ్యారు. 2012 : పి.గన్నవరం మండలం లంకల గన్నవరం వద్ద వశిష్ట గోదావరి నదీపాయలో ఇంజిన్ బోటు బోల్తా పడి ఐదుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. 2016 : ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద గోదావరి వరద ఉధృతికి ఐదుగురు రైతులు మృతువాత పడ్డారు. -
కొబ్బరి రైతులను ముంచుతున్న ఆక్వా
సాక్షి, అమలాపురం: కోనసీమ కొబ్బరి రైతుకు కొత్త కష్టమొచ్చింది. ఆక్వా సాగు పుణ్యమాని తూర్పు గోదావరి జిల్లాలో వందలాది కొబ్బరి చెట్లు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు రొయ్యలు, చేపల చెరువులున్న ప్రాంతాల్లో కొబ్బరి కాయ సైజు గణనీయంగా తగ్గిపోతోంది. గడచిన ఐదేళ్ల కాలంలో కాయ సైజు సగటున 100 గ్రాముల వరకు తగ్గినట్టు అంచనా. కొబ్బరి ధర పతనానికి.. మార్కెట్ సంక్షోభానికి కాయ సైజు తగ్గడం కూడా ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన దిగుబడి ఉండే తోటల్లో పక్వానికి వచ్చిన కొబ్బరి కాయ సగటు బరువు డొక్కతో కలిపి 600 గ్రాముల వరకు ఉంటుంది. డొక్క తీసిన తరువాత కాయ బరువు మన రాష్ట్రంలో సగటున 450 గ్రాములు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, విజయనగరం జిల్లాలో అయితే 450 నుంచి 500 గ్రాముల వరకు బరువు ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో డొక్క తీసిన కాయ బరువు 500 గ్రాముల వరకు, కేరళలో 550 గ్రాముల వరకు వస్తోంది. మన రాష్ట్రంలో కొబ్బరి తోటలకు పెట్టింది పేరైన కోనసీమతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో వలిచిన కాయ సగటు బరువు 400 గ్రాముల వరకు ఉండేది. ఇప్పుటికీ ఆరోగ్యకరమైన తోటల్లో దిగుబడి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. కానీ.. తీరప్రాంత మండలాలు, ఆక్వా చెరువులు ఉన్న మండలాల్లో మాత్రం కాయ బరువు గణనీయంగా తగ్గుతోంది. ఇక్కడ వలిచిన కాయ సైజు 250 గ్రాములకు మించడం లేదని రైతులు వాపోతున్నారు. కాయ బరువు తగ్గడమే కాదు.. కాయ స్వరూపం మరింత కోలగా మారిపోతోంది. కోనసీమతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం, తాళ్లరేవు, తొండంగి మండలాల పరిధిలో ఆక్వా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి ఎక్కువగా సాగయ్యే నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఆకివీడు తదితర మండలాల్లో సుమారు 25 వేల ఎకరాలకు పైబడి కొబ్బరి తోటలు ఆక్వాబారిన పడి కాయ సైజు తగ్గిపోతోంది. ఉప్పు వల్ల ముప్పు ఇటీవల ఆక్వా సాగు విస్తీర్ణం పెరుగుతున్న స్థాయిలోనే కొబ్బరికి నష్టం కలుగుతోంది. ఆక్వా ప్రభావం వల్ల ఇప్పటికే వందలాది కొబ్బరి చెట్లు మోడువారిన విషయం తెలిసిందే. ఇది వెనామీ రొయ్యల్ని పెంచే చెరువు గట్ల మీద ఉన్న కొబ్బరి చెట్లకు మాత్రమే పరిమితమైందని రైతులు భావించేవారు. కానీ.. భూమి పొరల ద్వారా వస్తున్న ఆక్వా ఉప్పు నీటివల్ల కలుగుతున్న నష్టాన్ని గుర్తించలేకపోయారు. ఆక్వా సాగు చేస్తే చెరువు చుట్టూ సుమారు 2 కిలోమీటర్ల పరిధిలోని భూమిలో సూక్ష్మ పోషకాలు నశించడంతోపాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. నీరు ఉప్పగా మారిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకున్నవారు లేరు. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కొబ్బరికి భూమి ద్వారా సహజ సిద్ధంగా అందే నీరు ఉప్పగా మారడంతో తెగుళ్లు, పురుగుల దాడిని తట్టుకునే శక్తిని కోల్పోతోంది. మరోవైపు పోషకాలు అందక కొబ్బరికాయ సైజు తగ్గుతోంది. ఫలితంగా ఇక్కడ పండే కొబ్బరి కాయలకు డిమాండ్ తగ్గి ధర పడిపోతోంది. ఇతర రాష్ట్రాల్లో పండే కొబ్బరి కాయల్లో నూనె శాతం 69 ఉంటే.. ఇక్కడి కాయల్లో 61 శాతం మాత్రమే ఉంటోంది. ఫలితంగా ఈ ప్రాంత కొబ్బరి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రానున్న రోజుల్లో మరింతగా దిగజారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పు సాంద్రత ప్రమాదకర స్థాయిలో ఉంది ఆక్వా సాగు వల్ల, సముద్రం ఎగదన్ని వస్తున్నందు వల్ల నదులు, మురుగునీటి కాలువల్లో ఉప్పు సాంద్రత ప్రమాదకర స్థాయికి పెరిగింది. భూగర్భ జలాలు సైతం ఉప్పు బారిన పడుతున్నాయి. మరోవైపు కొబ్బరి ఆక్వా బారిన పడటంతో రోగ నిరోధక శక్తి తగ్గుతోంది. కోనసీమలో చాలాచోట్ల లవణాల సాంద్రత 2000 పీపీఎం దాటింది. ఇది ప్రమాద తీవ్రతకు సూచిక. ఈ పరిస్థితులే కొబ్బరి కాయ సైజు తగ్గడానికి, దిగుబడి పడిపోవడానికి కారణం. – డాక్టర్ పి.కృష్ణకిశోర్, ప్రిన్సిపాల్, ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ, అమలాపురం శక్తి హరిస్తోంది ఆక్వా చెరువుల వల్ల భూగర్భ జలాల్లో లవణ శాతం పెరిగి కొబ్బరి చెట్లకు సూక్ష్మ పోషకాలు, ప్రొటీన్లు అందడం లేదు. దీనివల్ల చెట్టు శక్తిహీనమై దిగుబడి తగ్గుతోంది. గడిచిన ఐదేళ్లలో కాయ సైజు భారీగా తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టం. ఆక్వా చెరువుల చుట్టూ ఉన్న చెట్లకు నల్లముట్టి పురుగు, తెల్లదోమ ఉధృతి కూడా ఎక్కువైంది. –ఎన్‌బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తా: మంత్రి
తూర్పుగోదావరి జిల్లా: సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంత్రి పినేపి విశ్వరూప్ తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టారు. జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గి రెడ్డి, పార్టీ శ్రేణులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం రావులపాలెం నుంచి అమలాపురం వరకు ర్యాలీగా మంత్రి బయలుదేరారు. ఈ సందర్భంగా విశ్వరూప్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సాంఘిక సంక్షేమ శాఖను నిర్వహిస్తానని తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లాను మోడల్ జిల్లాను అభివృద్ధి చేస్తానని చెప్పారు. -
టీడీపీకి ఓటేయలేదని ఐదేళ్లుగా బహిష్కరణ..!
సాక్షి, అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో టీడీపీ నేతలు అధికార మదంతో రెచ్చిపోయారు. రాజ్యాంగ నిర్మాత అబేంద్కర్ ఆశయాలకు నిలువునా తూట్లు పొడిచారు. తమకు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్ఛను హరించారు. గత (ఏపీ అసెంబ్లీ-2014) ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని ఓ దళిత కుటుంబంపై పచ్చనేతలు కన్నెర్రజేశారు. అగ్రకుల దరహంకారంతో ఆ కుటుంబాన్ని గత ఐదేళ్లుగా సామాజికంగా బహిష్కరించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆ కుంటుంబాన్ని వేధింపులకు గురిచేశారు. ఓటు వేయొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఓటు వేసినా టీడీపీకి కాకుండా ఇతర పార్టీలకు వేస్తే అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు. అయితే, పోలీసుల సహకారంతో ఆ కుటుంబం ఓటు హక్కును వినియోగించుకోవడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. ఊరొదిలి వెళ్లిపోవాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తుడంటంతో దిక్కుతోచని ఆ కుటుంబం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని మంగళవారం కలిసింది. తమకు న్యాయం చేయాలని వారు సీఈఓకు విన్నవించుకున్నారు. ఇక స్థానిక అధికారులు టీడీపీ నేతల ఆగడాలకు సాక్షులుగా మాత్రమే మిగిలారు. -
వైఎస్సార్సీపీకి ఓటేశారని ఐదేళ్లుగా బహిష్కరణ
-
చింతా అనూరాధ నివాసంలో విషాదం
సాక్షి, అమలాపురం : తూర్పు గోదావరి జిల్లా అమలాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి చింతా అనురాధకు మాతృ వియోగం కలిగింది. అనురాధ తల్లి విజయభారతి (64) ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. అనారోగ్యం కారణంగా అమలాపురం శ్రీనిధి హాస్పటల్లో చికిత్స పొందుతూ విజయభారతి మృతి చెందారు. దీంతో చింతా అనురాధకు వైఎస్సార్ సీపీ నేతలు పలువురు సంతాపం తెలిపారు. దీంతో చింతా అనురాధకు వైఎస్సార్ సీపీ నేతలు పలువురు సంతాపం తెలిపారు. -
చింతా అనురాధపై దుష్ప్రచారం..
సాక్షి, అమలాపురం : తనపై ఎల్లోమీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను అమలాపురం పార్లమెంటు వైఎస్సార్ సీపీ అభ్యర్థి చింతా అనురాధ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల పోటీ నుంచి చింతా అనురాధ తప్పుకున్నట్లు ఎల్లో మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై చింతా అనురాధ మాట్లాడుతూ తాను పోటీ నుంచి తప్పుకోలేదని, ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే ఎల్లో మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మహిళలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం ఇచ్చారని, దీన్ని కూడా ఎల్లో మీడియా సహించలేకపోతోందని ఆమె నిప్పులు చెరిగారు. తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నామని, దుష్ర్పచారాలను తాము పట్టించుకోమని చింతా అనురాధ తెలిపారు. ఎంపీ రవీంద్రబాబు మాట్లాడుతూ.. చింతా అనురాధ ఎన్నికల్లో గెలవబోతున్నారని టీడీపీ ఇలాంటి కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. టీడీపీ, ఎల్లో మీడియా ఎన్ని కుట్రలు చేసినా అనురాధ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. -
బాలయోగిది హత్యే!
అమలాపురం టౌన్: పశ్చిమగోదావరి జిల్లాలో 19 ఏళ్ల కిందట జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అప్పటి లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగిది హత్య అని ఉభయ రాష్ట్రాల శెట్టిబలజి మహానాడు అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నాయకుడు కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. ఈ హత్యా పథకంలో చంద్రబాబే సూత్రధారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికార అండతో ఆనాడు బాలయోగి హత్యను బయటకు రాకుండా చేసిందని ఆరోపించారు. అప్పటి నుంచి బాలయోగి కుటుంబాన్ని కన్నెత్తి కూడా చూడని టీడీపీ ముఖ్యనేతలు ఎన్నికలు వచ్చేసరికి ఆయన కుమారుడు హరీష్‌మాథూర్‌ని తెరమీదకు తీసుకొచ్చి సానుభూతితో ఓట్లు దండుకునేందుకు చూస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బాలయోగి మరణంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి వినతి పత్రం ఇచ్చినట్టు సూర్యనారాయణరావు తెలిపారు. బాలయోగి హత్యపై తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. బాబు సోదరుడికి ఇంతటి దుస్థితా? ‘నా స్నేనిహితుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఇంట్లో అచేతనంగా ఉండటం తనను కలిచివేస్తోందని సూర్యనారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. రామ్మూర్తినాయుడు ఆ దుస్థితిలో ఉండడానికి చంద్రబాబే కారణమని చెప్పారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం రక్త సంబంధాలను కూడా లెక్క చేయరనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. సమావేశంలో శెట్టిబలిజ మహానాడు నాయకులు మట్టపర్తి నాగేంద్ర, బొంతు గోవిందశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
అమలాపురం లోక్‌సభ అభ్యర్థిగా చింతా అనురాధ
సాక్షి, కాకినాడ: అమలాపురం లోక్‌సభ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా అనురాధ పేరును పార్టీ అధిష్టానం శనివారం రాత్రి ప్రకటించింది. తొలి జాబితాలో ఆమె పేరు ప్రకటించడంపై కోనసీమలోని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్న అనురాధ పేరును ఊహించిన విధంగానే అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. కోనసీమలోని అంబాజీపేటలో జగన్ ఆదివారం రోడ్‌షో నిర్వహించనుండగా, శనివారం అనురాధ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ప్రకటించింది. తండ్రి చింతా కృష్ణమూర్తి హయాం నుంచీ ఆమెకు ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది. అనేక సేవా కార్యక్రమాల్లో అనురాధ పాలు పంచుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన ఆమెకు డిగ్రీ చదివారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ప్రావీణ్యం ఉంది. గతంలో ఏ రాజకీయ పార్టీలోనూ ఆమె క్రియాశీలకంగా లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అతికొద్ది కాలంలోనే చురుకైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె తండ్రి చింతా కృష్ణమూర్తి 2009 ఎన్నికల్లో అమలాపురం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీలో చేరి అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా కొంతకాలం పని చేశారు. ఆయన పేరుతో అనురాధ ఫౌండేషన్ ఏర్పాటు చేసి, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
వైఎస్.. ఒయాసిస్సై..దాహం తీర్చారు
సాక్షి, అమలాపురం టౌన్ / అల్లవరం: ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రానికి ప్రజారంజక పాలన అందించినప్పుడు అమలాపురం నియోజకవర్గం కూడా అనూహ్యమైన అభివృద్ధిని సాధించింది. 2004 నుంచి 2009 వరకూ సాగిన డాక్టర్ వైఎస్ పాలన ఈ నియోజకవర్గంలో కొన్ని శాశ్వతమైన ప్రజా ప్రయోజనాలతో జరిగిన నిర్మాణాలు నేటికీ నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాయి. వాస్తవానికి 2004 అసెంబ్లీ ఎన్నికల నాటి నియోజకవర్గానికి 2009లో జరిగిన పునర్విభజనలో గతంలోని అల్లవరం నియోజకవర్గం దాదాపు 80 శాతం అమలాపురంలో చేరింది. దీంతో వైఎస్ హయాంలో ఆ రెండు నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి అంతా పునర్విభజన తర్వాత ఏర్పడ్డ అమలాపురం నియోజకవర్గంలోకి రావడంతో రెండు నియోజకవర్గాల అభివృద్ధిని మూట కట్టుకున్నట్లయింది. 2004 ఎన్నికల్లో వైఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చాక అప్పటి అమలాపురం, అల్లవరం ఎమ్మెల్యేలు కుడుపూడి చిట్టబ్బాయి, గొల్లపల్లి సూర్యారావులు తమ తమ నియోజకవర్గాలకు అభివృద్ధిపరంగా నిధులను అడిగిందే తడవుగా ముఖ్యమంత్రిగా వైఎస్ నిధుల మంజూరు చేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్ మళ్లీ సీఎం కావడంతో, నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన పినిపే విశ్వరూప్‌ను తాగునీటి సరఫరా మంత్రిని చేయడంతో తాగునీటి పథకాలకు కొదవ లేకుండా చేశారు. అమలాపురం నియోజకవర్గం మీదుగా ఉన్న 216 జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న గోదావరిపై వైఎస్ వారధి నిర్మించి అటు రాజోలు దీవిని అనుసంధానం చేయడంతో అమలాపురంతో కలిపారు. నియోజకవర్గంలో వైఎస్ అభివృద్ధి జాడలు నిత్యం కనిపిస్తూనే ఉంటోంది. ఆయన ముద్ర నియోజకవర్గంపై శాశ్వతమై ఉంది. ఆ మహానేత హయాంలో జరిగిన అభివృద్ధి పనుల వారీగా ఓ సారి పరిశీలిస్తే అవి నేడు నియోజకవర్గ ప్రజలకు ఎంతలా ఉపయోగపడుతున్నా యో... ఎంతటి సేవలు అందిస్తున్నాయో అర్థమవుతుంది. వారధి నిర్మించి చిరకాల వాంఛ తీర్చారు. అది 2000 సంవత్సరం.. అప్పటి లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కోనసీమ మీదుగా జిల్లాలోని కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లా పామర్రు వరకూ దాదాపు 235 కిలో మీటర్ల రహదారికి జాతీయ రహదారి హోదా కల్పించారు. అయితే ఈ జాతీయ రహదారిలో కాకినాడ వైపు నుంచి కోనసీమ ముఖద్వారమైన యానాం–ఎదుర్లంక మధ్య ఉన్న గౌతమీ నదిపై వారిధి నిర్మించారు. తర్వాత ఇదే జాతీయ రహదారిలో కోనసీమలో ఉన్న దిండి–చించినాడ మధ్య గల వశిష్ట నదిపై వారధి కూడా నిర్మితమైంది. అయితే కోనసీమలో ఇదే జాతీయ రహదారిపై అమలాపురం– పి.గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య ఉన్న వైనతేయ నదిపై వారధి నిర్మించలేదు. దీంతో జాతీయ రహదారి అనుసంధానం కాకపోవడంతో అమలాపురం ప్రాంతమే జాతీయ జీవన స్రవంతితో కలిసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నదిపై వారధి నిర్మించాలన్న ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను డాక్టర్ వైఎస్సార్ గుర్తించారు. 2005లో ఈ వారిధికి రూ.76 కోట్లు విడుదల చేసి వైఎస్సే దాని నిర్మాణానికి పునాది రాయి వేశారు. 2009 నాటికి వారధి పూర్తయ్యి జాతీయ రహదారుల సేవలో అనుసంధానమైంది. పట్టణ ప్రజలకు భారీ సమ్మర్ స్టోరేజీ అమలాపురం పట్టణంలో వైఎస్ ప్రభుత్వం రాక ముందు, వాటర్ వర్క్స్ వద్ద రెండు తాగునీటి చెరువులు (రిజర్వాయర్లు), మూడు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉండేవి. వీటితోనే పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీరాయి. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక పట్టణ శివారులో 44 ఎకరాల్లో నిర్మించిన భారీ సమ్మర్ స్టోరేజీ రిజర్వాయర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 2005లో వైఎస్సే ఈ భారీ తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. గోదావరి జలాలు ప్రవహించే పంట కాల్వల నుంచి ఈ సమ్మర్ స్టోరేజీ రిజర్వాయర్‌కు నీటిని ముడి నీటిగా మళ్లించి పట్టణ ప్రజలకు 70 రోజుల పాటు నీటి నిల్వలు ఉండే సామర్థ్యంతో అందుబాటులోకి తెచ్చారు. ఈ రోజు పట్టణంలో పైపులైన్ల మరమ్మతులు, శివార్లు విస్తరించి జనాభా పెరిగిపోయి సరైన పర్యవేక్షణ లేక తాగునీటి చౌర్యం, వృధాను అరకట్టలేక పలు చోట్ల తాగునీటి సమస్యలు అనివార్యం చేశారు. అయితే తాగునీటి వనరుల పరంగా నాటి భారీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే సామర్ధ్యం ఉన్నా పర్యవేక్షణ లోపంతో, అధికారుల వైఫల్యంతో నిరుపయోగంగా మారాయి. అప్పట్లో దాదాపు రూ.5 కోట్లతో ఆ తాగునీటి ప్రాజెక్టును నిర్మించారు. 3 మండలాలు...4 భారీ తాగునీటి ప్రాజెక్టులు.. డాక్టర్ వైఎస్ 2009లో మళ్లీ సీఎం అయ్యాక ఆయన మంత్రివర్గంలో ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి అయ్యారు. దీంతో నియోజకవర్గంలోని మండలాలకు దాదాపు 60 కోట్ల వ్యయంతో భీమనపల్లి, కూనవరం, చిందాడగరువు, బోడసకుర్రు గ్రామాల్లో నాలుగు ప్రాజెక్ట్‌లు ఏకకాలంలో నిర్మించారు. నియోజకవర్గంలోని 60 గ్రామాల్లో మూడొంతుల గ్రామాలు నదీ పరీవాహకం, సముద్ర తీరం వెంబడి ఉన్నాయి. దీంతో ఇక్కడ భూగర్భ జలాల్లో ఉప్పు నీటి శాతం ఉండడంతో అవి దాహార్తి తీర్చవు. ఈ కారణంతోనే అప్పటి నియోజకవర్గ ఎమ్మెల్యే, సంబంధిత మంత్రి విశ్వరూప్ సీఎం వైఎస్‌తో చర్చించి మూడు మండలాలకు నాలుగు తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆమోదముద్ర వేశారు. ఫలితంగా ఆ రోజు పట్టణంలోని 54 వేల మంది జనాభా, 60 గ్రామాల్లోని 2.30 లక్షల జనాభా దాహార్తి తీరుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి వారధిగా నామకరణం చేయాలి జాతీయ రహదారిలో అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాలను కలుపుతూ నిర్మించిన బోడసకుర్రు వారధి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే వచ్చింది. అందుకే ఆ వారధికి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని వల్ల అమలాపురం ప్రాంతానికి, రాజోలు దీవికి మధ్య దూరాభారం కూడా తగ్గింది. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే వారధి నిర్మాణం జరిగింది. – దొమ్మేటి శివస్వామి, బోడసకుర్రు, అల్లవరం మండలం స్వచ్ఛమైన నీరు తాగుతున్నాం ఉప్పలగుప్తం మండలంలో రోజూ స్వచ్ఛమైన నీరు తాగుతున్నాం. గతంలో కలుషిత నీరును కాచుకుని తాగేవాళ్లం. భీమనపల్లి, కూనవరం గ్రామాల్లో నిర్మించిన తాగునీటి స్కీముల వల్ల ఇప్పుడు తాగునీటి సమస్యలే లేవు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి మా మండలానికి మంజూరు చేసిన రెండు తాగునీటి స్కీముల వల్లే ఈ రోజు మేమంతా మంచి నీరు తాగుతున్నాం. అప్పట్లో మా ఎమ్మెల్యే, మంత్రి విశ్వరూప్ ఈ స్కీములు మంజూరు చేసి మా ఇబ్బందులు తొలగించారు. – సూదా ఉమాపార్వతి, గృహిణి,వాడపర్రు, ఉప్పలగుప్తం మండలం బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదిపై నిర్మించిన వారధి -
అమలాపురంలో ఐటీ దాడులు
అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మొబర్లీపేటకు చెందిన ముగ్గురు అన్నదమ్ములైన టీడీపీ నేతల ఇళ్లల్లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఐటీ దాడులు జరిగాయి. టీడీపీకి చెందిన మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, ఆయన సోదరులైన టీడీపీ నాయకులు అల్లాడ వాసు, అల్లాడ శరత్‌బాబు ఇళ్లలో సోదాలు జరిగాయి. మొబర్లీపేటలో ఈ ముగ్గురి ఇళ్లున్నాయి. తొలుత ఐటీ అధికారులు స్వామినాయుడు, శరత్‌బాబు ఇళ్లలోనే సోదాలు చేశారు. సాయంత్రం నుంచి వారి సోదరుడైన వాసు ఇంట్లో కూడా సోదా చేశారు. ఐటీ అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకూ ఎవరినీ ఇళ్లలోకి అనుమతించకుండా సోదాలు కొనసాగించారు. దీంతో ఆ ముగ్గురు అన్నదమ్ములు పట్టణ టీడీపీలో ముఖ్యంగా స్వామినాయుడు కీలక నాయుకుడిగా ఉన్నారు. మిగతా ఇద్దరు కూడా ఈ పార్టీ నాయకులుగా ఉన్నారు. ఈ అన్నదమ్ముల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయో స్పష్టంగా తెలియక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పట్టణంలో చర్చనీయాంశమైంది. రాజమహేంద్రవరం ఐటీ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇటీవల ఈ ముగ్గురు తమకు చెందిన అత్యంత విలువైన భూములను రియల్ ఎస్టేట్ అవసరాలకు రూ.కోట్లలో విక్రయించినట్టు తెలిసింది. ఈ ఆదాయానికి సంబంధించి కాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉందని.. అందుకే ఈ సోదాలు జరిగినట్టు తెలిసింది. ఆ ముగ్గురి ఇళ్లల్లోని డాక్యుమెంట్లు, ఇతర ఆస్తులను అధికారులు తనిఖీలు చేపట్టారు. పట్టణంలో ఓ ఆడిటర్ వద్దకు కూడా అధికారులు వెళ్లి ఆ అన్నదమ్ముల ఆదాయాలకు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉన్న కంప్యూటర్, ఇతర ధ్రువపత్రాలను తమ వెంట తీసుకుని వచ్చి తిరిగి అవే ఇళ్లల్లో సోదాలు కొనసాగించారు. ఈ అన్నదమ్ముల్లో ఇద్దరు మద్యం సిండికేట్ వ్యాపారాల్లో కూడా ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలను కూడా అధికారులు సేకరించినట్టు తెలిసింది. అయితే వీరు అమ్మిన భూమికి సంబంధించి అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నారని, ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని, పూర్తి సొమ్ములు చెల్లింపులు కాలేదని స్థానిక టీడీపీ నేతలు కొందరు చెబుతున్నారు. మొత్తం మీద టీడీపీ నేతలైన అన్నదమ్ముల ఇళ్లపై ఏకకాలంలో ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. -
వైఎస్సార్సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ
-
వైఎస్సార్సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని అమలాపురం ఎంపీ పి. రవీంద్రబాబు అన్నారు. పుట్టింటికి వచ్చినట్టుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావుతో కలిసి రవీంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. (వైఎస్ జగన్‌ను కలిసిన టీడీపీ ఎంపీ) ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చారని, ఆయన వల్లే ప్రత్యేక హోదా రాలేదని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోవడం వల్లే చంద్రబాబు హడావుడిగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనికిరారని, ఆయన వల్ల రాష్ట్రం బాగుపడదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతిచోట అవినీతి పెరిగిపోయిందని, ఒకే సామాజిక వర్గానికి మేలు జరుగుతోందని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్ సీపీలో చేరినట్టు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే సత్తా వైఎస్ జగన్‌కు మాత్రమే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై వైఎస్సార్ సీపీని గెలిపించాలని రవీంద్రబాబు కోరారు. పేదరికం పోవాలంటే వైఎస్ జగన్ అధికారంలోకి రావాలని అభిప్రాయపడ్డారు. కులాలవారీగా చంద్రబాబు దగ్గర ఆర్మీ ఉంటుందని, ఏ కులం వారితో ఆ కులం వారిని తిట్టిస్తారని చెప్పారు. అమలాపురం ఎంపీ పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాజీనామా లేఖను మీడియాకు చూపించారు. టీడీపీకి కూడా రాజీనామా చేసినట్టు తెలిపారు. (వైఎస్సార్సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్) -
వైఎస్ జగన్‌ను కలిసిన టీడీపీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్: అమలాపురం టీడీపీ ఎంపీ పి. రవీంద్రబాబు సోమవారం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావుతో పాటు వైఎస్ జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై రవీంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. అమలాపురం ఎంపీ టిక్కెట్‌పై మరోసారి భరోసా ఇవ్వకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. కాగా, అనకాపల్లి ఎంపీ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి అవంతి శ్రీనివాసరావు ఇటీవల వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి తెలిసిందే. (వైఎస్సార్సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్) -
అమ్మో అమెరికా దోమ
అమలాపురం: ఖండాంతరాలు దాటి కడియపు లంకకు చేరుకున్న శత్రువు పచ్చని గోదారి జిల్లాలను పీల్చి పిప్పి చేస్తోంది. ఎటు చూసినా పచ్చని పైర్లు, పండ్ల తోటలు, నర్సరీలతో అలరారే ఉభయగోదావరి జిల్లాలు ఈ శత్రువు ధాటికి విలవిల్లాడుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి తమిళనాడులోని పొల్లాచ్చి.. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు.. తరువాత కడియం నర్సరీలకు..అక్కడ నుంచి క్రమంగా మిగతా ప్రాంతాలకు విస్తరిస్తోంది రూగోస్ వైట్ఫ్లై (వలయాకారపు తెల్లదోమ). తొలుత నర్సరీల్లోని మొక్కలకు.. తరువాత కొబ్బరి.. ఆయిల్ పామ్.. తాజాగా అరటి, మామిడి, జీడిమామిడి, సీతాఫలం, సపోటా, పనస..ఇలా అన్ని రకాల పంటలను ఆశించి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. కేరళ, తమిళనాడు కొబ్బరి రైతులకు వలయాకార తెల్లదోమ చేసిన నష్టం అంతా ఇంతా కాదు. అక్కడ దిగుబడి 40 శాతం వరకు పడిపోయింది. పొల్లాచ్చి ప్రాంతంలో ఈ దోమ ఉధృతికి తోడు వర్షాలు లేక వందల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనమవుతున్నాయి. మూడేళ్ల క్రితం దీని జాడ కనిపించినా ఇప్పటికీ ఉధృతి తగ్గలేదు. మన రాష్ట్రంలో రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లుకు కేరళ నుంచి దిగుమతి చేసుకున్న కొబ్బరి మొక్కల ద్వారా ఇది వ్యాపించింది. తరువాత కడియం నర్సరీకి వ్యాపించింది. నర్సరీ మొక్కల ద్వారా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో దీని ఉధృతి అధికంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో కొబ్బరి 1.78 లక్షల ఎకరాల్లోను, ఆయిల్‌పామ్ 98 వేల ఎకరాలు, అరటి 74 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఇక కడియం, పరిసర ప్రాంతాల్లో 14 వేల 500 ఎకరాల్లో పూలు, పూలమొక్కలు, ఆర్నమెంట్ సాగు చేస్తున్నారు. దిగుబడిపై పెనుప్రభావం... కొబ్బరి, ఆయిల్ పామ్ దీర్ఘకాలిక పంటలు. అరటి కార్సి తోట పంట కావడం వల్ల మూడేళ్లపాటు రైతులకు ఆదాయాన్నిస్తోంది. ఈ పంటలను తెల్లదోమ ఆశించడం వల్ల దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. నర్సరీ రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. గడచిన రెండేళ్లుగా తెల్లదోమ వల్ల సుమారు 30 శాతం విక్రయాలు తగ్గిపోయాయని నర్సరీ రైతులు చెబుతున్నారు. మొక్క ఆకుల దిగువు భాగాన్ని ఈ తెల్లదోమ అశిస్తోంది. ఇది వదిలే వ్యర్థం ఆకు ఎగువ భాగంలో దట్టమైన నల్లని పొర రూపంలో ఏర్పడుతోంది. దీనివల్ల ఆకుల ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరగక చెట్లు బలహీనంగా మారి దిగుబడి పడిపోతోంది. వాతావరణంలో తేమ పెరిగే కొద్దీ ఇది శరవేగంగా విస్తరిస్తోంది. చేతులెత్తేసిన అధికారులు.. తెల్లదోమ నిర్మూలన విషయంలో ఉద్యాన శాఖ అధికారులు చేతులెత్తేశారు. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దీన్ని నివారించేందుకు కొంతవరకు చర్యలు చేపట్టారు. గతంలో కడియం మొక్కలను గోదావరి జిల్లాల్లోని కొబ్బరి తోటలు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా నిషేధించారు. తెల్లదోమను అరికట్టేందుకు ఎల్లోస్టిక్స్ (పసుపురంగు అట్టలు), ఎన్కార్సియా గ్వడెలోపే, ఎన్కార్సియా డిస్‌పెర్సా (బదినికలు), వేపనూనె మందులను అందించారు. డ్రోన్లను తీసుకు వచ్చి మందులు పిచికారీ చేయించారు. కేరళ, తమిళనాడు నుంచి తెల్లదోమ సోకిన మొక్కలు రాగా వాటిని గుర్తించి తగులబెట్టారు. తొలి ఆరు నెలల్లో దీని ఉధృతిని అరికట్టేందుకు కృషి చేసిన ఉద్యానశాఖ అధికారులు తరువాత కాలంలో అలసత్వం ప్రదర్శించారు. దీనికితోడు రైతులు సైతం సరైన చర్యలు చేపట్టలేదు. దీంతో దీని ఉధృతి క్రమేపీ తీవ్రమవుతోంది. అన్ని ప్రాంతాల్లోను కొబ్బరి, అరటి, ఆయిల్ పామ్ తోటలకు ఇది విస్తరిస్తోంది. ఇప్పటివరకు గోదావరి జిల్లాల కొబ్బరిలో 30 శాతం అంటే సుమారు 50 వేల ఎకరాలకు పైబడి ఈ వ్యాధి సోకిందని అంచనా. చాలాచోట్ల ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ఇది మరింత విస్తరించే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని నిర్మూలనకు అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు తాజాగా డ్రైకోక్రైసా ఆస్టర్ మిత్ర పురుగులను రైతులకు అందిస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉంది. మిత్ర పురుగులతో ఎదుర్కొంటున్నాం... తెల్లదోమ ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. రసాయన మందులు ఎక్కువగా వినియోగించడం వల్ల దీని ఉధృతి పెరుగుతుంది. జీవ నియంత్రణ పద్ధతి, మిత్ర పురుగులు వినియోగం ద్వారా చాలా వరకు దీన్ని అరికట్టే అవకాశముంది. ఎన్కార్సియా గ్వడెలోపే, డైకోక్రైసాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నాం. – ఎన్.బి.వి.చలపతిరావు, ప్రిన్సిపల్ సైంటిస్టు, వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
రెండోసారి పోటీ హుళక్కే!
అమలాపురం అసెంబ్లీ టికెట్ విషయంలో టీడీపీలో చరిత్ర పునరావృతం అవుతుందా? అమలాపురం (పాత అల్లవరం నియోజకవర్గంలో) టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యేకు.. ఆ తరువాత టికెట్ దక్కదన్న సెంటిమెంట్ నిజం కానుందా? అంటే అవునంటున్నాయి టీడీపీ వర్గాలు. సిటింగ్ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కించుకునే అవకాశాలు లేవంటున్నారు. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్, పార్టీలో మరో సీనియర్ నాయకుడు పరమట శ్యామ్ రూపంలో ఆనందరావుకు టికెట్ విషయంలో అడ్డంకి ఏర్పడనుంది. తూర్పుగోదావరి , అమలాపురం: రూ.కోట్లతో అభివృద్ధి చేశానని గొప్పలకు చెప్పుకుంటున్న అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుకు గెలుపు అవకాశాలు లేవంటూ టీడీపీ సొంత సర్వే నివేదికలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీకి దన్నుగా ఉన్న ఒక ప్రధాన సామాజిక వర్గం ఎమ్మెల్యే తీరుపై గుర్రుగా ఉండి పార్టీకి దూరంగా ఉంది. కొంతమంది పార్టీ కూడా మారుతున్నారు. ఇవి కూడా ఆయన టికెట్ పొందడానికి ప్రధాన అవరోధంగా ఉన్నాయంటున్నారు. దీంతో పార్టీ అధిష్టానం కొత్త అభ్యర్థుల అన్వేషణలో పడిందని కొన్ని నెలలుగా ప్రచారం సాగుతోంది. దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి వారసుడు హరీష్ అయితే బాగుంటుందనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ సీనియర్ నాయకుడు, గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌ను త్రుటిలో చేజార్చుకున్న పరమట శ్యామ్ పేరును మరో ప్రత్యామ్నాయంగా సూచిస్తున్నారు. అయితే బాలయోగి వారసుడు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని, తిరిగి సిటింగ్ ఎమ్మెల్యే ఆనందరావుదే టికెట్ అంటూ ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో, సంక్రాంతి సందర్భంగా బాలయోగి అభిమానుల పేరుతో హరీష్ ఫ్లెక్సీలను అమలాపురం పట్టణంతోపాటు పలుచోట్ల ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. హరీష్ రాజకీయాల్లోకి వస్తాడన్న ప్రచారం జోరందుకుంది. హరీష్ రాకను ఉప ముఖ్యమంత్రి రాజప్ప వర్గం అంతర్గతంగా స్వాగతిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాజకీయ గురువు బాలయోగి తనయుడిని రంగంలోకి తీసుకురావడం ద్వారా ఆయన రుణం తీర్చుకోవడంతో పాటు సొంత నియోజకవర్గంలో బలమైన పోటీదారుడిని రంగంలో నిలపాలన్న పార్టీ అధిష్టానం యోచనకు మార్గం ఏర్పడుతుందని రాజప్ప వర్గీయులు అంటున్నారు. అయితే హరీష్‌ను లోక్‌సభకు పంపుతారనే ప్రచారం కూడా సాగుతోంది. మార్పు కోరుకుంటున్న రాజప్ప? అమలాపురం నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థిని మార్చాలని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప భావిస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. పార్టీపరంగా ఎమ్మెల్యే అయిన వ్యక్తికి రెండోసారి అవకాశం ఇచ్చేందుకు రాజప్ప అంగీకరించరనే సెంటిమెంట్ కూడా ఉంది. 1999 ఎన్నికల్లో అల్ల వరం సిటింగ్ ఎమ్మెల్యే ఏజేవీబీ మహేశ్వరావును కాదని చిల్లా జగదీశ్వరికి టికెట్ ఇప్పించారు. 2004 ఎన్నికల్లో ఆమెను కాదని పండు స్వరూపరాణిని నిలబెట్టారు. తాజాగా సిటింగ్ ఎమ్మెల్యేకు మొండిచేయి చూపుతారన్న ప్రచారం సాగుతోంది. శిష్యుడిగా భావించి ఆనందరావుకు టికెట్ ఇచ్చే విషయంలో రాజప్పతో ఇటీవల ఏర్పడిన అధిప్యత పోరే కారణమని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో రాజప్ప వర్గం పెత్తనం ఎమ్మెల్యే వర్గానికి మింగుడ పడడం లేదు. ఎమ్మెల్యే వర్గంలో కీలకంగా ఉన్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గునిశెట్టి చినబాబు రెండోసారి చైర్మన్ పదవి ఇవ్వలేదని రాజప్పపై అసంతృప్తితో ఉన్నారు. బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్న ఆయను ఎమ్మెల్యే వారించకపోవడంపై రాజప్ప గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల వివాదంలో చిక్కుకున్న సోదరుడు జగ్గయ్యనాయుడిని ఎమ్మెల్యే వెనకేసుకు రాకపోవడం కూడా రాజప్ప వర్గం అసంతృప్తి ఉందంటున్నారు. అమలాపురం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఖరారవుతుం దన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
శెట్టిబలిజ మహానాడు బహిరంగ సభ
-
‘కొబ్బరి’కి మొలకలు.. రైతులకు కన్నీళ్లు
సాక్షి, అమలాపురం: కొబ్బరికాయలకు మొలకలొస్తున్నాయి. నర్సరీ రైతులైతే వీటిని చూసి సంతోషించేవారు కానీ రెండు నెలలుగా సరైన అమ్మకాలు లేక కొబ్బరి రాశుల్లో వస్తున్న మొలకలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. అన్ని ఉద్యాన పంటలు గత ఏడాది కాలంగా సంక్షోభంలో ఉండగా.. కొబ్బరి దిగుబడితో పాటు ధర బాగా ఉందని రైతులు మురిసిపోయారు. ఆ సంతోషంపై నీళ్లు జల్లుతూ గత కొంతకాలంగా కొబ్బరి ధర నేల చూపులను చూస్తోంది. రాష్ట్రంలో 2.45 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతోంది. ఇళ్ల వద్ద, చెరువు గట్లు, రహదారులకు ఇరువైపులా ఉన్న చెట్లను పరిగణనలోకి తీసుకుంటే మరో 40 వేల ఎకరాల తోటలున్నట్టు అంచనా. ఏడాదికి సగటున 213.50 కోట్ల కాయల దిగుబడి వస్తోంది. రాష్ట్రంలో 9 జిల్లాల్లో కొబ్బరిసాగు జరుగుతున్నా దానిలో 2.37 లక్షల ఎకరాలు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. ఇటీవల తిత్లీ తుపాను వల్ల ఉద్ధానం ప్రాంతంలోని పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో 27 వేల ఎకరాలకు పైబడి కొబ్బరి దెబ్బతింది. చెట్లున్నచోట మరో రెండేళ్లపాటు కాలం దిగుబడి రాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో దిగుబడి ఉన్నా.. ధర లేక రైతులు లబోదిబోమంటున్నారు. గతేడాది ఈ సీజన్లో వెయ్యి పచ్చికాయల ధర రూ.13 వేల 500 వరకు ఉండగా.. అంబాజీపేట మార్కెట్లో ఇప్పుడు రూ.6 వేలకు పడిపోయింది. ధర పతనమైనా కొబ్బరి కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు ఇళ్ల వద్ద రెండు దింపుల రాశులు పేరుకుపోయాయి. వర్షాలకు వాటికి మొలకలు వస్తున్నాయి. ప్రతి 100 కాయలకు 20 కాయలు మొలకలు వస్తున్నాయి. దీనిని ఎండు కొబ్బరిగా చేసినా కాయకు మూడు రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. దీనివల్ల రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సాధారణంగా శ్రావణమాసం.. దీపావళి.. కార్తిక మాసాల్లో ధరలు పెరుగుతుంటాయి. ఈసారి అది కూడా లేదు. పెట్టుబడులు కూడా రావడం లేదు... ఇటీవల కూలిరేట్లు, దింపు, వలుపు కార్మికుల జీతాలు, ఎరువుల ధరలు పెరగడం వల్ల కొబ్బరి సగటు పెట్టుబడి ఎకరాకు రూ. 50 వేల వరకు అవుతోంది. కానీ ఇప్పుడున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఎకరాకు సగటు దిగుబడి 7 వేల కాయలు కాగా, రూ. 42 వేలు మాత్రమే ఆదాయం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పాస్ విధానానికి వ్యతిరేకంగా జూలై ఒకటిన ఆరంభమైన సమ్మె ఇంచుమించు నెలాఖరు వరకూ కొనసాగింది. అదే నెల 26 నుంచి దేశవ్యాప్తంగా ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల సమ్మె, ఆగస్టు ఒకటి నుంచి ప్రాంతాల వారీగా వలుపు కార్మికులు సమ్మె.. ఇలా వరుసగా వ్యాపారాలు మూతపడడంతో ఎక్కడి కొబ్బరి అక్కడే నిలిచిపోయింది. దీనిని అందిపుచ్చుకున్న తమిళనాడు వ్యాపారులు ఉత్తరాదికి భారీగా ఎగుమతులు చేశారు. దీనివల్ల ధర తగ్గిపోయింది. ధర పడిపోయిన నేపథ్యంలో 2005లో అప్పటి సీఎం, దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో కొనుగోలు చేసినట్టుగా పచ్చి కొబ్బరిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ధరలును బట్టి కేజీ రూ. 34 చేసి కొనాలని, జనవరి నుంచి నాఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. -
‘కుక్కను ఉసిగొల్పిన హోంమంత్రి మరదలు’
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): దళిత విద్యార్థిపై పెంపుడు కుక్కను ఉసిగొల్పి అతని మృతికి కారణమైన రాష్ట్ర హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తమ్ముడు భార్యను అరెస్టు చేయకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్న బీఎస్పీ నాయకులపై కేసులు పెడుతున్నారని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఏపీ అధ్యక్షుడు పట్టపు రవి అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల 28న దళిత విద్యార్థి ఎన్.వరుణ్ తోటివారితో కలిసి ఆడుకునేందుకు అమలాపురంలోని హౌసింగ్ కాలనీకి వెళ్లాడని, ఆ సమయంలో హోంమంత్రి మరదలు పెంపుడు కుక్కను ఉసిగొల్పిందన్నారు. దానినుంచి తప్పించుకునే క్రమంలో వరుణ్ పక్కనే ఉన్న ఎర్రకాలువలో పడి మృతిచెందాడని చెప్పారు. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా పోలీసులు స్పందించటంలేదన్నారు. విద్యార్థి మృతికి కారణమైన మహిళను 2 రోజుల్లో అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచ్చలకూర పుష్పరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లంకా కరుణాకర్ దాస్ పాల్గొన్నారు. -
బాలుడి మృతదేహం లభ్యం
అమలాపురం టౌన్ : అమలాపురం ఎర్రవంతెన సమీపంలో కాలువలో పడి గల్లంతైన నల్లి వరుణ్‌కుమార్ (14) మృతదేహం శనివారం ఉదయం ఆరు గంటలకు లభ్యమైంది. వరుణ్‌కుమార్ శుక్రవారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన తన స్నేహితులతో కలసి ఆటలాడుకుంటుండగా పెంపుడు కుక్క తరమడంతో ఆ బాలుడు కాలువ ఐరన్ గ్రిల్ ఎక్కి కాలువలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. సంఘటన స్థలానికి సమీపంలోనే ఉన్న డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు ఇంట్లోంచి వచ్చిన పెంపుడు కుక్క తరమడం వల్లే వరుణ్‌కుమార్ ఈ ప్రమాదానికి గురయ్యాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వరుణ్‌కుమార్ మృతదేహం లభ్యం అయ్యాక అతని తండ్రి, బ్యాంక్ ఉద్యోగి నెల్లి తిరుపతిరావు శనివారం ఉదయం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా నిమ్మకాయల జగ్గయ్యనాయుడు పెంపుడు కుక్క వల్లే తన కుమారుడు కాలువలో పడి చనిపోయాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహం ఆస్పత్రికి తరలింపుపై వివాదం బాలుని మృతదేహం కోసం శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకూ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, అగ్ని మాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గాలించారు. ఉదయం ఆరు గంటలకు మృతదేహం లభ్యం కాగానే ఆమృతదేహాన్ని కుటుంబ సభ్యుల వద్దకు తీసుకు వెళ్లకుండా... వారికి చూపించకుండా పోస్టుమార్టం కోసం నేరుగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడి బంధువులతో దళిత సంఘాల నాయకులు పోలీసుల చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏరియా ఆస్పత్రి వద్ద, బాలుని ఇంటి వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ జోక్యం చేసుకుని ఆందోళనకారులతో మాట్లాడి బాలుడి మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారు. మిన్నంటిన రోదనలు మృతదేహాన్ని చూసిన వరుణ్‌కుమార్ తల్లిదండ్రులు, అక్కలు, బంధువులు ఒక్కసారిగా గుండెలవిసేలా రోదించారు. ఒక్కడే కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కుటుంబం ఈ దుర్ఘటనను తట్టుకోలేకపోయింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. తమ్ముడిని కోల్పోయిన అక్కలు విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. శవ పంచనామాలోనూ ఫిర్యాదులు బాలుడి మృతదేహానికి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో తహసీల్దార్ బేబీ జ్ఞానాంబ, వీఆర్వోల సమక్షంలో శవ పంచనామా చేశారు. వరుణ్‌కుమార్ మృతదేహంపై గాయాలు ఉండడంతో కుక్క కాట్ల వల్లే ఆ గాయాలు అయ్యాయని బాలుడి తండ్రి తిరుపతి రావుతో పాటు దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. జగ్గయ్యనాయుడు పెంపుడు కుక్క వల్లే వరుణ్‌కుమార్ మృతి చెందినట్టు వారు స్టేట్మెంట్లు ఇచ్చారు. జగ్గయ్యనాయుడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దాన్ని పోలీసు అధికారులు నమోదు చేసుకున్నారు. దళిత సంఘాల నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, జంగా బాబూరావు, పెయ్యల శ్రీనివాసరావు, గెడ్డం సంపదరావు, చిల్లా పురుషోత్తం, సబ్బిత కృష్ణ ప్రసాద్, కోలా త్రిమూర్తులు, నక్కా సంపత్‌కుమార్, బొంతు బాలరాజు, పెయ్యల పరశురాముడు తదితరులు బాధిత కుటుంబానికి అండగా నిలిచి అధికారులతో చర్చల్లో పాల్గొన్నారు. ముందు జాగ్రత్త చర్యగా బాలుడి ఇల్లు, ఆస్పత్రి వద్ద సీఐలు జి.దేవకుమార్, సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు, అయిదుగురు ఎస్సైలతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం తర్వాత మరో వివాదం అమలాపురం టౌన్: పెంపుడు కుక్క తరమడంతో కాలువలో పడి గల్లంతై మృతి చెందిన నెల్లి వరుణ్‌కుమార్ పోస్టుమార్టం అనంతరం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద దళిత నాయకులు మరో అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో మరో వివాదం అనివార్యమైంది. పోలీసు కేసులో చనిపోవటానికి కారణం రాసే కాలమ్‌లో ఐపీసీ 174 సెక్షన్‌తో అనుమానస్పద మృతిగా నమోదు చేయడంపై దళితనాయకులు అభ్యంతరం చెప్పారు. పోస్టుమార్టం ముందు పోలీసు అధికారులు ఇచ్చిన హామీ మేరకు కాకుండా మరోలా పేర్కొనడంతో వివాదం మొదలైంది. దాంతో పోస్టు మార్టం పూర్తయినా బాలుడి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకు వెళ్లకుండా ఆందోళన చేశారు. అప్పుడు పోలీసు అధికారులు కేసు పత్రంపై మృతికి కారణం రాసే కాలమ్‌లో నిమ్మకాయల జగ్గయ్య నాయుడు పెంపుడు కుక్కను వదిలేయడం వల్ల బాలుడు మరణించినట్టు రాయడంతో వివాదానికి తెరపడింది. అప్పుడు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. కవల పిల్లల్లో ఒకడు వరుణ్‌కుమార్ తండ్రి తిరుపతిరావుకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు సంతానం. ముగ్గురు కుమార్తెల్లో ఒకరు, వరుణ్‌కుమార్ కవల పిల్లలు. తనతో పాటు ఒక్కసారే పుట్టిన సోదరుడు మృతి చెందడంతో ఆ సోదరి వెక్కి వెక్కి ఏడుస్తున్న తీరు అందరినీ బాధిస్తోంది. -
స్మశానంలో మృతదేహాలతో నిరసన
-
పెళ్లికి అడ్డుచెబుతోందని..
తూర్పుగోదావరి, అల్లవరం (అమలాపురం): ప్రేమించిన యువతితో పెళ్లి చేయకుండా, తమ ప్రేమను అడ్డుకుంటోందన్న ఆగ్రహంతో ఆ యువతి తల్లిని దారణ హత్య చేశాడు ఓ యువకుడు. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో పొన్నమండ విష్ణుకుమారి(45) దారుణ హత్యకు గురైంది. అదే గ్రామానికి చెందిన ఆమె కుమార్తెను ప్రేమించిన చిలకలపూడి దుర్గాప్రసాదు ఆమెపై చాకుతో దాడి చేసి ఈ హత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఓడలరేవు మరిడమ్మ సెంటర్ సమీపంలో నివసిస్తున్న విష్ణుకుమారికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె, కుమారుడు ఉన్నారు. హత్యకు పాల్పడ్డ దుర్గాప్రసాద్‌కు ఇటీవల ఆమె కుమార్తె పరిచయమై, అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దల సమక్షంలో వారికి పెళ్లి నిశ్చయించారు. గ్రామంలో విష్టుకుమారికి చెందిన మూడు సెంట్ల స్థలాన్ని, రూ.మూడు లక్షలు కట్నంగా ఇచ్చేందుకు పెద్దలు ఒప్పించారు. అందుకు పెద్దల సమక్షంలో అంగీకరించిన విష్ణుకుమారి కొద్ది రోజులకు అభ్యంతరం తెలిపింది. దీంతో తరచూ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దుర్గాప్రసాద్ జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లాడు. గల్ఫ్ వెళ్లిన దుర్గాప్రసాద్ తన సంపాదనలో కొంత భాగం విష్ణుకుమారికి పంపుతూ ఉండేవాడు. కొంత కాలం తర్వాత అతడు గల్ఫ్ నుంచి సొంతూరు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ముందు ఒప్పుకున్న మాట ప్రకారం తాను ప్రేమంచిన ఆమె కుమార్తెతో పెళ్లి చేయమని అడుగుతుండేవాడు. అయితే దుర్గాప్రసాద్‌కు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తోంది. కుమార్తెతో పెళ్లి చేయక, గల్ఫ్ నుంచి తాను పంపిన డబ్బులకు సమాధానం చెప్పక విసుగు చెందిన దుర్గాప్రసాద్ ఆగ్రహంతో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న విష్ణుకుమారిపై చాకుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె పొట్ట, రెండు అరి చేతులు, ఎడమ మోకాలు, పీక, వీపుపై మొత్తం పది చోట్ల చాకుతో పొడిచి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా రక్తపు మడుగులో ఉన్న విçష్ణుకుమారిని ఆమెను మంచంపై ఉన్న బొంతతో సహా గదిలోంచి ఈడ్చుకుంటూ డాబాకు వెనుక అరుగుపైకి తీసుకొచ్చాడు. అరుగు చెంతనే ఉన్న రాడుపై ఆమెను గిరాటు పెట్టినట్టుగా విసిరేశాడు. దీంతో విష్ణుకుమారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్యకు పాల్పడిన దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు సీఐ దేవకుమార్, ఎస్సై డి.ప్రశాంత్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విష్ణుకుమారి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి కుమారుడు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కుమార్తె హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుకుంటోంది. ఏడాది క్రితమే మృతురాలి భర్త చనిపోయాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండడం... ఇల్లు గ్రామ శివారున కొబ్బరితోటలో ఉండడంతో దుర్గాప్రసాద్ ఈ హత్యను సునాయాసంగా చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. హంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏడాది క్రితం తండ్రిని, ఇప్పుడు తల్లిని కోల్పోవడంతో ఆమె కుమారుడు, కుమార్తె ఇక మాకు దిక్కెవరు...? అంటూ విలపిస్తున్నారు. -
టిఫిన్ డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు..
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అమలాపురం చిన్న వంతెన వద్ద గల ఆమని హోటల్ యాజమాని నల్లా సాయిబాబుపై ఓ వ్యక్తి రౌడీయిజం చేయడమే కాకుండా, హత్యాయత్నం చేశాడు. అమలాపురం ఉప్పరకాలనీకి చెందిన కోసూరి ప్రసాద్ అనే వ్యక్తి రోజూ ఆ హోటల్‌కు వచ్చి టిఫిన్లు తిని డబ్బులు ఇవ్వకుండా ఘరానాగా వెళ్లిపోతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ప్రసాద్ హోటల్‌కు వచ్చి టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నప్పుడు హోటల్ యాజమాని సాయిబాబు డబ్బులు ఇవ్వమని అడిగారు. నేను లోకల్...నన్నే డబ్బులు అడుగుతావా? అంటూ రౌడీయిజం చేశాడు. అక్కడే ఉన్న స్థానిక మార్కెట్‌కు చెందిన అమలదాసు గోవిందు అతడిని వారించాడు. అయినా ప్రసాద్ హోటల్ యాజమానిని చంపేస్తానంటూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా తన జేబులోంచి బ్లేడ్ తీసి సాయిబాబు పీక కోసేందుకు ప్రయత్నించాడు. సాయిబాబు త్రుటిలో తప్పించుకున్నా అతని ఎడమ బుగ్గ, పెదవి చీరుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. అలాతప్పించుకున్న సాయిబాబుపై బ్లేడ్‌తో దాడి చేసేందుకు ఇంకా ప్రయత్నిస్తుండడంతో స్థానికులు అతడిని అదుపు చేశా రు. తీవ్ర రక్తస్రావం అదుతున్న సాయిబాబును తక్షణమే అత్యవర వైద్యం కోసం అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడైన హోటల్ యాజమాని సాయిబాబు ఫిర్యాదు మేరకు ప్రసాద్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. కత్తులతోనే కాదు బ్లేడ్‌తో దాడి చేసినా రౌడీయిజం, హత్యాయత్నానికి పాల్పడినట్టేనని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు అన్నారు. ఎస్సై పి.విజయశంకర్ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. -
ఓ అత్త, కూతురు, అల్లుడు..దొంగల ముఠా
తూర్పు గోదావరి, అమలాపురం టౌన్: కారులో వస్తారు.. బంగారు దుకాణాల్లోకి టిప్ టాప్‌గా వెళతారు. నగలు కొనుగోలు ముసుగులో చాకచక్యంగా నగలు నొక్కేస్తారు. అయితే ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందనే సంగతి మాత్రం వారు గుర్తించరు. ఇలా అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది ఓ దొంగల ముఠా. తీగ లాగితే డొంక కదలినట్టు అమలాపురంలో నాలుగు రోజుల క్రితం ఓ బంగారు దుకాణంలో కొనుగోలుకు వచ్చి బంగారు రూపు దొంగిలించి పట్టుబడడంతో గత ఏడాది వారు చేసిన చోరీ కూడా బయటపడింది. ఈ చోరీలు చేసింది ఓ అత్త, కూతురు, అల్లుడు. హైదరాబాద్ బేగంపేటలో ప్రకాష్‌నగర్‌కు చెందిన ఆళ్ల అరుణకుమారి (అత్త), తాడి శ్రీదేవి (కూతురు), తాడి శివ దుర్గారావు (అల్లుడు) ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. వీరి స్వగ్రామం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి. వీరు కొంత కాలంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఈనెల 18న అమలాపురంలోని ఓ నగల దుకాణానికి నగల కొనుగోలు కోసం కారులో వచ్చారు. దుకాణంలోకి వచ్చిన అత్త, కూతురు, అల్లుడు ఏవో నగలు చూస్తున్నట్టు...ధరలు అడుగుతున్నట్టు నటిస్తూనే ఓ బంగారు రూపును చాకచక్యంగా కాజేశారు. దీనిని దుకాణ యాజమాని సీసీ కెమెరా ఫుటేజీలో గమనించారు. అనుమానం వచ్చి వారిని తనిఖీ చేయగా చోరీ చేసినట్టు గుర్తించి, ఆ ముగ్గురిని పోలీసులకు అప్పగించారు. కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఈ ముగ్గురే గత ఏడాది ఏప్రిల్ 22న అమలాపురంలోని మరో నగల దుకాణంలో కొనుగోలు ముసుగులో నగలు కాజేసినట్టు తేలింది. గత ఏడాది చోరీలో వీరు ఆరు జతల బంగారు చెవి దిద్దుల జతలు మాయం చేసినట్లు... ఈనెల 18న జరిగిన చోరీలో ఓ బంగారు రూపు దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు. వీరు అమలాపురంలో సూర్య జ్యూయలర్స్, ఆదినారాయణ జ్యూయలర్స్ దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు నగల దుకాణదారుల ఫిర్యాదుల మేరకు అత్త, కూతురు, అల్లుడిపై కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.1.53 లక్షల విలువైన బంగారు నగలు, వారు వేసుకుని వచ్చిన మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురినీ మంగళవారం అరెస్ట్ చేశారు. వారిని అమలాపురం మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు మేజిస్ట్రేట్ పవన్‌కుమార్ ముందు హాజరుపరచగా వారికి రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. -
‘లక్ష్మి’భూరి విరాళం
అమలాపురం టౌన్: భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో అనేక ఎకరాల భూములున్న వారు కూడా సెంటు భూమి విరాళంగా ఇచ్చేందుకు సవాలక్ష సార్లు ఆలోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.1.50 కోట్ల విలువ జేసే ఐదు ఎకరాల వ్యవసాయ భూములను ఒక వృద్ధురాలు మూడు ఆలయాలకు ఒక ఎకరం చొప్పున విరాళంగా ఇస్తున్నట్టు వీలునామా రాసింది. మిగిలిన రెండు ఎకరాలను ఆమెను నమ్ముకున్న నాలుగు కుటుంబాలకు ఇచ్చేందుకు ఆమె నిర్ణయించారు. ఈ భూములు తన మరణాంతరం ఈ ఆలయాలకు, కుటుంబాలకు అప్పగించాలని ఆమె రాసుకున్న వీలునామా శనివారం కార్యరూపం దాల్చింది. ఆమె మరణించిన తర్వాత తన భూములను ఆలయాల సేవలకు రాసి ఇవ్వడంపై ఆ వృద్ధురాలి త్యాగాన్ని అందరూ కొనియాడారు. ఎవరు ఆమె..? అమలాపురం రూరల్ మండలం జనుపల్లె గ్రామానికి చెందిన ఈరంకి లక్ష్మీ నరసమ్మకు 80 ఏళ్లు. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయారు. వారసులు లేరు. తన పేరిట ఉన్న ఐదు ఎకరాలకు పైగా ఉన్న వ్యవసాయ భూములను గ్రామంలో నమ్మకంగా ఉండే కొలిశెట్టి గంగాధరం కుటుంబీకులకు కౌలుకు ఇచ్చింది. ఇటీవల ఆమె మృతి చెందింది. ఆమె రాసిన వీలునామాలను పరిశీలించగా జనుపల్లెలోని మదన గోపాల స్వామి, విశ్వేశ్వర స్వామి ఆలయాలకు.. అమలాపురంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఒక్కో ఎకరం భూమిని రాశారు. ఆమె వీలునామా ప్రకారం మూడు ఎకరాల మాగాణి భూములను ఆ ఆలయాలకు అప్పగించారు. ఇంతకాలం ఈ భూములను పర్యవేక్షించిన జనుపెల్లకు చెందిన కొలిశెట్టి గంగాధరం, లక్ష్మి దంపతులు, వారి కుమారుడు కొలిశెట్టి వెంకటేశ్వరరావు, వరలక్ష్మి దంపతులు.. ఈ భూముల దస్తావేజులను అమలాపురం వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులకు శనివారం అందజేశారు. వాటిని ఆలయ చైర్మన్ కర్రి రామస్వామి (దత్తుడు), ఈఓ వీవీవీఎస్‌ఎన్ మూర్తిలకు, జనుపల్లె విశ్వేశ్వరస్వామి ఆలయ చైర్మన్ వేమన సూర్యనారాయణ, జనుపల్లె మదనగోపాల స్వామి ఆలయ చైర్మన్ వాకపల్లి వీరాస్వామిలకు వాటిని అప్పగించారు. మిగిలిన రెండు ఎకరాలను.. కొలిశెట్టి కుటుంబీకులకు అర ఎకరం వంతున నాలుగు కుటుంబాలకు రాశారు. -
ఆషాఢంలో ఇంటికి వస్తున్నాడని అల్లుడి హత్య
సాక్షి, అమలాపురం టౌన్: ఆషాఢ మాసంలో తరచుగా తమ ఇంటికి వస్తున్నాడన్న కోపంతో అల్లుడిని హత్య చేసిన మామకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అల్లుడిని హత్య చేశాడన్న నేరం రుజువు కావడంతో తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన లోకినెడి అక్కిరాజు(మామ)కు జీవిత ఖైదు, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ అమలాపురం రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బీఎస్వీ హిమబిందు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. భీమనపల్లి శివారు సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన అక్కిరాజు, తన అల్లుడైన ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడికి చెందిన అమలదాసు సత్తి బాబును హత్య చేశాడు. ఆషాఢ మాసంలో అత్తవారింటికి తరచూ రావద్దని పదేపదే చెప్పినా వినకపోవడంతో కోపంతో 2015 జూలై 8న అల్లుడిని కోళ్లను కోసే కత్తితో నరికాడు. అప్పటికి అతడి భార్య దుర్గాభవాని 9వ నెల గర్భిణి. ఈ కేసును అప్పటి ఉప్పలగుప్తం ఏఎస్ఐ బి.జనార్దన్ నమోదు చేయగా రూరల్ సీఐ జి. దేవకుమార్ దర్యాప్తు చేశారని ఉప్పలగుప్తం ఎస్సై బి.రామకృష్ణ తెలిపారు. పీపీ అజయ్‌కుమార్ ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించారు. -
కత్తి మహేష్‌పై ఫిర్యాదులు
సాక్షి, అమలాపురం: రామయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అమలాపురం ఆజాద్ ఫౌండేషన్ కోరింది. ఓ వార్తా చానల్ చర్చా కార్యక్రమంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ ఆదివారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్లో ఆ ఫౌండేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావుకు అందజేశారు. న్యూస్ ఛానల్ డిబేట్లో కత్తి మహేష్ మాట్లాడుతూ.. ‘రామాయణం నాకొక కథ మాత్రమే. రాముడు దగుల్భాజీ అని నేను నమ్ముతా. ఆ కథలో సీత రావణుడితో ఉంటేనే న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అజాద్ ఫౌండేషన్ అధ్యక్షుడు యల్లమిల్లి నాగసుధా కొండ తెలిపారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌పైన, ఇలాంటి పనికి రాని చర్చలు పెట్టి మతాలు, కులాల, సామాజిక వర్గాలను రెచ్చ గొట్టేలా ప్రసారాలు చేసే ఆ టీవీ ఛానల్ యాజమాన్యంపైనా చర్యలు తీసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయ స్థానాన్ని కూడా ఆశ్రయించి కత్తి మహేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమజానికి ఎంత మాత్రం ప్రయోజనం లేని అలాంటి డిబేట్లను ఇప్పటికైనా నిలిపివేసి సమాజ హితమైన అంశాలను ప్రసారం చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులు ఆ టీవీ ఛానల్‌కు విజ్ఞప్తి చేశారు. కత్తి మహేష్‌పై చర్యలు తీసుకునే వరకూ తమ ఫౌండేషన్ ద్వారా ఆందోళనలు చేపడతామని చెప్పారు. ఫౌండేషన్ ప్రతినిధులు బసవా సత్య సంతోష్, మహదేవ నాగేశ్వరరావు, జొన్నాడ దుర్గారావు, ఇవాని శర్మ, కొత్తపల్లి వంశీ, కొండేపూడి ప్రకాష్, బొక్కా నాని తదితరులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. హైదరాబాద్‌లోనూ ఫిర్యాదు కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ జనశక్తి నేతలు కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆయనపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
201వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, అమలాపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నానంటూ భరోసానిస్తూ జననేత వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న బిడ్డ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 201వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం భీమనపల్లి శివారు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి సింగాయపాలెం, అనంతవరం, మహిపాల చెరువు చేరుకుని అక్కడ జననేత భోజన విరామం తీసుకుంటారు. అనంతవరం శివారు వద్ద వైఎస్ జగన్ పాదయాత్ర ముమ్మిడివరం నియోజకవర్గంలోకి ప్రవేశించినుంది. విరామం అనంతరం పాదయాత్ర తిరిగి 2.45కు ప్రారంభమౌతుంది. బొండయకొడు, కొండలమ్మచింత మీదుగా ముమ్మిడివరం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ముమ్మిడివరం హైస్కూల్ సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఇదివరకే 200 రోజులతో పాటు 2,400 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకుంది. -
ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు : వైఎస్ జగన్
సాక్షి, భీమనపల్లి (తూర్పుగోదావరి) : ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమై 200 రోజులు పూర్తి అయిన సందర్భంగా బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పాదయాత్ర చేయగలుగుతామా? అన్న పరిస్థితుల నుంచి సునాయాసంగా ముందుకు సాగగలుగుతున్నామని అన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెన వల్ల మాత్రమే ఇది సాధ్యం అయిందని చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నగారు తోడుగా ఉండి నడిపిస్తున్నట్టు ఉందని వెల్లడించారు. వేసే ప్రతి అడుగులోనూ ప్రజలు ఆశీర్వదించారని, వారి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు ఈ 200 రోజులపాటు నన్ను నడిపించగలిగాయని చెప్పారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా తాను చూసిన సమస్యలు బాధకలిగించాయని వెల్లడించారు. రుణాలు మాఫీ కాక, గిట్టుబాటు ధరలు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ‘రైతులను ప్రభుత్వం మోసం చేసింది. విద్యార్థులు నాన్నగారి పాలనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య శ్రీ ఉందా? లేదా? అన్న పరిస్థితిని చూసి పేదలు అవస్థలు పడుతున్నారు. ఇళ్లు లేక పూరి గుడిసెల్లోనే పేదలు నివసిస్తున్నారు. ఇలా ఏ సమస్య చూసినా మనసును కలచివేసే సన్నివేశాలు నాకు పాదయాత్రలో కనిపించాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంవల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయి. ప్రజలకు మంచిచేయాలన్న ఆలోచన ఇప్పటి ప్రభుత్వానికి లేదు. దేవుడు ఆశీర్వదించి, కోట్ల మంది ప్రజలు దీవిస్తేనే ముఖ్యమంత్రి పదవి వస్తుంది. అలాంటి సీట్లో కూర్చున్నప్పుడు ప్రజలకు ఏం చేయాలన్న దానిపై ఇప్పటి ముఖ్యమంత్రికి ఆలోచనలు కరువయ్యాయి. ఇక రేపు లేదు అన్నట్టుగా సీఎం సీట్లో ఉన్న వ్యక్తి ప్రజల కోసం పరితపించాలి. మనం చనిపోయాక ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడాలి. కానీ, అలాంటి పాలన ఇప్పుడు కనిపించడంలేదు. ఈ పరిస్థితులను చూసి నా మనసు చలించిపోతోంది. వచ్చే మంచి రోజుల గురించి పాదయాత్రలో ప్రజలకు భరోసా నిచ్చాం. నవరత్నాలు వస్తాయి, రాజన్న రాజ్యం వస్తుందని ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చాం. ప్రజలు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. 200 రోజుల పాటు ప్రజలు చూపిన ప్రేమాభిమానాలను మరిచిపోలేను. నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల రుణాన్ని తీర్చుకుంటాను. నాన్నగారి పాలన, అంతకన్నా గొప్ప పాలన ఇవ్వడానికి శాయశక్తులా ప్రయత్నిస్తా. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజలు ఇచ్చిన స్ఫూర్తి, ప్రేమ, ఆప్యాయతలు నన్ను 200 రోజులు నడిపించాయి. ఇంకా ఇచ్ఛాపురం వరకూ ప్రజాసంకల్పయాత్ర పోవాలి. దీనికి ముందడుగు.. ప్రజల ఆశీర్వదంతోనే పడుతుంది.’ అని వైఎస్ జగన్ తన పాదయాత్ర అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు. -
అమలాపురం బహిరంగసభలో పోటెత్తిన అభిమానం
-
బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా పాలన చేస్తున్నారు
-
చంద్రబాబు రాగం, తాళం, పల్లవి.. అందుకే : వైఎస్ జగన్
సాక్షి, అమలాపురం (తూర్పు గోదావరి) : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు, నాలుగు నెలల తర్వాత’ అనే సినిమాను ప్రజలకు చూపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. 199వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అమలాపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈ మధ్య చంద్రబాబుకు హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలపై, నిరుద్యోగులపై, అంగన్వాడీ కార్యకర్తలపై ఉన్నట్లువుండి ప్రేమ పుట్టుకొచ్చిందని అన్నారు. హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలకు కోడికూర పెడతానని చంద్రాబాబు అంటున్నారని చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 648 ఎస్సీ హాస్టళ్లు, 201 బీసీ హాస్టళ్లు, ఎస్టీ హాస్టళ్లను చంద్రబాబు మూసేశారు. దీంతో 60 వేల మంది పిల్లలు రోడ్డున పడ్డారు. స్కూళ్లు ప్రారంభమైనా ఇప్పటివరకూ పిల్లలకు పుస్తకాలు ఇవ్వకపోవడానికి కారణం మన పిల్లలందరూ నారాయణ, చైతన్యలకు వెళ్లడానికేనని అన్నారు. ఇదే అదనుగా వాళ్లేమో మనల్ని బాదుడే బాదుడు బాదాలనేది ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. ‘గతంలో అంగన్వాడీ అక్కచెల్లెమ్మలను గుర్రాలతో తొక్కించారు. లాఠీలతో కొట్టించారు. ఎన్నికలు వస్తున్నాయని ఇదే అంగన్వాడీ చెల్లెమ్మలకు జీతాలు పెంచుతా అని చంద్రబాబు చెబుతున్నాడు. నిరుద్యోగులకు భృతి వెయ్యి రూపాయలు ఇస్తానని చెబుతున్నారు. అదీ కేవలం 10 లక్షల మందికేనట. అది కూడా కేవలం నాలుగు నెలలు మాత్రమేనట. ఎన్నికల ముందు చంద్రబాబు రాగం, తాళం, పల్లవి మారుతుంది. ఆయన డ్యాన్స్ చేయడం మొదలెడతాడు. అయ్యయ్యో మీకు పింఛన్లు రావడం లేదా?. నాకిప్పుడే తెలిసింది. వెంటనే పది లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తా అంటాడు. అయ్యో మీకు రేషన్ రావడం లేదా? అయితే అధికారి తోలు తీస్తా అంటాడు. ఇల్లు లేదా అయ్యో వెంటనే ఇళ్లు కట్టించి ఇచ్చేస్తా అంటాడు. అయ్యయ్యో మీకు రెండు రూపాయలకు మంచినీరు అందడం లేదా? అయితే, అధికారికి నేను క్లాస్ తీసుకుంటా అంటాడు. ‘ఏం చేసినా ఎన్నికలకు ఆరు నెలల ముందు 4 నెలల తర్వాత’ అనే సినిమాను పక్కాగా చూపిస్తాడు. ఈ మధ్యకాలంలో కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావడం లేదని చంద్రబాబు ఆదేశాలతో ఆయన పార్టీ నాయకులు నిరాహార దీక్ష చేస్తున్నారట. ఆశ్చర్యంగా నాలుగేళ్ల పాటు బీజేపీతో కలసివున్నప్పుడు ఫ్యాక్టరీ గుర్తు రాలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే ఇది కనిపిస్తుంది. ఇలాంటి నైజం చూసి వేమన పద్యం ఒకటి చెబుతా. ‘ఎలుక తోలు ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా, తిట్టినా ఉలకదు, పలకదు. విశ్వదాభి రామ వినురవేమా‘ అని వేమన అన్నాడు. చంద్రబాబు నైజం గురించి చెప్పాలంటే ఇది సరైన పద్యం. కొనసీమలో గోదారి ఉంటుంది. కానీ, రబీ పంటకు చాలీచాలని నీళ్లు. కోనసీమలో కొబ్బరిచెట్లు ఉంటాయి. కానీ తాగడానికి మంచినీళ్లు ఉండవు. కోనసీమలో పెట్రో సంబంధిత సంపద అపారం. కానీ ప్రజలకు పేదరికం దూరం కాదు. ఉద్యోగాలు దొరకవు. గల్ఫ్ బాట పట్టాల్సిందే. కోనసీమలోని మండలానికి హోం మంత్రిగా, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోలీసు స్టేషన్లో సరిపడా కానిస్టేబుల్స్‌ను పెట్టలేని పరిస్థితి. వైఎస్సార్ పదేళ్ల కిందట రూ. 70 కోట్లతో వైనతేయపై బ్రిడ్డిని కట్టించారు. చంద్రబాబు కనీసం కూనవరం డ్రెయిన్‌ను కూడా బాగు చేయించలేదు. చివరగా కోనసీమలో ఓట్లన్నీ కూడా 2014లో చంద్రబాబు తీసుకున్నారు. ఆ తర్వాత హామీలన్నీ గోదారి, బంగాళాఖాతాల్లో కలిపేశాడు. 2014లో ఇదే జిల్లా నుంచి 19 స్థానాలకు 14 స్థానాలు ప్రజలు ఇచ్చారు. అవి సరిపోలేదని వైఎస్సార్ సీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలను పశువుల్లా కొనుగోలు చేశాడు చంద్రబాబు. 17 స్థానాలు తీసుకున్న చంద్రబాబు ఈ జిల్లాకు ఏం చేశారు?. అమలాపురానికి ఏం చేశారో చెప్పండి. స్వామినాథన్ కమిటీ సిఫారుసులు అమలు చేస్తానన్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను, స్వామినాథన్కమిటీను మర్చిపోయాడు. నాలుగు ఏళ్ల పాటు బీజేపీతో సంసారం చేశారు. కానీ రైతులకు న్యాయం చేయాలని కనీసం ఒక్క లేఖ కూడా రాయడు. భూమి మీద పంటలకే కాక నీళ్లలోని రొయ్యలకు గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతులు వాపోతున్నారు. చంద్రబాబు సీఎం అవ్వగానే కొబ్బరి పంట రేటు దారుణంగా పడగొట్టారు. హెరిటేజ్ ఫుడ్స్ రైతుల నుంచి కొనుగోలు చేసి అమ్ముతోంది. లాభాల కోసం దళారీలకు చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నారు. రైతుల నుంచి తక్కువ రేటుకు కొనుగోలు చేసి మూడు, నాలుగు రెట్ల అధికంగా అమ్మకాలు చేస్తున్నారు. ఇదే కోనసీమలో ఖరీఫ్‌లో ముంపు సమస్య, రబీలో సాగునీటికి కొరత. కూనవరం డ్రెయిన్ ఆధునీకరణ చేయకపోవడంతో ప్రతి ఏటా 60 వేల ఎకరాల పంట నీట మునుగుతోంది. అమలాపురం టౌన్‌కు తాగునీరు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ది. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టులో పని చేస్తున్న వారికి ప్రభుత్వం వేతనాలు ఇవ్వడం లేదు. రెండు రూపాయలకు 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తామన్నారు. ఇవాళ ఏ గ్రామానికి వెళ్లినా కూడా మినరల్ వాటర్ ప్లాంట్ కనిపించదు. చంద్రబాబు పాలనలో తాగడానికి నీళ్లు ఉండవు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఈ పెద్దమనిషి నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను బలవంతంగా లాక్కుంటున్నాడు. అక్కడ ఫ్లాట్లు కట్టిస్తాం అని చెబుతున్నాడు. అడుగుకు 2 వేల చొప్పున ఆరు లక్షలతో ఇల్లు కడతారట. బయట బిల్డర్లను అడిగితే ఎంత ఖర్చుఅవుతుందో తెలుస్తుంది. మూడు లక్షలను కేంద్ర, రాష్ట్రం చెల్లిస్తాయట. మిగిలిని మూడు లక్షలను పేదవాడు 20 ఏళ్ల పాటు కడుతూతూతూ పోవాలట. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా?. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఫ్లాట్లు కట్టించి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇస్తే తీసుకోండి. మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రుణాలను మాఫీ చేసేస్తాం. ఇసుక ర్యాంపుల్లో హైటెక్ పనిముట్లు కనిపిస్తాయి. వేల లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. మన కళ్ల ఎదుట దోచుకుంటుంటే, కలెక్టర్, పోలీసులు అడ్డుకోరు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, చినబాబు, పెదబాబులకు లంచాలు వెళుతున్నాయి. ఇసుక, మట్టి, మద్యం, కాంట్రాక్టర్లు, రాజధాని భూములు, బొగ్గు, గుడి భూములను కూడా వదిలిపెట్టకుండా చంద్రబాబు దోచుకుంటున్నారు. జన్మభూమి కమిటీలనే మాఫియాకు పెన్షన్లు, రేషన్ కార్డులకు, రేషన్ కోసం, మరుగుదొడ్లకు లంచాలు ఇవ్వాల్సివస్తోంది. ఇంతటి దారుణంగా చంద్రబాబు పరిపాలన సాగుతోంది. ఎన్నికల ప్రణాళికను 2014లో చంద్రబాబు విడుదల చేశారు. ఇప్పుడది కనిపించట్లేదు. అది కనిపిస్తే ప్రతి కులం వారు చంద్రబాబు చొక్కా పట్టుకుంటారనే భయం. కాపులు తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని నిలదీస్తే, కాపులు సంఘవిద్రోహ శక్తులు అని ముద్రవేశాడు. కోనసీమలోని ప్రతి పోలీస్ స్టేషన్లో కాపులపై కేసులు ఉన్నాయి. వాళ్లు చేసిన తప్పు చంద్రబాబును ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని కోరడమే. మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తారని చెప్పిన చంద్రబాబు, వారి ఆ విషయంపై వస్తే ‘తాట తీస్తా’అని అంటాడు. నాయి బ్రహ్మణులు ఎన్నికల మ్యానిఫెస్టోను పట్టుకుని చంద్రబాబు వద్దకు వెళ్తే వారికి తోక కత్తిరిస్తానని బెదిరించాడు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే విశ్వసనీయత అనే పదం రావాలంటే వైఎస్ జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. చంద్రబాబును మీరు పొరబాటున క్షమిస్తే ఏం చేస్తాడో తెలుసా?. మొదటగా మైకు పుచ్చుకుని తాను 2014 ఇచ్చిన హామీలను 98 శాతం పూర్తి చేశానని అంటాడు. మన చెవుల్లో పూలు పెడతాడు. మైకు పట్టుకుని మీరు చిన్నచిన్న అబద్దాలు మోసాలు నమ్మరని తెలిసి ఇంటికి కేజీ బంగారం, బెంజి కారు ఇస్తానంటాడు. ప్రతి ఇంటికి మనిషిని పంపుతాడు. ప్రతి చేతిలోనూ మూడు వేల రూపాయలు పెడతాడు. డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి. ఐదు వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసినదే. కానీ ఓటు వేసేప్పుడు మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. అబద్దాలు చెప్పేవాళ్లను, మోసం చేసేవాళ్లను బంగాళాఖాతంలో కలపండి. అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదం వస్తుంది.’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అదిగదిగో రింగ్ రోడ్డు..ఇక్కడే ఐటీ హబ్!
-
సత్యా నాదెళ్లకు ట్యూషన్.. వరుణుడిపై యుద్ధం..!!
సాక్షి, అమలాపురం (తూర్పు గోదావరి) : 2014 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఉద్దేశించి ప్రజాసంకల్పయాత్ర 199వ రోజు అమలాపురం బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నపాటి కథను చెప్పారు. ‘ఒక మోసపూరిత రియల్ ఎస్టేట్ వ్యాపారి మనకు ప్లాట్లను అమ్మేందుకు ఇక్కడికి సమీపంలో ఎయిర్‌పోర్టు వస్తుంది అంటాడు. పక్కనే అదిగదిగో రింగ్ రోడ్డు అంటాడు. ఇక్కడే ఐటీ హబ్ వస్తుంది అంటాడు. 100 అంతస్తుల భవనాలు సైతం వస్తున్నాయంటాడు. ఇక్కడ నుంచి ఒక కిలోమీటరు దూరం పోతే పక్కనే ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుందంటాడు. ఆసియాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ వస్తుందని అంటాడు. అంతటితో ఆగడు. ఇక్కడే మల్టీప్లెక్స్ కూడా వస్తోందని చెబుతాడు. కొత్త సినిమా విడుదల కాగానే, తొలి షో ఇక్కడే పడుతుందంటాడు. అంతటితో ఆగడు ఆ మోసపూరిత వ్యాపారి. మీరు ఈ రోజు పెట్టుబడి పెట్టే డబ్బు 4 నెలల్లో పది రెట్లు పెరుగుతుందంటాడు. నమ్మి మనం భూమిని కొంటాం. నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ భూమిలో పిచ్చి మొక్కలు తప్ప ఏమీ కనిపించవు. ప్రజలేమో ఎక్కడబ్బా ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డు, ఐటీ హబ్, షాపింగ్ మాల్, మల్టీఫ్లెక్స్ అని ఎదురుచూస్తుంటారు. ఆ భూమిలో పిచ్చి మొక్కలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఐదో ఏడాది వచ్చేసరికి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంకో వెంచర్ వేస్తాడు. మళ్లీ ఇవే మాటలు చెప్పడం మొదలుపెడతాడు. మళ్లీ ప్రజలకు అమ్మాలని ప్రయత్నిస్తాడు. ఇది ఒక చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రజలను మోసగించే కథ. ఇలా మోసం చేసే వారిని మనమంతా నాటుగా 420 అని పిలుస్తాం. నాలుగు ఏళ్లుగా సీఎంగారు మనకు చూపిస్తున్న రియల్ ఎస్టేట్ సినిమాను గమనించండి. మన పెద్ద మనిషి అదిగదిగో సింగపూర్ లాంటి రాజధాని అంటాడు. అదిగదిగో అక్కడ పోలవరం. ఇదిగో రేపు ఆరు నెలలలో, ఏడాదిలో పూర్తి అవుతుంది అని చెప్తాడు. ఇదిగో ఇక్కడే ఐకానిక్ టవర్. ఆ పక్కనే ఐకానిక్ బ్రిడ్జి. దాని పక్కనే సిలికాన్ వ్యాలీ. దాని పక్కనే లెఫ్ట్ తీసుకుని, రైట్‌కు తీసుకుంటే 100 అంతస్తుల బిల్డింగ్. దాని పక్కనే బుల్లెట్ రైలు, దాని పక్కనే హైపర్ లూప్. దానికి ఆనుకుని మైక్రోసాఫ్ట్ . దానిలో సత్య నాదెళ్ల కనిపిస్తాడు. చంద్రబాబు ట్యూషన్ చెబుతూ ఉంటాడు. అంతటితో చంద్రబాబు సినిమా ఆగదు. దేశం 7 శాతం అభివృద్ధి సాధిస్తోంటే, మన రాష్ట్రం దేశం కన్నా డబుల్ వేగంతో అభివృద్ధి చెందుతోందని అంటాడు. అక్కడితో ఆగడు. చిటికెస్తే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయంటాడు. జేబులో పెన్ను తీస్తే 40 లక్షల ఉద్యోగాలు వస్తాయంటాడు. చంద్రబాబు చూపిస్తున్న నాలుగేళ్ల సినిమా ఇంకా పూర్తికాలేదు. అనంతపురం కరువును రెయిన్ గన్స్‌తో జయించాడట. వర్షం దేవుడి మీద యుద్ధం చేశాడట. రెయిన్ గన్స్ ద్వారా వరుణదేవుడిని ఓడించాడట. ఇంకా కాలేదు. దోమల మీద యుద్ధం. దోమలను చంపేసే సూపర్ డ్రోన్స్ అట. సినిమా రసవత్తరంగా ఉంది కదూ. నాలుగేళ్లుగా ఈ పెద్దమనిషి మనకు ఒక మోసపూరిత రియల్ ఎస్టేట్ వ్యాపారి మాదిరిగా చంద్రబాబు సినిమా చూపిస్తున్నాడు. మరోవైపున రాష్ట్ర నిజస్వరూపం ఘోరంగా ఉంది. రైతులు ఆత్యహత్యల మొదలు నిరుద్యోగుల ఆకలి కేకలు, అక్కచెల్లెమ్మల మాన, ప్రాణాలతో ఆడుకుంటున్నారు. జన్మభూమి కమిటీలతో ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారు. చంద్రబాబు పాలనలో దేశంలో ఎక్కడాకూడా కనివినీ ఎరుగని అవినీతిని చూస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు తాకట్టుపెట్టారు. నాలుగేళ్లుగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. ఒక్కసారి వీటన్నింటిని గమనించండి. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల బాదుడు మామూలుగా లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ అనే గొప్ప పథకానికి పూర్తిగా ఎగనామం పెడుతున్నారు. ఉద్యోగాలా? అని ఎక్కడున్నాయి అని వెతుక్కనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. పేదవాడికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేవు. వర్షాలు, ఎండలకు ఎలా బ్రతకాలనే ఆందోళనలో పేదలు ఉన్నారు. ఆరోగ్య పథకం పూర్తిగా అటకెక్కింది. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు. పిల్లల్ని సైతం తాగుబోతుల్ని చేస్తున్నారు. మన కళ్ల ఎదుటనే మట్టిని ఇసుకను దోచుకుతింటున్నారు.’ అని వైఎస్ జగన్ రాష్ట్ర పాలనపై కథను ముగించారు. -
199వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 198వ రోజు సోమవారం పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలో జననేత పాదయాత్ర చేశారు. రేపు (మంగళవారం) ఇదే మండలం నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం కానుంది. రేపు ఉదయం పాశర్లపూడి బాడవ నుంచి వైఎస్ జగన్ 199వ రోజు పాదయాత్ర మొదలుపెడతారు. తర్వాత అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బోడసకుర్రు మీదుగా దేవరలంక క్రాస్ చేరుకుని, అక్కడ నుంచి అమలాపురం మండలం పెరూరు, పెరూరుపేట వై జంక్షన్ చేరుకొని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తర్వాత కొంకపల్లి, అమలాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం అమలాపురంలో జరిగే బహిరంగ సభలో జననేత ప్రసంగిస్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 198వ రోజు వైఎస్ జగన్ 7.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,421.3 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు. కాగా, తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సోమవారం వైఎస్ జగన్ కలిసి ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలిపారు. -
భర్తకు ఆరు నెలల గృహ నిర్బంధం!
అల్లవరం (అమలాపురం): రోజూ తనతో గొడవ పడుతూ హింసిస్తున్న భర్తను మరో ఇద్దరి సాయంతో భార్య తీవ్రంగా కొట్టి, ఆరు నెలలుగా గృహ నిర్బంధంలో ఉంచింది. విషయం వెలుగులోకి రావడంతో అల్లవరం పోలీసులు ఈ ఘటనపై శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై డి. ప్రశాంత్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొక్కిరిగడ్డ వీర వెంకట సత్యనారాయణ, సూర్యకుమారి దంపతులు మండలంలోని కొమరగిరిపట్నం శివారు మిలటరీ కాలనీలో నివశిస్తున్నారు.సత్యనారాయణ చాలాకాలం దుబాయ్‌లో పనిచేసి తిరిగి వచ్చాడు. అతడు తరచూ భార్యతో గొడవ పడేవాడు. మద్యం సేవించి వచ్చి భార్యను హింసించేవాడు. దీంతో విసిగిపోయిన సూర్యకుమారి ఈ ఏడాది జనవరి ఐదో తేదీన సంగాని రాంబాబు, పొనమండ శ్రీనివాసరావు అనే మరో ఇద్దరితో కలిసి రాడ్డులతో భర్త సత్యనారాయణపై దాడి చేసింది. గాయపడిన అతడిని గృహంలోనే నిర్బంధించింది. విషయం బయట పడింది ఇలా.. ఐదు నెలలు పైబడినా తన అన్న సత్యనారాయణ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సఖినేటిపల్లిలో నివసించే అతడి సోదరుడు కొక్కిరిగడ్డ నాగమలేశ్వరరావుకు అనుమానం వచ్చింది. దీంతో అతడు అన్నను చూసేందుకు కొమరగిరిపట్నం శివార్లలోని ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి గాయాలతో బాధపడుతూ జీవచ్ఛంలా పడి ఉన్న సత్యనారాయణ కనిపించాడు. దీంతో నాగమల్లేశ్వరరావు పోలీసుల సహకారంతో అన్నను గృహ నిర్బంధం నుంచి విడిపించి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చేర్పించాడు. శనివారం ఉదయం నాగమల్లేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సూర్యకుమారిని అరెస్టు చేశామని ఎస్సై ప్రశాంత్‌కుమార్ తెలిపారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న సత్యనారాయణకు స్థానికంగా ఉన్న పీఎంపీతో చికిత్స చేయించారే తప్ప పెద్దాస్పుత్రిలో చికిత్స అందించలేదు. ప్రస్తుతం అతడి చేతులు విరిగి వేలాడుతున్నాయని, మోకాలి చిప్ప పగిలిపోవడంతో నడవలేకపోతున్నారని ఎస్సై తెలిపారు.