సాక్షి, అమలాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బులను బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేశారు. అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ నాలుగున్నరేళ్లలో మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల సాధికారత కోసం అడుగులు వేశామన్నారు.
అక్కచెల్లెమ్మలు సంతోషమే ముఖ్యం..
పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీభారం పడకూడదు. మహిళల జోవనోపాధి మెరుగుపడేలా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ చేస్తున్నాం. అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశామన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.
దేశ చరిత్రలోనే చరిత్ర సృష్టించాం..
దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం తీసుకొచ్చాం. పేద పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశాం. పేదరికం నుంచి బయటపడాలంటే చదువే ఆయుధం. వైఎస్సార్ చేయూత ద్వారం 14వేల 129 కోట్లు అందిచామన్నారు. వసతి దీవెన కింద ప్రతీ ఏటా రూ.20వేలు ఇస్తున్నాం. పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. ఈ స్థాయిలో గతంలో ఇళ్ల పట్టాలు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా 22 లక్షల ఇళ్లు కూడా కట్టిస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా మహిళలకు ఇంతటి మేలు చేయలేదు.
ఇది మన ప్రభుత్వ ఘన చరిత్ర..
దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. సూర్యోదయం కంటే ముందే వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు అందిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో 2లక్షల 31వేల 123 కోట్లు ఇచ్చాం. బాలింతల కోసం 2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. బాలింతల కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.400 కోట్లే. ఇది మన ప్రభుత్వం సృష్టించిన చరిత్ర అని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చాం. దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్‌ను తీసుకువచ్చాం. కోటి 24లక్షల మంది దిశ యాప్‌లో రిజిస్టర్ అయ్యారు. దిశ యాప్ ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నాం. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment