జిల్లాలోని అమలాపురంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు కృష్ణంరాజు (55) కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన భార్య లక్ష్మీదేవి (45), కుమారుడు కృష్ణసందీప్ (25) బలన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.