షాక్‌లో డాక్టర్‌ కృష్ణంరాజు బంధువులు | Relatives Shocked Over Amalapuram Doctor Family Suicide | Sakshi
Sakshi News home page

షాక్‌లో డాక్టర్‌ కృష్ణంరాజు బంధువులు

Aug 30 2019 6:23 PM | Updated on Aug 30 2019 6:35 PM

Relatives Shocked Over Amalapuram Doctor Family Suicide - Sakshi

రామకృష్ణంరాజు, లక్ష్మీదేవి, కృష్ణసందీప్‌ (ఫైల్‌)

డాక్టర్‌ రామకృష్ణంరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడటంతో బంధువులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

సాక్షి, అమలాపురం(తూర్పుగోదావరి జిల్లా): ప్రముఖ వైద్యుడు పెనుమత్స రామకృష్ణంరాజు తన భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడటంతో బంధువులు, శ్రీకృష్ణ ఆర్దోపెడిక్ ఆసుపత్రి సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. మంచి వైద్యుడిగా పేరుగాంచిన కృష్ణంరాజు బలవన్మరణాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. రామకృష్ణంరాజు రెండవ కుమారుడు కృష్ణవంశీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

డాక్టర్‌ కృష్ణంరాజు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనేది ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ప్రాణాలు తీసుకునివుండొచ్చని అనుమానిస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన కారణంగానే కుటుంబంతో కలిసి ఆయన ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేట్టారు. (ప్రాథమిక వార్త: డాక్టర్‌ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement