
సాక్షి, కోనసీమ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ మండలం రావుల చెరువు సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించింది. ఇంట్లో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.దీంతో రెండంతస్తుల భవనం ధ్వంసమైంది.
ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఆరుగురిని కిమ్స్ ఆసుపత్రికి, ఎనిమిది మందిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
కాగా రావుల చెరువోలని ఓ ఇంట్లో అక్రమంగా బాణా సంచా తయారు చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. అయితే గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఘటన జరిగే సమయంలో భవనంలో బాణాసంచా కేంద్రలో 150 కిలోల పేలుడు పటాస్ ఉన్నట్లు సమాచారం.. ప్రమాదం ధాటికి నలుగురు వ్యక్తులు గాల్లో ఎగిరిపడ్డారు. అనుమతులు లేకుండా బాణాసంచా తయారీ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గాయపడిన బాధితుల వివరాలు
గోపాల్ నాగేశ్వరరావు (60)
గోపాల్ నాగలక్ష్మి (58)
గోపాల్ రాజు (25)
చొల్లంగి మారుతి (18)
కట్ట వెంకట్ (17)
కట్ట వేణు (35)
పేలుడు దాటికి గాయపడిన పక్కన ఉన్న ఇంట్లో వ్యక్తులు...
బొక్కా లిల్లీ (12)
పాటి దేవి (23)
దూనబోయిన సుబ్బలక్ష్మి (48)
దునబోయిన గాయత్రి (20)
పితాని చంటి (28)
పాటి ప్రకాష్ (26)
పాటి సుజాత (40)
పాటి ప్రభాకర్ ( 45)

చదవండి:
Comments
Please login to add a commentAdd a comment