gas cylendar blast
-
అమలాపురం బాణసంచా కేంద్రంలో పేలుడు.. 14 మందికి గాయాలు
సాక్షి, కోనసీమ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ మండలం రావుల చెరువు సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో సోమవారం పేలుడు సంభవించింది. ఇంట్లో అక్రమంగా బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.దీంతో రెండంతస్తుల భవనం ధ్వంసమైంది.ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఆరుగురిని కిమ్స్ ఆసుపత్రికి, ఎనిమిది మందిని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.కాగా రావుల చెరువోలని ఓ ఇంట్లో అక్రమంగా బాణా సంచా తయారు చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. అయితే గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఘటన జరిగే సమయంలో భవనంలో బాణాసంచా కేంద్రలో 150 కిలోల పేలుడు పటాస్ ఉన్నట్లు సమాచారం.. ప్రమాదం ధాటికి నలుగురు వ్యక్తులు గాల్లో ఎగిరిపడ్డారు. అనుమతులు లేకుండా బాణాసంచా తయారీ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాయపడిన బాధితుల వివరాలుగోపాల్ నాగేశ్వరరావు (60)గోపాల్ నాగలక్ష్మి (58)గోపాల్ రాజు (25)చొల్లంగి మారుతి (18)కట్ట వెంకట్ (17)కట్ట వేణు (35)పేలుడు దాటికి గాయపడిన పక్కన ఉన్న ఇంట్లో వ్యక్తులు...బొక్కా లిల్లీ (12)పాటి దేవి (23)దూనబోయిన సుబ్బలక్ష్మి (48)దునబోయిన గాయత్రి (20)పితాని చంటి (28)పాటి ప్రకాష్ (26)పాటి సుజాత (40)పాటి ప్రభాకర్ ( 45) చదవండి: ముంచేసిన బుడమేరు.. చెరువుల్లా పొలాలు -
HYD: టిఫిన్ సెంటర్లో పేలిన గ్యాస్ సిలిండర్
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురంలో పెను ప్రమాదం తప్పింది. రైతుబజార్ సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్లో బుధవారం సాయంత్రంగ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు శబ్దం భారీగా రావడంతో టిఫిన్ సెంటర్లోని పనివాళ్లు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పేలుడు దాటికి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల్లో టిఫిన్ సెంటర్ పూర్తిగా దగ్గమైంది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చదవండి: Telangana: DME వాణి నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు -
కరాచీ బేకరీలో పేలుడు.. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ RGIA పోలీస్‌స్టేషన్ పరిధిలోని గగన్ పహడ్‌లో పేలుడు సంభవించింది. ఓ కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది. కరాచీ బేకరీ గోడౌన్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవటంతో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద దాటికి కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను పోలీసులు స్థానిక కంచన్‌బాగ్ డీఆర్డీఓ తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెరుగైన వైద్య చికిత్స అందచేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సదుపాయాలూ అందచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కారికులున్నారని సీఎం రేవంత్‌కు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్‌బాగ్ డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. -
పేలిన గ్యాస్ సిలిండర్.. కుప్పకూలిన అయిదు ఇళ్లు
మహారాష్ట్ర రాజధానిలో ముంబైలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. చంబూరులోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అయిదు ఇళ్లు కూలిపోయాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం ఇరుకైన సందులో ఉండటంతో శిథిలాల కింద అనేకమంది నివాసితులు చిక్కుకుపోయారు. గోల్ఫ్ క్లబ్ సమీపంలోని ఓల్డ్ బారక్‌లో ఉదయం 8 గంటలకు ఈ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి నాలుగైదు అంతస్తుల భవనాలు కుప్పకూలిపోయాయి. ధ్వంసమైన ఇళ్లకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో మెట్లు సగం కూలిపోయి, బాల్కనీలు గాలిలో వేలాడుతూ కనిపిస్తున్నాయి. వీటిని చూస్తుంటే ప్రమాద తీవ్రత కళ్లకు అద్దం పడుతోంది. Mumbai: An incident of a house collapse due to a cylinder blast has been reported in the Chembur area of Mumbai, four people sustained injuries and have been sent to a nearby hospital. 11 people have been rescued safely, so far: BMC pic.twitter.com/kOtWmq1vaT— ANI (@ANI) November 29, 2023 అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ఇప్పటి వరకు భవనాల శిథిలాల నుంచి 11 మందిని రక్షించారు. వీరిలో నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. అగ్నిమాపక దళం, పోలీసులు మరియు అంబులెన్స్ సేవలు ప్రమాద స్థలంలో ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా రెండు వారాల క్రితం ముబైలోని బాంద్రాలో గ్యాస్ సిలిండర్ పేలుడు జరిగి ఎనిమిది మంది గాయపడిన విషయం విదితమే. గాయపడిన వారిలో చాలా మందికి 35 నుండి 40 శాతం వరకు తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. ఎల్పీజీ సిలిండర్ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని ముంబై అగ్నిమాపక దళం అధికారులు తెలిపారు. చదవండి: ఎంత ఘోరం.. గాజు డోర్ మీద పడటంతో మూడేళ్ల చిన్నారి మృతి -
సికింద్రాబాద్‌లోని అపార్ట్మెంట్లో పేలుడు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. అపార్ట్మెంట్లోని మొదటి అంతస్థులో సంభవించిన పేలుడు ధాటికి ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. పేలుడు సంభవించినప్పుడు భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరికి గాయాలవ్వగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. దంపతులిద్దరిని నేపాల్ వాసులు సందీప్, అనుగా గుర్తించారు. 20 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చిన ఈ జంట ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ పేలుడు ఘటనను పోలీసులు నిర్ధారించారు. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల పేలుడు జరిగినట్లు తెలిపారు. సిలిండర్ లీక్ కావడంతో రూమ్ అంతా గ్యాస్ నిండినట్లు, వంట చేయడం కోసం గ్యాస్ వెలిగించడంతో సిలిండర్ పేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం తనిఖీలు చేపట్టింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ముందు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. కేసీఆర్ సర్కార్‌పై నిర్మల ఫైర్ -
విషాదం: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి
సాక్షి, అనంతపురం: జిల్లాలోని శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇళ్లు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని స్థానికి ఆసుపత్రికి తరలించారు. -
పాప్‌కార్న్ బండిలో పేలుడు
సాక్షి, తిరుపతి: నగర శివారులోని కొర్లగుంటలో పాప్‌కార్న్ తయారీ బండిలో శనివారం పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో అయిదుగురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా పాప్ కార్న్ బండిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు గ్యాస్ నింపుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గ్యాస్ సిలిండర్ పేలుడు- పది మందికి తీవ్ర గాయాలు
-
గ్యాస్ సిలిండర్ పేలుడు- పది మందికి తీవ్ర గాయాలు
కొత్త గ్యాస్ కనెక్షన్ వారి జీవితాల్లో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా గురజాల పట్టణంలో ఆదివారం సాయంత్రం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. జీఐసీ కాలనీలో హుస్సేన్ అనే వ్యక్తి కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాడు. బంధువులను పిలుచుకుని ప్రార్థనల అనంతరం గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా... సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు వీరిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. -
సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
చిన్నచింతకుంట : వంట గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటనలో ఓ మహిళకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. వివరాలోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం చిన్నచింతకుంట మండలంలోని అప్పంపల్లికి చెందిన కుర్వ ముత్యాలమ్మ ఇంట్లో గ్యాస్ సిలిండర్‌పై వంట చేస్తోంది. కొద్దిసేపటికి దాని పైపు ద్వారా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆమె వెంటనే బయటకు పరుగులుతీసింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు సైతం ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనలో ఇంటి పెంకపై కప్పు ధ్వంసమైంది. అందులో ఉన్న *50 వేలు, రెండు క్వింటాళ్ల బియ్యం, ఆధార్, రేషన్ కార్డులు మంటల్లో కాలిపోయాయి. హుటాహుటిన ఆత్మకూర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు.అనంతరం సంఘటన స్థలాన్ని సర్పంచ్ నెల్లి శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ యతిరాజ, పోలీసులు పరిశీలించి *1.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. -
హైడ్రాలిక్ కంపెనీలో పేలుడు, ముగ్గురికి గాయాలు
-
హైడ్రాలిక్ కంపెనీలో పేలుడు, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్ : హైదరాబాద్ కూకట్పల్లి ప్రశాంత్‌నగర్‌లో జీపీఎస్ హైడ్రాలిక్ కంపెనీలో శనివారం ఉదయం ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రెమిడీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సత్యనారాయణ, మల్లారెడ్డి, శంషుద్దీన్ గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైడ్రాలిక్ కంపెనీకి అనుమతులు ఉన్నాయా, ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై విచారణ చేపట్టారు.