సాక్షి, శంషాబాద్: శంషాబాద్ RGIA పోలీస్‌స్టేషన్ పరిధిలోని గగన్ పహడ్‌లో పేలుడు సంభవించింది. ఓ కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది. కరాచీ బేకరీ గోడౌన్‌లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవటంతో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాద దాటికి కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను పోలీసులు స్థానిక కంచన్బాగ్ డీఆర్డీఓ తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మెరుగైన వైద్య చికిత్స అందచేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
కరాచీ బేకరీ గోడౌన్‌లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సదుపాయాలూ అందచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కారికులున్నారని సీఎం రేవంత్‌కు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్బాగ్ డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment