rajendra nagar
-
రాజేంద్రనగర్ లో బైక్ రేసింగ్ లు..
-
రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ కలకలం.. నైజీరియన్ కిలాడీ లేడీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. 50 గ్రాముల ఎండీఎంఏ, 25 గ్రాముల కొకైన్‌ను సీజ్ చేశారు. నైజీరియన్ కిలాడీ లేడీని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేసి విక్రయిస్తున్నారు.భార్య, భర్తతో పాటు మరో ముగ్గురు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియాకు చెందిన తంబా ఫిడెల్మాను జైల్‌కు తరలించారు. సన్ సిటీని అడ్డాగా చేసుకొని డ్రగ్స్ దందా సాగుతోంది. -
రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే వద్ద కారు బీభత్సం.. ఒకరి మృతి
సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే వద్ద సోమవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద థార్ కారు వేగంగా దూసుకొచ్చి ఢీ వైడర్ను ఢీ కొట్టింది. అధికవేగంతో ఉండటంతో ఆ కారు.. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదం కారణంగా అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హుటాహుటిన ఘటన స్థలానికి ట్రాఫిక్ పోలీసులు చేరుకున్నారు. ట్రాఫిక్‌ను మరలించిన పోలీసలు ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. అయితే మితిమీరిన వేగమా?. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన కారు.. రేసింగ్‌లో పాల్గొని ఇలా వేగంగా దూసుకువచ్చినట్లు తెలుస్తోంది. -
Ranga Reddy: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
అధికారంలోకి వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం కనిపిస్తోంది. హస్తం శ్రేణుల్లో కనిపించని ఆందోళనకు కారణమేంటీ ? కొత్త, పాత నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా? గ్రూపు తగాదాలు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ... కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే ప్రచారం క్యాడర్‌ను కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్‌ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉప్పప్పటికీ... పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ్ల రాష్ట్ర నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామ అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండో సారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు.తాండూరు కాంగ్రెస్‌లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్‌లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది.ఎవరికి వారు అన్నదమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కప్పుకున్న కండువా రంగులు మారుతున్నాయి తప్పా.. నేతలు మారడం లేదనే టాక్ వినిపిస్తోంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ ను ఎలా సెట్ చేస్తారనేది చూడాలి. -
బీఆర్ఎస్కు మరో షాక్.. పార్టీని వీడనున్న ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయినబీఆర్‌ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు నేతలు ఒక్కొకరుగా పార్టీని వీడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు ఇలా అందరూ బీఆర్ఎస్కు గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా మారో సిట్టింగ్ ఎమ్మెల్యే కారు దిగేందుకు రెడీ అయ్యారు. బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సీఎంకు తెలియజేశారు. తన అనుచరులతో కలిసి, సీఎం సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. వీరితోపాటు అనేకమంది ఎంపీలు, ముఖ్య నేతలు సైతం బీఆర్ఎస్ను వీడారు. -
HYD: యువతి హైడ్రామా.. రాజేంద్రనగర్ చోరీ కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజేంద్రనగర్ దొంగతనం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఒక యువతి ఆడిన నాటకాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకొని యువతి చోరీ డ్రామాకు తెరతీసింది. ఉదయం తాను వాష్ రూమ్‌కి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు ఉన్నారని తెలిపిన యువతి.. పట్టుకునే క్రమంలో తనను తోసేసి పారిపోయారంటూ వెల్లడించింది. స్థానికులు సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు విషయాన్ని బయటపెట్టారు. పథకం ప్రకారమే ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బట్టలు ఇతర వస్తువులను చిందరవందరగా పడేసింది. ఆన్లైన్లో గేమ్స్ ఆడి 25 వేలు పొగొట్టుకుని భయంతో డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదీ చదవండి: ‘డెత్’లైన్ గేమ్స్! -
HYD: రత్నదీప్ సూపర్ మార్కెట్లో అగ్నిప్రమాదం
సాక్షి, రాజేంద్రనగర్: నగరంలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. సూపర్ మార్కెట్లో మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో రత్నదీప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. సిబ్బంది సూపర్ మార్కెట్లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ఆ మంటలను చూసి పరుగులు తీశారు. మంటలకు తోడు దట్టమైన పొగ వ్యాపించింది. ఈ క్రమంలో రత్నదీప్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు
-
రాజేంద్రనగర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
కరాచీ బేకరీలో పేలుడు.. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ RGIA పోలీస్‌స్టేషన్ పరిధిలోని గగన్ పహడ్‌లో పేలుడు సంభవించింది. ఓ కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది. కరాచీ బేకరీ గోడౌన్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకోవటంతో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద దాటికి కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను పోలీసులు స్థానిక కంచన్‌బాగ్ డీఆర్డీఓ తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెరుగైన వైద్య చికిత్స అందచేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సదుపాయాలూ అందచేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కారికులున్నారని సీఎం రేవంత్‌కు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్‌బాగ్ డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. -
సన్ సిటీ క్రాకర్స్ షాప్ లో అగ్నిప్రమాదం
-
5 అంత వీజీ కాదు!
రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున ఓటర్ల సంఖ్య 2.5లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఆ మేరకు ఓటర్లున్న చోట గెలిచేందుకు అభ్యర్థులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రాష్ట్రంలోని ఓ ఐదు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులు అందరికన్నా ఎక్కువగా తంటాలు పడక తప్పని పరిస్థితి. ఎందుకంటే అవి రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఓటర్లున్న సెగ్మెంట్లు. వీటిలో ఓటర్ల సంఖ్య 5 లక్షలపైనే. ఇందులోనూ రెండింటిలో అయితే ఆరు లక్షలపైనే ఓటర్లు ఉన్నారు. అంటే రెండు, మూడు సాధారణ నియోజకవర్గాలతో సమానం అన్నమాట. ఇవన్నీ హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నవే. వీటిలో శేరిలింగంపల్లి (6.98 లక్షలు), కుత్బుల్లాపూర్ (6.69 లక్షలు), ఎల్బీనగర్ (5.66 లక్షలు), రాజేంద్రనగర్ (5.52 లక్షలు), మహేశ్వరం (5.17 లక్షలు) ఉన్నాయి. ఇవన్నీ నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో కొత్తగా ఏర్పడినవే కావడం గమనార్హం. ఎక్కువ మంది ఓటర్లేకాదు.. బస్తీల నుంచి గేటెడ్ కమ్యూనిటీల దాకా, అత్యంత సంపన్నుల నుంచి కూలీపని చేసుకునేవారి దాకా విభిన్న వర్గాలు, కులాలు, వివిధ మతాల ప్రజలు వీటిలో ఉన్నారు. వీరందరినీ ఆకట్టుకుని ఓట్లుగా మలచుకోవడం ఆషామాషీ కాదు. ఖర్చు కూడా ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి. ఈ నియోజకవర్గాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.. శేరిలింగంపల్లి టాప్ రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఇక్కడ 6,98,133 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బీసీ నేత భిక్షపతియాదవ్.. టీడీపీ అభ్యర్థి మొవ్వ సత్యనారాయణపై 1,327 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమి తరఫున కమ్మ సామాజికవర్గ నేత అరికపూడి గాందీ.. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌గౌడ్‌పై 75,904 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో అరికపూడి గాంధీ బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థిపై భవ్య ఆనంద్‌పై 44,194 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ బీసీ నేతలదే.. ఓటర్ల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,69,361 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జనం తొలి నుంచీ బీసీ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. 2009లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్‌పై స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసిన కూన శ్రీశైలంగౌడ్ 23,219 ఓట్లతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ నేత కె.హన్మంతరెడ్డిపై టీడీపీ తరఫున బరిలోకి దిగిన కేపీ వివేకానందగౌడ్ 39,021 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన వివేకానంద.. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై 41,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఎల్బీనగర్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గాల్లో మూడోదైన ఎల్బీనగర్లో 5,66,866 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో టీడీపీ అభ్యర్థి ఎన్వీ కృష్ణప్రసాద్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి 13,142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్‌పై టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య 12,525 ఓట్లతో విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 17,251 ఓట్లతో గెలిచారు. తర్వాత కొద్దిరోజులకే ఆయన బీఆర్ఎస్లో చేరారు. బీసీలకే రాజేంద్రనగర్ మద్దతు ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో నాలుగో స్థానంలోని రాజేంద్రనగర్‌లో 5,52,455 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో ఏర్పాటైనప్పటి నుంచీ బీసీ నేత ప్రకాశ్‌గౌడ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జ్ఞానేశ్వర్‌పై విజయం సాధించారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్.. టీడీపీ అభ్యర్థి గణేశ్‌పై 57,331 ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్‌కు 46 వేలకుపైగా ఓట్లు రావడం గమనార్హం. ఐదో స్థానంలోని మహేశ్వరంలో.. మహేశ్వరం నియోజకవర్గం ఎక్కువ ఓటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. 2009లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పి.సబితా ఇంద్రారెడ్డి 7,833 ఓట్లతో గెలిచారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో తొలి మహిళా హోంమంత్రిగా వైఎస్సార్ కేబినెట్లో బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.రంగారెడ్డిపై టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 30,784 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన కృష్ణారెడ్డి 2018లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగగా.. ఆయనపై కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి 9,227 ఓట్లతో గెలిచారు. తర్వాత ఆమె బీఆర్ఎస్లో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -గౌటే దేవేందర్ -
జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్ జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాహుల్ హత్యకు, ప్రేమ వ్యవహారానికి సంబంధం లేదని, ఆ రోజు వీడియో కాల్ మాట్లాడింది ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితో అని పోలీసులు తేల్చారు. రాహుల్‌ను హత్య చేసిన నలుగురు హంతకులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే హత్య చేసినట్లు సమాచారం. చిన్నపాటి గొడవే కారణంగానే రాహుల్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. రాహుల్‌ను హత మార్చాలని రెక్కీ నిర్వహించిన దుండగులు.. అదును చూసి రాహుల్‌ను అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు. రాహుల్ బలం అంచనా వేసి పెప్పర్ స్ప్రే వాడారు. వర్కట్ ముగించుకొని లిఫ్ట్‌లో కిందకు రాగానే కంట్లో పెప్పర్ స్ప్రేను ఓ యువకుడు కొట్టగా, మరో ముగ్గురు రాహుల్‌పై కత్తులతో దాడి చేశారు. రాహుల్ తేరుకునే లోపు విచక్షణారహితంగా పొడిచి చంపారు. చదవండి: కోరుట్ల దీప్తి కేసు.. పోలీసుల అదుపులో చందన, ఆమె బాయ్ ఫ్రెండ్? -
గుప్తనిధులు నిజమా అబద్దమా ?
-
బ్రాండెడ్ చాక్లెట్స్కు నకిలీ సరుకు తయారు చేస్తున్న ముఠా
-
చిన్నపిల్లలు తినే చాక్లేట్లను కల్తీ చేస్తున్న ముఠా
-
ఘనంగా ఎన్ఐఆర్డీపీఆర్ 64వ వ్యవస్థాపక దినోత్సవం
ఏజీవర్సిటీ: రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ సంస్థ 64వ వ్యవస్థాపక దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హజరై మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ సంస్థలను బలోపేతం చేయడం సమగ్రాభివృద్ధికి చాలా అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలతో పోటీపడుతున్నాయన్నారు. విద్య, ఆరోగ్యం వంటి అనేక రంగాలలో భారతదేశం బెంచ్‌మార్క్‌లను సాధించిందన్నారు. ఉపాంత రంగాలకు చెందిన ప్రజలకోసం ఎన్ఐఆర్డీపీఆర్ జాతీయ స్థా యి మేళాలను నిర్వహించడం ద్వారా దేశవ్యా ప్తంగా కళాకారులను ప్రొత్సహిస్తుందన్నారు. -
రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం
-
హైదరాబాద్: స్కూల్లో క్షుద్రపూజల కలకలం!
సాక్షి, రంగారెడ్డి: హైదరాబాద్ నగర పరిధిలో తాజాగా.. క్షుద్ర పూజల కలకలం రేగింది. అదీ ఏకంగా ఒక పాఠశాలలో కావడం గమనార్హం. రాజేంద్ర నగర్ పరిధిలోని ఓ స్కూల్లో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు బయటపడ్డాయి. స్కూల్లోని సైన్స్ ల్యాబ్‌తోపాటు స్టోర్ రూమ్‌లో క్షుద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. ఈ విషయం తెలిసి టీచర్లు, విద్యార్థులు భయాందోళనకు లోనయ్యారు. మరోవైపు స్కూల్లో సీసీ ఫుటేజ్‌లు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దర్యాప్తు ద్వారా ఈ విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
Hyderabad: ఏటీఎంలో భద్రపరచాల్సిన నగదుతో డ్రైవర్ పరారీ
సాక్షి, హైదరాబాద్: కెనరా బ్యాంక్ ఏటీఎం కేంద్రాల్లో డబ్బును లోడ్ చేసేందుకు వచ్చిన డ్రైవర్ అదును చూసి రూ.3 లక్షలతో ఉడాయించాడు. వాహనంలో రూ. 37 లక్షలు ఉన్నప్పటికి బ్యాక్సులను మోయలేక రూ.3 లక్షల బాక్సుతో పాటు రెండు సెక్యూరిటీ గన్లతో పరారయ్యాడు. రాజేంద్రనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్లలో రైటర్ సేఫ్ గార్డు సంస్థ నగదును లోడ్ చేస్తుంది. ప్రతి రోజు వివిధ రూట్లలో ఈ సంస్థ ఆధ్వర్యంలో వాహనాల్లో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లి నగదును లోడ్ చేస్తారు. గురువారం సిబ్బంది అశోక్, భాస్కర్‌తో పాటు సెక్యూరిటీ గార్డులు కె.వి.రామ్, చంద్రయ్యలు రూ.72 లక్షలతో డ్రైవర్ ఫారూఖ్‌తో కలిసి వాహనంలో బయలుదేరారు. అహ్మద్‌నగర్, ఎన్ఎండీసీ, గగన్‌పహాడ్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్లలో నగదును లోడ్ చేసి ఆయా కేంద్రాల్లో మిగిలిన బాక్సులను తీసుకుని వాహనంలో లోడ్ చేశారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో రాజేంద్రనగర్‌లోని కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్‌కు వచ్చారు. సిబ్బంది ఆశోక్, భాస్కర్‌తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కె.వి.రామ్, చంద్రయ్య లోపలికి వెళ్లి షట్టర్ వేసుకుని నగదును లోడ్ చేస్తున్నారు. సెక్యూరిటీకి చెందిన రెండు ఏయిర్ పిస్తల్‌లను వాహనంలోనే ఉంచారు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఫారూఖ్ వాహనంతో ఉడాయించాడు. రాజేంద్రనగర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి బుద్వేల్ మీదుగా కిస్మత్పూర్ బ్రిడ్జీ వద్దకు చేరుకున్నాడు. అక్కడ రోడ్డు పక్కన వాహనాన్ని పార్కు చేసి అందులో ఉన్న ఒక బాక్సు, రెండు గన్లను తీసుకుని పరారయ్యాడు. ఒక్కడే ఉండడం, బాక్సులు పెద్దగా ఉండడంతో నగదు మొత్తం తీసుకెళ్లేందుకు అతడికి వీలు కాకపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎంలో డబ్బులు లోడ్‌చేసి బయటికి వచ్చిన సిబ్బంది చూడగా వాహనం కనిపించకపోవడంతో 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. చదవండి: Road Accident: బస్సు, టవేరా వాహనం ఢీ.. 11 మంది దుర్మరణం ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బ్యాంకు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాహనానికి జీపీఎస్ సౌకర్యం ఉండడంతో ఏజెన్సీ నిర్వహకుల సమాచారంతో పోలీసులు కిస్మత్పూర్ బ్రిడ్జి వద్ద వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. వాహనంలో మిగిలిన నగదు బాక్సులు ఉండడం, ఒక్క బాక్సు మాత్రమే కనిపించకపోవడం, రెండు గన్లు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు నగదును లెక్కించగా రూ.3 లక్షలు బాక్సుతో డ్రైవర్ పారిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల పరిశీలన... డ్రైవర్ ఫారూఖ్ ఒక్కడే నగదును దొంగలించాడా అతడికి ఎవరైనా సహకరించారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం సెంటర్ నుంచి కిస్మత్పూర్ బ్రిడ్జీ వరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతను ట్రంక్ బాక్సుతో పాటు రెండు గన్లను తీసుకువెళ్లడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. సెక్యూరిటీ గార్డులకు చెందిన ఈ తుపాకులు బరువుగా ఉంటాయని వాటిని తీసుకువెళ్లే సమయంలో ప్రతి ఒక్కరు గుర్తిస్తారన్నారు. స్థానికంగా వాటిని పడేసి ఉండవచ్చునని భావించిన పోలీసులు దాదాపు గంట సేపు గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. -
హిమాయత్ సాగర్ చెరువులో యువకుడు గల్లంతు
-
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కొత్తగా ఒక జోన్.. ఏడు ఠాణాలు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది ఈ మరకు శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జోన్, పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు నాలుగేళ్ల క్రితం సీఎంకు ప్రతిపాదనలు పంపగా.. తాజాగా ఆయన ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్, శంషాబాద్, బాలానగర్ మూడు జోన్లు ఉండగా.. కొత్తగా రాజేంద్రనగర్ జోన్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు శంషాబాద్ జోన్ పరిధిలో శంషాబాద్, షాద్‌నగర్, రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు ఉన్నాయి. వీటిలో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్లు కలిపి రాజేంద్రనగర్ జోన్‌గా.. అలాగే శంషాబాద్, షాద్‌నగర్ డివిజన్లు కలిపి శంషాబాద్ జోన్‌గా ఏర్పాటు చేసేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు మాదాపూర్ జోన్ పరిధిలో ఉన్న నార్సింగి పోలీస్ స్టేషన్‌ను తొలగించి... కొత్తగా ఏర్పాటు కానున్న రాజేంద్రనగర్ జోన్లో కలపనున్నారు. డివిజన్ స్థాయిలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ఏసీపీ), జోన్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (డీసీపీ) స్థాయి అధికారి కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. సైబరాబాద్ పునర్ వ్యవస్థీకరణపై ‘సైబరాబాద్ సరికొత్తగా..’ శీర్షికన ఈనెల 10న ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. కొత్త ఠాణాల ఏర్పాటు కూడా.. 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న సైబరాబాద్‌లో 37 శాంతి భద్రతలు, 14 ట్రాఫిక్ ఠాణాలు, 7 వేల మంది పోలీసులున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న సైబరాబాద్‌లో ఏడు కొత్త ఠాణాల ఏర్పాటుపై కూడా సీఎం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీపురం ఠాణా పరిధిలో ఉన్న కొల్లూరు, నార్సింగి పీఎస్ పరిధిలోని జన్వాడ, శంకర్పల్లి స్టేషన్ పరిధిలోని మోకిల ప్రాంతాలను విభజించి.. కొత్తగా కొల్లూరు, జన్వాడ, మోకిల ఠాణాలను ఏర్పాటుకు రూటు క్లియరైంది. ఇటీవలే కొత్తగా మేడ్చల్ ట్రాఫిక్ పీఎస్‌ను ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొత్త జోన్ ఏర్పాటు, ఠాణాల పెంపుతో పరిపాలన సులువవటంతో పాటు నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
సాక్షి, హైదరాబాద్: స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన మేరకు.. గుజరాత్ రాజ్‌కోట్ ప్రాంతానికి చెందిన తుషార్ అమ్రా బెడ్వా(32), పూజా బెడ్వా భార్యభర్తలు. వీరికి 18 నెలల క్రితం వివాహం జరిగింది. నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో తుషార్‌కు ఉద్యోగం రావడంతో నగరానికి వలస వచ్చాడు. బండ్లగూడ జాగీరు ప్రాంతంలోని రాయల్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం పూజా ఏడు నెలల గర్బిణి. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తుషార్ స్నేహితులతో కలిసి స్థానికంగా ఉన్న ఖాళీ ప్రదేశంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ప్రతి రోజు క్రికెట్ ఆడి రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేవాడు. 8 గంటలైనా రాకపోవడంతో భార్య పూజా తుషార్ సెల్‌ఫోన్‌కు ఫోన్‌చేయడంతో స్నేహితులు ఫోన్ లిఫ్ట్ చేశాడు. క్రికెట్ ఆడుతూ తుషార్ కిందపడ్డాడని దీంతో తాము స్థానికంగా ఉన్న రినోవా ఆసుపత్రికి తీసుకు వచ్చామని వెల్లడించారు. హుటాహుటిన పూజా ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్లు వెల్లడించారు. దీంతో విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం తుషార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు మృతదేహానికి రాజ్‌కోట్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లి మండపంలోకి ప్రియురాలి ప్రవేశం.. తాళి కట్టే సమాయానికి -
దారుణం.. ఆలస్యంగా వచ్చాడని ఓలా డ్రైవర్‌ను చితకబాదిన గ్యాంగ్
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. క్యాబ్ బుక్ చేస్తే అరగంట ఆలస్యంగా వచ్చినందుకు డ్రైవర్, అతని యజమానిని చితకబాదింది ఓ గ్యాంగ్. ఈ ఘటనలో డ్రైవర్, ఓనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఉప్పర్‌పల్లికి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేశాడు. అరగంట ఆలస్యం కావడంతో డ్రైవర్‌ను నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఓలా డ్రైవర్‌పై వియన్ రెడ్డి అతని స్నేహితులు దాడి చేశారు. డ్రైవర్ ఈ విషయాన్ని తన యజమానికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. వెంటనే ఉప్పర్‌పల్లికి చేరుకున్న యజమానిని సైతం వియన్ రెడ్డి గ్యాంగ్ చితకబాదింది. రౌడీల్లా రెచ్చిపోయి ఉదయం 4 గంటల వరకు ఓ గదిలో బంధించి కొట్టారు. చదవండి: ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం -
కన్న కూతురిపై కసాయి తండ్రి దారుణం
సాక్షి, రాజేంద్రనగర్: కన్న కూతురుపై ఓ కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ మైనర్ బాలిక విషయాన్ని తల్లికి తెలపగా ఆమె విషయాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి కిస్మత్పూర్లో కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. వీరికి 9 ఏళ్ల కూతురు సంతానం కాగా సోమవారం రాత్రి కన్న కూతురుపై తండ్రి లైంగిక దాడికి దిగాడు. బంధువుల ఇంటికి వెళ్లిన భార్య తిరిగొచ్చాక ఉదయం కూతురు జరిగిన విషయాన్ని తల్లికి తెలపడంతో భర్తను నిలదీసింది. వారిని చితకబాదిన అతడు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించాడు. దీంతో స్థానికుల సహాయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. వైద్య పరీక్షల కోసం చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.