మణికొండ (రంగారెడ్డి): చిన్నతనంలో చదువుకోనందుకు ఇప్పటికీ బాధ కలుగుతోందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్ మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన ఉపాధ్యాయులను సన్మానించిన అనంతరం మాట్లాడుతూ... చిన్నతనంలో అప్పటి పరిస్థితుల వల్ల తాను చదువుకోలేకపోయానని... తనలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దన్నారు. ఉపాధ్యాయులు ఎంతో ఓపికతో ప్రతి విద్యార్థిని గమనిస్తూ విద్యాబోధన చేస్తారని చెప్పారు.