రాజేంద్రనగర్లో కాల్పుల కలకలం | Gang firing in Rajendra nagar area in Hyderabad | Sakshi
Sakshi News home page

రాజేంద్రనగర్లో కాల్పుల కలకలం

Published Tue, Nov 11 2014 8:26 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Gang firing in Rajendra nagar area in Hyderabad

హైదరాబాద్: రాజేంద్రనగర్లో మంగళవారం తెల్లవారుజామున ఆగంతకులు జరిపిన కాల్పులు స్థానికంగా కలకలం సృష్టించాయి. రాజేంద్రనగర్ ఏజీ కాలనీలోని రహదారిపై వెళ్తున్న వాహనంపై ఆగంతకులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. అనంతరం ఆగంతకులు అక్కడినుంచి పరారైయ్యారు. దాంతో కారులో ప్రయాణిస్తున్న రియాల్టర్ షాబుద్దీన్ నేరుగా రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. తన వాహనంపై ఆగంతకులు కాల్పులు జరిపారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాబుద్దీన్ తో పాటు పోలీసులు కాల్పులు  జరిగిన ప్రదేశానికి వచ్చి స్థానికులను విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement