హైదరాబాద్: రాజేంద్రనగర్ మండలంలో మంగళవారం ఉదయం డీసీఎం బోల్తాపడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆయిల్ పీపాలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ప్రమాదవశాత్తు ఆరాంఘర్ చౌరస్తాలో బోల్తా పడింది. వ్యాన్లోని పీపాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పాడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
డీసీఎం బోల్తా: ముగ్గురికి గాయాలు
Published Tue, Apr 26 2016 11:11 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement