three injured
-
విధుల్లో కానిస్టేబుల్.. క్షణాల్లో దూసుకొచ్చిన బస్సు
చైన్నై : తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌ను అతివేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌తో పాటు రోడ్డు పక్కన నిల్చున్న మరో ఇద్దరు కూడా తీవ్ర గాయాలపాలయ్యారు. గుడువాంజేరి పట్టణంలోని ఓ కూడలి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నడిరోడ్డుపై నిల్చుని డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్‌ను బస్సు ఢీకొడుతున్న చిత్రాలు కూడలిలో ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతివేగమే ఇంతటి ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. కాగా, క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
విధుల్లో కానిస్టేబుల్.. క్షణాల్లో దూసుకొచ్చిన బస్సు
-
మాందారిపేట శివారులో రోడ్డు ప్రమాదం
శాయంపేట (భూపాలపల్లి) : మండలంలోని మాందారిపేట శివారులోని గుట్టల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం రేగొండ మండలం దమ్మన్నపేటకు చెందిన నడిపెల్లి కృష్ణారావు రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తూ హన్మకొండలో ఉంటున్నాడు. ఈ క్రమంలో పరకాలలోని ఓ శుభకార్యానికి తన భార్య సరిత, కూతురు కీర్తనలతో కలిసి వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణంలో హన్మకొండకు వెళుతుండగా మాందారిపేట శివారులో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న కృష్ణారావు సీటుబెల్ట్ పెట్టుకోవడంతో కారులో ఉన్న ఎయిర్‌బ్యాగ్ తెరుచుకుంది. దీంతో కృష్ణారావు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంటనే అతడి బంధువులు వెంటనే మరో కారులో వారిని హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై జక్కుల రాజబాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారులకు గాయాలు
రామాయంపేట(మెదక్) : మండలంలోని కాట్రియాల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. పర్వతాపూర్ పంచాయతీ పరిధిలోని లక్యా తండాకు చెందిన అనిల్, కాట్రియాల తండాకు చెందిన మహేందర్.. కాట్రియాల స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. బుధవారం పతాకావిష్కరణ కార్యక్రమం అనంతరం వారిద్దరూ సైకిల్‌పై వెళ్తుండగా కాట్రియాల వైపు వస్తున్న బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో అనిల్ ఎడమ చేయి విరగగా.. మహేందర్ వీపు, తలకు గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న బాలుడు సైతం గాయపడ్డాడు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
మహేశ్వరం: మూలమలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని గొల్లూరు గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం... హైదరాబాద్ నింబోలిఅడ్డాకు చెందిన విజయ్‌కుమార్, లాల్ దర్వాజాకు చెందిన చలేందర్లు మామిడి పండ్ల వ్యాపారం చేస్తున్నారు. మండల పరిధిలోని మాణిక్యమ్మగూడలో రైతు వద్ద మామిడి తోటను లీజుకు తీసుకొని పండ్లను ఆటోలో నగరానికి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మంగళవారం మధ్యాహ్నం గొల్లూరు నుండి మాణిక్యమ్మగూడ గ్రామం వెళ్లే క్రమంలో గొల్లూరు సమీపంలో మూలమలుపు వద్ద ఆటోను అతివేగంగా నడపడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ విజయ్‌కుమార్, పక్కన కూర్చున్న చలేందర్లకు గాయాలయ్యాయి. విజయ్‌కుమార్‌పై ఆటో ఒరగడంతో ఆటో బాడీకి ఉన్న ఇనుప రాడ్ చేతి, వీపులోకి దిగింది. స్థానికులు గమనించి ఆటోకున్న ఇనుపరాడ్‌ను కత్తిరించి గాయాలపాలైన ఇద్దర్నీ శంషాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆటోను అతివేగంగా మూలమలుపు వద్ద నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు ప్రమాదం జరిగిందని ఫిర్యాదు రాలేదని పోలీసులు పేర్కొన్నారు. కంటెయినర్‌ను ఢీకొట్టిన టాటా ఏస్ కొత్తూరు: ముందు వెళ్తున్న కంటెయినర్‌ను వెనుక నుంచి వస్తున్న టాటా ఏస్ ఆటో ఢీకొట్టింది. ఈ సంఘటన మంగళవారం మండల పరిధిలోని తిమ్మాపూర్ శివారులో వెంకటేశ్వర హ్యాచరీస్ ఎదురుగా జాతీయ రహదారిపై చోటు చేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రింగ్ డబ్బాలతో తిమ్మాపూర్ నుండి కొత్తూరు వైపునకు వెళ్తున్న టాటా ఏస్ ఆటో అదే రూట్లో ముందు వెళ్తున్న కంటెయినర్ లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ముజీబ్ స్వల్పంగా, క్యాబిన్లో ఉన్న మరో వ్యక్తి (కరీముల్లా)తీవ్రంగా గాయపడగా వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఉస్మానియాకు తరలించారు. కాగా కరీముల్లా మృతిచెందాడు. వారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దానంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం
జోగిపేట(అందోల్) మెదక్ : అందోలు మండలం దానంపల్లి వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జోగిపేట నుంచి దానంపల్లి గ్రామానికి వెళుతూ రోడ్డుపై నిలిపి వేసిన టీవీఎస్ 50 ఎక్సెల్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. అది ఢీకొట్టడంతో టీవీఎస్ 50 ఎక్సెల్‌పై ఉన్న శ్రీనివాస్ (35) కాళ్లు విరిగిపోగా వర్షిణి (16), వెంకట్ (6)లకు తలకు గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. దీంతో 108 వాహనంలో ముగ్గురిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రథమ చికిత్స అనంతరం శ్రీనివాస్, వర్షిణిలకు గాయాలు బాగా తగలడంతో సంగారెడ్డి ఆస్పత్రికి కి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకటేష్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. అక్కడ ఢీకొట్టిన వాహనం గురించి అడిగినా సరైన సమాచారం తెలియలేదు. అదే ప్రదేశంలో అక్కడక్కడా నంబరు ప్లేటు ముక్కలను గమనించి వాటినన్నింటిని ఒకచోటికి చేర్చారు. ఢీకొట్టిన కారు నంబరును టీఎస్09 వీఏ 0712గా పోలీసులు గుర్తించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నంబరు ప్లేటు ముక్కలను గమనించిన ఎస్ఐని స్థానికులు అభినందిస్తున్నారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి.
ఉన్నత చదువులు చదవాలి.. ఉన్నత స్థాయికి ఎదగాలనేది ఆమె ఆశ.. దానికి తగ్గట్టుగానే ఆమె తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఆమె కూడా ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 87.8 శాతం మార్కులు సాధించింది. దగ్గర బంధువులందరూ ఇంజినీర్లు కావడంతో ఆమె కూడా సాఫ్ట్వేర్ కావాలనే ఆకాంక్షను కుటుంబ సభ్యుల వద్ద వెలిబుచ్చేది. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం కోరంగిలోని కైట్ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఎంట్రన్స్ పరీక్షకు తండ్రితో పాటు బైక్‌పై వెళ్లింది. పరీక్ష రాసిన అనంతరం ఇంటికి బయల్దేరిన వీరిని తాళ్లరేవు మండలం పటవల వద్ద అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఆమె ఆశలను చిదిమేసింది. ఈ ప్రమాదంలో తండ్రితో పాటు ఆమె ప్రాణాలు కోల్పోయింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు.., ఓ వ్యక్తి బైక్‌పై నిర్లక్ష్యంగా రోడ్డుపైకి దూసుకురావడం వల్ల జరిగిన ప్రమాదంలో తండ్రీ కూతురు బలి కావలసి వచ్చిందని పలువురు వాపోతున్నారు. – తాళ్లరేవు (ముమ్మిడివరం), సర్పవరం (కాకినాడ సిటీ). అతివేగంగా దూసుకెళ్లిన కారు.. నిర్లక్ష్యంగా రోడ్డుపైకి వచ్చిన మోటారుసైక్లిస్ట్.. కారణంగా తండ్రీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 216లోని పటవల వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాకినాడకు చెందిన దాట్ల శ్రీరామరాజు(45), ఆయన కుమార్తె దాట్ల లక్ష్మీహిమజ(17) దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పటవలకు చెందిన రెడ్డి శ్రీను అనే వ్యక్తి తీవ్రగాయాలపాలు కాగా, కారులో ప్రయాణిస్తున్న వి.మల్లికార్జునవర్మ, అతడి తల్లికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు, కోరంగి పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ మధురానగర్ లక్ష్మీగణపతి వీధికి చెందిన దాట్ల శ్రీరామరాజు తన కుమార్తె దాట్ల లక్ష్మీ హిమజను తీసుకుని కోరంగి కైట్ ఇంజినీరింగ్ కళాశాలకు మంగళవారం ఉదయం వచ్చారు. విజ్ఞాన్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన అనంతరం కాకినాడ తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వారు ఇంటికి చేరుకునేలోపు విధి కాటేసింది. పటవల ఫైర్ ఇనిస్టిట్యూట్‌కు సమీపంలోకి వచ్చే సరికి పటవల ఊరిలో నుంచి హైవేపైకి వచ్చేందుకు గల కంకర రోడ్డులో నుంచి రెడ్డి శ్రీను అనే వ్యక్తి నిర్లక్ష్యంగా బైక్‌పై వేగంగా హైవేపైకి రావడంతో కాకినాడ నుంచి భీమవరం వెళుతున్న డబ్ల్యూబీ02 ఏఏ5929 నంబర్ గల కారు అతి వేగంగా వెళుతూ శ్రీను బైక్‌ని ఢీకొంది. అత్యంత వేగంగా వెళుతున్న కారు నియంత్రణలోకి రాకపోవడంతో అదే సమయంలో అటుగా వస్తున్న శ్రీరామరాజు బైక్‌ను కూడా కారు వేగంగా ఢీకొట్టింది. తండ్రీ, కూతురు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న తుప్పల్లో పడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో శ్రీను కాలు విరిగి తీవ్రగాయాలపాలయ్యాడు. అలాగే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వీరిని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై సుమంత్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కారు డ్రైవర్ వి.మల్లికార్జునవర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో వైద్యం చేయించేందుకు భీమవరం తీసుకు వెళుతున్నట్టు మల్లికార్జునవర్మ పోలీసులకు తెలిపాడు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. లక్ష్మీ హిమజ కాకినాడ ఆదిత్య కళాశాలలో ఇటీవలే ఇంటర్ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం పరీక్షలు రాస్తుంది. హృదయ విదారకంగా జరిగిన ఈ ఘటనను చూసి స్థానికులు చలించిపోయారు. తండ్రీకూతుళ్లు ఒకేసారి మృతిచెందడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. చదువులో మేటిగా ఉండి ఉన్నత స్థాయికి ఎదుగుతుందనే ఆశలుపెట్టుకున్న ఆ కుటుంబానికి దాట్ల లక్ష్మీహిమజ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి సుజాత, సోదరుడు అశృతవర్మలు హిమజ మరణవార్తతో కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు. -
టైరు పంక్చరై..లారీని ఢీకొట్టిన కారు
కొత్తూరు: రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లి పొత్తిళ్లలో పడుకొని ఉన్న ఏడాది వయసున్న చిన్నారికి తల్లిని శాశ్వతంగా దూరం చేసింది. ఈ హృదయ విదారక ఘటన బుధవారం మండల కేంద్రంలోని బైపాస్ వైజంక్షన్ కూడలి సమీపంలో చోటు చేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం గ్రామానికి చెందిన దుష్యంత్‌రెడ్డి(35), ఆయన తమ్ముడు యశ్వంత్రెడ్డిలు హైదరాబాద్‌లోని లింగోజిగూడ, సరూర్‌నగర్ ప్రాంతంలో ఉంటూ అక్కడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాగా ఇటీవల స్వగ్రామంలో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తికావడంతో ఈ నెల 7న గృహ ప్రవేశం చేయాలని నిర్ణయించారు. ఏర్పాట్ల కోసం దుష్యంత్‌రెడ్డితో పాటు తల్లి జయశ్రీ,, దుష్యంత్‌రెడ్డి తమ్ముడి భార్య స్వాతి(28), ఆమె పెద్ద కుమారుడు పృథ్విక్రెడ్డి(8) చిన్న కుమారుడు రేవంత్‌రెడ్డి(01)లతో కలిసి కారులో గ్రామానికి బయలుదేరారు. కాగా కొత్తూరు వై జంక్షన్ సమీపంలోకి రాగానే కారు ముందు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి డివైడర్‌పై నుండి దూసుకొచ్చి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న స్వాతి, పృథ్విక్రెడ్డిలు కారులో నుండి ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న దుష్యంత్‌రెడ్డి తీవ్రంగా గాయపడగా ఆయన తల్లి జయశ్రీ, చిన్నారి బాలుడు రేవంత్‌రెడ్డి(1) స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ఈఎంటీ సుధాకర్ అక్కడకు చేరుకొని వారికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడకు చేరుకొన్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై నుజ్జునుజ్జయిన కారును క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు. -
ఎదురెదురుగా ఢీకొన్న మోటారు సైకిళ్లు
నారాయణఖేడ్: ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నారాయణఖేడ్ మండలంలోని అంత్వార్ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అంత్వార్ గ్రామానికి చెందిన సంగ్‌శెట్టి(41), మంజుల(16) ద్విచక్ర వాహనంపై నారాయణఖేడ్ వస్తున్నారు. రేగోడ్ మండలం దోసపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్(22) నారాయణఖేడ్ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై అంత్వార్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అంత్వార్ సమీపంలో ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సంగ్‌శెట్టి కాలు విరగగా మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు తగిలాయి. 108 అంబులెన్స్‌లో ఖేడ్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ నరేందర్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
కారు బోల్తా,ముగ్గురికి గాయాలు
-
ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం – కంబదూరు ప్రధాన రహదారిలో కృషి విజ్ఞాన కేంద్రం సమీపంలోని కొత్త మారెమ్మ ఆలయం వద్ద గురువారం రాత్రి అడవి పంది రోడ్డుకు అడ్డురావడంతో దాన్ని ఢీ కొన్న డీజిల్ ఆటో బోల్తా పడింది. దీంతో ముగ్గురుకి గాయాలయ్యాయి. కళ్యాణదుర్గం నుంచి డ్రైవర్ మాధవయ్య యర్రంపల్లి గ్రామానికి చెందిన శివ వెంకటేశులను ఎక్కించుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గంమధ్యంలోని కొత్త మారెమ్మ ఆలయం వద్దకు రాగానే ఉన్నఫలంగా అడవి పంది రోడ్డుకు అడ్డంగా వచ్చింది. దీంతో డీజిల్ ఆటో అదుపుతప్తి బోల్తా పడగా శివకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. వెంకటేశులు, డ్రైవర్ మాధవయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్య చికిత్సల కోసం శివను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పేలిన సిలిండర్,ముగ్గురికి గాయాలు
-
కర్నూలులో పిడుగు పడి ముగ్గురికి గాయాలు
-
ఢిల్లీ శివార్లలో కాల్పులు.. తల్లీకొడుకుల హత్య
దేశ రాజధాని శివార్లలో ఘోరం జరిగింది. వ్యాపారంలో వచ్చిన గొడవలతో తన భాగస్వామి ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించిన ఓ వ్యక్తి.. అతడి భార్యను, చిన్న కొడుకును కాల్చి చంపాడు. వ్యాపారవేత్త అజయ్ ఖురానాను, అతడి పెద్దకొడుకును, ఇంట్లో పనిచేసే వ్యక్తిని కూడా నిందితుడు రాజేష్ జాలీ పొడిచేశాడు. వాళ్లు ముగ్గురినీ నోయిడా సెక్టార్ 28 లోని కైలాష్ ఆస్పత్రిలో చేర్చారు. నిందితుడికి కూడా తలమీద తీవ్రగాయాలు కావడంతో అతడిని కూడా ఆస్పత్రిలో చేర్చారు. అయితే అతడికి గాయాలు ఎలా అయ్యాయో మాత్రం పోలీసులు చెప్పలేకపోతున్నారు. వడ్డీ వ్యాపారం చేసే వీళ్లిద్దరి మధ్య ఆర్థిక విషయాల్లోనే గొడవ జరిగిందని అంటున్నారు. రాత్రి 11 గంటలకు ఖురానా ఇంటికి వచ్చిన జాలీ.. ముందుగా ఖురానా భార్య అంజు, చిన్న కొడుకు అంకుశ్ (33)లను చంపేసిన తర్వాత పెద్దకొడుకు అమిత్ (38), ఇంట్లో పనిచేసే రాజులను కూడా పొడిచాడు. ముందుగా భోజనం చేస్తున్న అంకుశ్ మీద కాల్పులు జరిపాడు. తుపాకి మోత విని అంజు బయటకు రాగా ఆమెను కూడా కాల్చేశాడు. వాస్తవానికి ఖురానాను మాత్రమే చంపుదామని అతడు వచ్చాడని, కానీ అతడి మీద కాల్పులు జరిపినా తప్పించుకున్నాడని పోలీసులు అంటున్నారు. అంతలో ఖురానా పెద్దకొడుకు అమిత్ ఎలాగోలా జాలీని పట్టుకున్నాడు. అతడిని ఆపేందుకు తండ్రీకొడుకులు ప్రయత్నించినా, పదునైన ఆయుధంతో ఇద్దరినీ పలుమార్లు పొడిచేశాడు. తుపాకుల మోత విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు వచ్చిన పోలీసు బృందం జాలీని అదుపులోకి తీసుకుని అందరినీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే అంజు, అంకుశ్ మరణించారని, ఖురానా, అమిత్, రాజు ఐసీయూలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
కూకట్‌పల్లిలో డీసీఎం బీభత్సం
-
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
లేపాక్షి : మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. కల్లూరు–నాయనిపల్లి రహదారిలో బుధవారం సాయంత్రం రెండు బైకులు ఢీకొని ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. కల్లూరు గ్రామానికి చెందిన నంజుండప్ప(62) నాయనిపల్లి నుంచి కల్లూరుకు పోతున్నాడు. అదే సమయంలో నాయనిపల్లికి చెందిన శ్రీనివాసులు (40) కల్లూరు నుంచి నాయనిపల్లికి తన బైకులో వెళ్తున్నాడు. ఈక్రమంలో రోడ్డు మలుపు వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నంజుండప్ప కాలికి తీవ్రగాయాలు కాగా, శ్రీనివాసులు తలకు, కాలికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించబోయి.. లేపాక్షి మండల కేంద్రంలోని లేపాక్షి సాయిదుర్గా సేవా ట్రస్టు ఎదురుగా ఉన్న రహదారిలో ద్విచక్రవాహనం బోల్తా పడి వ్యక్తి గాయపడ్డాడు. వివరాలు.. బుధవారం సాయంత్రం హిందూపురం పట్టణంలోని బోయపేటకు చెందిన నంజుండప్ప (45) వ్యాపార నిమిత్తం పనులు ముగించుకుని చిలమత్తూరు నుంచి హిందూపురం వైపు బైకులో ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలో లేపాక్షి సాయిదుర్గా సేవా ట్రస్టు వద్ద ఎదురుగా లారీ, కారు వస్తుండగా వాటిని తప్పించడానికి ప్రయత్నించగా బైకు అదుపు తప్పి కింద పడింది. ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కాగా, చెవిలో రక్తం కూడా వస్తోంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుణ్ని చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించారు. బైకును లేపాక్షి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
కుప్పకూలిన సుఖోయ్-30 విమానం
రాజస్థాన్ : సుఖోయ్-30 విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్ ప్రాణాలతో సురక్షితంగా తప్పించుకున్నారు. రాజస్థాన్ బర్మర్ జిల్లా శివకర్ కుద్లా గ్రామం వద్ద బుధవారం విమానం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు స్థానికులు గాయపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఈ విమానాన్ని ఉత్తర్లాయి ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ చేస్తుండగా, ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయపడిన ధుర రామ్ ఆయన భార్య, మనవడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ధర్మవరంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య మరో వివాదం చెలరేగింది. పరిటాల వర్గీయులు చేపట్టిన విద్యుత్ కేబుల్ పనులను ఎమ్మెల్యే సూరి వర్గంవారు అడ్డుకున్నారు. దీంతో పరిటాల, సూరి వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు పరిటాల వర్గీయులకు గాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా సూరి వర్గీయులు పోలీసుల ద్వారా కేబుల్ పనులను ఆపేందుకు యత్నించారు. దీంతో పోలీసులతో మంత్రి పరిటాల వర్గీయులు వాగ్వివాదానికి దిగారు. కేబుల్ పనులు కొనసాగించి తీరుతామని పరిటాల వర్గీయులు స్పష్టం చేశారు. -
ఘోర ప్రమాదంలో ముగ్గురి మృతి
-
గ్యాస్ సిలిండర్ పేలుడు : ముగ్గురికి గాయాలు
యాదాద్రి : యాదాద్రి జిల్లాలో శనివారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బీబీనగర్ మండలం ఇందిరమ్మ కాలనీలో ఈ ప్రమాదం సంభవించింది. ఎస్సై సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన పెద్దపాటి లచ్చిరెడ్డి ఇంట్లో వంట చేస్తుండగా శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో లచ్చిరెడ్డి, అతని భార్య రాజమ్మకు తీవ్రగాయాలు కాగా.. లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద శబ్ధం రావడాన్ని గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. పేలుడు ధాటికి ఇళ్లు పాక్షికంగా దెబ్బతింది. -
జనంపైకి దూసుకెళ్లిన కారు ఒకరి మృతి
-
ముంబైలో కారు బోల్తా ఆరుగురు మృతి
-
కల్వర్టులో పడిపోయిన కారు,ఒకరు మృతి
-
అడవి పంది దాడి: ముగ్గురికి గాయాలు
వరంగల్: వరంగల్ జిల్లా చేర్యాల మండల కేంద్రంలో శనివారం అడవిపంది హల్చల్ చేసింది. స్థానిక పాత వీరభద్ర సినిమాహాల్ సమీపంలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు పాదచారులపై అడవిపంది దాడి చేసింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అడవిపందిని చంపేశారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
అనంతపురం సెంట్రల్ : రుద్రంపేటలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ దినపత్రికలో పనిచేస్తున్న రాజారెడ్డి ఇంటి నుండి విధులకు వెళ్తుండగా ఎదురుగా మరొక ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు
చివ్వెంల: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని బీబిగూడెం, దురాజ్‌పల్లి గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఖమ్మం పట్టణానికి చెందిన గోపాలదాస్ చందు స్వగ్రామం వెళ్లేందుకు బీబిగూడెం గ్రామంలో సూర్యాపేట–ఖమ్మం రహదారి వెంట నిలబడి ఉన్నాడు. ఈ క్రమంలో సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చందు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అదేవిధంగా దురాజ్‌పల్లి గ్రామ శివారులో సూర్యాపేట నుంచి కోదాడ వైపు వెళ్తున్న టాటాఏస్ అదుపు తప్పి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అహ్మద్, కమతం నరేందర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
డివైడర్‌ను ఢీకొట్టిన కారు : ముగ్గురికి గాయాలు
దువ్వూరు : కడప జిల్లా దువ్వూరు చెరువు సమీపంలో మంగళవారం కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతికి చెందిన జ్యోత్స్న, బ్రహ్మయ్య, చాంద్‌బాషా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. డివైడర్లోకి దూసుకుపోయిన కారును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురు హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిచ్చికుక్క కరిచి ముగ్గురికి తీవ్రగాయాలు
నెల్లూరు(బృందావనం): ఫతేఖాన్‌పేట అరిగెలవారివీధిలో శనివారం పిచ్చికుక్క కరిచి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. పది నిమిషాల వ్యవధిలో పాఠశాలలకు వెళ్తున్న ఏడేళ్ల బాలిక వైష్ణవి, పన్నెండేళ్ల బాలిక నాగశర్వాణి, విధులకు వెళ్తున్న హరీష్‌ను కరిచి గాయపర్చింది. ఫతేఖాన్‌పేటలోని పలు వీధుల్లో సైతం శుక్రవారం మరో ముగ్గుర్ని కరిచినట్లు బంధువులు తెలిపారు. బాధితులు రెడ్‌క్రాస్, ప్రైవేట్ ఆస్పత్రులకు ఆశ్రయించారు. ఫతేఖాన్‌పేట, అరిగెలవారివీధి, సకిలంవారివీధి, రైతు బజార్‌సెంటర్, పాత పోలీస్ క్వార్టర్స్, రాగిచెట్టు సెంటర్ ప్రాంతాల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భద్రతా దళాలపై 'ఉగ్ర' కాల్పులు
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా దళాలపై కశ్మీర్ లోని బడ్గమ్ జిల్లాలో కాల్పులకు తెగబడ్డారు. ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ తో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరళించారు. ఘటన అనంతరం ఆర్మీని అప్రమత్తం చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల సీఆర్ఫీఎఫ్ భద్రతా దళాలపై కాల్పులు జరపడంతో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందగా మరో 22 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు: ఇద్దరు దుర్మరణం
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల సాంబవరం మెట్ట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతులు చిత్తూరు జిల్లాకు చెందిన ధనలక్ష్మి, మణెమ్మగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు ఢీకొని యువకుడు మృతి
తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకు శివారులోని 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పలుగుపట్నం గ్రామానికి చెందిన కోలా మల్లేష్(30), ముత్యాలరావు(35) ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మల్లేష్ అక్కడికక్కడే మృతిచెందగా, ముత్యాలరావు, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీసీఎం బోల్తా: ముగ్గురికి గాయాలు
హైదరాబాద్: రాజేంద్రనగర్ మండలంలో మంగళవారం ఉదయం డీసీఎం బోల్తాపడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆయిల్ పీపాలతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ప్రమాదవశాత్తు ఆరాంఘర్ చౌరస్తాలో బోల్తా పడింది. వ్యాన్‌లోని పీపాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పాడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. -
కారు బోల్తా: ముగ్గురికి గాయాలు
మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయాలయ్యాయి. పట్టణానికి చెందిన విద్యుత్ శాఖ ఏడీఈ తిలక్‌కు చెందిన కారులో ఆయన భార్య శివలింగాపూర్‌లో ఉన్న శివాలయానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో వారి వాహనానికి అకస్మాత్తుగా అడ్డువచ్చిన బైక్‌ను ఢీకొట్టి, అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న తిలక్ భార్య గాయపడ్డారు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులకు స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ పరారు కాగా స్థానికులు క్షతగాత్రురాలిని కారు నుంచి బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. -
ఆటో నుంచి కిందపడి ముగ్గురికి గాయాలు
ఒంగోలు : ఆటో నుంచి కిందపడి ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాల పాలైన సంఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కొండేపి మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..... కొండేపి మండలం నేతివారిపాలెం గ్రామానికి చెందిన గోవిందమ్మ (65), కవిత (35), స్మైలీ (8) మంగళవారం కొండేపి నుంచి వారి గ్రామానికి ఆటోలో వెళ్తున్నారు. వారు ఆటో వెనుక భాగంలో కూర్చున్నారు. అయితే వారు ప్రయాణిస్తున్న ఆటోకు అకస్మాత్తుగా గేదెల మంద అడ్డం వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్ ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. ఆటో అదుపు తప్పి వెనుక కూర్చున్న ఐదుగురు వ్యక్తులు కిందపడ్డారు. వారిలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... వారిని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ బోల్తా : ముగ్గురికి గాయాలు
వరంగల్ : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం జాతీయరహదారిపై గురువారం పత్తి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని...క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే లారీ బోల్తాతో రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు రంగంలోని దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దైవ దర్శనానికి వెళ్తూ.. అనంతలోకాలకు
వరంగల్: భద్రాచలంలోని రాములవారిని దర్శించుకోవడానికి కుటుంబ సభ్యులతో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి గ్రామ శివారులో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన బంగారు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలసి కారులో భద్రాచలం బయలుదేరారు. ఈ క్రమంలో మంగపేటలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుంచి చుంచుపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే.... కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పుష్పమ్మ(68) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా : ఇద్దరు మృతి
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలం సిర్నపల్లి సమీపంలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో - లారీ ఢీ: ఒకరి మృతి
గుంటూరు : గుంటూరు జిల్లా నాదెండ్ల వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఆటో - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బస్సును ఢీకొన్న కారు: ఒకరు మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బలిజపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన లారీ: ముగ్గురికి గాయాలు
నల్గొండ : నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా దట్టమైన పొగమంచు ఆవరించి ఉంది. ఈ నేపథ్యంలో పొగమంచు కారణంగా రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడపోవడం జరుగుతుంది పోలీసులు తెలిపారు. ఆ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. -
హోటల్లోకి దూసుకెళ్లిన లారీ : ముగ్గురికి తీవ్రగాయాలు
మెదక్ : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. అధిక వేగంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
స్కూల్ బస్సును ఢీకొట్టిన మరో బస్సు
విశాఖపట్నం : రహదారిపై ఆగి ఉన్న స్కూల్ బస్సును మరో స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌తోపాటు మరో వ్యక్తి గాయపడ్డాడు. రహదారిపై వాహనదారులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై చైతన్య స్కూల్ ఆగి ఉంది. వెనక నుంచి వచ్చిన కృష్ణవేణి స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
లక్నో: గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్ లోని హర్డోయ్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హర్డోయ్ జిల్లా ఆసుపత్రి ఎదుట నేటి మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ ఓ గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో సమీపంలో ఉన్న గ్యారేజీలో కారు రిపేర్ చేస్తున్న ఇద్దరు వర్కర్లు, వాహన యజమాని గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం రాజధాని లక్నోలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించినట్లు వివరించారు. -
నీలాద్రిపేటలో పేలుడు : ముగ్గురికి తీవ్రగాయాలు
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిపేటలో శుక్రవారం బాణాసంచా తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం...గ్రామానికి చెందిన శీలం సత్తిబాబు ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా అనుకోకుండా పేలుడు జరిగింది. ఈ ఘటనలో సత్తిబాబు, అతని భార్య అశ్విని, సోదరుడు ప్రసాద్ గాయపడ్డారు. పేలుడుతో ఇల్లు పూర్తిగా దెబ్బతింది. సత్తిబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇన్వర్టర్ పేలటం వల్లే తామంతా గాయపడ్డామని బాధితులు చెబుతున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. -
భూవివాదం.. ముగ్గురికి కత్తిపోట్లు
-
భూవివాదం.. ముగ్గురికి కత్తిపోట్లు
పెద్దపల్లి : పొలం తగాదా కారణంగా గొడవ జరిగి ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం కుర్మపల్లి గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. కుర్మపల్లి గ్రామానికి చెందిన రాయమల్లు, సంతోష్‌లకు చెందిన పొలాలు పక్కపక్కనే ఉంటాయి. రాయమల్లు పొలం మీదుగా వీరయ్యగౌడ్ అనే వ్యక్తి పెద్ద బండరాయి తీసుకెళుతుండగా తన పొలం నుంచి ఎందుకు తీశావంటూ రాయమల్లు అడ్డుకున్నాడు. ఈ రాయి పక్కనున్న క్వారీదని చెప్పినా వినిపించుకోకుండా గొడవకు దిగాడు. కాసేపయ్యాక రాయమల్లు, సంతోష్, హరీష్ అనే వ్యక్తులు వీరయ్యగౌడ్ ఇంటి వద్దకు వెళ్లి ప్రశ్నించడంతో ఆగ్రహించిన అతడు కత్తితో ముగ్గురిని పొడిచాడు. స్థానికులు అక్కడకు వచ్చి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దపల్లి ఎస్ఐ తెలిపారు. -
బైక్‌లను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
-
ఆటో బోల్తా: ముగ్గురికి తీవ్రగాయాలు
మద్దిగర్ర: కర్నూలు జిల్లా మద్దిగర్ర మండల శివారులో గుంతకల్లు వెళ్లే రహదారిపై ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రాజేష్ (34) అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కసాపురం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ఆదోని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బైకు బోల్తా: ముగ్గురికి గాయాలు
కొత్తూరు (శ్రీకాకుళం): బైకు ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం వీఎన్‌పురం గ్రామ సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని మాకవరం గ్రామానికి చెందిన నరేశ్ (23), రోడ గ్రామానికి చెందిన మహేశ్ (29) ఒడిశా రాష్ట్రానికి చెందిన కె.అజయ్ (24) బైకుపై కొత్తూరు నుంచి హీరాకు వెళ్తున్న సమయంలో.. వీఎన్‌పురం గ్రామ సమీపంలోకి చేరుకోగానే.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయిన బైకు బోల్తా కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
న్యూయార్క్ లో పేలుడు
న్యూయార్క్: పాఠశాల ఆవరణంలో పేలుళ్లు సంభవించి ముగ్గురు గాయపడ్డారు. పాఠశాల భవనం దెబ్బతింది. ఈ సంఘటన న్యూయార్క్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు.. న్యూయార్క్ లోని యోషితా లోని మహత్తాన్ పాఠశాల ఆవరణంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీకేజి కావడంతో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో స్కూలు భవనంలో ముగ్గురే ఉన్నట్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు తెలిపాడు. పేలుడు ప్రభావంతో పాఠశాలలో మూడు అంతస్తులు ధ్వంసం అయ్యాయని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ పాఠశాలలో మొత్తం 1291 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. -
లారీ, బైక్ ఢీ : ఒకరు మృతి
పశ్చిమ గోదావరి : వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఒక వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ముదునూరు సమీపంలో మంగళవారం జరిగింది. ఉంగుటూరు మండలం నాచుకుంట గ్రామానికి చెందిన వర్జి రవి(32) ద్విచక్రవాహనంపై తన కుటుంబ సభ్యులతో ముదునూరు నుంచి నాచుకుంట వెళ్తున్న క్రమంలో రహదారిపై ఉన్న కాంటా వేబ్రిడ్జి వద్ద టర్న్ అవుతున్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు కార్లు ఢీకొని ఇద్దరు మృతి
పశ్చిమ గోదావరి (తాడేపల్లిగూడెం) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆటోనగర్ వద్ద జాతీయరహదారిపై గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న మహీంద్రా వాహనం అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన తాడేపల్లిగూడెంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా వారి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాజీ ఎంపీ తనయుడి కారు ఢీకొని ముగ్గురికి గాయాలు
రాజమండ్రి రూరల్ (తూర్పుగోదావరి) : మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు అజాగ్రత్తగా కారు నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మండలం కోలమూరులో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురిక తీవ్ర గాయాలయ్యాయి. మాజీ ఎంపీ తనయుడు సుందర్ శనివారం అర్థరాత్రి కారులో వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టటంతో మహేష్, చంటి, మనోజ్ అనే స్థానిక యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. హర్షకుమార్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. -
టిప్పర్‌ను ఢీకొన్న కారు: ముగ్గురికి గాయాలు
ఖమ్మం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం క్రాస్ రోడ్డు వద్ద ఆగిఉన్న టిప్పర్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సింగరేణికి చెందిన ఏజీఎంతో సహా ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లారీని ఢీకొన్న బస్సు: ముగ్గురికి గాయాలు
పెద్ద వడుగూరు(అనంతపురం): జాతీయ రహదారిపై రోజురోజుకీ ప్రమాదాలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం తెల్లవారుజామున కాళేశ్వరీ ట్రావెల్స్ బస్సు, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పెద్ద వడుగూరు మండలం మిడతూరు వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీపంలోని గుత్తి ఆస్పత్రికి తరలించారు.హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు - లారీ ఢీ: ఇద్దరు మృతి
మెదక్ : మెదక్ జిల్లా కంకోల్ గ్రామ సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై కారు - లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు కార్లు ఢీ
పుల్కల్ (మెదక్) : మెదక్ జిల్లా పుల్కల్ మండలం కార్‌దాన్‌పల్లి వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కార్‌దాన్‌పల్లి గ్రామంలోని చౌరస్తా వద్ద ఇండికా కారు టైరు పేలి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారును ఢీకొంది. దీంతో ఇండికా కారులో ఉన్న ముగ్గురిలో రహీనాబేగం అనే మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడి వైద్యుల సలహా మేరకు హైదరాబాద్ ఉస్మానియాకు తరలించారు. క్షతగాత్రురాలు హైదరాబాద్‌లోని కిషన్ బాగ్‌కు చెందిన మహిళగా గుర్తించారు. అలాగే స్విఫ్ట్ కారులో ఉన్న ఐదుగురిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
క్వారీలో ప్రమాదం...
వరంగల్: క్వారీలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం వరంగల్ జిల్లా కేసముద్రం మండల కేంద్రం శివారులో ఉన్న మెడ్‌వెస్ట్ క్వారీలో జరిగింది. వివరాలు.. క్వారీలో పేలుడు సంభవించడంతో అక్కడే పని చేస్తున్న ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రస్తుతానికి వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. (కేసముద్రం) -
పిచ్చికుక్కల స్వైరవిహారం.. ముగ్గురిపై దాడి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని బెజ్జూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గురువారం రోడ్డుపై వెళుతున్న ఓ ముగ్గురు విద్యార్థినులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిలో గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల స్వైర విహారంతో.. స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తాయోనని బయటకు రాలేకపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద కారు బీభత్సం
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయం వద్ద సోమవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ ట్యాక్సీని ...ఓ కారు అదుపు తప్పి వెనుక నుండి ఢీకొనటంతో ముగ్గురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆగి ఉన్న లారీని ఢీ కొన్న కారు-ముగ్గురికి గాయాలు
దర్శి(ప్రకాశం): రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీను ఢీ కొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. దర్శికి చెందిన తాటి వెంకటేశ్వర్లు, మేకల దుర్గాప్రసాద్, బాలులు కారులో వెళ్తున్నారు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న లారీ లైట్ల ఫోకస్ ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పిన కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో కారు బేలూన్లు తెరుచుకోవడంతో పెనుప్రమాదం తప్పి ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఎక్కువగా గాయపడిన దుర్గాప్రసాద్‌ను 108లో దర్శికి తరలించి, పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలుకు తీసుకెళ్లారు. -
బైక్ బోల్తా... ముగ్గురికి తీవ్ర గాయాలు
పాడేరు: విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం మస్త్యగెడ్డ వద్ద ఓ బైకు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం పాడేరు వైపు బైక్‌పై వెళుతుండగా ... ఎదురుగా వస్తున్న జీపును తప్పించబోయి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. -
స్కార్ఫియోను ఢీకొన్న లారీ, ఇద్దరి మృతి
-
స్కార్ఫియోను ఢీకొన్న లారీ, ఇద్దరి మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా గుడిపాల మండలం నరహరిపేట చెక్‌పోస్ట్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్ఫియోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనటంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఓ కేసుకు సంబంధించి ఇన్‌ఫార్మర్‌తో నిందితుల కోసం చెన్నై నుంచి మదనపల్లికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇన్‌ఫార్మర్‌తో పాటు మరొకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీని ఢీకొన్న కారు, ఇద్దరి మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లా పెళ్లకూరు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి వున్న లారీని కారు వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు తిరుపతికి చెందిన రేష్మా, అమిత్‌గా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికా స్కూల్లో కాల్పులు.. ముగ్గురికి గాయాలు
అమెరికాలో మళ్లీ స్కూల్లో కాల్పులు కలకలం రేపాయి. ఓరెగావ్ రాష్ట్రంలో ఓ హైస్కూల్ వెలుపల జరిగిన కాల్పుల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది మాఫియా పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపినవాళ్లు వెంటనే అక్కడినుంచి పారిపోవడంతో వాళ్లను పట్టుకోడానికి గాలింపు మొదలైంది. గాయపడిన వాళ్లలో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వాళ్లంతా స్పృహలోనే ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు. ఉత్తర పోర్ట్లాండ్ లోని రోజ్మేరీ ఆండర్సన్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గాయపడిన వాళ్లు వెంటనే స్కూల్లోకి పరుగులు తీశారని, వెంటనే కాల్పులు జరిపినవాళ్లు పారిపోయారని తెలిపారు. మామూలు హైస్కూళ్లలో ఫీజులు కట్టి చదువుకునే స్థోమత లేని పిల్లల కోసం సమాజంలో ఉన్నవాళ్ల విరాళాలతో ఈ పాఠశాల నడుస్తుంటుంది. కాల్పులు జరిపినవాళ్లకు మాఫియా గ్యాంగులతో సంబంధం ఉండి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
లారీ - కారు ఢీ: ఒకరు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జగమర్ల వద్ద లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డిప్యూటీ సీఎం కాన్వాయ్‌లోని వాహనం బోల్తా
కడప: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్. చిన రాజప్ప ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు సమీపంలోని రాయప్పగారి పల్లె వద్ద చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు ప్రాధమిక చికిత్స అందించారు. శనివారం చిన రాజప్ప వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించారు. -
వోల్వో బస్సు-లారీ డీ, క్లీనర్ మృతి
-
కాలువలో పడిన కారు : 8 మంది మృతి
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ రామబన్ జిల్లాలో ఓ వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారని పోలీసులు వెల్లడించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మొత్తం 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం నచాలన - షేర్ బిబి ప్రాంతంలోని కాది - మోహీ వద్ద అదుపు తప్పి కాలువలో పడిందని చెప్పారు. కాలువ నుంచి కారును బయటకు తీసుకువచ్చేందు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వివరించారు. -
దుకాణంలోకి దుసుకెళ్లిన లారీ
-
మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరు మృతి
-
మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరు మృతి
మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నం చల్లరాస్తా వద్ద సోమవారం ఉదయం మంత్రి కొల్లు రవీంద్ర ఎస్‌టార్క్ వాహనం అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. మంత్రిని మచిలీపట్నంలో దించి వాహనం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాజీమంత్రి బాలరాజుకు తృటిలో తప్పిన ప్రమాదం
విశాఖ : మాజీమంత్రి బాలరాజు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలరాజు తలకు, కాలికి గాయాలు అయినట్లు సమచారం. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో ముగ్గురు గాయపడ్డారు. నర్సీపట్నం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బైక్,లారీ ఢీ : ముగ్గురికి గాయాలు
-
రెండు కార్లు ఢీ: ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
వరంగల్ జిల్లా రఘునాధపల్లి మండలం పూమళ్ల వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఆ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బావా, బావమరిది ప్రచారాల్లో అపశ్రుతి
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, హిందుపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ ప్రచారంలో సోమవారం అపశ్రుతి చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో చంద్రబాబు ప్రచార రథం అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు అనంతపురం జిల్లా హిందుపురంలో ప్రచారం చేస్తున్న బాలకృష్ణ కాన్వాయ్ తగిలి ఒకరు గాయపడ్డారు. అయితే ఆ విషయాన్ని బాలయ్య ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగారు. ఈ ఘటనపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ బస్సు ట్యాంకర్ ఢీ,ముగ్గురికి గాయాలు
-
తిరుమలలో తొక్కిసలాట, ముగ్గురికి గాయాలు
-
తిరుమలలో తొక్కిసలాట, ముగ్గురికి గాయాలు
తిరుమల : తిరుమలలో అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. గర్భాలయంలోకి ప్రవేశించిన అనంతరం ధ్వజ స్థంభం వద్ద భక్తులు ఒక్కసారిగా తోసుకు రావటంతో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా యాదవేలుకు చెందినవారు. చిత్తూరు జిల్లా నాగలాపురం వేదనారాయణస్వామి ఆలయంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తిరుమలకు చేరుకున్న కళాకారుల బృందాలకు టిటిడి బుధవారం స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేసింది. ఈ కళాకారుల బృందాలను నిన్న సాయంత్రం శ్రీవారి దర్శనానికి అనుమతించారు. మహాద్వారం దాటి వెళ్లిన అనంతరం సిబ్బంది ఒక్కసారిగా భక్తులను వదలడంతో భక్తులు పరుగులు తీశారు. ఈ సందర్భంగా వెండి వాకిలి వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో వారి వెంట ఉన్న చిన్నారులు స్వల్ప గాయాలకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. గాయపడిన పావని, జయలక్ష్మి, లోకేష్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.