
ఆగి ఉన్న లారీని ఢీ కొన్న కారు-ముగ్గురికి గాయాలు
దర్శి(ప్రకాశం): రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీను ఢీ కొట్టింది. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. దర్శికి చెందిన తాటి వెంకటేశ్వర్లు, మేకల దుర్గాప్రసాద్, బాలులు కారులో వెళ్తున్నారు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న లారీ లైట్ల ఫోకస్ ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పిన కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో కారు బేలూన్‌లు తెరుచుకోవడంతో పెనుప్రమాదం తప్పి ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఎక్కువగా గాయపడిన దుర్గాప్రసాద్‌ను 108లో దర్శికి తరలించి, పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలుకు తీసుకెళ్లారు.