కృష్ణాజిల్లా మచిలీపట్నం చల్లరాస్తా వద్ద సోమవారం ఉదయం మంత్రి కొల్లు రవీంద్ర ఎస్టార్క్ వాహనం అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది.
మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నం చల్లరాస్తా వద్ద సోమవారం ఉదయం మంత్రి కొల్లు రవీంద్ర ఎస్టార్క్ వాహనం అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. మంత్రిని మచిలీపట్నంలో దించి వాహనం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.