తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకు శివారులోని 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పలుగుపట్నం గ్రామానికి చెందిన కోలా మల్లేష్(30), ముత్యాలరావు(35) ద్విచక్రవాహనంపై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చి కారు ఢీకొంది.
ఈ ప్రమాదంలో మల్లేష్ అక్కడికక్కడే మృతిచెందగా, ముత్యాలరావు, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.