Escort vehicle
-
మంత్రి కాన్వాయ్ చూసి భయపడుతున్న జనం
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు. మంత్రి పదవి కూడా దక్కింది. జిల్లాలో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలంటూ నిత్యం ఆమె బిజీగా ఉంటారు. రాష్ట్ర మంత్రి కావడంతో కేబినెట్ హోదాలో ఎస్కార్ట్ వాహనం, కాన్వాయ్ వంటి హంగులు, భద్రత అంతా సమకూరింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆ కాన్వాయ్ అంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలే అందుకు కారణం. గత నెల 26న మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరకు మంత్రి కాన్వాయ్ వల్ల పెనుప్రమాదమే తప్పింది. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సాలూరు పట్టణంలోని పీఎన్ బొడ్డవలస వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఆయన వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణమైన సమయంలో మంత్రి కాన్వాయ్ బొడ్డవలస వైపు వెళ్తోంది. బంగారమ్మపేట వద్దకు వచ్చేసరికి వేగంగా వచ్చిన మంత్రి కాన్వాయ్.. రాజన్నదొర ప్రయాణిస్తున్న వాహనం మీదుకు దూసుకొచ్చింది. ఆయన డ్రైవర్ వాహనాన్ని చాకచక్యంగా వాహనాన్ని పూర్తిగా ఎడమవైపు తిప్పాడు. అప్పటికే మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం.. రాజన్నదొర వాహనం సైడ్ మిర్రర్‌ను రాసుకుంటూ వెళ్లిపోయింది. దీనిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసంచార ప్రాంతంలో, ఇరుకు రహదారులపై అంతవేగంగా వాహన శ్రేణిని నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.సెప్టెంబరులో బూశాయవలస వద్ద ప్రమాదం..గత సెప్టెంబరు 12వ తేదీన ఉదయం రామభద్రపురం మండలంలోని బూశాయవలస–ఆరికతోట మధ్యలో జాతీయ రహదారిపై మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం–ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహన డ్రైవర్‌తోపాటు, ఆర్ఎస్సై, ముగ్గురుపోలీసులు, మినీ వ్యాన్‌లో ఉన్న మురో ముగ్గురికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు రెండు ప్రమాదాల్లో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.ప్రజల్లో ఆందోళన..మంత్రి ప్రయాణించే కాన్వాయ్ తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో ప్రజలు కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు. రాష్ట్రమంత్రి వాహన శ్రేణి కావడంతో అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. రద్దీ ప్రాంతాలు, సింగిల్ రోడ్లలో సైతం వాహన శ్రేణి అత్యంత వేగంగా వెళ్తోందని చెబుతున్నారు. మున్ముందు ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా వాహన శ్రేణి చోదకులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. -
మినీ వ్యాన్‌ను ఢీకొన్న ఏపీ మంత్రి ఎస్కార్ట్ వాహనం.. పలువురికి గాయాలు
సాక్షి, విజయనగరం: ఏపీ మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం మినీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ వ్యాన్ డ్రైవర్ సహా ముగ్గురు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు.వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాలోని బుసాయవలస వద్ద ఏపీ మంత్రి సంధ్యా రాణి ఎస్కార్ట్‌లోని వాహనం ఎదురుగా వస్తున్న మీనీ వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్యూటీలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్స్ సహా మినీ వ్యాన్ డ్రైవర్ గాయపడ్డారు. దీంతో, వారిని విజయనగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. -
Hyderabad: నో పార్కింగ్.. అయితే ఏంటి?
బంజారాహిల్స్: ప్రజావసరాలు, ప్రజాప్రతినిధుల కోసం, వారికి ఎస్కార్టుగా ఉండటం కోసం కేటాయించిన వాహనాలను కొంత మంది సిబ్బంది వారి వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కుకు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ఎస్కార్ట్ వాహనంలో డ్రైవర్, గన్మెన్లు నిత్యం వాకింగ్‌కు వస్తున్నారు. పార్కు వద్ద నో పార్కింగ్జోన్లో నిత్యం వాహనాన్ని నిలుపుతున్నారు. ఇక్కడ వాహనాలు పార్కింగ్ చేయవద్దని వాకర్లు ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. మంత్రిగారి వాహనం ఇది అంటూ దబాయిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఇక్కడ విధుల్లో ఉన్న పోలీసులు సైతం ప్రశ్నించడంతో వారిని సైతం మీ ఉద్యోగాలు ఉండాలా పోవాలా అంటూ బెదిరించినట్లు సమాచారం. -
హోం మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకోని వ్యక్తి మృతి ..కానీ కాన్వాయ్..
కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఎస్కార్ట్ వాహనం బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హాసన్ జిల్లా అర్సికెరెలోని గండాసి గ్రామంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి చామరాజనగర్ జిల్లాలోని ప్రసిద్ధ కేత్రమైన మలే మహాదేశ్వర బెట్ట నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఐతే ప్రమాదం జరిగిన తర్వాత జ్ఞానేంద్ర అతని కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. ఐతే వ్యక్తిని ఢీకొట్టిన ఎస్కార్ట్ వాహనం ప్రధాన కాన్వాయ్‌లో భాగం కాదని, వారి వాహానాల వెనుకే ప్రయాణించిందని కర్ణాటక హోంమంత్రి కార్యాలయం పేర్కొంది. (చదవండి: భర్త పాయిజన్ తీసుకుని చనిపోవడంతో భార్య..) -
పోలీస్ స్టేషన్ ఎదుట మోదీ సోదరుడి ధర్నా
జైపూర్ : వ్యక్తిగత భద్రతాసిబ్బందికి ప్రత్యేక వాహనం కేటాయించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మంగళవారం ఆందోళనకు దిగారు. జైపూర్ - అజ్మేర్ జాతీయ రహదారి మార్గంలోని బగ్రు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు.. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం ప్రహ్లాద్ మోదీకి ఇద్దరు పీఎస్వో(వ్యక్తిగత భద్రతా అధికారులు)లను కేటాయించింది. నిబంధనల ప్రకారం.. వ్యక్తిగత భద్రతా సిబ్బంది ప్రహ్లాద్‌తో పాటు ఒకే వాహనంలో వెళ్లాలి. అయితే ఇందుకు ఆయన అంగీకరించలేదు. భద్రతా సిబ్బందిని తన వాహనంలో తీసుకెళ్లడం కుదరదని.. వారికి ప్రత్యేక పోలీస్ వాహనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతటితో ఊరుకోక పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. దాదాపు గంట పాటు ప్రహ్లాద్ ఆందోళన సాగింది. అనంతరం పోలీసులు సర్దిచెప్పడంతో ప్రహ్లాద్ మోదీ భద్రతా సిబ్బందిని వెంట తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయం గురించి ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నా భద్రత కోసం ఇద్దరు పీఎస్‌ఓలను కేటాయించింది. నేను ఎక్కడికి వెళ్లినా వారు నాతో పాటే వస్తారు. అయితే ఈ సారి నేను కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నాను. దాంతో నా కారులో చోటు లేదు. అందుకే వారికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను కోరాను. కానీ వారు అంగీకరించలేద’ని ప్రహ్లాద్ మోదీ తెలిపారు. -
అల్లు అర్జున్ కాన్వాయ్‌లో అపశ్రుతి
ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరికిస్వల్ప గాయం నిర్వాహకులపై త్రీ టౌన్లో కేసు నమోదు విశాఖపట్నం: నగరంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం నగరానికి వచ్చిన ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం ఢీకొట్టడంతో చినవాల్తేరు ప్రాంతానికి చెందిన చెన్నా సంగీతరావు స్వల్పంగా గాయపడ్డారు. బీచ్‌రోడ్డులోని తన తాత అల్లు రామలింగయ్య విగ్రహానికి పూల మాల వేయడానికి అల్లు అర్జున్ తన అభిమానులతో కలిసి ర్యాలీగా వెళుతున్న సమయంలో ఏడాదిన్నర పసిపాపతో వెళుతున్న సంగీతరావు ద్విచక్రవాహనాన్ని కాన్వాయ్ వాహనం ఢీకొంది. అయినప్పటికీ కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోవడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. బాధితుడితోపాటు స్థానికులు ప్రైవేట్ కార్యక్రమం జరుగుతున్న నోవోటెల్ హోటల్ ముందు ఆందోళన చేపట్టారు. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని బౌన్సర్లు అడ్డుకోవడంతో కాసేపు ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న ఏసీపీ నర్సింహమూర్తితోపాటు వన్ టౌన్, టూటౌన్, త్రీ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని అరుణ్‌బాబు అలియాస్ ఆర్య, కరుకు మోహన్‌కృష్ణ, తోట రమేష్‌లను త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి పంపించారు. అనంతరం బాధితుడు చెన్నా సంగీతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాన్వాయ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. -
బైక్‌ను ఢీకొట్టిన పోలీస్ ఎస్కార్ట్ వాహనం
మహబూబ్‌నగర్(కొత్తూరు): అతి వేగంగా వెళ్తున్న ఓ పోలీస్ ఎస్కార్ట్ వాహనం బైక్‌ను ఢీకొనడంతో ఒకరు గాయపడ్డారు. ఈ సంఘటన మండల కేంద్రం సమీపంలోని బైపాస్ వై జంక్షన్ కూడలీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం...మండలంలోని చేగూరు పంచాయతీ తాళ్ళగూడకు చెందిన జంగయ్య(45) మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై కొత్తూరు నుంచి తిమ్మాపూర్‌కు వెళుతుండగా పోలీస్ వాహనం ఢీకొట్టింది. దీంతో జంగయ్య గాయపడ్డాడు. క్షతగాత్రుడిన ఎస్కార్ట్ వాహనంలోనే మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజయ్య ఎస్కార్ట్ వాహన ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి
ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ఎస్కార్ట్ వాహనం ఢీకొన్న ఘటనలో తీవ్రగాయూలపాలైన గులాం సాధికున్నీసా బేగం (48) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హన్మకొండలోని రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. -
అదుపుతప్పి.. ఢీకొట్టి..
* కారు, బైక్‌ను ఢీకొన్న డిప్యూటీ సీఎం రాజయ్య ఎస్కార్ట్ వాహనం * నలుగురు పోలీసులతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు * వరంగల్ జిల్లా యశ్వంతాపూర్ శివార్లలో ఘటన జనగామ రూరల్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి కారును, బైక్‌ను ఢీకొట్టింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జనగామ మండలం యశ్వంతాపూర్ సమీపంలో ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజయ్య ఆదివారం జనగామలోని ఓ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వరంగల్ వైపు ఆయన కాన్వాయ్ బయలుదేరింది. ఇదే సమయంలో రఘునాథపల్లి పోలీస్‌స్టే షన్ కానిస్టేబుల్ కంజర్ల బాబు, హోంగార్డు వెంకటరత్నం బైక్‌పై జనగామ వైపు వస్తున్నారు. వారి వాహనం వెనుక నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నయీముల్లాఖాన్ (ఎఫ్‌సీఐ ఏడీ) తన బంధువులతో కలిసి జనగామవైపు వస్తున్నారు. ఈ క్రమంలో యశ్వంతాపూర్ శివార్లలో ఎస్కార్ట్ వాహనం టైర్ పంక్చర్‌కావడంతో అదుపు తప్పి.. ఎదురుగా వస్తున్న బైక్, కారులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కంజర్ల బాబు, వెంకటరత్నంతో పాటు ఎస్కార్ట్ వాహనంలోని పోలీసులు జగన్మోహన్, విజయ్‌కుమార్, రాజ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. కారులో ఉన్న నయీముల్లాఖాన్, ఉన్నిసాబేగం తీవ్రంగా గాయపడ్డారు. -
డిప్యూటీ సీఎం ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం
-
మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరు మృతి
-
మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరు మృతి
మచిలీపట్నం : కృష్ణాజిల్లా మచిలీపట్నం చల్లరాస్తా వద్ద సోమవారం ఉదయం మంత్రి కొల్లు రవీంద్ర ఎస్‌టార్క్ వాహనం అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. మంత్రిని మచిలీపట్నంలో దించి వాహనం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.