మహబూబ్‌నగర్(కొత్తూరు): అతి వేగంగా వెళ్తున్న ఓ పోలీస్ ఎస్కార్ట్ వాహనం బైక్‌ను ఢీకొనడంతో ఒకరు గాయపడ్డారు. ఈ సంఘటన మండల కేంద్రం సమీపంలోని బైపాస్ వై జంక్షన్ కూడలీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం...మండలంలోని చేగూరు పంచాయతీ తాళ్ళగూడకు చెందిన జంగయ్య(45) మరో వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై కొత్తూరు నుంచి తిమ్మాపూర్‌కు వెళుతుండగా పోలీస్ వాహనం ఢీకొట్టింది. దీంతో జంగయ్య గాయపడ్డాడు. క్షతగాత్రుడిన ఎస్కార్ట్ వాహనంలోనే మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.