మెదక్ : మెదక్ జిల్లా నర్సాపూర్లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. అధిక వేగంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.