Narsapur
-
మట్టి బట్టీలకు గట్టి గిరాకీ
నోరూరించే తందూరీ వంటకాల తయారీ అనగానే గుర్తొచ్చేది మట్టి బట్టీలు.. ఈ వంటకాల్లో కీలకమైన మట్టి బట్టీల తయారీకి చిరునామాగా నిలిచింది నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామం. ఈ కుగ్రామంలో తయారుచేసిన తందూరీ మట్టి బట్టీలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో, వ్యాపారం ఖండాలు దాటుతోంది. నర్సాపూర్‌కు చెందిన కుమ్మరి గోపాల్ తరతరాల నుంచి వస్తున్న కులవృత్తిని కొనసాగిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో రుచికరమైన వంటలకు ఉపయోగపడే తందూరీ మట్టి బట్టీలకు మంచి డిమాండ్ ఏర్పడటంతో.. బట్టీల తయారీనే కుటుంబం ఉపాధిగా ఎంచుకుంది. – దామరగిద్ద17 ఏళ్లుగా ఇదేవృత్తినర్సాపూర్ గ్రామవాసి కుమ్మరి గోపాల్, అతడి కుటుంబ సభ్యులు 17 ఏళ్లుగా తమ కులవృత్తిలో భాగంగా బట్టీల తయారీలో నైపుణ్యం సాధించారు. మొదట రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) పెద్ద పెద్ద హోటళ్లలో మట్టి బట్టీల వినియోగాన్ని గుర్తించిన గోపాల్.. వాటికి డిమాండ్ ఉందని తెలుసుకొని నాణ్యమైన మట్టి బట్టీల తయారీని మొదలుపెట్టారు. ఈ బట్టీలను హైదరాబాద్, ముంబై, లాతూర్, నాందేడ్, గుల్బర్గా, చెన్నై, మైసూర్ (Mysore) తదితర నగరాలకు సరఫరా చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెలుసుకొని.. ముంబై పోర్టు నుంచి మస్కట్, ఖతార్, దుబాయ్‌తో పాటు ఆ్రస్టేలియా సింగపూర్, మలేసియా, అమెరికా తదితర దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. కర్ర పెట్టెలో ప్రత్యేకంగా ప్యాక్ చేసి, కంటెయినర్లలో ముంబై పోర్టుకు (Mumbai Port) తరలించి.. అక్కడి నుంచి రవాణా సంస్థల సహాయంతో విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గోపాల్ తెలిపారు.కావలసిన పరిమాణాల్లో.. స్థానికంగా లభించే మట్టితో గృహావసరాలకు ఉపయోగపడే పాత్రలతో పాటు తందూరీ బట్టీలను డ్రమ్ ఆకారంలో చిన్న, పెద్ద, మధ్యస్థంగా తయారు చేస్తున్నారు. మట్టిని బట్టీల తయారీ ప్రక్రియకు స్టీల్ బాక్స్‌లు లేదా మట్టి కవచాలను ఉపయోగిస్తారు. దీంతో వేడి బయటికి వెళ్లకుండా ఉంటుంది. మట్టి బట్టీల పరిమాణం మేరకు ధర రూ.500 నుంచి రూ.2వేలు పలుకుతోంది. స్టీల్, రాగి, సిమెంట్ బట్టీలు రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు లభిస్తున్నాయి. వర్షాకాలంలో బట్టీల తయారీ తక్కువగా ఉంటుంది. నవంబర్ నుంచి వేసవికాలం వరకు ఏటా 500 నుంచి 800 వరకు బట్టీలను తయారు చేస్తున్నారు. మట్టి బట్టీల తయారీతో గోపాల్ మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు.ఆధునిక పరికరాలివ్వాలి కులవృత్తిలో ఉన్న నైపుణ్యంతో ఆధునిక కాలం అవసరాలను గుర్తించా. ఏళ్ల తరబడి మట్టి బట్టీలు తయారు చేస్తున్నాం. వీటికి మంచి గిరాకీ ఉంది. దేశంలోని ప్రధాన పట్టణాలతో పాటు వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. వీటి తయారీ ఎంతో శ్రమతో కూడుకున్నది. ఆధునిక పరికరాలు అందించి ప్రోత్సహిస్తే మరింత మందికి ఉపాధి కల్పించవచ్చు. – గోపాల్, మట్టి బట్టీల తయారీదారు, నర్సాపూర్ -
కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయకపోతే, డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాం: హరీష్ రావు
సాక్షి, మెదక్ : తన ఇంటిపై దాడి జరిగిందని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. 30 ఏళ్లుగా తమ గ్రామంలో మెలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని తెలిపారు. గొడవ జరుగుతుందని తెలిసి ముందే పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదని విమర్శించారు. గ్రామంలోని కొంతమందికి మద్యం తాగించి దాడులకు ఉసిగొల్పారని ఆరోపించారు. ఇంటి గేట్లు తన్నుకుంటూ వచ్చి తమ అనుచరులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని తెలిపారు. ఇంటి లోపలికి టపాసులు వేసి రాళ్లు, కర్రలతో ఇంట్లో ఉన్నవారిపై దాడికి దిగారని పేర్కొన్నారు.దాడి చేసిన వారితో పాటు ఘటనను ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తానును ఎమ్మెల్యేగా గెలవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకే దాడులకు దిగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడితే తాము రెచ్చిపోమని.. తమ సహనాన్ని పరీక్షించొద్దని సూచించారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కు వెళ్లారు. గోమారంలోని ఎమ్మెల్యే నివాసంలో హరీష్ రావు మాట్లాడుతూ.. ‘సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తుంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, హైదరాబాదులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాష్ట్రంలో గుండు రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన సాగుతుంది.తెలంగాణకున్న మంచి పేరును మంటగలిపి ఈరోజు బిహార్‌లాగా తెలంగాణను మారుస్తున్నారు. నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడి. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే నివాసంలో లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలని, ఎమ్మెల్యే ఇంటి ముందు పటాకాయలు కాల్చడం, ఇంట్లోకి పటాకాయలు విసరడం ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైనది.ఇప్పుడే ఎస్పీ, ఐజీతో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాం. కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుల్ చేతులోని ఫోన్ లాక్కోని నెట్టేస్తే ఆయన కింద పడిపోయాడు. పోలీసులపై దాడి జరిగినా కేసు తీసుకోవడం లేదు.కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారు. పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా?ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గుండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరు.వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలి . దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా వెళ్తాం. దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం. ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంతో తెలంగాణ ప్రజలతో మాది పేగు బంధం ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మేము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం, పోలీసులు కూడా వ్యవహరిస్తే మంచిది.ఇంట్లో చొరబడి దాడి చేసిన వారిని అరెస్టు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలి. డీజీపీ ఉన్నతమైన పదవిలో ఉన్నారు మీరు ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లిన వారిని ఉపేక్షించవద్దు అని సూచిస్తున్నాను. రాష్ట్ర డిజిపి వెంటనే ఈ ఘటన పై స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ అరెస్టు చేయనట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’ అని పేర్కొన్నారు.సునీతా లక్ష్మారెడ్డితో అటు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా మాట్లాడారు. ఘటన వివరాలు, ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీతా లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.కాగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇటుకలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం అర్ధరాత్రి హంగామా చేశారు. వినాయక నిమజ్జనం అడ్డుపెట్టుకుని గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి గేటు ముందు పటాకులు కాల్చారు. ఇంటి లోపలికి వచ్చి ఇద్దరిపై దాడి చేశారు.అంతటితో ఆగకుండా ఇంటిపైకి ఇటుకలు విసిరారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రాత్రిపూట దాడులు చేయడం కాంగ్రెస్ నాయకుల పిరికిపంద చర్య బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దాడికి నిరసనగా ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. -
YS జగన్ చేస్తున్న సామాజిక సమీకరణాలను అందరూ స్వాగతిస్తున్నారు: ఉమాబాల
-
ఏపీలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శం: ఉమాబాల
-
చంద్రబాబు ఎంత మందితో కలిసి వచ్చినా గెలుపు మాదే..!
-
మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్‌కు మీరు ఓ లెక్కా: రేవంత్‌రెడ్డి
సాక్షి,నర్సాపూర్ : నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేసి పార్టీలు మారారని, కార్యకర్తలు మాత్రం పార్టీ జెండా మోస్తూనే ఉన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. నర్సాపూర్‌లో జరిగిన బహిరంగసభలో రేవంత్ మాట్లాడారు. ‘ఇక్కడి ఎమ్మెల్యే మదన్ రెడ్డి , కేసీఆర్ స్నేహితులు అంటారు. మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా మిత్రున్ని మోసం చేసిన కేసీఆర్‌కు మీరు ఓ లెక్కా. మదన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించలే. పార్టీ ఫిరాయించిన సునీతా లక్ష్మా రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని సిరిసిల్ల జోన్లో కలిపి నిరుద్యోగులను మోసం చేశారు. మేం అధికారంలోకి వస్తే చార్మినార్ జోన్లో కలిపే అవకాశాన్ని పరిశీలిస్తాం. నర్సాపూర్ గడ్డ..లంబాడీల అడ్డ మేం అధికారంలోకి వస్తే తండాల అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తాం. కేసీఆర్ కుటుంబంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు బంగారు పళ్లెంలో తింటూ బంగారు తెలంగాణ అంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో, బెల్టు షాపుల్లో తెలంగాణ నెంబర్ వన్ చేసిండు కేసీఆర్. పార్టీ మారి మోసం చేసిన సునీతా లక్ష్మా రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలి. ఆమె కోసం ప్రచారం చేస్తే నాపై కేసులు పెట్టారు. ఆమె మాత్రం కేసీఆర్ పార్టీలో చేరారు. నమ్మక ద్రోహులు ఎవరైనా సరే బండకేసి కొట్టాలి. అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యం అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే దళితులకు, గిరిజనులకు భూములు పంచి ఇచ్చిన రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం 12 లక్షల పోడు భూముల పట్టాలు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యం నాగార్జున సాగర్, శ్రీ శైలం కట్టింది. ఇందిరమ్మ రాజ్యం ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది. ఇందిరమ్మ రాజ్యం రిజర్వేషన్లు ఇచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దర్గా దగ్గర నువు బిచ్చం ఎత్తుకుని బతికేటోడివి’ అని రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఇదీచదవండి..కాంగ్రెస్ తెచ్చేది భూ మాత కాదు..భూ మేత : కేసీఆర్ -
తెలంగాణను ఏడిపించేదే కాంగ్రెస్ పార్టీ: సీఎం కేసీఆర్
సాక్షి, నర్సాపూర్, నిజామాబాద్ రూరల్: రైతుబంధు ఉండాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు బంధు పథకాన్ని కలలో కూడా ఎవరూ ఊహించలేదని తెలిపారు. మొట్టమొదటిసారి రైతుబంధును పుట్టించిందే బీఆర్ఎస్ అని, ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందుతుందన్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారం రోజుల్లోనే రూ. 5 లక్షల బీమా అందిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు నర్సాపూర్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు ఆగం కావద్దని.. పార్టీలు, నాయకుల గురించి చర్చ జరగాలని పేర్కొన్నారు. ఒకప్పటి కాంగ్రెస్ పాలన, ప్రస్తుత బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. 24 గంటల కరెంట్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, మూడు గంటల కరెంట్‌తో పొలాలు పండుతాయా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అయితే.. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. తెలంగాణను ఏడిపించేదే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. చదవండి: చిదంబరానికి మంత్రి హరీష్ రావు కౌంటర్ బెంగుళూరును దాటనున్నాం.. రాష్ట్రంలో ఇండస్ట్రీల కోసం బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చి పెట్టుబడులు సమకూర్చుతున్నామని కేసీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నామని, త్వరలోనే బెంగళూరును దాటే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగి, ఆదాయం పెరిగిందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ వచ్చినప్పుడు భారత్‌లో రాష్ట్రంలో 19 వ స్థానంలో ఉంటే.. నేడు 3 లక్షల 18 వేలతో తసలరి ఆదాయంలో ఇండియాలో నంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు. ‘రైతుబంధు దుబారానో లాభమో రైతులు తేల్చాలి. మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 24 గంటల కరెంట్ ఉండాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలి. రైతులందరూ 10 హెచ్‌పీ మోటార్ పెట్టుకోవాలని రేవంత్ అంటున్నారు. 3, 5 హెచ్‌పీ మోటారు ఉంటది రైతుల వద్ద. ఇప్పుడు 10 హెచ్‌పీ మోటార్ ఎవడు కొనియ్యాలి? ఎన్ని అవస్థలు.. ఎన్ని లంచాలు గతంలో. ఇవాళ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలడం లేదు. ఏ బాధ లేదు. మంచిగా రైతు పండించుకున్నంత చేతికి డబ్బులు వస్తున్నాయి’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
గాంధీభవన్‌లో ఉద్రిక్తత
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాబోయే ఎన్నికల రెండవ జాబితా విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం గాంధీభవన్‌లో నర్సాపూర్ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డిని మార్చాలని కోరుతూ నియోజకవర్గ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. ఈ సందర్భంగా పలువురు ఆందోళనకారులు మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీ అంటే తమకు ఎంతో అభిమానమని గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని ఇతరులకు టికెట్లు కేటాయించడం సరికాదన్నారు. బచావో కాంగ్రెస్ హటావో పారాచూట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ కార్యకర్త పెట్రోలు పోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే పక్కనే ఉన్న పార్టీ కార్యకర్తలు అడ్డుకుని ఆ వ్యక్తిపై నీళ్లుచల్లి నిప్పుఅంటించుకునే ప్రయత్నాన్ని ఆపివేశారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారుతుండటంతో పోలీసులు కలుగజేసుకుని పార్టీశ్రేణులను బయటకు పంపించివేశారు. -
కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే మోసపోతారు
నర్సాపూర్: కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి ఓటేస్తే మోసపోతారని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటకలో రోజుకు ఐదు గంటలే విద్యుత్ ఇస్తున్నామని, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశారు. శివకుమార్ వాస్తవాన్ని చెప్పారంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మన రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం గోసపడిన రోజులు మళ్లీ వస్తాయని ప్రజలను హెచ్చరించారు. డీకే శివకుమార్ మాటలను రాష్ట్రంలోని రైతులు అర్థం చేసుకుని కాంగ్రెస్‌ను తెలంగాణలో సమాధి చేయాలని హరీశ్‌రావు హితవు పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కష్టాలతో బతికామని, ఇప్పుడిప్పుడే మన బతుకులు ఒక స్థాయిలో బాగు పడుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్‌తోనే మన బతుకులు మరింత బాగు పడతాయని అన్నారు. కాగా, రైతుబంధు కింద ఆర్థిక సహాయం ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని మంత్రి ఆరోపించారు. యాసంగికి రైతుబంధు కావాలా.. వద్దా? అని రైతులను ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. మూడు గంటల కరెంటు చాలని అంటున్నారని, అలాంటి వారికి ఓటెయ్యవద్దని చెప్పారు. ఈ సభలో నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, నర్సాపూర్ ఎన్నికల ఇన్చార్జి వెంకటరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పల్లాకు డబ్బు మదం ఎక్కువైంది: ముత్తిరెడ్డి
సాక్షి, చేర్యాల(సిద్దిపేట): బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి డబ్బు మదం ఎక్కువైందని, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ పార్టీని మలినం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది అధర్మం, సీఎం సంకల్పానికి విరుద్ధమని ముత్తిరెడ్డి ఆరోపించారు. ఆయన సిద్దిపేట జిల్లా చేర్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి ప్రజాప్రతినిధులకు ఫోన్లుచేస్తూ డబ్బులు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన వారిని ‘కుక్కలు’అనడం పల్లా అహంకారానికి నిదర్శనమన్నారు. నాకే నర్సాపూర్ టికెట్ ఇవ్వాలి.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని, తనకు నర్సాపూర్ టికెట్ కావాలని సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏ ఆలోచనతో నర్సాపూర్ టికెట్ ప్రకటించకుండా ఆపారో తెలియదని, పునరాలోచించి తనకే ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి బీఆర్ఎస్లో చేరారని, ఇక్కడ కేబినెట్ కేడర్ హోదాలో ఉన్నారని పరోక్షంగా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి అన్నారు. తనకు మంత్రి హరీశ్‌రావు అండదండలు ఉన్నాయన్నారు. టికెట్ ఇవ్వకుంటే ఏం చేస్తారని విలేకరులు అడగ్గా.. టికెట్ తనకే వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చదవండి: Thummala: తుమ్మల చేజారిపోకుండా.. టికెట్ ఇవ్వకుంటే రాజకీయ సన్యాసం సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఈసారి తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. ఆయన సోమవారం మహబూబాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని, ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇంత బలం ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఒక వేళ ఇవ్వకపోతే ఖద్దరు బట్టలు కాకుండా.. ఎర్రటి వస్త్రాలు ధరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని వెల్లడించారు. -
TS Election 2023: టికెట్ పోరు..‘నర్సాపూర్’పై కొనసాగుతున్న ఉత్కంఠ!
మెదక్: బీఆర్ఎస్ నర్సాపూర్ నియోజకవర్గం అభ్యర్థిత్వంపై నెలకొన్న సస్పెన్స్ ఒకటెండ్రోజుల్లో వీడే అవకాశం ఉందన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. నర్సాపూర్ అభ్యర్థిత్వాన్ని మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఈ టిక్కెట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం మెదక్‌లో ప్రగతి శంఖారావం బహిరంగ సభ జరిగిన మరుసటిరోజైన గురువారమే ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తన అనుచరులతో హైదరాబాద్ తరలివెళ్లి హరీశ్‌రావును కలిశారు. టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేటాయించాలని మంత్రి నివాసం ముందు అనుచరులు బైఠాయించడం చర్చనీయాంశమైంది. దీంతో సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక శాఖ మంత్రి సముదాయించి పంపారు. ఇప్పటికే ఇద్దరితో మాట్లాడిన అధినేత మెదక్‌లో జరిగిన ప్రగతి శంఖారావం బహిరంగ సభ వేదికపై కేసీఆర్, మదన్‌రెడ్డితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన అడిగిన వెంటనే నర్సాపూర్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సునీతా లక్ష్మారెడ్డి కూడా గురువారం మంత్రి హరీశ్‌రావును కలిసేందుకు హైదరాబాద్ తరలివెళ్లినట్లు తెలిసింది. అంతకు ముందే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశా రు. ఈనెల 21న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రక టించక ముందే వీరిద్దరితో నర్సాపూర్ టిక్కెట్ విషయమై ముఖ్యమంత్రి మాట్లాడినట్లు సమాచారం. ఇద్దరు కలిసే పార్టీ వ్యవహారాలు.. ప్రగతి శంఖారావం బహిరంగ సభకు కార్యకర్తలు, అనుచరులను తరలించే ప్రక్రియను మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరు చేపట్టారు. ఏర్పాట్లు పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఇన్చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి వీరితో చర్చించారు. అయితే బహిరంగ సభకు ముందు.. ఈనెల 14న మెదక్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ ఇద్దరూ హాజరుకావడంతో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అప్పుడే అభ్యర్థిత్వంపై కొంతమేరకు సంకేతాలు అందడంతోనే సునీతా లక్ష్మారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే అభిప్రాయం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ నియోజకవర్గం అభ్యర్థిత్వం విషయంలో నెలకొన్న ఉత్కంఠ, రోజుకో పరిణామం ఆసక్తికరంగా మారుతోంది. -
నర్సాపూర్‌పై నలుదిక్కుల నజర్..
మెదక్: సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నర్సాపూర్ నియోజకవర్గంపై బీసీ నాయకులు దృష్టి సారించారు. అసెంబ్లీ టికెట్‌ను తమ సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్‌తో ప్రయత్నాలు ప్రారంభించారు. జనాభాలో అధిక శాతం ఉన్న తమకు పార్టీలు ప్రాధాన్యం ఇవ్వాలంటూ జిల్లాలో ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో బహిరంగంగానే ప్రకటించారు. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు టికెట్లు కేటాయించేందుకు సముఖంగా ఉండడం కూడా వీరికి కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. దీనికి అనుగుణంగా జిల్లాలోని బీసీ నాయకులు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిని పోటీలో ఉంచేందుకు పావులు కదుపుతున్నారు. బీఆర్ఎస్ నుంచి.. నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరోసారి పోటీకి సై అంటుండగా, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, మాజీ మంత్రి సునీతారెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నారు. కాగా బీసీ కోటాలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ టికెట్ ఆశిస్తున్నారు. 2014, 2018లో రెండు సార్లు ఎంపీపీగా ఎన్నికై న హరికృష్ణ ప్రస్తుతం రేసులో ఉన్నారు. బీజేపీలో.. బీజేపీ రాష్ట్ర నాయకుడు సింగాయిపల్లి గోపి గతంలో రెండుసార్లు పోటీ చేశారు. మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. బీసీ కోటాలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీ యాదవ్ సైతం టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం గోపికి ఉంది. ఆయన భార్య రాజమణి ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పని చేశారు. కాంగ్రెస్‌లో.. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, ఉపాధ్యక్షుడు, మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జ్ గాలి అనిల్‌కుమార్ సైతం టికెట్‌పై దృష్టి పెట్టారు. విస్తృతంగా పర్యటిస్తు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సొంత నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నుంచి అవకాశం దొరకకుంటే నర్సాపూర్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
మటన్ పెట్టకుండా సాంబారు పోశాడని.. పెళ్లి విందులో కొట్లాట
సాక్షి, మెదక్: పెళ్లి విందులో తలెత్తిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. నర్సాపూర్ మండల పరిధిలోని చండి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ మండల పరిధిలోని చండి గ్రామానికి చెందిన అమ్మాయిని అదేమండలం నత్నయిపల్లికి చెందిన అబ్బాయితో శనివారం చండి గ్రామంలో పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం భోజనం వడ్డిస్తున్న క్రమంలో అబ్బాయి తరఫు వ్యక్తికి మటన్ ముక్కలు వేయకుండా సాంబార్ పోశాడని గొడవకు దిగారు. మటన్ వడ్డిస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిపై అబ్బాయి తరఫు వారు దాడి చేయగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి నలుగురిపై కేసు నమోదు చేశారు. చదవండి: ఖమ్మం మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు! -
నర్సాపూర్–యశ్వంత్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వేసవిలో ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్–యశ్వంత్‌పూర్ మధ్య 6 వారంతపు సర్విసులు నడపనున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు. నర్సాపూర్–యశ్వంత్‌పూర్ (07687) ఈ నెల 14, 21, 28 తేదీలలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3.10 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి 7.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07688) ఈ నెల 15, 22, 29 తేదీలలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అక్కడ బయలుదేరి ఉదయం 8.30 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. -
బిజీ లైఫ్ నుంచి రిలీఫ్ పొందాలనుకుంటున్నారా..? చలో పోచారం..
ఎటుచూసినా భవనాలు... రోడ్లు.. వాహనాల రణగొణ ధ్వనులు.. ఉక్కిరిబిక్కిరి చేసే వాయుకాలుష్యం... ఉరుకుల పరుగుల జీవనం.. ఇదీ నేటి కాంక్రీట్ జంగిల్లా మారిన పట్టణ, నగరవాసుల దయనీయ పరిస్థితి. దీన్నుంచి కాస్త ఉపశమనం పొందాలనుకుంటున్నారా? ఎటుచూసినా పచ్చటి చెట్లు.. పక్షుల కిలకిలారావాలు... అక్కడక్కడా కనిపిస్తూ కనువిందు చేసే వన్యప్రాణులు, స్వచ్ఛమైన పిల్లగాలులు, ప్రకృతి సోయగాల నడుమ సూర్యోదయ, అస్తమయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. చలో నర్సాపూర్, పోచారం. సాక్షి, హైదరాబాద్: ప్రకృతి ఒడిలో నగరవాసులు కాసేపు సేదతీరేందుకు వీలుగా మెదక్ అటవీ శాఖ, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ) సంయుక్తంగా ‘కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం’నేచర్ క్యాంప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. నర్సాపూర్ అటవీ ప్రాంతం, పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, జీప్ సఫారీ, ట్రెక్కింగ్ తదితరాలతో రెండు పగళ్లు, ఒక రాత్రి కలిపి మొత్తం 36 గంటలపాటు అడవిలో గడుపుతూ మధుర అనుభూతులను సొంతం చేసుకొనేలా ప్యాకేజీని సిద్ధం చేశాయి. పర్యాటకులు అడవుల్లోని చెట్లు, జంతువుల రకాలు, పర్యావరణ వ్యవస్థలు, స్థానిక ఆహారపు అలవాట్లు, గిరిజనుల సాంస్కృతిక జీవనం, వ్యవసాయ పద్ధతుల వంటి వాటిని ప్రత్యక్షంగా తెలుసుకోవడాన్ని ఇందులో అంతర్భాగం చేశాయి. స్థానికంగా తయారు చేసిన వస్తువులకు గిరాకీ కలి్పంచడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాల పెంపుతోపాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించనున్నాయి. నేచర్ క్యాంప్ టూర్ ఇలా.. ♦ ఉదయం 6 గంటలకు నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు నుంచి ప్రారంభం ♦ ఈ పార్కులో ట్రెక్కింగ్, బర్డింగ్, బట్టర్ఫ్లై వాక్, వెట్‌ల్యాండ్ విజిట్ ♦ వాచ్‌టవర్ వద్ద అల్పాహారం. అక్కడే ఈ టూర్‌కు సంబంధించిన ఇంటరాక్షన్ ♦ నర్సాపూర్ పార్క్‌కు ఎదురుగానున్న అటవీప్రాంతం సందర్శన, అక్కడ నుంచి నర్సాపూర్ పట్టణానికి పయనం. ♦ మెదక్ పట్టణానికి ప్రయాణ మార్గమధ్యంలో ఫారెస్ట్, ప్రైవేట్ నర్సరీల విజిట్. మెదక్ చర్చి సందర్శన, ఆ తర్వాత సమీపంలోనే లంచ్ ♦ అక్కడి నుంచి పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీకి.. ♦ స్థానిక పర్యావరణ వ్యవస్థలపై అవగాహన పెంచుకునేందుకు సిద్ధం చేసిన ఎని్వరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ (ఈఈసీ) విజిట్ ♦ వైల్డ్‌లైఫ్ సఫారీ, పోచారం డ్యామ్, నిజాం హెరిటేజ్ బిల్డింగ్స్ సందర్శన, సూర్యాస్తమయ వీక్షణ. ♦ ఈఈసీ సెంటర్ వద్ద సమావేశం. అక్కడే స్థానిక వంటకాలు, రుచులతో బార్బిక్యూ డిన్నర్, హోమ్‌స్టే లేదా టెంట్లలో రాత్రి నిద్ర. ♦ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు పోచారం లేక్ వద్ద సూర్యోదయ వీక్షణ ♦ అల్పాహారం తర్వాత పోచారం వైల్డ్‌లైఫ్ ♦ శాంక్చురీలో బర్డ్ వాచింగ్, బట్టర్ఫ్లై వాక్ ♦ ఉదయం 11 గంటలకు దంతేపల్లి లేదా మరోచోట గిరిజన గ్రామ సందర్శన ♦ మధ్యాహ్నం దంతేపల్లిలో ‘ఫామ్ లంచ్’ ♦ అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ ప్రత్యేకతలివే... హైదరాబాద్‌కు 115 కి.మీ. దూరంలోని పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ 130 చ.కి.మీ. విస్తీర్ణంలో మెదక్, కామారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించింది. ఇది పోచారం లేక్ వెంట విస్తరించి ఉండటం విశేషం. ఇక్కడ వివిధ రకాల జింకలు, చిరుతలు, ఎలుగుబంట్లు కూడా కనిపిస్తుంటాయి. పలు రకాల అరుదైన పక్షులకు సైతం ఇది కేంద్రంగా ఉంది. ఫారెస్ట్ ప్లస్ 2.0 అంటే... కేంద్ర అటవీ, పర్యావరణశాఖల సహకారంతో యూఎస్ఏఐడీ సంస్థ ప్రకృతిసిద్ధ పరిష్కారాల అభివృద్ధి ద్వారా అడవులపై ఆధారపడిన స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంతోపాటు కమ్యూనిటీల పరంగా బలోపేతం కావడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి ఫారెస్ట్ ప్లస్ 2.0గా నామకరణం చేసింది. ఇందులో భాగంగా తిరువనంతపురం (కేరళ), గయ (బిహార్), మెదక్ (తెలంగాణ)లో కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం నేచర్ క్యాంపులకు శ్రీకారం చుట్టింది. కనీసం 20 మంది.. సొంత వాహనాల్లో వస్తేనే.. పర్యాటకులకు ప్రత్యక్షంగా ప్రకృతిని, వైల్డ్ లైఫ్‌ను అనుభవంలోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించాం. ప్రజలకు అడవులు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ క్యాంప్‌లకు ప్రాధాన్యతనిచ్చాం. నేచర్ క్యాంప్‌ల ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. కనీసం 20 మందితో కూడిన పర్యాటక బృందం ఈ క్యాంప్‌కు రావాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లోనే వారు మొత్తం టూర్లో పాల్గొనాల్సి ఉంటుంది. పిల్లలకు (పదేళ్లు పైబడిన వారే) రూ. 1,500, పెద్దలకు రూ. 2 వేలు చొప్పున చార్జీగా ఖరారు చేశాం. ఆహారం, ఎంట్రీ ఫీజు, సఫారీ తదితరాలన్నీ ఈ ప్యాకేజీలో ఉంటాయి. – జి. సాయిలు, రీజినల్ డైరెక్టర్, ఫారెస్ట్–ప్లస్ 2.0 చదవండి: తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్ల కేటాయింపు
లక్ష్మీపురం(గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్ ప్రయాణికుల సౌకర్యార్ధం దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను కేటాయించినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ఆంజనేయులు మంగళవారం వెల్లడించారు. రైలు నంబర్ 07153 నరసాపూర్–యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలు ఈ నెల 18వ తేదీ ఉంటుందన్నారు. ఈ రైలు మధ్యాహ్నం 3.10 గంటలకు నరసాపూర్ స్టేషన్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 7.50 గంటలకు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు యశ్వంత్‌పూర్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. రైలు నంబర్ 07514 ప్రత్యేక రైలును (యశ్వంత్‌పూర్–నరసాపూర్) ఈ నెల 19న కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ రైలు యశ్వంత్‌పూర్ స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి శుక్రవారం తెల్లవారుజాము 3.35 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకుని, అక్కడి నుంచి ఉదయం 8.30 గంటలకు నరసాపూర్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 07156 యశ్వంత్‌పూర్–నరసాపూర్ రైలు ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 2.20 గంటలకు నరసాపూర్ స్టేషన్ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 6.25 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకుని, అక్కడ నుంచి శనివారం ఉదయం 10.30 గంటలకు యశ్వంత్‌పూర్ స్టేషన్‌కు చేరుకుంటుందని వివరించారు. 07517 యశ్వంత్‌పూర్–నరసాపూర్ రైలు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5.20 గంటలకు యశ్వంతపూర్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు గుంటూరు స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి అదే రోజు ఉదయం 10.30 గంటలకు నరసాపూర్ స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. 07046 సికింద్రాబాద్–దిబ్రూగ్రహ్ వయా గుంటూరు డివిజన్ మీదుగా ఫిబ్రవరి 2, 9, 16, 23వ తేదీల్లో ప్రత్యేక రైలును కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ రైలు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 3.50 గంటలకు గుంటూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి శనివారం రాత్రి 8.50 గంటలకు దిబ్రూగ్రహ్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. 07047 ప్రత్యేక రైలును ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ రైలు ఆదివారం రాత్రి 7.25 గంటలకు దిబ్రూగ్రహ్ స్టేషన్ నుంచి బయలుదేరి గుంటూరు రైల్వే స్టేషన్‌కు మంగళవారం రాత్రి 10.10 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. (క్లిక్ చేయండి: సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు.. ఎప్పటినుంచంటే..) -
నరసాపురంలో నవశకం..
-
రైలు కింద పడి టీచర్ మృతి.. విషయం తెలిసి భార్య ఆత్మహత్యాయత్నం
మెదక్: భర్త మృతిని తట్టుకోలేక భార్య రెండు అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నర్సాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల కొత్త కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు రామారావు(40) కుటుంబం నర్సాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సమస్యల కారణంగా సికింద్రాబాద్‌లో రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసున్నాడు. విషయం తెలుసుకున్న భార్య చిన్నఅమ్ములు అద్దెకు ఉండే రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి స్థానిక ఆసుపత్రికి తరలించగా కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్‌లోని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరికి ఇద్దరు పిల్లలు దివ్యాన్షు(6), పూజిత (1)ఉన్నారు. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు ఉపాధ్యాయుడు మృతి చెందగా అతడి భార్య చిన్న అమ్ములు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలియని వారి పసిపిల్లలు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూడసాగారు. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. రామారావు విజయనగరం జిల్లా, చీపురుపల్లి మండలం, ఆకులపేట గ్రామానికి చెందిన నివాసిగా తెలిసింది. అలుముకున్న విషాదం శివ్వంపేట(నర్సాపూర్): మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు మృతితో విషాదఛాయ లు అలుముకున్నాయి. చిన్నగొట్టిముక్ల పంచాయతీ కొత్త కాలనీలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. పదేళ్ల క్రితం ఉపాధ్యాయుడిగా నియామకమై మొదటి పోస్టింగ్ మండలంలోని తిమ్మాపూర్ ప్రైమరీ స్కూల్, తర్వాత కొత్త కాలనీలోని పీఎస్ పాఠశాలల్లో విధులు నిర్వహించాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ బుచ్చనాయక్ తోటి ఉపాధ్యాయులు ఘటన స్థలానికి చేరుకొని నివాళులర్పించారు. -
‘కంటి వెలుగు’ ఉచిత పథకం
కౌడిపల్లి(నర్సాపూర్) : కంటి వెలుగు వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎవరి ఎక్కడ డబ్బులు చెల్లించవద్దని డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావ్ తెలిపారు. శుక్రవారం కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కొనసాగుతున్న కంటి వెలుగు వైద్యశిబిరాన్ని తనిఖీ నిర్వహించారు. రోగులకు వైద్యసేవలను గురించి అడిగితెలుసుకున్నారు. వైద్యచికిత్సలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 20 బృందాలు కంటి వెలుగు వైద్యశిబిరంలో చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 354 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మరో 750 మందికి వివిధ రకాల కంటి అద్దాలు అవసరంగా గుర్తించినట్లు తెలిపారు. వీరికి మూడు వారాలలో కంటి అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. 90 మందికి కంటి శుక్లాలు ఇతర ఆపరేషన్లు అవసరంగా గుర్తించామన్నారు. వీరికి 114 కార్పోరేట్ ఆసుపత్రులలో వారి కోరిక మేరకు ఆపరేషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. డబ్బులడిగితే ఫిర్యాదు చేయాలి.. గ్రామంలో కొనసాగిని వైద్యశిబిరం పూర్తయిన తరువాత ఆపరేషన్లు అవరంగా గుర్తించిన వారిని వైద్యుల సహాయంతో వాహనంలో పంపించి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఎక్కడ ఎవరకి ఒక్కరూపాయి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలుకు కంటి వెలుగు పథకంద్వార పూర్తిగా ఉచితంగా వైద్యచికిత్సలు చేయిస్తుందని తెలిపారు. వర్షం కారణంగా కొంత నెమ్మదిగా కొనసాగుతుందన్నారు. రోజుకు 250 మందికి వైద్యం చేయాల్సి ఉండగా కొంత తక్కువగా ఉందన్నారు. ప్రజలు సహకరించి వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటస్వామి, డాక్టర్ శోభన సిబ్బంది పాల్గొన్నారు. నర్సాపూర్: ప్రభుత్వం ప్రతాష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కంటి పరీక్ష కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని జిల్లా డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. శుక్రవారం ఆయన నర్సాపూర్‌లోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించారు. ఏర్పాట్లపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన çప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. కంటి పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ విజయ నిర్మల, డీఐఓ డాక్టర్ నవీన్ తదితరులు ఉన్నారు. నర్సాపూర్ కేంద్రంలో చేపడుతున్న పరీక్షల వివరాలను డాక్టర్ పావని ఆయనకు వివరించారు. కొల్చారంలో.. కొల్చారం(నర్సాపూర్): కంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రభుత్వం ద్వారా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం కొల్చారం మండలం తుమ్మలపల్లిలో చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. దేశంలో ఎక్కువగా ప్రజలు కంటి సమస్యలతో బాధపడటం మారిన ఆహార అలవాట్లు కొంత వరకు కారణమన్నారు. చిన్న వయస్సులోనే కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న కంటి వెలుగు పథకం ద్వారా గ్రామీణస్థాయిలో వైద్య శిబిరాలలను ఏర్పాటు చేయడం, ఉచితంగా కళ్లద్దాలు అందించడం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా కంటి అద్దాలు అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్చారం వైద్యాధికారి రమేష్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
మాజీ సర్పంచ్‌దీ పూరి గుడిసే..
నర్సాపూర్‌రూరల్ మెదక్ : గ్రామాలకు దూరంగా అడవులు, కొండలు, వాగులు, వంకలను ఆనుకొని ఉండే తండాల్లోని గిరిజనులు పక్కా ఇళ్లు లేక నేటికీ గుడిసెల్లోనే మగ్గుతున్నారు. వర్షానికి నానుతూ, ఎండకు ఎండుతూ వాటిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాగానే ఇల్లు లేని ప్రతీ ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామనిటీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడంతో పక్కా ఇల్లు లేని గిరిజనులకు ప్రాణం లేచి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిపోతున్నా నేటికీ గిరిజనులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కాలేదు. నర్సాపూర్ మండలంలోని పాత, కొత్త 34 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 56 వరకు తం డాలు ఉంటాయి. ఈ తండాల్లో 80 శాతానికి పైగా గిరిజన కుటుంబాలవారు గుడిసెల్లోనే నివసించేవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉం డగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కొందరు గిరిజనులకు వరమైంది. స్థాయిని బట్టి ఇళ్లు నిర్మించుకున్న ప్రతీ కుటుంబానికి రూ. 50 వేల నుంచి రూ. 1లక్ష వరకు ప్రభుత్వం బిల్లులు చెల్లించింది. అప్పట్లో ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నవారు శ్లాబ్ వేసుకొని ఇళ్లు నిర్మించుకున్నారు. మరి కొంత మంది లెంటల్ లెవల్ వరకు గోడలు నిర్మించుకొని రేకులు వేసుకున్నారు. అసలే ఆర్థికంగా లేనివారు 40 శాతం వరకు అవే గుడిసెల్లోనే మగ్గుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైనా వారు ముం దుగా బేస్మెంట్ నిర్మించుకుంటే బిల్లులు ఇచ్చేవారు. కనీసం బేస్మెంట్ లెవల్‌కు నిర్మించుకోలేని స్థితిలో ఉన్నవారే మిగిలిపోయారు. ప్రస్తుతం పూరిగుడిసెల్లో నివాసముంటున్న ప్రతీ గిరిజను డు నాలుగేళ్లుగా డబుల్ బెడ్రూం ఇల్లు వస్తుందని కళ్లలో వొత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. హామీ మరచిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నర్సాపూర్ మండలంలోని పెద్దచింతకుంట తాజా మాజీ సర్పంచ్ దేవసోత్ సీతారాంనాయక్‌కు స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి పలుమార్లు బహిరంగంగానే డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయించి కట్టిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం సీతారాంనాయక్ పదవీకాలం ముగియడంతో తనకున్న పూరిపాకలోనే నివాసముంటున్నాడు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పెద్దచింతకుంట గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వు అయింది. దీంతో గ్రామస్తులు తమ పంచాయతీ పరిధిలో తండాకు చెందిన నిరుపేద, మంచి వ్యక్తిగా పేరు ఉండడంతో సీతారాంనాయక్‌ను ఏకగ్రీవంగా పెద్దచింతకుంట సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అనంతరం ప్రత్యేక తెలంగాణ రావడం, టీఆర్ఎస్ ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చి స్థానికంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి గెలుపొందడంలాంటి ఘటనలు జరిగిపోయాయి. దీంతో ఏకగ్రీవంగా పెద్దచింతకుంట సర్పంచ్‌గా ఎన్నికైన సీతారాంనాయక్ గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. సీతారాంనాయక్ పూరిగుడిసెలో నివాసముంటున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానాని బహిరంగంగానే అతడికి హామీ ఇచ్చారు. సీతారాంనాయక్ కనిపించిన ప్రతీసారి అందరిముందే ఎమ్మెల్యే నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తాననే మాట పదేపదే గుర్తుచేయడానికే సరిపోయింది. అలా నాలుగేళ్లుగా అదే మాట అంటూ కాలం వెళ్లదీయడంతో సీతారాంనాయక్ సర్పంచ్ పదవీ కాలం కాస్తా ముగిసిపోయింది. ఇది ఒక సర్పంచ్‌కు ఇచ్చిన హామీ తీరు. డబుల్ బెడ్రూం ఇళ్లు మాకే ముందు ఇవ్వాలి ఊళ్లకు దూరంగా అడవులు, పొలాల మధ్య ఉంటం. ఇళ్లు లేకుండా పూరి గుడిసెలో నివాసం ఉండే గిరిజనులకు ముందుగా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలె. చాలాసార్లు డబుల్ బెడ్రూం ఇండ్లకోసం దరఖాస్తులు ఇవ్వాలంటే తహసీల్దార్ ఆఫీస్‌ల ఇచ్చి వచ్చినం. ఇప్పటి వరకు ఏ ఒక్క తండాకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇచ్చినట్లు కనిపిస్తలేదు. – రమణి, గిరిజనురాలు ‘డబుల్’పై నమ్మకం పోయింది పూరిగుడిసెలోనే పుట్టి పెరిగిన. మే పేదోళ్లం కావడంతో కూలీనాలీ చేసుకుంటూ పొట్టపోసుకునేవాళ్లం. నా మంచితనంపై నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నరు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతీ రూపాయిని గ్రామ అభివృద్ధికి ఖర్చుచేసిన. పక్కా ఇల్లు లేకున్నా దిగులు చెందలేదు. చాలా సార్లు ఎమ్మెల్యే నీవు ఎంతకాలం పూరిగుడిసెలో ఉంటావు.. ఖచ్చితంగా డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని స్వయంగా చెప్పి మర్చిపోయాడు. నేను నివాసముండే పూరిగుడిసె రెండు రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షానికే ఉరుస్తున్నందున ప్లాస్టిక్ కవర్ వేసుకున్నా. – దేవసోత్ సీతారాంనాయక్, పెద్దచింతకుంట తాజా మాజీ సర్పంచ్ -
వనంలో మనం
నర్సాపూర్ మెదక్ : జిల్లాలోని అడవుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ధర్మారెడ్డి చెప్పారు. డీఎఫ్ఓ పద్మజారాణి, ఇతర అధికారులతో కలిసి ఆయన నర్సాపూర్ అడవులలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న అడవులను వివిధ పథకాల కింద సంరక్షించడంతో పాటు అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు. నర్సాపూర్ అడవిలో ఎకో టూరిజం పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాగా అడవిని అభివృద్ధి చేసే పనులలో భాగంగా ఖాళీ ప్రదేశాలలో ఔషధ, ఇతర మొక్కలు నాటి కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని.. అడవి చుట్టూ ఫెన్సింగ్ వేయనున్నారని చెప్పారు. కాగా ఎకో టూరిజం పార్కు కింద నర్సాపూర్ అడవితో పాటు నర్సాపూర్ రాయరావు చెరువును అభివృద్ధి చేసి చెరువులో బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. టూరిజం పార్కు కింద ఎంపిక చేసిన అటవీ ప్రాంతంలో ప్రజలకు కనీస వసతులు కల్పించడం, విహార ప్రాంతంగా తీర్చిదిద్దే పనులను ఎక్కడెక్కడ చేపడితే బాగుంటుందో తెలుసుకునేందుకు తాము పర్యటించి పరీశీలించినట్లు ఆయన చెప్పారు. రాయరావు చెరువులో బోటింగ్ ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు. ఎకో టూరిజం పార్కును అటవీ శాఖ ఏర్పాటు చేస్తున్నప్పటికీ టూరిజం శాఖతో అనుసంధానం చేయనున్నందున ఆ శాఖ సైతం పలు వసతులు కల్పిస్తున్నదని కలెక్టర్ చెప్పారు. రూ.20 కోట్లు మంజూరు నర్సాపూర్ అడవి అభివృద్ధితోపాటు ఎకో టూరిజం పార్కు ఏర్పాటుకు గాను ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి చెప్పారు. కాగా జిల్లాలోని వడియారం, మనోహరబాద్, పర్కిబండ అడవులను అభివృద్ధి చేయడంతో పాటు అర్బన్ పార్కులు ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ నిధులు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. వడియారం అడవిలోని 170 హెక్టార్లలో అభివృద్ధి చేసేందుకు రూ.4.36 కోట్లు, మనోహరబాద్ అడవిని 725 హెక్టార్లలో అభివృద్ధి చేసేందుకు రూ.3.33 కోట్లు, పర్కిబండ అడవిని 186 హెక్టార్లలో అభివృద్ధి చేసేందుకు రూ.6.14 కోట్లు హెచ్ఎండీఏ మంజూరు చేసిందని ఆయన చెప్పారు. అర్బన్ పార్కులలో పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేసి పర్యాటకులు సంతోషంగా గడిపేందుకు పార్కులను తీర్దిదిద్దుతారని చెప్పారు. పార్కు ఏర్పాటుకు సంబంధించి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నట్లు కలెక్టర్ చెప్పారు. కలెక్టర్ ధర్మారెడ్డి వెంట డీఎఫ్ఓ పద్మజారాణి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, హెచ్ఎండీఏ డీసీఎఫ్ శ్రీలక్ష్మి, స్థానిక ఎఫ్ఆర్ఓ గణేష్ తదితరులు ఉన్నారు. కాగా అడవిలో ఉన్న వాగులు, గుట్టల వివరాలను అటవీ శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. స్థానిక అటవీ శాఖ రేంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే పనులు చేపట్టారు. కలెక్టర్ ధర్మారెడ్డి నర్సాపూర్ అడవులలో పలువురు అధికారులతో పర్యటించిన అనంతరం రాయరావు చెరువు శిఖం వద్ద మొక్క నాటారు. -
రెండోసారి మున్సిపాలిటీగా నర్సాపూర్
నర్సాపూర్: నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌ను రాష్ట్ర ప్రభుత్వ మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆగస్టు 2నుంచి మున్సిపాలిటీగా కొనసాగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్టు ఒకటి నాటికి ప్రస్తుతం ఉన్న గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగియనున్నందున 2నుంచి కొత్త పురపాలక సంఘాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్యాలయం కొనసాగిన భవనంలోనే పురపాలక సంఘం కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా సంబంధిత అధికారులు ఆ భవనానికి ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం బోర్డును తొలగించి పురపాలక సంఘం బోర్డును ఏర్పాటు చేశారు. నేటి నుంచి అమలులోకి.. నర్సాపూర్ పట్టణం గతంలో ఒకసారి పురపాలక సంఘంగా కొనసాగింది. 1960 నుంచి కొన్నేళ్ల పాటు పట్టణం పురపాలక సంఘం హోదాలో కొనసాగింది. అనంతరం సరిపడా జనాభా లేనందున పురపాలక సంఘం నుంచి తగ్గించి మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం మేజర్ గ్రామ పంచాయతీలను కొత్తగా పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేసే ప్రక్రియను ఇటీవల చేపట్టగా నర్సాపూర్‌కు పురపాలక సంఘం హోదా దక్కింది. పట్టణంలో 2011 లెక్కల ప్రకారం జనాభా 18,338 మంది ఉండగా వారిలో 9,627 మంది పురుషులు, 8,711 మంది మహిళలు ఉన్నారు. పట్టణంలో 9,607 మంది ఓటర్లు ఉండగా 4,854 పురుషులు, 4,753మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తాజాగా పరిశీలిస్తే జనాభా, ఓటర్లు ఎక్కువగా ఉంటారు. నర్సాపూర్‌ను గురువారం పురపాలక సంఘంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మృత్యుంజయుడు!
నర్సాపూర్‌రూరల్ : పాడుబడిన బావిలో ఓ నవజాత మగ శిశువు లభ్యమైంది. కాగజ్‌మద్దూరు గ్రామంలో ఆదివారం పాడుబడిన బావి నుంచి శిశువు ఏడుపు వినిపించడంతో అటుగా వెళ్తున్న గ్రామస్తులు తొంగి చూశా రు. పాడుబడిన బావిలో గాజుపెంకులు, చెత్తాచెదారం మధ్యలో శిశువు కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు..8 మీట ర్ల లోతులో ఉన్న శిశువును క్షేమంగా పైకి తీసుకొచ్చి నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. కాలుకు చిన్న గాయం తప్ప ఎలాంటి ప్రాణాపాయం లేదని నిర్ధారించారు. పుట్టిన మరుక్షణమే శిశువును బావిలో పడివేసి ఉంటారని వైద్యు లు భావిస్తున్నారు. సోమవారం సంగారెడ్డి లోని చైల్డ్వెల్ఫేర్ అధికారులకు అప్పగించనున్నట్లు ఎస్ఐ వెంకటరాజాగౌడ్ చెప్పారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన కాంగ్రెస్ నేత సునీతారెడ్డి.. శిశువు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శిశువుకు ‘మృత్యుం జయుడు’అనే పేరు పెట్టించాలన్నారు. -
నర్సాపూర్– సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నర్సాపూర్– సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ తెలిపారు. ఈ మేరకు నర్సాపూర్– సికింద్రాబాద్(07255/07256) ప్రత్యేక రైలు ఈ నెల 26న సాయంత్రం 6.15కి నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు సికింద్రా బాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 27న రాత్రి 9కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్ మణుగూరు వరకు.. రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కొల్హాపూర్– హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను వచ్చే ఏడాది మార్చి 14 నుంచి మణుగూర్ వరకు పొడిగించనున్నట్లు సీపీఆర్వో వెల్లడించారు. ఈ మేరకు కొల్హాపూర్– మణుగూర్ (11304/ 11303) ఎక్స్‌ప్రెస్‌గా సేవలం దించనుంది. కొల్హాపూర్‌లోని ఛత్రపతి సాహూ మహరాజ్ టెర్మి నల్ నుంచి ఉదయం 7.35కి బయలుదేరి మరుసటి రోజు మధ్యా హ్నం 1.30కి మణుగూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యా హ్నం 3.30కి మణుగూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.40కి కొల్హాపూర్ చేరుకోనుంది. మార్చి 14 నుంచి ఈ రైలు నాంపల్లి స్టేషన్‌కు బదులు వయా సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగించనుంది. -
ఊరంతా పందిరి
లోక కల్యాణం జంట ఒక్కటైతే... అది కళ్యాణం. అనేక జంటలు ఒక్కటైతే... అది లోకకళ్యాణం. ఒకరు తింటే... భోజనం. అనేక మంది తింటే... అది విందుభోజనం. విందులు మితిమీరితే... వృథా. వృథాలను అరికడితే... కనువిందు. అలాంటి కను‘విందు’లు కనిపించే కమనీయ కళ్యాణ దృశ్యాలను చూతము రారండి. పెళ్లి చేసినా.. ఇల్లు కట్టినా.. ఈ రోజుల్లో జీవితకాలపు ఆర్థిక భారం! కారణం.. ధరలు, ఆర్భాటాలు రెండూ ఆకాశాన్ని అంటడమే! వ్యవసాయం తప్ప వేరే ఉపాధి లేని ఊళ్లల్లో పెళ్లిళ్లు అంటే ఈసురోమనే స్థితే! దీన్ని అధిగమించడానికి ఓ ఉపాయం కనిపెట్టింది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం.. నర్సాపూర్. అదే సామూహిక వివాహాలు. నిన్న మొన్న కాదు.. 33 ఏళ్ల కిందటే! వివరాలు.. నర్సపూర్ ఓ మారుమూల పల్లెటూరు. ఊరంతటికీ వ్యవసాయమే ఆధారం. ముప్ఫైమూడు ఏళ్ల కిందట... వానల్లేక.. పంటలు పండక.. రైతులంతా పీకల్లోతు అప్పుల్లో కూరుకు పోయారు. కరువులో అధికమాసం లాగా.. పెళ్లీడుకు వచ్చిన కూతుళ్లు! తిండికే లేదంటే పెళ్లేం చేస్తారు? ఈ సమస్యనెలాగైనా పరిష్కరించాలని ఊరిపెద్దలు రాంచందర్ తిడ్కె, శామ్‌రావు కెంద్రే, బాబూరావు ముండే, రామ్రావు ముస్లే, ద్రువ ముండే ఏకమయ్యారు. ఆలోచించి సామూహిక వివాహాలే ఏకైక మార్గమని తేల్చారు. 22 జంటలతో మొదలు... పెద్దల చూపిన మార్గం గ్రామస్తులందరికీ నచ్చింది. వివాహాల కోసం ఒక్కో జంటకు రెండువేల రూపాయలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే కొందరు ఆ రెండు వేల రూపాయలు కూడా ఇవ్వలేని స్థోమతలో ఉన్నారు. వాళ్ల నుంచి డబ్బు వసూలు చేయలేదు. అలా 1984, మేలో మొత్తం 22 జంటలకు వివాహాలు జరిపించారు. అప్పటినుంచి కాలం కలిసొచ్చి పంటలు మెండుగా పండినా.. కరువు వచ్చినా.. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా సామూహిక వివాహాలకు నర్సాపూర్ వేదిక అయింది. ఆనవాయితీగా మార్చింది. యేటా పదిహేను జంటలకు తగ్గకుండా పెళ్లిళ్లు నిర్వహిస్తుంటారు. ఏప్రిల్, మేనెలల్లోనే ముహూర్తాలు పెట్టుకుంటారు. 1996లో 32 జంటలకు పెళ్లి జరిపించారు. ఈ ఏడాది 16 జంటలను ఒకింటి వారిని చేశారు. ఇప్పటి వరకు ఈ సామూహిక వివాహాల ద్వారా దాదాపు ఏడువందల జంటలు ఒక్కటయ్యాయి. ధనిక, పేద తేడాలేదు సామూహిక వివాహల్లో పేద, ధనిక అనే తేడా ఉండదు. పెళ్లికి పేదవారు తమకు తోచినంత ఇవ్వచ్చు. సామూహిక వివాహాల ముహూర్తపు తేదీని గ్రామపెద్దలు రెండు నెలల ముందే ప్రకటిస్తారు. ఆ తేదీకల్లా గ్రామస్తులు తమ కూతుళ్ల, కొడుకుల పెళ్లి సంబంధాలను కుదుర్చుకుంటారు. పెళ్లి కార్యక్రమాలు, భోజనాలు అన్నీ ఒకే వేదిక దగ్గర జరుగుతాయి. ఈ పెళ్లిళ్లకు బంధువులను గ్రామస్తులే ఆహ్వానిస్తారు. పెళ్లిపత్రికల మీద కూడా ఆహ్వానితులనే స్థానంలో గ్రామస్తులు అనే ఉంటుంది. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వారి బస, భోజన ఏర్పాట్లన్నీ గ్రామస్తులే చూసుకుంటారు. పెళ్లిళ్లకు మూడు రోజుల ముందు నుంచే బంధువులతో ఊరు కళకళలాడుతుంటుంది. నేతల హల్చల్.. సామూహిక వివాహాలకు నేతల రాక 1984 నుంచీ ఉంది. మొదటిసారిగా అప్పటి ఆదిలాబాద్ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డిని గ్రామస్తులు ఆహ్వానించారు. అప్పటినుంచి ప్రతి ఏటా జరిగే ఈ వివాహాలకు అధికార, ప్రతిపక్ష నాయకులు పోటీపడి మరీ ఈ పెళ్లిళ్లకు హాజరవుతున్నారు. పోలీసులకూ స్ఫూర్తి.. నర్సపూర్‌లో జరుగుతున్న సాముహిక వివాçహాలను పోలీసులు కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు. ‘మీకోసం’ కార్యక్రమంలో భాగంగా 2002లో ఇచ్చోడ పోలీసులు గిరిజన సామూహిక వివాహ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి 106 గిరిజన జంటలకు వివాహం చేశారు. తాళిబొట్టు తో పాటు బట్టల జతలూ అందించారు. జిల్లాలోని చాలా చోట్ల... ఈ సంప్రదాయం ఒక్క నర్సాపూర్‌కే పరిమితవలేదు. జిల్లాలోని చాలాచోట్ల కొనసాగుతోంది. మరాఠీ సంప్రదాయ గ్రామాలైన నవేగావ్, దర్మంపూరితో పాటు ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, థాంసీ, భీమ్‌పూర్, పార్డీతోపాటు పలు గ్రామాల్లో జరుగుతున్నాయి. ప్రతి ఏటా నిర్వహిస్తాం ఆ రోజుల్లో వరస కరువును దృష్టిలో పెట్టుకొని పెండ్లి ఖర్చు తగ్గించడానికి సామూహిక వివాహాలను ఏర్పాటు చేశాం. ఈ జంటల్లో చాలా మంది మంచి ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. – రాంచంద్ర తిడ్కె, గ్రామ పెద్ద అదే సంప్రదాయమైంది.. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు సామూహిక వివాహాల్లో తమ పిల్లల పెండ్లి చేయడం అనవాయితీగా వస్తోంది. ఊరంతా కలిసి పెండ్లి పనులు చూస్తాం. మా స్ఫూర్తిని అనేక గ్రామాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. – ద్రువ ముండే పాలుపంచుకుంటాం 1991లో నా పెళ్లి సామూహిక వివాహ మహోత్సవంలోనే జరిగింది. సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరం యేటా జరిగే ఈ పెళ్లిళ్లలో పాల్గొంటాం. పెళ్లి పనుల్లో పాలుపంచుకుంటాం. మా పెళ్లి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటాం. – విజయ్ ముస్లే (సాముహిక వివాహలో పెండ్లిచేసుకున్న వ్యక్తి ) -
సోలార్ సిటీలుగా నర్సాపూర్, మహబూబ్‌నగర్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో సంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని 10 శాతం తగ్గించాలన్న లక్ష్యంతో తెలంగాణలోని నర్సాపూర్ టౌన్, మహబూబ్‌నగర్‌తో పాటు ఏపీలోని విజయవాడ, కాకినాడను సోలార్ సిటీలుగా మార్చాలని నిర్ణయించినట్టు కేంద్ర వెల్లడించింది. ఈ మేరకు ఎంపీలు బుట్టా రేణుక, మాల్యాద్రి శ్రీరామ్ గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీలో 1,500 మెగావాట్ల సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు అనంతపురం జిల్లాలోని ఎన్పీ కుంట మండలంలో, కడప జిల్లాలోని గాలివీడు మండలంలో స్థలాలు గుర్తించామని, అలాగే 1,000 మెగా వాట్ల సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు కడప జిల్లాలోని మైలవరం, కర్నూలు జిల్లాలో స్థలాలు గుర్తించామని, అదేవిధంగా 500 మెగా వాట్ల సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలంలో, తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో స్థలాలు గుర్తించినట్టు తెలిపారు. వీటి ఏర్పాటుకు కేంద్ర సాయంగా రూ. 243 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణలో 2015–16 ఏడాదికిగానూ 402 మిలియన్ యూనిట్లు, 2016–17 ఆర్థిక సంవత్సరానికిగానూ సెప్టెంబర్ వరకు 458 మిలియన్ యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు తెలిపారు. -
నర్సాపూర్‌కు రెవెన్యూ డివిజన్ హోదా.
నర్సాపూర్:నర్సాపూర్ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పాలనాపరంగా పలు మార్పులు చెందుతూ వస్తూ ఎట్టకేలకు రెవెన్యూ డివిజన్ హోదా దక్కించుకుంది. 1957లో నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం ఏర్పాటైంది. అనంతరం పాలçనాపరంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గం ఏర్పడిన అనంతరం నియోజకవర్గ పరిధిలో ఆరు ఫిర్కాలు ఏర్పాటు చేశారు. నర్సాపూర్, కౌడిపల్లి, హత్నూర, తుర్కలఖానాపూర్, గుమ్మడిదల్ల, శివ్వంపేటలో ఫిర్కాలు ఏర్పాటు చేసి ఒక్కో ఫిర్కాకు ఒక్కో రెవెన్యూ ఇన్స్పెక్టర్ను నియమించారు. రెవెన్యూ అధికారిగా తహసీల్దార్ నర్సాపూర్‌లో ఉండేవారు. కాగా ప్రజాప్రతినిధులుగా గ్రామ స్థాయిలో సర్పంచులు, నియోజకవర్గ స్థాయిలో శాసనసభ్యునితో పాటు పంచాయితీ సమితి అధ్యక్షుడు ఉండేవారు. నియోజకవర్గంలో ఐదు మండలాల ఏర్పాటు 1985లో నియోజకవర్గాలను విభజించి మండల వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో ఐదు మండలాలను ఏర్పాటు చేశారు. నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంగా ఉండగా జిన్నారం, కౌడిపల్లి, హత్నూర, శివ్వంపేట మండలాలతో నియోజకవర్గం ఏర్పాటు చేశారు. మండల వ్యవస్థ రావడంతో ఫిర్కాలు కనుమరుగయ్యాయి. కాగా మండలాల ఏర్పాటుతో పంచాయతీ సమితి అధ్యక్ష పదవుల స్థానంలో ఎంపీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీ అధ్యక్ష పదవులు, జెడ్పీటీసీ సభ్యులుగా ప్రజాప్రతినిధులు కొత్తగా వచ్చారు. పునర్విభజనలో పెరిగిన మండలాలు మండల వ్యవస్థ అమలైన అనంతరం నర్సాపూర్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండేవి. 2009 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజనతో ఒక మండలం పోయి రెండు మండలాలు రావడంతో నియోజకవర్గ పరిధి ఆరు మండలాలకు పెరిగింది. నియోజకవర్గంలోని జిన్నారం మండలం కొత్తగా ఏర్పడిన పటాన్చెరు నియోజకవర్గంలోకి వెళ్లగా నర్సాపూర్ పరిధిలోకి ఇతర నియోజకవర్గల్లోని వెల్దుర్తి, కొల్చారం మండలాలు వచ్చి చేరడంతో మండలాల సంఖ్య ఐదు నుంచి ఆరు మండలాలకు పెరిగింది. కొత్త జిల్లాల నేపథ్యంలో డివిజన్ కేంద్రంగా.. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టిన నేపథ్యంలో నర్సాపూర్ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటు చేసిన మెదక్ జిల్లాలో చేరింది. అంతేకాకుండా రెవెన్యూ డివిజన్ కేంద్రం హోదా దక్కింది. నర్సాపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి పరిధిలోకి నర్సాపూర్‌తో పాటు కౌడిపల్లి, శివ్వంపేట, కొల్చారం మండలాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన చిలిపిచెడ్ మండలాలను చేర్చారు. కాగా రెవెన్యూ డివిజన్ కేంద్రం పరిధిలోకి వచ్చే మండలాల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని, సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే గెజిట్‌లో మార్పులు, చేర్పులు ఉండవచ్చని స్థానిక టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయడంతో ఆర్డీఓ ఆఫీసుతో పాటు పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. -
రక్తదానంతో ప్రాణాలు పదిలం
నర్సాపూర్: రక్తదానం చేయడంతో ఆపదలో ఉన్న వ్యక్తుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని మహేశ్వర కాలేజీ అండ్ హాస్పిటల్ క్యాంప్ ఇన్చార్జ్ డాక్టర్‌మహెష్ చెప్పారు. నర్సాపూర్‌లోని శ్రీ విష్ణు ఇన్సిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చీ కాలేజీలో(వైపర్) మహేశ్వర కాలేజీ అండ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్యాంప్ ఇన్చార్జ్ డాక్టర్ మహెశ్ మాట్లాడుతూ రక్తదానం చేసిన వ్యక్తులకు ఎలాంటి ఇబ్బంది జరుగకపోయినా ఏవో అనర్థాలు జరుగుతాయని చాలా మందిలో అపోహలుఉన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. రక్తదానం చేయడంతో అనేక మందికి మేలు చేసిన వారనవుతారని అన్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రక్త దానం చేయోచ్చని ఆయన సూచించారు. కాగా ప్రజలలో రక్త దానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ తమ కాలేజీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా రక్త దాన శిబిరం చేపట్టిన్లు చెప్పారు. తమ కాలేజీ విద్యార్తులు సేవా కార్యక్రమాలు తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆయన వారిని అభిందించారు. కార్యక్రంలో కాలేజీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, మహెశ్వర కాలేజీ అండ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్, శ్రీను, ఇతర సిబ్బంది మహెష్‌గౌడ్, రవీందర్‌గౌడ్‌తో పాటు వూపర్ కాలేజీ ఫ్రోఫెసర్లువిద్య, అర్చన తదితరులు పాల్గొన్నారు. కాగా కాలేజీకి చెందిన సుమారు వంద మంది విద్యార్థులు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. -
నరసాపురంలో రోడ్డు ప్రమాదం: యువకులు మృతి
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో గురువారం తెల్లవారుజామున పల్సర్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురిని గుర్తి తెలియని వాహనం ఢీకొట్టింది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా.. వారు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన ముగ్గురు యువకులు రుస్తుంబాదాకు చెందిన వారని పోలీసుల తెలిపారు. -
కడుపునొప్పి భరించలేక ఇద్దరు..
వెంకటాపురం : కడుపునొప్పి భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నర్సాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది, వెంకటాపురం ఎస్సై పోగుల శ్రీకాంత్ కథనం ప్రకారం.. నర్సాపూర్‌కు చెందిన తడక నాగరాజు-లావణ్య దంపతుల పెద్ద కూతురు ప్రత్యూష(16) ములుగులోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ప్రత్యూషకు సోమవారం రాత్రి 10 గంటలకు కడుపునొప్పి తీవ్రంగా రావడంతో బాధ భరించలేక ఆల్‌అవుట్‌కు చెందిన లిక్విడ్‌ను తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ప్రత్యూషను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు మంగళవారం తెల్లవారుజామున ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలో మృతిచెందింది. మృతురాలికి సోదరితోపాటు సోదరుడు ఉన్నాడు. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడి ఆత్మహత్య హన్మకొండ చౌరస్తా : కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హన్మకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. హన్మకొండ పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండలోని పోచమ్మకుంట ప్రాంతానికి చెందిన మంజల శ్రీకాంత్(29) రెండేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీకాంత్ రోజూ మాదిరిగానే సోమవారం పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. మందులు వాడుతున్నా నొప్పి తగ్గడం లేదనే మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి రమ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వ్యాపారస్థుల రాస్తారోకో
నర్సాపూర్: నర్సాపూర్ నియోజకవర్గాన్ని మెదక్ జిల్లాలో కలిపి నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలన్న డిమాండుతో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సంఘీభావంగా సోమవారం వ్యాపారస్తులు ర్యాలీ చేపట్టారు. అనంతరం రాస్తారోకో చేశారు. పట్టణంలోని పలు రకాలు వ్యాపారస్తులు కుమ్మరి సంజీవ, చంద్రశేకర్, భుజేందర్, ప్రవీన్‌కుమార్, వెంకటేశ్, కృష్ణమూర్తి, లక్ష్మన్, నాగరాజు, ప్రకాష్ తదితరులు పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోయాయి. కొనసాగుతున్న రిలే దీక్షలు నర్సాపూర్‌ను మెదక్‌లో కలిపి రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలన్న డిమాండుతో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 19వ రోజుకు చేరాయి. దీక్షల్లో మండలంలోని నారాయణపూర్ గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్‌తో పాటు గ్రామస్తులు నర్సయ్య, లక్ష్మి, పెద్దులు, రవుజా నాయక్, వీరస్వామి, వెంకటయ్య, బాగులు తదితరులు కూర్చున్నారు. వీరికి వ్యాపారులు, టీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు అశోక్‌గౌడ్, చంద్రశేకర్, హబీబ్‌ఖాన్, మల్లేశ్‌యాదవ్, భిక్షపతి, ఖుస్రు, నగేష్, కృపాచారి తదితరులు పాల్గొన్నారు. -
పునరావాస కేంద్రాల ఏర్పాటు
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్, తిరుమలాపూర్ గ్రామాల్లో శనివారం అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తుజాల్పూర్లో 10 పూరిగుడిసెలు, 5 పెంకుటిల్లు కూలిపోయాయి. తిరుమలాపూర్లో చెరువు అలుగు నీరు ఇళ్లల్లోకి రావడంతో 15 కుటుంబాలు అవస్థలు పడుతున్నారు. రెవెన్యూ అధికారులు తుజాల్‌పూర్‌లోని పాఠశాల, తిరుమలాపూర్ గ్రామ పంచాయతీలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి వంట చేసి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా... ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మాజీ మంత్రి సునీతారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు సంతోష్‌రెడ్డి సీడ్స్ ఆఫ్‌హోప్ సేవాస ంస్థ ద్వారా ఆహార పొట్లాలు, పాలు, బిస్కెట్లు, బ్రెడ్, బెడ్షీట్లు అందజేశారు. రెండు రోజుల పాటు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి పాలు, బిస్కెట్లు, బ్రెడ్, పులిహోర ప్యాకెట్లు అందేసినట్లు సీడ్స్ఆప్ హోప్ చైర్మన్ అమూల్య తెలిపారు. సునీతారెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న నాయకులు రెండు గ్రామాల ప్రజలను చూసిన దాఖలాలు లేవన్నారు. అధికారంలో ఉన్న నాయకులు చేయాల్సిన పని తాము చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో నర్సాపూర్ సర్పంచ్ రమణారావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అంజనేయులుగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, మాజీ సర్పంచ్ అశోక్, రెడ్డిపల్లి సర్పంచ్ భరత్‌గౌడ్, బాబు, రాజేష్, ముజాయిద్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీడీ శ్రీధర్ మండలంలోని తిరుమలాపూర్, తుజాల్పూర్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్, తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రవణ్‌కుమార్ సూచించారు. ఆ గ్రామాలను వారు సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. తిరుమలాపూర్లో చెరువు ప్రమాదంగా ఉండటంతో కట్టకు ఒక వైపు కాలువ తవ్వించి నీటిని దారి మళ్లించారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి రెవెన్యూ సిబ్బంది భోజనంతో పాటు వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. -
అల్లుకున్న నిర్లక్ష్యం
విద్యుత్తు అధికారుల తీరుకు సాక్ష్యం.. నిలువెత్తు ఈ స్తంభం నర్సాపూర్ రూరల్: విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ విద్యుత్తు స్తంభం. నర్సాపూర్ పట్టణం నడిబొడ్డున ఉన్న దివంగత మాజీ ఎమ్మెల్యే గుండం వీరయ్య ఇంటి ఎదుట ఉన్న విద్యుత్తు స్తంభంపై పిచ్చిమొక్కలు ఎగబాకి ప్రమాదకరంగా మారాయి. పిచ్చిమొక్కలు స్తంభాన్ని అల్లుకోవడంతో అటుగా వెళ్లే చిన్నపిల్లలు, కొత్తగా వచ్చే వ్యక్తులు విద్యుత్తు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ స్తంబానికి వీధిలైట్లతోపాటు పలు ఇండ్లకు విద్యుత్తు సరఫరా చేసే కండక్టర్ వైర్లు ఉన్నాయి. -
కన్నీటి ‘మధన’ం!
సందిగ్ధంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రోజుకో ఆలోచనతో సమస్య జఠిలం డివిజన్ కేంద్రమంటూ కొత్త పల్లవి నేరుగా సీఎం వద్ద ప్రస్తావన దక్కని ఫలితం.. దిక్కులు చూస్తున్న ప్రజాప్రతినిధి సాక్షిప్రతినిధి, సంగారెడ్డిజిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నర్సాపూర్ మండలం ఎటువైపు అనే అంశంపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తప్పటడుగులు వేస్తున్నారు. ఒకటి వెనుక ఒకటి అన్నట్టుగా తొందరపాటు నిర్ణయాలతో తలనొప్పి తెచ్చుకుంటున్నారు. సమస్య పరిష్కారం కాకపోగా మరింత జఠిలమయ్యేలా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రోజుకోరకమైన ఆలోచనల కారణంగా నర్సాపూర్ నియోజకవర్గ భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు.నర్సాపూర్ నియోజక వర్గాన్ని డివిజన్‌కేంద్రంగా చేసి మెదక్ జిల్లాలో కలుపుతూ అధికారులు ప్రభుత్వానికి తొలి ప్రతిపాదనలు పంపారు. పరిస్థితి అనుకూలిస్తే కొత్తగా ఏర్పడిన గుమ్మడిదల మండలాన్ని కూడా నర్సాపూర్‌లోనే కలిపి భవిష్యత్తులో నియోజక వర్గాల పునర్విభజన చేసినా ఎలాం టి సమస్య ఉత్పన్నం కాకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతోనే ప్రతిపాదనలు రూ పొందించారు. జిల్లా భౌగోళిక స్వరూపం, భవిష్యత్తు ప్రయోజనాలు, ప్రజాభిప్రాయాల దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. యూ టర్న్ ఫలితం.. నర్సాపూర్‌ను సంగారెడ్డి జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో రిలే దీక్షలు ఊపందుకున్నాయి. నర్సాపూర్‌లో వరుసగా 65 రోజుల దీక్ష జరిగింది. ఈ దీక్షకు కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ప్రత్యక్షంగా, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ పరోక్షంగా మద్దతు పలికారు. దీంతో రాజకీయ మైలేజీలో వెనుకబడి పోతానని భావించిన ఎమ్మెల్యే సీహెచ్ మదన్‌రెడ్డి కూడా నర్సాపూర్‌ను సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలనే డిమాండ్‌కు వంతపాడారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీకి లేఖ ఇచ్చారు. ఈ లేఖతో ప్రభుత్వం నర్సాపూర్, హత్నూర మండలాలను సంగారెడ్డి జిల్లాలో, శివ్వంపేట, వెల్దుర్తి, కౌడిపల్లి మండలాలను మెదక్ జిల్లాలో కలుపుతూ ముసాయిదాను జారీ చేసింది. ఇప్పుడు ఇంకోమాట... అనంతర కాలంలో మళ్లీ మనుసు మార్చుకొన్న మదన్‌రెడ్డి తాజాగా నర్సాపూర్‌ను డివిజన్ కేంద్రం చేసి మెదక్ జిల్లాలో కలపాలనే డిమాండ్ చేస్తున్నారు. సంక్లిష్టంగా మారిన సమస్యను పరిష్కరించడానికి ఆయనకు ముందున్న ఏకైక మార్గం మంత్రి హరీశ్‌రావు. ట్రబుల్ షూటర్‌గా గుర్తింపు ఉన్న మంత్రి హరీశ్‌రావుతో చర్చించి తన నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, తన వ్యక్తిగత అభిప్రాయాన్నిఆయన ముందు ఉంచితే ఆయనకు ఉపశమనం లభించే అవకాశం ఉందని మేధావులు సూచిస్తున్నారు. హరీశ్‌రావు మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకుని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పించే ప్రయత్నం చేయగలరని వారంటున్నారు. ఇక్కడా మరో తప్పటడుగు... కానీ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వెనుకాముందు ఆలోచించకుండా నేరుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి నర్సాపూర్‌ను డివిజన్ కేంద్రం గా చేసి మెదక్ జిల్లాలో ఉంచాలని కోరారు. ఇక్కడ మదన్‌రెడ్డి కేవలం తన కోరికను మా త్రమే కేసీఆర్ ముందు పెట్టగలిగారు. కానీ ఎందుకు నర్సాపూర్ డివిజన్ కేంద్రంగా చే యాలి?, నర్సాపూర్‌ను డివిజన్ చేస్తే అంతకు ముందే ప్రకటించిన తూప్రాన్ పరిస్థితి ఏమి టి? అనే శాస్త్రీయ అంశాలను ఆయన సీఎంకు విడమరిచి చెప్పలేకపోయారని తెలిసింది. దీంతో నర్సాపూర్ ఎమ్మెల్యే చేసిన డిమాండ్ ప్రాముఖ్యత లేని అంశంగా మిగిలిపోయింది. మరో వైపు మంత్రి హరీశ్‌రావు ఈ అంశాన్ని తన భుజం మీద వేసుకుని సీఎం వద్దకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. డిమాండ్‌ను గట్టిగా విన్పిస్తున్నా... నర్సాపూర్‌ను మెదక్ జిల్లాలో ఉంచాలనే డిమాండ్ ఇప్పటికీ సజీవంగానే ఉంది. అయితే డివిజన్ చేయటం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే ఇది సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గంతో ముడిపడి ఉన్న అంశం. దీన్ని డివిజచేయాలంటే ఇప్పటికే ప్రకటించిన తూప్రాన్ డివిజను ఏమి చేయాలనేది మొదటగా ఉత్పన్నమయే ప్రశ్న. ఒక వేళ తూప్రాన్ డివిజను అలాగే ఉంచి కొత్తగా నర్సాపూర్ డివిజన్‌ను ప్రకటించినా... తూప్రాన్‌లోని కొన్ని మండలాలను కలుపుకోవాల్సిన అవసరం ఉంది. అదే జరిగితే తూప్రాన్ డివిజహోదా కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రికి నేరుగా నష్టం కలిగించే ఈ వ్యవహారంలో వేలు పెట్టడానికి ఏ అధికారి, ప్రజాప్రతినిధి కూడా సాహసించకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
పుస్తకాలకు చెదలు
తడిసి ముద్దవుతున్న గ్రంథాలు శిథిలభవనాల్లో పుస్తక భాండాగారాలు పట్టించుకోని అధికారులు నర్సాపూర్: గ్రంథాలయాల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది గ్రంథాలయాల్లో ఐదింటి భవనాలు శిథిలావస్థకు చేరాయి. కౌడిపల్లిలోని గ్రంథాలయ భవనంలో పంచాయతీ రాజ్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా శివ్వంపేటలో భవన నిర్మాణ పనులు 15ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అమలుకు నోచుకోని ఎమ్మెల్యే, జెడ్పీచైర్పర్సన్ల హామీ నర్సాపూర్‌లోని ప్రభుత్వ గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరగా ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి గ్రంథాలయాన్ని సందర్శించి భవనం శిథిలావస్థకు చేరిన గ్రంథాలయాన్ని అద్దె భవనంలోకి మార్చాలని లైబ్రేరియన్‌కు సూచించారు. కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని, అంతవరకు అద్దె భవనంలో నిర్వహించాలని, అద్దె తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వారు హామీ ఇచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇంత వరకు గ్రంథాలయాన్ని అదే భవనంలో కొనసాగిస్తున్నారు. దీంతో భవనం మరింత శిథిలం కావడంతో ఎప్పుడు కూలుతుందోనని పాఠకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా భవనంలోని రీడింగ్ గది పైకప్పు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు రావడంతో పాటు అంతటా ఉరుస్తున్నందున ఆ గదిని మూసేసి చిన్న పాటి గదిని రీడింగు రూంగా ఏర్పాటు చేశారు. గది ఉరుస్తున్నందున పుస్తకాలు తడవడంతో కొన్ని పుస్తకాలను బస్తాల్లో ఉంచి అటకపై పెట్టగా అక్కడ సైతం వర్షం నీరు పడడంతో పుస్తకాలు తడిసి చెదలు పడుతున్నాయని తెలిసింది. గ్రంథాలయంలో సుమారు 50వేల రూపాయల విలువ చేసే పుస్తకాలు తడిసి ముద్దయినట్లు తెలిసింది. వెల్దుర్తిలో రెండు భవనాలు శిథిలావస్థకు వెల్దర్తి మండలంలో రెండు గ్రంథాలయాలు ఉండగా రెండూ శిథిలావస్థకు చేరాయి. వెల్దుర్తిలో గ్రంథాలయాన్ని గ్రామ పంచాయితీ భవనంలోని ఒక గదిలో నిర్వహిస్తుండగా ఆ గది శిథిలావస్థకు చేరింది. 1988లో నిర్మించిన మాసాయిపేట గ్రంథాలయం శాశ్వత భవనంలో కొనసాగుతున్నా శిథిలావస్థకు చేరింది. రంగంపేటలో అధ్వానం కొల్చారం మండంలం రంగంపేటలో గ్రంథాలయం అధ్వానంగా ఉన్న గదిలో కొనసాగుతోంది. గ్రామ పంచాయితీ కార్యాలయానికి చెందిన ఓ గదిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయగా అది శిథిలావస్థకు చేరింది. కాగా కొల్చారంలోని గ్రంథాలయానికి పక్కా భవనం ఉన్నా పుస్తకాల సంఖ్యను పెంచాలని పాఠకులు కోరుతున్నారు. గ్రంధాలయ భవనం మరో శాఖకు కేటాయింపు కౌడిపల్లిలో గ్రంథాలయ నిర్వహణ పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు చిన్న చూపు చూస్తున్నారు. గ్రంథాలయ భవనాన్ని ఇతర శాఖకు కేటాయించడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. కౌడిపల్లిలో గ్రంథాలయం కోసం ఆరు నెలల క్రితం నిర్మించిన భవనాన్ని పంచాయితీ రాజ్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయానికి కేటాయించి గ్రంథాలయాన్ని గ్రామంలోని కమ్యూనిటీ హాలులో కొనసాగిస్తున్నారు. కాగా కమ్యూనిటీ హాలులో కరెంటు లేకపోవడంతో సాయంత్రం పూట పాఠకులు ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. శివ్వంపేటలో 15 ఏళ్లుగా నిర్మాణం మండల కేంద్రమైన శివ్వంపేటలో గ్రంథాలయ భవన నిర్మాణ పనులు సుమారు 15 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. భవన నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. హత్నూరలో ఉన్న ప్రభుత్వ గ్రంథాలయానికి సొంత భవనం ఉన్నా నిధులు తక్కువగా మంజూరు కావడంతో పత్రికలు కూడా తక్కువ సంఖ్యలో వస్తున్నాయని పాఠకులు కోరుతున్నారు. -
కొత్త ఆలోచనలతో రండి..
గమ్యాన్ని చేరుకోండి దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించండి కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీ కృష్ణప్రసాద్ పిలుపు బీవీఆర్ఐటీలో కెమికల్ ఇంజినీరింగ్‌పై జాతీయ సదస్సు 12 అంశాలపై విద్యార్థులు, ప్రొఫెసర్ల ప్రజంటేషన్ దేశ నలుమూలల నుంచి హాజరైన విద్యార్థులు, ప్రొఫెసర్లు నర్సాపూర్ రూరల్: విద్యార్థులు కొత్త ఆలోచనలతో గమ్యాన్ని చేరి దేశాభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉందని గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీ ప్రసాద్, బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ విద్యా సంస్థల చైర్మన్ విష్ణురాజు అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బీవీఆర్ఐటీలో కెమ్‌కాన్ జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గ్రాన్యుల్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ... కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాక్టికల్‌గా ఆలోచించాలన్నారు. ఆయా రకాల పరిశోధనలు చేపట్టి గమ్యాన్ని చేరుకోవాలన్నారు. అదే సమయంలో దేశాన్ని ప్రగతి గమ్యం వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. పెట్రోలియం, పెట్రో కెమికల్, ఇంజినీరింగ్‌లో వస్తున్న మార్పులు, అవకాశాల గురించి ఆయన వివరించారు. బీవీఆర్ఐటీ యాజమాన్యం జాతీయ స్థాయిలో కెమికల్ సదస్సును నిర్వహించడాన్ని అభినందించారు. కార్యక్రమానికి తరలివచ్చిన ఆయా రాష్ట్రాల ప్రొఫెసర్లు, వెయ్యిమంది విద్యార్థులను ఆయన ఈ సందర్భంగా ఉద్దేశించి అనేక విషయాలను వివరించారు. కెమికల్ ఇంజినీరింగ్‌తో మంచి భవిష్యత్తు కెమికల్ ఇంజనీర్ వ్యవస్థ ఎప్పుడు పడిపోదని మళ్లీ మళ్లీ అది తిరిగి పైకి లేస్తుందని బీవీఆర్ఐటీ చైర్మన్ విష్ణురాజు అన్నారు. కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తేజాన్ని నింపుకుని నిత్యం పరిశోధనలు చేయాలన్నారు. ప్రస్తుతం కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... బీవీఆర్ఐటీ కళాశాల ప్లేస్‌మెంట్లతోపాటు విద్యార్థుల పరిశోధనలు, వారు చేసిన ఆయా రకాల పరికరాలు, కెమికల్లో సాధించిన ఘనతను వివరించారు. అనంతరం ఆయా రాష్ట్రాల విద్యార్థులు ప్రదర్శించిన పేపర్ ప్రజెంటేషన్, టెక్నికల్ ఈవెంట్స్ తదితర వాటిని డెలిగేట్స్ వీక్షించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు, ప్రొఫెసర్లు సైతం టెక్నికల్ ఈవెంట్స్‌తోపాటు 12రకాల అంశాలపై చర్చ కొనసాగించారు. నర్సాపూర్‌లో ఇలాంటి జాతీయ సదస్సు జరగడం పట్ల విద్యార్థులు, స్థానికులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి సదస్సుల ద్వారా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. నేడు కూడా సదస్సు ఈ సదస్సు ఆదివారం సైతం కొనసాగనుంది. ప్రాక్టికల్‌గా ఆయా రకాల ప్రదర్శన, పేపర్ ప్రజంటేషన్తోపాటు ముగింపు కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో డాక్టర్ కిషన్‌కుమార్, జీబీ రాధిక, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
5 తరగతులకు ఒకే గది ఎలా?
ఎంఈఓను నిలదీసిన తల్లిదండ్రులు నర్సాపూర్: ఐదు తరగతుల విద్యార్థులకు ఒక గది ఎలా సరిపోతుందని నర్సాపూర్‌లోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం మండల విద్యాధికారి జెమినిని నిలదీశారు. పట్టణంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి ఇటీవల రెయిలింగ్ కూలిన నేపథ్యంలో భవనంలో పాఠశాలను కొనసాగించ వద్దని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేయగా పాఠశాలను పట్టణంలోని జెడ్పీబాలికల ఉన్నత పాఠవాలలోకి మారుస్తూ అధికారులు నిర్ణయించారు. కాగా గురువారం ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు బాలికల ఉన్నత పాఠశాలకు వెల్లె సరికి వారికి ఒక గదితో పాటు వరండాలో చదువు చెప్పెందుకు అధికారులు ఏర్పాట్లు చేయడం పట్ల పాఠశాల మేనేజీమెంటు కమిటీ చైర్మన్ సంతోష, పలువురు పిల్లల తల్లిదండ్రులు సర్దార్, లక్ష్మినారాయణ, నసీమాబేగం తదితరులు వ్యతిరేకించారు. అంతేగాక వారు మండల పరిషత్తు కార్యాలయం వద్దకు వచ్చి ఐదు తరగతుల విద్యార్థులకు ఒక గది ఎలా సరిపోతుందని ఎంఈఓను నిలదీశారు. తమ పిల్లలకు తమ వార్డులోనే చదువు చెప్పాలని లేదంటే పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపమని తెగేసి చెప్పారు. కాగా స్థానిక ఎంపీటీసీ సభ్యుడు రాజేందర్ కలుగ చేసుకుని అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు నష్టపోతున్నారని, శిథిలావస్థకు చేరిన భవనంలో పాఠశాలను ఎలా నడుపుతారని ప్రశ్నించారు. కొత్త భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేసే వరకు ప్రైవేట్ భవనం సమకూర్చి, అద్దె తామె చెల్లిస్తామన్నారు. కాగా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిన విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించామని, అధికారుల సూచనల మేరకు ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల కొనసాగించేందుకు వసతి కల్పించానని ఎంఈఓ జెమిని చెప్పారు. ఇదిలాఉండగా విద్యార్తుల తల్లిదండ్రులు అక్డకి నుంచి ఎంఈఓ ఆఫీసుకు వచ్చి ఆఫీసు ఎదుట బైఠాయించి కొంత సేపు నిరసనలు వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ రమణ అక్కడికి వచ్చి ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం ఉన్న వార్డులో పాఠశాల కొత్త భవనం నిర్మించేందుకు స్థలం కేటాయిస్తామని చెప్పారు. -
ఏటీఎం నెంబర్ అడిగి..
డబ్బు డ్రా సైబర్ నేరగాళ్లు నర్సాపూర్: ఏటీఎం కార్డు నంబరు చెప్పాలని, లేకపోతే కార్డ్ బ్లాక్ అయిపోతుందని హెచ్చరించడంతో ఆ అమాయకుడు తన కార్డు నంబరు చెప్పాడు. దీంతో అదే రోజు అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ. 13 వేలు డ్రా చేసుకున్న సైబర్‌నేరగాళ్ల ఉదంతమిది. శివ్వంపేట మండలంలోని రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధి సీతారాం తండాకు చెందిన లంబాడి రవికి ఎస్బీఐ బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఏటీఎం కార్డు ఉంది. కాగా ఈనెల 3న గుర్తు తెలియని వ్యక్తి తన మోబైల్‌కు ఫోన్ చేసి నీ ఏటీఎం కార్డు నంబరు చెప్పాలని, లేకపోతే కార్డు బ్లాక్ అవుతుందని హెచ్చరించడంతో తాను భయపడి నంబరు చెప్పానన్నాడు. అనంతరం పిన్ నంబరు సైతం చెప్పాలని ఆగంతకుడు అడిగాడు. అయితే పిన్ నంబరు ఎందుకని ఎదురు ప్రశ్నించడంతో అతడు ఫోన్ కట్ చేశాడని చెప్పాడు. కాగా శనివారం ఏటీఎంకు వెళ్లి తన ఖాతాలో చూడగా ఈనెల 3నాడే రూ. 13వేలు డ్రా అయినట్లు ఉందని రవి వాపోయాడు. తన ఖాతా నుంచి డబ్బులు డ్రా అయిన విషయాన్ని ఎస్బీఐ అధికారులకు తెలియచేయగా పరిశీలిస్తామని చెప్పారని ఆయన చెప్పాడు. తన ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకున్న వ్యక్తులను గుర్తించి తనకు న్యాయం చేయాలని అతడు కోరాడు. కాగా నర్సాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని రవినాయక్ చెప్పాడు. కాగా ఈ విషయమై స్థానిక ఎస్ఐ వెంకటరాజగౌడ్ను అడగ్గా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. -
ముగ్గురికి డెంగీ
ఆలస్యంగా వెలుగు చూసిన కేసులు కలెక్టర్‌కు వార్డు సభ్యురాలి వినతి స్పందించిన వైద్య సిబ్బంది నర్సాపూర్: పట్టణంలో ముగ్గురు చిన్నారులు డెంగీ జ్వరంతో అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెంగీతో బాధపడుతున్న చిన్నారులకు తల్లిదండ్రులు సకాలంలో చికిత్స చేయంచడంతో కోలుకుంటున్నారు. విషయం తెలిసి 13వ వార్డు సభ్యురాలు కంది బబిత, ఆమె భర్త టీఆర్ఎస్ నాయకుడు కంది ప్రభాకర్‌రావు గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వారు కోరారు. దీంతో స్పందించిన కలెక్టర్ ఆరోగ్య కేంద్రం సిబ్బందిని పట్టణంలో పరిశీలించాలని ఆదేశించారు. మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి, ఇతర సిబ్బంది పట్టణంలో పర్యటించి డెంగీ బాధితుల వివరాలు సేకరించారు. డెంగీ బాధితులు ముగ్గురిదీ ఒకే వార్డు పట్టణంలోని 13 వార్డుకు చెందిన ముగ్గురు చిన్నారులు డెంగీతో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని విజయ్‌కుమార్ కూతురు బిందుకు గత నెల చివరి వారంలో జ్వరం రావడంతో ఐదు రోజులపాటు ఇక్కడే చికిత్స చేయించినా తగ్గ లేదు. దీంతో గాంధీ ఆసుపత్రికి తీసుకుపోగా ఈ నెల 3న ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి డెంగీ వ్యాధిగా నిర్ధారించారు. వైద్యం చేసి కోలుకున్న అనంతరం ఇంటికి పంపారు. అదే వార్డుకు చెందిన వెంకటేశం కూతురు నమ్రతకు గత నెల 25న జ్వరం రాగా స్థానికంగా చికిత్స చేయించారు. అనంతరం షాపూర్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించామని బాలిక తండ్రి చెప్పారు. అదే వార్డులోని శ్రీనివాస్ కుమారుడు నితిన్కుమార్కు సైతం 15 రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో హైదరాబాద్‌లో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జి అయ్యాడు. పారిశుద్ధ్యం అధ్వానం తమ వార్డులో పారిశుద్ధ్య పనులు అధ్వానంగా ఉన్నాయని వార్డు సభ్యురాలు కంది బబిత, టీఆర్ఎస్ నాయకుడు కంది ప్రభాకర్‌రావులు ఆరోపించారు. మురికి పేరుకుపోవడంతో పందులు ఎక్కువగా సంచరిస్తున్నాయని, దోమలు ఎక్కువయ్యాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. -
నరసాపురంలో అధిక వర్షపాతం
ఏలూరు (మెట్రో): జిల్లాలో గడిచిన 24 గంటల్లో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ముఖ్య ప్రణాళికాధికారి టి.సురేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అధికంగా నరసాపురం మండలంలో 7.6 మిల్లిమీటర్లు వర్షం కురవగా అత్యల్పంగా అత్తిలి మండలంలో 0.2గా నమోదైంది. దేవరపల్లిలో 5.8, దెందులూరులో 4.6, తాళ్లపూడిలో 3, పోల వరం, జీలుగుమిల్లిలో 2.4, గణపవరంలో 2, కామవరపుకోటలో 1.6, మొగల్తూరులో 1.4, చాగల్లులో 1.2,నల్లజర్ల మండలాల్లో 0.8గా వర్షపాతం నమోదైంది -
నిరుద్యోగుల కోసం మెగాజాబ్ మేళా
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుములమదన్‌రెడ్డి అజయ్‌యాదవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నర్సాపూర్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్‌మేళాలు చేపడుతున్నట్టు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం కృష్ణవేణి స్కూల్లో అజయ్‌యాదవ్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్‌మేళాకు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఉద్యోగం పొందినవారు రాణించాలని ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో పోటీ పెరిందని, అందుకు అనుగుణంగా ప్రతిభను పెంచుకోవాలని సూచించారు. కాగా, జాబ్‌మేళాలో 14 కంపెనీలు పాల్గొనడం అభినందనీయమన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అజయ్‌యాదవ్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మురళీధర్ యాదవ్ మాట్లాడుతూ యువతకు అన్ని రంగాల్లో సహకరించేందుకు ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల గ్రూపు-2 అభ్యర్థులకు 75 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చినట్టు గుర్తుచేశారు. సర్పంచ్ రమణరావు మాట్లాడుతూ.. జాబ్‌మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అరబిందో ప్రతినిధి రవి మాట్లాడుతూ.. ఉద్యోగాలు రానివారు నిరాశ పడొద్దని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం రాష్ట్ర అద్యక్షుడు గందం రాములు, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శశిధర్, నాయకులు భోగ శేఖర్, మల్లేశ్‌యాదవ్, నర్సింగ్‌రావు, సుభాష్ గౌడ్, భిక్షపతి తదితరులున్నారు. జాబ్‌మేళాలో పాల్గొన్న కంపెనీలు ఎంఆర్ఎఫ్, పెన్నార్ స్టీల్స్, అరబిందో ఫార్మా కంపెనీ, కోవాలెంట్ ల్యాబొరేటరీ, పిరమిల్ హెల్త్‌కేర్, కిర్బి, తోసిబా, పైనార్ ఎలక్ట్రానిక్స్, వసుధ ఫార్మా కంపెనీ, హెచ్జీఎస్ కంపెనీ, జెన్పాక్ట్, ఇన్నోవ్ సోర్స్ ప్రైవేటు కంపెనీ, స్మార్ట్ డ్రైవ్ సిస్టం కంపెనీ, గ్లాండ్ ఫార్మా కంపెనీ, శ్రీరాం చిట్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జాబ్ మేళాకు మంచి స్పందన మెగా జాబ్‌మేళాకు భారీ స్పందన లభించింది. ఉదయం 9 గంటల నుంచి నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 2,050 హాజరయ్యారు. కంపెనీల ప్రతినిధులు అభ్యర్థుల బయోడేటాలు పరిశీలించి త్వరలో సమాచారం అందిస్తామని చెప్పారు. విజయవంతంగా కొనసాగిస్తున్నాం నిరుద్యోగులకు సహకరించాలన్న లక్ష్యయంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, పేదలకు రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తున్నాం. ఇటీవల గ్రూపు-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చాం. మరోసారి మరిన్ని ఎక్కువ కంపెనీలు పాల్గొనేలా జాబ్ మేళా చేపడతాం. - మురళీధర్‌యాదవ్, అజయ్‌యాదవ్ ట్రస్టు చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జాబ్‌మేళా బాగుంది జాబ్‌మేళా బాగుంది. నన్ను ఎమ్మారెఫ్ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వూ ్య చేశారు. మరిన్ని జాబ్‌మేళాలు కండక్ట్ చేస్తే నాలాంటి నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. - నవీన్, బీటెక్, నర్సాపూర్ ఉపయోగకరంగా ఉంది ఈ జాబ్‌మేళా నిరుద్యోగులకు ఉనయోగకరంగా ఉంది. నేను బీటెక్ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదు. మేళాతో ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నా. జిల్లా నుంచి చాలా మంది వచ్చారు. - సౌమ్య, బీటెక్, నర్సాపూర్ మరిన్ని కంపెనీలు రావాలి మరిన్ని కంపెనీలు వస్తే బాగుండేది. విద్యార్హతలకు ప్రాదాన్యం ఉండేలా కంపెనీలు రావాలి. జాబ్ మేళా చేపట్టడం అభినందనీయం. నాలాంటి వాళ్లకు ఉద్యోగ సమస్య తీరుతుంది. - ఈశ్వర్, ఐటీఐ, సంగారెడ్డి అందరికి ఉపయోగ పడేవిదంగా ఉండాలి అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారికి ఉపయోగపడేలా ఉంటే బాగుండేది. ఎక్కువ కంపెనీలు ఐటీఐ అభ్యర్థులను అడిగారు. జాబ్‌మేలా చేపట్టడం అభినందనీయం. - లోకేందర్, మెదక్ -
విద్యుదాఘాతానికి రైతు బలి
సిద్దిపేట క్రైం: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ శివారులోని నర్సాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. టూటౌన్ సీఐ సైదులు కథనం ప్రకారం... నర్సాపూర్ గ్రామానికి చెందిన తాళ్ల రామయ్య (60) తన వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో గట్టుపై ఉన్న చెట్టు కొమ్మలను గొడ్డలితో నరుకుతుండగా అక్కడే పైన ఉన్న విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్‌కు గురై, మంటలు చేలరేగి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్టు సీఐ తెలిపారు. -
అంత్య పుష్కరాలకు రూ.43 లక్షలు
కొవ్వూరు/నరసాపురం : అంత్య పుష్కరాలకు అవసరమైన తాత్కాలిక ఏర్పాట్లపై కొవ్వూరు, నరసాపురం మునిసిపాలిటీలు ఎట్టకేలకు దృష్టి సారించాయి. ఈనెల 31వ తేదీ నుంచి 12 రోజులపాటు నిర్వహించే అంత్య పుష్కరాలకు కొవ్వూరు మునిసిపాలిటీ రూ.44 లక్షలు కేటాయించాలని నిర్ణయించింది. ‘పుష్కరాలు వచ్చేస్తున్నాయ్.. ఏర్పాట్లపై దృష్టి సారించని సర్కార్’ శీర్షికన జూన్ 23వ తేదీన ‘సాక్షి’లో ప్రచురించిన కథనంపై మునిసిపల్ పాలకవర్గాలు స్పందించాయి. కొవ్వూరు మునిసిపల్ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్ (చిన్ని), కమిషనర్ టి.నాగేంద్రకుమార్ ఇటీవల అధికారులతో సమావేశం నిర్వహించి అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. గతనెల 28న నిర్వహించిన సాధారణ సమావేశంలో రూ.43 లక్షలు నిధులు కేటాయిస్తూ తీర్మానం చేశారు. ప్రధానంగా తాగునీటి సౌకర్యానికి రూ.2 లక్షలు, తాత్కాలిక మరుగుదొడ్లు, కరెంటు చార్జీల నిమిత్తం రూ.3 లక్షలు, దుస్తులు మార్చుకునే తాత్కాలిక గదుల నిర్మాణానికి రూ.3 లక్షలు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుకు రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తూ తీర్మానం చేశారు. కన్జర్వెన్సీ సామగ్రి కొనుగోలుకు రూ.12 లక్షలు, 250మంది తాత్కాలిక పారిశుధ్య సిబ్బందిని వినియోగించేందుకు రూ.13 లక్షలు, పారిశుధ్య పనుల నిర్వహణకు జేసీబీ, ట్రాక్టర్లను అద్దె ప్రతిపాదికన తీసుకునేందుకు రూ.5 లక్షలు కేటాయిస్తూ తీర్మానం చేశారు. అంత్య పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే ఆ నిధుల నుంచి ఖర్చు చేయాలని, లేదంటే పురపాలక సంఘ సాధారణ నిధుల నుంచి వెచ్చించాలని నిర్ణయించారు. పట్టణంలోని ప్రధాన డ్రెయిన్లలో సిల్ట్‌ను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కౌన్సిల్ నిర్ణయించింది. మరోవైపు అంత్య పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై నరసాపురం మునిసిపాలిటీ దృష్టి సారించింది. మునిసిపల్ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాల అధికారులు, కౌన్సిలర్లతో గురువారం సమావేశమయ్యారు. ఘాట్లలో చేయాల్సిన తాత్కాలిక ఏర్పా ట్లు, చేపట్టాల్సిన పనులపై చర్చించారు. లైటింగ్, మంచినీటి సదుపాయం, ఇతర పనుల నిమిత్తం ఏ మేరకు నిధులు అవసరమవుతాయనే అంశాలపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచనలిచ్చారు. -
బస్సుబోల్తా...పది మందికి గాయాలు
నర్సాపూర్(మెదక్): బస్సు పల్టీకొట్టిన ఘటనలో పదిమంది గాయాల పాలయ్యారు. శనివారం సాయంత్రం నర్సాపూర్-తుప్రాన్ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సంగారెడ్డికి వెళుతుండగా.. హన్మంతాపూర్ సమీపంలో బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మందిలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
‘పోలవరం’పై రాజీ పడం
నరసాపురం అర్బన్: పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాజీలేని పోరాటం చేస్తానని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. మంగళవారం కొత్తపల్లి హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో జిల్లాలో రైతుల పరిస్థితి, సాగునీటి సమస్య, ఇసుక కొరత, వేసవిలో జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై చర్చించినట్టు కొత్తపల్లి విలేకరులకు తెలిపారు. కేంద్ర బడ్జెట్లో కూడా పోలవరం ప్రాజెక్ట్‌కు న్యాయం చేయకపోవడం, ముఖ్యమంత్రి కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకపోవడం వంటి అంశాలను కూలంకషంగా చర్చించినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్మాణాత్మక పోరాటం చేద్దామని, ప్రభుత్వాల మెడలు వంచి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే విధంగా పోరాడదామని అధినేత సూచించినట్టు చెప్పారు. వైఎస్ జగన్‌కు కలిసిన ముదునూరి ఆచంట : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అరకొర నిధుల కేటాయింపుపై జిల్లా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం వైఎస్ జగన్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అరకొర నిధులు కేటాయించడంపై అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ చెప్పారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించినట్టు ప్రసాదరాజు తెలిపారు. అధినేత దృష్టికి మెట్ట సమస్యలు దేవరపల్లి: జిల్లాలో మెట్ట రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వివరించినట్టు వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గం కన్వీనర్ తలారి వెంకట్రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌ను కలిసినట్టు ఆయన చెప్పారు. పొగాకు, ఆయిల్‌పామ్ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పతనమవుతున్న ఆయిల్‌పామ్ గెలల ధర, భీమోలులో రైతులకు పరిహారం ఇవ్వకుండా రైతుల భూముల్లో దౌర్జన్యంగా జరుపుతున్న చింతలపూడి కాలువ పనులు, దూబచర్ల పరిసర గ్రామాల్లో దళితుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటున్న తీరును వైఎస్. జగన్మోహన్రెడ్డికి వివరించినట్టు తలారి చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గాయాలు
బైక్, లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం నర్సాపూర్-సంగారెడ్డి రహదారిలోని బివిఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామానికి చెందిన బి.పవన్ బైక్‌పై బివిఆర్ఐటి కాలేజీలో తన బందువును వదిలిపెట్టి తిరిగి దౌల్తాబాద్ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ నుజ్జునుజ్జు కాగా పవన్ తలకు, రెండు కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్సులో అతన్ని నర్సాపూర్‌కు తరలించగా స్థానిక వైద్యులు పరీక్షలు చేసి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డికి తరలించారు. -
‘కొత్త’ సవారీ...
కొత్త సంవత్సర వేళ.. పోలీసులు భిన్నమైన, స్ఫూర్తివంతమైన నిర్ణయం తీసుకున్నారు. కాలుష్య నివారణకు, శారీరక దారుఢ్యానికి సైకిళ్ల వాడకంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు విధి నిర్వహణలో వీలును బట్టి సైకిళ్లను వాడాలని నిర్ణయించారు. ఈ మేరకు నర్సాపూర్, రామాయంపేట ఠాణాల్లో నాలుగు చొప్పున సైకిళ్లను కొన్నట్టు ఈ రెండు స్టేషన్ల సీఐలు తిరుపతిరాజు, నందీశ్వర్ తెలిపారు. శుక్రవారం వీటికి హత్నూరలోని పలుగుమీది పోచమ్మ ఆలయంలో పూజలు చేయించారు. కార్యక్రమంలో ఎస్ఐలు గోపినాథ్, లాలునాయక్, బాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. - నర్సాపూర్ -
బోనం.. సంబురం
నర్సాపూర్‌లో బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం నల్ల పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి సైతం బోనం ఎత్తుకున్నారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాదవ్ సైతం పూజలో పాల్గొన్నారు. - నర్సాపూర్ -
హోటల్లోకి దూసుకెళ్లిన లారీ : ముగ్గురికి తీవ్రగాయాలు
మెదక్ : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. అధిక వేగంతో వెళ్తున్న లారీ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ అధికారి
నర్సాపూర్ (మెదక్) : ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ.. ఫారెస్ట్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి మధుసూధన్ రావు స్థానిక రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా.. ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
అన్నదాత ఆత్మహత్య
నర్సాపూర్ రూరల్ (మెదక్) : తీరని అప్పులు, ఎండిన పంటలు.. ఓ గిరిజన రైతును బలి తీసుకున్నాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఇబ్రహీంబాద్ పంచాయతీ బోడగుట్ట తండాలో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన దేవాసోత్ శంకర్(52)కు రెండెకరాల భూమి ఉంది. అందులో వరి, మొక్కజొన్న సాగుచేశాడు. కొన్నిరోజులుగా బోరు బావి అడుగంటిపోవడంతో నీరు లేక చేతికొచ్చే దశలో ఉన్న వరి ఎండిపోయింది. రెండుసార్లు బోరు డ్రిల్లింగ్ చేయించినా ఫలితం లేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురై రూ.2 లక్షల అప్పును ఎలా తీర్చాలని ఆవేదన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం వేకువజామున వరి పొలంలో ఉన్న చెట్టుకు తాడుతో ఉరివేసుకున్నాడు. ఉదయాన్నే అటుగా వెళ్లిన రైతులకు విగతజీవిగా కనిపించాడు. అతనికి ముగ్గురు కుమారులు రమేష్, రాజు, రెడ్యా ఉన్నారు. -
వివాహిత ఆత్మహత్య
వరకట్న వేదింపులు ఓ గృహిణి ని బలితీసుకున్నాయి. కట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నర్సాపూర్ మండలంలోని రాంచంద్రాపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన జీడి నర్సింహ్మాగౌడ్ భార్య లక్ష్మి(26) వంటిపై కిరోసిన్‌పోసుకొని నిప్పంటించుకొని మృతిచెందింది. గత కొన్ని రోజులుగా అదనపు కట్నం కోసం నర్సింహ్మగౌడ్ తన కూతురును వేదించడం వల్లే... ఆమె ఈ దారుణానికి ఒడి గట్టి ఉంటుందని లక్ష్మి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దంపతులపై దాడి
నర్సాపూర్ : కుటంబకలహాల నేపథ్యంలో దంపతులపై కొంతమంది గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో భర్త చనిపోగా, భార్య అపస్మారక స్థితిలో ఉంది. ఈ సంఘటన బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో జరిగింది. వివరాలు..మండల కేంద్రంలో నర్సింహాలు, అనసూయ దంపతులపై గుర్తుతెలియని దుండుగులు దాడి చేశారు. ఈ దాడిలో నర్సింహాలు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన అనసూయ అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ఈ ఘటనలో నర్సింహులు మృతదేహాన్ని పోలీసులు పక్కనే ఉన్న పొలాల్లో గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నర్సాపూర్ లేదా నిర్మల్‌లో రాహుల్ పర్యటన!
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మే రెండో వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. రైతు భరోసా యాత్రలో రాహుల్ పాల్గొననున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బుధవారం సాయంత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాహుల్‌తో భేటీఅయ్యారు. తెలంగాణలో రాహుల్ పర్యటన గురించి ఆయన చర్చించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మెదక్ జిల్లా నర్సాపూర్ లేదా ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో రాహుల్ పర్యటించవచ్చని తెలిపారు. కాగా షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. -
నర్సాపూర్‌లో రాహుల్ పాదయాత్ర?
రైతులను పరామర్శించేందుకు రానున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మే రెండో వారంలో నిర్వహించే అవకాశం సాక్షి, హైదరాబాద్: రైతులను పరామర్శించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు టీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పాదయాత్ర చేస్తారని.. అయితే ఇంకా కచ్చితమైన షెడ్యుల్ రాలేదని పేర్కొన్నాయి. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం నుంచి టీపీసీసీకి సమాచారం అందినట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి దీనికి సంబంధించి మంగళవారం మెదక్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లా నేతలతో చర్చించారు కూడా. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. రైతుల ఆత్మహత్యలు, వడగళ్లతో ఎక్కువ నష్టం జరిగిన ప్రాంతాల్లో రాహుల్‌గాంధీ సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. మే రెండోవారంలో ఈ పర్యటన ఖరారైంది. తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. నిర్మల్ (ఆదిలాబాద్)లో ఎక్కువమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని టీపీసీసీ అధ్యయనంలో తేలింది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, గజ్వేల్ ప్రాంతం రైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో ఉంది. దీంతోపాటు స్టేషన్ ఘన్పూర్, మహబూబాబాద్ (వరంగల్), పరిగి (రంగారెడ్డి)ల్లోనూ పర్యటన చేపడితే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చించారు. అయితే ఇందిరాగాంధీ హయాం నుంచి మెదక్ జిల్లాకు, ఆ కుటుంబానికి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆ జిల్లాలోనే రాహుల్ పాదయాత్ర ఏర్పాటుచేయాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ బుధవారం రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా రాహుల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ ముఖ్యులతో సమావేశమవుతారు. ఆలోపు రాహుల్ పర్యటన వివరాలు ఖరారయ్యే అవకాశాలున్నాయి. కాగా.. ఈ నెల 30లోగా పార్టీ సభ్యత్వ వివరాలను సీడీలతో సహా అందించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతలకు సూచిం చారు. మంగళవారం మెదక్, వరంగల్ జిల్లాల నేతలతో గాంధీభవన్‌లో ఆయన సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సభ్యత్వమే కీలకమని, పార్టీ నేతలంతా దీనిపై సీరియస్‌గా దృష్టిని సారించాలని కోరారు. -
ఏడాది అధ్యయనం..ఏడు రికార్డుల విధానం
మెతుకుసీమ సర్కారు భూముల అన్యాక్రాంతానికి అడ్డుకట్ట పడింది. ప్రతి ఎకరాకు సమగ్రమైన రెవెన్యూ రికార్డుతో పాటు పటిష్టమైన కంచె సైతం ఏర్పాటైంది. అయితే దీని వెనుక ఓ ఉన్నతాధికారి శ్రమ ఉంది. ఆయన ఒక్కొక్క ఎకరాన్ని కాపాడుకుంటూ కబ్జాదారులకు అడ్డంపడ్డారు. బంట్రోతై ఫైళ్లు పట్టుకొని కోర్టు గుమ్మం ముందు నిలబడ్డారు. ఆయన కాపాడిన భూమినంత ఒక్కచోట గుదిగుచ్చి చూస్తే 1.59 లక్షల ఎకరాలు తేలింది. దీని విలువ సుమారు రూ. లక్ష కోట్లు ఉంటుందని అంచనా. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా వివిధ రూపాల్లో సర్కారు భూమి ఉంది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న పటాన్చెరు, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోనే 60 శాతం భూములున్నాయి. ఇవి అన్నీ కూడా అత్యంత విలువైన భూములు. గత పాలకుల ఏలుబడి లో కబ్జాదారులు అందిన చోటల్లా సర్కారు భూమి ని చదును చేశారు. ఈ భూములకు రెవిన్యూ రికార్డులు సరిగా లేకపోవడం, ఐఏఎస్ అధికారులకు రెవెన్యూ రికార్డులు, వాటి అమలు తీరుపై పట్టు లేకపోవడంతో పాటు అధికారుల్లోనే కొందరు కబ్జాదారులకు అండగా నిలబడటంతో ప్రభుత్వ భూమి తరిగిపోతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి వివాదాలు లేని ప్రభుత్వ భూమి జిల్లాలో ఎంత ఉందో తెలుపుతూ నివేదిక పంపాలని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రోశయ్య ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని కోరింది. అయితే అప్పటి అధికారులు కనీసం 100 ఎకరాల భూమిని కూడాచూపించలేకపోయారు. ఏడాది అధ్యయనం..ఏడు రికార్డుల విధానం మెదక్ జేసీగా బాధ్యతలు చేపట్టిన శరత్‌కు రెవెన్యూ రికార్డుల మీద సమగ్రమైన పట్టుంది. జిల్లా రెవెన్యూ రికార్డులను దాదాపు ఏడాది కాలం పాటు ఆయన సమగ్రంగా అధ్యయనం చేశారు. ఏడు రికార్డుల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. నిరుపేద సన్న, చిన్నకారు రైతులకు, దళిత, గిరిజనులకు అవసరమైన రెవెన్యూ సహకారం అందించారు. ఏడు రికార్డులతో కూడిన సమగ్ర పట్టా పుస్తకాలను అందించారు. పట్టాలు అందిందో లేదో తెలుసుకునేందుకు ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికీరెవెన్యూ సిబ్బందిని పంపించి రైతుల చేత సంతకం తీసుకున్నారు. ఇక రెండవ దశలో ప్రభుత్వ భూముల మీద దృష్టి సారించారు. ఒక్కో నియోజకవర్గాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు, కబ్జాలో ఉన్న వారి వివరాలు గుర్తించారు. ‘‘మీరు ఆక్రమణలో ఉన్నది ప్రభుత్వ భూమి, కాదు అని నిరూపించడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో చూపించండి’’ అని నోటీసులు పంపించారు. దీంతో భూ బకాసురుల బండారం బయటకి వచ్చింది. జేసీ శరత్ చర్యలతో జిల్లాలో మొత్తంగా 1.59 లక్షల ఎకరాల సర్కార్ భూమి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రభుత్వం ఎప్పుడు, ఏ అవసరాల కోసం అడిగినా ఎలాంటి వివాదం లేకుండా ఈ భూమి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని డాక్టర్ శరత్ ఇటీవల ఓ సభలో ప్రకటించడం విశేషం. ఆరోపణలు..అవమానాలు కబ్జాదారుల గుప్పిట్లో ఉన్న ప్రతి ఎకరాను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి జేసీ శరత్ ఎన్నో అవమానాలు పడ్డారు.. అంతకు మించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పటాన్చెరు, రామచంద్రాపురం మండలాల్లోని భూములను స్వాధీనం చేసుకునే సమయంలో ఏకంగా ఆయన బదిలీ కోసం సీఎం స్థాయిలో పైరవీలు చేశారు. అమీన్‌పుర గ్రామంలో 993 సర్వే నంబర్లోని దాదాపు 110 ఎకరాల భూమి పరాధీనంలోకి వెళ్లిపోయింది. దీని విలువ ప్రస్తుత మార్కెట్లో దాదాపు రూ. 350 కోట్లు ఉంటుంది. పట్టుబట్టి కబ్జాదారులను వెళ్లగొట్టిన జేసీ శరత్, ఈ 110 ఎకరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు చుట్టూ కంచె వేయించారు. ఇక జిల్లా కేంద్రమైన సంగారెడ్డి శివారులోని కంది గ్రామంలో దాదాపు 300 ఎకరాల భూమి తమదేనంటూ కొందరు కోర్టుకు వెళ్లారు. ఈ భూమి ప్రభుత్వానిదే అని నిరూపించడానికి జేసీ శరత్ ఏకంగా తానే ఫైళ్లు పట్టుకుని జడ్జి ఎదుట నిలబడ్డారు. ఎట్టకేలకు దాన్ని సాధించి 300 ఎకరాల చుట్టూ కంచె వేయించారు. ఇలా మొత్తంగా గుర్తించిన 1.59 లక్షల ఎకరాల్లో 16,551 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు, 35 వేల ఎకరాలను హెచ్ఎండీఏ అవసరాలకు ఉపయోగపడేవిగా గుర్తించారు. ఇవికాకుండా 3,500 ఎకరాల భూములను విలువైన భూములుగా, 1,620 ఎకరాల భూమి అత్యంత విలువైన భూములుగా నిర్ధారించారు. -
కుంటిసాకులు చెప్పొద్దు: కొత్తపల్లి
నర్సాపురం(పశ్చిమగోదావరి జిల్లా): వ్యవసాయ రుణాలు మాఫీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గుర్తుకు రాకపోతే ఎన్నికల మేనిఫెస్టో చదువుకోవాలని సూచించారు. రుణమాఫీపై గట్టిగా నిలదీస్తుంటే చంద్రబాబు సింగపూర్ షికారు, జపాన్ జంప్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తొలి సంతకం అమలు తీరు ఆపరేషన్ సక్సెస్.. షేపెంట్ డెడ్ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. -
సదరం క్యాంపునకు భారీ స్పందన
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్‌లోని ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన సదరం క్యాంపునకు భారీ స్పందన లభించింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వికలాంగులు శిబి రానికి తరలిరాగా, అధికారులు నాలుగు కౌం టర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. నలుగురు వైద్యు లు వికలాంగులకు పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో మొత్తం 1,613 దరఖాస్తులు వచ్చినట్లు డీఆర్డీఏ ఏపీఓ జయలక్ష్మి తెలిపారు. వికలత్వ పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలోనే ధ్రువీకరణ పత్రాలను ఆయా మండలాలకు పంపుతామని ఆమె వెల్లడిం చారు. అర్హులందరికీ పింఛన్లు అర్హులైన ప్రతి వికలాంగునికి రూ.1,500 పింఛన్ వచ్చేలా కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆమె సదరం క్యాంపును సందర్శించారు.ఈ సందర్భంగా దరఖాస్తులు స్వీకరణ కౌంటర్లు, వైద్య పరీక్షలు చేసే కౌంటర్లను పరి శీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మురళీధర్ యాదవ్, ఎంపీడీఓ ల క్ష్మీబాయి, స్థానిక ఆస్పత్రి సూపరింటెండెం ట్ సురేష్‌బాబు, నగేష్ , నవాజ్ పాల్గొన్నారు. -
‘హిందూస్థాన్’ గోదాంలో అర్ధరాత్రి చోరీ
నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని హిందూస్థాన్ లివర్ లిమిటెడ్ సంస్థకు చెందిన గోదాంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. సుమారు రూ. 46 వేల విలువైన సరుకును అపహరించారు. అయితే ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు సరుకును తీసుకెళుతున్న వాహనాన్ని వెంబడించడంతో దొంగలు వాహనాన్ని వదలి పారిపోయారు. ఎస్ఐ గోపీనాథ్ కథనం మేరకు.. హిందూస్థాన్ గోదాం షెటర్‌ను గడ్డపారతో పైకి లేపి దొంగలు లోనికి ప్రవేశించారు. అంతకు ముందే షెటర్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాను పనిచేయకుండా చేశారు. దొంగలు తమతో తెచ్చుకున్న బొలెరో వాహనంలో సబ్బులు, ఇతర సామగ్రిని నింపుకుంటుండగా యజమాని గౌరయ్యగుప్తా గమనించి అక్కడకు పరుగెత్తుకొస్తుండగా గమనించిన దొంగలు అతనిపై రాళ్లు రువ్వుతూ వాహనంతో అక్కడి నుంచి ఉడాయించారు. ఈ విషయాన్ని వెంటనే వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు తమ వాహనంలో బయలుదేరి దొంగల వాహనాన్ని వెంబడించారు. ఈ మధ్యలో జిన్నారం మండలం బంతపల్లి వద్ద ఉన్న పోలీసు చెక్‌పోస్టు ఇన్చార్జ్ ఏఎస్ఐ రాంచందర్‌రావుకు సమాచారం అందించారు. ఆయన కూడా సిబ్బందితో వాహనాన్ని వెంబడించడంతో దొంగలు జిన్నారం మండలం అన్నా రం సమీపంలో వాహనాన్ని వదిలి పారిపోయారు. చోరీ చేసిన వాహనంలోనే చోరీకి.. హిందూస్తాన్ లివర్ లిమిటెడ్‌లో చోరీకి దొంగలు వినియోగించిన వాహనం కూడా చోరీ చేసిందే కావడం గమనార్హం. ఈ వాహనం రంగారెడ్డి జిల్లా ధారూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డిది పోలీసులు గుర్తించారు. గత నెల 29 రాత్రి బొలెరోలో కూరగాయలు నింపుకొని రాంరెడ్డి డ్రైవర్ పాషా వికారాబాద్ న్యూగంజ్ మార్కెట్‌కు తీసుకువచ్చాడు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు పాషా వద్దకు వచ్చి తమది మెదక్ జిల్లా సదాశివపేట పట్టణమని, ఇల్లు ఖాళీ చేస్తున్నామని వాహనం అద్దెకు కావాలని అడిగారు. దీంతో డ్రైవర్ పాషా వారితో కలిసి బయలుదేరాడు. మార్గంమధ్యలో డ్రైవర్‌ను బెదిరించి వాహనాన్ని ఆ ఇద్దరూ చోరీ చేశారు. ఈ మేరకు వికారాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఇదే వాహనంతో గోదాంలో దొంగలు చోరీకి యత్నించారు. -
‘హిందూస్థాన్’ గోదాంలో చోరీ
నర్సాపూర్ : పట్టణంలోని హిందూస్థాన్ లివర్ లిమిటెడ్ సంస్థకు చెందిన గోదాంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. సుమారు రూ. 46 వేలు విలువైన సరుకును అపహరించారు. అయితే సమాచారాన్ని అందుకున్న పోలీసులు సరుకును తీసుకెళుతున్న వాహనాన్ని వెంబడించడంతో దొంగలు వాహనాన్ని వదలి పారిపోయారు. ఎస్ఐ గోపీనాథ్ కథనం మేరకు.. హిందూస్థాన్ గోదాం షెర్టర్ను దొంగలు గడ్డపారతో పైకి లేపి లోనికి ప్రవేశించారు. అంతకు ముందు షెట్టర్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాను దొంగలు పనిచేయకుండా చేశారు. దొంగలు తమతో తెచ్చుకున్న బొలెరో వాహనంలో సబ్బులు, ఇతర సామగ్రిని నింపుకుంటుండగా యజమాని గౌరయ్యగుప్తా గమనించాడు. దీంతో దగ్గరలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఉన్న వాచ్‌మన్‌తో కలిసి అక్కడి వస్తుండడగా గమనించిన దొంగలు వారిపై రాళ్లు రువ్వుతూ వాహనంతో అక్కడి నుంచి ఉడాయించారు. విషయాన్ని గౌరయ్య గుప్త పోలీసుల దృష్టికి తీసుకురావడంతో వారు దొంగల వాహనాన్ని వెంబడించారు. ఈ మధ్యలో జిన్నారం మండలం బంతపల్లి వద్ద ఉన్న పోలీసు చెక్‌పోస్టు ఇన్చార్జ్ ఏఎస్ఐ రాంచందర్‌రావుకు సమాచారం అందించారు. ఆయన కూడా సిబ్బందితో వాహనాన్ని వెంబడించడంతో దొంగలు జిన్నారం మండలం అన్నారం సమీపంలో వాహనాన్ని వదిలి పారిపోయారు. దీంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగలు వాడిన వాహనం సైతం చోరీ చేసుకువచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ వాహనం రంగారెడ్డి జిల్లా దారూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డికి చెందినదిగా గుర్తించామన్నారు. కాగా రామిరెడ్డి తన వాహనంలో గత నెల 29 రాత్రి కూరగాయలు నింపుకుని వికారాబాద్ న్యూగంజ్ మార్కెట్‌కు తీసుకువచ్చాడు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు డ్రైవర్ పాషా వద్దకు వచ్చి తమది మెదక్ జిల్లా సదాశివపేట పట్టణమని, ఇల్లు ఖాళీ చేస్తున్నామని, సామాన్లు వేసుకుపోయేందుకు వాహనం అద్దెకు కావాలని అడిగారు. దీంతో డ్రైవర్ పాషా వారితో కలిసి బయలుదేరాడు. మార్గమధ్యలో డ్రైవర్‌ను బెదిరించి వాహనాన్ని ఆ ఇద్దరూ చోరీ చేశారు. ఈ మేరకు వికారాబాద్‌లో కేసు నమోదైందని ఎస్ఐ తెలిపారు. -
నరసాపురానికి పోర్ట్ తీసుకువస్తాం: పరకాల
నరసాపురం పట్టణానికి పోర్ట్ తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పరకాల ప్రభాకర్ ఆయన భార్య ,కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నరసాపురం వచ్చారు. ఈ సందర్భంగా పరాకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని పేరుపాలెం బీచ్‌ను దేశంలో అతిపెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు. అలాగే తాము దత్తత తీసుకున్న తూర్పు తాళ్లు, పెదమైనివానిలంక గ్రామాలను రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చుదిద్దుతామని చెప్పారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నరసాపురం మండలంలోని పెదమైనివాని లంక గ్రామాన్ని, ఆమె భర్త పరకాల ప్రభాకర్ తూర్పు తాళ్ల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
చెరువుల ఎంపికకు కసరత్తు
నర్సాపూర్ : చెరువుల పునరుద్ధరణ లో భాగంగా మొదటి విడత ఎంపిక కోసం అధికారులు కసరత్తును ప్రారంభించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో సాగు నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, అటవీ శాఖలకు చెందిన చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు మొత్తం 1,612 ఉండగా వాటిలో 1,182 చెరువులు, కుంటలు సాగునీటి పారుదల శాఖకు చెందినవిగా రికార్డులు పేర్కొంటున్నాయి. సాగు నీటిపారుదల శాఖకు చెందిన చెరువులు, కుంటల్లో 20 శాతం చెరువులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించగా అందులో భాగంగా ఆరు మండలాలకు చెందిన సుమారు 259 చెరువులను మొదటి సంవత్సరం పునరుద్ధరించాలని నిర్ణయించి అందులో మొదటి విడత కోసం 60 చెరువులు ఎంపిక చేయనున్నారు. ఏ మండలంలో ఎన్ని చెరువులంటే.. నియోజకవర్గంలోని నర్సాపూర్ మండలంలో 39 చెరువులు, హత్నూరలో 57, కౌడిపల్లిలో 55, శివ్వంపేటలో 48, కొల్చారంలో 20, వెల్దుర్తి మండలంలో 40 చెరువులు, కుంటలను ఎంపిక చేస్తారు. కాగా వీటిలో మొదటి దశ కింద మండలానికి పది చెరువులు, కుంటలను కలిపి పునరుద్ధరణ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి నేతృత్వంలో సాగునీటి పారుదల శాఖ అధికారులు ఎంపిక చేయనున్నారు. సంపూర్ణంగా మరమ్మతులు పునరుద్ధరణ కింద ఎంపిక చేసిన చెరువులు, కుంటలను సంపూర్ణంగా మరమ్మతులు చేపడతారు. చెరువులు, కుంటల్లో పూడికను తీసి మట్టిని రైతులకు అందజేస్తారు. మట్టిని ప్రభుత్వ ఖర్చులతో వాహనాల్లో నింపితే రైతులు తమ ఖర్చులతో తమ తమ పొలాల్లోకి తరలించుకోవాల్సి ఉంటుంది. కాగా చెరువుల కట్టలను వెడల్పు, అలుగులు, తూములను మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైతే పునర్నిర్మాణం పనులు చేపడతారు. చెరువుల మరమ్మతులకు అంచనాల నివేదికల ఆధారంగా నిధులు కేటాయించనున్నారు. డిసెంబర్లో పునరుద్ధరణ పనులు చెరువుల పునరుద్ధరణ పనులను డిసెంబరు మొదటి వారంలో ప్రారంభించాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో అందుకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలను స్థానిక అధికారులు సిద్ధం చేయగానే ఉన్నతాధికారులు టెండర్లు పిలిచి పనులను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. -
నువ్వు సీఎం స్థాయి మనిషివి!
నర్సాపూర్ మండల సమావేశంలో విద్యుత్ ఏఈపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆగ్రహం నర్సాపూర్: నర్సాపూర్ విద్యుత్ శాఖ ఏఈ ఆదినారాయణరావుపై బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాసుగుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యుత్ శాఖపై చర్చ జరుగుతున్న సమయంలో ఏఈ ఆదినారాయణరావు మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఏఈని ఉద్దేశించి ‘ నీది ఎమ్మెల్యేల కన్నా చాలా పెద్ద స్థాయి, నీవు సీఎం స్థాయి మనిషివి, నీవు ఎవరికి అందుబాటులో ఉండవు, నీవు ఎక్కడుంటావో మాకే తెలియదు, నీకు ప్రజల సమస్యలు పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు సరఫరా చేయాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి విద్యుత్ శాఖ డీఈ కృష్ణయ్యను ఆదేశించారు. కరెంటు లేక పంటలు ఎండిపోతే మీదే బాధ్యత అంటూ హెచ్చరించారు. కాగా పలువురు సభ్యులు రాజేందర్, సురేష్, మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ తాము ఏఈని చూడడం ఇదే మొదటిసారన్నారు. మీసేవ కేంద్రాల్లో ఆధార్ కార్డుల కోసం వెళితే ఒక్కో కార్డు కోసం రూ.ఐదువందలు వసూలు చేస్తున్నారని, అధిక మొత్తంలో ఇస్తే వెంటనే ఇస్తున్నారని, లేనిపక్షంలో 15 నుంచి నెల రోజుల గడువు విధిస్తున్నారని సభ్యులు జితేందర్‌రెడ్డి ఆరోపించగా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకుంటానని తహశీల్దార్ పేర్కొన్నారు. నర్సాపూర్ సర్పంచ్ వెంకటరమణారావు మాట్లాడుతూ నర్సాపూర్‌లో డంప్ యార్డుకు స్థలం చూపాలని కోరగా త్వరలో స్థలం చూపుతామని తహశీల్దార్ చెప్పారు. కాగా బ్యాంకుల్లో రుణాలు ఇస్తలేరని సభ్యులు భరత్‌గౌడ్, జితేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా త్వరలో అందరికీ రుణాలు అందుతాయని తహశీల్దార్ పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నం దున అందరూ సహకరించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి మాట్లాడుతూ అందరూ సమైక్యంగా అభివృద్ధికి పాటుపడాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ లక్ష్మీబాయి, పలువురు అధికారులు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు చర్చ పట్టదా...? మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న పలువురు అధికారులు, గ్రామ స్థాయి ఉద్యోగులు సభలో చర్చ జరుగుతండగా మొబైల్ ఫోన్లలో ఆటలాడుతూ కూర్చోవడం గమనార్హం. మూడు నెలలకోసారి జరిగే సభలో ప్రజల సమస్యలపై ఆసక్తి చూపక పోవడం గమనార్హం. -
బాలికపై అత్యాచారయత్నం
నర్సాపూర్ : మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఓ దళిత బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు మంగళవారం రాత్రి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని ఏఎస్ఐ సుభాష్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన బాలిక మంగళవారం రాత్రి సుమారు తొమ్మిది గంటల సమయంలో బహిర్భూమికని ఇంటి బయటకు వెళ్లింది. అయితే ఈ విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన పీ కరుణాకర్ బాలిక వద్దకు వెళ్లి చేయి పట్టి లాగాడు. అయితే బాలిక కేకలు వేయడంతో కరుణాకర్ అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కరుణాకర్‌పై నిర్భయతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుభాష్‌రెడ్డి తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. -
అయ్యో.. అమ్మలకెంత కష్టం
నర్సాపూర్: అమ్మ..ఎవరికైనా అమ్మే...బిడ్డకు జన్మనిస్తుంది..దేశానికి సేవ చేసే పౌరులనిస్తుంది. మరి అంతటి అమ్మను ఎలా చూడాలి. మన పాలకులు మాత్రం అమ్మేకదా...అని...అష్టకష్టాలు పెడుతున్నారు. కు.ని. పేరుతో కడుపులు కోసేస్తూ కటిక నేలపైనే పడుకోబెడుతున్నారు. పచ్చి బాలింతలైన అమ్మలకు నరకం చూపుతున్నారు. దాదాపు ప్రతి కు.ని. శిబిరంలోనూ ఇదే పరిస్థితి తలెత్తినా అధికారులు మాత్రం మేల్కొనడం లేదు. అమ్మలకు అవస్థలు తప్పడం లేదు. తాజాగా బుధవారం కూడా నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రిలో అధికారులు కు.ని. శిబిరం నిర్వహించగా, దాదాపు 82 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకునేందుకు వచ్చారు. అయితే ఆస్పత్రి వద్ద కనీస సౌకర్యాలు కల్పించిన వైద్య అధికారులు, సిబ్బంది కు.ని శిబిరానికి వచ్చిన మహిళలకు, వారి బంధువులకు నరకం చూపారు. ఆస్పత్రిలో 30 పడకలే ఉండడంతో మిగిలిన వారినంతా కటిక నేలపై పడుకోబెట్టారు. కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. దీంతో వారి బంధువులే చీరలతో ఊపుతూ వారికి సాంత్వన కలిగించారు. ఇక చిన్నారులంతా ఉక్కపోతతో అల్లాడిపోవడంతో ఆస్పత్రి ఆవరణలోని చెట్లకు ఊయలలు వేసి వారిని బుజ్జగించారు. కు.ని. శిబిరానికి ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటు ఏర్పాటు చేసి కు.ని. శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళలతో పాటు వారికి సాయంతో వచ్చే బంధువుల కోసం కనీస వసతులు కల్పించాలని చెబుతున్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఆస్పత్రుల ఆవరణలో కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మహిళల వెంట వచ్చిన వారు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఇంటి దొంగలు తేలాకే కొత్త ఇళ్లు..
-
ఇంటి దొంగలు తేలాకే కొత్త ఇళ్లు..
* పేదలకు ఇళ్ల నిర్మాణంపై కేసీఆర్ స్పష్టత * కొత్త చట్టాలతో కొత్త పాలనకు శ్రీకారం చుట్టాం * రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ పాపమే * నర్సాపూర్ సభలో కేసీఆర్ సాక్షి, సంగారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారెవరో సీఐడీ విచారణలో తేలాల్సి ఉందని, వారిపై చర్యలు తీసుకున్న తర్వాతే కొత్త ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పథకాన్ని హడావుడిగా చేపట్టి ఆ నిధులను కూడా దొంగలపాలు చేయబోమన్నారు. త్వరలోనే గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని, సిద్దిపేట తరహాలో తాగునీటి విధానాన్ని రాష్ట్రమంతటికీ విస్తరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. దాదాపు రాష్ర్ర్ట కేబినెట్ మొత్తం వేదికపై ఉండగా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది. ‘ఇంతకుముందు ఇళ్ల పేరు మీద పైసలు మింగిన్రు. ఇయ్యాల మనం కట్టే ఇళ్లు ఎలక్షన్లప్పటి లెక్క ప్రకారం రూ. 3 లక్షలు అయితవనుకున్నం. ఇప్పుడు సిమెంటు ధర, సీకు ధర పెరిగింది. రూ. 3.30 లక్షలు అయితయని ఇంజనీర్లు చెప్తున్నరు. మనం పేదలకు కట్టే ఇళ్లు పక్కా పేదలకే చెందాలె. ఎవడన్నా దొంగ పదిండ్లను దక్కించుకుంటే మనకు రూ. 30 లక్షలు పోతయి. అదే వందిళ్లయితే రూ. 3.30 కోట్లు నష్టమైతది. ఈ దొంగలంతా కాసుకొని కూసున్నరు. పాత పద్ధతిలోనే వస్తయేమో... మింగుదామని చూస్తున్నరు. హడావుడిగా ఇళ్ల పథకం పెడితే మళ్ల పాత పద్ధతిలోనే మింగేయడానికి తయ్యారుగున్నరు. టీఆర్ఎస్ దొంగ దందా చేయదు, ఎవడెవడు దొంగతనం జేసిన్రో దొరకబట్టాలని సీఐడీని ఆదేశించాను. విచారణలో బయట పడితేనే.. కొత్తగా కట్టే వాటిని నిఖార్సుగా కడతరు. దొంగల భరతం పట్టాలె, వాళ్లపై చర్యలు తీసుకోవాలె. అప్పుడే ఇండ్ల పథకం మొదలు పెడతం. నేను హైదరాబాద్‌లో పైసలేస్తే నేరుగా పేదల ఇంటికే పోవాలే. ప్రజలు కేంద్ర బిందువుగా నిర్ణయాలు ఉంటాయి తప్ప.. ఆగమాగమైపోయి తీసుకోను’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోణంలో పాత చట్టాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరముందని, దసరా నుంచి రాష్ర్టంలో అసలు పని మొదలవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నూటికి నూరుపాళ్లు రుణ మాఫీ చేస్తాం రుణ మాఫీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇచ్చిన మాట మేరకు కచ్చితంగా దాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘నేను గూడా రైతు బిడ్డనే. నేనూ ఎవుసం చేస్తున్నా. రైతుల బాధేందో నాకు తెల్సు. భారమైనా సరే కచ్చితంగా రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయం జేసినం. ఆరు నూరైనా సరే బంగారంతో సహా అన్ని రకాల రుణాలను లక్ష రూపాయల వరకు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దాన్ని అమలుజేసి తీరుతాం. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం వద్దు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ప్రజలకు మనవిజేస్తున్నా. ఇంకో మాట.. నన్ను చంపినా అబద్ధం జెప్ప. రుణమాఫీలోనూ ఇబ్బందులున్నయి. మనం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నం. అవి మాఫీ కావాలి. మూడు నాలుగు కిస్తీల్లో ఆ రుణం చెల్లిస్తామని బ్యాంకులతో మాట ముచ్చట తీసుకొని రుణ మాఫీ చేస్తం. అయితే ఆ బ్యాంకులకు రిజర్వు బ్యాంకోడు అనుమతి ఇయ్యాలె. వాడేమో ఇస్తలేడు. ఇయ్యనప్పుడు కూడా మనకు వేరే మార్గాలున్నాయి. ఒకటికి రెండుసార్లు మన అధికారులను రిజర్వ్‌బ్యాంకు దగ్గరికి పంపినం. వాళ్లు మూడు జిల్లాలకు పర్మిషన్లు ఇచ్చిన్రు. మిగతా జిల్లాలకు ఇంకా ఇయ్యలే. అనుమతి వచ్చిన జిల్లాల్లో వెంటనే మాఫీ చేసుకుంట ముందుకుపోతాం. కొద్ది రోజుల్లోనే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తాం. కాంగ్రెసోళ్ల పిచ్చి మాటలేవి పట్టుకోవద్దు. చేస్తే దీన్ని టీఆర్ఎస్ పార్టీ చేయ్యాలే తప్ప, పొన్నాల లస్మయ్య కాళ్లు మీదికి, తలకాయ కిందికి పెట్టినా అది సాధ్యం కాదు. 146 మంది రైతులు ఆత్మహత్య చేసున్నరని పొన్నాల అంటుండు. ఇది ఎవరి పాపం? 46 ఏళ్లు పాలించిన కాంగ్రెసోళ్ల పాపం కాదా? మీ పాపం ఈ వంద రోజుల్లోనే పోద్దా.. మీరుజేసిన ఆగం సిన్నదా?’’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడూ బీజేపీకి ఓటేయడని వ్యాఖ్యానించారు. -
సునీతా లక్ష్మారెడ్డికి భయపడే కేసీఆర్ సభ
మెదక్ : కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి భయపడే నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ పెట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేసీఆర్ హిట్లర్ తాతల వ్యవహరిస్తున్నారని ఆయన బుధవారమిక్కడ మండిపడ్డారు. కేసీఆర్ తన వందరోజుల పాలనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు.. రుణమాఫీ, విద్యుత్ సమస్యపై స్పష్టత లేదని పొన్నాల అన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన తెలిపారు. -
నేడు నర్సాపూర్‌కు కేసీఆర్
నర్సాపూర్: మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నర్సాపూర్‌కు రానున్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ భారీ మెజార్టీ కోసం ఏకంగా సీఎంతో ప్రచారం చేయిస్తోంది. ఈ క్రమంలోనే నర్సాపూర్-హన్మంతాపూర్ గ్రామాల మధ్య ఉన్న వెంచర్ స్థలంలో బహిరంగసభకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్న ఈ సభలో కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ముఖ్యనేతలంతా పాల్గొననున్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా తరలివస్తుండడంతో అధికార యంత్రాగం కూడా బహిరంగసభపై ప్రత్యేక దృ్ట సారించి ఏర్పాట్లను పరిశీలిస్తోంది. ఏర్పాట్ల పరిశీలన సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను జిల్లా మంత్రి హరీష్‌రావు మంగళవారం పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, పార్టీ ఇన్చార్జి రాజయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే చిలుములమదన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, పార్టీ రాష్ర్ట నాయకుడు మురళీధర్ యాదవ్ ఇతర నాయకులతో కలిసి సభ జరగనున్న ప్రాంతానికి వచ్చిన హరీష్‌రావు వేదిక, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ కూడా మంగళవారమే నర్సాపూర్ చేరుకుని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీసులు వేదిక వద్ద డాగ్ స్క్వాడ్ తనిఖీలు సైతం చేపట్టారు. భద్రత చర్యల్లో భాగంగా సీఎం కాన్వాయ్ రిహార్సల్స్ చేసి పరిశీలించారు. జనసమీకరణపై గులాబీదళం దృష్టి తొలిసారి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జిల్లాలో పార్టీ బహిరంగ సభలో పాల్గొంటున్నందున సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యే విధంగా పార్టీ వర్గాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. సుమారు రెండు లక్షల మందిని సీఎం సభకు తరలించాలని ఆ పార్టీ నేతలంతా భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే జనసమీకరణ బాధ్యతలను పార్టీ ముఖ్యనేతలకు అప్పగించారు. పార్కింగ్ ఎక్కడంటే.. సీఎం సభకు వచ్చే వాహనాల కోసం అధికారులు పార్కింగ్‌ను సిద్ధం చేశారు. మెదక్, కౌడిపల్లి వైపు నుంచి వాహనాలను నర్సాపూర్ శివారులోని మూతపడిన షుగర్ ప్యాక్టరీ సమీపంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. వె ల్దుర్తి వైపు నుంచి వచ్చే వాహనాలను మార్కెట్ కమిటీ సమీపంలో, సంగారెడ్డి, హత్నూర వైపు నుంచి వాహనాలను పట్టణంలోని పశువుల సంత వద్ద కొన్నింటిని పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇక తూప్రాన్ వైపు నుంచి వ చ్చే వాహనాలను అదే మార్గంలో మూత పడిన షుగర్ ప్యాక్టరీ సమీపంలో పార్కు చేయాలని పోలీసులు తెలిపారు. వీఐపీల వాహనాలను సభా వేదిక వెనుక భాగాన ఉన్న ఖాళీ స్థలంలో పార్కు చేసే అవకాశం కల్పించారు. అంతేగాక సమావేశానికి చేరువలో ఉన్న కంజర్ల ఫంక్షన్ హాలు వెనుక భాగాన, లయన్స్‌క్లబ్ వెనుక భాగాన ఉన్న ఖాళీ స్థలాల్లో సైతం రెండు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. -
సేంద్రియ ఎరువులతో అధిక లాభాలు
నర్సాపూర్ రూరల్: రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించేందుకు ఇందిర క్రాంతి పథం సభ్యులు కృషి చేస్తున్నారు. రసాయనిక ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు, వేపపిండి, కషాయాన్ని రైతులకు అందుబాటులో ఉంచారు. మండలంలోని రుస్తుం పేట ఇందిర క్రాంతి పథం సభ్యులు రెండేళ్ల క్రితం నాన్ఫెస్టిసైడ్ మేనేజ్మెంట్ (ఎన్‌పీఎం)ను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఐకేపీ సభ్యులు పూర్తిగా రసాయన ఎరువులు వాడకుండా క్రిమి సంహారక ఎరువుల కోసం వేప కషాయం లాంటి మందులను వాడుతూ పంటలను సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో రెండేళ్ల ను ంచి రసాయన ఎరువుల వాడకం బాగా తగ్గిపోయింది. సేంద్రియ ఎరువులు, క్రిమి కీటకాల నాశనానికి వేపపిండి, వేప కషాయం వాడిన రైతులందరూ మంచి దిగుబడి సాధించడంతో మిగతాగ్రామాల రైతులు కూడా సేం ద్రియ ఎరువులు వాడేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో రుస్తుంపేట ఎన్‌పీఎం గ్రామ కోర్డినేటర్ పి. శేఖర్ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం రుస్తుంపేట ఐకేపీ కేంద్రంలో రైతులకు కావాల్సిన సేంద్రియ ఎరువులు, వేపపిండి, వేప కషాయం అందుబాటులో ఉంచారు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు మంచి దిగుబడులు సాధించుకునేందుకు అవకాశం ఉందని ఐకేపీ సిబ్బంది చెబుతున్నారు. వేపపిండి కిలో రూ.12, వేప కషాయం లీటరు రూ. 200కు విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు. వరి నాటు సమయంలో, ఇతర పంటలు సాగు చేసుకునే ముందు రైతులు వేపపిండిని విస్తీర్ణాన్ని బట్టి చల్లుకోవాల్సి ఉంటుందని ఐకేపీ సిబ్బంది చెప్పారు. పంట ఎదిగే సమయంలో క్రిమి కీటకాలు సోకకుండా వేప కషాయాన్ని పిచికారి చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. -
ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే
సంగారెడ్డి క్రైం : తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు జేఏసీ పిలుపు మేరకు జిల్లా కోర్టుతో సహా సిద్దిపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా కోర్టులో బార్ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ హైకోర్టుకు సమైక్య సంకెళ్లు ఇంకెన్నాళ్లు అంటూ నినదించారు. తెలంగాణ ప్రత్యేక హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యర్శి వీరన్న పాటిల్, ఆర్ మాణిక్‌రెడ్డి, ఎం జైపాల్‌రెడ్డి, ఆర్ శ్రీనివాస్, బాల్‌రెడ్డి, రవీందర్, సంజీవరెడ్డ, వెంకట్రాములు, శివకుమార్, భగవాన్‌రావు, అంబరీష్, వర్మ, నాగరాజు, ప్రసాద్, బాలరాజు, అరుణ్ నాగిశెట్టి, అమర్నాథ్రావు, కసిరెడ్డి శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నారాయణ, సదానందం, చంద్రయ్యస్వామి, ప్రసాద్, ప్రభుదాన్యం, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జోన్ : స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో అసోసియేషన్ సభ్యులు కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జుడీషియల్కు సంబంధించిన పోస్టుల ను తెలంగాణ ప్రాంత వ్యక్తులచే భర్తీ చే యాలన్నారు. సమస్యలు విస్మరిస్తే భవిష్యత్తులో నిరవధికంగా విధులకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు రమేష్‌బాబు, పవన్‌కుమార్, సంజయ్‌కృష్ణ, నరసింహారెడ్డి, సాయిబాబ, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. నర్సాపూర్ : తెలంగాణ న్యాయవాదులు జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో విధులు బహిష్కరించినట్లు చెప్పారు. -
పాల శీతల కేంద్రానికి తాళం!
నర్సాపూర్,న్యూస్‌లైన్: పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్యకు చెందిన పాల శీతలీకరణ కేంద్రం నిర్వహణ సరిగా లేనందున రెండేళ్ల క్రితం మూత పడింది. సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని కొంత కాలం పాటు మండల మహిళా సమాఖ్యకు అప్పగించగా వారు కూడా విఫలం కావడంతో సమాఖ్య ఆధ్వర్యంలో కొంతకాలం నిర్వహించి అనంతరం నష్టాలు వచ్చాయంటూ రెండేళ్ల క్రితం మూసివేశారు. కాగా మార్కెట్లో పాల కొనుగోలు కేంద్రాల నిర్వహకుల వ్యాపారం జోరుగా కొనసాగుతుండగా ప్రభుత్వానికి చెందిన పాల శీతల కేంద్రానికి నష్టాలు వచ్చాయంటూ మూత వేయడం గమనార్హం. కేంద్రం బాధ్యతలు తీసుకున్న వ్యక్తులు సక్రమంగా నిర్వహంచక పోవడంతో నష్టాలు వచ్చినట్లు తెలిసింది. ధర లభించక నష్ట పోతున్న రైతులు నర్సాపూర్‌లో ప్రభుత్వ పాల సేకరణ కేంద్రం లేనందున పాడి రైతులు ప్రైవేటు పాల కేంద్రాలపై ఆధార పడాల్సి వస్తోంది. దీంతో రైతులకు ఆశించిన ధర లభించక పోవడంతో నష్టాల పాలవుతున్నారు. ప్రైవేటు పాల కొనుగోలు దారులు తమ ఇష్టమొచ్చినట్లు నిబంధనలు పెడుతూ ఇష్టానుసారంగా ధర నిర్ణయించడంతో తాము నష్ట పోతున్నామని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన పాలు తీసుకుపోయినా లీటరుకు రూ.30 నుంచి రూ.35కు మించి ఇవ్వడం లేదని తెలిసింది. పాడి గేదెల నిర్వహణకు ఖర్చులు బాగా పెరుగుతున్నాయని, పాలు అమ్మితే ఆశించిన ధర లభించక పోవడంతో గేదెలు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభుత్వం పాడి పరిశ్రమను అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా రైతులకు, మహిళలకు పాడి గేదెలను సబ్సిడీతో కూడిన రుణాలను కార్పొరేషన్ల ద్వారా అందజేస్తూ గేదెలు ఇప్పిస్తోంది. ప్రభుత్వం పాడి అభివృద్ధికి చర్యలు తీసుకుంటుండగా పాడి సమాఖ్య అధికారులు పాలు కొనుగోలు చేసేందుకు, పాల శీతలీకరణ కేంద్రాల నిర్వహణపై దృష్టి పెట్టకపోవడంతో గేదెలు కొనుగోలు చేసిన రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. తనిఖీ చేయరా? నర్సాపూర్‌లోని పలు ప్రైవేటు పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు పాల కొనుగోలుదారులు రైతల నుంచి పాలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడే లీటరు పాలను రూ.40 కి విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. అంతేగాక రైతుల నుంచి తీసుకున్న పాలల్లో నీళ్లు కలిపి అమ్ముతున్నారని, అవి పలుచగా ఉండకుండా రసాయనాలు కలిపి చిక్కగా మారేలా చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఆహార పదార్థాలను తనిఖీ చేసే ప్రభుత్వ విభాగం అధికారులు పాల కొనుగోలు కే ంద్రాల వైపు కన్నెత్తి చూడక పోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రూ. పది లక్షలు వెచ్చించినా ప్రయోజనం శూన్యం ప్రభుత్వం ఇక్కడ రూ. పదిలక్షల వ్యయంతో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేసినా నిర్వహణ సరిగాలేకపోవడంతో అది మూత పడింది. దీంతో నిధులు వృధా కావడంతో పాటు ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోవడంతో రైతులు నష్ట పోతున్నారు. అధికారులు ఇప్పటికైనా ఈ కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలని రైతులు కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా పాల శీతలీకరణ కేంద్రం మూత పడడంతో మందుబాబులకు అది అడ్డగా మారింది. -
రైతులకు హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు
నర్సాపూర్, న్యూస్‌లైన్: హై సెక్యూరిటీ పట్టాదార్ పాస్ పుస్తకాలు త్వరలో రైతులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రయోగాత్మకంగా పలు పాస్ పుస్తకాలు స్థానిక తహ శీల్దార్ కార్యాలయానికి వచ్చాయి. భూముల రిజిస్ట్రేషన్లు పూర్తవగానే నేరుగా తహశీల్దార్ కార్యాలయాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వచ్చే విధంగా వెబ్‌ల్యాండ్ పద్ధతి అమలులోకి వచ్చింది. రిజిస్ట్రార్ డాక్యుమెంట్లు తహ శీల్దార్ కార్యాలయానికి రాగానే వీఆర్ ఓలు సంబంధిత గ్రామ రెవెన్యూ రికార్డులలో వాటిని నమోదు చేస్తారు. కాగా గతంలో పాత పాస్ పుస్తకాల్లో తాజాగా కొనుగోలు చేసిన భూముల వివరాలు రాసేవారు. హై సెక్యూరిటీ పట్టాదార్ పాస్ పుస్తకాల వచ్చిన నేపథ్యంలో రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రాగానే రెవెన్యూ సిబ్బంది తమ రికార్డులలో నమోదు చేస్తే సరిపోతుంది. సబ్ రిజిస్ట్రార్,తహశీల్దార్ కార్యాలయాలను వెబ్‌ల్యాండ్‌లో భాగంగా అనుసంధానం చేసినందున భూముల విక్రయాల సమాచారం ఆయా కార్యాలయాల నుంచి నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు పూర్తి సమాచారం చేరుతుంది. అక్కడ పాస్ పుస్తకాలు ముద్రించి సంబంధిత మండల తహశీల్దార్ కార్యాలయాలకు పాస్ పుస్తకాలు పంపితే స్థానిక రెవెన్యూ అధికారులు వాటిని సంబంధిత లబ్ధిదారులకు అందచేస్తారు. తాజాగా భూముల కొనుగోలు చేసిన వ్యక్తుల పేర గతంలో పాస్ పుస్తకం జారీ చేసి ఉంటే అదే నంబరుతో కొత్తగా మరో పాస్ పుస్తకంలో పాత భూములతో పాటు తాజాగా కొనుగోలు చేసిన భూముల వివరాలు కలిపి కొత్తగా పాస్ పుస్తకం జారీ అవుతుంది. అంతకు ముందు భూములు లేని పక్షంలో కొత్తగా పాస్ పుస్తకం జారీ అవుతుంది. ఇదిలా ఉండగా పట్టాదార్ పాస్‌పుస్తకంలో రైతుల ఫొటో, స్కాన్ చేసిన వారి సంతకంతో పాటు కులం, గ్రామం, భూములు వివరాలు, వారు చెల్లించాల్సిన శిస్తు వివరాలు, పూర్తి అడ్రసు పొందు పరుస్తున్నారు. అంతేగాక సంబంధిత మండల తహశీల్దార్ సంతకం స్కాన్ చేసి వస్తుంది. కాగా ప్రభుత్వం తాజాగా రూపొందించిన హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు శుక్రవారం నర్సాపూర్ మండలంలోని మంతూర్‌కు చెందిన రైతులకు చెందిన ఆరు పాస్ పుస్తకాలు వచ్చాయి. వాటిని త్వరలో అందచేస్తామని అధికారులు చెప్పారు. నకిలీని అరికట్టేందుకు కొత్త పుస్తకాలు: తహశీల్దార్ పట్టాదార్ పాస్ పుస్తకాలలో నకిలీవి అరికట్టేందుకు హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు ఎంతో దోహదపడతాయని స్థానిక తహశీల్దార్ నరేందర్ చెప్పారు. వాటితో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. అందులో రైతుల అన్ని భూముల వివరాలు, శిస్తు, ఇతర వివరాలు ఉంటాయని, చేతి రాత అసలే ఉండదని చెప్పారు. కాగా మొదటగా నర్సాపూర్‌కు ఆరు హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు వచ్చాయని వాటిన త్వరలో లబ్ధిదారులకు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. దశలవారీగా అందరికీ హై సెక్యూరిటీ పాస్ పుస్తకాలు త్వరలో వస్తాయని ఆయన తెలిపారు. -
మెదక్, నర్సాపూర్‌లో నేడు కేసీఆర్ పర్యటన
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం మెదక్, నర్సాపూర్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 5.20 గంటలకు మెదక్.. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు నర్సాపూర్‌లో జరిగే బహిరంగ సభలో చంద్రశేఖర్‌రావు ప్రసంగించనున్నారు. 26వ తేదీన జహీరాబాద్, జోగిపేట, సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. 27వ తేదీన పటాన్చెరు, సంగారెడ్డి పట్టణాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జనసమీకరణపై ఎమ్మెల్యే అభ్యర్థులు దృష్టి సారించారు. -
జిల్లాలో మావోయిస్టుల కదలికల్లేవు
నర్సాపూర్, న్యూస్‌లైన్ : జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని అడిషనల్ ఎస్పీ ఆర్ మధుమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన నర్సాపూర్‌కు వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టుల కదలికలు లేక పోయినా, కూంబింగ్‌లు చేపడుతున్నామన్నారు. గతంలో వారి ప్రభావం ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా తమ ఓటును వినియోగించుకునే విధంగా జిల్లాలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు తమ శాఖ కృషి చేస్తోందన్నారు. అందరూ ఓటు వేసి వంద శాతం పోలింగ్ జరిగేలా సహకరించాలని ఆయన కోరారు. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోను కావొద్దని, ఎవరైనా ప్రలోభ పెడితే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తూ మద్యం, డబ్బు అక్రమ రవాణాను అడ్డుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట సీఐ సైదిరెడ్డి తదితరులు ఉన్నారు. -
విద్యుత్ కోసం రైతుల రాస్తారోకో
నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్ : వ్యవసాయానికి ఏడు గంటల పాటు నిరంతరాయంగా సరఫరాతో పాటు లో ఓల్టేజీ సమస్యను తీర్చాలని సోమవారం మండలంలోని కాజీపేట, మంతూరు, రెడ్డిపల్లి గ్రామాల రైతులు నర్సాపూర్ - మెదక్ రహదారిలోని రెడ్డిపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. అంతకుముందు సబ్‌స్టేషన్‌లో ఉన్న లైన్ ఇన్స్పెక్టర్ అంజ య్యతో పాటు లైన్మన్లు రాంలు, టీ వేణు, సబ్‌స్టేషన్ ఆపరేటర్ దశరథ్ను ఓ గదిలో నిర్బంధించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో రాత్రీపగలు కలిపి దశలవారీగా సుమారు ఐదు గంటలు సరఫరా చేసేవారని, అయితే వారం రోజులుగా కేవలం రెండు మూడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోందని వాపోయారు. సరఫరా అవుతున్న విద్యుత్‌లో ఎక్కువ భాగం లో ఓల్టేజీతో సరఫరా అవుతోందని తెలిపారు. దీంతో వారం రోజులుగా మంతూరు, కాజీపేట, గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందన్నారు. వ్యవసాయ పంటలు దాదాపు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారించాలని విద్యుత్ శాఖ ఏడీతో పాటు ఏఈలకు పలుమార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై లైన్ ఇన్స్పెక్టర్తో పాటు లైన్మన్లను వివరణ కోరగా రెడ్డిపల్లి ఫీడర్ కెపాసిటీ కన్నా ఎక్కువ వినియోగం ఉండడంతో లో ఓల్టేజీతో పాటు తరచూ సబ్‌స్టేషన్‌లో ట్రిప్ కావడం జరుగుతోందన్నారు. రైతులు సమస్యల ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనన్నారు. అయితే తమ చేతిలో ఏమీ లేదన్నారు. ఇదిలా ఉండగా.. విషయం తెలుసుకున్న ఎస్ఐ కోటేశ్వరరావు అక్కడికి చేరుకుని ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతులు లేకుండా రాస్తారోకోలు చేయకూడదని రైతులకు సూచిం చారు. సమస్యలుంటే అధికారుల వద్దకు వెళ్లి చెప్పుకోవాలన్నారు. రైతులు తమ పరిస్థితులను వివరిస్తుండగా.. ఓ కానిస్టేబుల్ మొబైల్లో రాస్తారోకో ఫొటోలను తీశారు. అప్పటి వరకు ట్రాన్స్‌కో అధికారుల తీరును ఎండగట్టిన రైతులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా.. అనుమతులు లేకుండా రాస్తారోకో చేసినందుకు, అధికారులను నిర్బంధించిన విషయంలో ఆరుగురు రైతులు, మరో కొంతమందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
పొత్తుల కోసం ఎదురుచూపులు
నర్సాపూర్, న్యూస్‌లైన్: స్థానిక జెడ్పీటీసీ స్థానం ఈసారి బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఆ యా పార్టీల్లో పోటీ చేసేవారి సంఖ్య భా రీగా పెరిగింది. అన్ని పార్టీల్లోనూ ఈ సమస్య నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు సైతం ఇంకా ఖరారు కా లేదు. పొత్తులో భాగంగా ఈ స్థానం ఎవరికి దక్కుతుందో తెలియక ఆయా పారీ ్టల నాయకులు అయోమయానికి గురవుతున్నారు. అదే సమయంలో ఎవరికి వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్, సీపీఐ ముఖ్య నాయకులు ఇటీవల సమావేశమైనప్పటికీ ఏ పార్టీకి ఎన్ని స్థానాలు?, ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే విషయమై స్పష్టత రాలేదు. పొత్తులు కుదిరినా స్థానిక జెడ్పీటీసీ స్థా నం నుంచి టీఆర్ఎస్కు దక్కుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో టికెట్ తమకే కేటాయించాలంటూ నాయకులపై ఒత్తిడి కూడా పెంచుతున్నట్టు సమాచారం. టీఆర్ఎస్ నుంచి నర్సాపూర్ మాజీ సర్పంచ్ మురళీధర్ యాదవ్, మరో నాయకుడు మన్నె వీరేశం టికెట్ ఆశిస్తున్నారు. జడ్పీ చైర్పర్సన్ స్థానం బీసీ మహిళకు కేటాయిం చినందున మురళీధర్ యాదవ్ నర్సాపూర్ స్థానం నుంచి తన భార్య నర్సాపూర్ మాజీ సర్పంచ్ రాజమణిని పోటీ లో నిలపాలని, తద్వారా జడ్పీ పీఠాన్ని కూడా దక్కించుకోవాలని చూస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్, ఆత్మ మాజీ చైర్మన్ ఆంజనేయులుగౌడ్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, రుస్తుంపేటకు చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు మల్లేశ్ జడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. సీపీఐ నుంచి జగదీశ్వర్, శివకుమార్‌లు టికెట్లు ఆశిస్తున్నట్టు సమాచారం. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలున్నాయి. ఇంకా అంగీకారానికి రాకపోవడంతో ఎవరికి వారు టికెట్లు ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి అశోక్‌గౌడ్, బీజేపీ నుంచి రమేశ్‌గౌడ్‌లు పోటీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. వైఎస్సార్ సీపీ ఒంటరిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ పార్టీ నుంచి కూడా పలువురు అభ్యర్థులు టికె ట్ కోసం అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నా రు. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు గడిచినా ఇంకా ఏ పార్టీలోనూ అభ్యర్థులు ఖరారు కాలేదు. ప్రస్తుతానికి పొత్తు అంశం కొలిక్కి రానందున ఆయా పార్టీల నుంచి ఆశావహులతో నామినేషన్లు వేయించి ఆ తరువాత ఉపసంహరించేలా చూడాలని ప్రధాన పార్టీల నాయకులు భావిస్తున్నారు. -
మృత్యువు మింగేసింది
ఆ ముగ్గురు యువకులూ కష్టాన్నే నమ్ముకున్నారు. తాపీ పనులు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. విధి వారితో ఆటలాడింది. ముగ్గుర్నీ మృత్యువు పొట్టనపెట్టుకుంది. భీమడోలు మండలం అంబర్‌పేట వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో నరసాపురం మండలం వేములదీవి, తూర్పుతాళ్లు గ్రామాలకు చెందిన యువకులు మృతి చెందటంతో ఆ కుటుంబాలు శోకసము ద్రంలో మునిగిపోయూయి. నరసాపురం రూరల్/భీమడోలు, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం సముద్ర తీరప్రాంత గ్రామాల్లో విషాదం నింపింది. వేములదీవి, తూర్పుతాళ్లు గ్రామాలకు చెందిన పరసా ఆదినారాయణ(25), తోట దుర్గాప్రసాద్(22), వలవల సురేష్(21)లు మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా కొవ్వూరు- గుండుగొలను రహదారిపై భీమడోలు మండలం అంబర్ పేట సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతిచెందారు. వీరు మంచినీటి ట్యాంక్ నిర్మాణ పనులు, సెంట్రింగ్ పనులు చేస్తుంటారు. పనుల్లో భాగంగా వారం రోజుల క్రితమే దూబచర్లకు వచ్చి ఉంటున్నారు. బుధవారం రాత్రి పల్సర్ బైక్‌పై భీమడోలు వచ్చిన వీరు తిరిగి దూబచర్ల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తాపీపని చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్న యువకుల మృతితో ఆయూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాధిత కుటుంబాలను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో గ్రామాలు హోరెత్తారుు. ముగ్గురిలో ఎవరికీ వివాహాలు కాలేదు. సర్దుగొడపకు చెందిన ఆదినారాయణ తండ్రి అనారోగ్యంతో చాలాకాలం క్రితం మృతి చెందగా ఆరుగురు సంతానాన్ని తల్లి సత్యవతి పెంచింది. అందరిలో చిన్నవాడు కావడంతో పెళ్లికి సన్నాహాలు చేస్తున్నారని ఆ ప్రాంతవాసులు తెలిపారు. తూర్పుతాళ్లుకు చెందిన తోట దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. కుమారుడి మృతితో వీరుపడే వేదనను బంధుమిత్రులు చూసి కంట తడిపెడుతున్నారు. మరణ వార్తను ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ పలుకరిస్తూ ఉండేవాడని కరింశెట్టివారిపాలెం గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. తూర్పుతాళ్లుకు చెందిన వలవల సురేష్ ఇంటికి పెద్ద కుమారుడు కావడంతో తమ కుటుంబానికి దిక్కు ఎవరని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. సురేష్ దుబాయ్ వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తున్నాడు. గురువారం రాత్రికి ఏలూరులో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు గ్రామానికి చేరుకుంటాయని బంధువులు తెలిపారు. -
బతుకు గూడులో తుపాను విధ్వంసం
నరసాపురం టౌన్, న్యూస్‌లైన్ : రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. పూరిగుడిసెలో జీవనం సాగిస్తున్న ఆ పేద కుటుంబాన్ని తుపాను నిలువ నీడ లేకుండా చేసింది. తలదాచుకోవడానికి గూడులేక అష్టకష్టాలు పడుతున్నారు. పాక్షికంగా ఇంటికి నష్టం వాటిల్లిందటూ అందికారులు అరకొరగా సాయం అందించి చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితులు గత్యంతరం లేక బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. పూర్తి సాయం చేసి పుణ్యం కట్టుకోండి బాబూ అంటూ 28వ వార్డు గోగులమ్మ చెరువునకు చెందిన జడ్డు పద్మావతి అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. హెలెన్ తుపాను ఆమె పూరిల్లు పూర్తిగా కూలిపోయింది. నిలువ నీడ కరువవడంతో బంధువులు ఆసరా ఇవ్వడంతో కుటుంబ సభ్యులంతా వారి ఇంటి వసారాలో తలదాచుకుంటున్నారు. పద్మావతి భర్త వీరవెంకట సత్యనారాయణ అనారోగ్యంతో కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు. కొడుకు కూలి పని చేసి తీసుకువచ్చే డబ్బుతో ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది. ఇల్లు నేలకూలడంతో ప్రభుత్వం సహాయం కింద ఇచ్చే రూ.5 వేలతో మళ్లీ పూరిగుడిసె వేసుకోవాలని ఆమె భావించింది. కొంత మేర అప్పు చేసి మళ్లీ రాటలు నిలబెట్టుకుంది. ఈ లోగా అధికారులు వచ్చి ఇల్లు పాక్షికంగా దెబ్బతిందంటూ పరిహారంగా రూ.1900 నగదు, 10 కిలోల బియ్యం అందించి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వం అందించిన సహాయం కనీసం తాటాకు కొనేందుకు కూడా సరిపోదని గోడలు, తలుపులు, తదితర ఇంటి సామగ్రి అమర్చుకునే ఆర్థిక స్థోమత తమకు లేదని ఆమె వాపోతోంది. పూర్తి సహాయం కింద రూ. 5 వేలు ఇప్పించాలని పలుమార్లు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగింది. అధికారులు కనికరించకపోవడంతో మానవత్వం ఉన్న వారి సహాయం కోసం ఆమె బేలగా ఎదురు చూస్తోంది. -
శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు
నర్సాపూర్,న్యూస్‌లైన్: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు అమోదం పొందే అవకాశాలు ఉన్నాయని పీసీసీ ప్రధాన కార్యదర్శి చౌటి శ్రీనివాస్‌రావు ఆశా భావం వ్యక్తం చేశారు. బుదవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్ ధృడ నిశ్చయంతో ఉన్నారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటు విషయంలో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. రాబోయే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయన్నారు. నేడు అన్నదానం తన తండ్రి దివంగత మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి చౌటి జగన్నాథరావు రెండో వర్థంతిని పురస్కరించకుని గురువారం నర్సాపూర్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చౌటి శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు తన తండ్రి విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం విగ్రహం సమీపంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, కార్యకర్తలు, అభిమానులు సకాలంలో హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.