నేడు నర్సాపూర్‌కు కేసీఆర్
నర్సాపూర్: మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నర్సాపూర్‌కు రానున్నారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్ భారీ మెజార్టీ కోసం ఏకంగా సీఎంతో ప్రచారం చేయిస్తోంది. ఈ క్రమంలోనే నర్సాపూర్-హన్మంతాపూర్ గ్రామాల మధ్య ఉన్న వెంచర్ స్థలంలో బహిరంగసభకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానున్న ఈ సభలో కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ ముఖ్యనేతలంతా పాల్గొననున్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా తరలివస్తుండడంతో అధికార యంత్రాగం కూడా బహిరంగసభపై ప్రత్యేక దృ్ట సారించి ఏర్పాట్లను పరిశీలిస్తోంది.
ఏర్పాట్ల పరిశీలన
సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను జిల్లా మంత్రి హరీష్‌రావు మంగళవారం పరిశీలించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, పార్టీ ఇన్‌చార్జి రాజయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే చిలుములమదన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, పార్టీ రాష్ర్ట నాయకుడు మురళీధర్ యాదవ్ ఇతర నాయకులతో కలిసి సభ జరగనున్న ప్రాంతానికి వచ్చిన హరీష్‌రావు వేదిక, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
మరోవైపు జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ కూడా మంగళవారమే నర్సాపూర్ చేరుకుని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలీసులు వేదిక వద్ద డాగ్ స్క్వాడ్ తనిఖీలు సైతం చేపట్టారు. భద్రత చర్యల్లో భాగంగా సీఎం కాన్వాయ్ రిహార్సల్స్ చేసి పరిశీలించారు.
జనసమీకరణపై గులాబీదళం దృష్టి
తొలిసారి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జిల్లాలో పార్టీ బహిరంగ సభలో పాల్గొంటున్నందున సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యే విధంగా పార్టీ వర్గాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. సుమారు రెండు లక్షల మందిని సీఎం సభకు తరలించాలని ఆ పార్టీ నేతలంతా భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే జనసమీకరణ బాధ్యతలను పార్టీ ముఖ్యనేతలకు అప్పగించారు.
పార్కింగ్ ఎక్కడంటే..
సీఎం సభకు వచ్చే వాహనాల కోసం అధికారులు పార్కింగ్‌ను సిద్ధం చేశారు. మెదక్, కౌడిపల్లి వైపు నుంచి వాహనాలను నర్సాపూర్ శివారులోని మూతపడిన షుగర్ ప్యాక్టరీ సమీపంలో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. వె ల్దుర్తి వైపు నుంచి వచ్చే వాహనాలను మార్కెట్ కమిటీ సమీపంలో, సంగారెడ్డి, హత్నూర వైపు నుంచి వాహనాలను పట్టణంలోని పశువుల సంత వద్ద కొన్నింటిని పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు.
ఇక తూప్రాన్ వైపు నుంచి వ చ్చే వాహనాలను అదే మార్గంలో మూత పడిన షుగర్ ప్యాక్టరీ సమీపంలో పార్కు చేయాలని పోలీసులు తెలిపారు. వీఐపీల వాహనాలను సభా వేదిక వెనుక భాగాన ఉన్న ఖాళీ స్థలంలో పార్కు చేసే అవకాశం కల్పించారు. అంతేగాక సమావేశానికి చేరువలో ఉన్న కంజర్ల ఫంక్షన్ హాలు వెనుక భాగాన, లయన్స్‌క్లబ్ వెనుక భాగాన ఉన్న ఖాళీ స్థలాల్లో సైతం రెండు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.