కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారు | kcr is behaving like dictator, says sunitha lakshma reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారు

Published Thu, Sep 11 2014 11:03 AM | Last Updated on Tue, Oct 16 2018 3:09 PM

kcr is behaving like dictator, says sunitha lakshma reddy

మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీమంత్రి, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి విరుచుకు పడ్డారు. కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆమె గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. మహిళలు, ఉద్యోగులు, ఎమ్మెల్యేలు....చివరికి మంత్రులను సైతం లెక్కలేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అందుకు నర్సాపూర్లో జరిగిన సభే సాక్ష్యమన్నారు.

 

రెండు లక్షల మంది ప్రజలు వస్తారని భారీ ఏర్పాట్లు చేశారని, అయితే 25వేలమంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ నేతలు మతి తప్పి మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. వందరోజులు పూర్తి చేసుకున్న కేసీఆర్ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. మరోవైపు నేటితో మెదక్ ఉపఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement