dictator
-
కంటి వైద్యుడి నుంచి కర్కశ నియంత దాకా..
బీరూట్: రెండు పుష్కరాల క్రితం అన్యమనస్కంగా అధ్యక్ష పీఠంపై కూర్చున్న అసద్ తదనంతరకాలంలో నిరంకుశ నేతగా ఎదిగిన వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డమాస్కస్ మెడికల్ కాలేజీలో చదివిన అసద్ తర్వాత ఆప్తమాలజీ చదివేందుకు బ్రిటన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. అసద్ తొలినాళ్లలో లండన్‌లో నేత్ర వైద్యునిగా సేవలందించేవారు. 1971 సంవత్సరం నుంచి సిరియాను తన ఉక్కుపిడికిలి కింద పాలిస్తున్న తన తండ్రి హఫీజ్ మరణంతో 2000 సంవత్సరంలో అసద్ స్వదేశం తిరిగొచ్చాడు. సానుభూతిపరుల మద్దతుతో అయిష్టంగానే అధ్యక్ష పీఠంపై కూర్చున్నారు. అప్పటికి ఆయన వయసు కేవలం 34 సంవత్సరాలు. అధ్యక్ష పదవికి కనీస అర్హత వయసు అయిన 40 ఏళ్లుకూడా నిండకపోవడంతో ఈయన కోసం పార్లమెంట్లో చట్టసవరణ చేశారు. నిజానికి హఫీజ్ తన పెద్ద కుమారుడు బస్సెల్ను తన వారసునిగా చూడాలనుకున్నారు. అయితే 1994లో కారు ప్రమాదంలో బస్సెల్ మరణించడంతో అసద్ అసలైన వారసుడయ్యారు. 2011దాకా అసద్ పాలనపై పెద్దగా విమర్శలు రాలేదు. కానీ అరబ్ విప్లవం మొదలయ్యాక 2011 మార్చిలో అసద్ పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు డమాస్కస్, డేరా నగరాల్లో వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేశారు. వీటిని అసద్ సర్కార్ ఉక్కుపాదంతో అణచివేసింది. ఆనాటి నుంచి అసద్ నిరంకుశ పాలనకు తెరలేపారు. మానవహక్కుల ఉల్లంఘన, అక్రమ అరెస్ట్‌లు, జనంపైకి రసాయన ఆయుధాల ప్రయోగం, కుర్దులను అణగతొక్కడం, ప్రభుత్వ ఆధ్వర్యంలో కిడ్నాప్‌లు, హత్యలు వంటి అరాచకాలు ఆనాటి నుంచి నిత్యకృత్యమయ్యాయి. ఆ తర్వాతి ఏడాది అలెప్పో సిటీలో ఘర్షణలు పెరిగాయి. తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమించుకోగా నాలుగేళ్లు కష్టపడి సైన్యం తిరిగి స్వాధీనంచేసుకుంది. ఆ తర్వాత తూర్పు ఘాతాలో ప్రభుత్వం జరిపిన రసాయన ఆయుధ దాడిలో ఏకంగా వందలాది మంది అమాయక పౌరులు చనిపోయారు. దీంతో ఐసిస్ ఉగ్రసంస్థ విజృంభించి రఖాను స్వాధీనం చేసుకుంది. 2019దాకా ఐసిస్ పట్టుకొనసాగింది. అయితే 2015 సెప్టెంబర్‌లో రష్యా రాకతో అసద్ బలం పుంజుకున్నారు. అయితే 2017 ఏప్రిల్‌లో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా సేనలు పరోక్షంగా రంగ ప్రవేశం చేశాయి. 14 ఏళ్ల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ గత నెల 27న ఇడ్లిబ్ సిటీ ఆక్రమణతో మొదలైన తిరుగుబాటుదారుల జైత్రయాత్ర రాజధాని డమాస్కస్దాకా కొనసాగడంతో 59 ఏళ్ల అసద్ పలాయనం చిత్తగించక తప్పలేదు. అసద్ పాలనలో దాదాపు ఐదు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతర్యుద్ధం కారణంగా 11 లక్షల మంది సిరియాను వదిలి విదేశాలకు శరణార్థులుగా వలసవెళ్లారు. అసద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
బంగ్లాదేశ్ సంక్షోభం.. ప్రతి నియంతకు ఒక గుణపాఠం: ఫరూక్ అబ్దుల్లా
బంగ్లాదేశ్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులు, రాజకీయ అస్థిరతపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ప్రస్తుత బంగ్లాదేశ్ పరిణామాలు.. ఆ దేశానికే కాకుండా, ప్రతి నియంతకు ఒక హెచ్చరిక సందేశంగా పేర్కొన్నారు. ఈ మేరకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత మాట్లాడుతూ.. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం, దేశం విడిచి పారిపోవడం.. ప్రతి నియంతకు ఓ గుణపాఠమని పేర్కొన్నారు. ప్రజల ఓపిక నశించినప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని అన్నారు. నియంతృత్వం ఎప్పటికైనా ప్రజల అసంతృప్తతి, ఆగ్రహానికి కారణమవుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా షేక్ హసీనా నిలబడలేదని, అందుకే ఆమె ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చిందనిన్నారు.‘బంగ్లాదేశ్‌లో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఆ దేశంలో అంతర్గత పరిస్థితి కూడా బాగా లేదు. అందుకే అక్కడ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు లేవనెత్తిన ఉద్యమాన్ని అణచివేయడం అక్కడి సైన్యానికి గానీ, ఇంకెవరికీ గానీ సాధ్యం కాలేదు. కాబట్టి ఇది ఒక గుణ పాఠం. బంగ్లాదేశ్‌కు మాత్రమే కాదు. ప్రజల ఆగ్రహానికి గురైన ప్రతి నియంత దీనిని నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రజల ఓపిక నశించే సమయం వస్తే ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాపై నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఆదివారం జరిగిన అల్లర్లలో 100 మందికి పైగా మరణించగా.. మొత్తంగా 300 మంది మృతి చెందారు. నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి సోమవారం రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లిన విషయం తెలిసిందే.హసీనా రాజీనామాతో నిరసనకారులు చెలరేగిపోయారు. ప్రధాని ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. పలు వస్తువులను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. హసీనా తండ్రి, మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. బంగ్లాదేశ్ పార్లమెంటులోనూ విధ్వంసానికి పాల్పడ్డారు. -
ప్రియురాలిని పెళ్లాడిన డిక్టేటర్ నటి కుమారుడు.. ఫోటోలు వైరల్!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు తారలు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా మరో నటుడు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సినీయర్ నటి, హీరోయిన్ రతీ అగ్నిహోత్రి కుమారుడు తనూజ్ విర్వాన తన ప్రియురాలు తాన్యా జాకబ్‌ను పెళ్లాడారు. మహారాష్ట్రలోని లోనావాలాలో జరిగిన వివాహా వేడుకకు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. కాగా.. తనూజ్ అమెజాన్ వెబ్ సిరీస్ ఇన్సైడ్ ఎడ్జ్‌లో వాయు రాఘవన్ పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న పాయిజన్ వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించారు. కాగా.. తనూజ్ మదర్ రతి అగ్నిహోత్రి తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళం చిత్రాల్లోనూ నటించారు. ఆమె చివరిసారిగా బాలకృష్ణ నటించిన డిక్టేటర్ చిత్రంలో కనిపించారు. View this post on Instagram A post shared by Tanuj Virwani (@tanujvirwani) -
జిన్‌పింగ్ ఓ నియంత.. బైడెన్ నోట మళ్లీ అదే మాట!
వాషింగ్టన్: రెండు అగ్రరాజ్యాల అధ్యక్షులు జో బైడెన్, జిన్‌పింగ్ బుధవారం భేటీ అయ్యారు. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దాదాపు ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ అనంతరం బయటకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని నియంతగానే విశ్వసిస్తున్నానని చెప్పారు. చైనా ప్రభుత్వం, తమ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుందని అన్నారు. జిన్‌పింగ్‌ను నియంతలాగే చూస్తున్నారా..? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో బైడెన్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఏడాది జూన్‌లోనూ బైడెన్ ఇదే మాట మాట్లాడారు. అప్పట్లోనే బైడెన్ తీరును చైనా ఖండించింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. కాగా.. కాలిఫోర్నియాలోని ఒక విశాలమైన భవనంలో ఈ సమ్మిట్ ముగిసింది. రెండు దేశాల మధ్య విబేధాలు సమసిపోయేలా, దౌత్య సంబంధాలు తప్పదోవపట్టకుండా కృషి చేయడానికి అధ్యక్షులు అంగీకరించారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్, పశ్చిమాసియా, ఉక్రెయిన్, తైవాన్, ఇండో-పసిఫిక్, ఆర్థిక సమస్యలు, కృత్రిమ మేధస్సు, మాదక ద్రవ్యాల సరఫరా, వాతావరణం వంటి ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు. అమెరికాలో అక్రమ మాదక ద్రవ్యాల వాణిజ్యం చేపడుతున్న చైనా సంస్థలపై చర్యలు తీసుకుంటానని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. అమెరికాను ఇరుకున పెట్టాలనే ఉద్దేశం లేదని జిన్‌పింగ్ స్పష్టంగా తెలియజేశారు. అలాగే.. అమెరికా కూడా చైనాను అణగదొక్కే చర్యలకు పాల్పడకూడదని పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు వివాదాలకు దారితీయకుండా చర్యలు తీసుకోవాలని ఇద్దరు అధ్యక్షులు అంగీకారానికి వచ్చారు. తైవాన్ అంశం ఇరుదేశాల మధ్య సంబంధాలకు చాలా సున్నితమైన అంశంగా మారిందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. తైవాన్ స్వాతంత్య్రానికి అమెరికా మద్దతు ఇవ్వకూడదని కోరుతూ.. ఆయుధ సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ -
అత్యంత క్రూరమైన ‘ఉగాండా కసాయి’ ఎవరు? మృతదేహాలతో ఏం చేసేవాడు?
కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా క్రూరమైన పాలకులు చాలామంది ఉండేవారు. ఆ క్రూరమైన నియంతలలో అతనిపేరు తప్పుక వినిపిస్తుంది. హిట్లర్ నియంతృత్వ పోకడల గురించి మనం చాలానే విన్నాం. అయితే ఇప్పుడు మనం ‘ఉగాండా కసాయి’గా పేరొందిన ఒక నియంత గురించి తెలుసుకోబోతున్నాం. ఆ నియంతకు మృతదేహాలతో జీవించడమన్నా, మనిషి మాంసం తినడమన్నా ఎంతో ఇష్టమట. ఈ ‘ఉంగాండా కసాయి’ పాలనలో లక్షలాది మంది హత్యకు గురయ్యారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మనం ఉగాండా నియంత ఈదీ అమీన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈదీ అమీన్ 1972లో ఉగాండాలో నివసిస్తున్న వేలాది మంది ఆసియావాసులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించించాడు. ఇదీ అమీన్ 130 కిలోలకు మించిన బరువు కలిగివుండేవాడు. ఎత్తు 6 అడుగుల నాలుగు అంగుళాలు. ఈ ‘ఉగాండా కసాయి’కి ఎవరైనా ఎదురైతే ఇక వారి పని అయిపోయినట్టే. ఈదీ అమీన్ అత్యంత క్రూరమైనవాడు. అతని పేరు చెప్పగానే జనం వణికిపోయేవారు. ఈదీ అమీన్ సహచరులు రాసిన కొన్ని పుస్తకాల్లో వెల్లడైన వివరాలు తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఈ పుస్తకాల ద్వారానే ఈ నియంత ఎంత క్రూరుడో ప్రపంచానికి తెలిసింది. ఈ ఉగాండా కసాయి తన శత్రువులను హత్య చేసిన తరువాత, వారి మృతదేహాలను మరింత క్రూరంగా హింసించేవాడు. అంతే కాదు మృతదేహాలతో ఒంటరిగా గడపడమంటే ఆయనకు ఇష్టమని కొందరు తమ రచనలలో తెలిపారు. ఇది అతనికి ఎంతో ప్రశాంతతను ఇస్తుందట. ఇంతేకాదు ఆ నియంత మానవ మృతదేహాలను తినేవాడట. అలాగే వారి రక్తాన్ని తాగడాన్ని ఇష్టపడేవాడట. చిరుతపులి మాంసం కంటే మానవ మాంసమే బాగుంటుదని అమీన్ ఓ వైద్యునితో చెప్పాడట. ఇది కూడా చదవండి: ‘లాయర్ల సీనియర్ హోదా’ అంటే ఏమిటి? నిబంధనలు, అర్హతలు ఏవి? -
ఆయనో నియంత..బైడెన్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ చారిటీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చైనా ప్రస్తావన వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ఒక నియంత అంటూ ఏకిపాడేశారు. ఇదే ఏడాది మొదట్లో అమెరికా గగనతలంలో ఎగిరిన చైనా గూఢచారి విభాగానికి చెందిన బెలూన్లను పేల్చివేయడం పాపం జిన్ పింగ్ కు మింగుడుపడలేదు. ఆ బెలూన్ల నిండా రెండు బాక్సుల గూఢచారి పరికరాలు ఉన్నాయి. బెలూన్లయితే పంపించాడు కానీ తర్వాత ఏం జరిగిందన్న దానిపై ఆయనకు సమాచారం లేదు. సాధారణంగా అలాంటి సమయాల్లో నియంతలు వెర్రెక్కిపోతూ ఉంటారని, సరైన సమాచారం లేక జిన్ పింగ్ కూడా అలాంటి అయోమయ పరిస్థితిలోనే ఉండి ఉంటారని అన్నారు. అసలే అమెరికా చైనాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యంగా కొవిడ్ సమయంలో ఈ విబేధాలు మరింత పెరిగి తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పే ఉద్దేశ్యంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ చైనా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటన సందర్బంగా చైనా అధ్యక్షుడితో భేటీ అయ్యి పలు కీలక అంశాల గురించి చర్చించుకున్నారు కూడా. ఈ సమావేశం ముగిసిన మరుసటి రోజే జిన్ పింగ్ ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ఘాటు వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇది కూడా చదవండి: అమెరికా పర్యటన వేళ.. రష్యాతో బంధంపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..? -
నియంత కిమ్‌లా మారిన రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని తీరుపై నెటిజన్లు ఫైర్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై నెటిజన్లు మండిపడ్డారు. లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌కు వచ్చే సమయంలో సునాక్ కాన్వాయ్ ముందు సెక్యూరిటీ గార్డులు సైకిల్ తొక్కుకుంటూ కన్పించారు. మరికొంత మంది సెక్యూరిటీ ఆయన కారుతో పాటు పరుగులు తీస్తూ డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లారు. రిషి సునాక్ రేంజ్ రోవర్ కారు ముందు సెక్యూరిటీ ఇలా సైకిల్‌పై రావడం, పరుగులు పెట్టుకుంటూ వెళ్లడం చూసిన స్థానికులు అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Is this really necessary? 😳 Look at how @RishiSunak gets escorted through London. pic.twitter.com/O6VaiNneyV — Charlotte, The Baroness 💫 (@CharlotteEmmaUK) April 24, 2023 ఈ వీడియో చూసిన నెటిజన్లు సునాక్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సెక్యూరిటీని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ సెక్యూరిటీతో పోల్చారు. రిషి సునాక్ కూడా కిమ్‌లా ప్రవర్తిస్తున్నారని, నియంతలా మారిపోయారని ధ్వజమెత్తారు. మరికొందరేమో కిమ్ జోంగ్ లండన్ వచ్చారా? ఆయన సెక్యూరిటీ ఇక్కడ ఉందేంటి? అని సునాక్ తీరుపై సెటైర్లు వేశారు. 'రిషి సునాక్లా చేసినట్టు గతంలో ఏ ప్రధాని చేయలేదు. పోలీసు బలగాలను వృథా చేస్తున్నారు. ఉత్తర కొరియాను ఫాలో అవడం బాలేదు' అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. సునాక్ కాన్వాయ్ ముందు సైకిళ్లపై వచ్చిన సెక్యూరిటీ రోడ్డుపై ఉన్నవారిని పక్కకు తప్పుకోవాలని హెచ్చరించింది. దారివ్వండి, తప్పుకోండి అంటూ అరుస్తూ ముందుకు సాగింది. దీంతో వీళ్ల హడావుడి చూసి స్థానికులు అవాక్కయ్యారు. చదవండి: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు -
బ్రిటీష్ పాలకుల కంటే బీజేపీ ప్రభుత్వమే ఎక్కువ ప్రమాదకరం!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ చర్యలను అహంకారపూరిత నియంతృత్వ చర్యగా అభివర్ణించారు. ఈ చర్యతో ప్రతిపక్షాల గొంతును భారతీయ జనతా పార్టీ అణిచివేయలేదని నొక్కి చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో.. "రాహుల్ గాంధీని లోకసభ ఎంపీగా అనర్హత వేటు విధించడం దిగ్భ్రాంతికరం. మేము న్యాయవ్యవస్థను గౌరవిస్తాం. కానీ రాహుల్‌ని లోక్‌సభ సభ్యుత్వం నుంచి తొలగించడం అనేది పిరికి చర్యే. ఈ తీర్పుతో ఏకీభవించం. ప్రస్తుతం దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. వారి పాలనతో దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. వారి అహంకార శక్తులకు వ్యతిరేకంగా 130 కోట్ల మంది ప్రజలు ఏకం కావాలి. దేశంలో ఒకే పార్టీ ఉండేలా పరిస్థితిని బీజేపి సృష్టించాలని చూస్తోంది. దీన్ని నియంతృత్వం అని, స్వాతంత్య్రానికి ముందు భారత్‌ని పాలించిన బ్రిటిష్ పాలకులు కంటే బీజేపీ ప్రభుత్వ పాలనే ఎక్కువ ప్రమాదకరంగా ఉంది" అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ అసెంబ్లీలో కూడా నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన నాయకత్వంతో దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఆమ్ఆద్మీ పార్టీ పనితీరుని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అడ్డుకుంటూ ఇబ్బందులు సృష్టించారన్నారు. एक अहंकारी तानाशाह, कम-पढ़े लिखे व्यक्ति से देश को बचाना पड़ेगा@RahulGandhi को Lok Sabha की सदस्यता से बर्खास्त कर देना कायराना है हम इस Judgement से सहमत नहीं हैं देश में सभी डरे हुए हैं अब लोगों को खड़ा होना पड़ेगा, मेरी लोगों से Appeal—ये देश सबका है —CM @ArvindKejriwal pic.twitter.com/hmdlMlESLu — AAP (@AamAadmiParty) March 24, 2023 (చదవండి: మహాత్మాగాంధీ డిగ్రీ చేయలేదని తెలుసా!:జమ్మూకాశ్మీర్ గవర్నర్ వ్యాఖ్యలు) -
యుద్ధంలో రష్యా ఓడితే! జరిగేది ఇదే..
చిన్న దేశం.. పైగా పెద్దగా సైనిక బలగం కూడా లేదు. మూడురోజులు.. కుదరకుంటే వారంలోపే ఆక్రమించేసుకోవచ్చు. ఉక్రెయిన్ దురాక్రమణకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వేసిన అంచనా ఇది. కానీ, ఆ అంచనా తప్పింది. ఏడాది పూర్తైనా యుద్ధం ఇరువైపులా నష్టం కలగజేస్తూ ముందుకు సాగుతోంది. పైగా చర్చలనే ఊసు కూడా కనిపించడం లేదు. ఈ తరుణంలో.. ఒకవేళ రష్యా గనుక యుద్ధంలో ఓడిపోతే పరిస్థితి ఏంటి?.. మరీ ముఖ్యంగా పుతిన్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై.. రష్యా మాజీ దౌత్యవేత్త ఒకరు స్పందించారు. యుద్దంలో గనుక పుతిన్ ఓడిపోతే.. వెంటనే అధ్యక్ష పదవి నుంచి దిగిపోతాడు. ఆయనేం సూపర్ హీరో కాదు.. ఎలాంటి సూపర్‌పవర్స్ లేవు. ఆయనొక సాధారణ నియంత మాత్రమే. కాబట్టి, దిగిపోక తప్పదు అని బోరిస్ బోండరెవ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బోండరెవ్.. జెనెవాలో రష్యా దౌత్యపరమైన కార్యకలాపాలకు సంబంధించి ఆయుధాల నియంత్రణ నిపుణుడిగా బాధ్యతలు నిర్వహించేవారు. అయితే.. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ ఈయన తన పదవికి రాజీనామా చేశారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖండిస్తూ.. బహిరంగంగా రాజీనామా చేసిన తొలి దౌత్యవేత్త, అదీ రష్యా పౌరుడు కావడం ఇక్కడ గమనార్హం. ‘‘చరిత్రను గనుక ఓసారి తిరగేస్తే.. నియంతలు ఎక్కడా శాశ్వతంగా కనిపించరు. వాళ్లు పూర్తిస్థాయిలో అధికారం కొనసాగించిన దాఖలాలు లేవు. యుద్ధంలో ఓడితే గనుక.. మద్దతుదారుల అవసరాలను తీర్చలేక వాళ్లంతట వాళ్లే పక్కకు తప్పుకుంటారు. పుతిన్ కూడా ఒక సాధారణ నియంతే. రష్యా యుద్ధంలో గనుక ఓడిపోతే.. పుతిన్ తన దేశానికి ఏమీ ఇవ్వలేడు. ప్రజల్లోనిరాశ, అసమ్మతి పేరుకుపోతుంది. రష్యా ప్రజలు ఇకపై పుతిన్ అవసరం తమకు లేదని అనుకోవచ్చు. అప్పుడు ఆయనకు వీడ్కోలు పలికేందుకే మొగ్గు చూపిస్తారు కదా అని అభిప్రాయపడ్డారు బోండరెవ్. అయితే.. ప్రజలను భయపెట్టడం లేదంటే అణచివేత ద్వారా మాత్రమే పుతిన్ ఆ పరిస్థితిని మార్చేసే అవకాశం మాత్రం ఉంటుంది అని తెలిపారాయన. -
నియంతలా మోదీ పాలన: ఖర్గే
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఒక నియంతలాగా పాలిస్తున్నారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ‘‘బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ దాన్ని రక్షిస్తున్నామని చెప్పుకుంటున్నారు. వాళ్ల డిక్షనరీలో రాజ్యాంగానికి స్థానం లేకుండా పోయింది’’ అంటూ దుయ్యబట్టారు. పార్లమెంటు అధికార పార్టీ తీరుకు నిరనసగా విపక్ష సభ్యులతో కలిసి పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకూ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాల సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, పైగా ప్రజాస్వామ్యం, జాతీయవాదం, దేశ గౌరవం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ పెద్దల తీరు దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు. ప్రధాని మోదీ గతంలో చైనా, దక్షిణ కొరియా, కెనడా, యూఏఈలో పర్యటించినప్పుడు ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలని ఖర్గే హితవు పలికారు. లోక్‌సభలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అందుకే పార్లమెంట్ వాయిదా: జైరామ్ రమేశ్ పార్లమెంట్ సమావేశాలు జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే వాయిదా వేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ విమర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అదానీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలన్నదే ప్రభుత్వ కుతంత్రమని ఆరోపించారు. -
శ్రీలంకలో మళ్లీ భగ్గుమంటున్న నిరసనలు.. ఐ డోంట్ కేర్ అంటున్న రణిల్
కొలంబో: శ్రీలంక గత కొద్దికాలంగా తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహోజ్వాలలు కట్టలు తెంచుకోవడంతో శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కాస్త సద్దుమణిగి ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడుతుందేమో! అనేలోపు మళ్లీ తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అదీగాక మరోవైపు ప్రస్తుత శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేని పార్లమెంట్‌ని రద్దు చేసి, ముందస్తు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. దీంతో రణిల్ ప్రతిపక్షాల డిమాండ్‌ని తిరస్కరించడమే కాకుండా పాలన మార్పు లక్ష్యంగా భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వచ్చిన వాటిని అణిచేవేసేందకు కచ్చితంగా సైన్యాన్ని రంగంలోకి దింపుతానని నొక్కి చెప్పారు. ముందుగా శ్రీలంక ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు పార్లమెంట్‌ను రద్దు చేసేదే లేదని తేల్చి చెప్పారు. ఆయన పదవీకాలం 2024లో ముగియనుంది. అదీగాక రాజపక్స స్థానంలో వచ్చిన విక్రమిసింఘే మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేసేంతవరకు కొనసాగే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్షాలు రణిల్ ప్రభుత్వానికి ఎన్నికల విశ్వసనీయత లేదంటూ ముందస్తు పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిస్తున్నాయి. ఐతే ఆర్థిక సంక్షోభంలో రణిల్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా నెలక్నొన అశాంతి కాస్త రాజకీయ సంక్షోభంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వేలాదిమంది నిరసకారులు వీధుల్లోకి వచ్చి గత జూలై నెలలో గోటబయ రాజపక్సను వెళ్లగొట్టారు. ఆయన వెళ్లిపోయిన తదనంతరమే నిరసనలు అణిచివేసి శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విక్రమసింఘే మాట్లాడుతూ ఇలాంటి నిరసనులు మళ్లీ పునరావృతమైతే అణిచివేసేందకు సైన్యాని దింపుతానని కరాకండీగా చెప్పేశారు. తనను నియంతగా పిలచినా పర్వాలేదు కానీ ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరగనివ్వనని చెప్పారు. ఒకవేళ నిరసకారులు వీధి నిరసనలు నిర్వహించాలనుకుంటే ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడకుండా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వాన్ని గద్దే దింపే ఏ ప్రణాళికను అనమితించనని తేల్చి చెప్పారు. అయినప్పటికీ ఇలాంటి ప్రయత్నాలకి ఆందోళనకారులు మళ్లీ మళ్లీ తెగబడితే వాటిని ఆపేలా అత్యవసర చట్టాలను సైతం ఉపయోగిస్తానని కరాకండీగా చెప్పారు. ఈ మేరకు రణిల్ ఆదేశాల మేరకు అధికారులు తీవ్రవాద నిరోధక చట్టం కింద ఇప్పటికే ఇద్దరు నిసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ఉక్రెయిన్ ఆసుపత్రిపై రష్యా సేనల దాడి.. శిశువుతో సహా ముగ్గురు మృతి) -
రష్యా రెక్కలు విరుస్తాం: బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను నియంతగా, యుద్ధ పిపాసిగా అభివర్ణించారు. అకారణ యుద్ధానికి దిగినందుకు ఆయన దోషిగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయమన్నారు. జీ7 దేశాల నేతలతో గంటకు పైగా వర్చువల్‌గా చర్చించాక భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక బైడెన్ మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా, ఇతరత్రా కూడా రష్యా రెక్కలు విరిచేస్తామన్నారు. ‘‘మరో నాలుగు అతి పెద్ద రష్యా బ్యాంకులపై, పుతిన్‌కు సన్నిహితులైన ఆ దేశ కుబేరులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాం. ఆ బ్యాంకులకు, సంపన్నులకు చెందిన అన్ని ఆస్తులనూ జప్తు చేస్తున్నాం. ఇక అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలతో రష్యాకు సంబంధాలన్నీ తెగిపోయినట్టే. చదవండి: (Vladimir Putin: రష్యా అధ్యక్షుడికి ఎక్కడిదీ బరి తెగింపు!) డాలర్లు, యూరోలు, పౌండ్లు, యెన్ కరెన్సీల్లో ఇకపై రష్యా ఎలాంటి లావాదేవీలు చేయలేదు. ఆ దేశ ఎగుమతులు, దిగుమతుల సామర్థ్యం తీవ్రంగా దెబ్బ తీస్తాం. ఇవన్నీ యూరోపియన్ యూనియన్, జపాన్ తదితర దేశాలతో కలిసి అమెరికా సంయుక్తంగా తీసుకున్న నిర్ణయాలు. త్వరలో రష్యాపై మరిన్ని అతి కఠిన ఆంక్షలుంటాయి’’ అని ప్రకటించారు. తూర్పు యూరప్‌లోని నాటో స్థావరాలకు మరిన్ని అమెరికా బలగాలను తరలిస్తున్నట్టు చెప్పారు. నాటో దేశాలకు చెందిన ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటామన్నారు. ఉక్రెయిన్ క్షేమం కోసం ప్రపంచ దేశాలన్నింటితో కలిసి ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఆ దేశానికి నైతికంగా, మానవతా దృక్పథంతో అన్ని రకాల సాయమూ చేస్తామన్నారు. చదవండి: (Russia Ukraine War Effect: ప్రపంచం చెరి సగం.. భారత్ ఎందుకు తటస్థం?) -
Lata Mangeshkar: లత పాటకు పాకిస్తాన్ నియంత కూడా ఫిదా అయ్యాడు!
సుమధుర గాయని, భారత రత్న లతా మంగేష్కర్ గాత్రానికి ముగ్దుడు కానీ సినీ ప్రియుడు ఉండడంటే అతిశయోక్తి కాదు.పాకిస్తాన్లో సంగీతం, లలిత కళలపై కఠిన నిషేధం విధించిన నాటి కరడుగట్టిన నియంత జనరల్ జియా ఉల్ హక్ కూడా లత గాన మాధుర్యానికి ఫిదా అయ్యాడు. తానామె అభిమానినని 1982లో ప్రఖ్యాత జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 1977లో సైనిక తిరుగుబాటు ద్వారా జుల్ఫికర్ అలీ భుట్టో సర్కారును కూలదోసి జియా అధికారంలోకి రావడం తెలిసిందే. తర్వాత భుట్టోను హత్య కేసులో ఉరి తీయించాడు. దానిపై దేశమంతటా వెల్లువెత్తిన నిరసనలను కట్టడి చేసే చర్యల్లో భాగంగా మహిళలు పాల్గొనే సంగీత, సాహిత్య ప్రదర్శనలపై నిషేధం విధించాడు. అందుకే తన అభిమాన గాయని లతతో కూడిన భారత గాయక బృందం పాకిస్తాన్లో పర్యటించేందుకు అనుమతించలేదు! గోవాలో మూలాలు లత మూలాలు గోవాలో ఉన్నాయి. అక్కడి మంగేషీ గ్రామం ఆమె పూర్వీకుల స్వస్థలం. అక్కడి మంగేషీ ఆలయంలో మంగేశుని పేరుతో కొలువైన శివుడు లత కుటుంబీకుల కులదైవం. ఆయన పేరిటే ఈ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం ఇంటి పేరు మంగేష్కర్‌గా స్థిరపడింది. లత తండ్రి అయిన సంగీత దర్శకుడు, రంగస్థల నటుడు దీనానాథ్ మంగేష్కర్ అసలు పేరు దీనానాథ్ అభిషేకీ. తమ ఊరిపై మమకారంతో ఇంటిపేరును మంగేష్కర్‌గా మార్చుకున్నారు. ఆ ఇంటి పేరుకు పెద్ద కూతురు లత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. -
లో లొంగదు
ఒక మారుమూల సముద్రంలో ఒక ద్వీపం ఉంది. ఓడల మీద సముద్రాలను నాగరకులు గాలించారు. నాగరకులు సర్వ ప్రపంచము, సముద్రపు నీళ్లలో తేలిన ప్రతిమంటిగడ్డ తాము సాధించామని అనుకొన్న తరువాత ఆ ద్వీపం ఉన్నదని తెలుసుకునేందుకే కొన్ని వేల యేండ్లు పట్టినవి. తెలుసుకోవటమే ఆలస్యము. మతాలు, వర్తకులు, తుపాకులు అక్కడికి చేరినవి. ఒక నాగరకజాతి సేనానాయకుడు ఆ ద్వీపానికి సైనిక నియంత. అతడు బ్రహ్మచారి. అనగా అవివాహితుడన్నమాట. ఆ ద్వీపము శీతమండలాల్లో ఉండటం మూలంగా అక్కడి జనులు తెల్లనివాళ్లు. ఇతర ఖండములలోని అనాగరకులవంటివారు. అనగా కోట్ల కొలది సంవత్సరాలు బ్రతికిన జాతి అన్నమాట. చెట్టులో– పుట్టలో, సూర్యునిలో – చంద్రునిలో, మెరుపులో– మేఘములోనేదో దివ్యశక్తి యున్నదని దాని నారాధించినవాళ్లు. జీవుణ్ణి కాలిక్రిం బెట్టి త్రొక్కరు. బంగారము నాణెముగా వాడుకోరు. దానియందు తేజశ్శక్తి ఉన్నదని ఆరాధిస్తారు. కుండపెంకులలో వండుకొని తింటారు. లోహపాత్రలు నాగరకత అని యెరుగరు. శరీరావయవములు కావలసినంత మాత్రము కప్పుగొంటారు. ఈ యనాగరకులు నాగరకులయ్యే రోజులు వచ్చి ఆ ద్వీపం నాగరకుల కంట బడ్డది. సైనిక నియంత ఒక స్త్రీని చూచాడు. ఆమె అందం అతని కళ్లు పట్టరాకండా ఉండిపోయింది. ఆవిడ మొగుడికి కబురు పంపించాడు– నీ భార్యని నాకు తోలిపెట్టమని. ఆ జీవుడు యేమి చేస్తాడూ? ఇదివరకే తమ ద్వీపంలో జరిగిన ఘోరాలు తెలుసు. అయినా జీవుడు పెనగులాడటం స్వభావం. అది అన్యాయ మని, తన ప్రాణము పోయినా భార్యను వదిలిపెట్టనని కబురంపించాడు. నియంతకు కోపం వచ్చింది. పదిమంది సైనికులు, తుపాకులతో వాని యింటికి వెళ్లాడు. వీళ్లు వస్తారని తెలిసి పొయ్యిలో పెట్టుకొనే పొడుగాటి పుల్లలు తానొకటి, తన పెద్ద కొడుకొకటి చేతులతో పుచ్చుకొని, గుడిసె ముందర నిలుచున్నారు. వారి యాయుధాలను చూస్తే నియంతకు నవ్వు వచ్చింది. అతడు ‘‘ఎందుకు నవ్వుతావు’’ అని యడిగాడు. నియంత అన్నాడు: ‘‘ఓరి మూర్ఖుడా! మా తుపాకులముందు నీ కట్టెపుల్లలు నిలుస్తావా?’’. అతడన్నాడు కదా– ‘‘నా కట్టెపుల్లలు నీ తుపాకులకు సమాధానము చెపుతవని గాదు నే నీ కర్రలు పుచ్చుకొన్నది. నా మనస్సు నీ మనస్సుకు సమాధానం చెప్పవలెనని.’’ ఒక్క కత్తి విసరుతో తండ్రీకొడుకుల తలలు తెగిపోయినవి. నియంత గుడిసెలో ప్రవేశించి అతని భార్యను తీసుకు రాబోయినాడు. ఆరేండ్ల మొదలు చనుబాలు త్రాగే శిశువు వరకు నలుగురు పిల్లలు ఏడవ మొదలుపెట్టారు. ఆ స్త్రీ భర్త శవం, కొడుకు శవం మీదబడి యేడవటం మొదలుపెట్టింది. సైనికులు శవాలను సముద్రంలో పారవేశారు. ఆమె యింక పిల్లలను పట్టుకొని యేడవటం మొదలుపెట్టింది. సైనికులు నియంత ఆజ్ఞతో పెద్దపిల్లలను ముగ్గురినీ తల్లి చేతులలోంచి లాక్కుని పదిపదకొండు సార్లు విదిలించి వేయగా వేయగా వాళ్లు దెబ్బలు తగిలి, ఉస్సురని ప్రాణాలు కడవట్టి చనిపోయినారు. ఆ స్త్రీ పాలుత్రావు పిల్లతో నియంత యింటికి వెళ్లింది. ఈ కథ జరిగి అయిదేళ్లయింది. ఆ స్త్రీ ఆ పిల్లతో కాలం పుచ్చుతోంది. నియంత– ఆ పిల్లకూడ పోతేగానీ నీవు నాతో సరిగా ఉండవు. స్త్రీ– నీకన్న కర్కోటకుడవు నీవే! ఈ పసిపిల్ల ప్రాణములు కూడా తీస్తావా? నియంత– నిన్ను తీసుకువచ్చినప్పుడు ఇది పసిపిల్ల. ఇప్పుడు కాదే! దీని యీడు పిల్లలను అప్పుడు నీ దగ్గరనుండి లాగివేయలేదా? అట్లాగే యిప్పుడూను. ఆ స్త్రీకి అతనితో అయిదేండ్లున్న తరువాత అతని యేమాటకు ఎంత అర్థమో తెలిసినది. తన బిడ్డ తనకు మిగలదని తెలిసింది. పిల్లను చేతిలో పెట్టి ‘‘యిదిగో, చంపివేయి. ఈ పిల్ల ఉన్నన్నాళ్లు నేను దానిని వదిలిపెట్టలేను’’ అన్నది. అతడు ఆ పిల్లను నరికాడు. ఆమె యేడుస్తూ వెళ్లిపోయింది. ఆమె కొన్ని రాత్రులు ఉరి పోసుకుందామనుకుంది. పోసికోలేదు. సముద్రములో బడి చద్దామనుకుంది. చావలేదు. కిరసనాయిలు మీద పోసికొని నిప్పు ముట్టించుకుందా మనుకుంది. ముట్టించుకోలేదు. యెన్నో అనుకుంది. ఏమీ చేయలేదు. కొన్నాళ్లకు ఒక రాత్రి నియంత తప్ప త్రాగి మదించిన కళ్లతో ఆమె గదికి వచ్చాడు. నియంత– నీ మగడు, నీ పిల్లలు పోయి పదేళ్లయింది. స్త్రీ– నా ద్వీపపు స్వాతంత్య్రం పోయి పాతిక యేండ్లయింది. నియంత– ఇంకా యెన్నాళ్లీ దుఃఖం? స్త్రీ– ఈ శరీరం వున్నన్నాళ్లు. నియంత– నీకు ఏమి తక్కువగా ఉంది? పూర్వంకన్న మంచిదుస్తులు ధరిస్తున్నావు. మంచి భోజనం చేస్తున్నావు. నీ జాతికన్న నా జాతి గొప్పది. నీ భర్తకన్న నేను గొప్పవాడను. స్త్రీ– నా భర్తకన్న గొప్పవాడవు కావు. నియంత– కానా! స్త్రీ– భార్య పిల్లలను రక్షించుకునేందుకు కర్రపుచ్చుకొని నిలబడ్డాడు. రక్షించలేనని తెలుసు. అయినా తన ధర్మం తాను చేశాడు. తాను చచ్చిన తరువాతగాని నిన్ను నా దగ్గరకు రానీయలేదు. నేను నిజముగా నీ భార్యనై ఉంటే నీకన్న బలవంతుడు నాకోసం వస్తే, నీవు పారిపోయేవాడవు. నియంత– మరి యిటువంటివాడితో నీవు సంసార మెందుకు చేస్తున్నావు? స్త్రీ– నేను నీతో సంసారము చేయుట లేదు. నియంత– ఈ మాటలు వింటే యెవరైనా నిన్ను మూఢురాల వనుకొంటారు. స్త్రీ– నేను వాళ్లని మూఢులనుకొంటాను. నియంత– అయితే నీకు నాతో ఉండటం యిష్టం లేదన్నమాట. స్త్రీ– లేదని నీతో చెప్పుట యిది యెన్ని లక్షలో సారి. నియంత– నిన్ను చంపేస్తాను. స్త్రీ– పదియేళ్ల నుండి అల్లా చేస్తావేమోయని యెదురు చూస్తున్నాను. నియంత– నీకు చావంటే అంత యిష్టమా? స్త్రీ– అంతాయింత యిష్టమా! నియంత– ఎందుకు చావవు? సముద్రంలో పడి చావవచ్చు. ఉరి పోసికొని చావవచ్చు. స్త్రీ– నా కట్లా చావటం యిష్టం లేదు. నియంత– ఎట్లా చావటం యిష్టం? స్త్రీ– నీకు కోపము తెప్పించి నువ్వు నన్ను చంపితే చావాలని. నియంత– అంటే, నీకు నామీద ప్రేమ ఉన్నదన్నమాట. స్త్రీ– అవును, ఉంది. నా భర్త, నా పిల్లలు నీ చేతిమీదుగా చచ్చారు గనుక అల్లా నీ చేతిమీదుగానే చద్దామన్నంత ప్రేమ. నియంత– ఈ మాటల కేమిగాని నీకు చావటానికిష్టం లేదు. స్త్రీ– పొరపాటు. చావటాని కిష్టం ఉన్నది. ఆ యిష్టము కూడా ఒళ్లంతా తగలబెడుతూ ఉన్నంత యిష్టం. కాని చావు రెండు రకాలు. తనంతట తాను చచ్చే చావు. యెదటివాళ్లు చంపితే చచ్చేచావు. నాకు రెండవ చావే యిష్టం. నియంత– అంటే నాతో కలిసి సుఖించడం యిష్టమన్నమాట. స్త్రీ– నీవు పశువువు. నీ నాగరకత అంతా నీవు చేసే సురాపానంలో, ధరించే దుస్తుల్లో, తుపాకి మందులో ఉంది. నీ మనసులో లేదు. నీ జాతిలో లేదు. నేను బ్రతుకుచున్నానన్న విషయం నీకాశ్చర్యంగా ఉంది. ఉరి పోసికునో, సముద్రంలో పడో చావటం నా జీవుడికి యిష్టం లేదు. నా జీవుడు ఈ శరీరాన్ని పట్టుకున్నాడు. వాడంతట వాడు వదలిపోడు. ఆ నా చనిపోయిన భర్తకోసం, పిల్లల కోసం గుండె అటమటించి చావటం, మహాగ్ని జ్వాలలలో మ్రగ్గిపోవటం ఈ జీవుడికి యిష్టం. ఈ జీవుడికి యిది యొక అనుభవం. చచ్చిపోవటానికి యిష్టపడడు. సౌఖ్య మనుభవిద్దామని కాదు. దుఃఖమనుభవిద్దామని. సౌఖ్యమో, దుఃఖమో ఈ శరీరంతో పుట్టి, యీ శరీరానికి సంబంధించినవి అనుభవించటమే అతని కిష్టం. ఈ శరీరానికి, యీ జీవుడికి యెడతెగరాని లంకె. నా అంతట నేను చావటం నా కిష్టం లేదు. నీవు చంపితే చచ్చిపోవటం యిష్టం. మృత్యువు దానియంతట అది వస్తే యింకా యిష్టం. అట్లాగే ఈ జీవుడు ఈ శరీరంతో తన యిష్టం వచ్చిన సౌఖ్యాన్ని అనుభవించి సౌఖ్యం అనుభవించా ననుకుంటాడు. ఇతరులవల్ల బలవంతంగా చేయబడ్డ అనుభవం అది వాడికి సౌఖ్యం కాదు. అది దుఃఖమే. ఆ దుఃఖమైనా అనుభవించటం అతని కిష్టం. నియంత– అయితే నీవు నా కక్కర లేదు. స్త్రీ– ఊరికే అనట మెందుకు? నియంత ఆమెను చంపెను. చనిపోవుచున్న యామె పెదవిమీద సంతోషపు నవ్వు తాండవించెను. కొనయూపిరితో నిట్టనెను: ‘‘నీవు నీ జన్మలో చేసిన మంచి పని యిది యొక్కటియే. నేను చనిపోవు చుంటిని గదా! నీవు తరువాత యేమి చేసెదవు?’’ నియంత– మరల నింకొక స్త్రీని సంపాదించెదను. స్త్రీ– నీకు తగిన మాట! నీ జాతికి జీవుని యిష్టము తెలియదు. ఆమె కొన్ని రాత్రులు ఉరి పోసుకుందామనుకుంది. పోసికోలేదు. సముద్రములో బడి చద్దామనుకుంది. చావలేదు. కిరసనాయిలు మీద పోసికొని నిప్పు ముట్టించుకుందామనుకుంది. ముట్టించుకోలేదు. యెన్నో అనుకుంది. ఏమీ చేయలేదు. కొన్నాళ్లకు ఒక రాత్రి నియంత తప్ప త్రాగి మదించిన కళ్లతో ఆమె గదికి వచ్చాడు. విశ్వనాథ సత్యనారాయణ -
సూడాన్‌లో సైనిక తిరుగుబాటు
ఖార్టూమ్: ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైనిక తిరుగుబాటు జరిగింది. దేశాన్ని దాదాపు మూడు దశాబ్దాలపాటు పాలించిన అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్(75)ను పదవీచ్యుతుడిని చేసి, గృహ నిర్బంధంలో ఉంచినట్లు గురువారం సైన్యం ప్రకటించింది. ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ రాజధాని ఖార్టూమ్ వీధుల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సైన్యంలో బ్రిగేడియర్‌గా ఉన్న బషీర్ 1989లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దింపి, అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆఫ్రికాలో ఎక్కువ కాలం అధికారం చెలాయించిన పాలకుల్లో ఒకరైన బషీర్.. ఇస్లామిక్ తీవ్రవాదుల అండతో నియంతృత్వ విధానాలను అవలంభించారు. అల్‌ఖాయిదా చీఫ్ బిన్‌లాడెన్ వంటి వారు 1996 వరకు సూడాన్‌లోనే ఆశ్రయం పొందారు. బషీర్ విధానాల కారణంగా దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఊచకోతకు గురికాగా, 2.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అనంతరం దేశం నుంచి ఉత్తర సూడాన్ విడిపోయింది. -
నియంతలా టీటీడీ ఉన్నతాధికారి
-
మోదీ.. ఎవరి మాటా వినరు!
సాక్షి, బళ్లారి/దావణగెరె: ‘ప్రధాని మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారు. విపక్షాలను పట్టించుకోవడం లేదు.. ప్రజల కష్టాలను తెలుసుకోవడం లేదు.. తన అభిప్రా యాలను మాత్రం జనంపై రుద్ది ఇబ్బంది పెడుతున్నారు’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఆయన బుధవారం కర్ణాటకలోని దావణగెరెలో పర్యటిం చారు. నోట్ల రద్దుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు నరకయాతన పడ్డారన్నారు. జీఎస్టీ నుంచి నిత్యావసర వస్తువులను మినహాయించాలని కోరినా పట్టించుకోలేద న్నారు. లింగాయత్‌లకు ప్రత్యేక మత హోదా ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ అభిమతం కాదని, ఆ సంఘ ప్రముఖులు, స్వామీజీలు కోరుతున్నందునే ఆ మేరకు చర్యలు చేపట్టామని చెప్పారు. అనంతరం ఆయన లింగాయత్ లకు చెందిన ప్రముఖ సిద్ధగంగ మఠాన్ని సందర్శించి శివకుమార స్వామి(111) ఆశీస్సులు అందుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ ఆజమాయిషీ నుంచి ప్రభుత్వ వ్యవస్థలకు విముక్తి కల్పిస్తామన్నారు. -
‘కేసీఆర్ పాలన డిక్టేటర్‌ను తలపిస్తోంది’
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలన డిక్టేటర్ పాలనను తలపిస్తోందని, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘‘ తెలంగాణ రాష్ట్ర సాధనకి ధర్నాచౌక్ వద్ద జరిపిన ధర్నాలు ఎంతో దోహదం చేశాయి. ఇప్పుడు అదే ధర్నాలను చూసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భయపడుతున్నారు. ప్రశ్నించే గొంతులను సీఎం అణిచివేస్తున్నారు. ధర్నా చౌక్ మూసివేత పై అన్నిపార్టీలు స్పందించాలి. ఉద్యమాలతో పుట్టిన తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్‌ని మూసివేయడం సరికాదు. బీసీ సబ్ ప్లాన్ బడ్జెట్‌కి బీసీ నాయకుల సలహాలు తీసుకోకపోవడం దుర్మార్గమని, సీఎం కేసీఆర్ ఓటుబ్యాంక్ రాజకీయాలు మానుకోవాలని’’ వి.హనుమంతరావు సూచించారు. -
కిమ్ జోంగ్ ఉన్ భార్య హత్య?
-
కిమ్ జోంగ్ ఉన్ భార్య హత్య?
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భార్య రి సోల్ జు అకస్మాత్తుగా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె ప్రజలకు కనిపించి దాదాపు ఏడు నెలలు అవుతోంది. గత మార్చి 28న ఆమె చివరిసారిగా భర్త కిమ్‌తో కలిసి ప్యాంగ్యాంగ్లో ఓ బహిరంగ కార్యక్రమంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె కనిపించలేదు. దీంతో ఆమె అదృశ్యంపై ఊహాగానాలు, వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తర కొరియా ప్రచార కార్యకలాపాల విభాగం చీఫ్‌గా ఉన్న కిమ్ సోదరితో విభేదాల కారణంగానే సోల్ జు అదృశ్యమైందని కొందరు చెప్తుండగా.. స్వయంగా కిమ్ భార్యను చంపి ఉంటాడని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భర్తే హత్యచేశాడా? దేశద్రోహం ఆరోపణలపై కిమ్ తన మేనమామ జాంగ్ సాంగ్ థేక్‌ను 2013 డిసెంబర్లో ఉరితీసిన సంగతి తెలిసిందే. అతనికి సన్నిహితురాలైన తన భార్య సోల్ జుతో కిమ్‌కు విభేదాలు వచ్చాయని చెప్తున్నారు. దీంతో కిమ్ ఆమెను చంపేసి ఉంటారని అనుమానిస్తూ పలు కథనాలు వచ్చాయి. తన సన్నిహితులు, బంధువులను ఉరితీయించిన ఘనత కలిగిన కిమ్‌కు భార్యను ఉరితీయించడం పెద్ద కష్టమేమి కాదని ఈ కథనాలు పేర్కొంటున్నాయి. గర్భవతి అయిందా!? ఉత్తరకొరియా పరిణామాలను నిశీతంగా గమనించే టోక్యోలోని వసేదా యూనివర్సిటీ ప్రొఫెసర్ తోషిమిత్సు షిగెమురా కిమ్ భార్య సోల్ జు అదృశ్యంపై పలు విషయాలు తెలిపారు. ప్యాంగ్యాంగ్లో ఇటీవల రాజకీయ అస్థిరత నెలకొనడం, పలు దాడులు జరగడంతో ప్రత్యేక రక్షణ నడుమ సోల్ జును ఉంచారని, అత్యంత భద్రత నడుమ ఉండటం వల్లే ఆమె బయటికి రాలేదని ఆయన అంచనా వేస్తున్నారు. మరోవైపు సోల్ జు గర్భవతి అయి ఉండొచ్చునని, అందుకే బయట కనిపించడం లేదని మరికొందరు అనుమానిస్తున్నారు. 2012లో సోల్ జు ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే, అధికారికంగా ఉత్తరకొరియా ప్రకటన చేయడం లేదా.. సోల్ జు ప్రజల ముందుకువస్తేనే ఈ ఊహాగానాలన్నింటికీ తెరపడుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా విషయమై పలు వదంతులు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. -
రాష్ట్రంలో నియంత పాలన
– నిరుద్యోగ భృతి ఇచ్చేది లేదని ప్రకటించడం సిగ్గుచేటు – వర్ల రామయ్యది జగన్‌ను విమర్శించే స్థాయి కాదు – వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య కర్నూలు (ఓల్డ్‌సిటీ): కజకిస్తాన్, ఉక్రెయిన్ తరహాలో రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి విచారణకు సిద్ధపడటం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. ప్రతిపక్షాలపైనే వేలు చూపడం సరికాదన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్యది తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించేంత స్థాయి కాదన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్.. హోమ్ మంత్రి అవమాన పరుస్తూ మాట్లాడారని, దీనిని టీడీపీ నాయకులు ఖండించకపోవడం దారుణమన్నారు. టీడీపీకి ప్రజలే గుణపాఠం చెబుతారని పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ అన్నారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శౌరి విజయకుమారి, సలోమి మాట్లాడుతూ.. టీడీపీ నాయకుడు ఆకెపోగు ప్రభాకర్ తన స్థాయి తెలుసుకుని మాట్లాడాలని హితబోధ చేశారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి పి.రాజా విష్ణువర్ధణ్ రెడ్డి, లీగల్‌సెల్ ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రఘు, జిల్లా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీన్స్ ప్యాంట్లు ధరిస్తే తోలు తీస్తాం!
చెవిపోగులపైనా నిషేధం దేశంలో ఎవరూ జీన్స్ ప్యాంట్లు ధరించవద్దు. చెవిపోగులు పెట్టుకోకూడదు. పాశ్చాత్య ఫ్యాషన్లపై ఏ మాత్రం వ్యామోహం పెంచుకోకూడదంటూ ఉత్తర కొరియన్లపై ఆ దేశ నియంత మరిన్ని ఆంక్షలు విధించాడు. దేశవ్యాప్తంగా పాశ్చాత్య పోకడలపై అణచివేతను నియంత కిమ్ జాంగ్ ఉన్ ముమ్మరం చేశాడు. మరీ ముఖ్యంగా చైనాకు సమీపంలో ఉన్న నార్త్ హంగ్వాంగ్, యాంగాంగ్ ప్రావిన్స్‌ల్లో ఈ అణిచివేత ఆదేశాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్దేశించాడు. ఈ ప్రావిన్స్‌ల్లోని ప్రజలకు బయటి ప్రపంచంతో ఎక్కువ అనుబంధం ఉండటంతో, వీరిలో సహజంగానే పాశ్చాత్య ఫ్యాషన్లపై మోజు పెరుగుతున్నదని, ఇది అధికార వర్గాన్ని ఆందోళన పరుస్తున్నదని పరిశీలకులు చెప్తున్నారు. ఉత్తర కొరియా అధికార పార్టీ అయిన వర్కర్స్ పార్టీ 7వ కాంగ్రెస్ త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఈ నిబంధనలను మరింత కఠినంగా అమలుచేయాలని నిర్ణయించినట్టు జపాన్‌కు చెందిన ఏషియా ప్రెస్ తెలిపింది. దేశంలో అత్యధికులు పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆకర్షితులవుతుండటంతో 7వ కాంగ్రెస్ నాటికి దీనిని అణచివేసేందుకు చర్యలు కొనసాగనున్నాయని కొరియాలో జర్నలిస్టుగా పనిచేస్తున్న జపనీయన్ ఇషిమారు జిరో తెలిపారు. కిమ్ జాంగ్ ఉన్‌కు విధేయులైన యూత్ గ్రూప్స్ ఈ నిబంధనలను అమలు చేయనున్నాయని, క్యాపిటలిస్టు టెండన్సీస్ అయిన జీన్స్, మినీ స్కర్ట్, టీ-షర్ట్లు, హెయిర్ స్టైల్‌ను పౌరులు అనుసరించకుండా ఈ గ్రూపులు కాపలా కాయనున్నాయి. దేశంలోని పురుషులంతా రెండు సెంటీమీటర్లకు మించి వెంట్రుకలు పెంచకుండా తన తరహాలోనే హెయిర్ స్టైల్ ను అనుసరించాలని కొన్ని నెలల కిందట కింగ్ జాంగ్ ఉన్ ఆదేశాలు ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. మహిళలేమో తన భార్య రి సోల్ జు బాబ్ హెయిర్ కట్‌ను ఫాలో కావాలని సలహా ఇచ్చారు. పాశ్చాత్య పోకడలు, హెయిర్ స్టైల్ విషయంలో ఎవరైనా ప్రభుత్వ ఆంక్షలతో కూడిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. వారిని పెట్టుబడిదారుల అనుకూలురిగా భావించి నిఘా పెడతామని ఉన్ ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా వరుసగా అణ్వాయుద్ధ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
మాజీ ప్రధాని భార్యపై భారీ ఆరోపణలు!
పేరుకు ఆమె నడిపింది ఓ మానవ హక్కుల సంస్థ. కానీ ఓ నియంతకు కొమ్ముకాసి.. భారీగా సొంత ఖజానా నింపుకొంది. మానవ హక్కులను నిలువునా పాతరేసి.. తన సొంత ప్రయోజనాలను దండిగా కాపాడుకుంది. తన భర్త ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవి నిర్వర్తించినప్పటికీ, ఆమె అవినీతికి పాల్పడేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఈ మేరకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య చెరీ బ్లెయిర్ నిలువునా అవినీతి ఆరోపణల్లో మునిగిపోయి.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మాల్దీవులకు చెందిన అవినీతి నియంత అబ్దుల్లా యమీన్‌తో చెరీ బ్లెయిర్ సాగించిన రహస్య ఆర్థిక వ్యవహారాల గూడుపుఠాణీ బట్టబయలైంది. అబ్దుల్లా యమీన్‌కు అండగా నిలిచినందుకు రోజుకు రెండు వేల పౌండ్ల చొప్పున మొత్తం రెండు లక్షలకుపైగా పౌండ్ల సొమ్ము ఆమె కంపెనీకి ముట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చెరీ కంపెనీ ఒమ్నియా స్ట్రాటెజీకి అక్రమంగా పెద్ద మొత్తం తరలిన ఈ నిధులపై దర్యాప్తు జరిపేందుకు సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్, అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి. మల్దీవులకు నియంత పాలకుడిగా ఉన్నప్పుడు యమీన్ భారీగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన 1700మంది ప్రతిపక్ష కార్యకర్తలను జైళ్లలో బంధించాడు. న్యాయాన్ని అవహేళన చేస్తూ ముగ్గురు ప్రతిపక్ష నేతలను శిక్షించాడు. ఈ నియంత పాలకుడితో చెరీ బ్లేయిర్ సాగించిన అక్రమ ఆర్థిక వ్యవహారాలు తాజాగా డైలీమెయిల్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. - నియంతృత్వ పాలకుడైన అబ్దుల్లా యమీన్ తో ఆరు నెలలపాటు పనిచేసేందుకు 4.20 లక్షల పౌండ్లతో చెరీ బ్లెయిర్ ఓ ఒప్పందం చేసుకుంది. - అంతర్జాతీయంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నానని చెప్పుకొనే చెరీ.. నియంత పాలనలో ఉన్న మాల్దీవుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంతో పనిచేస్తున్నట్టు అప్పట్లో ప్రకటించారు. - కానీ నియంత యమీన్‌కు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆమె కంపెనీకి అక్రమమార్గంలో ఏకంగా 2.10 లక్షల పౌండ్లు ముట్టాయి. వీటిని ఆయుధ సరఫరా వ్యాపారి, ఉగ్రవాది, ఇంటర్ పోల్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు మహమెద్ ఆలం లతీఫ్ ఆమె కంపెనీ ఖాతాలో జమచేయడం గమనార్హం. మల్దీవులు అధ్యక్షుడిగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మహమ్మద్ నౌషధ్ను సైనిక చర్య ద్వారా అబ్దుల్లా యమీన్ గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కోర్టు విచారణలో న్యాయసహాయం కోసం చెరీ బ్లెయిర్ లీగల్ కంపెనీ 'ఒమ్నియా స్ట్రాటెజీ'ని అబ్దుల్లా యమీన్ గత ఏడాది వేసవిలో నియమించుకున్నారు. అయితే ఈ సంస్థ మానవ హక్కులకు సంబంధించి న్యాయసహాయం కోసం కాకుండా అంతర్జాతీయ మీడియా ముందు నియంత ప్రభుత్వాన్ని సమర్థించడానికి, అంతర్జాతీయ దౌత్య సంబంధాలు మెరుగుపరచడానికి లోపాయికారి సహకారం అందించిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. -
డిక్టేటర్ డైరెక్టర్‌తో నాగచైతన్య
యంగ్ హీరో నాగచైతన్య యమ స్పీడు మీద ఉన్నాడు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమాను పూర్తి చేసిన చైతన్య, ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ ప్రేమమ్ రీమేక్‌లో నటిస్తున్నాడు. మజ్ను పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన తదుపరి చిత్రాలను కూడా ఫైనల్ చేస్తున్నాడు. లక్ష్యం, లౌక్యం లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ ఇటీవల డిక్టేటర్ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరున్న శ్రీవాస్, నాగచైతన్య హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే చైతన్యకు కథ వినిపించిన శ్రీవాస్, అతని అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాతో పాటు సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు చైతు. -
'రామారావు గారు'గా బాలయ్య
డిక్టేటర్ సినిమాతో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేకపోయినా, బాలయ్య మాత్రం జోరు తగ్గించటం లేదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే వందో సినిమా కోసం ఇద్దరు దర్శకులను లైన్లో పెట్టిన బాలయ్య నూట ఒకటో సినిమాను కూడా ఫైనల్ చేశాడు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఆదిత్య 999 తరువాత రామారావుగారు అనే ఆసక్తికర టైటిల్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడు. కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన అనీల్ రావిపూడి, ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా సుప్రీం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే బాలకృష్ణ హీరోగా మరో సినిమాను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడు అనీల్. ఇప్పటికే రామారావుగారు కథను బాలయ్యకు వినిపించిన దర్శకుడు త్వరలోనే ఆ కథకు తుది రూపు తీసుకొచ్చేందుకు పని ప్రారంభించనున్నాడు. బాలయ్య వందో సినిమా పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి, ఈ లోగా రామారావుగారు కథను పక్కాగా రెడీ చేసి బాలకృష్ణతో కూడా భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా రామారావుగారి పాత్రలో బాలయ్య కనిపించనున్నాడన్న వార్తతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. -
‘డిక్టేటర్’ సక్సెస్ మీట్
-
త్వరలోనే నా వందో చిత్రం: బాలకృష్ణ
కంబాలచెరువు : డిక్టేటర్ చిత్ర విజయయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరంలోని అనుశ్రీ సినిమాస్ థియేటర్‌కు ఆ చిత్రం హీరో నందమూరి బాలకృష్ణ వచ్చారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు. త్వరలోనే తన వందో సినిమా ఉంటుందన్నారు. అనంతరం ఆ సినిమాలోని డైలాగులతో సందడి చేశారు. హైదరాబాద్‌లో మాదిరిగానే ఉభయగోదావరి, కృష్ణాజిల్లావాసుల కోసం బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని బాలకృష్ణను ఎంపీ మురళీమోహన్ కోరారు. వైజాగ్ నుంచి రోడ్డుమార్గంలో వస్తున్న బాలకృష్ణ ముందుగా తలుపులమ్మ లోవలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ చిత్ర దర్శకులు శ్రీవాస్, సినీనటుడు పృథ్వీరాజ్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్, అనుశ్రీ సినిమాస్ అధినేత సత్యనారాయణ, చిత్ర పంపిణీదారులు చల్లా శంకర్రావు ఉన్నారు. -
బాలకృష్ణను డీల్ చేయడం కష్టమన్నారు...
‘డిక్టేటర్’తో శ్రీవాస్ త్రిబుల్ హ్యాపీ. దర్శకునిగా, నిర్మాతగా, పంపిణీదారునిగా ఈ సినిమా తనకో మరపు రాని విజయమని శ్రీవాస్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో శ్రీవాస్ మీడియాతో చాలాసేపు ముచ్చటించారు... ముందుగా ‘డిక్టేటర్’ రెస్పాన్స్ గురించి చెబుతారా? అద్భుతంగా ఉంది. సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా వచ్చిందని చూసినవాళ్లందరూ అంటున్నారు. బాలయ్య బాబుకి స్పెషల్ ఇమేజ్ తీసుకు రావాలనుకున్నాను. అది నెరవేరింది. సో.. అందరం హ్యాపీగా ఉన్నాం. బాలకృష్ణ కోసమే ఈ కథ రాశారా? అవును. ఆయన కోసమే తయారు చేసిన కథ ఇది. ‘లౌక్యం’ తర్వాత నేను బాలయ్యబాబుని కలిశాను. అప్పుడాయన ‘నా 99వ సినిమాకి నువ్వే దర్శకుడివి. సినిమా చేద్దాం’ అన్నారు. ముందు కథ కూడా వినలేదు. డెరైక్ట్‌గా నన్నే నమ్మారాయన. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే బాలయ్యబాబు అభిమానులు ఆయన ఎలాంటి సినిమాలో నటిస్తే చూడాలనుకుంటారో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా వదులుకోకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కోన వెంకట్, గోపీ మోహన్, నేనూ ఈ కథ చేశాం. ‘డిక్టేటర్’ టైటిల్ పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? కథ రెడీ అవుతున్న టైమ్‌లోనే ఈ టైటిల్ అనుకున్నాం. సెకండాఫ్‌లో వచ్చే హీరో క్యారెక్టరైజేషన్‌కి ఇదే బాగుంటుందనిపించింది. అందుకే అందరం అనుకుని, దీన్నే ఫైనలైజ్ చేశాం. వసూళ్లు గురించి ఏం చెబుతారు... కొంచెం తగ్గాయనీ.. ముఖ్యంగా నైజాంలో డ్రాప్ అయ్యాయనే టాక్ వినపడుతోంది..? సంక్రాంతికి వచ్చిన సోలో సినిమా కాదిది. నాలుగైదు సినిమాలు రావడంవల్ల వసూళ్లు డివైడ్ అవుతాయి. నేనీ చిత్రానికి నిర్మాతగా కూడా చేశాను కాబట్టి, వసూళ్లు గురించి మెసేజ్‌లు వస్తున్నాయి. ఎక్కడా తగ్గలేదు. ఈ సినిమాకి మేం అనుకున్నట్లుగానే వసూళ్లు ఉన్నాయి. ఇక, నైజాంలో బాలయ్య బాబు చిత్రాలకు వసూళ్లు కొంచెం తక్కువగానే ఉంటాయి. మొదటి వారానికే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌జోన్‌లోకి వచ్చేశారు. ఈ వీకెండ్ నుంచి ఓవర్ ఫ్లో మొదలవుతుంది. 98 సినిమాలు చేసిన హీరోతో సినిమా అంటేనే సవాల్. పైగా దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్ చేయడం అంటే ఇంకా సవాల్ కదా. మరి... నిర్మాతగా కూడా ఎందుకు చేశారు? యాక్చువల్‌గా ముందు అనుకోలేదు. డెరైక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే నరసింహారావు అని నా ఫ్రెండ్ ఈరోస్ సంస్థకు ఇన్చార్జ్గా ఉన్నారు. వాళ్లకు తనుఈ ప్రాజెక్ట్ అవుట్‌లైన్ చెబితే, నిర్మించడానికి ముందుకొచ్చారు. అయితే, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్లకు ఎవరైనా కావాల్సి వచ్చింది. ఈ చిత్రం చర్చల్లో భాగంగా నేను ఒకటీ రెండు నెలలు ఈరోస్ వాళ్లతో ట్రావెల్ అయ్యాను. అప్పుడు నా మీద నమ్మకం కుదిరి, నన్నే చేయన్నారు. దాంతో మా పాప ‘వేదాశ్వ’ పేరుతో బేనర్ ఆరంభించాను. ఇప్పటివరకూ నిర్మాతలతో టైఅప్ అయ్యి ఈరోస్వాళ్లు సినిమాలు తీశారు కానీ, డెరైక్టర్‌తో వాళ్లు టైఅప్ కావడం ఇదే మొదటిసారి. బాలకృష్ణను డీల్ చేయడం కొంచెం కష్టం అని కొంతమంది అంటారు.. ఆయనతో మీ ఎక్స్పీరియన్స్? నాతోనూ కొంతమంది అలా అన్నారు. ఆయనతో ట్రావెల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను గమనించింది ఏంటంటే... బాలయ్య బాబు ప్రవర్తన నిజాయతీగా ఉంటుంది. ముందు ఒకటీ వెనకాల ఒకటీ మాట్లాడరు. తనతో పాటు ఉండేవాళ్లు సింగిల్ ఫేస్‌తో ఉండాలనుకుంటారు. నాక్కూడా ఆయనలా ఓపెన్‌గా ఉండటం ఇష్టం. దర్శకుడిగా నేనేం చేద్దాం అనుకుంటున్నాను, నిర్మాతగా ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నాను.. వంటి విషయాలన్నీ క్లియర్‌గా చెప్పేవాణ్ణి. దాంతో కనెక్ట్ అయ్యాం. ఈ చిత్రం కోసం మొత్తం 95 రోజులు పని చేశాం. ఆయన సీరియస్ అయిన రోజు ఒక్కటి కూడా లేదు. బాలయ్య బాబు స్టాఫ్ కూడా ఆశ్చర్యపోయారు. అలాగే, యూనిట్ సభ్యులకు నగదు బహుమతి ఇచ్చారు. సినిమా సక్సెస్ తర్వాత సెపరేట్‌గా అందరికీ పార్టీ ఇచ్చారు. ఇలా ఎప్పుడూ చేయలేదనీ, ఇదే ఫస్ట్ టైమ్ అనీ ఆయన స్టాఫ్ అన్నారు. దాన్నిబట్టి ఈ సినిమా విషయంలో బాలయ్యబాబు ఎంత హ్యాపీ ఫీలయ్యారో అర్థం చేసుకోవచ్చు. మరి.. బాలకృష్ణ మీకేం ఇచ్చారు? ఆయనతో ఏర్పడ్డ అనుబంధం నాకు పెద్ద గిఫ్ట్‌లాంటిది. దానికి విలువ కట్టలేను. ‘మన శ్రీవాస్’ అని తన కుటుంబ సభ్యులందరికీ ఆయన పరిచయం చేశారు. ఎన్టీఆర్గారిలాంటి పేరున్న కుటుంబానికి దగ్గరవ్వడం మంచి అనుభూతి మిగిల్చింది. చంద్రబాబు నాయుడుగారు కూడా ఫోన్ చేసి, మాట్లాడారు. ‘మంచి సినిమా ఇచ్చారు. సంక్రాంతి రోజు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాం. మనవాళ్లందరూ తలెత్తుకుని తిరిగే సినిమా ఇచ్చారు. మనం కలుద్దాం’ అని ఆయన అభినందించారు. మళ్లీ బాలకృష్ణతో సినిమా చేస్తారా? తప్పకుండా. మోక్షు (బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ)తో కూడా చేయాలని ఉంది. కథ కుదిరితే ఎప్పుడైనా చేయడానికి నేను రెడీ. ‘డిక్టేటర్’ డిస్ట్రిబ్యూటర్స్‌కి 15 శాతం డిస్కౌంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఈ చిత్రాన్ని దాదాపు నాకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్సే కొన్నారు. బాలయ్యబాబు సినిమా కాబట్టి డిస్ట్రిబ్యూటర్లందరూ మంచి రేట్‌కే ఈ సినిమా కమిట్ అయ్యారు. అడ్వాన్సులు కూడా ఇచ్చారు. కానీ, ఆ తర్వాత సంక్రాంతికి వేరే చిత్రాల రిలీజ్ కూడా ఉండటంవల్ల అనుకున్న థియేటర్లు వాళ్లకు దొరకలేదు. దానివల్ల డబ్బులు సర్దుబాటు చేయలేకపోయారు. దాంతో ఇబ్బందిపడ్డారు. మామూలుగా ఇలాంటి విషయాలను సినిమా విడుదలకు ముందు చెబుతుంటారు. కానీ, మా డిస్ట్రిబ్యూటర్లు పదిహేను రోజుల ముందే నా దృష్టికి తీసుకు వచ్చారు. నేను ఈరోస్ వాళ్లతో సంప్రతించి, 15 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా చేశా. ఇదంతా కూడా బాలయ్య బాబు సమక్షంలోనే జరిగింది. ఫస్ట్ వీక్‌కే అందరికీ డబ్బులొచ్చేశాయ్. ‘లౌక్యం’లో పృథ్వీ పాత్ర బాగా కామెడీ చేసింది. ‘డిక్టేటర్’లో కామెడీ డోస్ తగ్గించడానికి కారణం ఏంటి? గోపీచంద్‌తో వినోద ప్రధానంగా ‘లౌక్యం’ తీశాను. అందుకని, బాలయ్య బాబుతో ఎలాంటి సినిమా చేస్తానో అని అభిమానులు సందేహం వ్యక్తం చేశారు. బాలయ్యతో ఎక్కువ కామెడీ చేస్తానేమోనని టెన్షన్ పడ్డారు. ఆయనతో కామెడీ చేయలేం. బాలయ్యబాబు అంటే డేంజరస్ జోన్. ఆయనకు తగ్గట్టుగానే ఉండాలి. అందుకని, కామెడీ మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ‘డిక్టేటర్’ని హిందీలో చేస్తారట? ఈ చిత్రం అజయ్ దేవగన్‌కి అయితే బాగుంటుందని ఈరోస్వాళ్లు అనుకుంటున్నారు. ఒకవేళ హిందీలో చేస్తే నేను డెరైక్షన్ చేస్తాను. మీ బేనర్లో ఇతర దర్శకులతో కూడా సినిమాలు చేస్తారా? మంచి కథలతో ఎవరు వచ్చినా ఈరోస్వాళ్లకు సజెస్ట్ చేస్తాను. నచ్చితే చేస్తాం. మీ తదుపరి చిత్రం? త్వరలో చెబుతాను. ప్రస్తుతం ‘డిక్టేటర్’ మూడ్‌లోనే ఉన్నాను. అభిమానులను కలవడం కోసం బాలయ్యబాబు, నేను, ఇంకింతమంది వైజాగ్, విజయవాడ, రాజమండ్రి వెళ్లబోతున్నాం. అందుకే సేఫ్ గేమ్ ఆడాను! కథ రొటీన్‌గా ఉందని కొంతమంది అంటున్నారు.. అలా అనేవాళ్లకి మీ సమాధానం? 'ఆల్రెడీ 98 సినిమాలు చేసిన స్టార్డమ్ ఉన్న హీరోతో సినిమా అంటే ఆ హీరో ఇమేజ్‌కి అనుగుణంగానే వెళ్లాలి. ఆయన అభిమానులు డిసప్పాయింట్ అవ్వకూడదనుకున్నా. బాలయ్యబాబు ఇంతకుముందు చేసిన సినిమాలకకన్నా స్పెషల్‌గా చేయలనుకున్నాను తప్ప ఎవరూ చేయని కొత్త పాయింట్‌తో చేయాలని అనుకోలేదు. నేను పర్సనల్‌గా నమ్మిందేంటంటే.. ఒక పెద్ద కమర్షియల్ హీరోతో అందరికీ అర్థమయ్యే కథనే కొత్తగా చెబితే సక్సెస్ అవుతాం అనుకున్నాను. అలా చేస్తేనే హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుందనుకున్నాను. ఇప్పటివరకూ రాని పాయింట్‌తో చేయడానికి నాకు ధైర్యం సరిపోలేదు. అదే కొత్త హీరోలతోనో, సీ గ్రేడ్ హీరోలతోనో అయితే ఎంత కొత్త పాయింట్ అయినా టచ్ చేస్తాను. కానీ, ఇక్కడ చేయలేను. ఎన్నో ఫ్యామిలీస్, కోట్ల రూపాయల డబ్బు ఇన్వాల్వ్ అయ్యుంటాయి. అందుకని ప్రయోగం చేయడానికి భయపడ్డాను. నావల్ థాట్‌కి ఏసీ డీసీ ఉంటుంది. ఒక్కోసారి క్లిక్ అవ్వచ్చు.. క్లిక్ కాపోవచ్చు. ఒక స్టార్ చేతిలో ఉన్నప్పుడు ఏసీ డీసీ ప్రాజెక్ట్ చేయడానికి ఇష్టపడను. నా నిర్మాతల, డిస్ట్రిబ్యూటర్ల సేఫ్టీ నాకు ముఖ్యం. వాళ్లు హ్యాపీ అంటే.. నాకు చాలు. సంతృప్తిపడిపోతా. ‘పాయింట్ చాలా కొత్తగా ఉంది. ఇప్పటివరకూ ఎవరూ చేయని పాయింట్‌తో తీశారు’ అనే అభినందనలతో ఒక ఫోన్ కాల్, ‘సార్.. మేం కొనుక్కున్న సినిమా పోయింది. మా ఫ్యామిలీలు రొడ్డు మీదకొచ్చేస్తాయ్’ అని మరో ఫోన్ కాల్ అందుకోవడం నాకిష్టం లేదు. అందరి సేఫ్టీ ముఖ్యం. అందుకే సేఫ్ గేమ్ ఆడాను'. -
వందో సినిమాకు కథ అందిస్తున్న బాలయ్య
డిక్టేటర్ తో 99 సినిమాలు పూర్తి చేసిన బాలకృష్ణ, వందో సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ సినిమా కావటంతో ఈ మూవీ ప్రతిష్టాత్మకంగా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్ ఓ వినిపిస్తోంది. ఇప్పటికే బాలయ్య వందో సినిమాకు ఇద్దరు స్టార్ డైరెక్టర్ల పేర్లు వినిపిస్తుండగా తాజాగా మరో కొత్త దర్శకుడు కూడా లైన్ లోకి వచ్చాడు. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త నందమూరి అభిమానులను ఖుషీ చేస్తోంది. తన వందో సినిమాకు తానే స్వయంగా కథ అందించాడట బాలయ్య. ఇప్పటికే బాలకృష్ణ చెప్పిన లైన్ ను డెవలప్ చేసిన సింగీతం శ్రీనివాసరావు పక్కా స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ఆదిత్య 369కు సీక్వెల్ గా ఈ సినిమాకు తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు అఫీషియల్ గా కన్ఫామ్ చేయకపోయినా, తన సొంత కథతోనే బాలయ్య వందో సినిమా ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. -
కొత్త దర్శకుడితో వందో సినిమా...?
డిక్టేటర్ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న బాలకృష్ణ తన వందో సినిమా మీద దృష్టిపెట్టాడు. చాలా కాలంగా ఈ సినిమా విషయంలో కసరత్తులు చేస్తున్న బాలయ్య ఇద్దరు దర్శకులను లైన్లో పెట్టాడు. తనకు సింహా, లెజెండ్ లాంటి భారీ సక్సెస్‌లను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో గాని, తన కెరీర్లో ప్రత్యేక చిత్రాలుగా నిలిచిన ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి చిత్రాలను అందించిన సింగీతం శ్రీనివాస్ దర్శతక్వంలో గాని సినిమా చేయాలని భావించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సరైనోడు సినిమా షూటింగ్లో ఉన్న బోయపాటి ఆ సినిమా తరువాత బాలయ్య సినిమా కథ రెడీ చేయాలని భావిస్తున్నాడు. సింగీతం శ్రీనివాస్ ఇప్పటికే ఆదిత్య 369 సినిమాకు సీక్వల్గా ఆదిత్య 999 స్క్రీప్ట్‌ను సిద్దం చేశారు. దీంతో సింగీతం దర్శకత్వంలోనే బాలయ్య వందో సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. పలు సందర్భాల్లో బాలయ్య కూడా అదే విషయాన్ని వెల్లడించారు. అయితే తాజాగా మరో వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వర్రావు తనయుడు పరుచూరి రవీంద్ర తన తొలి సినిమాను బాలయ్య హీరోగా డైరెక్ట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇప్పటికే ఓ జానపద కథను బాలయ్యకు వినిపించిన రవీంద్ర తన అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాడు. భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు రవీంద్ర. మరి బాలకృష్ణ వందో సినిమా విషయంలో ఇలాంటి ప్రయోగానికి ఓకె చెపుతాడో లేదో చూడాలి. -
వందో సినిమా... ఆదిత్య 999
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ఏ దర్శకుడితో ఉంటుంది? ఎలాంటి చిత్రం చేస్తారు? ఈ ప్రశ్నకు సోమవారం సమాధానం దొరికింది. హైదరాబాద్‌లో జరిగిన ‘డిక్టేటర్’ విజయోత్సవంలో వందో చిత్రం గురించి బాలకృష్ణ స్పష్టంగా ప్రకటించారు. పాతికేళ్ల క్రితం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తాను చేసిన ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా రూపొందనున్న ‘ఆదిత్య 999’ తన వందో చిత్రమని తెలిపారు. ఈ సీక్వెల్ కూడా సింగీతం దర్శకత్వంలోనే రూపొందనుందని చెప్పారు. ఇప్పటికే స్టోరీబోర్డ్‌తో సహా సిద్ధమైన ఈ కథ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. హిట్ అని ముందే చెప్పా! శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ, అంజలి, సోనాల్‌చౌహాన్ ముఖ్యతారలుగా ఈరోస్ ఇంటర్నేషనల్, శ్రీవేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘డిక్టేటర్’ ఈ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘నేనూ, శ్రీవాస్ దాదాపు ఒకేలా ఆలోచిస్తాం. మా ఇద్దరి మనస్తత్వాలూ ఒక్కటే. ఈ సినిమా కోసం ఎక్కడా రాజీపడలేదు. అందుకే 15 కోట్ల తెలుగు ప్రజలు ఈ చిత్రాన్ని మెచ్చారు. ఈ సినిమా హిట్ అవుతుందని శ్రీవాస్‌కి ముందే చెప్పా’’ అన్నారు. ‘‘సినిమా విడుదలైన రోజే దాదాపు 900 ఫోన్లు రిసీవ్ చేసుకున్నా. అందరూ సూపర్‌హిట్ అంటుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని శ్రీవాస్ అన్నారు. ఈ వేడుకలో నటులు సుమన్, రాజీవ్ కనకాల, ఎడిటర్ గౌతంరాజు, సినిమాటోగ్రాఫర్ శ్యాం కె.నాయుడు, రచయిత భాస్కరభట్ల, సోనాల్ చౌహాన్, నటి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
నేనెప్పుడూ అంతే...
దీపానికి పెట్టే పేరు అంజలి. దీపం పెట్టి వెతికినా సినిమాల్లో తెలుగమ్మాయి హీరోయిన్గా కనిపించని దశలో.. అంజలి సినిమా థియేటర్లో వెలిగే దీపం అవుతుందని వాళ్ల అమ్మానాన్న కూడా అనుకోలేదు. పదేళ్లలో పలు భాషల్లో ముప్పై రెండు సినిమాల్లో తెలుగు వెలుగులు విరజిమ్మింది. ఇంటర్వ్యూ అంతా అదే వెలుగు! ‘అలా ఎలా?’ అని అడిగితే.. ‘నేనెప్పుడూ అంతే..’ అంటూ చిరునవ్వులు వెదజల్లింది. కొత్త సంవత్సరం చాలా బిజీగా ఉన్నట్లున్నారు? అవునండీ. చాలా హ్యాపీగా స్టార్టయింది. ‘డిక్టేటర్’కి మంచి పేరొచ్చింది. తమిళంలో ‘ఇరైవి’ రిలీజ్‌కి రెడీ. మమ్ముట్టి సరసన తమిళ ‘పేరన్బు’లో మంచి పాత్ర చేస్తున్నా. తెలుగు, తమిళ షూటింగ్‌లతో హైదరాబాద్, చెన్నైల మధ్య తిరుగుతూ బిజీ బిజీగా ఉన్నా. తెలుగునాట స్థిరపడినట్లేనా? (నవ్వేస్తూ...) గతంలో ఎక్కువగా తమిళంలోనే చేసేదాన్ని. కానీ, ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో - ఒక్కోదానిలో రెండు మూడు చొప్పున చేస్తున్నా. అయితే, ఇప్పుడు నా బేస్ హైదరాబాదే. ఇక్కడే ఉంటున్నా. మీ సెల్ఫీలు వగైరా చూస్తుంటే, కెమేరా ముందే కాదు వెనక కూడా అల్లరి చేసినట్లున్నారు. మీ ఉల్లాస రహస్యం? మామూలుగా నేనెప్పుడూ అంతే! కొంచెం హైపర్. మూడీగా కూర్చోవడం నా వల్ల కాదు. నేనెప్పుడైనా అలా మూడీగా ఉంటే, అందరూ ఏమిటేమిటని అడిగేస్తారు. పుట్టినతేదీ రీత్యా నా రాశి ‘జెమినీ’ (సింహరాశి). నేను డల్‌గా ఉండలేను. అందరినీ నవ్వుతూ పలకరిస్తుంటాను. జీవితంలో ఒడుదొడుకులు వస్తుంటాయి. బీ హ్యాపీ... ఇట్స్ వన్ లైఫ్... అనేది నా సిద్ధాంతం. అంతే! తమిళంలోని మీ పాత్రలు, తెలుగులో చేస్తున్నవీ చూస్తుంటే కొత్త తరహావాటికి ప్లాన్ చేస్తున్నట్లనిపిస్తుంది? ఇక్కడ ప్లాన్ చేయడమంటూ ఏమీ ఉండదు. మన దగ్గరకొచ్చినవాటిలో బెస్ట్ది ఎంచుకోవ డమే. మొదటి నుంచీ పాత్రల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాను. మొత్తానికి సినిమా రంగానికి వచ్చి పదేళ్ళు కావస్తోంది. పాతిక పైనే సినిమాలు చేసేశారు! (నవ్వేస్తూ...) దర్శక - నిర్మాతలు, అభిమానుల అండదండలే కారణం. పదేళ్ళు ఇట్టే గడిచిపోయాయి. పాతిక సినిమాలనే మైలురాయి ఎప్పుడు దాటానో కూడా చూసుకోలేదు. ఆ మధ్య ఇంటర్నెట్ వెతికితే, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు, అతిథి పాత్రలు - అన్నీ కలుపుకొని ఇప్పటికి 32 ఫిల్మ్స్ చేశానని తేలింది. అతిథి పాత్రలన్నారు... హీరోయిన్ అయ్యుండీ, ‘శంకరాభరణం’లో లేడీ గ్యాంగ్ లీడర్‌గా ఎలా చేశారు? నాకెప్పుడూ డిఫరెంట్ తరహా పాత్రలే నచ్చుతాయి. గత ఏడాది ‘గీతాంజలి’ తరువాత బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. అవి చేస్తే, ఏడాదికి కనీసం మూడు, నాలుగు సినిమాలు చేసేయచ్చు. కానీ, అలాంటివే మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల ఫ్లాప్ రావడం తప్ప, మనకు జరిగే మంచి ఏమీ ఉండదు. నా మటుకు నాకు డబ్బు సంపాదన రెండో విషయం. సంతృప్తినిచ్చే పాత్రలు చేయడం మొదటి విషయం. చెట్టూ పుట్టల వెంట తిరుగుతూ డ్యాన్సులు చేసే పాత్రలూ చేయాల్సిందే. కాకపోతే, అలాంటివి ఏటా 3, 4 చేస్తే కానీ, మనం గుర్తుండం. అదే గనక ‘గీతాంజలి’ లాంటివి ఒక్కటి చేయడం వల్ల ఏడాది మొత్తానికి సరిపడా పేరు సంపాదించుకుంటాం. తెలుగమ్మాయి అయిన మీరు తమిళనాడుకు ఎలా? టెన్త్ క్లాస్ వరకు తూర్పుగోదావరి జిల్లా రాజోలులోనే చదువుకున్నా. ఆ తరువాత చెన్నైకి షిఫ్ట్ అయ్యాం. టెన్త్ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో చదివా. అక్కడ చదువు కుంటూ, మోడలింగ్ చేశా. అప్పట్లో నేను డ్యాన్స్ క్లాస్‌కు వెళుతున్నప్పుడే నన్ను చూసి, సినిమాలకు అడిగారు. తెలుగులో దర్శకుడు శివనాగేశ్వరరావు ‘ఫోటో’ తొలి చిత్రం. తమిళంలో తొలి సినిమాతోనే (‘కట్రదు తమిళ్’) మంచి పేరొచ్చింది. ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ దక్కింది. అలా అక్కడ సినిమాలు చేస్తూ వచ్చా. ఒక రకంగా తెలుగులో కన్నా పరాయి భాషలోనే మీకు తొందరగా పేరు, గుర్తింపు దక్కాయేమో! నిజానికి, అప్పుడే తెలుగులోనూ చేసినా, ఇక్కడ తొలి చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. మరోపక్క తమిళంలో విజయాలొచ్చి, అక్కడ వరుసగా ఫిల్మ్స్ చేశా. ‘అంగాడి తెరు’ (తెలుగులో ‘షాపింగ్ మాల్’)తో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ (తెలుగులో ‘జర్నీ)లో ఒరిజనల్ స్కిన్‌టోన్‌లో ఉంటా. అబ్బాయి తరహా దుస్తుల్లో కనిపిస్తా. అదీ బాగా పేరు తెచ్చింది. తెలుగునాట అవన్నీ స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్స్‌లా ఆడే శాయి. చాలామందికి నేను గతంలో చేసిన సినిమాలు తెలీవు. ‘జర్నీ’ తొలి తెలుగు చిత్రం అనుకుంటారు. చిన్నప్పుడు అబ్బాయిల దుస్తుల్లో అల్లరి చేసేవారట! (నవ్వేస్తూ...) బాగానే రిసెర్చ్ చేసినట్లున్నారు. రాజోలులో స్కూల్లో చదువుకొనే రోజులవి. వారంలో మిగిలిన రోజుల్లో యూనిఫామ్ ఉన్నా, శనివారం నాడు సివిల్ డ్రెస్ వేసుకోనిచ్చేవాళ్ళు. అప్పట్లో మా అమ్మను అడిగి, ప్యాంట్లు, షర్ట్స్ లాంటివి కొనిపించుకొని, అవి వేసుకొని వెళ్ళేదాన్ని. దాంతో, మా మాస్టార్ కూడా ‘నువ్వు అమ్మాయిల బెంచీలో కాదు... అబ్బాయిల బెంచీలో కూర్చోవాలి’ అంటూ ఆట పట్టించేవారు. క్లాసులు ఎగ్గొట్టి, సినిమాలకు వెళ్ళిన అనుభవాలు? ఒకే ఒక్కసారి అలా చేశా! టెన్త్ క్లాస్ చదువుతున్న ప్పుడు ‘నువ్వే కావాలి’ సినిమాకు క్లాసు ఎగ్గొట్టి వెళ్ళా. దక్షిణాది భాషలన్నిట్లో చేస్తున్నారు. ఒకేసారి రెండు, మూడు పడవల్లో కాలుమోపడం వల్ల కష్టమేమో? అవకాశాలు వచ్చినప్పుడు ఇతర భాషల్లో చేస్తే తప్పేంటి? ఒకటికి, నాలుగు భాషల్లో చేయడం వల్ల అన్ని భాషలూ తెలుస్తాయి. కన్నడంలో ఈ ఏడాది ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ సరసన ‘రణ విక్రమ’ అనే సినిమా చేశా. కష్టమైన పాత్ర. ప్రశంసలొచ్చాయి. కానీ హీరోయినై ఉండి... చిన్న పాత్రలూ చేయడం... (మధ్యలోనే అందుకుంటూ...) నిడివి కన్నా సినిమాలో నేను పోషించే ఆ పాత్ర ప్రాధాన్యం ఏమిట న్నది ముఖ్యం. క్యారెక్టర్ కొత్తగా ఉంటే ఒప్పేసుకుంటా. అయితే, ‘శంకరాభరణం’లో విలన్ పాత్రకు రచయిత కోన వెంకట్ మీకు ఏం చెప్పి, ఒప్పించారు? ఆ పాత్ర నేనే చేయాలని కోన పట్టుబట్టారు. గ్యాంగ్ స్టర్ మున్నీ పాత్ర నాకెలా కుదురుతుంద నుకున్నా. ఆ మాటే అన్నా కూడా. కానీ, క్యారెక్టర్ ప్రాధాన్యం చెప్పి, కొత్త ట్రెండ్ అవుతుందనడంతో ఒప్పుకున్నా. ఆ సినిమాలో ప్రత్యేకగీతం చేయడంలో వ్యూహం? నిజానికి, మొదటి ప్లాన్‌లో దీన్ని అతిథి పాత్రగానే అనుకున్నాం. పాట అనుకోలేదు. తీరా మున్నీ దీదీ పాత్ర స్వభావం చెప్పేపాట పెడితే, హెల్పవుతుందనుకున్నాం. పాట వినగానే, ష్యూర్ షాట్ హిట్ అని కూడా అర్థమైంది. కానీ, తీరా సినిమా ఆశించినట్లు హిట్టవలేదుగా! కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా, నాకు పేరొచ్చింది. మొత్తానికి, మీరిప్పుడు ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ అయ్యారు. తమిళ ‘కో’ (తెలుగులో ‘రంగం’) నుంచి వరుసగా ఐటమ్ సాంగ్స్‌లో కనిపిస్తున్నారు! ఒక్కమాట! అవేమీ ఐటమ్ సాంగ్స్ కావు... స్పెషల్ సాంగ్స్. ‘రంగం’లో చేసింది అతిథి పాత్ర అనుకోవచ్చు. ‘సింగమ్-2’లో దర్శకుడు హరి, హీరో సూర్య అడగ డంతో హీరో పరిచయ గీతం కాబట్టి ఒప్పుకున్నా. ‘సరైనోడు’లో అల్లు అర్జున్‌తో పాట చేస్తున్నారుగా! ‘శంకరాభరణం’లోని నా ‘ఘంటా...’ పాట టీజర్ చూసి, దర్శకుడు బోయపాటి శ్రీను అడిగారు. ఇది కూడా స్పెషల్ సాంగే. పైగా, ‘ఘంటా...’ పాట కంపోజ్ చేసిన శేఖర్ మాస్టరే ఆ పాటా చేస్తున్నారు. అల్లు అర్జున్ పక్కన నాకూ సరిసమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే, ఒప్పుకున్నా. సినిమా చూశాక మీకూ అర్థమవుతుంది. స్పెషల్ సాంగ్స్‌కి మీరూ రెమ్యూనరేషన్ పెంచేశారా? (నవ్వేస్తూ...) అదేమీ లేదు. అయినా, ఎవరైనా సరే డిమాండ్ ఉన్నప్పుడేగా నాలుగు డబ్బులు సంపాదించు కోవాలి! మార్కెట్లో దేనికైనా సేల్స్ బాగా ఉన్నప్పుడే ధర పెంచుతారు. హీరోయిన్ మార్కెట్ తగ్గిపోయాక, ఎవరూ ఆమెకు అంత పారితోషికమివ్వరుగా! మరి మంచి పాత్రైనా పరిమిత బడ్జెట్ ఫిల్మ్ అయితే? నటీనటులు కూడా కరాఖండిగా ఏమీ ఉండట్లేదు. మంచి పాత్ర అయ్యుండి, సినిమాకు పెద్ద బడ్జెట్ లేదంటే, పారితోషికాలు తగ్గించుకుంటున్నారు. నేనూ అంతే! పారి తోషికం తగ్గించుకుంటా కానీ, మంచి పాత్ర వదులుకోను. ఏమైనా ఆశించినన్ని పాత్రలు, గుర్తింపొస్తున్నాయా? చూడండి. ‘డిక్టేటర్’లో చేశా. విష్ణు సరసన అడిగారు. మరోపక్క ‘చిత్రాంగద’లో నటిస్తున్నా. ‘పిజ్జా’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు డెరైక్షన్‌లో ‘ఇరైవి’, అలాగే ‘తరమణి’ - ఇలా తమిళంలో మూడు, నాలుగు సినిమాలు ఉన్నాయి. మలయాళంలో చేస్తున్నా పదేళ్లలో 32 ఫిల్మ్స్ చేయడ మంటే, గుర్తింపున్నట్లేగా! ఇంకెందుకు, భయం, బెంగ!! మీరు దేనికీ భయపడరా? (నవ్వేస్తూ..) ఎందుకు భయపడను! భయపడతాను. కానీ, దేనికి భయపడతానో చెప్పను. ఎందుకంటే... రేపటి నుంచి అందరూ నన్ను అలా భయపెట్టేస్తారుగా! (నవ్వు) మరి, మీ ప్రధానమైన బలం? గర్వం లేకపోవడం! అందర్నీ నవ్వుతూ పలకరిస్తా. ఎవరితోనైనా ఇట్టే స్నేహం చేస్తా. అది నా ఎస్సెట్. మీ మేనిఛాయ బాగుంటుంది. ఆ టిప్ చెబుతారా? ఐ డోన్ట్ ఫాలో బ్యూటీ టిప్స్! ఫేషియల్స్‌కి, కెమికల్ ట్రీట్మెంట్స్కి నేను దూరం. ఎక్కడ ఉన్నా మానసికంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తా. మీ కుటుంబ వివరాల మాటేంటి? నేను... మా అమ్మ. నాకు ఇద్దరు అన్నలు. అక్కయ్య. హైదరాబాద్‌లోనే అక్కయ్య ఉంటుంది. నేను ఆఖరు! ఆ మధ్య కుటుంబ వివాదాల్లో ఉన్నారు. తగ్గాయా? టైమ్ పడుతుందండీ! ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యలుంటాయి. కాకపోతే, మేము సినీ నటులం కాబట్టి, మా గురించి బయటకు వస్తుంటుంది. అంతే! కోన వెంకట్ లాంటి శ్రేయోభిలాషులు కాకుండా, ఇండస్ట్రీలో మీకు మంచి స్నేహితులంటే... చాలామందే ఉన్నారు. ఒకరి పేరు చెప్పి, ఇంకొకరి పేరు చెప్పకపోతే - బాగుండదు. ఈ పదేళ్ళ ప్రయాణంలో మీ కెరీర్ బెస్ట్ ఫిల్మ్స్? ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గీతాంజలి’. తమి ళ్లో ‘అంగాడి తెరు’, ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’. మల యాళంలో, కన్నడంలో చేసినవి తక్కువే. మలయాళంలో ‘పయ్యన్స్’, కన్నడంలో ‘రణవిక్రమ’ గుర్తుంచుకోదగ్గవి. - రెంటాల జయదేవ -
నా 100వ సినిమాలో మోక్షజ్ఞ: బాలకృష్ణ
తిరుపతి: కొత్త శకానికి సంక్రాంతి పండుగ నాంది పలకాలని సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఈ సారి ఆయన సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని,దేవుడు చల్లని చూపు చూడాలని, పంటలు బాగా పండాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ కేబినెట్ విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టమన్నారు. అయితే అవకాశం వస్తే సమర్థవంతంగా పని చేస్తానని బాలయ్య తన మనసులోని మాటను బయటపెట్టారు. హిందుపురం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని బాలకృష్ణ అన్నారు. ఇక తన వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై బాలకృష్ణ పలు విషయాలు వెల్లడించారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ 'చివరికి సినిమాల్లోకే రావాలి కదా...నా వందో సినిమాలో మా అబ్బాయి నటించవచ్చు' అని తెలిపారు. డిక్టేటర్ సినిమాపై బాలకృష్ణ మాట్లాడుతూ...అభిమానులకు ఆ సినిమా ఫుల్ ప్లేట్ మీల్స్‌గా ఉందని, అన్ని అంశాలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు బాలయ్య ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తన సినిమాల్లో హీరోతో పాటు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ కూడా మహిళల అభ్యున్నతికి కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. -
అభిమానుల... డిక్టేటర్
తారాగణం: బాలకృష్ణ, అంజలి, కథ -స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, కెమేరా: శామ్ కె. నాయుడు, సంగీతం: తమన్, నిర్మాత: ఈరోస్ ఇంటర్నేషనల్, సహ నిర్మాత, దర్శకత్వం: శ్రీవాస్ పవర్ఫుల్ టైటిల్స్ పెట్టుకోవడం ఒక ఎత్తు. అంతకు అంత పవర్ఫుల్ డైలాగులు చెబుతూ, అలవాటైన హావభావాలతో నటించి, మెప్పించడం మరో ఎత్తు. ఈ రెండు విషయాల్లోనూ జగమెరిగిన నటుడు బాలకృష్ణ. ‘సింహా’, ‘లెజెండ్’, ‘లయన్’ తరువాత ఇప్పుడు ఆయన ‘డిక్టేటర్’ని అన్నారు. సామాన్యుడిలా ప్రశాంత జీవితం గడిపే హీరో... ఎవరినో, ఎలాగో రక్షిస్తున్న టైమ్‌లో అతను సామాన్యుడు కాదు, ఘనచరితుడని ఎవరో బయటపెట్టడం... ఆ షాకింగ్ ఘట్టం దగ్గర ఇంటర్వెల్... సెకండాఫ్ మొదలవగానే, మామూలు మనిషిగా బతుకుతున్న ఆ మహోన్నత హీరో ఘనచరిత్ర ఫ్లాష్ బ్యాక్... అది అయిపోగానే, హీరో మళ్ళీ ధర్మసంస్థాపనార్థం సామాన్యుడి వేషం వదిలేసి, విలన్లను మట్టికరిపించడం. అప్పుడెప్పుడో సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘బాషా’ రోజుల నుంచి ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్త కావు. ఈ చట్రంలోనే ‘సమరసింహారెడ్డి’ మొదలైన అనేక చిత్రాల్లో బాలకృష్ణను చూసేసిన ప్రేక్షకులకు ఈ ‘డిక్టేటర్’ మరో కొత్త వెండితెర వడ్డింపు. కథేమిటంటే, అనగనగా ఒక మినిస్టర్‌గారి కొడుకు. అతగాడు, అతని రౌడీ ఫ్రెండ్ డ్రగ్స్ దంధాలో ఉండగా, ఒక ఇన్స్పెక్టర్ (రవిప్ర కాశ్) పట్టుకోవాలని చూస్తాడు. సహజంగానే ఆ ఇన్స్పెక్టర్ని చంపేసి, ఆత్మహత్య అని లోకాన్ని నమ్మిస్తారు. తీరా ఆ హత్యను క్యాటరింగ్ ఉద్యోగి (రాజీవ్ కనకాల) చూస్తాడు. నటి అవ్వాలనుకొనే అతని చెల్లెల్ని (సోనాల్ చౌహాన్)ను విలన్లు వెంటాడి వేధిస్తారు. కిడ్నాప్ చేస్తారు. మాల్లో పనిచేస్తూ, అనుకోకుండా ఆమెకి దగ్గరైన చందు (బాలకృష్ణ) ఆమెను కాపాడి, ఏకంగా ఆ రౌడీ గ్యాంగ్ మనుషుల్ని చంపేస్తాడు. తమ వాళ్ళను చంపేసిన హీరో కోసం విలన్లు ఢిల్లీ, రాజస్థాన్ల నుంచి వస్తారు. అప్పటి దాకా కనిపించని బిజినెస్ మ్యాగ్నెట్ లైన హీరో అన్న (సుమన్) కూడా తమ్ముణ్ణి వెతుక్కుంటూ వస్తాడు. సామాన్యుడిలా తిరుగుతున్న హీరో నిజానికి ‘డిక్టేటర్’గా పేరు పడ్డ లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్య నేత చంద్రశేఖర్ ధర్మా అని అర్థ మవుతుంది. అక్కడికి ఇంటర్వెల్. సెకండాఫ్‌లో అతని పాత కథ ఫ్లాష్ బ్యాక్. అతను ప్రేమించి పెళ్ళాడిన మధ్యతరగతి అమ్మాయి కాత్యా యని (అంజలి) ఏమైంది, ఢిల్లీలో హీరోతో ఢీ అంటే ఢీ అన్న మహి మారాయ్ (రతీ అగ్నిహోత్రీ) కథేంటి, హీరో అయినవాళ్ళని వదిలేసి ఎందుకున్నాడు, చివరకు మళ్ళీ ఢిల్లీ వెళ్లి ఏం చేశాడన్నది సినిమా. లక్షల కోట్ల వ్యాపారానికి అధినేత చంద్రశేఖర్ ధర్మాగా బాలకృష్ణ స్టైలిష్‌గా కనిపిస్తారు. ఫస్టాఫ్‌లో మాల్లో పనిచేసే మామూలు మనిషి చందుగా ఒదిగిపోవడానికి ప్రయత్నించారు. పాత్రపోషణలో తీవ్రత ఆయనకు అలవాటే. ఆహార్యం బాగుంది. శరీరంపై అదుపు, మాటల్లో పొదుపుతో ఇంకా బాగుంటారనిపిస్తుంది. సోనాల్ చౌహాన్ ‘వాట్సప్ బేబీ’ పాటకూ, కథ పురోగతికీ పనికొచ్చారు. సెకండాఫ్‌లో కాత్యా యనిగా తెలుగమ్మాయి అంజలి నటించారు, నాజూగ్గా ఉన్నారు. అల్లుడు విశ్వంభర్తో కలసి ఢిల్లీలో చక్రం తిప్పే అత్తగారిగా నాటి హీరోయిన్ రతీ అగ్నిహోత్రీ తెలుగు తెరపై మెరిశారు. ఆమె, ఆమె అల్లుడి పాత్రలు చిన్నవైనా, అవి సమకాలీనమైనవేనని తెలుస్తుంది. ఫస్టాఫ్‌లో చెప్పడానికి తగినంత కథ లేకపోవడంతో, ఎక్కువగా కాలనీలో సీన్లు, కామెడీపై ఆధారపడ్డారు. వాటిలో ఎంత వినోదం పండిందో చటుక్కున చెప్పేయలేం. పట్టుగా సాగే ఇంటర్వెల్ సీన్ తర్వాత సెకండాఫ్‌లోనే ఉన్న కొన్ని బలమైన సీన్లే వ్యవహారమంతా! ఇక సినిమాలో కావలసినన్ని ట్విస్టులు పెట్టారు. ఎక్కడికక్కడ కావాల్సినట్లుగా సినిమాను ముందుకూ నడిపారు. మినిస్టర్ కొడుకు హత్య చేయడం చూసిన రాజీవ్ కనకాలను విలన్లు వెతకడంతో మొదలయ్యే ఈ సినిమాలో సెకండాఫ్ నుంచి కన్వీనియంట్‌గా అతను కనిపించడు. అతని చెల్లెలైన సోనాల్చౌహాన్ను హీరో రక్షించడం ఫస్టాఫ్‌లోనే అయిపోయాక కథలో ఆమెపనీ ఉండదు. కనిపించదు. కడుపులో కత్తిపోటుతో కోమాలోకి వెళ్ళిన అంజలి ఆఖరులో మళ్ళీ వస్తారు. నిర్మాణ విలువలు, కెమేరా వర్క కనిపించే ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లాంటి చోట్ల, కొన్ని స్టెప్పుల్లో బాలకృష్ణ శ్రమా తెలుస్తుంది. ‘గం గణేశా’ పాట చిత్రీకరణ, గణపతిని గుర్తుచేసే స్టెప్పులు బాగున్నాయి. ‘నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో. నా బ్లడ్‌కే హిస్టరీ ఉంది’లాంటి బాలయ్య మార్క పంచ్ డైలాగ్స్ సీన్‌కు ఒకటికి రెండున్నాయి. ‘నాన్నగారి’ ప్రస్తా వనలు, ‘నాన్నగారి జ్ఞాపకాల జోలికొస్తే చంపేస్తా’లాంటి వార్నింగ్‌లూ పెట్టారు. హిందీ పంచ్ డైలాగ్ అదనం. ముమైత్‌ఖాన్, శ్రద్ధాదాస్‌లతో ఐటవ్ుసాంగూ పెట్టారు. వెరసి, కథ తెలిసిందే అయినా, ఢిల్లీ, బల్గేరియా లాంటి నేపథ్యాల్లో ఎంత కొత్తగా చెప్పారన్నదే ఆసక్తి. అందుకు లోపం లేకుండా ప్రయత్నించారు. ‘నేను సంపాదించేటప్పుడు లెక్కలు చూస్తాను కానీ, చంపేటప్పుడు లాజిక్‌లు చూడను’ అన్నది ఈ సినిమాలో వచ్చే హీరో డైలాగ్సలో ఒకటి. దాంతో ఈ ‘డిక్టేటర్’లో మనం చూడాల్సినదేమిటో, చూడకూడనిదేమిటో సుస్పష్టం. ఏతావతా భోగి నాటికే 3 కొత్త రిలీజ్లొచ్చినఈ సంక్రాంతి సీజన్లో బాక్సాఫీస్ వద్ద ఎవరు ‘డిక్టేటర్’ అన్నది వేచి చూడాలి. ఎన్ని సినిమాలొచ్చినా, ఎంత స్టార్సున్నా ఆఖరికి టికెట్ కొనివెళ్ళిన ప్రేక్షకుడే వాటి బాగోగులు నిష్కర్షగా తేల్చే అసలైన డిక్టేటర్! ‘డిక్టేటర్’ సినిమా స్టైల్లో చెప్పాలంటే, ‘హీ ఈజ్ నాట్ రాంగ్!!’ - రెంటాల జయదేవ -
'డిక్టేటర్' బాలయ్యతో చిట్ చాట్
-
'డిక్టేటర్' మూవీ రివ్యూ
సంక్రాంతి బరిలో మంచి రికార్డ్ ఉన్న నందమూరి బాలకృష్ణ తన 99వ చిత్రం డిక్టేటర్తో మరోసారి పండుగ రేస్ లో నిలిచాడు. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్లో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్‌లో తెరకెక్కిన డిక్టేటర్ మరో రెండు భారీ చిత్రాలతో పోటీ పడుతోంది. మరి నందమూరి అందగాడు సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ సక్సెస్ సాధించాడా...? డిక్టేటర్‌గా బాలయ్య బాక్సాఫీస్ కలెక్షన్లను శాసించాడా..? కథ : చంద్రశేఖర్ ధర్మ ( బాలకృష్ణ) ఢిల్లీలో పెద్ద బిజినెస్ మేన్. తన సంపదతో దేశ ఆర్ధిక వ్యవస్థనే శాసించే స్ధాయి వ్యాపార వేత్త. అప్పటి వరకు మాఫీయా వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారవేత్తలకు తను అండగా ఉంటూ అందరినీ కాపాడుతుంటాడు. అదే సమయంలో తన పవర్‌తో రాజకీయాలను, మాఫీయాను శాసిస్తుంటుంది మహిమా రాయ్(రతీ అగ్నిహోత్రి). ఒక ఫ్యాక్టరీ విషయంలో చంద్రశేఖర్ ధర్మ, మహిమా రాయ్ లకు గొడవ అవుతుంది. ఆ ఫ్యాక్టరీని దక్కించుకోవటం కోసం చంద్రశేఖర్ ధర్మకు కావాల్సిన వ్యక్తిని మహిమా రాయ్ అల్లుడు చంపేస్తాడు. దీంతో చంద్రశేఖర్ ధర్మ అతన్ని ఎలాగైనా చంపాలనుకుంటాడు. ఈ గొడవల్లో చంద్రశేఖర్ ధర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాత్యాయని (అంజలి)ని మహిమారాయ్ మనుషులు పొడిచేస్తారు. చంద్రశేఖర్ ధర్మకు మహిమా రాయ్‌తో ఉన్న గొడవలు కారణంగా తాము కూడా చనిపోవాల్సి వస్తుందేమో అన్న భయంతో కుటుంబం కూడా చంద్రశేఖర్ ధర్మను దూరం చేస్తుంది. అలా ఢిల్లీ నుంచి వెళ్లిపోయిన చంద్రశేఖర్ ధర్మ మళ్లీ ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు. చివరకు మహిమారాయ్, ఆమె అనుచరులు ఏం అయ్యారు అన్నదే మిగతా కథ. నటీనటులు : చంద్రశేఖర్ ధర్మగా పవర్ఫుల్ రోల్లో కనిపించిన బాలకృష్ణ మరోసారి తన మార్క్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారీ డైలాగ్‌లతో ఆడియన్స్‌తో విజిల్స్ వేయించాడు. ఫస్టాఫ్‌లో కూల్‌గా, సెకండాఫ్‌లో పవర్‌ఫుల్‌గా రెండు షేడ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎక్కువగా మాస్ పాత్రలలోనే కనిపించే బాలకృష్ణ ఈ సారి స్టైలిష్‌గా కనిపించి మెప్పించాడు. తొలిసారిగా బాలయ్యతో జోడి కట్టిన అంజలి మరోసారి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మెప్పించింది. ఇక కథతో సంబంధం లేకపోయినా కేవలం అందం కోసమే పెట్టుకున్న సోనాల్ చౌహాన్ బాగానే గ్లామర్ ఒలకబోసింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన రతీ అగ్నిహోత్రి విలన్‌గా మెప్పించింది. నాజర్, సుమన్, శియాజీ షిండే, 30 ఇయర్స్ పృధ్వీలు తమ పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : ఇప్పటి వరకు ఎక్కువగా కామెడీ టచ్ ఉన్న కథలు మాత్రమే డీల్ చేసిన శ్రీవాస్. బాలయ్య స్టామినాకు తగ్గ సినిమా చేయటంలో కాస్త తడబడినట్టుగా అనిపించింది. ముఖ్యంగా రెండున్నర గంటల పాటు చెప్పేంత కథ లేకపోవటంతో ఫస్టాఫ్ అంతా కథతో సంబంధం లేని సీన్స్‌తో నింపేశాడు. ఇక అసలు కథలో ఎంటర్ అయిన తరువాత కూడా సినిమాలో వేగం కనిపించలేదు. కోన వెంకట్, గోపి మోహన్‌లు మరోసారి రొటీన్ కథతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. చాలా పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్టుగా అనిపిస్తోంది. ఎం. రత్నం మాటలు బాగున్నాయి. బాలయ్య అభిమానులతో విజిల్స్ వేయించే పంచ్ డైలాగ్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. థమన్ సంగీతం ఫరవాలేదనిపించింది. పాటలు విజువల్‌గా బాగున్నాయి. చిన్నా అందించిన నేపధ్య సంగీతం చాలా చోట్ల ఆకట్టుకుంటుంది. శ్రీవాస్ సినిమాలలో ఆశించే స్థాయి కామెడీ ఎక్కడా కనిపించలేదు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : బాలకృష్ణ సినిమాటోగ్రఫి నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ స్టోరి మ్యూజిక్ ఫస్టాఫ్ ఓవరాల్ గా డిక్టేటర్ బాలయ్య అభిమానులను అలరించే కమర్షియల్ ఎంటర్ టైనర్ సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ -
మేమిద్దరం హీరోలమే!
♦ మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనిషి. భోళా శంకరులు. మీకు... ఈ ‘డిక్టేటర్’ అనే టైటిల్‌కూ... (నవ్వుతూ... అందుకుంటూ...) భోళా శంకరులే డిక్టేటర్లు. అది మా నాన్నగారి నుంచొచ్చింది. పదిమందితో సంప్రతిస్తారు. చివరకు తీసుకొనే నిర్ణయం తీసుకుంటారు. ఆవేశంతో చేయకపోతే, కొన్నిపనుల్చేయలేం. నేనూ అంతే! ♦ ‘సింహ’, ‘లెజెండ్’, ‘లయన్’, ‘డిక్టేటర్’ - ఇలా పవర్ఫుల్ టైటిల్స్‌తో అంచనాలెక్కువవుతాయే! ‘డిక్టేటర్’ టైటిల్ కథ అనుకున్నాక పెట్టినదే. నాకీ టైటిల్‌పై అనుమానమేమీ లేదు కానీ, ‘ఇంత బరువైన టైటిల్ పెడుతున్నాం. కాబట్టి, సబ్జెక్ట్, క్యారెక్టరైజేషన్లో అప్రమత్తంగా ఉందాం’ అని దర్శకుడితో అన్నా. అలాగే అన్నీ కుదిరాయి. ♦ ‘డిక్టేటర్’ నేపథ్యం కూడా కొత్తగా ఉంటుందేమో! ప్రభుత్వం ఎవరిదైనా, సారథులు ఎవరైనా - దేశ ఆర్థిక వ్యవస్థను శాసించేదంతా కొందరు వ్యాపారవేత్తలే! అలాంటి కుటుంబవ్యక్తిగా కనిపిస్తా. ఢిల్లీ నేపథ్యంలో కథ ఉంటుంది. ♦ రసవత్తరమైన సమకాలీన రాజకీయం ఉందట! ఉంది. కానీ అంతా జనరల్‌గానే తప్ప ఎవర్నీ ఉద్దేశించినది కాదు. ఆనాటి ప్రముఖ నటి రతి అగ్నిహోత్రీ నాతో ఢీ అంటేఢీ అనే పొలిటీషియన్. ♦ ముందుగా హేమమాలినిని అనుకున్నట్లున్నారు! హేమమాలిని, షబనా అజ్మీ- ఇలా చాలా మందిని అనుకున్నాం. కుదరలేదు. ఇంతలో మా డెరైక్టర్ శ్రీవాస్ గారికి రతి పేరు గుర్తొచ్చింది. ఫ్రెష్‌నెస్ ఉంటుందని వెంటనే ఓకె అనేశా. గతంలో మేమిద్దరం ‘వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా చేశాం. ♦ ఈ చిత్రంలో మీతో తొలిసారిగా నటిస్తున్న అంజలిని మహానటి సావిత్రితో పోల్చినట్లున్నారు! అవును. నేనెప్పుడూ నా పాత్రే కాకుండా, నా పక్కన ఉండే పాత్రలు బాగుండాలని చూస్తా. పాత్రధారులు మంచి నటులై ఉండాలని చూస్తా. అప్పుడే కదా... మంచి కెమిస్ట్రీ, టైమింగ్ కుదిరి, సీన్ పండుతుంది. హీరోయిన్లందరినీ అరువు తెచ్చుకుంటున్న రోజుల్లో ఆమె తెలుగమ్మాయి. అటు అందంతో పాటు అభినయం ఉన్న మంచి ఆర్టిస్ట్. ఇలా నటీనటులు, సాంకేతిక నిపుణులం అంతా ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తాం. ♦ మీతో అందరూ భయంగా, గౌరవంగా ఉంటారు కదా! ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఎలా తెస్తారు? సినిమా మొదలుపెట్టినప్పుడు మొదట సెలైంట్‌గా ఉంటా. నాలుగైదు రోజులు అబ్జర్వ్ చేస్తా. లైట్‌బాయ్ నుంచి దర్శకత్వ శాఖ దాకా ఎవరు పనిచేస్తారో, ఎవరు పనిదొంగో గమనిస్తా. పనిమంతుల్ని గుర్తించి, ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత అప్పచెబుతాను. షూటింగ్లో టెంపో పెరిగే కొద్దీ, అందరూ లీనమవుతారు. ప్రాజెక్ట్‌లో భాగస్థులమనే ఫీలింగ్ క్రియేటవుతుంది. ♦ కానీ, అందరూ మీరు కోపధారి అంటారెందుకు? నిజజీవితంలో నటించడం నాకు చేతకాదు. పెద్ద విషయాల కన్నా చిన్న చిన్నవాటికే నాకు కోపమొస్తుంది. ‘క్రీమ్ ఆఫ్ ఎయిటీస్’ అని నేను, చిరంజీవి, వెంకటేశ్, అలాగే దక్షిణాది తారలు రజనీకాంత్, మోహన్‌లాల్, సుహాసిని, కుష్బు - ఇలా చాలామందిమి సరదాగా కలుస్తుంటాం. వ్యక్తిగత హోదాలన్నీ మర్చిపోయి, సరదాగా గడపాలని అలా ఒక్కోచోట కలుస్తాం. అందరితో కలసి, గ్రూప్ ఫోటోలు దిగుతుంటే, ‘బాలా! వచ్చేయ్... కిందకు!’ అని సుహాసిని అంది. ఏమి టంటే, ‘రజనీకాంత్ వచ్చారు’ అంది. అందరం ఒకటనుకొని కలిస్తే, తేడాలు చూపించేసరికి నాకు సర్రున కోపం వచ్చింది. ‘రజనీ సారేంటి? ఎవడు సూపర్‌స్టార్?’ అని అరిచా. ‘ఫోటో తియ్యండి’ అన్నా. అయ్యాకే కిందకు వచ్చా. నేను పర్ఫెక్ష నిస్ట్ని. నా చుట్టూ అందరూ అలానే ఉండాలను కుంటా. లేకపోతే కోపమొస్తుంది. ♦ ‘డిక్టేటర్’ 99వ సినిమా. వందో సినిమా ఏంటి? (నవ్వేస్తూ...) నాకు ఏ ప్లాన్లూ ముందుగా ఉండవు. అందరూ ‘వంద సినిమాలు చేసేశారు’ అంటున్నారు. నేను మాత్రం ‘వంద సినిమాలేనా చేశాను’ అంటాను. అయితే, వంద సినిమాలనే సంఖ్య ఒక మైలురాయి. ముఖ్యంగా ఫ్యాన్స్‌కి! 41 ఏళ్ళ క్రితం బాల నటుడిగా ప్రవేశించా. బాగా చదువుకోవాలని మధ్యలో మా నాన్న గారు ఆపకపోతే, ఈపాటికి 150 నుంచి 200 సినిమాలు చేసి ఉండేవాణ్ణి. కానీ, నిజామ్ కాలేజ్‌లో చదువుకోవడం వల్ల ప్రపంచజ్ఞానం పెరిగింది. ఎంతోమందితో పరిచయాలొచ్చాయి. నా కాలేజ్‌మేట్స్ - కిరణ్‌కుమార్‌రెడ్డి సి.ఎం అయ్యాడు. సురేష్ రెడ్డి స్పీకర్ అయ్యాడు. అంతా ఎంతో ఎదిగారు. కాలేజ్ చదువు లేకపోతే, వీళ్ళందరితో సాంగత్యం పోగొట్టుకొనేవాణ్ణి. అందుకే, మా పిల్లల విషయంలో కూడా చదువుకే ప్రాధాన్యమిచ్చా. వాళ్ళూ బాగా చదువుకున్నారు. ♦ మీ అబ్బాయి మోక్షజ్ఞ మీ వందోసిన్మాలో ఎంట్రీట! (నవ్వేస్తూ...) ఏమో అవ్వచ్చు. ఆలోచనలు న్నాయి. ఎలా టర్న్ తీసుకుంటాయో చెప్పలేం! ఏదైనా అప్పటికప్పుడు వేడివేడిగా నిర్ణయం తీసు కోవాలి. ఆచరించాలి. నాన్చడం ఇష్టం ఉండదు. ♦ నూరో సినిమా బోయపాటి దర్శకత్వంలోనేనా? (నవ్వేస్తూ) చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏమీ అనుకోలేదు. ఏమైనా, రెండు నెలలు అంతా సిద్ధం చేసుకొని, మార్చి కల్లా వందో సినిమా పట్టాల మీదకు ఎక్కిస్తాం. అప్పటికి బోయపాటి రెడీగా ఉంటే సరే, ‘లేదు. నాలుగైదు నెలలు టైమ్ పడుతుం’దంటే, అంతకాలం ఆగలేను. వెంటనే మరొకరితో, ఇంకో సినిమా, పాత్ర చేయాల్సిందే. ♦ సింగీతంతో ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేస్తారనీ... స్టోరీ బోర్డ్‌తో సహా అది సిద్ధంగా ఉంది. చూడాలి. ఏమైనా, ఒక వారంలో ఈ సంక్రాంతి పండుగ తర్వాత నిర్ణయం తీసుకుంటా! ♦ వందో సినిమా తర్వాత పూర్తిగా ప్రజాసేవకేనా? లక్షలాదిప్రజల్ని తృప్తిపరిచే నటన వదిలి పెట్టను. నేనింకా అనేకపాత్రల్లో చేయాలనీ, చూడాలనీ ఫ్యాన్స ఆశిస్తున్నారు. వాళ్ళని నిరాశ పరచను. సినిమాలు చేస్తూనే, ప్రజాసేవ చేస్తా. ♦ ‘కాబోయే సి.ఎం. బాలయ్య’ లాంటి స్లోగన్లు...? ఆ మాటలు వినిపిస్తుంటాయి. పట్టించు కోను. నేను దేన్నీ ఆశించను. ఏం జరగాలనుంటే అది జరుగుతుంది. ఏది నాకు రావాలనుంటే అది వస్తుంది. అది కాలం నిర్ణయిస్తుంది. ♦ తాతయ్య అయ్యాక మీలో వచ్చిన మార్పు? ఏమీ లేదు. నేనిప్పటికీ ‘బాలు’ణ్ణే! (నవ్వు). నాలోని ఆ పసితనం పోలేదు. పోదు. ♦ అమరావతి శంకుస్థాపన, సత్య నాదెళ్ళ సమా వేశం - ఏదైనా మీ మనుమడే స్టార్ ఎట్రాక్షన్. (మనుమణ్ణి ఎత్తుకొని...) వీడికి ఎనిమిది నెలలు. వీడికి నేనే సందడి. వీడితో నాకు మంచి కాలక్షేపం. హావభావాలతో డైలాగ్స్ చెబుతుంటే, అలా చూస్తూ ఉంటాడు. మెడలో పులిగోరు చూడ గానే ‘గడ్డం తాత (చంద్రబాబు) కాదు.. నేను’ అని గుర్తుపడతాడు. వీడి కోసం నేను లైవ్ పెర్ఫా ర్మెన్స్... డ్యాన్స్‌లు చేస్తుంటా. వాడూ ఎగురు తాడు. కెమేరా కనిపించగానే, అలా చూస్తుం టాడు. వీడు కచ్చితంగా హీరో అవుతాడు. ఇద్దరం హీరోలమే! ఈ సంక్రాంతికి వీణ్ణి తీసుకొని, నారావారి పల్లె వెళుతున్నాం. వచ్చే సంక్రాంతి మా ఊరు నిమ్మకూరులో. ♦ సంక్రాంతి మీకు సెంటిమెంటా? నాన్న గారి ‘చంద్రహారం’ నుంచి ఎన్నో సినిమాలు సంక్రాంతికే వచ్చాయి. దర్శకుడిగా ఆయన తొలి చిత్రం ‘సీతారామ కల్యాణం’ నుంచి ‘దాన వీరశూర కర్ణ’ దాకా అన్నీ ఆ రోజే రిలీజ్. ఆ వాసనలు నాకూ అబ్బాయి. ఒకటి, రెండు సంక్రాంతులు మినహా దాదాపు ప్రతిసారీ నా సినిమాలు వస్తున్నాయి. ఇప్పటి నుంచి మాత్రం ఇక ప్రతి సంక్రాంతికీ నా సినిమా ఒకటి ఉంటుంది. ♦ మీది, తారక్, నాగ్, శర్వానంద్లవి - నాలుగు సిన్మాలొస్తున్నాయి. ఈ సంక్రాంతెలా ఉంటుంది? (గంభీరంగా...) నేను వేరేవాళ్ళ గురించి, వేరే సిన్మాలగురించి ఆలోచించను, పట్టించుకోను. ♦ థియేటర్ల విషయంలో మీ సినిమాకూ, ఇతరులకూ మధ్య గొడవని వార్తలు వచ్చాయి. అలాగా! నాకు తెలీదు. నా వరకు ఏదీ రాలేదు. సినిమా ప్రమోషన్ హడావిడిలో ఉన్నా. ♦ అంటే థియేటర్ల విషయం మీరు పట్టించుకోరా? ఫలానా ఊళ్ళో మన సినిమాకి హాలుదొరక్క, ప్రాబ్లమ్ ఉందని వాళ్ళు నాకు ఫోన్ చేసి, నా దృష్టికి తెస్తేనే పట్టించుకుంటాను. లేకపోతే లేదు. ♦ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తప్పుచేస్తే.. ఏదైనా విషయంలో తేడా వస్తే, కూర్చోపెట్టి మాట్లాడ తారా? క్షమిస్తారా? లేదండి. నాలో క్షమించే గుణం తక్కువే. ఏ విషయంలోనైనా ఎవరైనా తప్పు చేస్తే క్షమించను. బుజ్జగించడం అలాంటివి మనకస్సలు లేవు. ఏదైనా ఒక్కసారే. అంతే. ఏదైనా సరే నా స్టయిల్ల్లో డీల్ చేస్తాను. వాళ్లకు రెండో అవకాశం ఇవ్వను. అక్కడితో కటాఫ్ అంతే. అది ఇంట్లో వాళ్లయినా, బయటి వాళ్లయినా అంతే. ♦ మీ పిల్లల్లో ఎవరికి మీ వద్ద చనువు ఎక్కువ? మా పెద్దమ్మాయి బ్రహ్మిణికి. నన్ను క్రిటిసైజ్ చేసి, సలహాలు ఇవ్వాలన్నా బ్రహ్మిణే. చిన్న మ్మాయి తేజస్విని అడిగితే కానీ చెప్పదు. బ్రహ్మిణి మాత్రం అడగపోయినా చెబుతుంది. ♦ మీ పిల్లల కెరీర్ విషయంలో మీ జోక్యం? నిజానికి, మా అమ్మాయిలతో సహా అందరికీ చదువుకొన్నాక, సినిమాల్లో ఆసక్తి ఉంటే రమ్మని చెప్పాను. కానీ, అమ్మాయిలు వద్దన్నారు. మా అబ్బాయి వస్తున్నాడు. వట్టి బాలకృష్ణగా కాక ‘బ్రహ్మిణి తండ్రి బాలకృష్ణ’ అని అనిపించుకో గలిగితే, అది నాకు పెద్ద కిరీటం లాంటిది కదా. ♦ మోక్షజ్ఞ తొలి సినిమాలు ఎలా ఉండాలి? తొలి అయిదారు సినిమాలు నార్మల్ హీరోగా చేయాలి. ప్రపంచాన్ని కాపాడేశాడు లాంటి సూపర్ హీరో పాత్రలొద్దని. ప్రేక్షకులందరూ మన అబ్బాయి అనుకొనే పాత్రలు చేస్తే, ఆ తరువాత మాస్ ఫాలోయింగ్ ఎలాగూ వస్తుంది. ♦ మీ విజయంలో మీ శ్రీమతి వసుంధర పాత్ర? (నవ్వేస్తూ...) 1982లో మా పెళ్ళయింది. నన్ను ఇంతకాలం భరించిన భార్య ఆవిడ. పిల్లల చదువుల విషయమంతా దగ్గరుండి చూసింది. ♦ ఈ మధ్య ఇంటిల్లపాదీ కలసి చూసిన సినిమా? నిన్నే నేను, నా భార్య వసుంధర, బ్రహ్మిణి, మోక్షజ్ఞ, శ్రీవాస్ కలిసి ‘డిక్టేటర్’ చూశాం. ఇంట్లో అందరూ బాగుందన్నారు. ♦ రాజకీయనాయకుడిగా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్? నేను ప్రచారానికి వెళ్లినప్పుడు మహిళలు బిందెలతో వచ్చేసేవారు. పాపం తాగడానికి నీళ్లు ఉండేవి కాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ట్యాంకుల ద్వారా తాగునీటి సమస్య తీర్చే ప్రయత్నం చేశా. ఆ ఆత్మసంతృప్తి ఉంది. నేనేదో చుట్టంచూపుగా నా నియోజకవర్గానికి వెళ్తానని అనుకున్నారు. కానీ నిజాయతీగా పనిచేస్తున్నాని ప్రజలు గుర్తించారు. ఇంకా చేయాల్సినవి ఎన్నో. ♦ కానీ, తలదూర్చేవారు, తలనొప్పులెక్కువేగా? నా నియోజకవర్గంలో ఎవడైనా తలదూరిస్తే ఎవరికైనా వార్నింగే. నా స్వభావం అలాంటిది. ♦ జీవితంలో పశ్చాత్తాపపడిన సందర్భాలున్నాయా? లేదండీ. ఎప్పుడూ లేదు. ♦ ప్రపంచానికి తెలియని బాలకృష్ణ గురించి? నా జీవితమే ఓపెన్ బుక్. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను. చాలామంది టీవీ షోలకు రమ్మన్నా రానని చెప్పా... నా గురించి అందరికీ కొత్తగా తెలిసేది ఏంటని. నాకు కపటం చేత కాదు. నిజజీవితంలో నా ప్రవర్తన నుంచే నా సినిమాల్లో డైలాగులు పుడుతుంటాయి. ఏమున్నా ఆవేశంతో వెళుతుంటా అంతే . చాలామంది నాకు భయపడి దాక్కుని దాక్కుని వెళుతూ ఉంటారు. ♦ మీరు భయపడే సంఘటనలు? అస్సలు దేనికీ భయపడని స్వభావం నాది. ♦ భవిష్యత్తు కొన్నిసార్లు మీకు తెలుస్తుందట... అప్పుడప్పుడూ ముందు జరిగేవి తెలుస్తూనే ఉంటాయి. భగవంతుడు ఆ పవర్ ఇస్తాడు. రామకృష్ణకు యాక్సిడెంట్ జరుగుతుందనగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సాయికృష్ణ చనిపోతున్నా రనగా అలాంటి సంఘటనే జరిగింది. ‘పెద్దన్నయ్య’ రిలీజ్ టైమ్ లో మా తమ్ముడు రామ కృష్ణకి యాక్సిడెంటైంది. ఆ ముందు రోజు రాత్రి కల్లోనే వచ్చింది. పొద్దున లేచేసరికి బెడ్ అంతా చెమటతో తడిచిపోయింది. శాస్త్రి గారిని అడిగి పూజలు చేశా. పెద్ద యాక్సిడెంట్ అయినా, దేవుడి దయ వల్ల ఇప్పటికీ బాగానే ఉన్నాడు. కానీ నాన్నగారి మరణం చూశాక ఒకలాంటి వైరాగ్యం నాలో ఆవహించింది. ఎవరూ దేన్నీ ఊహించ లేరు. మా అన్నయ్య సాయికృష్ణ సంగతీ కలలో తెలిసింది. కానీ, ప్రాప్తం లేదు. కాపాడుకోలేక పోయాం. అందుకే ఎవరికి ఎంత రాసిపెట్టి ఉంటే అంత. కాపాడటానికి యోగం ఉండాలి. ♦ ప్రపంచానికెలా గుర్తుండిపోవాలని ఆలోచన? సినిమాల వల్లే కాక, ‘బాలకృష్ణంటే... ఇలా ఉంటా’డనే వ్యక్తిత్వం ద్వారా గుండెల్లో ఉంటాను. ♦ మీ దృష్టిలో దైవం అంటే? కష్టాల్లో ఉన్నప్పుడే కాకుండా నిత్యం చేయాల్సిన పనుల్లో దైవ చింతన ఒకటి. రోజూ గంట 45 నిమిషాలు పూజ చేస్తా. నా గదిలో పూజ చేస్తాను. దైవాన్ని ప్రార్థిస్తున్నామంటే సరెండర్ అవుతున్నట్టే. యాక్టింగ్‌లో రకరకాల పాత్రలు చేసి, ఆ అహాన్ని పెంచుకోకుండా బయటకు వచ్చి దేవుడికి ఆత్మసమర్పణ చేసుకోవాలి. మన పుష్పక విమానం లాంటివేగా ‘స్టార్ వార్స్’లో చూపించేది. నేను బీజాక్షరాలను నమ్ముతాను. మన వేదాల్లో బుుగ్వేదం, అధర్వణ వేదాలు నమ్ముతాను. అధర్వణ వేదంలో పండితుడైన దండిభట్ల విశ్వనాథశాస్త్రిని చాలా ఏళ్ళక్రితం జర్మనీయులు తీసుకెళ్ళి, తర్జుమా చేయించుకున్నారు. హిందూమతంలో పుట్టినందుకు నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను. కానీ కెమెరా ముందుకెళితే పనే నాకు దైవం. ♦ పంచాంగం మీద మీకు చాలా పట్టుందట? (నవ్వేస్తూ) రోజువారీ ముహూర్తాలు చూస్తా. ♦ పునర్జన్మలను మీరు నమ్ముతారా? నమ్ముతాను. నాన్న గారు అన్నట్లు మళ్లీ తెలుగు జాతిలోనే పుడతాను. తెలుగు జాతి రుణం తీర్చుకుంటాను. - డాక్టర్ రెంటాల జయదేవ -
బాబాయ్, అబ్బాయ్... ఎవరి బలమెంత..?
ఎన్నడూ లేని విధంగా ఈ సారి సంక్రాంతికి వెండితెర మీద భారీ యుద్ధం జరుగుతోంది. నాలుగు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటం, వీటిలో మూడు టాప్ స్టార్ హీరోలు నటించిన సినిమాలే కావటం, ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి బాబాయ్, అబ్బాయ్‌లు బరిలో దిగుతుండటంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. మిగతా సినిమాల సంగతి ఎలా ఉన్నా.. 'నాన్నకు ప్రేమ'తో సినిమాతో వస్తున్న ఎన్టీఆర్, 'డిక్టేటర్'గా గర్జిస్తున్న బాలయ్యల మధ్య పోటినే ప్రధానంగా చర్చకు వస్తోంది. బాలయ్య టిడిపి ఎమ్మెల్యేగా ఉండటం, ఈ మధ్య ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉండటంతో ఈ పోటీ రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి కలిగిస్తోంది. సినిమాల విడుదల విషయంలో ఎత్తుకు పై ఎత్తులు కూడా బాగానే సాగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను డిసైడ్ చేసేది తొలి రోజు.. తొలి వారం కలెక్షన్లే కావటంతో బాబాయ్, అబ్బాయ్‌లు రికార్డ్ వసూళ్ల మీద కన్నేశారు. అందుకు తగ్గట్టుగా భారీ సంఖ్యలో థియేటర్లు దక్కించుకోవటం కోసం అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల ప్రమేయంతో మాత్రమే జరిగిన థియేటర్ల ఎంపికలో ఈ రెండు సినిమాల విషయంలో రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో కూడా అబ్బాయ్, బాబాయ్‌కి గట్టి పోటీనే ఇస్తున్నాడట. సినిమా విషయానికి వస్తే, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సక్సెస్.. హీరోతో పాటు దర్శకుడికి కూడా చాలా కీలకం. వన్ సినిమాతో నిరాశపరిచిన సుకుమార్, తనని తానూ ప్రూవ్ చేసుకోవటం కోసం భారీ హిట్ ఇచ్చి తీరాలి. చాలా రోజులుగా ఫ్లాప్ లలో ఉన్న జూనియర్ టెంపర్ సినిమాతో హిట్ ఇచ్చినా.. ఆ సక్సెస్ లక్ కాదు అనిపించుకోవటం కోసం హిట్ కంపల్సరీ. అందుకే ఇద్దరు కసిగా నాన్నకు ప్రేమతో సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి వరకు లుక్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయని ఎన్టీఆర్, ఈ సినిమాలో పూర్తి వెస్ట్రన్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ లుక్‌తో పాటు ఆడియో కూడా సూపర్ హిట్ అవ్వటం నాన్నకు ప్రేమతో సినిమాకు ప్లస్ పాయింట్స్. భారీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా పై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ తన కెరీర్ లోనే బెస్ట్ అంటున్నారు యూనిట్. సినిమా బడ్జెట్‌తో పాటు శాటిలైట్ రైట్స్, ఏరియా బిజినెస్ లాంటి విషయాల్లో కూడా జూనియర్, బాబాయ్ కన్నా ఒక అడుగు ముందే ఉన్నాడు. ఈ నేపథ్యంలో సరైన సంఖ్యలో థియేటర్లు దొరికితే ఎన్టీఆర్ రికార్డ్‌లు తిరగరాయటం ఖాయంగా కనిపిస్తోంది. బాబాయ్ బాలయ్య కూడా భారీగానే వస్తున్నాడు. రెగ్యులర్‌గా చేసే మాస్ తరహా పాత్రలో కాకుండా డిక్టేటర్ సినిమాలో స్టైలిష్ డాన్‌లా కనిపిస్తున్నాడు బాలకృష్ణ. లౌక్యం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన శ్రీవాస్, బాలకృష్ణతో ఓ పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాడన్న టాక్ వినిపిస్తోంది. ఆడియోకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ప్రొమోస్‌లో బాలయ్య మరోసారి తన మార్క్ పంచ్ డైలాగ్లతోఅలరిస్తున్నాడు. అయితే ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఢీలా పడ్డ కోన వెంకట్, గోపి మోహన్, శ్రీధర్ సీపానలతో కలిసి కథా కథనాలు అందించటం డిక్టేటర్ పై అనుమానాలు కలిగిస్తోంది. బడ్జెట్ పరంగానే కాదు, బిజినెస్ పరంగా కూడా, డిక్టేటర్ బాలయ్య కెరీర్ లోనే టాప్‌గా నిలిచింది. శ్రీవాస్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ పాళ్లు బాగానే ఉంటాయి. దీనికి తోడు భారీ తారాగణంతో మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎలాగూ ఉంటుంది. అంజలి, సోనాల్ చౌహాన్‌ల గ్లామర్ సినిమాకు యాడెడ్ ఎట్రాక్షన్. ఇది బాలయ్య 99వ సినిమా కావటంతో సినిమాకు భారీ వసూళ్లను అందించి 100వ సినిమాకు మరింత హైప్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలా అన్ని రకాలుగా బాలయ్య కూడా భారీ హిట్‌నే టార్గెట్ చేశాడు. రెండు సినిమాలు యు/ఎ సర్టిఫికేట్‌తోనే రిలీజ్ అవుతుండటం, రెండూ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఎమోషనల్ డ్రామాస్ కావటం, ఇద్దరు హీరోలు ఒకే ఫ్యామిలీకి చెందిన అగ్రకథానాయకులు కావటం, గతంలో ఎప్పుడూ ముఖాముఖి తలపడని ఇద్దరు సంక్రాంతి బరిలో కాలు దువ్వుతుండటం, తొలిసారిగా సినిమా బిజినెస్‌లో రాజకీయ ప్రమేయం ప్రత్యక్షంగా కనిపించటం లాంటివి ఈసారి పోటిని మరింత వేడెక్కిస్తున్నాయి. మరి ఈ యుద్ధంలో బాబాయ్, అబ్బాయ్లలో గెలుపెవరిదో తెలియాలంటే మాత్రం మరో కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బాలకృష్ణ, ఎన్టీఆర్ ల పోటి ఎలాగున్నా, అభిమానులకు మాత్రం ఈ సంక్రాంతి అతి పెద్ద సినిమా పండుగే అవుతోంది. -
రెండుసార్లు మిస్సయ్యా!
హీరోయిన్ అంజలి... పదహారణాల తెలుగమ్మాయి. తమిళ సినిమా వాకిట్లో... తెలుగు సిరిమల్లె చెట్టు. ‘షాపింగ్ మాల్’, ‘జర్నీ’తో దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచిన అభినయాంజలి. బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’తో ఈ 14న సంక్రాంతి వేళ... మన వాకిళ్ళలో బాక్సాఫీస్ ముగ్గు వేస్తున్న సౌందర్యాంజలి. ఆమె ‘డిక్టేటర్’ అనుభవాలు... మనసులోని ముచ్చట్లలో మచ్చుకు కొన్ని... బాలకృష్ణ గారితో ఇది నా మొదటి సినిమా. నిజానికి, గతంలో రెండుసార్లు ఆయనతో కలసి నటించే ఛాన్స్‌లు మిస్సయ్యా. ‘లెజెండ్’లో రాధికా ఆప్టే నటించిన పాత్రకు అడిగారు. కుదరలేదు. అలాగే, ‘లయన్’లో హీరోయిన్గా అడిగినప్పుడు డేట్స్ప్రాబ్లమ్. చివరికి ‘డిక్టేటర్’తో కుదిరింది. మొదట భయపడ్డా! బాలకృష్ణ గారితో సినిమా అనగానే, ‘ఆయన పెద్ద హీరో. సెట్స్‌పై ఎలా ఉంటారో ఏమిటో’ అని భయపడిన మాట నిజం. అలాగే, బయట చాలామంది దగ్గర ఆయన గురించి విన్న మాటలతో టెన్షన్‌పడుతూ వెళ్ళాను. కానీ, బయట అనుకొనేదానికీ, నిజానికీ చాలా తేడా ఉంది. ఆయన చాలా స్వీట్ పర్సన్. తోటి నటీనటులకు చాలా స్పేస్ ఇస్తారు. సెట్స్‌లో నటిస్తున్నప్పుడు మనకు మంచి టిప్స్ ఇస్తారు. మనం ఒకటికి రెండు టేక్‌లు తీసుకున్నా, విసుక్కోకుండా సహకరిస్తారు. హీరోయిన్ దగ్గర నుంచి లైట్‌మెన్ దాకా ప్రతి ఒక్కరితో బాగుంటారు. స్నేహంగా, జోవియల్‌గా ఉంటారు. ఆయన దగ్గర అది నేర్చుకున్నా! కెమేరా ముందు ఎలా ఉండాలి, ఎమోషన్స్‌లో ఖాళీ వచ్చినప్పుడు వాటిని ఎలా భర్తీ చేసుకోవాలి లాంటి చాలా టిప్స్ ఆయన చెప్పేవారు. ఆయన దగ్గర నుంచి పంక్చువాలిటీ నేర్చుకున్నా. ఫలానా టైమ్‌కి షూటింగంటే, ఆయన షాట్ ఉందా, లేదా అన్నదానితో సంబంధం లేకుండా ఆయన రెడీ అయి, కూర్చొనేవారు. పెద్ద హీరో ఆయనే రెడీగా ఉంటారని, దానికి భయపడి మిగిలినవాళ్ళందరం ఆ టైమ్‌కి సిద్ధంగా ఉండేవాళ్ళం. ♦ నేను ఒక డాక్టర్‌ను చేసుకొని, పిల్లను కనేశానని పుకారొచ్చింది. తాజాగా టీవీ యాంకర్ ఓంకార్ ‘రాజుగారి గది’ సీక్వెల్లో చేస్తున్నా ననీ, ఆయనతో సన్నిహితంగా ఉన్నాననీ నెట్లో రాశారు. అవన్నీ వట్టి పుకార్లే. ♦ నా సహ నటీనటులందరూ నాకు స్నేహితులే. సినిమాలు తెగ చూస్తాను. ఏ సినిమా బాగుంటే ఆ సినిమా నటీనటులకు మెసేజ్‌లు కూడా పెడతాను. అలా పిలవాలంటే కంగారుపడ్డా! తోటి నటీనటుల్ని బాలాగారెంత కంఫర్ట్‌గా ఉంచుతారంటే, నేను ‘బాలకృష్ణ గారూ, సార్’ అని పిలుస్తుంటే నన్ను పిలిచి, ‘కాల్ మి బాలా’ అన్నారు. నేను కంగారుపడిపోయి, అలా పిలవలేనన్నా. చివరికి ‘బాలా గారూ అని పిలుస్తా’ అన్నా. సరే అన్నారు. అలా సాన్నిహిత్యం పెరిగింది. ఆయన అలా పోల్చడం నా అదృష్టం! ‘డిక్టేటర్’ చాలా మంచి స్క్రిప్ట్. రచయిత కోన వెంకట్ గారు కథ వినిపిస్తున్నప్పుడే అది అర్థమైంది. కథ రాస్తున్నప్పుడే ఈ పాత్రకు నేను బాగుంటానని పేరు రాసుకున్నారట. ఢిల్లీలో వర్కింగ్ గర్ల్‌గా నా పాత్ర యూత్‌ఫుల్‌గా, చలాకీగా బాగుంటుంది. పాత్ర పేరు విచిత్రంగా ఉంటుంది. బయటపెట్టలేను కానీ, సినిమాలో ప్రధాన భాగమంతా నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. పైగా, నాలోని నటనను హైలైట్ చేసే సీన్లు ఉన్నాయి. ఎడిటింగ్‌లో, ఆ తరువాత డబ్బింగ్లో అవి చూసిన బాలకృష్ణ గారు నన్ను ‘మహానటి సావిత్రి’తో పోల్చడం, అంత లెజండరీ యాక్టర్‌తో ఆ ప్రశంస అందుకోడం నా అదృష్టం! ఫస్ట్ రోజే టెన్త్ ఎగ్జామ్! ఈ సినిమా సెట్స్‌కు వెళ్ళిన మొదటి రోజే పాట షూటింగ్. పైగా ‘గణ...గణ’ అనే మాస్ బీట్ పాట. అంతే! బాలా గారు మంచి ఎనర్జీతో స్టెప్స్ వేస్తున్నారు. నాకు టెన్ష నొచ్చింది. ఫస్ట్‌రోజే టెన్త్ ఎగ్జామ్ రాస్తున్నట్లనిపించింది. ‘ప్రాక్టీస్ చెయ్. నువ్వు రెడీ అయ్యాక చేద్దా’మని బాలా ప్రోత్సహించారు. అయిదున్నర కిలోలు తగ్గా! ‘డిక్టేటర్’లో వర్కింగ్ గర్ల్ పాత్ర కాబట్టి, ఈ సినిమా అనుకున్నప్పుడే కొంచెం సన్నగా ఉండాలని దర్శక - నిర్మాత శ్రీవాస్ చెప్పారు. అందుకని ప్రత్యేకించి అయిదున్నర కిలోలు తగ్గా. హెయిర్‌స్టైల్, లుక్, శ్యామ్ కె. నాయుడు కెమేరా పనితనంతో తెరపై వేరే కొత్త అంజలిని చూడవచ్చు. ఫ్రెష్‌గా, యంగ్‌గా కనిపిస్తా. ట్రాన్సజెండరూ కాదు... వేశ్యా కాదు..! ఇప్పుడు నా బేస్ హైదరాబాద్. ఇక్కడే ఉంటున్నా. తమిళ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నా కాబట్టి, ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా. తెలుగు-తమిళాల్లో ‘చిత్రాంగద’, తమిళంలో కార్తీక్ సుబ్బ రాజు ‘ఇరైవి’ లాంటివి రిలీజ్‌కు సిద్ధమవుతు న్నాయి. మమ్ముట్టి గారితో తమిళ చిత్రం ‘పేరన్బు’ షూటింగ్ మంగళవారం నుంచి. అందులో నాది ట్రాన్సజెండర్ పాత్ర అనీ, వేశ్య పాత్ర అనీ రాస్తు న్నారు. అది నిజం కాదు. కొత్తగా రెండు తెలుగు స్క్రిప్ట్స్ విన్నా. వాటికి సైన్ చేయాలి. -
జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దెబ్బ?
►బాబాయ్, అబ్బాయ్ సినిమాలు పోటాపోటీగా విడుదల ► థియేటర్ల కొరతతో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దెబ్బ? ► టీడీపీలో ఓ వర్గం నేతల మద్దతు బాలయ్యకే ► యువకుల బలం జూనియర్‌కు సాక్షి ప్రతినిధి, ఏలూరు : హైకోర్టు ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలతో పశ్చిమాన పందెం కోళ్ల ముచ్చట ఎలా ఉన్నా సినిమా బరిలో మాత్రం నందమూరి హీరోలు ఢీ అంటే ఢీ అంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా బాబాయ్ నందమూరి బాలకృష్ణ, అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్‌ల సినిమాలు కేవలం ఒక్కరోజు వ్యవధిలో విడుదల కానుండటంతో టీడీపీ నేతలు వర్గ రాజకీయాలకు తెరలేపారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా జోరును తగ్గించేలా థియేటర్ల కొరత సృష్టించనున్నట్టు తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో సినిమా ఈనెల 13వ తేదీన, మరుసటి రోజు 14వ తేదీన బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా విడుదల కానున్నాయి. గత ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు, నందమూరి, నారా కుటుంబాలకు దూరంగా ఉంటున్న జూనియర్‌ను దెబ్బతీసేందుకు సరిగ్గా ఇదే అదనుగా టీడీపీలోని ఓ వర్గం నేతలు భావిస్తున్నారు. ఇటీవలికాలంలో నిఖార్సైన హిట్ లేని జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వం వహించిన నాన్నకు ప్రేమతో సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. తెలుగు సినిమా రూ.వందకోట్ల క్లబ్లో చేరి చాన్నాళ్లయినా జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రూ.50 కోట్ల బెంచ్‌మార్క్ దాటలేకపోయారు. ఈ నేపథ్యంలో రూ.50 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన నాన్నకు ప్రేమతో సినిమా కమర్షియల్ హిట్ సాధించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది. పొరపాటున ఈ సినిమా అటు ఇటు అయితే జూనియర్ సినిమా కెరీర్ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీంతో ఇదే అవకాశంగా థియేటర్లు దొరక్కుండా చేసి జూనియ్ సినిమా కలెక్షన్లు దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీలోని ఓ వరం్గ నేతలు పావులు కదుపుతున్నారు. నాన్నకు ప్రేమతో రూ.2.5 కోట్లు డిక్టేటర్ రూ.1.50 కోట్లు పశ్చిమగోదావరి జిల్లాలో నాన్నకు ప్రేమతో సినిమాను రూ.రెండున్నర కోట్లకు ప్రముఖ పంపిణీదారు కొనుగోలు చేసినట్టు తెలిసింది. బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా ప్రదర్శన హక్కులను కూ.కోటిన్నరకు ఓ ఔత్సాహికుడైన యువకుడు పొందినట్టు సమాచారం. 13వ తేదీన విడుదలయ్యే నాన్నకు ప్రేమతో సినిమాను ఆ రోజు దాదాపుగా జిల్లాలోని అన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరుసటి రోజు 14వ తేదీన సగం థియేటర్లు ఎత్తివేసి.. వాటిలో బాలకృష్ణ డిక్టేటర్ సినిమాను ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టీడీపీ నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా స్క్రీన్లు మరిన్ని తగ్గించేలా కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తోంది. ఇక 15వ తేదీన అక్కినేని నాగార్జున సోగ్గాడే చిన్నినాయన, శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలు ఉండటంతో జూనియర్ స్క్రీన్లు ఇంకా తగ్గించేస్తారని అంటున్నారు. ఇటీవలికాలంలో జూనియర్ సినిమాలకు ఆశించిన కలెక్షన్లు రాకపోయినా.. నాన్నకు ప్రేమతోపై భారీ అంచనాలు ఉండటంతో రూ.రెండున్నర కోట్లకు సినిమాను పంపిణీ చేస్తున్నారు. ఆది, సింహాద్రి స్థాయి హిట్ వస్తేనే నాన్నకు ప్రేమతో బయ్యర్లకు లాభాలు వస్తాయి. ఇప్పుడు పచ్చనేతల రాజకీయంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు బలయ్యే పరిస్థితి నెలకొందని అంటున్నారు. మంచి థియేటర్లు బాలయ్యకే కాగా, థియేటర్ల పంపిణీలో కూడా రాజకీయం జరుగుతోందని అంటున్నారు. డీటీఎస్‌తో పాటు ఆధునిక సౌకర్యాలు ఉన్న థియేటర్లు బాలకృష్ణకు, బీ, సీ గ్రేడ్ థియేటర్లు జూనియర్ సినిమాకు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. తాడేపల్లిగూడెంలో ఈ మేరకు థియేటర్ల పంపిణీ జరిగినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, తెలుగుదేశం పార్టీలో వర్గనేతల అండ బాలకృష్ణకు ఉన్నప్పటికీ అదే వర్గ యువకులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సినిమా హిట్ అయ్యేవరకే ఈ రాజకీయాలు.. ఒక్కసారి హిట్ టాక్ బయటకు వస్తే థియేటర్ల కొరత సృష్టించడం ఎవరి వల్లా కాదు.. అప్పుడు బాలకృష్ణ సినిమా అయినా, జూనియర్ సినిమా అయినా ఎవ్వరూ ఆపలేరు.. అని ఏలూరుకు చెందిన ఓ ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్ ‘సాక్షి’ ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ సంక్రాంతి బరిలో పందెంకోళ్లలా దిగుతున్న నందమూరి హీరోల్లో హిట్‌టాక్ పరంగా ఎవరిది పైచేయి అవుతుందో నాలుగు రోజుల్లో తేలిపోనుంది. -
నాగార్జున సినిమాను నడిపించే వారెవరు?
* ‘డిక్టేటర్’ కోసం థియేటర్ల యజమానులకు టీడీపీ నేతల హెచ్చరికలు * బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్ * నాగార్జున సినిమాను నడిపించే వారెవరు? * థియేటర్ల యజమానుల్లో అయోమయం సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘‘ఆటాడాల్సిందే.. ‘డిక్టేటర్’ అంటే ఏమనుకున్నారు? మీ ఇష్టం.. చెప్పింది చేయండి.. లేకుంటే తర్వాత చూస్తారు..’’ ఇవీ జిల్లాలోని పలు థియేటర్ల యజమానులకు తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వెళ్లిన హెచ్చరికలు. డిస్ట్రిబ్యూటర్లకు ఏంచేయాలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. విజయవాడకు చెందిన కాకుమాను ప్రసాద్ (అలంకార్ ప్రసాద్) జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’ కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. గన్నవరానికి చెందిన తుమ్మల రామ్మోహన్రావు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ను తీసుకోగా, నాగార్జున ఫ్యాన్స్ ఆలిండియా అధ్యక్షుడు సర్వేశ్వరరావు నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్టీఆర్, నాగార్జునల సినిమాలకు నెల క్రితమే జిల్లాలో థియేటర్ల బుకింగ్ పూర్తయింది. ఈ నెల 14న సంక్రాంతి సందర్భంగా విడుదలకానున్న బాలయ్య ‘డిక్టేటర్’కు జిల్లాలో ఒక్క హాలు కూడా లేకపోవడం విశేషం. నిజానికి అలంకార్ ప్రసాద్, సురేష్ ప్రొడక్షన్స్ వారికి జిల్లాలో 80 శాతం థియేటర్ల వారితో సంబంధాలు ఉన్నాయి. ఏ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా వారు ఈ 80 శాతం థియేటర్లను ముందుగానే కృష్ణా జిల్లాలో బుక్ చేసుకుంటారు. సినిమా ఆడేదాన్ని బట్టి ఎంతకాలం అనేది ఉంటుంది. ఎన్టీఆర్, నాగ్ చిత్రాలకు ముందే థియేటర్లు బుక్ చేయటంతో శుక్రవారం నుంచి టీడీపీ శ్రేణుల నుంచి థియేటర్లపై ఒత్తిళ్లు పెరిగాయి. ఎన్టీఆర్ సినిమాను ఆపేయాల్సిందిగా ఫోన్లు చేసి మరీ థియేటర్ల యజమానులను బెదిరించటం మొదలుపెట్టారు. ఇందులో ఒక కీలక మంత్రి నుంచి పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు సైతం ఉన్నారు. ఈ విధంగా ఇప్పటివరకు 30 థియేటర్లు ‘డిక్టేటర్’కు బుక్ చేసినట్లు సమాచారం. అభిమానుల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం... జిల్లాలో 108 సినిమా థియేటర్లు ఉన్నాయి. అందులో పూర్తిగా ఎన్టీఆర్, నాగార్జున సినిమాలకే బుక్ అయ్యాయి. 20 సింగిల్ థియేటర్లు, 25 డబుల్ థియేటర్లు ఉన్నాయి. సింగిల్ థియేటర్లు ఉన్నచోట డిక్టేటర్ ఆడాల్సిందేనని టీడీపీ నాయకులు పట్టుబట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈ గ్రామాల్లో కొట్లాటలు చోటుచేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. డబుల్ థియేటర్లు ఉన్నచోట నాగార్జున సినిమాను ఆపివేయిస్తున్నారు. దీంతో నాగార్జున అభిమానుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ సినిమాను రద్దు చేయించిన చోట పరిస్థితులు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి. -
నేనెవరినీ పోటీగా భావించను - బాలకృష్ణ
‘‘నా సినిమాలు నాకే పోటీ. నేనెవరినీ పోటీగా భావించను. నా కొడుకు, మనవడు వచ్చినా సరే సినిమాలు చేస్తూనే ఉంటాను. ఎప్పుడూ మంచి సినిమాలు చేయడానికి నేను రెడీ’’ అని బాలకృష్ణ చెప్పారు. శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ కాంబినేషన్లో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘డిక్టేటర్’. ఎస్.ఎస్. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సక్సెస్ మీట్ శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘నా ప్రతి సినిమా టైటిల్‌కు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ చిత్రకథ, క్యారెక్టరైజేషన్స్ బాగా కుదిరాయి. శ్రీవాస్ రథసారధిగా ముందుండి నడిపించాడు. తమన్ చాలా డిఫరెంట్ ట్యూన్స్ అందించాడు. ఈ సినిమాలో అన్ని పాటలు బాగా కుదిరాయి. పాటలను అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. నాకు మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాలు చాలా ఇష్టం. చిన్నా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. మంచి ప్లానింగ్‌తో, ఆహ్లాదకరమైన వాతావరణంలో షూటింగ్ సాగింది. అంజలి తన పాత్రకు న్యాయం చేసింది. ఈ చిత్రం సంక్రాంతికి మంచి కానుక. అందరూ సకుటుంబ సపరివార సమేతంగా మళ్లీ మళ్లీ చూసే విధంగా ‘డిక్టేటర్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘దర్శకుడిగా, నిర్మాతగా నేను రెండు రకాల పాత్రలు పోషించడానికి కారణం బాలకృష్ణగారు. నేనింత బాగా చేశానంటే దానికి కారణం ఆయనే. బాలకృష్ణగారి నమ్మకం నిలబెట్టాననే అనుకుంటున్నాను. అందరం ఫ్రెండ్లీగా ఉండటంతో ఈ సినిమా బాగా వచ్చింది. బాలకృష్ణగారు సెట్లో చాలా జోవియల్‌గా ఉండేవారు. తెరపై బాలకృష్ణగారిని ఇంకా బాగా చూపించాలన్న కసితో ఈ సినిమా కోసం పనిచేశాం. విడుదలయ్యాక ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ పండగ చేసుకుంటారు’’ అని శ్రీవాస్ పేర్కొన్నారు. అంజలి మాట్లాడుతూ- ‘‘తమన్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో కెమెరామ్యాన్ శ్యామ్ కె. నాయుడు చాలా అందంగా చూపించారు. బాలకృష్ణగారు మంచి మనసున్న వ్యక్తి’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటులు సుమన్, కాశీ విశ్వనాథ్, జీవా, అజయ్, హేమ, రచయితలు రత్నం, శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ vs బాలయ్య.. ఎందుకీ ఫైట్!
సంక్రాంతి ముంచుకొస్తోంది. నందమూరి అభిమానుల్లో కలకలం రేగుతోంది. నాన్నకు ప్రేమతో సినిమాతో ఎన్టీఆర్, డిక్టేటర్ సినిమాతో బాలయ్య వస్తున్నారు. సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమా కోళ్లే. కాకపోతే.. తొలిసారిగా.. ఒకరితో ఒకరు ఢీకొడుతున్నారా? లేకపోతే ఎవరి సత్తా ఏంటో చూపించాలని అనుకుంటున్నారా? ఇద్దరి అభిమానుల్లో ఒకటే సంఘర్షణ. బాలయ్య అభిమానులు జూనియర్‌కు విజ్ఞప్తులు చేస్తుంటే, జూనియర్ అభిమానులు బాలయ్యకు లేఖలు రాస్తున్నారు. నెట్లో.. వీళ్ల హడావిడి అంతా ఇంతా కాదు. సంక్రాంతి సమయంలో రెండు సినిమాలు విడుదల చేస్తే పరిస్థితి ఏంటి? ఎవరి మద్దతు ఎవరికి అన్నదానిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సినీ అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృతంగా చర్చ సాగుతోంది. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ - పెద్దహీరో. టీడీపీకి అనుకూలంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. తాత సిద్ధాంతాలున్న పార్టీకి తన ఓటు అన్నాడు. చంద్రబాబును మామయ్య అంటూ.. ప్రతి వేదిక మీదా ఆప్యాయంగా పిలిచాడు. సడెన్‌గా ఆనాటి కౌగిలింతలు, కమ్మటి మాటలు ఆగిపోయాయి. ఎన్నికల ప్రచారంలో ప్రమాదానికి గురైన జూనియర్.. సీన్ నుంచి సైడైపోయాడు. క్రమంగా.. సైలెంటైపోయాడు. ఎన్నికల తర్వాత.. ఇక ఎన్టీఆర్ అనవసరం అనుకున్నారో, లేక భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదనుకున్నారో గానీ.. చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయ వర్గాలు అంటాయి. జూనియర్ పెళ్లి ప్రక్రియ మొత్తాన్ని తన చేతులమీదుగా నడిపించారు చంద్రబాబు. తన మేనకోడలి కూతురు ప్రణతిని జూనియర్‌కు ఇచ్చి పెళ్లిచేయడంలో బాబు కీలకపాత్ర పోషించారు. ఈ పెళ్లి తర్వాత.. జూనియర్‌ది ఒక దారైతే.. బాబుది మరో దారి. మొత్తమ్మీదకు బాబు - ఎన్టీఆర్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణించిపోయాయి. ఇదో మరో టర్న్ తీసుకుంది. హరికృష్ణ, జూనియర్, కళ్యాణ్ రాం దాదాపుగా ఏకాకులయ్యారు. ఈ పరిణామాలు అన్నీ జరిగే సమయంలోనే బాలకృష్ణ - చంద్రబాబుల మధ్య బంధం గట్టిపడుతుంటే జూనియర్ క్రమంగా దూరం కావాల్సి వచ్చింది. 2007లో కూతురు బ్రాహ్మణిని చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఇచ్చిన బాలకృష్ణ... పార్టీవ్యవహారాల్లో బావ చంద్రబాబుకు నమ్మకస్తుడిగా ఉండిపోయారు. ఫలితంగానే హిందూపురం ఎమ్మెల్యే సీటు దక్కించుకున్నారు. తనకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండానే బాలకృష్ణకు రాజకీయ అవకాశాలు చంద్రబాబు కల్పించారన్నది అందరూ చెబుతున్న మాట. ఇదే సమయంలో.. హరికృష్ణ కుటుంబం పూర్తిగా దూరమైపోయింది. ఈ ఎపిసోడ్‌లోనే.. బాలయ్య వర్సెస్ జూనియర్ ఘటనకు ఆజ్యంపోసింది. సింహా ఆడియో ఫంక్షన్లో బాలయ్యకు ఆత్మీయంగా జూనియర్ పేల్చిన డైలాగులు అన్నీ ఇన్నీ కావు. తన తాత, ఆ తర్వాత నాన్న, తర్వాత బాబాయ్ అంటూ.. చెప్పుకొచ్చారు జూనియర్. అప్పుడు బాలయ్య కూడా.. జూనియర్‌ను ఆకాశానికి ఎత్తేశారు. కానీ కొంత కాలం తర్వాత గ్యాప్ వచ్చేసింది. దీనికి కారణాలు ఏంటో గానీ, జూనియర్‌ను చంద్రబాబు తొక్కేశారని రాజకీయ విశ్లేషకులు అంటారు. ఈలోపే 2014 ఎన్నికలు వచ్చాయి. జూనియర్ మళ్లీ ప్రచారానికి వస్తారా? రారా? అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. ఈలోగా బాలయ్య పేల్చిన డైలాగ్ జూనియర్‌తో ఉన్న భేదాభిప్రాయాలను బయటపెట్టింది. ఎవర్నీ బొట్టు పెట్టి పిలవమంటూ బాలయ్య వదిలిన బుల్లెట్.. జూనియర్‌ను గట్టిగానే తాకిందంటారు. కానీ, అదే బాబు.. పవన్‌కు బొట్టుపెట్టి పిలవడం కూడా జూనియర్‌ను మనస్తాపానికి గురిచేసిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఊహించని రీతిలో టీడీపీకి అధికారం దక్కడంతో జూనియర్‌కు కాస్త కష్టకాలం మొదలైంది. కొడుకు లోకేష్ కోసం చంద్రబాబు, అల్లుడి కోసం బాలకృష్ణ, బాలయ్య కోసం మిగతా కుటుంబ సభ్యులు.. ఇలా ఒక వలయం ఏర్పడింది. జూనియర్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. ఒకానొక సమయంలో రెండు వర్గాలూ పరోక్షంగా కామెంట్లు కూడా చేసుకున్నాయి. అప్పుడే జూనియర్ దమ్ము సినిమా విడుదలైంది. థియేటర్లు ఇవ్వొద్దని, సినిమా చూడొద్దని కొంతమంది నందమూరి అభిమానులు పేరిట ఎస్ఎంఎస్లు వెల్లువెత్తాయి. సినిమాలంటే విపరీతమైన క్రేజ్ ఉన్న విజయవాడలో పోస్టర్లు కూడా కట్టనీయకుండా కొంతమంది టీడీపీ నేతలు తెర వెనక నుంచి డ్రామా నడిపారు. అప్పుడు మొదలైన బాబాయ్- అబ్బాయ్ కోల్డ్‌వార్ ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్లో.. వారసత్వం మాట తలెత్తింది. ఎన్టీఆర్‌కు సిసలైన వారసుడు జూనియరే అంటూ హరికృష్ణ పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఆనాటి ఘటనలను ప్రజలముందు ఉంచారు. హరికృష్ణ, జూనియర్, కళ్యాణ్రామ్లలో ఏ ఒక్కరూ బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా స్క్రిప్టు రాసుకొచ్చినట్టు చాలా క్లారిటీతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేపారు. ఆడియో ఫంక్షన్‌కు పాసులు కూడా కేవలం జూనియర్ అభిమానులకు మాత్రమే ఇచ్చారు. మర్నాడే డిక్టేటర్ పోస్టర్లు పేపర్లో కనిపించాయి. నందమూరి అసలైన వారసుడు బాలకృష్ణే అంటూ యాడ్స్ కనిపించాయి. జూనియర్, బాలకృష్ణల మధ్య కుటుంబపరంగా ఉన్న విభేదాలు ఇప్పుడు సినిమా జోలికి వచ్చాయి. ఏకంగా ఒకరితో ఒకరు పోటీ పడి సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నారు. సంక్రాంతి వేదికగా బాలయ్య డిక్టేటర్ వస్తుండగా, ఇదే సమయంలో జూనియర్ నాన్నకు ప్రేమతో వస్తోంది. రెండూ ఒకేసారి వస్తే.. నందమూరి అభిమానులు ఎటువైపు అన్న చర్చ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. సోషల్ మీడియాలో, సెల్ఫోన్లలో ఇద్దరి అభిమానుల మధ్య వార్ కొనసాగుతోంది. సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ అభిమానుల టెన్షన్ అంతా, ఇంతా కాదు. ఒకరిపై ఒకరు వేసుకుంటున్న కౌంటర్లు కూడా అన్నీ ఇన్నీ కావు. జూనియర్ సినిమాకు సరైన థియేటర్లు రాకుండా, సరైన ప్రచారం లేకుండా చేయాలని బాలకృష్ణ వర్గం ప్రయత్నిస్తుంటే.. దీన్ని అధిగమించి సాగాలన్నది జూనియర్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. స్వతహాగా బాలకృష్ణకు పట్టులేని నైజాంలో ఇప్పటికే జూనియర్ తన సినిమాకు ఎదురు లేకుండా చేసుకున్నారు. కానీ పక్కా ప్లాన్‌తో నైజాంలో థియేటర్లను జూనియర్‌కు వదిలేసి ఆంధ్రా, సీడెడ్ మాత్రం జూనియర్‌కు తగ్గించే ప్రయత్నాల్లో లోకేష్ బిజీగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే సినిమాకు సంబంధించి పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు నేరుగా ఫోన్లు కూడా చేస్తున్నాని తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో కొనొద్దు, ఆడించొద్దన్నదే ఈ ఫోన్ కాల్స్ సారాంశమని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బాలయ్యతో కాలుదువ్వే శక్తి జూనియర్ ఉందా? ఈ పోరులో జూనియర్ నిలబడగలడా? రాజకీయవర్గాలు ఇప్పుడు ఈ విషయాన్ని తక్కెటపెట్టి మరీ కొలుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారం, చంద్రబాబు అండ, రాజకీయ వర్గాల్లో పట్టు బాలకృష్ణకు ప్లస్ పాయింట్ కాగా, నిర్మాణాత్మక వ్యక్తిత్వం లేకపోవడం, ఆకట్టుకునే రీతిలో ప్రసంగాలు చేయలేకపోవడం, సమకాలీన అంశాలపై పట్టులేకపోవడం మైనస్ పాయింట్లు. అందుకే ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణే అని ఒక దశలో పెద్ద హైప్ వచ్చినా అవేమీ ఆయనను పైస్థాయికి చేర్చలేకపోయాయి. సినిమాల్లో డిక్టేటర్ అయినా రాజకీయాల్లో, వ్యవహారజ్ఞానంలో పట్టులేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. చంద్రబాబుకు ఇది కలిసి వచ్చిందని టీడీపీ సీనియర్లే చెవులు కొరుక్కుంటారు. బాలయ్యలో లేనిది, తనకు ఉన్నది ఏంటని ఇటీవలి కాలంలో జూనియర్ బాగా అవలోకనం చేసుకుంటున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. పెద్ద ఎన్టీఆర్ రూపురేఖలు రావడం, హీరోగా మంచి పేరు ఉండడం, ఇంగ్లిషులో పట్టు ఉండడం ఎన్టీఆర్‌కు కలిసొచ్చాయి. ఎలాంటి ట్రైనింగ్ లేకుండా అనర్గళంగా మాట్లాడటం, ప్రజలను అట్టే నిలబెట్టడంలో.. బాలయ్యకన్నా బెటరనే పేరు జూనియర్‌కు ఉంది. అందుకే ఎప్పుడైనా బాబు-లోకేష్‌లకు ముప్పుగా మారుతాడనే భావనతోనే బాలయ్య ద్వారా జూనియర్‌ను తొక్కేశారని రాజకీయవర్గాలు విస్తృతంగా చర్చించుకున్నాయి. కాకపోతే బాబు-బాలయ్యలను ఢీకొట్టే నైపుణ్యం, ఆర్థికసత్తా జూనియర్‌కు ఉన్నాయా? ఒకవేళ సై అంటే జూనియర్ తట్టుకోగలరా అన్నదే అసలు డిస్కషన్. -
బాలయ్య వారసుడి ఎంట్రీ..?
టాలీవుడ్లో స్టార్ వారసుల ఎంట్రీకి యమా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుంటుంబాల నుంచి వచ్చే స్టార్ వారసుల రాక కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు. అలా ఇండస్ట్రీ వర్గాల చాలారోజులుగా ఎదురుచూస్తున్న స్టార్ వారసుడు నందమూరి మోక్షజ్ఞ. బాలకృష్ణ నట వారసుడిగా ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ తెరగేంట్రంపై చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తన 99వ సినిమా డిక్టేటర్‌ను పూర్తిచేసిన నందమూరి బాలకృష్ణ, తన 100వ సినిమా కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు దర్శకుడిగా బోయపాటి శ్రీనును ఎనౌన్స్ చేసినా ఇంకా ప్రాజెక్ట్ మాత్రం కన్ఫామ్ కాలేదు. అయితే అదే సమయంలో సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదిత్య 369 సీక్వల్గా ఆదిత్య 999ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే సింగీతం కథ కూడా రెడీ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కీలక సన్నివేశంలో ఓ యువరాజు పాత్ర కనిపిస్తుందట. ఆ పాత్రను బాలయ్య వారసుడు మోక్షజ్ఞతో చేయించాలని భావిస్తున్నాడు దర్శకుడు సింగీతం శ్రీనివాస్. అయితే ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీపై దృష్టిపెట్టిన నందమూరి ఫ్యామిలీ, ఈ విషయం పై కూడా ఆలోచిస్తోంది. అన్ని అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీపై ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు ఫ్యాన్స్. -
రిలీజ్‌కు ముందే రీమేక్ ప్లాన్స్
ఈ సంక్రాంతికి భారీ రిలీజ్‌కు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఎంటర్టైనర్ డిక్టేటర్. బాలయ్య స్టైలిష్ డాన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే రిలీజ్‌కు ముందే డిక్టేటర్ ఓ రేంజ్లో హడావిడి చేస్తున్నాడు. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు తమిళ్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇప్పటికే ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డిక్టేటర్ సినిమాను అజయ్ దేవ్గన్ హీరోగా బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. ఈ సినిమాకు తెలుగులో దర్శకత్వం వహించిన శ్రీవాస్నే దర్శకుడిగా ఎంపిక చేశారు. ఇప్పుడు అదే బాటలో కోలీవుడ్‌లోనూ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. వేదాలం సినిమాతో భారీ హిట్ కొట్టిన అజిత్ హీరోగా డిక్టేటర్ రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కథ కూడా విన్న అజిత్ డిక్టేటర్ రిలీజ్ తరువాత ఫైనల్ డెసిషన్ తీసుకోనున్నాడు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్లు హీరోయిన్లుగా నటించిన డిక్టేటర్ సంక్రాంతి కానుకగా ఈ నెల 14న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో పాటు శ్రీవాస్ స్టైల్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా కూడా అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
అక్కడ ‘డిక్టేటర్’గా అజిత్?
సినిమా విడుదల కావడానికి మరో వారం రోజులు ఉందనగా, పరభాషల నుంచి ఆ సినిమా గురించి ఎంక్వైరీలు మొదలైతే దర్శక-నిర్మాతల ఆనందం మామూలుగా ఉండదు. నందమూరి బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై శ్రీవాస్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. సినిమా జనాల్లోకి వెళ్లే ముందు.. అందరికన్నా ముందు చూసేవాళ్లల్లో ఎడిటింగ్, రీ-రికార్డింగ్ డిపార్ట్‌మెంట్‌వాళ్లు ఉంటారు. ‘డిక్టేటర్’ చిత్రానికి చిన్నా రీ-రికార్డింగ్ చేశారు. ఆర్.ఆర్. చేసేటప్పుడు చూసిన ఆయన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తే ఇద్దరు హీరోలకు బాగుంటుందని అనుకున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్, లేటెస్ట్ క్రేజీ స్టార్ అజిత్‌లకు ఈ సినిమా గురించి చెప్పారని సమాచారం. రజనీకాంత్ ఏమన్నారనే విషయం బయటకు రాలేదు కానీ, అజిత్ తాలూకు వ్యక్తులు మాత్రం వెంటనే హైదరాబాద్ విచ్చేసి ‘డిక్టేటర్’ చూశారట. వాళ్లకు నచ్చడంతో తమిళ రీమేక్‌కి అజిత్‌ని దాదాపు ఫిక్స్ చేసేశారని టాక్. -
కౌంట్‌డౌన్ స్టార్ట్!
సంక్రాంతి బాక్సాఫీస్ పందెంలో దూసుకు రానున్న ‘డిక్టేటర్’ కోసం అభిమానులు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో చిత్రబృందం గుమ్మడికాయ ఫంక్షన్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించింది. షూటింగ్ అనుకున్న విధంగా జరగడంతో కేక్ కట్ చేసి, సందడి చేశారు. బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ‘‘అభిమానులు బాలకృష్ణను ఎంత స్టయిలిష్‌గా చూడాలని కోరుకుంటారో, ఈ చిత్రంలో అలానే కనిపిస్తారు’’ అని దర్శక-నిర్మాత శ్రీవాస్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కథ-స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, గోపీమోహన్, సహ-నిర్మాత: శ్రీవాస్. -
‘డిక్టేటర్’ మూవీ స్టిల్స్
-
'డిక్టేటర్లో కూడా ఉన్నాయి'
-
నయనతార కాదు ముమైత్ ఖాన్
సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఎంటర్టైనర్ డిక్టేటర్. బాలయ్య స్టైలిష్ డాన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఒక్క పాట మాత్రం బ్యాలెన్స్ ఉంది. భారీగా తెరకెక్కిస్తున్న ఈ పాట కోసం ముందుగా స్టార్ హీరోయిన్లను ప్రయత్నించారు చిత్రయూనిట్. బాలయ్య సరసన సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న నయనతార, ప్రస్తుతం టాలీవుడ్లో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఇలియానా లాంటి తారలను ప్రయత్నించి ఫైనల్‌గా ముమైత్ ఖాన్‌ను ఫిక్స్ అయ్యారట. డిసెంబర్ 23 నుంచి హైదరాబాద్‌లో వేసిన సెట్లో ఈ పాట చిత్రీకరణ జరగనుంది. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేస్తాం అంటున్నారు చిత్రయూనిట్. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్లు నటిస్తున్న ఈ సినిమాను, ఈరోస్ ఇంటర్ నేషనల్‌తో కలిసి దర్శకుడు శ్రీవాస్ నిర్మిస్తున్నాడు. కోనవెంకట్, గోపి మోహన్‌లు కథ, మాటలు అందిస్తున్నారు. -
ఎన్టీఆర్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'నాన్నకు ప్రేమతో' సినిమాలోనటిస్తున్నాడు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నారు చిత్రయూనిట్. అందుకు తగ్గట్టుగా రెస్ట్ లేకుండా సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. కానీ అదే సమయంలో బాలకృష్ణ హీరోగా నటించిన డిక్టేటర్ రిలీజ్ కూడా ఉండటంతో ఒకేసారి ఇద్దరు నందమూరి హీరోల సినిమాలు రిలీజ్ చేయటం మంచిది కాదని అందుకే ఎన్టీఆర్ తన సినిమా వాయిదా వేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ ట్విట్టర్ పేజ్‌పై కనిపించిన పోస్ట్ అభిమానలకు భారీ షాక్ ఇచ్చింది. ' చాలా రోజులుగా అభిమానులు... సినిమా రిలీజ్, ఆడియో రిలీజ్‌ల గురించి అడుగుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు అనే అనుకుంటున్నారా..? సినిమా విషయంలో ఏ జరుగుతుందో నాకు కూడా తెలీదు' అన్న పోస్ట్ ఇండస్ట్రీ వర్గాలను కూడా షాక్‌కు గురి చేసింది. అయితే ఈ కామెంట్ పోస్ట్ అయిన కొద్ది సేపటికే డిలీట్ అవ్వటం తిరిగి పోస్ట్ అవ్వటం మళ్లీ డిలీట్ అవ్వటం అభిమానులను మరింత కన్ఫ్యూజ్ చేసింది. ఫైనల్‌గా ఈ విషయంపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. తన ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయినట్టుగా తన టీం గుర్తించింది, ఏం జరిగిందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. నా ఎకౌంట్ పూర్తిగా నా కంట్రోల్ లోకి వచ్చిన తరువాత తిరిగి అభిమానులతో మాట్లాడతాను అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నాన్నకు ప్రేమతో రిలీజ్‌పై వచ్చిన రూమర్స్‌కు చెక్ పెట్టాడు ఎన్టీఆర్. ప్రస్తుతానికి ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమా రిలీజ్ సంక్రాంతికే ఉంటుందంటున్నారు చిత్రయూనిట్. -
‘డిక్టేటర్’ చిత్రం పాటల వేడుక
-
కాలం వెంట వెళ్లను...కాలం నా వెంటే రావాలి!
- బాలకృష్ణ ‘‘బిడ్డను అనాథను చేసినట్లుగా రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టారు. ఎంతో చరిత్ర ఉన్న అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేయడం ఆనందం. బుద్ధుడు నడయాడిన భూమి ఇది. మా నాన్నగారు నందమూరి తారక రామారావుగారు రాజకీయ చరిత్రను తిరగ రాశారు. తెలుగు జాతికి గర్వకారణం అమరావతి’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్తో కలసి వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై తొలిసారి శ్రీవాస్ నిర్మాతగా మారి, దర్శకత్వం వహించిన చిత్రం ‘డిక్టేటర్’. బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ నాయకానాయికలుగా నటించిన ఈ చిత్రానికి తమన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగింది. ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆడియో సీడిని ఆవిష్కరించి, బాలకృష్ణకు ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘నేనెప్పుడూ కాలం వెంట వెళ్లను. కాలం నా వెంట రావాల్సిందే. నా స్వభావానికి తగ్గ టైటిల్ ‘డిక్టేటర్’. ఒక్కోసారి మంచి మార్పు తీసుకు రావాలంటే జులుం తప్పదు. ఈ చిత్రకథాంశం ఇదే. శ్రీవాస్ నాలానే ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. తమన్ మంచి పాటలిచ్చారు’’ అంటూ ‘సింహం కూడా దాహం వేస్తే తలదించుకుని నీళ్లు తాగుతుంది. అంత మాత్రాన తలదించినట్లు కాదు. కొట్టడానికి తొడా ఉండదు... ఎత్తడానికి తలా ఉండదు’ అని సినిమాలోని డైలాగ్ చెప్పారు. ఇది ఓ అభిమాని పంపించిన డైలాగ్ అని బాలకృష్ణ చెప్పారు. ఏమీ ఆశించికుండా అభిమానులు ఆదరిస్తున్న తీరు చాలా ఆనందంగా ఉందనీ, నాడు తన తండ్రి పార్టీ పెట్టినప్పుడు అభిమానులే అండగా నిలిచారనీ బాలకృష్ణ అన్నారు. ఇప్పుడు ప్రభుత్వానికీ, పార్టీకి అభిమానులు అండగా నిలుస్తున్నారనీ, వాళ్లకు ఇప్పటికే కావాల్సినవి చేశాననీ, మున్ముందు ఇంకా చేస్తానని ఆయన అన్నారు. నాన్నగారి అభిమానులే కాకుండా భవిష్యతులో పార్టీ పరంగా నా అభిమానులు కూడా ముందుంటారని ఆశిస్తున్నానని బాలకృష్ణ అన్నారు. పదవులు ఎప్పుడూ మనకు అలంకారం కాకూడదనీ, మనమే పదవులకు అలంకారం కావాలని కూడా అన్నారు. శ్రీవాస్ మాట్లాడుతూ - ‘‘98 చిత్రాల్లో ఎన్నో పాత్రలు చేసిన బాలయ్యగారిని 99వ చిత్రంలో ఎలాంటి పాత్రలో చూపిస్తే బాగుంటుందా? అని రచయితలు గోపీ-కోనవెంకట్ , శ్రీధర్ సీపాన, ఎమ్.రత్నంలతో కలిసి బాగా డిస్కస్ చేసి, ఈ కథ తయారు చేశాం. బాలయ్యగారిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని చాలామంది చెప్పారు. ఆయనకు నిజాయతీగా ఉంటే నచ్చుతుంది. ఆయనతో నేను సినిమా చేయాలన్న మా నాన్నగారి కోరిక నెరవేరినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. తమన్ మట్లాడుతూ- ‘‘నేను బాలయ్యగారి ‘భైరవద్వీపం’ సినిమాలోని ఓ సన్నివేశానికి ఆర్ఆర్ ఇచ్చాను. అందుకుగాను నేను తీసుకున్న జీతం 30 రూపాయలు. నా తొలి సంపాదన ఆయన సినిమాతోనే స్టార్ట్ అయింది’’ అని చెప్పారు. నిర్మాతలు అంబికా కృష్ణ, సాయి కొర్రపాటి, అనిల్ సుంకర, రామ్ ఆచంట, కథానాయికలు అంజలి, సోనాల్ చౌహాన్, ఈరోస్ వైస్ ప్రెసిడెంట్ చింటు, గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బాబూరావు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్‌బాబు తదితర రాజకీయ రంగ, చిత్రరంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
డూప్ వద్దన్న బాలయ్య
ప్రస్తుతం డిక్టేటర్ సినిమాలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ ఆ సినిమా కోసం కొన్ని ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నాడు. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఈ ఫైట్ సీక్వన్స్ను దాదాపు 150 మంది ఫైటర్లతో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వన్స్లో హీరో కొన్ని రిస్కీ స్టంట్స్ చేయాల్సి రావటంతో ఆ సీన్స్‌ను డూప్‌తో చేయించాలని భావించారు చిత్రయూనిట్. అయితే అందుకు అంగీకరించని బాలయ్య తానే ఆ సీన్స్ లో నటిస్తున్నాడు. 55 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా బాలయ్య చేస్తున్న స్టంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లౌక్యం సక్సెస్‌తో సూపర్ ఫాంలో ఉన్న శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. -
స్టైల్‌గా... కూల్‌గా..!
హీరోలను స్టైలిష్‌గా చూపించడంలో కొంతమంది దర్శకులకు ప్రత్యేకమైన శైలి ఉంటుంది. శ్రీవాస్ కూడా తన హీరోలను సరికొత్త స్టైల్లో ఆవిష్కరిస్తుంటారు. తాజాగా నందమూరి బాలకృష్ణను ‘డిక్టేటర్’ సినిమాలో అలానే చూపిస్తున్నారాయన. ఇలా కూల్‌గా.. స్టైల్‌గా కనిపిస్తున్న బాలకృష్ణ లుక్ అభిమానులకు పండగ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ పాటలు స్వరపరిచారు. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆడియో ఆవిష్కరణ వేడుక జరగనుంది. -
బాలయ్య 'డిక్టేటర్' ఆలస్యం అవుతుందా..?
తమిళనాట సామాన్య ప్రజానీకంతో పాటు సినీ రంగాన్ని కూడా వరదలు ఇబ్బందులకు గురిచేశాయి. ముఖ్యంగా సినీరంగానికి సంబంధించిన ఎడిటింగ్, మిక్సింగ్, రీ రికార్డింగ్ స్టూడియోలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులు తెలుగు ఇండస్ట్రీకి కూడా తప్పటం లేదు. తెలుగు సినిమాలకు పనిచేసే చాలా మంది సాంకేతిక నిపుణులకు చెన్నైలో స్టూడియోలు ఉన్నాయి. ఇప్పుడు అదే సమస్యగా మారింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ డిక్టేటర్. బాలయ్య 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న తమన్ స్టూడియో చెన్నై వరదల్లో పూర్తిగా దెబ్బతింది. దీంతో డిక్టేటర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇంజనీర్లు తమన్ స్టూడియోను బాగుచేసే పనిలో ఉన్నా ఆ పనులు పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుంది అన్న విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. తమన్ స్టూడియో అందుబాటులోకి రాని పక్షంలో మణిశర్మ లేదా చిన్నాతో రీ రికార్డింగ్, డిటియస్ వర్క్స్ పూర్తి చేయించాలని భావిస్తున్నాడు దర్శకుడు శ్రీవాస్. వీటిలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న మరికొంత సమయం పడుతుంది కాబట్టి అనుకున్నట్టుగా డిక్టేటర్ సంక్రాంతి రిలీజ్ చేయటం వీలౌతుందా..లేదా..? అనే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. -
బాలయ్య మాట కాదనలేకపోయిన నయనతార
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డిక్టేటర్ సినిమా రోజుకో వార్తతో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించేసిన చిత్రయూనిట్ అందుకు తగ్గట్టుగా శరవేగంగా షూటింగ్ పనులు కానిచ్చేస్తోంది. బాలయ్యకు జోడిగా అంజలి, సోనాల్ చౌహాన్లు నటిస్తున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ అద్దడానికి మరో భామ రెడీ అవుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలయ్యతో రెండు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార డిక్టేటర్ సినిమాలో నటించనుందట. అయితే ఈ సినిమాలో నయన్ చేసేది హీరోయిన్ క్యారెక్టర్ కాదన్న టాక్ వినిపిస్తోంది. కేవలం రెండు మూడు నిమిషాలు మాత్రమే కనిపించే, ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం నయన్‌ను ఎంపిక చేశారు. గతంలో బాలయ్య సరసన నయనతార నటించిన రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించటంతో సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. కోలీవుడ్‌లో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నయన్‌ను, స్వయంగా బాలయ్య ఫోన్ చేసి సినిమా చేయాలని కోరాడట. దీంతో కాదనలేకపోయిన నయన్ రెండు రోజుల పాటు డిక్టేటర్ సినిమాకు డేట్స్ కేటాయించింది. బాలయ్య 99వ చిత్రంగా భారీగా తెరకెక్కుతున్న డిక్టేటర్ సినిమాకు శ్రీవాస్ దర్శకుడు. ఈ సినిమాలో బాలయ్య న్యూ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించనున్నాడు. బాలయ్యకు మంచి రికార్డ్ ఉన్న సంక్రాంతి సీజన్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో మరోసారి చరిత్ర తిరగరాస్తాడని నమ్మకంగా ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. -
బాలీవుడ్లో బాలయ్య 'డిక్టేటర్'..?
నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 99వ చిత్రం డిక్టేటర్. ఎనౌన్స్ అయిన దగ్గర నుంచే బాలయ్య లుక్‌తో పాటు ప్రొడక్షన్ వాల్యూస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమా. ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమాను, అదే స్ధాయిలో సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా మరో వార్త ఈ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ఇంకా రిలీజ్ కూడా కాకపోయినా బాలయ్య డిక్టేటర్ సినిమాను బాలీవుడ్ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇందుకు ప్రయాత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు తెలుగులో దర్శకత్వం వహించిన శ్రీవాస్ బాలీవుడ్‌లోనూ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. బాలకృష్ణ నటించిన స్టైలిష్ డాన్ పాత్రలో అజయ్ దేవగన్‌ను ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు డిక్టేటర్ బాలీవుడ్ రీమేక్‌పై చిత్రయూనిట్ ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. -
సంక్రాంతిని శాసించే... డిక్టేటర్!
సంక్రాంతి సంరంభానికి బాలకృష్ణ ‘డిక్టేటర్’గా సమాయత్తమవుతున్నారు. ఇప్పటి వరకు సంక్రాంతి రేసులో బాలకృష్ణ ఎక్కువ విజయాలు అందుకోవడంతో ‘డిక్టేటర్’పై అంచనాలు రెట్టింపయ్యాయి. రానున్న సంక్రాంతికి బాలయ్య బాక్సాఫీస్‌ను శాసిస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘లౌక్యం’తో గోపీచంద్‌కు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు శ్రీవాస్ హీరో బాలకృష్ణను ‘డిక్టేటర్’గా స్టయిలిష్ లుక్‌లో చూపిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సోనాల్‌చౌహాన్, అక్ష నాయికలు. శ్రీవాస్ మాట్లాడుతూ - ‘‘ఢిల్లీ, హర్యానాల్లో జరిగిన షెడ్యూల్‌తో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ఇక ఒక పాట, ఒక యాక్షన్ ఎపిసోడ్ బ్యాలెన్స్ ఉన్నాయి. డిఫరెంట్‌గానే ఉంటూనే బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు సాగే యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా పాటలను ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. -
అమరావతిలో ఆడియో!
బాలకృష్ణ 99వ సినిమా ‘డిక్టేటర్’పై అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ‘లౌక్యం’తో మంచి హిట్ అందుకున్న దర్శకుడు శ్రీవాస్ ఇప్పుడు బాలకృష్ణను ‘డిక్టేటర్’గా సంక్రాంతి బరిలో దించడానికి రెడీ అంటున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి, సోనాల్‌చౌహాన్ కథానాయికలు. తమన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఈ డిసెంబరు 20న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతిలో విడుదల చేయనున్నారు. శ్రీవాస్ మాట్లాడుతూ-‘‘ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. బాలకృష్ణగారి పాత్ర డిఫరెంట్ షేడ్స్‌లో ఉంటూ అందరినీ ఆకట్టుకుం టుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో జరుపుకుంటున్న మొదటి సినిమా వేడుక ఇదే. ఆయన స్టయిలిష్ లుక్ అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది. ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. యాక్షన్, ఎమోషనల్ డ్రామా ఉన్న సరికొత్త సబ్జెక్ట్ ఇది’’ అని చెప్పారు. -
'గాడ్‌ఫాదర్'గా బాలయ్య..?
ఏ నటుడి జీవితంలో అయినా వందో సినిమాకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ తరం నటుల్లో వంద సినిమాలు పూర్తి చేయగలిగే హీరోలు అసలు కనిపించటం లేదు. అలాంటి అరుదైన మైలురాయికి అతి చేరువలో ఉన్న నటుడు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం తన 99వ సినిమా చేస్తున్న బాలయ్య 100వ సినిమా గ్రాండ్‌గా ఉండేలా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు. బాలకృష్ణ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో డిక్టేటర్ సినిమాలో నటిస్తున్నాడు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య చేయబోయే 100వ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న బాలకృష్ణ వందో సినిమాను సక్సెస్ఫుల్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయనున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు ఘనవిజయం సాధించటంతో మరోసారి అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు అభిమానులు. ఈ సినిమాకు గాడ్‌ఫాదర్ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు. -
డిక్టేటర్‌కు సవాల్ విసురుతున్న సోగ్గాడు ?
-
బాబాయ్‌తో ఢీ అంటున్న జూనియర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'నాన్నకు ప్రేమతో'. తారక్ డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. 90 శాతానికి పైగా విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలైన సమయంలోనే 'నాన్నకు ప్రేమతో' సినిమాను 2016 సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అంటూ ప్రకటించిన చిత్రయూనిట్, అదే సమయంలో బాలయ్య హీరోగా నటిస్తున్న 'డిక్టేటర్' కూడా రిలీజ్ అవుతుండటంతో ఆలోచనలో పడింది. అంతేకాదు బాలయ్య సంక్రాంతి బరిలో దిగితే ఎన్టీఆర్ రేసు నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేసింది 'నాన్నకు ప్రేమతో' టీం. ముందుగా అనుకున్నట్టుగానే పొంగల్ రేసులో దిగుతున్నట్టుగా ప్రకటించేశాడు ఎన్టీఆర్. దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో పొంగల్ రిలీజ్ అన్న లైన్‌తో బాబాయ్‌తో ఢీ కోడుతున్నట్టుగా తేల్చేశాడు. అయితే పొంగల్ సీజన్ జనవరి నెల అంతా ఉంటుంది కాబట్టి, కనీసం నందమూరి హీరోల రెండు సినిమాలు, రెండు వారాల గ్యాప్‌తో రిలీజ్ అయితే బాగుంటుందని భావిస్తున్నారు అభిమానులు. Wishing everyone a HAPPY and a safe DIWALI #NannakuPrematho pic.twitter.com/ZbVbQeYGpm — tarakaram n (@tarak9999) November 10, 2015 -
తన బ్లడ్‌కే హిస్టరీ ఉందంటున్న బాలయ్య
నందమూరి అభిమానులకు పండుగ సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. దసరాకు ఒక్కరోజు ముందుగానే ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' టీజర్‌తో పండుగ తీసుకువస్తే, దసరా తరువాత రోజు కూడా సెలబ్రేషన్స్‌ను కంటిన్యూ చేస్తున్నాడు బాలకృష్ణ. శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'డిక్టేటర్' టీజర్‌ను ఈ రోజు (శుక్రవారం) రిలీజ్ చేశారు. ముందు నుంచి చెపుతున్నట్టుగానే శ్రీవాస్ ఈ సారి బాలయ్యను ఫుల్ స్టైలిష్ గా చూపించాడు. బాలయ్య అభిమానులు కోరుకునే పంచ్ డైలాగ్‌లను టీజర్ లోనే చూపించి ఆకట్టుకున్నాడు శ్రీవాస్. 'నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో, నా బ్లడ్‌కే హిస్టరీ ఉంది. మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం, నాలాంటి వాళ్లన్ని రెచ్చగొట్టడం నీ జీవితానికే ప్రమాదకరం' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. బాలకృష్ణ 99వ సినిమాగా తెరకెక్కుతున్న డిక్టేటర్లో అంజలి హీరోయిన్గా నటిస్తుంది. బాలయ్య సరసన లెజెండ్ లో హీరోయిన్గా నటించిన సోనాల్ చౌహాన్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా, భారీ తారాగణంతో పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీవాస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈరోస్ ఇంటర్ నేషనల్స్ బ్యానర్‌తో పాటు వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
స్టయిలిష్ డిక్టేటర్!
అతను పవర్ఫుల్ డిక్టేటర్. సమాజ శ్రేయస్సు కోసం ఏం చేయాలో డిక్టేట్ చేసేటప్పుడు హుందాగా ఉంటాడు. గాళ్ ఫ్రెండ్‌తో రొమాన్స్ చేసేటప్పుడు మంచి లవర్‌లా మారిపోతాడు. ప్రత్యర్థులను అంతం చేయాలనుకున్నప్పుడు రెచ్చిపోతాడు. ఈ అన్ని పార్శ్వాల్లోనూ స్టయిలిష్‌గా కనిపిస్తాడు. అందుకే ఈ డిక్టేటర్ అందరికీ నచ్చుతాడని శ్రీవాస్ అంటున్నారు. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్లో శ్రీవాస్ దర్శకత్వంలో వేదాశ్వ క్రియేషన్స్‌తో కలిసి ఈరోస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘డిక్టేటర్’. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష కథానాయికలు. దసరా కానుకగా అభిమానుల కోసం ఈ చిత్రంలో బాలయ్యకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. ‘శుభాకాంక్షలతో మీ బాలకృష్ణ’ అంటూ ఫొటో పై సంతకం ద్వారా అభిమానులను పలకరించారు బాలకృష్ణ. ‘‘ఇంతకుముందు ఏ చిత్రంలోనూ కనిపించనంత స్టయిలిష్‌గా ఈ చిత్రంలో బాలయ్య కనిపిస్తారు. యూత్, ఫ్యామిలీస్‌కి నచ్చే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈరోస్ సంస్థ వెనకాడకుండా నిర్మిస్తుండటంతో ఇప్పటివరకూ జరిపిన షూటింగ్ క్వాలిటీగా వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నాం. తదుపరి షెడ్యూల్‌ను యూరప్‌లో జరపనున్నాం. అక్కడ కొంత టాక్టీ, యాక్షన్ సీన్స్, సాంగ్స్ చిత్రీకరించాలనుకుంటున్నాం’’ అని శ్రీవాస్ చెప్పారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి చూస్తోంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఈ ట్రెండ్ చాలా బాగుంది. ‘శ్రీమంతుడు’వంటి భారీ విజయవంతమైన చిత్రంతో అసోసియేట్ అయిన తర్వాత ‘డిక్టేటర్’ చిత్రాన్ని నిర్మించడం మరింత ఆనందంగా ఉంది’’ అని ఈరోస్ మ్యానేజింగ్ డెరైక్టర్ సునీల్ లుల్లా అన్నారు. -
గం...గం...గణేశా..!
వినాయకుడి మీద ఇప్పటివరకూ బోల్డన్ని పాటలు వచ్చాయి. తాజాగా, గజాననుడి భక్తుల కోసం ‘గమ్... గమ్.. గణేశా..’ అంటూ ‘డిక్టేటర్’ బృందం ఓ పాటను కానుకగా ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రి యేషన్ సంయుక్తంగా శ్రీవాస్ దర్శకత్వంలో నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వినాయక చవితి సందర్భంగా వచ్చే పాట ఇది. తమన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. వినాయక చవితి సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు, గణేశుని పాటను హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ -‘‘యూరప్‌లో ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేశాం. వినాయకుని సమక్షంలో సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. అభిమానులను అలరించే సినిమా ఇది’’ అన్నారు. -
ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్న డిక్టేటర్ మూవీ టీమ్
-
99 మంది డ్యాన్సర్లతో పాట
పండగ పాటలు భలే సందడిగా ఉంటాయి. ఆ పాటలకు డ్యాన్స్ చేస్తున్నవాళ్లని చూస్తుంటే, చూసేవాళ్లకి కూడా కాలు కదపాలనిపించేంత జోష్‌గా ఉంటాయ్. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అలాంటి పాటకు జోరుగా, హుషారుగా స్టెప్పులేస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’ కోసం ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పాట వినాయకుడి బ్యాక్‌డ్రాప్‌లో వస్తుంది. ఈ పాట కోసం హైదరాబాద్‌లో భారీ సెట్ వేశారు. బాలకృష్ణకు ఇది 99వ చిత్రం కావడంతో ఈ పాటకు ఆయనతో కలిసి 99మంది డ్యాన్సర్లు కాలు కదిపేలా దర్శకుడు ప్లాన్ చేశారు. 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ పాటలో ఉంటారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ మరో మూడు రోజుల్లో పూర్తవుతుంది. తదుపరి షెడ్యూల్‌ను యూరోప్‌లో జరపనున్నారు. వచ్చే సంక్రాంతి పండగకు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, బ్రహ్మానందం, రవికిషన్, కబీర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: కోన వెంకట్-గోపీ మోహన్, రచన: శ్రీధర్ సీపాన, మాటలు: ఎం. రత్నం, సంగీతం: ఎస్.ఎస్. థమన్, కెమెరా: శ్యామ్ కె. నాయుడు. -
బాలయ్య @ 99
‘లెజెండ్’, ‘లయన్’గా కనిపించిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ‘డిక్టేటర్’ కాబోతున్నారు. ‘లౌక్యం’తో గత ఏడాది భారీ విజయం సాధించిన శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. అంజలి కథానాయిక. ఈరోస్ ఇంటర్నేషనల్‌తో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు బి. గోపాల్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు బోయపాటి శీను క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ -‘‘చాలా శక్తిమంతమైన టైటిల్ ఇది. ప్రాణం తీసే భయం కన్నా, ప్రాణం పోసే ఆయుధం గొప్పదనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. శ్రీవాస్‌తో ఎప్పటినుంచో చేయాలనుకున్నా. ఇన్నాళ్ళకు కుదిరింది’’ అన్నారు. శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘నందమూరి హీరోలతో నేను సినిమా చేయాలన్నది మా నాన్న కోరిక. బాలకృష్ణతో 99వ సినిమా చేసే అవకాశం రావడం బరువైన బాధ్యత’’ అన్నారు. ఈ సినిమాకు రచన చేయడం బిగ్గెస్ట్ ఛాలెంజ్ అని రచయితలు కోన వెంకట్, గోపీమోహన్ చెప్పారు. బాలకృష్ణతో కలిసి నటించడం తన అదృష్టమని అంజలి పేర్కొన్నారు. ఈ చిత్రానికి మాటలు: ఎం. రత్నం, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: తమన్. -
బాలకృష్ణ 99వ సినిమా 'డిక్టేటర్' చిత్రం ప్రారంభోత్సవం
-
ఒక సెకనులో మాటిచ్చేశారు..
హైదరాబాద్ : హీరో బాలకృష్ణ 99వ సినిమా 'డిక్టేటర్' చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు బోయపాటి శ్రీను శుక్రవారం రామానాయుడు స్టూడియోలో ముహుర్తపు షాట్ క్లాప్ కొట్టారు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అంజలి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ తాను దర్శకుడిగా మారినప్పటి నుంచి బాలకృష్ణతో సినిమా తీయాలని చాలాసార్లు అనుకున్నానని, ఈ రోజు తన జీవితంలో మర్చిపోలేని రోజు అన్నారు. సినిమా చూస్తే ఈ దర్శకుడు ఏ హీరోతో అయినా సినిమా తీయగలడు అనిపించుకోవటమే తన లక్ష్యమన్నారు. 'లక్ష్యం' చిత్రం తర్వాత బాలయ్యతో సినిమా తీయాలనుకున్నా... కుదరలేదని, అయితే ఇన్నిరోజులకు తమ కాంబినేషన్ కుదిరిందన్నారు. లౌక్యం సినిమా అనంతరం తాను బాలయ్యబాబును కలిసి సినిమా చేయాలనే చెప్పగానే... 99వ సినిమాకు నువ్వే దర్శకుడివి అని ఆయన ఒక్క సెకనులో మాటిచ్చేశారని శ్రీవాస్ తెలిపారు. ఇప్పటివరకూ బాలకృష్ణ ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి చూసే సినిమాలు వచ్చాయని, టైటిల్‌కు తగ్గట్టుగా డిక్టేటర్ సినిమాలో బాలకృష్ణ క్యారెక్టర్ ఉంటుందని శ్రీనివాస్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ, హీరోయిన్ అంజలి మాట్లాడుతూ ఈ సినిమాలో తమ క్యారెక్టర్స్ గత సినిమాల కన్నా భిన్నంగా ఉంటాయని తెలిపారు. -
డిక్టేటర్ షూటింగ్ 29న ప్రారంభం
హైదరాబాద్: సింహా... లెజెండ్... లయన్ చిత్రాలలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు డిక్టేటర్‌గా కనిపించనున్నాడు. బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం డిక్టేటర్ షూటింగ్ మే 29వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు శ్రీవాస్ శనివారం హైదరాబాద్‌లో వెళ్లడించారు. కాగా చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ 12 నుంచి మొదలవుతుందని తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీతోపాటు యూరప్ దేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార నటిస్తుందని చెప్పారు. బాలకృష్ణతో నయనతార నటిస్తున్న మూడో చిత్రం అని శ్రీవాస్ పేర్కొన్నారు. గతంలో బాలకృష్ణ, నయనతార కాంబినేషన్లో సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. తన దర్శకత్వంలో వచ్చిన లక్ష్యం, లౌక్యం చిత్రాలు విజయం సాధించాయి.... అలాగే ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని శ్రీవాస్ స్పష్టం చేశారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారని శ్రీవాస్ తెలిపారు. డిక్టేటర్ చిత్రాన్ని ఈ ఏడాది దసరా పండగకు విడుదల చేస్తామన్నారు. -
నియంతలా కలెక్టర్
{పజా సమస్యలు పట్టించుకోవడంలేదు ముఖ్యమంత్రి మెప్పుకోసం వెంపర్లాడుతున్నారు మంత్రి సభలో కలెక్టర్‌పై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫైర్ ఎమ్మెల్యే నారాయణస్వామి సైతం మండిపాటు చిత్తూరు: కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సీఎం మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల గురించి చర్చించేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధుల పట్ల నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆది వారం పీవీకేఎన్ కళాశాల ఆవరణలో జరిగిన దళిత-గిరిజన సాధికారిక సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు సమక్షంలో జరిగిన ఈ సదస్సులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కే.నారాయణస్వామి, డాక్టర్ సునీల్‌కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. తొలుత చెవిరెడ్డి మాట్లాడుతూ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సంధానకర్తగా వ్యవహరించాల్సిన కలెక్టర్ నియంతగా మారారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరగడం లేదని, సమాచారం కావాలని కలెక్టర్‌కు లేఖరాస్తే సమాధానం ఇవ్వకుండా నిబంధనలు తుంగలో తొక్కారని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు, నియమావళినే కలెక్టర్ పాటించకపోతే ఎలా అని వేదికపై తన పక్కనే ఉన్న కలెక్టర్‌ను ప్రశ్నించారు. ఇలా అయితే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాలని మంత్రి రావెల కిషోర్‌ను ప్రశ్నించారు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులతో ఎంతగా గొడవపడితే అన్ని మార్కులు సీఎం వద్ద వస్తాయని కలెక్టర్ భావిస్తున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ విధానం మంచిది కాదని, తీరుమార్చుకోకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం ఎన్ని పథకాలు పెట్టినా అవి సరిగా అమలు కావడం లేదన్నారు. బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆర్థికంగా ఎదుగుదల లేకపోతే దళితులు సామాజికంగా, రాజకీయంగా ఎలా అభివృద్ధి సాధిస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నారాయణస్వామి మట్లాడుతూ అవినీతిపరులైన అధికారులకు కలెక్టర్ సిద్ధార్థజైన్ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 90 శాతం అవినీతి ఉందన్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నా కలెక్టర్ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్‌కుమార్, సత్యప్రభ, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, మేయర్ అనూరాధ, కలెక్టర్ సిద్ధార్థజైన్, ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి మాట్లాడారు. -
కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారు
మెదక్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీమంత్రి, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి విరుచుకు పడ్డారు. కేసీఆర్ నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆమె గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. మహిళలు, ఉద్యోగులు, ఎమ్మెల్యేలు....చివరికి మంత్రులను సైతం లెక్కలేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. అందుకు నర్సాపూర్‌లో జరిగిన సభే సాక్ష్యమన్నారు. రెండు లక్షల మంది ప్రజలు వస్తారని భారీ ఏర్పాట్లు చేశారని, అయితే 25వేలమంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ నేతలు మతి తప్పి మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. వందరోజులు పూర్తి చేసుకున్న కేసీఆర్ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. మరోవైపు నేటితో మెదక్ ఉపఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. -
చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, విద్యార్ధులకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను ముందుగా రైతులే కట్టుకోమని వ్యవసాయమంత్రి పుల్లారావు చెప్పడం చాలా దారుణమని శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆర్బీఐ, చంద్రబాబు ఇద్దరూ కలిసి డ్రామాలాడుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబుకు రైతులంటే ఎందుకు చులకన అంటూ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నింటిని నెరవేర్చాలని శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
యనమల కరడుగట్టిన నియంత: బోస్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత యనమల రామకృష్ణుడుకు, నియంత హిట్లర్‌కు చాలా దగ్గరి పోలికలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. యనమల కరడుగట్టిన నియంత అని, ఆయన పోకడల గురించి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. దివంగత ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయడంలో చంద్రబాబుతో కలసి యనమల కుట్ర పన్నడమే కాక.. ఆనాడు నిండు అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను కన్నీళ్లు పెట్టించారని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశమివ్వాలని ఎన్టీఆర్ ఎంత ప్రాధేయపడినా స్పీకర్‌గా ఉన్న యనమల ఘోరంగా అవమానపరిచారన్నారు. సభా సంప్రదాయాలను సైతం తుంగలో తొక్కిన యనమల తమ అధినేతను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు బోస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘టీడీపీని విడిచి వెళ్లిన వారు తిరిగి పార్టీలోకి రావాలని చంద్రబాబు అనేకసార్లు బహిరంగంగానే పిలుపునిచ్చారు. కొందర్ని పార్టీలోకి రప్పించడానికి పారిశ్రామికవేత్తలైన సీఎం రమేష్, సుజనాచౌదరి లాంటివారు మంతనాలు సాగిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. వాటినే ‘సాక్షి’ ప్రచురిస్తే భుజాలు తడుముకుంటూ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదం’ అని అన్నారు. ఎవరెన్ని రకాలుగా వ్యక్తిగత దూషణలకు పాల్పడినా విజ్ఞులైన ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుంటారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు.