చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు.. | Chandrababu Naidu behaving like dictator, says MLA Srikanth Reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు..

Published Tue, Aug 5 2014 5:44 PM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు..

చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులు, మహిళలు, విద్యార్ధులకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 
 
బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను ముందుగా రైతులే కట్టుకోమని వ్యవసాయమంత్రి పుల్లారావు చెప్పడం చాలా దారుణమని శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.  ఆర్‌బీఐ, చంద్రబాబు ఇద్దరూ కలిసి డ్రామాలాడుతూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. 
 
చంద్రబాబుకు రైతులంటే ఎందుకు చులకన అంటూ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నింటిని నెరవేర్చాలని శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement