జూలై పదోతేదీ లోగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. కమిటీ పేరుతో కాలయాపన చేయడం సరికాదని, రుణమాఫీని ఆలస్యం చేస్తే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అలాగే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక రాయచోటికి అదనంగా మరొక గ్యాస్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని, జాతీయ రహదారి విస్తరణ కోసం కృషి చేస్తామని, ఈద్గా అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని కూడా శ్రీకాంత్ రెడ్డి, మిథున్ రెడ్డి తెలిపారు. ఎంపీ కోటా నిధుల నుంచి తాగునీటి సదుపాయానికి పెద్దపీట వేస్తామని చెప్పారు.
రుణమాఫీని ఆలస్యం చేయొద్దు
Published Sat, Jun 14 2014 4:09 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement